►రాష్ట్రంలో రక్తపుటేరులు పారించిన బాబు
►ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేని రోజులు
►రైతన్న నెత్తురూ కళ్లజూసిన నారాసురుడు
►ఉద్యోగులనూ రాచి రంపాన పెట్టిన ఉన్మాది
నెల రోజులకు పైగా సాగిన ప్రచార పర్వానికి తెర పడింది. చరిత్రలో నిలిచిపోయే పోలింగ్‌కు నేడు సర్వం సిద్ధమైంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. గత చరిత్ర తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ ఈ సందర్భంగా వరుసగా కళ్లముందు కదలాడుతున్నాయి. ప్రజాప్రతినిధులకే రక్షణ కరువైన భయానక రోజులు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. బెజవాడ నడిబొడ్డున నిరాహార దీక్షలో ఉన్న ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగాను ‘తెలుగు’ తమ్ముళ్లతో తెగనరికించిన ‘నారా’జకీయం మనసులో మెదులుతోంది. చిల్లర ప్రచార పాకులాటలో మల్లెల బాబ్జీని బలిపశువును చేసిన వైనం అందరి మనసుల్లోనూ ఇంకా తాజాగానే ఉంది.
పాలక బాబుల అండదండలతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పడగ విప్పి బుసలు కొట్టిన ఫ్యాక్షనిజం, వందలాది మందిని పొట్టన పెట్టుకుని అది పారించిన నెత్తుటి మరకలు ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి. నీటి ‘తీరు’వాపై గళమెత్తినందుకు కాల్ధరిలో, కార్పొరేట్ల తొత్తుగా మారి పొట్ట కొడతారా అన్నందుకు చిన గంజాంలో, ఇవేం కరెంటు చార్జీలని ప్రశ్నించినందుకు రాజధాని నడిబొడ్డున బషీర్‌బాగ్‌లో... అన్నదాతలను పిట్టల్లా కాల్చి పొట్టన పెట్టుకున్న చరిత్ర ఇప్పటికీ తాజాగానే ఉంది. నిత్యం మూడు హత్యలూ ఆరు దౌర్జన్యాలుగా సాగిన చంద్రబాబు నరహంతక పాలన ఎన్నటికీ మర్చిపోలేనిదే...!
చిల్లర ప్రచారం కోసం మల్లెల బాబ్జీని..
తెలుగుదేశం పార్టీ దేదీప్యంగా వెలిగిపోతున్న 1984వ సంవత్సరం అది. ఎన్టీ రామారావు ప్రభుత్వ తొలి వార్షికోత్సవాన్ని హైదరాబాద్ లాల్‌బహుదూర్ స్టేడియంలో జనవరి 9న ఘనంగా నిర్వహించిన సందర్భమది. చిల్లర ప్రచారం కోసం నారా చంద్రబాబునాయుడు ఆడిన నాట కంలో మల్లెల బాబ్జీ అనే యువకుడి ప్రాణమే పోయింది. ఎన్టీ రామారావుపై అతి చిన్న కత్తిని మల్లె ల బాబ్జీ విసరడంతో ఆయన బొటన వేలికి చిన్న గాయమైంది. అంతే.. ఎల్లోమీడియా, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్‌పై హత్యాయత్నమం టూ గోబెల్స్ ప్రచారాన్ని గోడెక్కి మరీచేశారు.
టీడీపీకి సానుభూతి పెంచేందుకు బాబు ఆడించిన నాటకంలో బాబ్జీ పాత్రధారి అయ్యారు. సీఎంపై హత్యాయత్నం కేసు పేరుతో బాబ్జీని జైలులో పెట్టారు. ఏడాది తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక బాబుగారి నాటకానికి తాను బలిపీఠం ఎక్కానని బాబ్జీ తెలుసుకున్నాడు. ఎన్టీఆర్ పెద్దమనసు చేసుకుని చిన్న కేసే కదా బాబ్జీని వదిలేయాలన్నారు. అంతే కాదు బాబ్జీకి మూడు లక్షల రూపాయలను పరిహారంగా ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. తీరా బాబ్జీకి ఇచ్చిం ది కేవలం రూ.30 వేలే. అప్పటికే కు టుంబం అల్లరికావడం, ఏడాదిపాటు జైలులో ఉండటంతో మల్లెల బాబ్జీ మానసికంగా కుంగిపోయాడు. చంద్రబాబు ఇస్తానన్న డబ్బు కోసం చెప్పులు అరిగేలా తిరిగినా కనీసం దర్శనభాగ్యం కూడా లభించలేదు. చివరికి 1987 నవంబర్ 30న విజయవాడలోని కనకదుర్గలాడ్జిలో ఫ్యానుకు ఉరి వేసుకొన్నాడు. అప్పుట్లో అందరూ బాబ్జీది హత్యేనని ఆరోపించారు.
ఆ సమయంలో బాబ్జీ జేబులో స్వదస్తూరితో ఉన్న లేఖలో కఠోర నిజాలు వెలుగుచూశాయి. చంద్రబాబు తనకు రూ.3లక్షలు ఇస్తామని చెబితే ఎన్టీఆర్‌పై చిన్నపాటి చాకు విసిరానని, తీరా ఇచ్చింది రూ.30వేలేనని, హత్యాయత్నం డ్రామాను చంద్రబాబే ఆడించారని బాబ్జీ ఆ లేఖలో పేర్కొన్నాడు. చిల్లర ప్రచారం కోసం మల్లెల బాబ్జీ ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు గత చరిత్ర తెలియనట్టే నటనలో జీవిస్తూ నటరత్న నందమూరి తారకరామారావు నటననే మరిపిస్తున్నారు.
అన్నదాత హంతకులెవరు ?
బషీర్‌బాగ్ దమనకాండ
అది ఆగస్టు 28, 2000. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ అప్పటి ప్రతిపక్షపార్టీలు నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో 2000 సంవత్సరంలో జరిగిన పోలీసు కాల్పుల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలస్వామి(22), ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన రామకృష్ణలు మృతి చెందారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చంద్రబాబు తన హయాంలో..
కర్షకుడిపై విరుచుకుపడ్డాడు
వ్యవసాయం దండగన్నాడు
కళ్లు తిరిగేలా కరెంటు బిల్లులిచ్చాడు
మోటార్లకు మీటర్లు బిగించాడు
హార్స్‌పవర్ రేటును పెంచేశాడు
రకరకాల చార్జీలతో పిప్పిచేశాడు
నీటి తీరువానూ పెంచాడు
నిస్సహాయులను దొంగల్లా చూశాడు
వేలాది కేసులు పెట్టించాడు
బషీర్‌బాగ్, కాల్దరి, చినగంజాం..
ఊరేదైనా ఉద్యమంపై ఉక్కుపాదం మోపాడు
బక్కరైతు గుండెలపై తుపాకీ ఎక్కుపెట్టాడు.
చినగంజాంలో రైతులను చంపేశాడు
అది ఫిబ్రవరి 11, 2000 సంవత్సరం. ప్రకాశం జిల్లా చినగంజాం. ఓ బహుళ జాతి సంస్థను ఆనాటి టీడీపీ సర్కార్ వెనకేసుకు రావడాన్ని రైతులు నిరసించారు. ఉప్పు తయూరీ వల్ల పంట భూవుులు నిరుపయోగవువుతాయుని ఆందోళన వ్యక్తం చేశారు. కడుపు వుండి రోడ్డెక్కిన రైతులపై పోలీసులు పాశవికంగా కాల్పులు జరిపారు. దీంతో రాజుబంగారు పాలేనికి చెందిన కుక్కల పుల్లారెడ్డి, మూలగానివారి పాలేనికి చెందిన రాజు రాఘవ రెడ్డి బలయ్యూరు.
అనంత.. రక్త చరిత్ర
►చంద్రబాబు దన్నుతో చెలరేగిన దేశం నేతలు..
► ప్రతిపక్ష పార్టీ నేతల ఊచకోత
టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో అనంతపురం జిల్లాలో రక్తం ఏరులైపారింది. చంద్రబాబు కనుసైగలతో పరిటాల రవి తన ప్రైవేటు సైన్యంతో ప్రతిపక్ష పార్టీ నేతలను ఊచకోత కోయించారు. బాబు హయాంలో 200 మందికిపైగా హత్యకు గురయ్యారు. 130 మందికిపైగా నేతల ఆచూకీ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. వర్గాధిప్యతమే లక్ష్యంగా పీపుల్స్‌వార్‌లో పనిచేసిన పరిటాల రవి 1993లో పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తరువాత టీడీపీ తీర్థం పుచ్చుకుని.. రాజకీయ అరంగేట్రం చేశారు. కొద్ది రోజులకు ఆయన కుడిభుజం పోతుల సురేష్ పీపుల్స్‌వార్‌లో క్రియాశీలకమయ్యారు. 1993 అక్టోబరు 24న, మద్దెలచెర్వు సూరి ఇంట్లో టీవీ బాంబును పెట్టి పేల్చివేశారు.
ఈ ఘటనలో సూరి తల్లి సాకమ్మ, సోదరుడు రఘునాథరెడ్డి, సోదరి పద్మావతి, చంద్రశేఖర్(7), నారాయణప్ప దుర్మరణం చెందారు. దీనిపై ఆగ్రహించిన పీపుల్స్‌వార్ పోతుల సురేష్‌ను బహిష్కరించింది. దీంతో రీఆర్గనైజింగ్ కమిటీ(ఆర్వోసీ)ని ప్రారంభించారు. 1994లో పరిటాల పెనుకొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రైవేటు సైన్యం ఆర్వోసీ రెచ్చిపోయింది. దొరికినవారిని దొరికినట్లుగా ఊచకోత కోసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిటాల ప్రైవేటు సైన్యం పెనుకొండ, ధర్మవరం, తాడిపత్రి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేసింది. చంద్రబాబు దన్నుగా నిలవడంతో వారి ఆగడాలకు హద్దులేకుండా పోయింది.
పెనుకొండ మాజీ ఎమ్మెల్యే సానే రమణారెడ్డి, తాడిపత్రి మండలం యాడికి ఎంపీపీ బాలా సతీష్ తదితరులను దారుణంగా నరికి చంపారు. దాదాపు 200 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్వోసీ చేతిలో హతమయ్యారు. ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల్లో 130 మందికి పైగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కిడ్నాప్‌నకు గురయ్యారు. వీటిపై వివిధ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదైనా ఇప్పటివరకు వారి ఆచూకీ తెలియడం లేదు. అదృశ్యమైనఅత్యధికులను చంపి శవాలను రామగిరి బంగారు గనుల్లో పారవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 1995 నుంచి 2003 వరకూ ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ అనంతపురం జిల్లాలో హత్యకాండపై తెలుగుదేశం సర్కారును అప్పటి విపక్షాలు నిలదీసినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. పరిటాల ప్రైవేటు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన రెడ్‌స్టార్ అనే నక్సల్ గ్రూపుపై బాబు పోలీసులను ఉసిగొల్పి ఎన్‌కౌంటర్లు చేయించారు. ఇదీ చంద్రబాబు అనంత.. రక్తచరిత్ర!
ఆడపడుచులపై అమానుషం
‘మహిళా ఓట్లతోనే అధికారంలోకి వచ్చాం.. వారంతా మా పక్షమే’... అప్పట్లో చంద్రబాబు పదేపదే చెప్పిన మాటలివి. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో తమకు ఏం జరిగిందని ఏ స్త్రీమూర్తిని అడిగినా ఆ నాటి ఘటనలు తలచుకుని మండిపడుతుంది. ఎన్నికల నాడు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించిన అంగన్‌వాడీలను ఇందిరా పార్క్ సాక్షిగా గుర్రాలతో తొక్కించిన వైనం... చంకలో పసిపిల్లలతో ఆందోళన చేస్తున్నా పోలీసులతో తరిమి తరిమి కొట్టించిన పాశవిక సన్నివేశం.. గుక్కెడు నీటి కోసం జన్మభూమిలో నిలదీస్తే తెలుగుసేన రూపంలో దండెత్తిన వైనం.. తండా మహిళలపై ‘దేశం’ తమ్ముళ్ల దారుణం.. ఎన్నని చెప్పేది? ఏమని చెప్పేది అని మహిళాలోకం ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమ గుండెలపై ఇంకా గుర్రపు డెక్కల ముద్రలు చెరిగిపోలేదని, తమ వీపులపై లాఠీదెబ్బల గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని.. ఆక్రో శిస్తుంది. మహిళా సాధికారత గురించి మహా గొప్పగా చెబుతున్న బాబు.. తన నైజాన్ని మార్చుకున్నాడంటే నమ్మం అంటోంది.
కర్నూలులో రక్తకాసారం
⇒ టీడీపీ హయాంలో తమ్ముళ్ల కల్లోలం.. ప్రత్యర్థును వేటాడి మరీ చంపిన వైనం
⇒ కర్నూలు జిల్లాలో టీడీపీ హయాంలో తమ్ముళ్లు కల్లోలం సృష్టించారు.
- పత్తికొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే శేషిరెడ్డి, కోడుమూరు కాంగ్రెస్ నాయకుడు పర్రప్పను 1996 ఏప్రిల్ 18న టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు.
- హుసేనాపురానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నాగిరెడ్డి డోన్ నుంచి ఆటోలో వెళ్తుండగా కాపు కాసి టీడీపీవారు వేటకొడవళ్లతో హత్య చేశారు.
- కౌతాళం మండలానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు మర్రెగౌడును ఆదోని ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వర్గీయులు హత్య చేశారు.
- టీడీపీ నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు, అతని అనుచరులు ఒకే రోజు ఆరుగురు ప్రత్యర్థులను దారుణంగా హత్య చేశారు.
- మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డిని కర్నూలు కొత్త బస్టాండ్‌లో అప్పటి తెలుగుదేశం నేత బెరైడ్డి అనుచరులు అత్యంత దారుణంగా హత్య చేశారు.
- నందికొట్కూరు కాంగ్రెస్ నాయకుడు మాండ్ర గిడ్డారెడ్డి నామినేషన్‌కు హాజరైన పూడూరు వెంకటేశ్వర్లును బెరైడ్డి అనుచరులు హత్య చేశారు. బ్రాహ్మణకొట్కూరుకు చెందిన సాంబ శివారెడ్డి, చౌట్కూరు జనార్ధనరెడ్డి సోదరులు, మల్యాల టీకారెడ్డి, నంది కొట్కూరు ఉస్మాన్ బాషా, నెహ్రూనగర్‌కు చెందిన శ్రీరాములు, విలేకరి కృష్ణలింగ ప్రసాద్, దామగట్ల పుల్లారెడ్డి, లక్ష్మిరెడ్డి, ముచ్చుమర్రి స్వామిరెడ్డి, మర్రి వెంకటస్వామి తదితరులు కూడా టీడీపీ హయాం లో బెరైడ్డి వర్గీయుల చేతిలో హతమయ్యారు.
కాల్దరిలో కర్షకులను కాల్చేశాడు
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్దరి రైల్వే స్టేషన్‌లో 1996 సెప్టెంబర్ 6న.. నీటి తీరువా, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని రైతులు రైల్‌రోకో చేపట్టారు. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే పోలీసులు నేరుగా తుపాకులను గురిపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో కాల్దరి గ్రామానికి చెందిన రైతు ఆలపాటి రామచంద్రరావు, వేలివెన్ను గ్రామానికి చెందిన రైతు గన్నమని కష్ణారావు అక్కడికక్కడే పిట్టల్లా రాలిపోయూరు.
ఉద్యోగుల ఉసురు తీశాడు
నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కె.అప్పారావు. మరికొద్ది నెలల్లో రిటైర్ కావాల్సిన ఆయనను.. తోటి అధికారుల ముందు బాబు చేసిన అవమానం పొట్టన పెట్టుకుంది. టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా బాబు తీవ్ర పదజాలంతో మందలించడంతో అప్పారావు బాగా చిన్నబుచ్చుకున్నారు. అది టీవీ చానెళ్లలో కూడా ప్రముఖంగా రావడం, బంధుమిత్రులు, తెలిసిన వారు ఫోన్లు చేసి ఏం జరిగిందంటూ ఆరా తీయడంతో అయిన వారందరిలోనూ నవ్వులపాలయ్యానన్న భావనతో కుంగిపోయారు. దాంతో సన్నిహిత మిత్రుడు రాత్రి భోజనానికి పిలిచినా వెళ్లలేదు. మర్నాడు ఉదయం ఆఫీసుకు బయలు దేరుతూ, గుండెపోటుతో కారు వద్దే కుప్పకూలారు.. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చంద్రబాబు వైఖరికి అద్దం పట్టే సంఘటన.
అందలమెక్కిస్తే అంతం చూశాడు
దుర్మార్గుడు.. మేకవన్నె పులి
గాడ్సేనే మించిన వాడు
అభినవ ఔరంగజేబు.. మిడత..!
మూర్తీభవించిన పదవీ కాంక్ష
ప్రజాస్వామ్య హంతకుడు.. కుట్రకు కొలువు
గూడుపుఠాణీకి గురువు.. మోసానికి మూలస్తంభం
గుండెల్లో చిచ్చు పెట్టినవాడు.. గొడ్డు కన్నా హీనం
చీమల పుట్టలో పాములా చేరిన వాడు
.. ఇవన్నీ గిట్టని వారి మాటలు కావు. ఎన్నికల వేళ ఎవరి పేరు చెప్పుకుంటూ చంద్రబాబు ఊరూరా ఓట్లడుక్కుంటున్నారో, ఆ అన్నగారే స్వయానా అన్నమాటలు! దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. బాబు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుద రాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా నయవంచనకు, వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు! వెన్నుపోటుకు గురై అధికారం కోల్పోయిన అనంతరం బాబును దునుమాడుతూ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు.. గాంధీని చంపిన గాడ్సే కన్నా హీనుడని వాపోయారు. మూర్తీభవించిన పదవీ కాంక్షతో మోసం చేశాడని ఆవేదన చెందారు. అధర్మమని ఘోషించారు. ఆఖరికి.. అన్యాయమై..పోయారు!