రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత ధ్వజం
నిజామాబాద్ నాగారం: ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి.. అందుకే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే తెలంగాణ తల్లి ఉండకూడదన్న ఉద్దేశంతో విగ్ర హం రూపు రేఖలు మార్చేశారు. కాంగ్రెస్ తల్లి విగ్రహాలను సెక్ర టేరియట్‌లో ఉంచారు. ఇక మ నం ఆమెనే కొలవాలట’ అంటూ ఎమ్మెల్సీ కవిత ధ్వజమె త్తారు. ‘తెలంగాణ తల్లి మాదిరా.. కాంగ్రెస్ తల్లి మీదిరా’ అంటూ నినదించారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత తొలిసారి ఆదివారం నిజామా బాద్ పర్యటనకు వచ్చిన కవితకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆమె పట్టణంలోని సుభాష్‌నగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేసి తెలంగాణ ఆడబిడ్డలను రేవంత్‌రెడ్డి అవమానించాడన్నారు.
గురుకులాలను నడపడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే 57 మంది పిల్లలు చనిపోయారని తెలి పారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని, ఇక రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment