
ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలి: సిడ్నీలో ఈటల
తెలంగాణ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. అస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మంత్రి, సోమవారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. అస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మంత్రి, సోమవారం సిడ్నీలో ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెట్టుబడులకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందన్నా రు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రపంచంలోనే ఉత్తమమైన విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు, అన్ని మౌలిక వసతులున్నందున హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.