Telugudesam party
-
చంద్రబాబుకు షాక్.. ‘టీడీపీ గుర్తింపు రద్దు చేయండి’
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. బహిరంగ సభల్లో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి హింసను ప్రేరేపించి అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని చెబుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద టీడీపీ గుర్తింపుని రద్దు చెయ్యాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు నవ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రమౌళి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చంద్రమౌళి లేఖ రాశారు. ఈ లేఖలో.. గత ఏడాది డిసెంబర్లో నెల్లూరు జిల్లా కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోగా నలుగురు గాయపడ్డారని, ఈ ఏడాది జనవరి 2న గుంటూరులో జరిగిన సభలో మరో ముగ్గురు చనిపోయారని, ఇక ఇదే నెలలో పుంగనూరులో కార్యకర్తలను రెచ్చగొట్టి ఏకంగా పోలీసులపైనే రాళ్ళ దాడికి పాల్పడేలా చేసి చంద్రబాబు హింసకు తెరతీశారన్నారు. ప్రజా ప్రతినిధుల చట్టం ఆర్టికల్-2 ప్రకారం ఏ రాజకీయ పార్టీ హింసాత్మక కార్యక్రమాలను రెచ్చగొట్టకూడదు. ఈ చట్టాన్ని అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించినందుకు తెలుగుదేశం పార్టీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను చంద్రమౌళి కోరారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలలోనూ రాజకీయాలా ? -
తెలుగు మీడియం పేద పిల్లలే చదవాలా..?
-
పొలిటికల్ కారిడార్ : ఇదేమి కర్మ పేరుతో టీడీపీ మరో కార్యక్రమం
-
టీడీపీ, జనసేన పార్టీలు కనుమరుగు అవ్వడం ఖాయం : మంత్రి ఉషశ్రీ చరణ్
-
టీ–కాంగ్రెస్‌లో ‘టీఎస్ కాంగ్రెస్!’
టీ–కాంగ్రెస్‌కూ టీఎస్ కాంగ్రెస్‌కు తేడా ఏముంటుంది? వడ్ల గింజలో బియ్యం గింజ. రెండూ ఒకటే. కానీ తేడా ఉందట! ఈమధ్య ఒక కాంగ్రెస్ నాయకుడు ‘మమ్మల్ని టీ కాంగ్రెస్ అనకండి ప్లీజ్. ఇబ్బందిగా ఉంది. కావాలంటే టీఎస్ కాంగ్రెస్ అని రాసుకోండి’ అన్నారట! అలా ఎందుకంటున్నారో చెప్ప మని అడిగితే బాగా ఆలోచించండి... మీకే అర్థమవుతుందని తప్పించుకున్నాడట! తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ రక్తాన్ని బాగా ఎక్కించిన తర్వాత పాత కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉక్కపోతకు గురవుతున్న సంగతి తెలిసిందే. వాళ్లకు టీ అనే శబ్దంలో తెలుగుదేశమే ధ్వనిస్తున్నదట. జగ్గారెడ్డి ఎపిసోడ్ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలి ఉన్నట్టు స్పష్టంగా వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ అన్నాక ఓ ఇరవై ముప్ఫయ్ గ్రూపులుండటం ఆమోదయోగ్యమే కదా! రెండు వర్గాలుగా విడిపోతేనే కంగారెందుకు అనే అనుమానం సహజం. కానీ ఈ తాజా రెండు వర్గాలకు ప్రాతిపదిక ‘రక్తసంబంధం’. సెంటి మెంట్ బాగా వర్కవుట్ అవుతున్నట్టు కనిపిస్తున్నది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడం లేదని పాతవాళ్ల అభియోగం. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలనీ, లేదంటే ఆయన్నే మార్చాలని పార్టీ అధ్యక్షు రాలికి జగ్గారెడ్డి రాసిన లేఖ పెద్ద కలకలాన్నే సృష్టించింది. ఆ లేఖ మీడియాకు లీకవడం క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందని క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి తేల్చారు. వివరణ కోసం జగ్గారెడ్డిని పిలుస్తామని కూడా చిన్నారెడ్డి చెప్పారు. కానీ జగ్గారెడ్డి ఏమాత్రం తగ్గలేదు. ‘కబాలి’ సినిమాలో రజనీకాంత్ ‘క... బా... లి... రా’ అని చెప్పినంత నిబ్బరంగా, ధీమాగా సమాధానం చెప్పారు. క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కావలసి వస్తే ముందుగా రేవంత్‌రెడ్డే హాజరు కావలసి ఉంటుందని జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని పాత కాంగ్రెస్ నాయకులందరికీ అధిష్ఠానం వైఖరి స్పష్టంగా తెలుసు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోరాడాలని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో ముఖ్యంగా రాహుల్‌తో చంద్ర బాబుకు తెరచాటు అనుబంధాలు బలంగా ఉన్నాయనే సంగతి కూడా తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టే సమయంలో కుదిరిన సఖ్యత క్రమంగా గట్టిపడుతూ వచ్చింది. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ, అంతకుముందు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మాటసాయం, ‘మూట’సాయం చంద్రబాబు బాగానే చేశారని వెల్లడైంది. ఆయన ప్రభావం వల్లనైతేమీ, మరే ఇతర కారణం వల్లనైతేమీ రేవంత్ నాయకత్వాన్ని మార్చే ఉద్దేశం హైకమాండ్‌కు లేదని చెబుతారు. ఈ విషయాలు తెలిసిన తర్వాత కూడా జగ్గారెడ్డి ధిక్కార స్వరానికి కారణమేమిటి? ఆయనిప్పుడు పాడిన పాట ఒంటరి పాటగానే మిగులుతుందా? భవిష్యత్తులో బృందగానంగా మారుతుందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం ఇంకా రెండేళ్ల కంటే కొంచెం తక్కువ సమయమే వున్నది. కానీ షెడ్యూల్ కంటే ముందే కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం రెండో అర్ధభాగం నుంచే ఎన్నికల మోడ్‌లోకి తెలంగాణ వెళ్లవచ్చు. దేశంలో ఉన్న రెండు ప్రధాన జాతీయ పార్టీలు తెలంగాణపై ఆశలు పెంచు కున్నాయి. కేసీఆర్‌కు ఇది రెండో ఇన్నింగ్స్ కనుక అంతో ఇంతో నెగెటివ్ ఓటు ఉండే అవకాశం ఉందనీ, దాన్ని సానుకూలంగా మార్చుకోవాలనీ అవి భావిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునాదులు ఇంకా పదిలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న నిరుత్సాహకర వాతావరణంలో తెలంగాణ గెలుపు ఆ పార్టీకి సంజీవనిగా తోడ్పడుతుంది. భారతీయ జనతా పార్టీకి కర్ణాటక తర్వాత మరో స్థావరం దక్షిణాదిలో ఇంతవరకూ దొరకలేదు. ఏపీ, కేరళ, తమిళ నాడులతో పోలిస్తే ఆ పార్టీ పలుకుబడి తెలంగాణలోనే ఎక్కువ. ఒక సంపూర్ణ జాతీయ పార్టీగా పూర్వపు కాంగ్రెస్ స్థాయిని అందుకోవాలంటే తెలంగాణను గెలుచుకోవలసిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు వాటి వ్యూహాలను రూపొందిస్తున్నాయి. రెండు నెలలకోమారు సర్వేలు చేసి ప్రజల నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీల సర్వే ల్లోనూ ఫలితాలు దాదాపుగా ఒకే మాదిరిగా వస్తున్నాయట. రాష్ట్రంలో ఏకైక పెద్దపార్టీగా టీఆర్ఎస్ సుమారు 40 శాతం ఓటు బ్యాంకుతో స్థిరంగా కొనసాగుతున్నది. జాతీయ పార్టీల అంచనా ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ ఓటు 38 శాతం కంటే తగ్గదు. 42 శాతం మించి పెరగదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 25 నుంచి 27 శాతం మంది, బీజేపీకి 13 నుంచి 15 శాతం మంది ఓట్లేస్తారని ఆ పార్టీలు ఒక నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ మూడు ప్రధాన పార్టీలకు ఓట్లేసేవారు మొత్తం ఓటర్లలో 80 శాతం మంది. ఇతర పార్టీలకూ, ఇండిపెండెంట్లకూ కలిపి ఐదారు శాతం ఓట్లు పడ్డా మిగిలిన పద్నాలుగు, పదిహేను శాతం మంది ఇప్పటికీ తటస్థంగానే మిగిలిపోయారు. ఈ బెంచి మార్కు నుంచిరెండు జాతీయ పార్టీలు వాటి కార్యాచరణను సిద్ధం చేసు కుంటున్నాయి. కుమ్ములాటలు లేకుండా పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపినట్లయితే, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడినట్లయితే ఎన్నికల నాటికి తమ పార్టీ పుంజుకొని మంచి ఫలితాలు సాధించగలుగుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. కాంగ్రెస్ కంటే బీజేపీ ముందున్నది ఇంకా పెద్ద టాస్క్. యథాతథంగా చూస్తే అధికార పీఠానికి కాంగ్రెస్ కంటే బీజేపీ ఇంకొంచెం ఎక్కువ దూరంలో ఉన్నది. ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికీ, కాంగ్రెస్‌ను తోసిరాజని ప్రధాన పోటీదారుగా నిలవడానికీ తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నట్టు సమాచారం. పంజాబ్ మోడల్‌ను తెలంగాణలో అమలు చేసేందుకు కొన్ని ప్రయ త్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. రైతుల ఆందోళన తర్వాత బీజేపీ మరింత బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీ అంతఃకలహాలను అవకాశంగా మలుచుకొని ఒక గట్టి అలయెన్స్‌లో భాగం కాగలిగింది. కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరీందర్‌సింగ్ చీలిక ఆ పార్టీకి శాపంగా మారింది. కెప్టెన్ నాయకత్వంలోని లోక్ కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ పోటీలోకి దిగింది. ఈ ఫార్ములా తెలంగాణలో అమలుచేసే అవకాశాలపై ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఒక రాజకీయ వ్యవహారాల నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. టీ–కాంగ్రెస్ నాయ కత్వాన్ని మార్చేందుకు అధిష్ఠానం సుముఖంగా లేదనీ, అదే నాయకత్వంలో పనిచేయడానికి టీఎస్ కాంగ్రెస్ పాత నాయ కులు సిద్ధంగా లేరనీ, ఈ నేపథ్యంలో చీలిక తప్పక పోవచ్చుననీ ఆ నివేదికలో అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. ఘనమైన చరిత్ర కలిగిన పార్టీని చంద్రబాబు వంటి అవకాశవాదికి పరోక్షంగా లీజుకు ఇవ్వడం కంటే, పార్టీ స్వచ్ఛతను కాపాడుకోవడానికి కొంతకాలం వేరుగా ఉండటమే మేలన్న అభిప్రాయాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు వినిపిస్తు న్నారు. ఇందుకోసం వారు తమిళనాడులో మూపనార్ చేసిన ప్రయోగాన్ని ఉదాహరిస్తున్నారు. 1996 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ అధిష్ఠానం తమిళనాడులో అన్నాడిఎమ్‌కేతో పొత్తు కుదుర్చుకున్నది. జాతీయ స్థాయిలో ట్రబుల్ షూటర్‌గా పేరెన్నికగన్న తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు జీకే మూపనార్ ఈ పొత్తును వ్యతిరేకించారు. జయలలితపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదనీ, ఆమెతో పొత్తు వల్ల పార్టీ తుడిచి పెట్టుకుపోతుందనీ మూపనార్ వర్గం వాదించింది. అధిష్ఠానం అంగీకరించలేదు. దీనితో మూపనార్ నేతృత్వంలో మెజారిటీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ నుంచి చీలి ‘తమిళ మానిల కాంగ్రెస్’ (టీఎమ్సీ) పేరుతో వేరు కాపురం పెట్టారు. ఈ చీలిక కాంగ్రెస్‌తో డిఎమ్‌కే పొత్తు పెట్టుకొని 20 లోక్‌సభ సీట్ల్లను కేటాయించింది. తను 17 సీట్లలోనే పోటీ చేసింది. పోటీచేసిన అన్ని స్థానాలలోనూ ఈ కూటమి గెలిచింది. మెజా రిటీ అసెంబ్లీ సీట్లను తీసుకున్న డిఎమ్‌కే అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో కూడా 40 సీట్లను టీఎమ్సీ గెలుచు కోగలిగింది. అన్నాడిఎమ్‌కేతో కలిసి పోటీచేసిన అధికార కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కానీ, పార్లమెంట్ సీటు కానీ దక్కలేదు. అప్పుడు కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ మంత్రివర్గంలో ‘తమిళ మానిల కాంగ్రెస్’ కీలకపాత్ర పోషిం చింది. ఆరేళ్ల తర్వాత తిరిగి ఆ పార్టీ మాతృసంస్థలో విలీన మైంది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న ఈ ఉదంతం ఇప్పుడు తెలంగాణా వ్యవహారాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీ ఆకాంక్షలకూ, టీఎస్ కాంగ్రెస్‌వాదుల అవసరాలకూ లంకె కుదిరితే కనుక అది కచ్చితంగా సత్ఫలితాలను సాధిస్తుందని మధ్యవర్తుల నమ్మిక. వారి అభిప్రాయం ప్రకారం బీజేపీతో చీలిక వర్గం జతకడితే మెజారిటీ కాంగ్రెస్ ఓట్లు వీరివైపే మొగ్గుతాయి. దాని ప్రభావంతో తటస్థుల ఓట్లను కూడా అధిక సంఖ్యలో ఆకర్షించగలుగుతారు. ఫలితంగా టీఆర్ఎస్కు గట్టి పోటీ దారుగా ఈ కూటమి నిలబడుతుంది. ఈరకమైన విశ్లేషణతో అందిన నివేదికపై బీజేపీ నాయకత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వ్యవహారంలో బీజేపీ చొరవ తీసుకుంటే కాంగ్రెస్‌లో చీలిక తప్పకపోవచ్చుననే వాదన వినబడుతున్నది. ఇటువంటి ఒక రాజకీయ పొందిక ఏర్పాటు ద్వారా కేసీఆర్‌ను బలంగా ఎదుర్కోవాలని భావిస్తున్న కొందరు తటస్థ ప్రము ఖులు ఇటువైపునా అటువైపునా రాయబారులు నడుపు తున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం తొలిదశలో ‘ఆకర్ష్ బీజేపీ’ కార్యక్రమం ఉధృతంగా జరుగుతుంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి జోరుగా చేరికలుంటాయి. రెండో దశలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ముదిరి చీలిక ఏర్పడుతుంది. తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ (చీలికవర్గం)తో అవగాహన కుదిరిన తర్వాత వారికి కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డికె అరుణ, విజయ శాంతి... ఇలా అనేక ఆప్షన్లు బీజేపీ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ వర్గానికి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వదిలి, పార్లమెంట్ సీట్లు బీజేపీ ఎక్కువ తీసుకునే అంశం కూడా చర్చకు రావచ్చు. అయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రాథమిక స్థాయిలో, అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. కార్యరూపం దాల్చాలంటే తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక మూపనార్ ఉండాలి. ఎవరా మూపనార్? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఇమడలేక సతమతమవుతున్నారా? దశ దిశా లేకుండా దిక్కులేని పక్షిలా సాగుతున్న పార్టీ ప్రయాణంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారా? జనంతో సంబంధం లేకుండా నిత్యం మీడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, లోకేష్ భజన చేస్తూ పబ్బం గడుపుకునే నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తమను అవమానిస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కేశినేని నాని.. చంద్రబాబుకు స్పష్టంగా తేల్చిచెప్పడాన్ని బట్టి సీనియర్ నాయకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇటీవలే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నడుస్తున్న తీరు బాగోలేదంటూ ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని బుజ్జగించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని బుచ్చయ్య వాయిదా వేసుకున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం పట్ల ఆయన అభిప్రాయం మాత్రం మారలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సైతం పార్టీ తీరు పట్ల బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రైవేటు సంభాషణలో టీడీపీ పని అయిపోయిందని, ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వీరే కాకుండా ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు టీడీపీ మునిగిపోతున్న నావ అనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. చురుగ్గా లేని సీనియర్ నేతలు గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ దాదాపు పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారో, లేదోననే పరిస్థితి ఉంది. రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల్లో నలుగురైదుగురు మినహా ప్రస్తుతం ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వారి నియోజకవర్గాల్లో సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించినా పట్టించుకోవడం లేదు. టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు (వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరామకృష్ణమూర్తి) ఆ పార్టీకి దూరమయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో సగం మంది గోడ దూకడానికి ఎప్పుడో సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన తన తనయుడు లోకేష్‌కి పెత్తనం అప్పగించడం సీనియర్లకు మింగుడుపడడం లేదు. తన భజన చేసే వారినే ఆయన ప్రోత్సహిస్తుండడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. -
టీడీపీలో కుతకుతలు: నిన్న జేసీ, కాల్వకు.. నేడు ఉమా, ఉన్నం
కల్యాణదుర్గం రూరల్: కల్యాణదుర్గం టీడీపీలో వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమాల్లోనే వర్గ విభేదాలు బయట పడుతుండడంతో ఆ పార్టీ పరువు పోతోంది. తాజాగా బీటీపీ పరిధిలోని హంద్రీ-నీవా కాలువ అభివృద్ధి పనులు పరిశీలించేందుకు కాలువ వెంబడి పాదయాత్ర చేపట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరితో పాటు పలువురు పాదయాత్రలో పాల్గొన్నారు. కళ్యాణదుర్గం- ఒంటిమిద్ది మధ్యలో కార్యక్రమాన్ని చేపట్టారు. పాదయాత్ర ముందు వరుసలో మాజీ మంత్రులతో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన తనయుడు మారుతీ చౌదరి తదితరులు కలిసి సాగుతుండగా... వెనుక ఉన్న టీడీపీ కల్యాణదుర్గం ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు, అనుచరులు కల్పించుకున్నారు. ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం ముందు వరసలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో వివాదం చెలరేగింది. ఒకానొక దశలో మారుతీ చౌదరి, ఉమా వర్గీయులు పరస్పరం బూతులతో విరుచుకుపడ్డారు. కొద్ది సేపు గందరగోళం నెలకొంది. చివరకు నాయకులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత పాదయాత్ర కాస్త ముందుకు సాగగానే నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. -
పార్టీ మార్పుపై ఎల్.రమణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: పార్టీ మారాలని తానెప్పుడూ అనుకోలేదని, ఏదైనా ఉంటే అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటివరకు పార్టీ మారే విషయంలో ఎవరూ ఎటువంటి ప్రతిపాదనలు తీసుకురాలేదని చెప్పారు. తాను పార్టీ మారతానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. సోషల్ మీడియాను నియంత్రించే పరిస్థితి లేకపోవడంతోనే రకరకాలుగా ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇలాంటి చర్యలతో నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తుల మనసు బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ పదవులు, పైరవీలు, ప్రాపర్టీల కోసం ఆలోచించలేదన్నారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా అవకాశం ఇచ్చిందని చెప్పారు. 27 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తల రెక్కలకష్టం మీద తాను ఎదిగానని, తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ, కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని ముందుకుసాగుతానని స్పష్టం చేశారు. ఏ పార్టీలోకి వెళ్లినా, వెళ్లకపోయినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తానని స్పష్టంచేశారు. తాను పార్టీ మారదల్చుకుంటే ముందుగా మీడియా ద్వారానే వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా, మారుతున్న రాజకీయాలను గమనిస్తున్నానని రమణ అన్నారు. ఈ మార్పులను ఎప్పటికప్పుడు తమ అధినేతకు తెలియజేస్తున్నట్లు వివరించారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం తనది కాదని, అలాగే ఇంకొకరి పదవులకు అడ్డుపడే మనస్తత్వం కాదని స్పష్టంచేశారు. -
బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదగా ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. కాగా అప్పట్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావించినా కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. అక్టోబర్‌లో అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియమితులైనా కరోనా సమయంలో తాను ఎక్కడికీ రాలేనని చంద్రబాబు తేల్చి చెప్పడంతో ఇప్పటికి అచ్చెన్న బాధ్యతలు స్వీకరించారు. (టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు) -
ఎల్లో మీడియాకు పోసాని కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కుయుక్తులపై సినీ నటుడు పోసాని కృష్ణమురళీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా విమర్శలపై ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కులపిచ్చి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. కుల, మతాలకు అతీతంగా వైఎస్సార్ కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదే పదే కుల ప్రస్తావన తీసుకు వచ్చి ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని పోసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎలా అయితే ప్రజల గుండెల్లో దేవుడులా చిరస్థాయిగా నిలిచారో.. అంతేస్థాయిలో వైఎస్ జగన్ కూడా ప్రజలకు సేవ చేస్తూ అందరి హృదయాల్లో నిలిచిపోతారు. ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ స్థానంలోకి తీసుకు వెళతారు’ అని అన్నారు. -
ప్రచారానికి తెర..
ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులన్నీ మూగబోయాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఎక్కడ ప్రచారం అక్కడ ముగించారు. జిల్లాలో ఎన్నికల ప్రచారం విషయంలో వైఎస్సార్సీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలకు ఈసారి ముచ్చెమటలు పట్టాయి. గతనెలలో షెడ్యూలు వెలువడ్డాక అనూహ్యంగా తక్కువ వ్యవధి ఉండటంతో అధికార టీడీపీ తడబడింది. చాలా చోట్ల అభ్యర్థుల ఎంపిక నామినేషన్ల ఘట్టం వరకూ తేల్చలేకపోయింది. ఫలితంగా అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడిపోయారు. నామినేషన్ల ఘట్టం ముగిశాక తొందరపడ్డారు. కానీ అప్పటికే సమయం హరించుకుపోయింది. మిగిలిన పార్టీలదీ అదే పరిస్థితి. జనసేన లాంటి పార్టీలు కనీసం అభ్యర్థులందరినీ పరిచయం చేసే ప్రచారం సైతం నిర్వహించలేపోయాయి. మరోపక్క అధికారులు రేపటి ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారు. బుధవారం ఉదయం నుంచి ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల తరలింపునకు శ్రీకారం చుట్టనుంది. ఎన్నికల అధికారులు..సిబ్బంది కూడా నేటి నుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సాక్షి కడప : ప్రచారానికి మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు ఫుల్స్టాప్ పడింది. అన్ని రాజకీయ పక్షాలు అన్ని రకాల ప్రచారాలను నిలిపేశాయి. జిల్లాలో వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. గతనెల 18న రాయచోటిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు. 22న పులివెందులలో సీఎస్ఐ చర్చి మైదానంలో అశేష జనవాహినినుద్దేశించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. 29న బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈనెల 5వ తేదీన జమ్మలమడుగులో ఎన్నికల సభలో ప్రసంగించారు. అన్ని సభలకూ జనం పోటెత్తారు. కేడరులో ఆయన ప్రసంగం ఉత్సాహాన్ని నింపింది. ప్రతిపక్ష నేత హామీలపై ప్రజల విశ్వాసం తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాలు వివరించారు. ప్రజాకాంక్షలకు పట్టం కట్టేలా హామీలిచ్చారు. నవరత్న పథకాలతో ప్రతి కుటుంబానికి జరిగే ప్రయోజనాలను వివరించారు. రాయచోటిలో హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు పారించడంతోపాటు శ్రీనివాసపురం, వెలిగల్లు, ఝరికోనలను నీటితో నింపుతాం. రాయచోటికి చెందిన మైనార్టీ నేతకు ఎమ్మెల్సీ ఇస్తాం. బద్వేలు, మైదుకూరు సభల సందర్భంగా కుందూనది నుంచి బ్రహ్మంసాగర్‌కు పంపింగ్ స్కీమ్ ద్వారా నీరు సరఫరా. సోమశిల బ్యాక్ వాటర్‌తో బద్వేలు, అట్లూరు, గోపవరానికి తాగు, సాగునీటి సరఫరా. వెలిగోడు నుంచి కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్లలకు జలాలు. చెన్నూరు చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధ్దరించి కార్మికులకు ఉపాధి, రైతులకు గిట్టుబాటు ధర రాజోలి ప్రాజెక్టును నిర్మాణం.బద్వేలు నియోజకవర్గంలోని అన్ని చెరువులకూ జలకళ. కేపీ ఉల్లితోపాటు పసుపు రైతులకు మద్దతు ధర ఉక్కు పరిశ్రమకు ఆరు నెలలలోపు పునాది రాయి వేసి....మూడేళ్లలో పూర్తి. చేనేత కుటుంబానికి రూ. 24 వేలు సాయం.. గండికోట ప్రాజెక్టు బాధితులకు రూ. 10 లక్షల పరిహారం గోడౌన్లలో నిల్వ ఉన్న శనగలన్నింటినీ క్వింటా రూ. 6500 చొప్పున కొనుగోలు బాబు సభలకు స్పందన కరువు అధికార పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రచారం నిర్వహించినా పెద్దగా ప్రజాస్పందన కనిపించలేదు.దీంతో కేడర్ డీలా పడింది. కడపలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను తీసుకొచ్చినా జనం లేక సభ వెలవెలబోయింది. రోడ్‌షోలకు కూడా ఆశించిన మేర జనం కనిపించలేదు. పులివెందులలో కూడా సీఎం సభకు జనం పలుచగా కనిపించారు. జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటిల్లో కూడా సీఎం ఎన్నికల సభలను నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కడపలో ఒకసారి మాత్రమే సభ నిర్వహించారు. అది కూడా జనం లేక వెలవెలబోయింది. బీజేపీ పక్షాన ఆపార్టీ నాయకులు జీవీఎల్ నరసింహారావు ఎన్నికల ప్రచారం ముగింపురోజున పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున అగ్రనేతలెవ్వరూ ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో ఆపార్టీ ఉనికి ప్రశ్నార్ధకమైందని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. స్వతంత్రులు అక్కడక్కడా మైకుల ప్రచారానికి పరిమితమయ్యారు. ప్రచారం ముగించిన అధికార పక్ష నేతలు మంగళవారం సాయంత్రం నుంచి ప్రలోభాలకు గురిచేసే పనిలో పడ్డారు. కడప లోక్‌సభకు: 15మంది రాజంపేట లోక్‌సభకు: 9మంది అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తున్న వారు 133మంది మొత్తం ఓటర్లు 22,04,964 మహిళలు 11,17,547 ఇతరులు 300 పోలింగ్ కేంద్రాలు 2,723 -
రాజకీయ కార్యాలయాల వేదిక మినీబైపాస్
సాక్షి, నెల్లూరు(అర్బన్): ప్రశాంతంగా ఉండే మినీబైపాస్ రోడ్డు రాజకీయ కార్యాలయాలకు వేదికైంది. మినీబైపాస్ రోడ్డులోనే టీడీపీ, బీజేపీ, జనసేన కార్యాలయాలు ఉన్నాయి. మరో 10 అడుగులు ముందుకేస్తే సీపీఎం కార్యాలయం ఉంది. అలాగే మినీబైపాస్ రోడ్డుకు కూతవేటు దూరంలోనే మాగుంట లేఅవుట్లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద రాజకీయ సందడి నెలకొంది. నిత్యం వందలాది మంది కార్యకర్తలు కార్యాలయాల బాట పట్టారు. ఎన్నికల సామగ్రి నిర్వహణ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ ప్రత్యర్థుల గురించి చర్చలు, ప్రచార వ్యూహాలు ఈ కార్యాలయాల నుంచే జరుగుతున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, మాజీలు, పోటీ చేసే అభ్యర్థులు, వారి శ్రేయోభిలాషులతో ఆయా కార్యాలయాల వద్ద సందడిగా ఉంది. ఆ కార్యాలయాల పక్కనే ఉండే టీ దుకాణాలు, కేఫ్‌లు, జ్యూస్ షాపులు నిత్యం వచ్చిపోయే కార్యకర్తలతో కిటకిటలాడుతున్నాయి. ఓటు రాజకీయాలతో కార్యాలయాలు కళకళలాడుతుండగా, మరోవైపు ఎన్నికల పుణ్యమా అని తమ వ్యాపారం బాగా జరుగుతుందని పార్టీ కార్యాలయాల సమీపంలోని దుకాణాల యజమానులు సంబరపడుతున్నారు. -
గుండె మండిన రైతు
సాక్షి, వెంకటగిరి: రుతుపవనాలు గతి తప్పి ఇబ్బంది పెడుతున్నా.. రైతులు కాడి పడేయడం లేదు. అనుకూలంకాని పరిస్థితులకు ఎదురొడ్డి బాధ్యతగా పంట పండిస్తూనే ఉన్నారు. తీరా పంట చేతికొచ్చి అమ్ముదామనే సమయానికి ధర అమాంతం పడిపోతుంది. ఈ పరిస్థితే అన్నదాతల్ని రగిలిపోయేలా చేస్తోంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న గిట్టుబాటు ధరకు, ఉత్పత్తి వ్యయానికి ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. కనీసం ఆ ధర అయినా అన్ని పంటలకు దక్కుతుంగా అంటే లేదు. ఫలితంగా ఆర్థికంగా కుదేలవుతున్నారు. అప్పులు తీర్చలేక కుటుంబ భారం మోయలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న నియోజకవర్గంలోని కుటుంబాల్లో అధికశాతం మంది రైతు కుటుంబాలే. నియోజకవర్గంలో కండలేరు జలాశయం నుంచి తమ ప్రాంతాల గుండా చెన్నై, తిరుపతి పట్టణాలకు తాగునీరు నెపంతో పదుల సంఖ్య టీఎంసీల నీరును చిత్తూరు జిల్లా రైతులు ప్రతిఏటా చెరువులకు పెట్టుకుని పంటలు సాగుచేసుకుంటున్నారు, జిల్లాలోని డెల్టా ప్రాంత రైతులు రెండు పంటలకూ నీరు సంమృద్ధిగా లేకుంటే సోమశిల నుంచి కండలేరును చుక్కనీరు వదలరు. నాలుగేళ్లుగా ఒక్క పంటకూడా పెట్టుకోలేని మెట్టప్రాంత వెంకటగిరి నియోజకవర్గ రైతులకు ఏళ్లుగా మారని ఈ పరిస్థితులే వారిని సాగుజలాల కోసం రోడ్డెక్కిస్తున్నాయి. వెంకటగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగే ఎస్ఎస్ కెనాల్‌ను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నా.. అన్ని బాధలని పంటి బిగువన భరిస్తున్నారు ఈ ప్రాంత రైతులు. జిల్లాకే చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి అయినప్పటికీ ఈ ప్రాంతంలో సాగునీటి రంగం మెరుగు పరచడం, మద్దతు ధర అందించడంలో ఏ మార్పు లేకపోవడంతో గత ఐదేళ్లుగా నష్టాల పాలవుతున్నారు. రైతులకు అమలు చేయాల్సినవి ఎంఎస్ స్వామినాథన్ కమిచేసిన సిఫార్సులను అమలు చేస్తామని, పంట ఉత్పత్తి వ్యవయానికి 50 శాతం జోడించి మద్దతు ధర నిర్ణయిస్తామని రైతులకు పాలకులు ఇచ్చిన హమీని అమలు చేయాలి. గత నాలుగేళ్లుగా నామమాత్రంగా ప్రభుత్వం ఆహార ధాన్యాల మద్దతు ధర పెంచింది. మరికొంత సహకారం అందజేయాలి. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతుకు జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడానికి ప్రత్యేక హెల్త్‌కార్డు సదుపాయం కల్పించాలి. వ్యవసాయ ధరల కమిషనర్ (సీఏసీపీ) పంట ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసే విధానం సరిగా లేదని రైతులకు నష్టం చేసేలా ఉందని, స్వామినాథన్, రమేష్ చంద్ కమిటీలు చెప్పిన దాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి , అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీగా ఎకరాకు రూ.10 వేలు ఆర్థికసాయం అందించాలన్న భూపేంద్రసింగ్ హుడా కమిటీ చేసిన సిఫార్సులను అమలుచేయాలి. ఇదీ సంక్షోభం భూమినే నమ్ముకున్న రైతులు బజారున పడడానికి బాధ్యులు ఎవరు? ఇది రాష్ట్రానికి క్షేమదాయకం కాదు. ఎన్నాళ్లనీ.. ఎన్నేళ్లనీ రైతులు తమ బాధలు దిగమింగుతూ బతకాలి? నాలుగేళ్లుగా రైతులకు పాలకులు ప్రకటించే రైతు రథం, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు వంటి పథకాలు తెలుగు తమ్ముళ్లకే పరమితమయ్యాయి. పంట వేసేందుకు సరైన విత్తనాలు అందించడం లేదు. ప్రకృతి ప్రకోపానికి గురైతే సాయం అందదు. బ్యాంకుల నుంచి రుణాలు అందక సాగు కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి ఆరుగాలం కష్టించి బోరుబావుల కింద కొద్దో గొప్పో సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధరలు అందవు. కోతల సమయంలో 30 శాతం వరకూ తగ్గిపోతున్నాయి. సాగు ఖర్చులు, పురుగుమందులు, ఎరువుల ధరలు మాత్రం ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. 2016 నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో నాలుగేళ్లుగా కరువు తాండవిస్తుంది. వాతావరణ అననుకూలతతో పంటలు సాగుచేయడం తలకు మించిన భారంగా పరణమించింది. నియోజకవర్గంలో అప్పుల ఊబిలో ఉన్న కుటుంబాల్లో 60 శాతం మందికి వ్యవసాయమే అధారం. టిడిపి అధినేత గత ఎన్నికల్లో రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హమీ ఇచ్చి గద్దెనెక్కారు. తొలి సంతకం రైతురుణమాఫీపై చేసి ఆపై కొర్రీలు పెట్టి ఎకరా భూమికి రూ.15000 వరకూ మాఫీ అంటూ కోతపెట్టడమే కాకుండా ఐదు విడతల్లో ఐదేళ్లపాటు ఇస్తానని చెప్పి ప్రతి ఏటా ఎకరాకు రూ 3000 వంతున మూడు దఫాలు చెల్లించారు. అయితే 4,5 విడతల రుణమాఫీ సొమ్ము ఇప్పటికీ రైతుల చేతికందలేదు. చాన్నాళ్ల తర్వాత రైతుల్లో ఆగ్రహాన్ని గమనించిన టిడిపి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఎన్నికల ముందు తీసుకొచ్చింది. అంతకు ముందే తెలంగాణలో ఈ పధకం ద్వారా అక్కడి తెరాస ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో రైతులే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపబోతున్నారని గ్రహించి 3,4 విడతల రుణమాఫీ సోమ్మును ఎన్నికలకు ముందుగానే జమ చేస్తానని వెంకటగిరి సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యం చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారు. వ్యవసాయంపై ఆయన ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. ఎస్‌ఎస్‌కెనాల్ పూర్తిచేస్తామని ఎన్నికల సంధర్భంగా ఇచ్చిన హమీలు విస్మరించారు. దీనివల్ల వేలాది ఎకరాలు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. – మామిడి ప్రభాకర్, మార్లగుంట, డక్కిలి మండలం నీరందక సాగు ప్రశ్నార్థకం అయింది తెలుగుగంగ ద్వారా సాగునీరందక ఈ ఏడాది పంటలు వేయలేదు. మా గ్రామంలోనే సుమారు 250 ఎకరాలు బీడు భూములుగా మారాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే సాగునీటి ప్రాజెక్టర్లను అభివృద్ది చేస్తానని ప్రకటించడం ఆనందగా ఉంది. – కె రామిరెడ్డి, కుప్పంపల్లి, వెంకటగిరి మండలం జగన్‌తో మంచి రోజులు జలయజ్ఞం పేరిట సాగునీటి ప్రాజెక్ట్‌లు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆయన హయాంలోనే ఎస్ఎస్ కెనాల్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినా టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. జగన్‌తో మళ్లీ మంచిరోజులు వస్తాయని ఎదురు చూస్తున్నాం. – ఆవుల గిరియాదవ్, సిద్ధవరం, వెంకటగిరి మండలం వైఎస్సార్ హయాంలో సాగుకు స్వర్ణయుగం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా తెలుగుగంగ బ్రాంచి కాలువలు పూర్తి, మెట్టప్రాంతాలకు సాగునీరందించే సుమారు 350 కోట్లుతో నియోజకవర్గంలోని రాపూరు వద్ద ఎస్‌ఎస్‌కెనాల్ నిర్మాణ పనులకు శంకుస్దాపన చేశారు. ఆయన మరణం తరువాత వచ్చిన పాలకులు ఆ ప్రాజెక్ట్‌లను విస్మరించారు. – మేకల శ్రీనివాసులు, వెంకటగిరి రాజన్న ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే జలయజ్ఞం ద్వారా ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేసేవారు. తెలుగుగంగ బ్రాంచి కాలువలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేవారు. రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. – ఆర్ వీరరాఘవులు, వెంకటగిరి -
వీళ్లు ఎవరికీ చిక్కరు.. దొరకరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బీద క్యాంపులో ఆర్థిక అలజడికి తెరలేచింది. వారం రోజులుగా బీద క్యాంపు చుట్టూ అధికార పార్టీ అభ్యర్థులు చక్కర్లు కొడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆర్థిక వ్యవహారం అంతా బీద బ్రదర్స్ చూసుకుంటారని జిల్లాకు వచ్చినప్పుడు అభ్యర్థులకు చెప్పి వెళ్లారు. అయితే ఇప్పటివరకూ రూపాయి కూడా విదల్చలేదని కొందరు అభ్యర్థులు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. మరికొందరైతే డబ్బులు ఇవ్వకుండానే పెత్తనం చేస్తున్నారని కినుకు వహిస్తున్నారు. దీనికితోడు వైఎస్సార్సీపీలోకి నేతలు పెద్ద ఎత్తున వలసల బాట పట్టడంతో అధికార పార్టీకి చెందిన క్యాంపు సతమతమవుతోది. ఇక అందర్నీ సమన్వయం చేయాల్సిన జిల్లా అధ్యక్షుడు, బీద మస్తాన్‌రావు సోదరుడు రవిచంద్ర చిక్కడు.. దొరకడు తరహాలో తప్పించుకుని తిరుగుతుండడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అధికార పార్టీ నుంచి అభ్యర్థులుగా దిగిన వారిలో ఒకరు ఇద్దరు మినహా అందరూ బడాబాబులే. దీంతో పెద్ద ఖర్చు లేకుండా ఎన్నికల బరిలో తలపడవచ్చన్న బీద బ్రదర్స్‌కు అభ్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించారు. చివరకు నెల్లూరు రూరల్, కావలికి అభ్యర్థి దొరక్క మొదట తిరస్కరించిన నేతలకే టికెట్లు ఇచ్చారు. దీంతో మొదట భారీగా ఖర్చు పెడతామని ప్రచారం చేసుకున్న నేతలు అంతా సర్దుకున్నారు. అసలే పార్టీ పరిస్థితి చూస్తే మెరుగ్గా లేకపోవడం, రూ.కోట్లు ఖర్చు చేసినా గెలిచే పరిస్థితి లేదని అర్థమైన నేతలు భారీగా ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏదో బీద ఇస్తే ఖర్చు చేయాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పరిస్థితి అర్థమైన బీద పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనని మొండికేసిన బీద మస్తాన్‌రావు ఎట్టకేలకు పార్టీ అధినేత ఒత్తిడితో ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి ఎంత సర్దుబాటు చేయాలనే దానిపై బీద బ్రదర్స్ తలలు పట్టుకుని కుర్చోన్నారు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది ముందుగానే చంద్రబాబు ఫైనల్ చేసి నేతలకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. అయితే గత వారం నుంచి మినీబైపాస్ రోడ్డులోని బీద క్యాంపుల్లో మాత్రం రోజు అభ్యర్థులు ఆర్థిక మంతనాలు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా కావలి అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిని బీద సోదరుల మద్దతుతో టికెట్ ఇచ్చారు. ఆయన ఖర్చు మొత్తం కూడా తామే చూసుకుంటామని చెప్పారు. నామినేషన్ ఘట్టం, స్క్రూటినీ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఒక్క రూపాయి ఇవ్వకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి కినుక వహించినట్లు సమాచారం. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు రెండో సారి టికెట్ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి లేక చేతులెత్తేసిన క్రమంలో ఎంపీ అభ్యర్థి చూసుకుంటాడని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్థిక వ్యవహరాలు కూడా మాట్లాడుకున్నారు. కానీ డబ్బులు మాత్రం చేతికి అందలేని బొల్లినేని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ తన పని తన ఓటు మాత్రమే తాను చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక నెల్లూరు రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌ది మాత్రం విచిత్ర పరిస్థితి. గతంలో నెల్లూరు రూరల్ లేదంటే సిటీ టికెట్ కోసం బలంగా ప్రయత్నాలు చేసిన అజీజ్ భంగపడ్డారు. నెల్లూరు పార్లమెంట్ టికెట్ అయినా తనకు ఇస్తే గట్టిగానే ఖర్చు పెట్టుకుంటానని సీఎంకు మొర పెట్టుకున్నాడు. అయితే చివరి నిమిషంలో నెల్లూరు రూరల్ టికెట్ దక్కడంతో ఆర్థికంగా పూర్తిగా చేతులెత్తేసి మీరే అంతా చూసుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో నగర అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి నారాయణ, ఎంపీ అభ్యర్థి నుంచి సహకారం ఉంటుందని చెప్పారు. అయితే మంత్రి నారాయణ సహకారం మొదలయింది కానీ పెత్తనం అంతా నారాయణ క్యాంప్దే కావడంతో మేయర్ వర్గంలో తీవ్ర అలజడి రేగింది. కేవలం ఎన్నికల ప్రచారంలో నమస్కారం పెట్టుకుంటూ తిరగడానికే మేయర్ పరిమతం అయినట్లు సమాచారం. ఇక రాత్రి వ్యవహారాలన్ని నారాయణ క్యాంపు నుంచి ఆయన సన్నిహితుడు తన సొంత టీమ్‌తో నడుపుతుండటంతో అజీజ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక మరో అసెంబ్లీ అభ్యర్థికి ఆ నియోజకవర్గంలో భారీ వలసలు షాక్‌ను ఇచ్చాయి. దీంతో సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ఎంత ఖర్చు చేసినా గెలవలేము.. కాబట్టి డబ్బు ఖర్చు చేయొద్దని సదరు అభ్యర్థి కుమారుడు గట్టిగా చెప్పటంతో అక్కడ గందరగోళం రేగింది. దీంతో అప్పటి దాక ఎంపీ అభ్యర్థి నుంచి ఆర్థిక సహకారం వద్దన్న సదరు అభ్యర్థి రెండు రోజుల నుంచి అభ్యర్థి క్యాంపు చుట్లూ చక్కర్లు కొడుతున్నాడు. మొత్తం మీద ఒక్క అభ్యర్థికి కూడా చెప్పినది ఇవ్వకుండా ఇంకా బాబు గారి నుంచి అనుమతి రాలేదంటూ కాలం గడుపుతుండటం పార్టీలో చర్చనీయాశంగా మారింది. -
విజయనగరం: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, విజయనగరం రూరల్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. విజయనగరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం కాగా జాతీయ పార్టీలతో పాటు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారం ఆఖరిరోజు కావడంతో బుధవారం ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగితా 9 మంది నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నాటికి నామినేషన్లు ఉపసంహరించుకోనందున బరిలో తొమ్మిది మంది నిలిచారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన ఎన్నికల గుర్తులతో ఎన్నికల సంఘానికి పంపినట్టు తెలిపారు. వ.సం. అభ్యర్థులు పార్టీ గుర్తు 1 కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ 2 పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు టీడీపీ సైకిల్ 3 సతీష్‌కుమార్ సుంకరి భారత జాతీయ కాంగ్రెస్ హస్తం 4 సుబ్బారావు కుసుమంచి భారతీయ జనతా పార్టీ కమలం 5 చోడి ఆదినారాయణ జన జాగృతి పార్టీ మైక్ 6 పాలవలస యశస్వి జనసేన గాజుటంబ్లర్ 7 రేజేటి స్వర్ణలత ఇండియా ప్రజాబంధు పార్టీ బాకా 8 మండపాక అప్పలరాము లోక్ జనశక్తి పార్టీ కంప్యూటర్ 9 భీశెట్టి అప్పారావు బాబ్జీ ఇండిపెండెంట్ విజిల్ -
టీడీపీ నాయకుల బరితెగింపు
సాక్షి, వెంకటగిరి: టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన కౌన్సిలర్ చల్లా మల్లికార్జున అనుచరులైన నరిసింహులు, విజయకుమార్, ప్రసాద్‌లపై ఎమ్మెల్యే గన్‌మన్ సిరాజ్ కుటుంబసభ్యులు, పలువురు టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచిన ఘటన మంగళవారం రాత్రి వెంకటగిరిలో చోటుచేసుకుంది. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. టీడీపీ నాయకుడు సుబ్బయ్య మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడు నరసింహులు ఇంటి వద్దకు వచ్చి ఉద్దేశపూర్వకంగా మూత్రవిసర్జన చేస్తుండడంతో నరిసింహులు ఇది పద్ధతి కాదని చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నరసింహులు ఇంటికి సమీపంలో నివశిస్తున్న విజయకుమార్, ప్రసాద్‌లు సుబ్బయ్య చేసిన పని సరికాదని సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా సుబ్బయ్య కుమారుడు వచ్చి టీడీపీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ గన్‌మన్ సిరాజ్ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో వారు వచ్చి నరసింహులు, విజయకుమార్, ప్రసాద్‌లపై దాడి చేసి గాయపరిచారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి విషయం తెలియగానే వైఎస్సార్సీపీ నేతలు దొంతు బాలకృష్ణ, శేతురాశి బాలయ్య, కౌన్సిలర్ మల్లికార్జున తదితరులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బుడా రియల్ బడా
సాక్షి, బొబ్బిలి: ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందానన్న సామెత అచ్చంగా టీడీపీ నాయకులకు సరిపోతుంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న రియల్ దందాను ఇక్కడి టీడీపీ నాయకులు అచ్చంగా పాటిస్తున్నారు. ఇటీవలే శ్రీకాకుళానికి సుడా, బొబ్బిలికి బుడా సంస్థలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ ఉత్తర్వులను నిబంధనల ప్రకారం ముందుగా కార్యాలయాలు, కార్యకలాపాలు ప్రారంభించకుండానే రియల్ వ్యాపారం బుడా పేరిట సంతరించుకుంటోంది. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ (బుడా)కు చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించిన అధికార ప్రభుత్వం దీని ఏర్పాటు వెనుక మతలబును చెప్పకనే చెబుతోంది. ఏదేని రియల్ ఎస్టేట్ ప్రారంభమయితే దానికి సంబంధించి అనుమతుల కోసం నిర్దిష్ట అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉండాలి. కానీ ఇక్కడ బుడా పేరిట బొబ్బిలిలో ఓ కార్యాలయమూ లేదు... కార్యవర్గమూ పూర్తి స్థాయిలో కాలేదు. అంతే కాదు దీనికి కార్యాలయం ఏర్పాటుకు ఒక్క పైసా బడ్జెట్ కూడా విడుదల చేయలేదు. కానీ బుడాకు ప్రతిపాదించామంటే రూ.కోట్లలో రియల్ బిజినెస్‌ను ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన పలువురు వ్యాపారులు టీడీపీ నాయకులతో కలసి పెద్ద వెంచర్‌ను ప్రారంభించారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ మొట్టమొదటి బుడా ప్రపోజ్డ్ అందమైన బ్రోచర్లు వేసి రియల్ వ్యాపారాన్ని ప్రారంభించేశారు. కానీ కొనుగోలు దారులకు ఈ బుడా సంగతి తెలియదు కదా? ఎడాపెడా కొనుగోలుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. అసలే ఎన్నికల వేళ అంటూ రాని బుడాకు అనుమతులకు దరఖాస్తులు చేశామని టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల రియల్ వ్యాపారానికి మాత్రం బుడాను అప్పుడే వినియోగించుకుంటున్నారు. బుడా ప్రపోజ్డ్ అంటూ పెద్ద వెంచర్లు వేస్తూ ప్రజలను మస్కా కొడుతున్నారు. బుడా పరిధిలో 11 మండలాల్లోని 572 గ్రామాలతో పాటు మూడు మున్సిపాలిటీ(బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం)లను విలీనం చేస్తూ జీఓ విడుదల చేశారు. మొత్తంగా 7.52లక్షల జనాభా పరిధిలో బుడా తన సేవలను ప్రారంభించాల్సి ఉంది. దీనికి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తెంటు లకు‡్ష్మనాయుడు, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్లను నియమించారు. ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది. అలాగే కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించి బడ్జెట్ విడుదల చేయకపోవడంతో ఎక్కడిదక్కడే ఉండిపోయింది. దీనికి సంబంధించిన రివాల్వింగ్ ఫండ్ కానీ, డవలప్మెంట్ ఫండ్కానీ విడుదల చేయలేదు. కానీ బుడా పేరిట అప్పుడే రియల్ వ్యాపారాలు మా త్రం ప్రారంభమయ్యాయి. అర్బన్ డెవలప్మెంట్ పనులు ప్రారంభించక పోయినా, కార్యాలయాలు కానరాకపోయినా రియల్ వ్యాపారులకు మాత్రం ఈ బుడా ముందుగానే వినియోగపడుతోంది. రియల్ బ్రోచర్లు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ చిత్రం చూడండి! ఆ.. ఏముంది? ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేసుకుని విక్రయించుకుంటున్నారనుకుంటున్నారా? అంత వరకూ బానే ఉంది. దీనికి సంబంధించి అనుమతులు తీసుకునేందుకు ఏదేని పట్టణాభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి రియల్ ఎస్టేట్లకు ఇంకా కార్యకలాపాలు ప్రారంభించని, కార్యాలయమే లేని బుడాకు ప్రతిపాదించామని రియల్ వ్యాపారులు బోర్డులు పెట్టారు. అంతే కాదు. మంచి నగిషీలతో బ్రోచర్లు తయారు చేసి టీడీపీ నాయకుల కనుసన్నల్లో వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి, నెల్లూరు(పొగతోట): నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, ఆర్ఓ ఆర్ ముత్యాలరాజు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. 21 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. నామినేషన్ పత్రాలపై పూర్తి స్థాయిలో సంతకాలు చేయకపోవడం, అఫిడవిట్స్ అందజేయకపోవడం తదితర కారణాలతో నామినేషన్లను తిరస్కరించారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి జాయింట్ కలెక్టర్, ఆర్ఓ వెట్రిసెల్వి నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. 15 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు కావలి నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. ఆత్మకూరుకు సంబంధించి 14 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక్క నామినేషన్‌ను మాత్రమే తిరస్కరించారు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక్కరి నామినేషన్‌ను మాత్రమే తిరస్కరించారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 12 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముగ్గురు నామినేషన్లను తిరస్కరించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు నామినేషన్లను తిరస్కరించారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందరి నామినేషన్లు ఆమోదించారు. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి 14 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముగ్గురి నామినేషన్లను తిరస్కరించారు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నలుగురి నామినేషన్లను తిరస్కరించారు. 28 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 27, 28 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిన తరువాత పోటీలో ఉండే అభ్యర్థులతో బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేస్తారు. -
ఆయన దారి.. అడ్డ దారే!
రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక పనవాలు వీస్తుండడంతో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అడ్డదారులు ఎంచుకున్నారు. ఓటుకు నోటు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. టీడీపీ కోటరీలో కీలక నేతగా ఉన్న నారాయణ విద్యాసంస్థల అధినేత, మంత్రి నారాయణకు ఓటమి భయం పట్టుకుంది. నోట్ల కట్టలు తెగ్గొట్టేశారు. కేవలం నోట్లతో ఓట్లు కొల్లగొట్టాలని నగర పరిధిలో నోట్లు వరదలా పారిస్తున్నారు. నెల్లూరు నగర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న నారాయణకు రోజు రోజుకు ప్రజాదరణ తగ్గిపోతోంది. ఓటమిపై బెంగతో తమ విద్యాసంస్థల ఉద్యోగులతో ఓటర్లకు నగదు చేర వేస్తూ వైఎస్సార్సీపీ నేతలకు పట్టుబడుతున్నారు. నగదు పంపిణీ కష్టతరం కావడంతో చివరకు విద్యార్థుల స్కూల్ బ్యాగుల ద్వారా చోటా నేతలకు నగదు చేర వేస్తున్నట్లు తెలిసింది. సాక్షి, నెల్లూరు: ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేని మంత్రి నారాయణ టీడీపీ కోటరీలో మాత్రం కీలక నేతగా ఎదిగారు. రెండు దశాబ్దాలుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. చంద్రబాబుకు బినామీ అని కూడా ప్రచారం ఉంది. ఎన్నికల సమయంలో నారాయణ తన విద్యాసంస్థల ఉద్యోగులతో సర్వేలు చేయిస్తూ, పార్టీకి భారీ విరాళాలతో ఆర్థిక వనరులు సమకూర్చేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉన్న 1994–1999, 1999–2004 మధ్య కాలంలో నారాయణ విద్యాసంస్థలను దేశ వ్యాప్తంగా విస్తరించారు. నెల్లూరులో ప్రైవేట్ మెడికల్ కళాశాలను నారాయణకే కేటాయించేలా చేయడంలో చంద్రబాబు ఎంతో కృషి చేశారు. ఇలా నారాయణ, చంద్రబాబు మధ్య ఇంతటి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. బాబుకు బినామీగా ఉన్న నారాయణ ప్రతి సాధారణ ఎన్నికల్లో ఆర్థిక వ్యవహారాలు చక్క బెట్టేవారు. రాష్ట విభజన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అధికారంలోకి తెప్పించేందుకు వందల కోట్లు నిధులను తన విద్యాసంస్థల ద్వారా సమకూర్చి, వారి ఉద్యోగులను కూడా ఎన్నికల సమయంలో పార్టీకి కార్యకర్తలా పనిచేయించారు. టీడీపీ అధికారంలోకి రాగానే నారాయణ స్వామి భక్తికి మెచ్చిన సీఎం చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికల అనుభవం లేని నారాయణకు తన కేబినేట్లో కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు. ఆది నుంచి స్వార్థమే.. దోపిడీ నారాయణ విద్యాసంస్థల అధినేతగా గుర్తింపుతోనే నారాయణ నెల్లూరు వాసులకు పరిచయం. నెల్లూరీయుల ఇచ్చిన ప్రోత్సాహంతో విద్యా సంస్థలను స్థాపించిన నారాయణ ఎన్నడూ నెల్లూరు వాసులకు సేవా కార్యక్రమాలు చేసిన పాపాన పోలేదు. తనతో చదువుకున్న స్నేహితులను కూడా కష్టకాలంలో ఆదుకున్న వ్యక్తిత్వం కాదనే ప్రచారం ఉంది. నారాయణ విద్యాసంస్థల్లో పేద వర్గాలను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. నారాయణ మెడికల్ కాలేజీలో రోగుల వద్ద అధిక ఫీజులు వసూలు చేశారన్న ప్రచారం ఉంది. నారాయణ ఆస్పత్రిలో ఠాగూరు సినిమా సీన్లు జరిగిన ఘటనలు ఉన్నాయి. మెడికల్ కాలేజ్‌లో దాదాపు 10 మందికి పైగా మెడిసిన్ చదివే విద్యార్థినులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి అవినీతి, అక్రమాల మరకలు ఉన్న నారాయణ మంత్రిగా పని చేసిన ఐదేళ్ల కాలంలో కూడా అవినీతినే ప్రొత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగడంతో ప్రజాదరణ లే క ఓటమి భయం పట్టకుంది. ఎలాగైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. డబ్బు పంచుతూ.. నెల్లూరు నగరంలో ఓటుకు నోటు పంచుతూ నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు పట్టుబడ్డారు. మూడు రోజుల క్రితం 43వ డివిజన్లో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి నేతృత్వంలో ఉద్యోగులు డబ్బు పంచుతుండగా వైఎస్సార్సీపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారి వద్ద రూ.8 లక్షల నగదు దొరికింది. సోమవారం కూడా 40వ డివిజన్లో నగదు పంచుతున్న నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి బాలమురళీకృష్ణ పట్టుబడ్డారు. ఇలా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నగదు ప్రవాహంలా చేసి అడ్డదారుల్లో గెలుపు కోసం నారాయణ చేస్తున చర్యలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. పోలీసుల సహకారం ఎన్నికల సమయంలో ఎన్ని అడ్డదారులు తొక్కినా ఏమి కాకుండా పోలీసుల సహకారం కూడా మంత్రి నారాయణ తీసుకుంటున్నారు. ఎన్నికల కోసమే తనకు అనుకూలమైన పోలీసు అధికారులను నగరంలో సీఐలుగా నియమించుకున్నారు. వారి ద్వారానే కొన్ని పనులు కూడా చక్కబెట్టించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులు బ్యాగుల ద్వారా.. నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులతో పాటు అక్కడ చదువుకునే విద్యార్థులను కూడా ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం విమర్శల పాలవుతోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండే పిల్లల తల్లిదండ్రులను గుర్తించి వారి బ్యాగుల ద్వారా ఓటుకు నోట్లు పంపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
చెక్ పోస్టుల్లో టీడీపీ రాజ్యం
సాక్షి, చీరాల: సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ అడ్డదారుల్లోనైనా అధికారం తెచ్చుకునేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి కోసం అధికారులను అడ్డంపెట్టుకుని ధన, బల రాజకీయాలకు వినియోగించుకుంటున్నారు. చీరాల్లో ఎలాగైనా గెలుపొందాలని టీడీపీ చేస్తున్న దగాకోరు రాజకీయాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. రూ.100 కోట్లు ఖర్చులు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన అన్నీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న చెక్‌పోస్టు అధికారులు, టీడీపీకి చెందిన వాహనాలను నామమాత్రంగా కూడా తనిఖీ చేయడం లేదు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నియోజకవర్గంలో పందిళ్లపల్లి, ఈపూరుపాలెం, కారంచేడు రోడ్డులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఈ చెక్‌పోస్టుల ద్వారా గుంటూరు జిల్లా నుంచి చీరాలవైపు వస్తున్న అన్ని వాహనాలను విధిగా తనిఖీలు చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సెక్టోరియల్ అధికారి, ఒక వీడియో గ్రాఫర్, ఇద్దరు పోలీసులతో 24 గంటలు తనిఖీ చేయాల్సి ఉంది. కానీ అధికార పార్టీకి చెందిన, ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారులే చీరాలకు ఎన్నికల అధికారులుగా విధులు నిర్వర్తిస్తుండటంతో చీరాల టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలకు, అక్రమాలకు వారే వంత పాడుతున్నారంటే అధికార పార్టీ సేవలో చీరాల ఎన్నికల అధికారులు ఏవిధంగా తలమునకలవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. చెక్‌పోస్టుకు వచ్చే ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, ట్రావెల్స్ వాహనాలు తనిఖీలు చేయాల్సి ఉండగా మొక్కుబడిగా కూడా పనిచేయడం లేదు చెక్‌పోస్టు డ్యూటీలో ఉన్నవారు. అధికార పార్టీకి చెందిన నేతల వాహనాలకు పచ్చజెండా ఊపుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల టూవీలర్లు, కార్లును మాత్రం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారంటే చెక్‌పోస్టు అధికారులు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలానే చెక్‌పోస్టుల వద్ద వేటపాలెం పోలీస్ అధికారులు మాత్రం వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, వారి అనుచరులను మాత్రం తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, నాయకుల ఇళ్లల్లో కూడా పోలీసులు అక్రమంగా తనిఖీల జరుపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయితే ఈ మధ్య టీడీపీ మహిళా నేత, ఎమ్మెల్సీకి చెందిన వాహనంలో కోట్లాది రూపాయలు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పర్చూరు మీదుగా ఆమె వాహనాల్లోనే చీరాలకు నగదును తరలించారు. కనీసం చెక్‌పోస్టుల వద్ద వారి వాహనాలను ముందస్తు అనుమతుల పేరుతో ఎలాంటి తనిఖీలు చేయలేదు. దీంతో టీడీపీ అభ్యర్థికి కావాల్సిన కోట్లాది రూపాయలు చీరాలకు వారి వాహనాల్లో తరలివచ్చాయి. అందుకు రాష్ట్ర పోలీస్ బాస్‌తో పాటు జిల్లా, స్థానిక పోలీస్ అధికారులు పూర్తిగా టీడీపీ నాయకులకు సహకరించినట్లు సమాచారం. పోలీసులు నిజాయితీగా వ్యవహరిస్తే కనీసం ఒక్క టీడీపీ నాయకుడు, కార్యకర్తల ఇళ్లల్లో సోదాలు చేయని పోలీసులు మాత్రం వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లో వరుసగా సోదాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల నిధులు చీరాలకు వస్తున్న కనీసం పట్టించుకోకపోగా చెక్‌పోస్టుల్లో టీడీపీ నాయకుల వాహనాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ అక్రమ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. -
77 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు దాఖలైన నామినేషన్లను పరిశీలించి సక్రమంగా లేని వాటిని రిజెక్టు చేశారు. రిజెక్ట్ అయిన వాటిలోఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 17నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 4 నామినేషన్లు తిరస్కరించారు. బాపట్ల పార్లమెంట్‌కు మొత్తం 16 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 2 నామినేషన్లు తిరస్కరించారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 237 నామినేషన్లు దాఖలైతే వాటిలో 65 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 172 నామినేషన్లు ఆమోదం పొందాయి. రిజెక్ట్ అయిన వాటిలో యర్రగొండపాలెం నియోజకవర్గంలో 4, దర్శి 10, పర్చూరులో 2, అద్దంకిలో 3, చీరాల 3, సంతనూతలపాడు 2, ఒంగోలు 5, కందుకూరు 12, కొండపి 3, మార్కాపురం 7, గిద్దలూరు 10, కనిగిరి 14 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. -
