గెస్ట్ కాలం: ‘సగటు అభివృద్ధి రేటు ప్రకారం చూస్తే పరిశ్రమల సంఖ్య, పెట్టుబడులు, ఉపాధి విషయూల్లో తెలంగాణే అగ్రస్థానంలో ఉన్న విషయుం అర్థవువుతుంది. అలాగే 2004-09 వుధ్యకాలంలో సాధించిన పెరుగుదలను చూసినా కూడా తెలంగాణే మొదటి స్థానంలో ఉన్న సంగతి గవునించవచ్చు. తెలంగాణతో పోల్చితే కోస్తాంధ్రలో అభివృద్ధి ఆరుశాతం తక్కువ ఉంది.’
- వి.హనుమంతరావు
ఆర్థిక విశ్లేషకులు
తెలంగాణ అభివృద్ధిని నిరోధించిన నేతగా డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డిని చిత్రించి చూపడానికి కొందరు ప్రయుత్నించిన సంగతి తెలియునిది కాదు. వారి దృష్టిలో వైఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను చిదిమివేసిన వ్యక్తి. ఇది గోబెల్స్ ప్రచారం తప్ప వురొకటి కాదు. దేశంలో చిన్న, లఘు పరిశ్రవుల రంగం ఉత్పత్తుల విలువ 2001- 02 ధరల ప్రకారం రూ.4,71,700 కోట్లు. ఆ పరిశ్రవుల సంఖ్య 130 లక్షలు. వాటిలో పని చేసే వారి సంఖ్య 420 లక్షలు. వాటి ఎగువుతుల విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ.1,77,600 కోట్లు. తయూరీ రంగంలో జరిగే ఉత్పత్తుల్లో 45 శాతం, ఎగువుతుల్లో 40 శాతం చిన్న, లఘు పరిశ్రవులదే.
పారిశ్రామికరంగాన్ని పరిశీలించేటపుడు పరి శ్రవుల సంఖ్య, పెట్టుబడి, వాటి ఉత్పత్తుల విలువ ఆధారంగా విశ్లేషిస్తారు. తెలంగాణ అనగానే హైదరా బాద్ నగరాన్ని మినహారుుస్తే మిగిలిన తెలంగాణ జిల్లాలన్నీ వెనుకబడే ఉన్నాయున్నది పలువురి నిశ్చితాభిప్రాయుం. అందుకే ఈ పరిశీలనను ఆంధ్ర, తెలంగాణ, సీవు అనే వుూడు ప్రాంతాలుగా కాకుండా హైదరాబాద్ నగరం ప్రభావం ఉన్న చుట్టు పక్కల ప్రాంతాలు రంగారెడ్డి, మెదక్, వుహబూ బ్‌నగర్ జిల్లాలను కలిపి ఈ ప్రాంతాన్ని హైదరా బాద్ నగర ప్రాంతంగా, మిగిలిన జిల్లాలు (ఆదిలాబాద్, నిజావూబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖవ్ముం) మిగిలిన తెలంగాణగా తీసుకోవడం జరిగింది.
కోస్తా జిల్లాలను దక్షిణ కోస్తా గా, ఉత్తర కోస్తా ప్రాంతాలుగా, రాయులసీవు నాలుగు జిల్లాలను వురో ప్రాంతంగా పరిగణించి విశ్లేషించి, అభివృద్ధిని సగటు వార్షికాభివృద్ధి రేటు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం పరిశ్రవుల సంఖ్య, పెట్టుబడి, ఉద్యోగాల విష యూల్లో కోస్తాంధ్ర, రాయుల సీవుల కన్నా తెలంగాణ అగ్రస్థా నంలో ఉంది. (వుూడు ప్రాంతాల గ్రాఫ్ చూడండి... గణాంకాలు పరిశ్రవుల శాఖ ఇచ్చినవి). 2004-09 వుధ్య కాలంలో సాధించిన పెరుగుదలను చూసినా కూడా తెలంగాణే మొదటి స్థానంలో ఉంది. కోస్తాంధ్రలో అభివృద్ధి తెలంగాణలో జరిగిన అభివృద్ధి కన్నా ఆరు శాతం తక్కువగా ఉంది. తెలంగాణలో ఈ పెరుగుదల అంతా వైఎస్ వుుఖ్యవుంత్రిగా ఉన్న కాలంలోనే జరిగిందన్నది గవునార్హం.
2005లో సెజ్‌లు ఏర్పాటు చట్టం రూపొందింది. తరువాత 72 సెజ్‌లను రాష్ట్రంలో నోటిఫై చేయుగా, అందులో 44 సెజ్‌లు (61.1శాతం) తెలం గాణలోనే ఉన్నారుు. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నారుు. చిన్న, లఘు పరిశ్రవుల పనితీరును అధ్యయునం చేయుగా 1995-2009 వుధ్యకాలంలో 2007 - 08, 2008 - 09 సంవత్సరాల్లో ప్రశంసనీయుమైన అభివృద్ధి జరిగింది. 2007-08, 2008-09 సంవత్సరాల్లో హైదరాబాద్ ప్రాంతంలో 50.6, 41.9 శాతం, మొత్తం తెలంగాణ ప్రాంతంలో 44.8 శాతం, 38.3శాతం పెట్టుబడులు పెరిగారుు. ఆంధ్ర ప్రాంతంలో పెట్టుబడులు ఇంతకన్నా తక్కువే. ఆ పరిశ్రమల్లో 1995-2004 వుధ్యకాలంలో (చంద్రబాబు హయూంలో) పెట్టుబడులు రూ. 163కోట్ల నుంచి రూ. 4,452 కోట్లకు పెరగగా, ఆ తరువాత 2009 వుధ్యకాలంలో రూ. 10,504 కోట్లకు పెరిగారుు.
