పవన్‌కు జిల్లా పరిస్థితి వివరిస్తున్న తేరా చిన్నపరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అ న్నారు. సోమవారం టీడీపీ, బీజేపీ పార్టీలు సంయుక్తంగా జిల్లాకేం ద్రంలోని మేకల అభి నవ్ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యువతకు ఉపాధి అవకా శాలు లభిస్తాయని చెప్పారు. బుధవారం జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
టీడీపీ ఎంపీ అభ్యర్థి తేరచిన్నపరెడ్డి మాట్లాడుతూ తనను నల్లగొండ నుంచి గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే జిల్లా అభివృద్ధి కోసం నరేంద్రమోడీని ఒప్పించి ఎక్కువ నిధులను తీసుకువచ్చి సమగ్రాభివృద్ధి చేసి జిల్లా రూపురేఖలను మారుస్తానని అన్నారు. జిల్లాలో రైల్వేలైన్ విస్తరణ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తానని చెప్పారు. సోలార్ సిస్టమ్ ద్వారా 24 గంటల విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తానని అన్నారు. జిల్లా కేంద్రంలో బత్తాయి మార్కెట్, జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయిస్తామన్నారు.
అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి కూతురు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మంచి ఆశయంతో ప్రజలకు సేవ చేయాలని, మోడీ, పవన్ కల్యాణ్‌లను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాలోకి వచ్చానన్నారు. సభలో టీడీపీ జిల్లా కార్యదర్శి ఆవుల రాములు, నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, చిలువేరు కాశీనాథ్, బోయపల్లి కృష్ణారెడ్డి, రియాజ్‌అలీ, మారం శత్రఘ్నారెడ్డి,తుమ్మల మధుసూధన్‌రెడ్డి , ఎల్వీయాదవ్, బీజేపీ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, ఓరుగంటి రాములు, బాకి పాపయ్య, నూకల వెంకటనారాయణరెడ్డి, చింత ముత్యాల్‌రావు, పాదూరి కరుణ, పొతెపాక సాంబయ్య కూతురు లక్ష్మారెడ్డి, కూతురు సత్యవతి పాల్గొన్నారు.