28 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, విజయనగరం గంటస్తంభం: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న నామినేషన్ల పర్వంలో మరో అంకం పరిశీలన పూర్తయింది. జిల్లాలోని విజయనగరం పార్లమెంట్ స్థానం, 9 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో జరిగింది. అభ్యర్థులు హాజరై నామినేషన్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకున్నారు. ఈ సందర్భంగా సక్రమంగా లేని నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. సక్రమంగా ఉన్నవాటిని అనుమతించారు. కురుపాం టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ.. నామినేషన్ల పరిశీలనలో కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి విశ్వేశ్వరరావు తిరస్కరించారు. ఆయన 2013లో పొందిన ఎస్టీ ధ్రువీకరణ పత్రం సమర్పించారు. దానిపై ఆయన ఎస్టీ కాదంటూ సుప్రీం, హైకోర్టులు తీర్పు ఇచ్చాయని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ చెప్పడంతో పరిశీలన చేసి అధికారులు తిరస్కరించారు. విజయనగరం, పార్వతీపురం మినహా అన్ని చోట్లా ప్రథాన పార్టీల అభ్యర్థులు తమకు డమ్మీలుగా మరొకరితో నామినేషన్ వేయించారు. వారి నామినేషన్లు సక్రమంగా ఉండడంతో డమ్మీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. సరైన పత్రాలు, ఇతరత్రా లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మొత్తం ఈ విధంగా మొత్తం దాఖలైన 132 నామినేషన్లలో 28 మందివి తిరస్కరించారు. 104 నామినేషన్లు సక్రమంగా ఉండడంతో అనుమతించారు. నామినేషన్ల పరిశీలన వివరాలు.. ∙విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం 17 నామినేషన్లు దాఖలు కాగా రిటర్నింగ్ అధికారి, కలెక్టరు హరి జవహర్లాల్ పరిశీలించి టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీల డమ్మీ అభ్యర్థులు సునీలా గజపతిరాజు, బెల్లాన రవి, పాకలపాటి శ్రీదేవి నామినేషన్లను తిరస్కరించారు. ఈ పార్టీల నుంచి ఇప్పటికే ప్రధాన అభ్యర్థులుగా బెల్లాన చంద్రశేఖర్ (వైఎస్సార్ సీపీ), పి.ఆశోక్‌గజపతిరాజు (టీడీపీ), పాకలపాటి సన్యాసిరాజు (బీజేపీ) బరిలో ఉన్నారు. ∙కురుపాం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ నామినేషన్‌ను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి విశ్వేశ్వరరావు తిరస్కరించారు. ఆయన ఎస్టీ కాదని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిశీలించిన అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు. ఆయతో పాటు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి బట్ల భద్రప్రసాద్, మరో ఐదుగురు స్వతంత్రుల నామినేషన్లను కూడా తిరస్కరించారు. మొత్తంగా 13 నామినేషన్లు దాఖలు కాగా ఏడింటిని తిరస్కరించి, ఆరింటిని అనుమతించారు. ∙సాలూరులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి టి.రమేష్, వైఎస్సార్ సీపీ డమ్మీ అభ్యర్థి పి.కృష్ణారావు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. పత్రాలు సక్రమంగా లేనందున అనుమతించనట్లు అధికారులు చెప్పారు. ఇక్కడ 10 మంది నామినేషన్లు వేస్తే 8 మందివి అనుమతించారు. ∙బొబ్బిలిలో రెండు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. వైఎస్సార్ సీపీ, బీజేపీ డమ్మీ అభ్యర్థులు శంబంగి శ్రీకాంత్, పుల్లెల శ్రీనివాస్ నామినేషన్లను తిరస్కరించారు. ప్రధాన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా 9 మందివి అనుమతించారు. ∙చీపురుపల్లిలో 15 నామినేషన్లు దాఖలు కాగా, టీడీపీ వైఎస్సార్ సీపీ, బీజేపీ డమ్మీ అభ్యర్థులు కిమిడి మృణాళిని, బొత్స ఝాన్సీలక్ష్మి, డి.అసుతోస్ల నామినేషన్లను తిరస్కరించారు. ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులు బరిలో నిలిచారు. మిగతా 12 నామినేషన్లను అనుమతించారు. ∙గజపతినగరంలో 13 నామినేషన్లలో రెండింటిని అధికారులు తిరస్కరించారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ డమ్మీ అభ్యర్థులు కొండపల్లి అరుణతేజి, బొత్స దేవీఅనురాధల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పార్టీ తరుఫున నామినేషన్లు వేయగా బీ ఫారం ప్రధాన అభ్యర్థులకు ఇచ్చినందున వీరి నామినేషన్లను పక్కన పెట్టారు. ఆయా పార్టీ ప్రధాన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ∙నెల్లిమర్లలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ డమ్మీ అభ్యర్థులు పతివాడ అప్పలనాయుడు, పతివాడ సత్యం, కడగల లక్ష్మి, బడుకొండ పద్మావతి నామినేషన్లను పత్రాలు సరిగ్గా లేనందున తిరస్కరించారు. ఆయా పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులతో పాటు 12 మంది నామినేన్లను అనుమతించారు. ∙ఎస్‌కోటలో 16 మంది నామినేషన్లు వేయగా ప్రధాన పార్టీలకు చెందిన డమ్మీ అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 7 నామినేషన్లను తిరస్కరించారు. తొమ్మిందింటిని అనుమతించారు. ∙విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అన్నీ సక్రమంగా ఉండడంతో అనుమతించారు. ∙పార్వతీపురం అసెంబ్లీకి 10 మంది నామినేషన్లు దాఖలు చేయగా అన్నీ సక్రమంగా ఉన్నాయి. -
ముగిసిన నామినేషన్ల పర్వం
సాక్షి, విజయనగరం గంటస్తంభం: నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. మొత్తం ఆరు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం ఎంపీ స్థానానికి 17 మంది, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలకు 130 మంది నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు పరిశీలన మంగళవారం జరగనుంది. ఇదేరోజు నుంచి 28వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీన జరిగే తొలివిడత పోలింగ్‌కు మార్చి 18న నోటిఫికేషన్ జారీ చేయగా అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరణ జరిగింది. 18 నుంచి 22వ తేదీ వరకు వరుసుగా నామినేషన్లను అధికారులు స్వీకరించారు. 23, 24 తేదీలు సెలవులు కావడంతో ఆఖరి రోజు 25న నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. చివరిరోజు రోజు 83 నామినేషన్లు జిల్లాలో చివరి రోజు ఏకంగా 83 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతకుముందు ఐదురోజులు పాటు 64 నామినేషన్లురాగా ఆఖరి రోజు అంతకుమించి రావడం విశేషం. ఇందులో విజయనగరం ఎంపీ స్థానానికి 10 నామినేషన్లు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వేశారు. కురుపాం నియోజకవర్గానికి 5, పార్వతీపురానికి 6, సాలూరులో 12, బొబ్బిలిలో 7, చీపురుపల్లిలో 7, గజపతినగరంలో 7, నెల్లిమర్లలో 13, విజయనగరంలో 3, శృంగవరపుకోటలో 13 చివరి రోజైన సోమవారం దాఖలయ్యాయి. బొబ్బిలి నుంచి టీడీపీ అభ్యర్థి సుజయ్‌కృష్ణ రంగారావు మాత్రమే నామినేషను వేశారు. రెండు నియోజకవర్గాల్లో అత్యధికంగా 19మంది మొత్తంగా చూస్తే విజయనగరం ఎంపీ స్థానానికి 17మంది నామినేషను దాఖలు చేశారు. ఎమ్మెల్యే స్థానాల్లో ఎస్.కోట, నెల్లిమర్లలో 20మంది చొప్పున నామినేషన్లు వేశారు. అత్యల్పంగా పార్వతీపురంలో 10 మంది నామినేషన్లు సమర్పించారు. నియోజకవర్గాల వారీగా నామినేషన్ల సంఖ్య నియోజకవర్గం నామినేషన్లు విజయనగరం ఎంపీ 17 కురుపాం 13 పార్వతీపురం 10 సాలూరు 15 బొబ్బిలి 11 చీపురుపల్లి 15 గజపతినగరం 13 నెల్లిమర్ల 20 విజయనగరం 13 శృంగవరపుకోట 20 -
అలా వచ్చి ఇలా వెళ్లారు
సాక్షి, నెల్లూరు/వెంకటగిరి/సూళ్లూరుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలు పేలవంగా జరిగాయి. వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరుల్లో ఎన్నికల రోడ్‌షోను సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఆయా సభలకు జన సమీకరణ కోసం టీడీపీ అభ్యర్థులు నానాతంటాలు పడ్డారు. పురుషులకు రూ.400, మహిళలకు రూ.200 వంతున నగదు ఇచ్చి జనసమీకరణ చేశారు. షెడ్యూల్ ఆలస్యం కావడంతో విసిగిపోయిన జనం సీఎం రాకముందే తిరుగుముఖం పట్టారు. వెంకటగిరిలో ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభం కావాల్సి ఉండాల్సి ఉండగా మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైంది. అలాగే సూళ్లూరుపేట, గూడూరుల్లో షెడ్యూల్ ప్రకారం ప్రచారం ప్రారంభం కాకపోవడంతో హాజరైన వారు అభ్యర్థులపై తిట్లదండకం అందుకున్నారు. 20 నిమిషాలు సభలో ఉంటే కూలీ డబ్బులిస్తామని తీసుకొచ్చి గంటల సేపు నిరీక్షణ చేయించారంటూ అనేకమంది మండిపడ్డారు. మండుటెండలో ఆకలితో నకనకలాడుతుండడంతో డబ్బులు కూడా వద్దంటూ వెళ్లిపోవడం కనిపించింది. చంద్రబాబు ప్రసంగం కూడా ఆకట్టుకోలేదు. నరేంద్రమోదీ, కేసీఆర్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేసిన ప్రసంగంపై సభికులు పెదవి విరిచారు. అన్నదాన సుఖీభవ కింద నగదు ఇచ్చానని చెప్పడంపై రైతు రుణమాఫీకి సంబంధించిన రెండు విడతలు ఇంకా పెండింగ్‌లో పెట్టావు కదా పలువురు అనడం కనిపించింది. పసుపు – కుంకుమ కింద మహిళలకు నగదు ఇచ్చానని చెప్పడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆకట్టుకోని సీఎం ప్రసంగం వెంకటగిరిలో సీఎం ప్రసంగం 20 నిమిషాలపాటు సాగింది. ఆయన ఎక్కువగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనే విమర్శలు గుప్పించారు. సీఎం ప్రసంగంలో పసలేదని తెలుగు తమ్ముళ్లే పెదవి విరిచారు. ఇక వివేకానందరెడ్డి హత్య, ఓట్ల తొలగింపు వ్యవహరాల్లో ప్రతిపక్షనేత వైఎస్జగన్మోహన్రెడ్డి పాత్రపై ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడంతో టీడీపీ అభిమానుల సైతం సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. మొదట హెలిప్యాడ్ నుంచి రోడ్‌షోగా చంద్రబాబు సభాస్థలమైన త్రిభువని సెంటర్‌కు చేరుకుంటారని టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. అయితే పర్యటన ఆలస్యం కావడంతో చాలాసేపు ఎదురుచూసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సొంత మండలాలకు వెళ్లిపోయారు. దీంతో నాయకులు రోడ్‌షోను రద్దు చేశారు. చంద్రబాబు నేరుగా హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో పోలీస్ కాన్వాయ్ మధ్య చేరుకున్నారు. సూళ్లూరుపేటలో.. సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పులికాట్ సరస్సు అభివృద్ధికి రూ.48 కోట్లు మంజూరు చేస్తున్నాని మరోమారు ప్రకటించడం విశేషం. తనపై కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రను భగ్నం చేయాలంటే మీరంతా మరోమారు టీడీపీకి ఓట్లు వేస్తారా తమ్ముళ్లూ.. అని బాబు అడగ్గా ఏమాత్రం స్పందన రాలేదు. సభ 20 నిమిషాల్లో ముగించి వెళ్లిపోవడంతో టీడీపీ నాయకుల్లో జోష్ కనిపించలేదు. -
షాడో మంత్రి వీరంగం
ఆయన షాడో మంత్రి. అధికార పార్టీలో అందరికి సుపరిచితుడు. ఇక పైరవీలు చేసే నేతలకు అయితే ఆయన బాగా సన్నిహితం. నెల్లూరు నగరంలో షాడో మంత్రిగా వ్యవహరిస్తూ మంత్రి నారాయణకు అన్నీ తానై వ్యవహరిస్తున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వ్యవహారశైలి తరచూ వివాదంగా మారుతోంది. తాజాగా సోమవారం చిన్నబజార్ పోలీస్‌స్టేషన్‌లో ఎన్నికల విధుల్లోని పోలీసులు, అధికారులపై వీరంగం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నారాయణ సిబ్బందినే స్టేషన్‌కు తీసుకువస్తారా అంటూ నానా యాగీ చేసి పోలీసులపై మండిపడుతూ గందరగోళం సృష్టించారు. అయినా పోలీసులు మాత్రం నోరు మెదపని పరిస్థితి. అదే గతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఆగమేఘాల మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ అధికార పార్టీ నేతగా ఉన్న పట్టాభి రామిరెడ్డి విషయంలో మాత్రం, అదీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జిల్లా పోలీసు బాస్ మొదలుకొని నగర డీఎస్పీ వరకు ఒక్కరు కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తూ పచ్చచొక్కాలు ధరించిన పోలీసుల్లా మారడం సర్వత్రా వివాదంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రజాభిమానం లేని నారాయణ కేవలం కరెన్సీ నోట్లనే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలను కూడా నమ్మకుండా సొంత మనుషుల ద్వారా డబ్బు వ్యవహారాలకు తెరతీశారు. తన విద్యా సంస్థల్లోని సిబ్బందితో అడగడుగునా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ, ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తూ ప్రజలకు దొరికిపోతున్నారు. అందులో భాగంగా ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజుల పాటు నెల్లూరు నగరంలో డబ్బులు పంచుతూ స్థానికులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబట్టారు. అది కూడా నారాయణ విద్యాసంస్థల్లో కీలక స్థాయి ఉద్యోగులే కావడం విశేషం. ఆదివారం 43వ డివిజన్లో డబ్బు పంచడానికి నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి రూ.8.30 లక్షలతో ఉండగా స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు యథావిధిగా కేసు నమోదు చేసి సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఇక సోమవారం నగరంలోని 40వ డివిజన్లో నారాయణ విద్యాసంస్థల లెక్చరర్ బాలమురళీకృష్ణ రూ.50 వేల నగదు ఎవరెవరికి పంపిణీ చేయాలనే దానికి సంబంధించిన స్లిప్పులు, టీడీపీ కండువాలతో చిక్కారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పట్టుకొని చిన్నబజార్ స్టేషన్లో అప్పగించారు. బాలమురళీతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అనుచరుడు పట్టాభి చిన్నబజార్ స్టేషన్‌కు చేరుకుని తమ వాళ్లను ఎలా పట్టుకుంటారని పోలీసులపై మండి పడ్డారు. నారాయణ సిబ్బంది నారాయణకు కాకుండా మీకు పనిచేస్తారా అంటూ తీవ్రంగా ఆవేశంతో ఉగిపోయారు. పోలీస్‌స్టేషన్‌లో గందరగోళం నెలకొనడంతో డీఎస్పీ మురళీ కృష్ణ స్టేషన్‌కు చేరుకుని అనేక తరన్జనభర్జల అనంతరం డబ్బులతో దొరికిన బాలమురళీ కృష్ణపై కేసు నమోదు చేసి మిగిలిన వారికి సంబంధం లేదంటూ పంపేశారు. ఇదేమి పోలీసు రాజ్యం కొద్ది రోజుల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారు. రూరల్ నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తున్న టీడీపీ వ్యక్తులను స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ఆపి వారిని స్టేషన్లో అప్పగించారు. పోలీసులు సర్వే టీమ్ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని పార్టీ కా>ర్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇదేమి అన్యాయం అని స్టేషన్‌కు వెళ్లి ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డిపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి హైడ్రామా నడుమ అరెస్ట్ చేశారు. వాస్తవానికి ప్రజాప్రతినిధికి జరిగిన విషయంపై ప్రశ్నించే హక్కు ఉంటుంది. అయితే ఎలాంటి హోదాలేని వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి స్టేషన్లో నానా యాగీ చేసినా పోలీసులు మాత్రం మౌనం వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. పైగా ఎన్నికల విధుల్లో ఉండి, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక పోలీసులు మరింత పక్కగా ఎన్నికల నియామావళికి లోబడి పనిచేయాలి. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం నారాయణ అడుగులకు మడుగులు ఒత్తడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. పట్టాభి తీరు అంతే పట్టాభి రామిరెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటుంది. నగర టీడీపీలో నేతలుగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, తాళ్లపాక ఆనురాధ తదితరులు ఇప్పటికే పట్టాభి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలోనూ పట్టాభి వ్యవహారంపై అనేక సార్లు మంత్రి వద్ద, రెండు సార్లు చంద్రబాబు వద్ద కూడా పంచాయితీ జరిగింది. పట్టాభిపై ఉన్న వ్యతిరేకతతో 2016లో టీడీపీ నేతల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన అతన్ని ఓడించారు. మరో వైపు ఎన్నికల సమయంలో బ్యాలెట్ పేపర్‌తో పాటు పట్టాభి చేసిన అరాచకాల్ని ఓటర్లు కాగితంపై రాసి బ్యాలెట్ పేపర్‌తో కలిపివేయడంతో అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో ఉద్యోగులను వేధించిన తీరును, పట్టాభి ఆడియో టేపులను సీపీఎం నేతలు విడుదల చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేతలు, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనున్నారు. -
బీదపై బొల్లినేని అప్పుల బండ
సాక్షి, నెల్లూరు: ‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు’ ఉదయగిరి టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అసమ్మతి తలనొప్పి.. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావుకు సంకటంగా మారింది. ఉదయగిరి నియోజవర్గంలో చేపట్టిన ఫైబర్ చెక్‌డ్యామ్ పనులను బొల్లినేని స్థానిక నేతలకు సబ్‌కాంట్రాక్ట్‌గా ఇచ్చి చేయించారు. ఆ బిల్లులను వసూలు చేసుకుని తన ఖాతాలో వేసుకున్నాడే కానీ.. పనులు చేసిన నేతలకు డబ్బులు ఇవ్వలేదు. తమ డబ్బులు ఎగనామం పెట్టిన ఎమ్మెల్యే బొల్లినేనికి ఎన్నికల సమయంలో సదరు నేతలు చుక్కలు చూపిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే కానీ ఎన్నికల్లో పని చేయమని తెగేసి చెప్పడంతో వారిని సర్దుబాటు చేసే వ్యవహారంలో భాగంగా బొల్లినేని అప్పుల బండను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్‌రావు నెత్తినేసుకున్నాడు. బొల్లినేని బాధితులను నెల్లూరులోని తమ కార్యాలయం వద్దకు పిలిపించుకుని నగదు సర్దుబాటు చేస్తున్నారు. ముందుగా నియోజకవర్గంలోని రూ.10 లక్షల లోపు బకాయిలు ఉన్న వారిని పిలిపించుకుని వారికి సగం నగదు ఇచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ పూర్తిస్థాయిలో బకాయిలు ఇచ్చే వరకు ఈ ఎన్నికల్లో బొల్లినేనికి పని చేయమని వారు తెగేసి చెబుతుండడంతో వారిని ఒప్పించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. రూ.9 కోట్ల బకాయిలు ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కొత్త టెక్నాలజీ పేరుతో దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో పైబర్చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. మహారాష్ట్రలోని పైబర్ చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ఉపయోగ పడుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నియోజక వర్గంలో పైబర్ చెక్ డ్యామ్‌లు నిర్మాణాలకు çపూనుకున్నారు. ఖర్చు తక్కువతో నిర్మాణాలు జరిగే పైబర్ చెక్ డ్యామ్‌ల నిర్మాణాల్లో అంచనా భారీగా పెంచి వేయించారు. తన సొంత కంపెనీ పేరుతోనే టెండర్లు దక్కించుకుని ఆయా చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలకు పంపకాలు చేసి వారి ద్వారా నిర్మాణాలు చేయించారు. కానీ ఆయా బిల్లులు పూర్తిస్థాయిలో తీసుకున్న బొల్లినేని రామారావు సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వలేదు. దాదాపు రూ.9 కోట్ల వరకు బిల్లులు ఇవ్వకుండా మూడేళ్లగా వారిని ముప్పు తిప్పులు పెట్టారు. వీరే కాకుండా మహారాష్ట్ర, ఏపీలో కూడా బొల్లినేని కంపెనీ నుంచి బిల్లులు రావాల్సిన జాబితా చాలానే ఉంది. సబ్ కాంట్రాక్టర్లకు రావాల్సిన నగదు ఇవ్వకుండా ఎగనామం పెట్టిన ఎమ్మెల్యేపై వారు పోరాటం చేయలేకపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాధితులంతా ఏకమై బొల్లినేని వ్యవహారంపై తీవ్రంగా పోరాటం చేశారు. ఒకనొక దశలో సీఎం చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టి టికెట్ ఇవ్వొద్దని, టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించి వచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేనికి టికెట్ ఇవ్వకుండా చివరి వరకు జాప్యం చేసినా, కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి టికెట్ ఇచ్చారు. కానీ బొల్లినేని బాధితులు మాత్రం మా బిల్లులు ఇస్తే కానీ ఆయనకు పని చేయమని తెగేసి చెప్పడంతో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడంతో మింగుడు పడని బొల్లినేని ఈ వ్యవహారం చక్కదిద్దాలని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్‌రావుకు అప్పగించారు. ఆయన నియోజకవర్గంలోని బొల్లినేని బాధితులను పిలిపించుకుని వారికి కొంత సర్దుబాటు చేసి పంపే ప్రయత్నాలు మమ్మురం చేశారు. దీంతో బొల్లినేని నగదు సర్దుబాటు చేస్తున్నారని తెలియగానే బాధితులు క్యూ కట్టారు. కేవలం నియోజకవర్గానికి చెందిన బాధితులను మాత్రం పిలిపించుకుని సర్దుబాటు చేస్తున్నారు. మిగిలిన వారికి పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహాం వ్యక్తం చేస్తునారు. -
చంద్రబాబును కలిసిన ఎల్.రమణ
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ బుధవారం కలిశారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో రేపటి నుంచి (గురువారం) నుంచి తెలంగాణలో తలపెట్టే పల్లె పల్లెకు తెలుగుదేశంపై చర్చించారు. అలాగే ఈ నెల 18న ఎన్టీఆర్ వర్థంతి ఏర్పాట్లు, రక్తదాన శిబిరాల నిర్వహణ, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా ఎల్.రమణకు దిశానిర్దేశం చేశారు. -
ఎంత మాటన్నారు చంద్రబాబు గారూ!