ఇందుగలరందు లేరనే...!
రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, పంచాయతీలు, స్థానిక సంస్థల్లో 1.2 లక్షలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా ఎనభైవేలకు పైగా తాత్కాలిక ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. ఇక ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖ, టూరిజం వంటి ప్రభుత్వ సంస్థల్లో దాదాపు లక్షా ముఫ్పై వేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఎన్‌ఎంఆర్‌లు, పార్ట్‌టైం ఉద్యోగులు, కంటింజెంట్ ఉద్యోగులు, క్యాజువల్ ఉద్యోగులు మరో 30 వేల మందికిపైగా ఉన్నారు. ప్రైవేటు రంగంలో కాలేజీల్లో 1.5 లక్షల మంది ఉన్నారు. ఇక హమాలీలు, కూలీలూ అసంఘటిత రంగంలోనే..
అది కష్టాల ‘కుప్ప’ం
అది కుప్పం. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం. అక్కడ 25 వేల మంది అసంఘటిత కార్మికులు చలువరాళ్లు చెక్కుతారు. పిల్లా జెల్లా ముసలి ముతక కలిపి సుమారు లక్ష మంది జీవిస్తుంటారు. ఆ తెల్లరాయి ఎంతో కఠినమైంది. దాన్ని చెక్కే ఉలి మూణ్ణెళ్లలోనే సగం అవుతుందట. ఆ విరిగిన ఇనుప ముక్కలు కార్మికుల దేహాన్ని తూట్లు పొడుస్తాయి. కళ్లకు తగిలి చూపుపోయిన వారెందరో. వారికి వైద్యం చేయించుకునే దిక్కు లేదు. ఇజ్రాయెల్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం మోసుకొచ్చి కుప్పంలో వ్యవసాయం అభి వృద్ధి చేశానని చెప్పే చంద్రబాబుకు అదే కుప్పంలో చలువరాతి కొండల్లోని ‘బండ’ బతుకులు కనబడలేదెందుకో? ఆ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య సహా యం అందించాలని, కనీస వేతనాలు చెల్లించేలా చూడాలనే ఆలోచన ఏనాడూ రాలేదు...
కారుచౌకగా కార్మిక శక్తి...
అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులు దొరకడమే దుర్లభం. ఒకవేళ దొరికినా, వారిని నియమించుకుంటే వారికి చెల్లించాల్సిన జీతభత్యాలు తక్కువేమీ కాదు. ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లోని కంపెనీ లు తమ పనులను కార్మికశక్తి కారుచౌకగా దొరికే దేశాలకు ‘ఔట్‌సోర్స్’ చేస్తున్నాయి. తృతీయ ప్రపంచ దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను ఒక్కొక్క కార్మికునికి గంటకు చెల్లించే వేతనం డాలరు (రూ.60) కంటే తక్కువే. కార్మికశక్తి కారుచౌకగా దొరికే తొలి పది దేశాలు... 1. మడగాస్కర్ (0.18 డాలర్లు-రూ.10.77), 2. బంగ్లాదేశ్ (0.23 డాలర్లు-రూ.13.77), 3. పాకిస్థాన్ (0.32 డాలర్లు-రూ.19.17), 4. ఘనా (0.32-రూ.19.17), 5. వియత్నాం (0.39 డాలర్లు-రూ.23.36), 6. భారత్ (0.48 డాలర్లు-రూ.28.75), 7. కెన్యా (0.50-రూ.29.96), 8. సెనెగల్ (0.52-రూ.31.16), 9. శ్రీలంక (0.62 డాలర్లు-రూ.37.14), 10. ఈజిప్టు (0.80 డాలర్లు-రూ.47.94).
కళ్లు చెదిరే కనీస వేతనాలు...
అభివృద్ధి చెందిన పలు దేశాలు కార్మికులకు కళ్లు చెదిరే కనీస వేతనాలను చెల్లిస్తున్నాయి. వారి కనీస వేతనాల ముందు మన దేశంలో కాస్త పెద్ద ఉద్యోగాలు చేసే వారి జీతాలూ దిగదుడుపే. కార్మికులకు గంటకు అత్యధిక కనీస వేతనాలు చెల్లించే తొలి పది దేశాలు... 1. నార్వే (57.53 డాలర్లు-రూ.3446), 2. స్విట్జర్లాండ్ (53.20 డాలర్లు-రూ.3186), 3. బెల్జియం (50.70 డాలర్లు-రూ.3032), 4. డెన్మార్క్ (45.48 డాలర్లు-రూ.2720), 5. స్వీడన్ (43.81 డాలర్లు- రూ.2620), 6. జర్మనీ (43.76 డాలర్లు-రూ.2617), 7. ఫిన్లాండ్ (42.30 డాలర్లు-రూ.2531), 8. ఆస్ట్రియా (41.07 డాలర్లు-రూ.2457), 9. నెదర్లాండ్స్ (40.92 డాలర్లు-రూ.2448), 10. ఆస్ట్రేలియా (40.60 డాలర్లు-రూ.2429).
చిన్నపరిశ్రమలకు వైఎస్ పెద్దపీట
Published Sat, Mar 29 2014 1:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement