సిద్ధిపేట: రాఘవాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరంతో తమకు పండగని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్దఎత్తున పంటలు పండుతున్నాయని చెప్పారు.
కానీ ప్రధాని మోదీకి ఎంతసేపూ తెలంగాణపై బురదజల్లడమే పని అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. శనివారం హైదరాబాద్ సభలో మోదీ మాట్లాడిన మాటలు చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్లుగా ఉందని సెటైర్లు వేశారు.
వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని మోదీ ఆపారని హరీశ్‌రావు ఆరోపించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని రూ.30వేల కోట్ల నిధులు ఆపారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.
చదవండి: ఎన్నికల కోసమే ఆయుధంగా వాడుతున్నారా?
Comments
Please login to add a commentAdd a comment