-
ఎంత మాటన్నారు చంద్రబాబు గారూ!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిగ్గా 35 ఏళ్ల తర్వాత తన రాజకీయ జీవిత విశేషాలను నెమరువేసుకుంటూ చెప్పిన పలు విషయాలు విశ్లేషకులను నివ్వెరపరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు పార్టీ పెట్టమని ఎన్టీఆర్‌కు చెప్పింది తానేననీ, ఎన్నికల్లో ఎన్టీఆర్పైన పోటీ చేస్తానని తానెప్పుడూ చెప్పలేదంటూ చంద్రబాబు అంటున్న విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలు రకరకాల సెటైర్లు వేస్తున్నారు. గత చరిత్రను తిరగదోడుతున్నారు. 1982లో పార్టీ స్థాపించాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్న రోజుల్లో చంద్రబాబు కాంగ్రెస్‌లో సినిమాటోగ్రఫీ, పురావస్తు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడుగానీ, దాని కోసం జరిగిన కసరత్తులోగానీ చంద్రబాబు పాత్ర ఎక్కడా లేదు. పైపెచ్చు సినిమా గ్లామర్‌కు ఓట్లు రాలుతాయా? అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబు తన పెళ్లి రోజును స్మరించుకుంటూ చెప్పిన వివరాలు ప్రజలను విస్మయపరిచాయి. "ఎన్టీఆర్‌కు పార్టీ పెట్టమని చెప్పింది నేనే...." పెళ్లయి 35 ఏళ్లు అయిన సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ చంద్రబాబు చెప్పినమాట ఇది. ఇంతకు ముందెప్పుడూ చంద్రబాబు ఈ మాట చెప్పలేదు. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు ఇలాంటి మాటలే ఆయన నోటి నుంచి రాలేదు. ఎన్టీఆర్ మరణించిన 20 ఏళ్ల తర్వాత చంద్రబాబు చెప్పిన ఈ మాటలను.. గతంలో జరిగిన సంఘటనలతో పోల్చుతూ సోషల్ మీడియాల్లో పోస్టులు చేస్తున్నారు. నిజానికి అంతకు ముందు ఏం జరిగిందంటే... 1982 మార్చి 21 న రామకృష్ణా స్టూడియోస్‌లో విలేకరుల సమావేశం పెట్టి ప్రజాజీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నానని ఎన్టీఆర్ ప్రకటించారు. అప్పుడు ఎన్టీఆర్ పక్కన చంద్రబాబు లేరు సరికదా... పెట్టిన తర్వాత పార్టీలో చేరాలని ఆహ్వానించినా చంద్రబాబు తిరస్కరించారు. అదో గాలి పార్టీ అని ఎద్దేవాచేశారు. ఎన్టీఆర్ ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన నాదెండ్ల భాస్కరరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదయ్య, రత్తయ్య, నారాయణ తదితరులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీఆర్‌కు మద్దతు ప్రకటించారు. ఆ సమయంలోనూ పక్కన చంద్రబాబు లేరు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఊటీలో సినిమా షూటింగ్ ముగించుకుని 1982 మార్చి 29న హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్ నేరుగా నాదెండ్ల ఇంటికి వెళ్లారు. అప్పుడు కూడా చంద్రబాబు లేరు. హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎన్టీఆర్ తన పార్టీ పేరు తెలుగుదేశంగా ఖరారు చేశారు. అప్పుడు చంద్రబాబు ఆ దరిదాపుల్లో లేరు. రామకృష్ణా స్టూడియోస్‌లో టీడీపీ లోగోను ఎన్టీఆర్ ఒక కాగితం మీద గీశారు. చక్రం, నాగలి, గుడిసె చిత్రాలతో పసుపు జెండా రూపొందించి అక్కడే ఉన్న ప్రముఖుల అభిప్రాయాలను కోరారు. వారెవరంటే... బెజవాడ పాపిరెడ్డి, తుర్లపాటి సత్యనారాయణ, యలమంచిలి శివాజీ, నాదెండ్ల భాస్కరరావు, రత్తయ్య, ఆదయ్య, నారాయణ, దగ్గుబాటి చెంచురామయ్య తదితరులు మాత్రమే. అక్కడ కూడా చంద్రబాబు లేరు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 1982 ఏప్రిల్ 11 న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో టీడీపీ తొలి బహిరంగ సభను ఎన్టీఆర్ నిర్వహించారు. ఆ ఛాయల్లో ఎక్కడా చంద్రబాబు లేరు. ఆనాడేం జరిగింది... దగ్గుబాటి మాటల్లోనే... "నిజాం కాలేజీలో మొదటిసభ ముగిసిన తర్వాత ఆయా నాయకుల మద్దతు కోరడానికి, పార్టీలోకి ఆహ్వానించడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్లాను. అప్పుడు చంద్రబాబు ఒక కాగితం తీసుకుని లెక్కలేసి ఎన్టీఆర్ జేబులోంచి పైసా తీయడు. ఎన్టీఆర్‌కు 5 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. సినిమా మోజుకి ఓట్లు పడతాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు. నాకు కాంగ్రెస్‌లో మంత్రిపదవి ఉంది. నేను మంత్రి పదవి వదులుకుని ఎలా వస్తాను?" అంటూ టీడీపీలోకి వచ్చేదే లేదని తేల్చిచెప్పారు చంద్రబాబు. ఆ తర్వాత క్రమంలో 1982 మే 28న ఎన్టీఆర్ తన జన్మదినం సందర్భంగా తిరుపతిలో ఒక సభ ఏర్పాటుచేసి దానికి మహానాడు అని పేరు ఖరారుచేశారు. (ఆ సమయంలోగానీ... ఆ సభ జరిగినప్పుడు గానీ ఆ దరిదాపుల్లో చంద్రబాబు లేరు) 1982 నవంబర్ 18 న కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ మీద పోటీకి రెడీ అని చంద్రబాబు ప్రకటన చేశారు. 1982 లో తిరుపతిలోని పాలిటెక్నిక్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, అధిష్టానం ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ మీద పోటీకి సిద్ధమని ప్రకటించారు. దానికి కొద్దిరోజుల ముందే ఆంధ్రపత్రికలో (దగ్గుబాటి ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకం నుంచి) చంద్రబాబు చెప్పిన విషయాలు "మామ ఎన్టీఆర్ పై ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి రెడీ. తెలుగుదేశం ఒక గాలి పార్టీ. దానికి భవిష్యత్తు లేదు" అన్న శీర్షికతో ప్రచురితమైంది. ఇదే విషయం అప్పట్లో మరికొన్ని పత్రికల్లో ప్రచురితమైంది. ఏమాత్రం తడుముకోకుండా...!! చంద్రబాబు ఆ మాటలు చెప్పినట్టు చరిత్రలో ఎన్నో సాక్ష్యాలున్నా, ఏమాత్రం తడబాటు లేకుండా ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని తానెప్పుడూ చెప్పలేదని తాజాగా అన్నారు. 1983 జనవరి 5న పుట్టినగడ్డ చంద్రగిరిలో మేడసాని వెంకటరామ నాయుడు అలియాస్ మీసాల నాయుడు చేతిలో 17,429 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. అప్పుడే టీడీపీ రాష్ట్రంలో ఘన విజయం సాధించింది. సరిగ్గా ఆ తర్వాతి నుంచి చంద్రబాబు రూటు మార్చడం ప్రారంభించారు. ఎన్నికల్లో ఓడిపోయిన 15 రోజులకే మామ ఎన్టీఆర్ వద్దకు పలువురి ద్వారా రాయబారం పంపారు. తన విధానాలను మార్చుకుంటానని, అంకితభావంతో పనిచేస్తానని... రాయబారం నెరిపారు. ఆ తర్వాత టీడీపీలో చేరుతానని ప్రకటన చేశారు. (విధానాలను మార్చుకుంటా అంటున్నారని, అందుకే పార్టీలో చేర్చుకుంటున్నానని ఎన్టీఆర్ చెప్పినట్టు దగ్గుబాటి తన పుస్తకంలో రాసుకున్నారు) 1983లో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఓటమికి తీవ్రకృషి చేయడమే కాకుండా అప్పట్లో జిల్లాలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించిన చంద్రబాబును చేర్చుకుంటే పార్టీ పతనానికి నాంది పలికినట్టేనని అప్పట్లో టీడీపీ నేత సిద్దయ్య మూర్తి బహిరంగంగానే ప్రకటించారు. అదే సంవత్సరం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సులో చంద్రబాబును ఓడించిన మీసాల నాయుడు లేచి కాంగ్రెస్ వారిని పార్టీలో చేర్పించుకోరాదని తీర్మానం ప్రవేశపెట్టగా దానికి మద్దతు తెలుపుతూ 99 శాతం మంది చేతులెత్తి దాన్ని బలపరిచారు. ఇలాంటివారిని పార్టీలోకి ఆహ్వానిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మహిళా విభాగం నాయకురాలు రమణమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి చేరికను వ్యతిరేకిస్తూ మరో నాయకురాలు సీతామహాలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాతి కాలంలో వారందరికీ సర్దిచెప్పిన ఎన్టీఆర్ (పిల్లనిచ్చిన మామ కావడంతో) చంద్రబాబును పార్టీలో చేర్చుకున్నారు. (తోడల్లుడు దగ్గుబాటు వెంకటేశ్వరరావు రాసిన ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకంలోంచి...) రాజ్యాంగం పర్మిట్ చేస్తే...! ''ఒక వ్యక్తి బొమ్మ (ఎన్టీఆర్) పెట్టుకొని గెలవలేదు. ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఉంది. అందరూ కలిసే ఎన్నికల్లో గెలిచాం. ఎన్టీఆర్‌కు చరిష్మా ఉంటే ఆయన 1989లో ఎందుకు ఓడిపోయారని అడుగుతున్నాను. 1984 ఆగస్టు క్రైసిస్ తర్వాత మిత్రపక్షాలు అందరూ కలిసి 240 మంది గెలిచాం. తిరిగి 1994లో అందరికీ తెలిసిందే. ఆ విధంగా ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్తో గెలిచాం. ఏ ఒక్కరితో కాదు'' -1995లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చెప్పిన మాటలివి. ఒకానొక చర్చ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన అంశంపై చంద్రబాబు సభలో మాట్లాడారు. "ఇదే హౌస్‌లో 227 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినా ఇంకా ప్రజాస్వామ్యం...! ప్రజాస్వామ్యం...! అని మాట్లాడితే నాకే అర్థం కావడం లేదు. అసలు ప్రజాస్వామ్యానికి డెఫినిషన్ ఏమిటని వారిని (ప్రతిపక్షాలను ఉద్దేశించి) అడుగుతున్నాను. ఎన్టీఆర్ ఏం చేశారంటే... పార్టీ రాజ్యాంగాన్ని రాసుకున్నామని అన్నారు. ఆయన ఎప్పుడు రాసుకున్నారో నాకు తెలియదు. పార్టీ అధ్యక్షుడిగా శాశ్వతంగా ఆయన ఉంటారని రాసుకున్నారు. మన కాన్ స్టిట్యూషన్ కూడా పర్మిట్ చేస్తే... ఆయన శాశ్వతంగా ముఖ్యమంత్రి అని రాసుకునే వారేమో నాకు తెలియదు." ఆగ్రహంతో ఊగిపోతూ అన్న మాటలివి. (5 డిసెంబర్ 1995 రోజున శాసనసభలో చంద్రబాబు చేసిన ప్రకటన - అసెంబ్లీ రికార్డుల్లోంచి). ఇదే చంద్రబాబు.. తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని, కానీ అప్పటికి పదో తరగతి చదువుతున్న తన కుమారుడు లోకేశ్‌ను అడిగితే ముఖ్యమంత్రి పదవి శాశ్వతం, ప్రధాని పదవి అశాశ్వతం అని చెప్పాడని, అందుకే తాను ముఖ్యమంత్రి పదవినే ఎంచుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి.. తన కొడుకు చెబితే మాత్రం ముఖ్యమంత్రి పదవి శాశ్వతం అని ఎలా భావించారో ఆయనకే తెలియాలి! కళ్లార్పకుండా... ఎన్టీఆర్ విషయంలో ఇలా ఒకో సందర్భంలో ఒకలా మాట్లాడిన చంద్రబాబు తాజాగా మీడియాతో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా నివ్వెరపరుస్తున్నాయి. మామ ఎన్టీఆర్‌పై ఎక్కడినుంచైనా పోటీకి రెడీ అని చంద్రబాబు ప్రకటన చేసిన కొద్దిరోజుల్లోనే ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నేతలు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి పి. అశోక గజపతిరాజు, కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి, టీడీపీ నేత ముద్దుకృష్ణమ నాయుడు తదితరులు టీడీపీలో చేరారు. ఇలా ఒకరేంటి... చాలామంది నేతలు చంద్రబాబు కన్నా ఎంతో ముందుగా టీడీపీలో చేరినవారే. ఆనాటి చరిత్రకు వీళ్లంతా సాక్షులే. ఇంత జరిగినా... ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించింది తానేననీ, పార్టీ పెట్టమని చెప్పిందీ తానేననీ... వంటి మాటలు అలవోకగా చెప్పడం చంద్రబాబుకే చెల్లింది. -
అశోక్ గజపతిరాజు ఎక్కడ?!
సాక్షి, అమరావతి: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ఎక్కడ...? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో జరుగుతున్న తీవ్ర చర్చ ఇది. అశోక్ గజపతిరాజు టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు. గత సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం చేస్తున్న కసరత్తులో ఆయన పాత్ర ఇసుమంతైనా కనిపించటం లేదు. టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు బినామీలుగా పేరుపడ్డ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌లు మాత్రమే ఈ కసరత్తులో భాగం పంచుకుంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోం మంత్రి రాజ్నా«ద్‌సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల విషయంలో వీరిద్దరే చర్చలు జరుపుతున్నారు. లోక్‌సభలో పార్టీనేత తోట నరసింహంను కూడా ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవటం లేదు. అశోక్ పైరవీలకు బద్ధ వ్యతిరేకి, ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. అలాంటి వ్యక్తికి కేంద్రంతో సంప్రదింపుల వంటి కీలక బాధ్యతలను అప్పగిస్తే తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనే ఏకైక కారణంతో అశోక్‌ను చంద్రబాబు పక్కన పెట్టారని స్వపక్షంలోనే తీవ్ర ప్రచారం జరుగుతోంది. సుజనా, సీఎం రమేష్ లాంటి వారు తిమ్మిని బమ్మిని చేసి వారి ప్రయోజనాలతో పాటు తన సొంత ప్రయోజనాలు కాపాడేలా వ్యవహరిస్తారనే నమ్మకంతోనే వారిద్దరికీ కీలకమైన ఈ బాధ్యతలను అప్పగించారనే వాదన వినిపిస్తోంది. అశోక్ కేబినెట్ మంత్రిగా ఉన్నా చంద్రబాబు తొలినుంచీ తన బినామీ, సహాయ మంత్రి అయిన సుజనా చౌదరికే అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తున్నారు. కేంద్రం వద్దకు రాష్ట్రానికి సంబంధించిన వినతులను తీసుకెళ్లాల్సినపుడు సుజనా చౌదరినే పంపారు. ఆయన తనకిష్టమైన, అనుకూలమైన ఎంపీలను వెంటబెట్టుకుని వెళ్లి వినతులను అందించేవారు. ఈ విషయాన్ని అశోక్ ఒకానొక సందర్భంలో ఢిల్లీ వచ్చిన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సుజనాకు ప్రాధాన్యత ఇవ్వాలని మీరు భావిస్తే ఆ పని చేసుకోండి తప్ప కేబినెట్లో ఉన్న తనను అవమానపరిచే విధంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. దీంతో కొద్ది రోజులు అశోక్‌కు ప్రాధాన్యతనిచ్చినట్లు వ్యవహరించిన చంద్రబాబు ఆ తరువాత యధావిధిగా బినామీలకు పట్టం కట్టడం ప్రారంభించారు. అదే విధానాన్ని ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నారు. -
మెడకు చుట్టుకుంటుందా?
