తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం | KCR Target Telangana Development | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం

Published Sat, Dec 10 2016 2:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

KCR Target Telangana Development

నకిరేకల్ : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు.  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారథ్యంలో దీక్షాదివస్ పేరుతో టీఆర్‌ఎస్ యువత, విద్యార్థి సంఘాల 60 మంది ప్రతినిధుల టీంతో 10 రోజులుగా నియోజకవర్గవ్యాప్తంగా చేపట్టిన స్ఫూర్తి యాత్ర శుక్రవారం నకిరేకల్‌కు చేరుకుంది. స్థానిక మెరుున్ సెంటర్‌లో రాత్రి జరిగిన దీక్షాదివస్, స్ఫూర్తి యాత్ర ముగింపు బహిరంగ సభలో నేతి విద్యాసాగర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ సమయంలో  చావు అంచుల్లోకి వెళ్లి సాధించుకున్న స్వరాష్ట్రం అభివృద్ధికి అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాట పటిమను మరో సారి గుర్తు చేస్తూ దీక్షాదివస్ పేరుతో ఈప్రాంత ఎమ్మెల్యే వేముల వీరేశం ఒక వినూత్న పద్ధతుల్లో 10 రోజులు పాటు వివిధ వర్గాల ప్రజలతో కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటు పడుతున్నారన్నారు.
 
 పోరాట స్ఫూర్తితో అభివృద్ధి : ఎమ్మెల్యే వేముల 
 సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కేసీఆర్ పోరాట స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం నాలుగు కోట్ల ప్రజానీకం ఎదురుచూస్తున్న సమయంలో కేసీఆర్ ప్రాణాలకు తెగించి దీక్షకు పూనుకున్నారన్నారు. బంగారు తెలంగాణ కోసం పార్టీలకతీతంగా అందరు భాగస్యామ్యం కావాలని కోరారు. కవి,గాయకుడు కోదారి శ్రీనివాస్ తాను రచించిన పాటలను పాడి సభికులను ఉత్తేజపరిచారు. ఈసభలో నకిరేకల్ మాజీఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, నార్కట్‌పల్లి, కేతేపల్లి ఎంపీపీలు రేగట్టే మల్లిఖార్జున రెడ్డి, గుత్తమంజుల, టీఆర్‌ఎస్ జిల్లా  నాయకులు పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమే ష్, టీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులుగౌడ్, నాయకులు మంగినపల్లి రాజు, సిలివేరు ప్రభాకర్, గాదగోని కొండయ్య, గున్నుడోరుున యాదగిరి, రాచకొండ వెంక న్న, పన్నాల అనసూర్యమ్మ, టీఆర్‌ఎస్వీ నాయకులు పెండెం సంతోష్, గాదె శివ, అరుులపాక శ్రవణ్, తోటకురి వంశీ, నరేం దర్‌రెడ్డి, జనార్దన్ తదితరులు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement