Nethi Vidya Sagar
-
మండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి కొత్త చైర్మన్‌గా నేతి విద్యాసాగర్ నియమితులు కానున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. మండలి చైర్మన్ వి.స్వామిగౌడ్ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ప్రస్తుతం మండలి వైస్‌చైర్మన్‌గా ఉన్న విద్యాసాగర్ శనివారం నుంచి తాత్కాలికంగా పూర్తిస్థాయి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. శాసనమండలి చైర్మన్ ఎన్నికపై త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈసారి విద్యాసాగర్‌కు అవకాశం ఇవ్వా లని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. మున్నూరు కాపు సామాజికవర్గానికి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఈ వర్గానికి చెం దిన నేతి విద్యాసాగర్‌కు శాసనమండలి చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల వరకు మండలి చైర్మన్, మండలి చీఫ్ విప్, అసెంబ్లీ చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేసే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఈ పదవులపై స్పష్టత రానుంది. శాసనమండలి ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో శనివారం నుంచి కొత్త సభ్యుల పదవీకాలం మొదలు కానుంది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు స్థానాలకు, స్థానిక సంస్థల కోటాలో ఒక స్థానానికి, ఉపాధ్యా యుల కోటాలో రెండు స్థానాలకు, పట్టభద్రుల కోటాలో ఒక స్థానానికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే కోటాలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ ఎమ్మెల్సీలుగా గెలి చారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం లో ఎం.ఎస్.ప్రభాకర్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా టి.జీవన్‌రెడ్డి గెలిచారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి.. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా కూర రఘోత్తమ్‌రెడ్డి గెలిచారు. వీరి ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 30 నుంచి వీరి పదవీకాలం మొదలవుతుంది. మహమూద్‌అలీ, ఎం.ఎస్.ప్రభాకర్‌రావులు ఎమ్మెల్సీలుగా ఉన్నవారే. మిగిలిన వారంతా కొత్త వారు. కాంగ్రెస్‌కు ఒక్కరే.. స్వామిగౌడ్‌తోపాటు, షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహమ్మద్ సలీం, టి.సంతోష్‌కుమార్, పాతూరి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. మండలిలో చీఫ్ విప్‌గా వ్యవహరించిన పాతూరి సుధాకర్‌రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. తాజా ఎన్నికల అనంతరం మండలిలో కాంగ్రెస్ సభ్యుల బలం ఒక్కరికే పరిమితం కానుంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తాజాగా కాంగ్రెస్ తరఫున జీవన్‌రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. -
తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం
నకిరేకల్ : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారథ్యంలో దీక్షాదివస్ పేరుతో టీఆర్ఎస్ యువత, విద్యార్థి సంఘాల 60 మంది ప్రతినిధుల టీంతో 10 రోజులుగా నియోజకవర్గవ్యాప్తంగా చేపట్టిన స్ఫూర్తి యాత్ర శుక్రవారం నకిరేకల్‌కు చేరుకుంది. స్థానిక మెరుున్ సెంటర్లో రాత్రి జరిగిన దీక్షాదివస్, స్ఫూర్తి యాత్ర ముగింపు బహిరంగ సభలో నేతి విద్యాసాగర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ సమయంలో చావు అంచుల్లోకి వెళ్లి సాధించుకున్న స్వరాష్ట్రం అభివృద్ధికి అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాట పటిమను మరో సారి గుర్తు చేస్తూ దీక్షాదివస్ పేరుతో ఈప్రాంత ఎమ్మెల్యే వేముల వీరేశం ఒక వినూత్న పద్ధతుల్లో 10 రోజులు పాటు వివిధ వర్గాల ప్రజలతో కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటు పడుతున్నారన్నారు. పోరాట స్ఫూర్తితో అభివృద్ధి : ఎమ్మెల్యే వేముల సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కేసీఆర్ పోరాట స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం నాలుగు కోట్ల ప్రజానీకం ఎదురుచూస్తున్న సమయంలో కేసీఆర్ ప్రాణాలకు తెగించి దీక్షకు పూనుకున్నారన్నారు. బంగారు తెలంగాణ కోసం పార్టీలకతీతంగా అందరు భాగస్యామ్యం కావాలని కోరారు. కవి,గాయకుడు కోదారి శ్రీనివాస్ తాను రచించిన పాటలను పాడి సభికులను ఉత్తేజపరిచారు. ఈసభలో నకిరేకల్ మాజీఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, నార్కట్‌పల్లి, కేతేపల్లి ఎంపీపీలు రేగట్టే మల్లిఖార్జున రెడ్డి, గుత్తమంజుల, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమే ష్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులుగౌడ్, నాయకులు మంగినపల్లి రాజు, సిలివేరు ప్రభాకర్, గాదగోని కొండయ్య, గున్నుడోరుున యాదగిరి, రాచకొండ వెంక న్న, పన్నాల అనసూర్యమ్మ, టీఆర్ఎస్వీ నాయకులు పెండెం సంతోష్, గాదె శివ, అరుులపాక శ్రవణ్, తోటకురి వంశీ, నరేం దర్‌రెడ్డి, జనార్దన్ తదితరులు ఉన్నారు. -
తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షుడిగా విద్యాసాగర్
-
డిప్యూటీ జయకేతనం
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నేతి విద్యాసాగర్ విజయానికి అవసరమైన 17 ఓట్లు రావడంతో వరించిన విజయం మొదటి ప్రాధాన్యతలోనే గెలుపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ జిల్లాకు మరో ఎమ్మెల్సీ పదవి దక్కింది. తాజా మాజీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈయన విజయానికి అవసరమైన 17 ఓట్లు రావడంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఈయన మండలిలో రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన మండలిలో ఆయన బలహీన వర్గాల కోటాలో డిప్యూటీ చైర్మన్ హోదాలో పనిచేశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయన టీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ పదవిలోనే కొనసాగారు. అనంతరం ఆయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. అయితే, ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపుతారని అందరూ భావించినా, అనూహ్యంగా ఎమ్మెల్యే కోటాలో నామినేషన్ వేశారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఎన్నికలలో ఆయన ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం. నేతి గెలుపు పట్ల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయల ఆరంగేట్రం విద్యార్థి దశ నుంచే నకిరేకల్ : నేతి విద్యాసాగర్ పాఠశాల స్థాయి నుంచే కాంగ్రెస్ అనుంబంధ విద్యార్థి సంఘంలో పనిచేశారు. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలందు కళాశాల అధ్యక్షుడిగా, ఆ తర్వాత కో ఆపరేటివ్ బ్యాంక్లొ సైక్రటరీగా చేరి దానికి రాజీనామా చేసి. ప్రజాసేవ కోసం రాజకీయాలలోకి మరల ప్రవేశించారు.. అదే విధంగా ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్‌లో వివిధ హోదాలో, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా అధ్యక్షుడిగా, పీసీసీ మెంబర్‌గా పదవులు నిర్వహించారు. కేతేపల్లి వైస్ ఎంపీపీ పదవినికూడా చేపట్టారు. చెర్కుపల్లి సర్పంచ్‌గా 15ఏళ్లు (మూడు దఫాలు) కొనసాగారు. అదే విధంగా పీఏసీయస్ శాలిగౌరారం చైర్మన్‌గా పనిచేశారు. రెండు పర్యాయాలు నల్లగొండ ఎమ్మెల్సీగా గెలిచారు. -
మండలి పీఠంపై నేతి
నల్లగొండ/నకిరేకల్, న్యూస్‌లైన్ : శాసనమండలి చైర్మన్ పీఠంపై జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ కూర్చోనున్నారు. ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మండలి రెండుగా విడిపోయింది. దీంతో తెలంగాణ నుంచి ఆయనకు చైర్మన్ పదవి దక్కింది. సోమవారం ఆయన శాసనమండలిలో చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విద్యాసాగర్ మొదటిసారిగా 2007 మార్చిలో స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అప్పుడు ఆయన పదవీ కాలం రెండేళ్లే. తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల నుంచే గెలిచారు. అప్పటి నుంచి ఆయన శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన అదే పదవిలో కొనసాగారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మండలి కూడా విడిపోయింది. దీంతో తెలంగాణ ప్రాంతం నుంచి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న విద్యాసాగర్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. విద్యాసాగర్ పదవీ కాలం 2015 మార్చి ఒకటితో ముగుస్తుంది. నేతి విద్యాసాగర్ స్వగ్రా మం కేతేపల్లి మండలం చెరుకుపల్లి. ఆయన విద్యార్థి దశలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేశారు. అనంత రం నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన శాసనమండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.