-
మెడకు చుట్టుకుంటుందా?
హైదరాబాద్: అంతా సజావుగా సర్దుకుపోయిందనుకుంటున్న ఓటుకు నోట్ల కేసు మరోసారి తెరమీదకు రావడంతో తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. వెంటనే సన్నిహిత అధికారులను పిలిచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సన్నిహిత న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు వెలువడటం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. చివరకు ఈ కేసు మెడకు చుట్టుకుంటుందా అన్న భయం కూడా ఉందని ఆ పార్టీ నేతల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోట్ల కేసులో ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో ఇక ఎలాంటి సమస్యలు రావని భావిస్తున్న తరుణంలో కోర్టు కేసును పునర్విచారణకు ఆదేశించడం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టింది. నిజానికి ఓటుకు నోట్లు కేసులో మొదట్లో విచారణ చురుకుగా సాగినప్పటికీ ఆ తర్వాత కాలంలో వేగం బాగా తగ్గింది. దానికి తోడు ఈ కేసులో చంద్రబాబు ముద్దాయిగా తేల్చడానికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక చాలా కాలం బయటకు రాలేదు. ఫోరెన్సిక్ నివేదిక పేరుతో ఇంతవరకు ఈ కేసులో చంద్రబాబు నాయుడిని అధికారులు ప్రశ్నించలేకపోయారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక కోర్టు ముందుంచిన తర్వాత కూడా కేసులో ఎలాంటి ముందడుగు పడలేదు. దానిపై అప్పట్లోనే రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఫోరెన్సిక్ నివేదికపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆయన వాదనతో ఏకీభవించి కేసు పునర్విచారణకు ఆదేశించడంతో చంద్రబాబు వర్గీయుల్లో గుబులు మొదలైంది. అందులోనూ ఫోరెన్సిక్ నివేదికను పరిగణలోకి తీసుకుని విచారణ జరగాలని కోర్టు కోరడం చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం మింగుడు పడటం లేదని తెలిసింది. ఈ విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్న దానిపై ఆయన న్యాయకోవిదులతో సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ఏసీబీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు విచారణకు సిద్ధపడటం లేదని తెలిసిపోతుంది. అలాగని పై కోర్టులను ఆశ్రయించని పక్షంలో కేసు మెడకు చుట్టుకునే ఆస్కారం ఉంది... ఏ కోణంలో చూసినా చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితే తలెత్తిందని సీనియర్ టీడీపీ నేత ఒకరు చెప్పారు. ఓటుకు కోట్ల కేసులో తనకేమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో తాను దోషి కాదని చంద్రబాబు నిజాయితీగా నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత అధికారి ఒకరు చెప్పారు. -
బ్రహ్మంసాగర్‌కు నీటిని అందించడంలో టీడీపీ విఫలం
బి.కోడూరు : బ్రహ్మంసాగర్‌కు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటిని అందించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు నేలటూరిరామిరెడ్డి కుమారుని వివాహానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు గత మూడేళ్లుగా మండలంలో వర్షాలు రాక బ్రహ్మంసాగర్ నీరు అందక పంటలు సరిగా పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు వారు స్పందిస్తూ బ్రహ్మంసాగర్ నీటి విషయమై ఇప్పటికే చీఫ్‌సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా బ్రహ్మంసాగర్ నీటి విషయమై పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా బ్రహ్మంసాగర్‌కు నీరు అందించి, బ్రహ్మంసాగర్ నుంచి అటు బి.మఠంతో పాటు బి.కోడూరు మండలంలోని 32 చెరువులకు నీరు అందించి కలసపాడు, కాశినాయన మండలాలకు నీరు అందించి చేయూతనిచ్చిన విషయాన్ని ఎంపీ అవినాష్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతాంగ సమస్యలను పూర్తి విస్మరించిందన్నారు. బ్రహ్మంసాగర్ నీటి విషయమై జిల్లాలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి తిరిగి చీఫ్ సెక్రటరీ దృష్టికి ఈ సమస్యను తీసుకెళతామని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల, బి.కోడూరు జెడ్పీటీసీలు చిత్తారవిప్రకాష్‌రెడ్డి, ఎస్.రామక్రిష్ణారెడ్డి, బి.కోడూరు సింగిల్‌విండో అధ్యక్షుడు ఓ.ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కదులుతున్న తెలుగుదేశం పునాదులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య తీసుకునే అనాలోచిత నిర్ణయాలు ఆయననే వెంటాడుతున్నాయి. ఆయన రగిల్చిన రిజర్వేషన్ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఏపీలో ఒక వైపు కాపులు ఉద్యమిస్తున్నారు. ఇంకోవెపు బీసీలు మండిపడుతున్నారు. దీనితో ఏపీలో టీడీపీ పునాదులు కదులుతున్నాయి. టీడీపీ స్థాపించిన ప్పటి నుంచి బీసీ కులాలు అండగా నిలిచాయి. కానీ ఇటీవలి కాలంలో టీడీపీ పార్టీ నేత బాబు తీసుకుం టున్న అసంబద్ధ నిర్ణయాల వలన ఈ కులాలు టీడీపీ పట్ల విశ్వాసం కోల్పోతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలో టీడీపీ గెలవడానికి ప్రధాన కారణం బీసీలు, కాపులు. ఎన్నికలకు ముందు అనేక సర్వేలు కూడా వైఎస్సార్ సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని తేల్చాయి. కానీ బీసీలు, కాపుల మద్దతుతో టీడీపీ అనూహ్యంగా గెలిచింది. ఏపీలో ఇటీవలి కాలంలో టీడీపీ ప్రతిష్ట బాగా దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోవడమే. 1.45 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులంతా ఆగ్ర హంగా ఉన్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అపహాస్యం పాలైంది. దీనితో రైతులు, మహి ళలలో భారీ వ్యతిరేకత వచ్చింది. అమరావతి రాజధాని భూ కుంభకోణంలో టీడీపీకి పడ్డ అవినీతి ముద్ర చెరిగిపోనిది. శాసనసభ్యులకు కోట్ల రూపాయల డబ్బు లిచ్చి, కాంట్రాక్టులిచ్చి కొనుగోలు చేయడంతో పార్టీ ప్రతిష్ట బాగా దిగజారింది. దీనికితోడు తమను చిన్న చూపు, నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన బీసీలలో రగులు తోంది. ఇవన్నీ టీడీపీని బలహీనపర్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని సర్వేలు తెలుపుతున్నాయి. అదే సమ యంలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆ పార్టీ 120 సీట్లు గెలుస్తుందని రాజకీయ పరిశీలకుల అంచనా. బీసీలు పార్టీ పెడితే టీడీపీ ఓటు బ్యాంకు పునాదులు కదలి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్సార్సీపీకి దళితులు, ముస్లింలు, క్రిష్టియన్లు, రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకుగా చెక్కు చెదరకుండా ఉంది. అలాగే ఇతర వర్గాల ఓటుబ్యాంకు ఏ మాత్రం కలిసొచ్చినా ఆ పార్టీకి తిరుగుండదు. పైగా పార్టీ అధి నేత జగన్మోహన్ రెడ్డికి తండ్రిలాగా మాట తప్పని వాడు అనే విశ్వసనీయత ఉంది. మరోవైపు టీడీపీ ఓటు బ్యాంకు పునాదులు కదలడంతో రెండు రాష్ట్రాలలో కోలుకోలేని దెబ్బతినబోతోంది. ఏదేమైనా బీసీలు, కాపుల సమస్యలు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. - ప్రొ॥ఎం. బాగయ్య వ్యాసకర్త ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మొబైల్ : 98665 30295 -
బాబూ.. మళ్లీ నాటకాలా?
* ప్రత్యేక హోదాపైనా డబుల్ డ్రామాలొద్దు: జేపీ * ఏడాది గడిచినా ఎందుకు తేలేకపోయారు? సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన సమయంలో ద్వంద్వ వైఖరి అవలంబించి నాటకాలాడిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తోందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చేందాలంటే పరిశ్రమలపై పన్నుల బారం తగ్గాలని, ప్రత్యేక హోదాతోనే అది సాధ్యం అవుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో తెలుగుదేశంపార్టీ విఫలం అయ్యిందని అన్నారు. అయిన వారికి లబ్ధి చేకూర్చడానికే తెలుగుదేశం ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందని విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఐదేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ముష్టిలా ఏడాదికి రూ.250 కోట్లు ఇస్తూ ఉంటే ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఇంత వరకూ కేటాయించిన నిధులు మట్టి తీయడానికే సరిపోవడం లేదన్నారు. 14 వ ఆర్థిక సంఘం నిధులతో ఏపీ బడ్జెట్ లోటు భర్తీ చేసేశామని కేంద్రం చెబుతోందంటే రాష్ర్టం ఇచ్చిన నివేదికలో ఏముందో, కేంద్రంతో ఏం లాలూచీ పడిందో ప్రజలకు తెలియాలన్నారు. ఓ వైపు అప్పుల్లో ఉన్నామంటూనే ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ, కార్యాలయాలకూ, హంగూ ఆర్భాటాలకూ, చంద్రన్న కానుకలకూ రూ.కోట్లు ఖర్చు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. -
ప్రత్యేక హోదా కోసం యుద్ధం ప్రకటించాలి: నారాయణ
బళ్లారి : పనికిమాలిన రెండు కేంద్ర మంత్రి పదవులను త్యజించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలుగుదేశం పార్టీకి సూచించారు. ఆయన గురువారం బళ్లారి నగరంలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా నగరంలోని రాయల్‌ఫోర్ట్ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని పార్లమెంటులో డిమాండ్ చేసిన బీజేపీ కేంద్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంలో నిర్లక్ష్యం చూపుతున్నందున వెంటనే తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలిగి పోరాటానికి సిద్ధపడాలన్నారు. అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి చంద్రబాబు తీసుకెళ్లకపోతే తామే అఖిలపక్ష బృందంతో ఢిల్లీకి వెళతామన్నారు. పోలవరానికి రూ.20 వేల కోట్లు కావాల్సి ఉండగా, కేవలం రూ.100 కోట్లు కేటాయిస్తే ఎన్ని సంవత్సరాలకు ప్రాజెక్టు పూర్తి కావాలని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు కేంద్రంతో మెతకవైఖరి అవలంభిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాటం చేయకపోతే ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సినీనటుడు పవన్ కళ్యాణ్ రైతుల కోసం రాజధాని భూముల్లో పర్యటన చేయలేదని, చంద్రబాబు కోసమే ఆయన పర్యటన సాగిందన్నారు. తాము తమల పాకులతో కొడతాము, మీరు తలుపులతో కొట్టండి అన్న చందంగా చంద్రబాబు, మోడీ తీరు ఉందని వ్యంగ్యంగా అన్నారు. కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్న వెంకయ్యనాయుడు పెద్ద అబద్దాలకోరు అని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ 10 సంవత్సరాలు కొనసాగాలని అప్పట్లో రాజ్యసభలో గొడవ చేసిన వెంకయ్య నాయుడు నోటికి ప్రస్తుతం తాళం పడిందన్నారు. ఆయనకు గట్టిగా మాట్లాడితే తన మంత్రి పదవీ ఊడిపోతుందనే భయం ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. -
పోలీసుల చేతికి బెట్టింగ్ తమ్ముళ్ల చిట్టా !
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో నిందితులైన తెలుగుదేశం పార్టీ ద్వితీయశ్రేణి నేతల చిట్టా పోలీసుల చేతికి చిక్కింది. దీంతో పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి. వారిని కాపాడేందుకు పలువురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేయవద్దని అడ్డుతగులుతున్నారు. అలాగే ప్రలోభాలకు గురిచేస్తున్నారు. దీంతో గజపతినగరం పోలీసులు నలిగిపోతున్నారు. కాగా, పోలీసులు నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతారా....? లేకపోతే పారదర్శకంగా వ్యవహరించి నిందితుల పేర్లను బయటపెడతారా అన్నదానిపై చర్చసాగుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రపంచకప్ సందర్భంగా జిల్లాలో బెట్టింగ్‌లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా గజపతినగరం, పార్వతీపురం, విజయనగరం పట్టణాల్లోని లాడ్జీల్లో బుకీలు మకాం వేసి కోట్లాదిరూపాయలకు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలిసి దాడిచేసిన పోలీసులకు ఇప్పటికే ఈ మూ డు ప్రాంతాల్లో పలువురు చిక్కారు. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల గజపతినగరంలో కీలకమైన బుకీ ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ బుకీకి విశాఖపట్నం వరకు లింకులున్నాయి. పోలీసులు తమదైన శైలిలో కాల్ డేటా ఆధారంగా విచారించే సరికి కీలక సమాచారాన్ని బయటపెట్టాడు. బెట్టింగ్‌లో పాల్గొంటున్న వారి పేర్లు సూచనప్రాయంగా చెప్పాడు. అందులో అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుల పేర్లు ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం లీకవడంతో నిందితుల గుండెల్ల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో అప్రమత్తమై తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు పలుకుబడి ఉన్న టీడీపీ నేతల్ని రంగంలోకి దించారు. వారు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కేసులు లేకుండా చూడాలని కోరుతూ పోలీసులకు కొంత సొమ్మును ముట్ట జెప్పాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నం విఫలమైనట్టు తెలిసింది. ఇక్కడి స్టేషన్ అధికారులకు విశాఖలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల చేత కూడా ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. బుకీని సమగ్రంగా విచారించి, తదననుగుణంగా కేసు కట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కాస్త తటస్థంగా ఉన్నట్టు తెలిసింది. ఎందుకొచ్చిందని ఆ కేసు విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. పోలీసు అధికారులపై ఒత్తిడి చేసేందుకు కనీసం ప్రయత్నించలేదు. నిబంధనల మేరకు నడుచుకోవాలని పోలీస్ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఆ బుకీ వెల్లడించిన వ్యక్తులెవరో తెలియాల్సిన అవసరం ఉంది. వారిపై కూడా కేసులు నమోదు చేసి పారదర్శకంగా ఉన్నామని నిరూపించుకోవల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉంది. కాగా ఈ వ్యవహారంపై గజపతినగరం సీఐ విజయ్నాథ్ను ‘సాక్షి’ వివరణ కోరగా పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్న మాట వాస్తవమే. అయినా దేనికీ లొంగే ప్రసక్తి లేదని చెప్పారు. బెట్టింగ్‌లో ఎంతటి వారు ఉన్నా విడిచిపెట్టమని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఉత్తుత్తి మాటలే!
‘దొంగలు పడ్డ ఆర్నెళ్లకు మేల్కొన్నట్లు’ అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. ఈఏడు ఎగువన జోరుగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద నీరు పుష్కలంగా వచ్చి చేరింది. నీరు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు జబ్బలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకునే పనిలో పడ్డారు తెలుగుతమ్ముళ్లు. సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారు... జిఎన్ఎస్ఎస్, పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు... గండికోటలో నీరు నిల్వ చేసి తీరుతాం... పులివెందుల తర్వాతే కుప్పంకు నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పారంటూ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి గొప్పగా ప్రకటించారు. అయితే అవన్నీ సత్యదూరాలని, ఉత్తుత్తి మాటలే అని వాస్తవ పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. ఈ ప్రాంతవాసిగా ముఖ్యమంత్రి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సాగునీటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమకు సాగు, తాగునీరు అందించాలంటే శ్రీశైలం రిజర్వాయరే మూలం. అలాంటిది కనీస నీటి మట్టం నిల్వ చేయకుండా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి రాయలసీమ కడుపుకోతకు కారకుడయ్యారని పలువురు వాపోతున్నారు. ఆపై నెపం తెలంగాణ రాష్ట్రంపై వేసి కన్నతల్లిలాంటి రాయసీమను సైతం వంచించారని పలువురు ఆవేదన చెందుతున్నారు. అధికారిక పగ్గాలు చేపట్టాక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మెట్టప్రాంతమైన రాయలసీమలో నీరు నిల్వచేసుకోవాల్సిన సమయంలో ఇక్కడి టీడీపీ నేతలు మిన్నకుండిపోయారు. అప్పట్లో మంత్రుల పర్యటనలు పరపతి పెంచుకునేందుకే మినహా, ఒక్కమారైనా ప్రాంతం కోసం ప్రాజెక్టుల కోసం చర్చించిన పాపాన పోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. పరవళ్లు తొక్కిన కృష్ణ, తుంగభద్ర నదులు ఈ ఏడాది కృష్ణ, తుంగభద్ర నదులు వరదతో పరవళ్లు తొక్కాయి. వాటి ద్వారా 2014 జూలై 30 నుంచే శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు చేరిక మొదలయింది. 2015 జనవరి 12వరకూ వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈమారు కృష్ణా జలాలు 182 టిఎంసీలు శ్రీశైలంలోకి వచ్చాయి. తుంగభద్ర నుంచి 302 టీఎంసీలు వచ్చిచేరాయి. అంటే 484 టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద రూపంలో వచ్చి చేరింది. ఆ సమయంలో స్పందించాల్సిన అధికార పార్టీ నేతలెవ్వరూ మాట్లాడిన దాఖలాలు లేవు. 484 టీఎంసీల్లో కేవలం 82 టీఎంసీలు మాత్రమే ఎస్సార్బీసీ, తెలుగుగంగ, చెన్నై తాగునీటి అవసరాలతో పాటు రాయలసీమకు వాడుకున్నట్లు అధికారికవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈమారు తెలంగాణ రాష్ట్రానికి 176 టీఎంసీల నీరు దక్కింది. తక్కిన 226 టీఎంసీల నీరు ఆంధ్ర ప్రాంతానికి దక్కింది. రాయలసీమ ప్రాంతవాసి ముఖ్యమంత్రిగా ఉండి కూడా సాగు, తాగునీరు అందించడంలో తీవ్ర అన్యాయం చేశారని ప్రజలు వాపోతున్నారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం.... ఈ మారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు చేపట్టాక తొలి సంవత్సరమే రాయలసీమకు వ్యూహాత్మకంగా అన్యాయం చేశారని సాగునీటి రంగ నిపుణుల వాదన. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 861 అడుగులు వచ్చేంత వరకూ విద్యుత్ ఉత్పాదనకు ఇష్టా రాజ్యంగా చేశారు. నాగార్జునసాగర్ నిండిన తర్వాతే పవర్ జనరేషన్ ఆపాలంటూ హుదూద్ తుపాన్ పర్యవేక్షణ చేస్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలు పోటీపడి విద్యుత్ ఉత్పాదన చేయడంతో చాలా స్పీడుగా జలాశయంలో నీరు అడగంటింది. రాయలసీమ ముంగిట్లో నీరున్నా తెచ్చుకోలేని దుస్థితి కల్పించారు. జిల్లాలో సుమారు 30 టీఎంసీల నీటిని బ్రహ్మంసాగర్, గండికోట, మైలవరం జలాశయాల్లో నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యల్లేవు. ఆ దిశగా అధికార పార్టీ నేతల చర్యలే లేకపోయాయి. రాయలసీమ అవసరాల రీత్యా 854 అడుగుల కనీస నీటిమట్టం నిల్వ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులను సైతం ధిక్కరించారు. ఈరోజుకు కేవలం 834 అడుగులే శ్రీశైలంలో నీటిమట్టం ఉంది. 854 అడుగుల నీటిమట్టం మెయింటెన్ చేస్తేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. అంతా అయ్యాక సాఫీగా గండికోటకు నీరు ఇచ్చి తీరుతామంటూ అధికార పార్టీ నేతలు జబ్బలు చరుస్తున్నారు. ముఖ్యమంత్రి కాలువలను సందర్శిస్తాడని అక్కడే నిద్ర చేస్తాడని ప్రకటిస్తున్నారు. సీఎం పర్యటనకు ఖర్చు మినహా రాయలసీమకు ఒనగూరే ప్రయోజనం లేదని పలువురు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గండికోటకు నీరు ఇప్పట్లో అసాధ్యమని వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయి. ఇకనైనా అధికార పార్టీ నేతలు స్పందించాల్సిన సమయంలో చొరవ చూపించాలని, న్యాయమైన హక్కుల కోసం పోరాడాల్సిన ఆవశ్యత ఉంది. -
గ్రూపులు కలవవ్.. పదవులు రావ్..
నెల్లూరు: పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినా.. తమ్ముళ్లకు పదవులు అందని ద్రాక్షలా మారాయి. తమ్ముళ్ల మధ్య ఉన్న తగాదాలతో నామినేటెడ్ పదవుల భర్తీ వాయిదాపడుతూనే వస్తోంది. పదవులపై ఆశలు పెట్టుకున్న తమ్ముళ్లు కొందరు తీవ్ర నిరుత్సాహంతో ఉండటంతో పార్టీ పదవులు కట్టబెట్టి సంతృప్తిపరచేందుకు టీడీపీ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ఆ మేరకు నెల్లూరు జిల్లా నేతలు కమిటీ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తోంది. అయితే ఇప్పటివరకు నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు. పదవుల కోసం నెల్లూరు జిల్లా నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మె ల్సీ, నూడా, ఆర్టీసీ చైర్మన్, 10 మార్కెట్ కమిటీలు, 7 దేవాలయాలకు పాలకమండళ్ల నియామకం జరగాల్సి ఉంది. వీటి భర్తీకి సంబంధించి జాబితాను సిద్ధం చేసి అధినేత బాబుకు అందించారు. అయితే జాబితా వడపోసి తీసుకురావాలని ఆదేశించినట్లు సమాచారం. ముగ్గురు మూడు దారులు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారి జాబితా వడపోత చేయాలంటే మంత్రి నారాయణ, ఆదాల, సోమిరెడ్డి, బీదా రవిచంద్ర బేటీ కావాల్సి ఉంది. అయితే వీరిలో మంత్రి, బీదా ఒకవర్గం అయితే.. మిగిలిన ఇద్దరు చెరో వర్గంగా తయారైనట్లు టీడీపీవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు, ఆదాల ఓ వర్గం, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జడ్ శివప్రసాద్, కిలారి వెంకటస్వామి, రూరల్‌కు చెందిన కొందరు నేతలు సోమిరెడ్డ్డితో ఉంటున్నారు. బీదా, అనూరాధ, రమేష్‌రెడ్డి, చాట్ల నరసింహరావు మంత్రి వర్గంగా ముద్ర ఉంది. ఈ మూడు వర్గాలు సమావేశమై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురు ఒక్కటయ్యే అవకాశమే లేద ని టీడీపీ శ్రేణుల అభిప్రాయం. అందుకే నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగటం లేదని తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూడాపై కమలనాధుల కన్ను నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఒకరికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రిని చేయాలని సీఎం ఆలోచన. అందుకు రవి చంద్ర పేరు దాదాపు ఖరారైందనే ప్రచా రం ఉంది. మరొకటి ఇచ్చేపనైతే సోమిరెడ్డికి ఇవ్వొచ్చు. ఎమ్మెల్సీ పదవి సోమిరెడ్డికి రాకుండా చేయాలని ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే సోమిరెడ్డి మాత్రం టీడీపీలో తనకున్న పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా నూడా చైర్మన్ పదవి దాదాపు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూరాధకు ఖరారైనట్టేనని పార్టీవర్గాలంటున్నాయి. అయితే ఈ పదవిపై కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నూడా చైర్మన్ పదవి జాబితాలో వెంకయ్యనాయుడు కుమార్తె పేరు తెరపైకి వచ్చింది. జిల్లాకు చెందిన కొందరు కమలనాథులు నూడా పదవి తమ వారికే ఉంటే జిల్లాలోని పార్టీ నేతలకు కొంత బలం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆర్టీసీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు కిలారి వెంకటస్వామినాయుడు లేదా పమ్మిడి రవికుమార్ చౌదరి పోటీపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించే యత్నం నామినేటెడ్ పదవుల భర్తీ విషయం ఇం కా కొలిక్కిరాకపోవటంతో పార్టీ పదవులపై అధినేత దృష్టిసారించినట్లు సమాచా రం. జిల్లాకు చెందిన తమ్ముళ్లు ఒక్కటవ్వకపోవటంతో కనీసం పార్టీ పదవులను కట్టబెట్టి కార్యకర్తలను సంతృప్తిపరచాలని నిర్ణయం తీసుకునట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో స్థానికసంస్థల ఎన్నికల కు సంబంధించి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవిని రెడ్డి సామాజికవర్గానికి కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఆ పదవికి పెళ్లకూరు పేరు వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలతో పాటు, గ్రా మ, మండల, డివిజన్, జిల్లా కమిటీల నియామకాలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. -
..ఫోనొస్తే వణుకే
అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. అధికారులను ఇంట్లో పనివారిగా జమకడుతూ.. చెప్పినట్లు వినాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. నేతల మాటల తీవ్రత, వారు ఉపయోగిస్తున్న పదజాలానికి అధికారులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బయట పడి కొందరు, చెప్పుకోలేక మరికొందరు తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి ఫోన్ వస్తే చాలు వణికి పోతున్నారు. రాజకీయ పెత్తనం ఇలానే కొనసాగితే ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదని, అర్హులకు అన్యాయం చేయూల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తమ అస్మదీయులకు మేలు చేసేలా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులు హుకూం జారీ చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని చెబుతున్న తహశీల్దార్లపై భౌతిక దాడికిదిగడం, పరుష పదజాలంతో దుర్భాషలాడం చేస్తున్నారు. దీంతో ఒత్తిళ్లు తాళలేక జిల్లాలో ఇప్పటికే నలుగురు తహశీల్దార్లు సెలవులో వెళ్లారు. మరో ఏడుమంది తహశీల్దార్లు ఏ క్షణమైనా సెలవులో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు అధికారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ప్రతీ ఆదాయ వనరు తమకే దక్కాలనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు చెందిన రేషన్ డీలర్ల తొలగింపు, కొత్తవారి నియామకం, ఇసుక అక్రమ రవాణా అంశాల్లో వీఆర్వో నుంచి ఆర్డీవోల దాకా అధికారులందరిపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి. పైగా పరిటాల సునీత పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉండటంతో టీడీపీ నేతలు పట్టపగ్గాల్లేకుండా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,886 మంది రేషన్‌డీలర్లు ఉన్నారు. వీరిలో సింహ భాగం 2004-05 నుంచి రేషన్‌డీలర్లుగా కొనసాగుతున్నారు. దాదాపు వీరంతా కాంగ్రెస్ పార్టీ హయూంలో నియమితులైనవారే. వీరిలో చాలా మంది కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తే... కొంత మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ గ్రామంలోనూ రేషన్ డీలర్లను తొలగించే కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు పూనుకున్నారు. వారి స్థానంలో తమ అస్మదీయులను నియమించేలా అధికారులకు హకూం జారీ చేశారు. మంత్రి పరిటాల సునీత కూడా టీడీపీ నేతలు సూచించిన వారికే రేషన్‌షాపులు కట్టబెట్టాలని జిల్లా అధికారులకు మౌఖికంగా ఆదేశించారు. దీంతో దాదాపు అన్నిచోట్లా పాత డీలర్ల స్థానంలో కొత్త వారిని నియమించారు. ఇందులో కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో కొత్తగా నియమితులైన వారిని తప్పించి తిరిగి పాత వారికే రేషన్‌షాపులను స్థానిక తహశీల్దార్లు కట్టబెట్టారు. ఈ పరిణామాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక, తహశీల్దార్లపై ప్రతాపాన్ని చూపుతున్నారు. గుడిబండ తహశీల్దార్ వే ణుగోపాల్పై భౌతిక దాడికి పాల్పడ్డారు. బ్రహ్మసముద్రం, కుందుర్పి, ధర్మవరం తహశీలార్లను కూడా తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో వీరంతా సెలవులో వెళ్లిపోయారు. ఇసుక తవ్వకాలపై కూడా ఒత్తిళ్లు జిల్లాలో అధికారికంగా మూడు ఇసుక రీచ్‌లు ఉన్నాయి. శింగనమల పరిధిలో ఉల్లికల్లు, తాడిపత్రి పరిధిలో చిన్న ఎక్కలూరు, ధర్మవరం పరిధిలో చిన్నచిగుళ్ల రేవు రీచ్‌లు ఐకేపీ సంఘాలకు కట్టబెట్టారు. ఇక్కడ మినహా వేరేచోట ఎక్కడా తవ్వకాలు జరపకూడదు. పెట్టుబడి లేకుండా రోజూ లక్షల రూపాయం ఆదాయం వచ్చే మార్గం ‘ఇసుక తవ్వకాలే’అని అధికార పార్టీ నేతలు గ్రహించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇసుక జాడ ఉన్న ప్రతీచోట అక్రమ తవ్వకాలకు తెగబడుతున్నారు. దొరికినంత దోచుకుంటున్నారు. ఈ అంశంలో కొందరు అధికారులు చూసీ చూడనట్లు పోతుంటే, ఇంకొందరు మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. తమ అక్రమార్జనకు అడ్డుపడుతున్నారనే అక్కసుతో అలాంటి తహశీల్దార్లపై విరుచుకుపడుతున్నారు. సెలవులో వెళ్లిన తహశీల్దార్లు కాకుండా మరో ఏడుగురు సెలవులో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిలో కళ్యాణదుర్గం తహశీల్దార్ గోపాల్‌రెడ్డి నేడో, రేపో సెలవులో వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులపై వేధింపుల నేపథ్యంలో ఆ సంఘం ప్రతినిధులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’ రూపొందిస్తున్నాం: నీలకంఠారెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెవెన్యూ అధికారులపై దాడులు, వేధింపులకు దిగడం దారుణం. ఏదైనా ఉంటే నిబంధనల మేరకు పని చేయించుకోవాలి. వినకపోతే ఉన్నతాధికారులకు చెప్పాలి. ప్రజాస్వామిక పద్ధతులలో వ్యవహరించాలి. అంతేకానీ దాడికి దిగడం, తిట్టడం సరికాదు. ఇప్పటికే గుడిబండ ఘటనపై ఫిర్యాదు చేశాం. రాష్ట్ర అధ్యక్షునికి పరిస్థితిని వివరించాం. భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నాం. జిల్లాలో సెలవు పెట్టిన తహశీల్దార్ల పరిస్థితి ఇది: మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలంలో కాంగ్రెస్ హయాంలో నియమించిన రేషన్డీలర్లను టీడీపీ నేతలు తొలగించారు. అందులో ఇద్దరు డీలర్లు కోర్టుకు వెళ్లడంతో వాళ్లను అలాగే కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను తహశీల్దార్ వేణుగోపాల్ అమలు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు తహశీల్దార్‌పై భౌతిక దాడికి దిగారు. 15 రోజుల పాటు కోమాలో ఉన్న నాయక్ వేణుగోపాల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం ఎర్రగొండాపురంలో 150 ఎకరాల పొలంపై కోర్టు తీర్పును ధిక్కరించి, నిబంధనలకు విరుద్ధంగా అడంగల్‌లో తమ పేర్లు చేర్చాలని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా తహశీల్దార్ హరిలాల్నాయక్ను ఒత్తిడి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తాను ఏ పని చేయలేనని చెప్పినందుకు ఇతన్ని తీవ్రంగా తిట్టారు. ఇసుక వ్యవహారంలో కూడా తమకు అనుకూలంగా వ్యవహరించలేదని టీడీపీలోని మరోవర్గం కూడా ఇదేరీతిలో వ్యవహరించింది. దీంతో ఈ నెల 26 నుంచి తహశీల్దార్ సెలవులో వెళ్లారు. కుందుర్పి మండలం వడ్డెపాళెంలో ఓ టీడీపీ నేత దళితులకు చెందిన అసైన్డ్ పొలాలను కొనుగోలు చేశారు. వీటికి పాసుపుస్తకాలు ఇవ్వాలని తహశీల్దార్ వెంకటనారాయణపై ఒత్తిడి తెచ్చారు. దళితుల అసైన్డ్ పొలాలు కొనుగోలు చేయడం నేరమని, పైగా వాటికి పాసుపుస్తకాలు ఇవ్వడం కుదరదని తహశీల్దార్ చెప్పారు. దీంతో తహశీల్దార్‌ను పరుష పద జాలంతో దూషించారు. దీంతో ఆయన 26 నుంచి సిక్ లీవ్ పేరుతో వెళ్లారు. ధర్మవరంలో రేషన్‌డీలర్ల చిచ్చుతోనే తహశీల్దార్ కేశవనాయుడు సెలవులో వెళ్లిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ హయాంలో నియమించిన రేషన్ డీలర్లను తొలగించి, టీడీపీ సానుభూతి పరులకు కట్టబెట్టారు. ఇందులో 30 మంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో తిరిగి పాత వారిని నియమించారు. దీనిపై ఎమ్మెల్యే వరదాపురం సూరి తహశీల్దార్‌పై తీవ్రంగా స్పందించి చేతకాకపోతే సెలవులో వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతోనే నాయుడు సెలవులో వెళ్లిపోయారు. నాయుడు రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. -
నామినేటెడ్ శిరోభారం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నామినేటెడ్ పోస్టుల భర్తీ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలకు తలనొప్పిగా పరిణమించింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలను తీసు కోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుకు సూచించారు. దీనిపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ కూడా చేయడంతో నియోజకవర్గాల్లో ఆశావహుల హడావుడి ప్రారంభమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడప్పుడూ మంత్రులు ప్రత్తిపాటి, రావెల కిషోర్, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీని కలుస్తున్నారు. మంత్రుల కంటే కోడెల, జీవీలను కలిసే ఆశావహుల సంఖ్య అధికంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన నేతల్లో ఎక్కువ మంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కోరుతున్నారు. ఆయా కార్పొరేషన్ పదవుల పరిధి, ప్రాధాన్యత, ఆదాయ వ్యయాల వివరాలను సేకరిస్తున్నారు. మరి కొందరు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవసరమైన ఖర్చు పెట్టుకోగలమని చెబుతూ ఎమ్మెల్యేలు, ఇతర నేతల మద్దతు కోరుతున్నారు. ద్వితీయశ్రేణి నాయకులు మార్కెట్ కమిటీ, దేవాలయాల కమిటీ చైర్మన్ పదవులను కోరుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందిన గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం పార్టీలోని పలువురు సీనియర్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కంచేటి శివప్రసాద్, మన్నవ సుబ్బారావు, మద్దాల గిరి, బోనబోయిన శ్రీనివాస యాదవ్ తదితరులు ఆశిస్తున్నారు. వీరంతా చిరకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారు. జిల్లాలోని మిగిలిన నామినేటెడ్ పోస్టుల కంటే మార్కెట్‌యార్డు చైర్మన్ పదవికి అత్యధిక ప్రాధాన్యం ఉండటంతో తమ వర్గానికి ఈ పదవి దక్కాలనే ఉద్దేశంలో పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరి కొందరు ఆ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజా మాస్టారు, చందు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ ఈ పదవి కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా వీలైతే కార్పొరేషన్ లేకుంటే ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారు. జిల్లా మంత్రులు, శాసన సభ్యుల సహకారం కోరుతూ టచ్‌లో ఉంటున్నారు. మరి కొందరు రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్న ‘క్రీడా’ (సీఆర్డీఏ)లో సభ్యునిగా నామినేట్ అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్న వాతావరణం పార్టీలో కనపడుతోంది. జిల్లాలోని మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్ పదవులు, దేవాలయాల ట్రస్టు బోర్డు చైర్మన్ పదవులను నియోజకవర్గ స్థాయి నాయకులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వీరంతా ముఖ్య భూమిక వహిస్తున్నారు. శాసన సభ్యుల సిఫారసులతోపాటు పార్టీకి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండటంతో ప్రస్తుత సభ్యత్వ నమోదులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండటంతో ఈ కమిటీ పదవులను ఆశిస్తున్న నేతలంతా సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొంటున్నారు.ఇప్పటి వరకు జిల్లాలో ఆరు లక్షల వరకు సాధారణ సభ్యత్వ నమోదు జరగడానికి కూడా నామినేటెడ్ పదవుల భర్తీ కూడా ఒక కారణమనే అభిప్రాయం పార్టీలో వినపడుతోంది. -
మాకే దక్కాలి..
సాక్షి, రాజమండ్రి : ‘పింఛన్లు ఎక్కడ ఎలా ఇచ్చారన్నది కాదన్నయ్యా.. మనవాళ్లకు ఇస్తున్నారా లేదా అనేదే లెక్క’ అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆధార్ కార్డుల్లో వయసు తక్కువగా నమోదై పింఛను కోల్పోయిన వారి కోసం జిల్లాలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో శుక్రవారం వయసు ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు చేయాల్సినవారి జాబితాను ముందుగానే వైద్యులకు అధికారులు పంపించారు. అధికార పార్టీవారే ఉండేలా ఈ జాబితాలు రూపొందించారు. వాటి ప్రకారం అభ్యర్థులను ఆస్పత్రులకు రప్పించి ధ్రువీకరణ చేయించారు. కేవలం ఆధార్‌లో తప్పుడు వయసు నమోదు కారణంగా పింఛను ఆగిపోతే నిజమా కాదో తెలుసుకునేందుకు తమను పిలవలేదేమిటని ముదుసలులు వాపోతున్నారు. పింఛన్ల కోత తీరు ఇలా... జిల్లాలో 2013 జూలై నాటికి అన్ని రకాల పింఛన్లూ కలిసి 4.75 లక్షలు ఉండేవి. ఎన్నికల వాగ్దానంలో భాగంగా టీడీపీ ప్రభుత్వం అక్టోబర్ రెండు నుంచి పింఛన్ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లబ్ధిదారుల జాబితాల పరిశీలన చేపట్టి, అనర్హుల పేరుతో సుమారు 1.04 లక్షల పింఛన్లు తొలగించింది. వీటిలో ఒక్క వృద్ధాప్య పింఛన్లే 40 వేలు పైగా ఉన్నాయి. ఆధార్ కార్డు ఆధారంగా సర్వే చేయగా వీరందరూ బినామీలుగా తేలారని ప్రభుత్వం పేర్కొంది. కానీ వాస్తవానికి కారణాలు చెప్పకుండా కొందరికి, ఆధార్ కార్డుల్లో వయసు తప్పుగా ఉందని మరికొందరికి పింఛన్లు తొలగించారు. వయసు తప్పుగా నమోదై తొలగించిన వివిధ రకాల పింఛన్లు సుమారు 45 వేలు పైగా ఉన్నట్టు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. లబ్ధిదారుల ఆందోళనకు తలొగ్గిన జిల్లా అధికారులు ఆధార్‌లో వయసు తప్పుగా ఉన్నప్పటికీ వైద్య పరీక్షల ద్వారా వయసు నిర్ధారణ చేసి అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఆ ప్రకారం రాజమండ్రి వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రితో పాటు పెద్దాపురం, ప్రత్తిపాడు, వై.రామవరం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రామచంద్రపురం, తుని, అమలాపురం, రాజోలు, కొత్తపేట, అనపర్తి ఏరియా ఆస్పత్రుల్లో వృద్ధులకు వైద్యులు శాస్త్రీయ పద్ధతిలో వయసు నిర్ధారణ చేశారు. ముందుగా ఇచ్చిన జాబితాల ప్రకారం.. ఈ పరిశీలనకు వైద్యులకు ముందుగా రూపొందించిన జాబితాలు అందజేశారు. వాటిలో పేర్లున్నవారు మాత్రమే వయసు పరిశీలకు అర్హులయ్యారు. అర్హులపేర్లు మాత్రం జాబితాల్లో లేవు. పెద్దాపురం, తుని, రామచంద్రపురం, అనపర్తి తదితర ప్రాంతాల్లో సుమారు 700 పైగా లబ్ధిదారులకు 65 ఏళ్లు పైబడి ఉన్నా, రెండు నెలల క్రితం వరకూ పింఛను పొందుతున్నా, వయసు తేడా పేరుతో వాటిని తొలగించారు. ఇప్పుడు విషయం తెలుసుకున్న వీరంతా తమ ఆధార్ కార్డులు, వయసు ధ్రువపత్రాలు పట్టుకుని ఆస్పత్రులకు వెళ్లారు. కానీ, జాబితాలో వారి పేర్లు లేవని తిప్పి పంపేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. వైద్య పరిశీలనకు వెళ్లేవారి జాబితాలను గ్రామాలవారీగా టీడీపీ కార్యకర్తలే దగ్గరుండి తయారు చేయించారని తెలుస్తోంది. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న వార్డులు, డివిజన్లను వదిలి తమకు ప్రాతినిధ్యం లభించిన వార్డుల్లోనివారి పేర్లను జాబితాలో చేర్చారు. వ్యతిరేకుల పేర్లు జాబితాలకు ఎక్కకుండా చూశారు. -
చక్రం తిప్పుదాం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగేందుకు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. పార్టీలో ప్రత్యర్థులపై అంతర్గతంగా పైచేయి సాధిస్తూనే రాష్ట్రస్థాయిలో ముఖ్య పదవుల కోసం పోటీ పడుతున్నారు. మంత్రి పదవి దక్కితేనే రాష్ట్రంలో చక్రం తిప్పొచ్చని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు. పీసీసీ పదవిపై మాజీ మంత్రి డీకే అరుణ, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వంపై రేవంత్‌రెడ్డి కన్నేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా కీలక స్థానాలకు ఎగబాకేందుకు జిల్లాకు చెందిన నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో తాము కొనసాగుతున్న పార్టీల్లో గుర్తింపు తెచ్చుకున్న నేతలు ప్రస్తుతం, రాష్ట్ర రాజకీయాలపై కన్నేశారు. టీఆర్ఎస్కు జిల్లా నుంచి ఏడుగురు శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఒక్కరికీ కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ముగ్గురు నేతలు మంత్రి పదవిని ఆశిస్తున్నా, ఇందులో ఇద్ద రు మాత్రం పదవిని ఆలంబనగా చేసుకుని రాష్ట్రస్థాయిలో బలమైన నేతలుగా ఎదగాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర స్థాయిలో తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన జూపల్లి కృష్ణా రావు జిల్లా రాజకీయాల్లో పైచేయి సాధిం చేందుకు మంత్రి పదవి తోడ్పడుతుందనే సమీకరణాలు వేసుకుంటున్నారు. ఉద్యోగ సం ఘం నేతగా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన శ్రీనివాస్‌గౌడ్ మంత్రివర్గంలో చోటు దక్కితే మరింత బలమైన నేతగా ఎదగవచ్చని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నిరంజన్‌రెడ్డి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే కీలక పదవి దక్కేదని పార్టీ నేతలు చెప్తుంటారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న నిరంజన్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో రాష్ట్రస్థాయిలో కీలక పదవి దక్కుతుందనే భరోసాతో ఉన్నారు. పీసీసీ పదవిపై డీకే కన్ను జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను శాసించిన డీకే అరుణ ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంత్రిగా పనిచేసిన కాలంలో జిల్లాలో పార్టీపై పట్టు సాధించడమే కాకుండా మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి ధీటుగా పావులు కదిపారు. 2014 సాధారణ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన డీకే అరుణ ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. కుటుంబ నేపథ్యం, వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, సామాజికవర్గం కోణంలోనూ తనకు అవకాశం దక్కుతుందనే కోణంలో డీకే అరుణ ఎత్తుగడలు వేస్తున్నారు. తెలంగాణలో జిల్లాలవారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు, వాని పనితీరును విశ్లేషించిన తర్వాత రాబోయే రోజుల్లో తాను కీలక నేతగా ఎదగడం ఖాయమనే అభిప్రాయంతో డీకే అరుణ ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విద్యుత్ కోతలపై ‘మహాధర్నా’ నిర్వహించడం ద్వారా జిల్లాలో పార్టీపై తనకున్న పట్టు, తన ప్రాధాన్యతను కూడా వెల్లడించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎల్పీ నేతగా రేవంత్? తెలంగాణలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాత్రం తెలుగుదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే అంచనాలో ఉన్నారు. ఇప్పటికే పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన రేవంత్‌రెడ్డి శాసనసభలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వం చేపట్టాలనే భావనలో ఉన్నారు. సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్, ఎర్రబెల్లిది ఒకే సామాజికవర్గం కావడంతో తనకు అవకాశం దక్కుతుందనే అంచనాలో ఉన్నారు. శాసనసభ సమావేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా పైచేయి సాధించి తెలంగాణ టీడీపీకి భవిష్యత్తులో తానే పెద్ద దిక్కు అనే భావన కలిగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటీ సౌమ్యుడిగా ముద్ర పడడం కూడా తనకు అనుకూలిస్తుందని రేవంత్ అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జిల్లాకు చెందిన నేతలు రాష్ట్రస్థాయిలో కీలక నేతలుగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తి రేపుతున్నాయి. -
ఎన్టీఆర్ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తెలుగుదేశం తరపున ఆర్థిక సహాయం అందించేందుకు ఎన్టీఆర్ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఇటీవల బస్సుయాత్ర ద్వారా పరామర్శించామని, వారి ఆర్థికంగా ఆదుకోవాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన పార్టీ నేతలు ఎర్రబెల్లి ద యాకర్ రావు, పి.రాములుతో కలసి విలేకరులతో మాట్లాడారు. రూ. 2 కోట్లతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిధికి దాతల నుంచి విరాళాలు సేకరిస్తామని, తెలంగాణ రైతుల కోసం ఎవరైనా సాయం చే యవచ్చని పేర్కొన్నారు. ఒక్కో బాధిత రైతు కుటుంబానికి ఈ నిధి ద్వారా రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. -
పేదల నోరు కొట్టడమే ప్రభుత్వ లక్ష్యం
పలమనేరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చి నాలుగు నెలలవుతున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, పేదల నోరు కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి విమర్శించారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లతో కలసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్న పథకాలను ఊడగొట్టేందుకు ఈ ప్రభుత్వం కమిటీలు, విచారణల పేరిట నాటకమాడుతోందన్నారు. ఇప్పటికే పాలన అస్తవ్యస్తమైందని, కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లకే పరిమితమయ్యారని అన్నారు. గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకుండా ఉన్న వాటిని తొల గించేందుకు విచారణ పేరిట కొత్త డ్రామాను తెరమీదికి తెచ్చిందని దుయ్యబట్టారు. మొత్తం మీద ఏ కార్యక్రమం చేసినా ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే మేలు జరిగేలా పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రజల ద్వారా గెలుపొందిన ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి అధికార పార్టీ వారితో జన్మభూమి కోసం కమిటీలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా బాండ్లను ఇస్తే వాటిని నేలకేసి రాసుకోవాలా అని మండిపడ్డారు. ఆ బాండ్లు మెచ్యూర్డ్ అయ్యాక డబ్బు తీసుకోవచ్చని, అంతవరకు తీసుకున్న రుణాలు కట్టాల్సిం దేనని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓ వైపు రైతులు, మరో వైపు పింఛన్‌దారులు, ఇంకో వైపు డ్వాక్రా మహిళలు ఆగ్రహంతో రగిలిపోతుంటే ఏ మొహం పెట్టుకొని జన్మభూమి కోసం గ్రామాల్లోకెళ్తారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకొచ్చాక రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో కార్పొరేటర్ల పెత్తనం సాగిందని ఆరోపించారు. మొత్తం మీద ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చాంద్‌బాషా, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ముహూర్తం ఆలస్యం?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి చుక్కెదురైంది. దసరా రోజున గులాబీ గూటికి చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్న తీగల.. లాంఛనప్రాయంగా పార్టీ ముఖ్యుల అభిప్రాయం కూడా తెలుసుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తన కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. పార్టీ మారాలనే నిర్ణయం సరికాదని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్లో చేరాలనే అంశంపై ముఖ్య నేతల నుంచి ప్రతిఘటన ఎదురుకావడం... మీరెళ్లినా పార్టీకెలాంటి నష్టంలేదని మెజార్టీవర్గం తెగేసి చెప్పడంతో డైల మాలో పడ్డ కృష్ణారెడ్డి... కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా అభిప్రాయసేకరణ జరిపిన తీగల... టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని, ఈ విషయంలో తనను వెన్నంటి నిలబడాలని అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అవసరమని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా సమృద్ధిగా నిధులు రాబట్టలేమని, అధికారపార్టీలో చేరితే ఈ సమస్య పరిష్కారమవుతుందని వివరించారు. అయితే, ఎమ్మెల్యే అభిప్రాయంతో ఏకీభవించని తమ్ముళ్లు... గతంలో దేవేందర్‌గౌడ్ పార్టీని వీడినా ఆయన వెంట తాము వెళ్లలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘మీకిష్టమైతే పార్టీ మారండి... మేం మాత్రం ఇదే పార్టీలో కొనసాగుతాం’ అని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న తీగల కృష్ణారెడ్డి ఈ అంశంపై మరోసారి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ప్రస్తుతానికి టీడీపీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. మారడం ఖాయం..! సన్నిహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా తీగల కృష్ణారెడ్డి మాత్రం టీడీపీలో కొనసాగే అవకాశాలు స్వల్పంగానే ఉన్నట్లు మంగళవారం జరిగిన పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. పార్టీ మారుతారనే ఊహాగానాలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీగలకు కబురుపంపారు. ఈ మేరకు చంద్రబాబును కలిసిన కృష్ణారెడ్డి పార్టీ మారే అంశంపై వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. అక్కడి నుంచి నేరుగా మీర్‌పేటలోని తన కళాశాలలో పార్టీ సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందే టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయంపై కొందరు నేతలను ఒప్పించారు. తన అనుకూలవర్గీయులతో వ్యక్తిగతంగా మాట్లాడిన ఆయన... టీఆర్ఎస్లో చేరితే కలిగే లాభనష్టాలను వివరించారు. ఈ మేరకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారు చేసుకున్నారు. అయినప్పటికీ, కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోకుండా పార్టీ మారారనే ఆరోపణలు రాకుండా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంలో ఊహించనిస్థాయిలో ప్రతికూలత రావడంతో సందిగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ వీడబోనని ‘జై తెలుగుదేశం’ నినాదం చేస్తూ సమావేశాన్ని ముగించిన ఆయన... రాత్రి పొద్దుపోయేవరకు కూడా ముఖ్య నేతలను తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ అయి, టీఆర్ఎస్లో చేరే అంశంపై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ తాజా పరిణామాలను గమనిస్తే... కారెక్కడం ఖాయంగానే కనిపిస్తున్నా... ముహూర్తం మాత్ర ం ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. హెచ్ఎండీఏ చైర్మన్ పదవి కట్టబెడుతామనే ఆఫర్‌తోనే తీగలకు వల వేశారని ప్రచారం జరుగుతుండగా, కేవలం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన కార్యకర్తలకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. -
కదం తొక్కినఆదర్శరైతులు
విశాఖపట్నం : ఆదర్శ రైతులు కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. జీవో నెం.43ను వెనక్కి తీసుకుని ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించాలని నినాదాలు చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆదర్శ రైతుల సంఘం అధ్యక్షుడు బుద్ద ఆదినాయుడు మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫారసు మేరకు అవతరించిన ఆదర్శ రైతు వ్యవస్థ వల్ల మండలాల్లో వ్యవసాయాభివృద్ధిపై రైతులకు అవగాహన పెరిగిందన్నారు. వ్యవసాయాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఆదర్శ రైతు వ్యవస్థను తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమన్నారు. ఎప్పటికైనా తమ గౌరవ వేతనం పెరిగి రెగ్యులర్ అవుతుందన్న ఆశతో పనిచేస్తున్నామన్నారు. తమలో డిగ్రీ, పీజీ చదివిన వారు కూడా ఉన్నారని, గౌరవ వేతనం రూ.1000కి పెంచి పని కల్పిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక దశలో కలెక్టరేట్‌లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ ఎదుట కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు ఆదర్శ రైతులను పోలీసులు అరెస్టు చేసి విశాఖ మహారాణి పేట పోలీస్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బోర రవి, చోడవరం మండల అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, సీహెచ్. పైడితల్లినాయుడు, వందల సంఖ్యలో ఆదర్శ రైతులు పాల్గొన్నారు. -
నాన్న మంచితనమే గెలిపించింది
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక కౌంటింగ్ దివంగత తంగిరాల ప్రభాకరరావు కుమార్తెకు పట్టం 74,827 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్‌కు దక్కిన డిపాజిట్ ‘నోటా’కు మూడో స్థానం నందిగామ : తన తండ్రి దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మంచితనం వల్లే ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందానని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ నెల 13న నందిగామ(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్‌ను మంగళవారం స్థానిక కేవీఆర్ కళాశాలలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో 1,84,064 ఓట్లు ఉండగా, 1,27,434 ఓట్లు పోలయ్యాయి. సౌమ్యకు 99,748 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్లుగా పోటీచేసిన కటారపు పుల్లయ్యకు 941, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావు నుంచి ధ్రువీకరణపత్రం అందుకున్న అనంతరం సౌమ్య మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఆశయ సాధన కోసం పని చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించడం కూడా తన గెలుపునకు దోహదపడినట్లు ఆమె తెలిపారు. తన గెలుపునకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులకు సౌమ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యకర్తలతో కలసి ర్యాలీగా స్థానిక రైతుపేటలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సౌమ్య మంత్రి ఉమాకు పాదాభివందనం చేశారు. కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంచారు. అక్కడి నుంచి తంగిరాల ప్రభాకరరావు ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. మంత్రి ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు టీడీపీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని చెప్పారు. ప్రతి రౌండ్లోనూ మెజారిటీ నందిగామ కేవీఆర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ నుంచి ఉదయం 8 గంటలకు ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి కౌంటింగ్ సిబ్బందికి అందజేశారు. ఎన్నికల రిటర్సింగ్ అధికారి రజనీకాంతరావు కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సమయంలో సిబ్బంది అవకతవకలకు పాల్పడితే సస్పెండ్ చేయటంతోపాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, అబ్జర్వర్ సాగర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరిగింది. కలెక్టర్ రఘునందన్‌రావు, ఎస్పీ విజయ్‌కుమార్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య చివరి 15వ రౌండ్ వరకు ఆధిక్యంలోనే కొనసాగారు. అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, ఎన్నికల అబ్జర్వర్ సాగర్, తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మాకు గెలుపు, ఓటములతో పనిలేదు : బోడపాటి తమకు గెలుపు, ఓటములతో సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబూరావు అన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఎన్నికల్లో పోటీ చేశామని వివరించారు. గత ఎన్నికల్లో రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చిన తమ పార్టీకి ఉప ఎన్నికల్లో 24,921 ఓట్లు లభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేల్పుల పరమేశ్వరరావు, గింజుపల్లి అనిల్, జాఫర్ పాల్గొన్నారు. డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకుంది. టీడీపీ పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్యకు 74,827 భారీ మెజారిటీ రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావుకు 24,921 ఓట్లు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల్లో ఊరట లభించింది. మూడో స్థానంలో ‘నోటా’ నందిగామ ఉప ఎన్నికల్లో మూడో స్థానం ‘నోటా’కు లభించింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కటారపు పుల్లయ్యకు 941 ఓట్లు, మాతంగి పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. కానీ, నోటా గుర్తును 1,177 మంది నొక్కారు. దీంతో మూడో స్థానం ‘నోటా’కు లభించినట్లయింది. -
యల్లమందలో టీడీపీ దాష్టీకం
యల్లమంద (నరసరావుపేట రూరల్) : అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండాపోతోంది. అదను దొరికితే వైఎస్సార్ సీపీ నాయకులపై అకారణంగా దాడులకు దిగుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికలు ముగిసి మూడు నెలలవుతున్నా టీడీపీ వర్గీయులు అకారణంగా వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా అధికార టీడీపీ నాయకులు మారణాయుధాలు, గొడ్డళ్లతో వైఎస్సార్ సీపీ నాయకులపై దాడికి పాల్పడిన ఘటన యల్లమంద గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్సార్ సీపీ నాయకులు గాయపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ముప్పాళ్ళ కృష్ణారావు, ముప్పాళ్ళ లక్ష్మయ్య, చల్లా వెంకటేశ్వర్లు తమ బంధువు ములసా వెంకటేశ్వర్లు ఇంట్లో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై గ్రామంలోని తూర్పుబజారుకు బయలుదేరారు. మార్గంమధ్యలో టీడీపీ నాయకుడు ఉప్పుటూరి శంకరయ్య ఇంటి వద్దకు వెళ్లేసరికి శంకరయ్యతోపాటు ఆ పార్టీ నాయకులు పాములపాటి వాసు, కడియాల శ్రీను, మానుకొండ నిరంజన్, మానుకొండ రామకృష్ణ, చుండూరి రాజు, మానుకొండ కోటయ్య, కొల్లా కిషోర్‌లు మూకుమ్మడిగా పరుష పదజాలంతో వారిని దూషించారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మీరు నాయకులా.. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు రిగ్గింగ్ చేయకుండా అడ్డుకుంటారా.. మీ అంతు చూస్తామంటూ మారణాయుధాలతో దౌర్జన్యానికి దిగారు. వారిలో ఒకరు గడ్డపలుగు తీసుకుని కృష్ణారావు మీదకు వెళ్లగా ఆయన ప్రాణభయంతో పరుగుపెట్టాడు. టీడీపీ నాయకులు వెంటపడి గొడ్డలితో కృష్ణారావు ఎడమకాలుపై నరికారు. ఇనుపరాడ్లతో ఇష్టారాజ్యంగా కొట్టారు. అడ్డుకోబోయిన లక్ష్మయ్య, వెంకటేశ్వర్లుపైనా దాడికి దిగారు. కృష్ణారావు తీవ్రంగా, మిగిలిన ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ రమేష్ సిబ్బందితో యల్లమంద గ్రామానికి వెళ్లి బందోబస్తు నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ యల్లమంద గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడి జరిగిందన్న సమాచారం మేరకు ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, ఇక్కుర్రు గ్రామ సర్పంచ్ పదముత్తం చిట్టిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు మూరె రవీంద్రారెడ్డి, షేక్ పొదిలిఖాజా, జగన్మోహన్రెడ్డి, ముప్పాళ్ళ నాగేశ్వరరావు తదితరులు ఏరియా వైద్యశాలకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఎంపీపీ ప్రభాకరరావు మాట్లాడుతూ టీడీపీ వర్గీయుల దౌర్జన్యానికి ఇలాంటి సంఘటనలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
రాజమండ్రి ‘దేశం’లో కో ఆప్షన్ కలకలం
సాక్షి, రాజమండ్రి : నగర పాలక మండలి (కౌన్సిల్) కో ఆప్షన్ సభ్యత్వాల ఎన్నికల వ్యవహారం అధికార తెలుగుదేశంలో కలకలానికి కారణమవుతోంది. అయిదు కో ఆప్షన్ సభ్యత్వాల్లో నామినేట్ చేసే రెండు పదవులు పోను మిగిలిన మూడింటినీ తనకు అత్యంత సన్నిహితులైన వారికే కట్టబెట్టాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరాట పడుతున్నారు. అయితే మూడు సభ్యత్వాల కోసం ఆ పార్టీ నుంచే ఆరుగురు పోటీ పడుతుండగా, మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఇద్దరు బరిలో ఉన్నారు. మరో రిటైర్డ్ అధికారి కూడా గోరంట్ల సహకారం పొంది, కౌన్సిల్లో కూర్చోవాలని ఆశపడుతున్నారు. కౌన్సిల్లో మొత్తం అయిదుగురు సభ్యులను చేర్చుకోవలసి ఉండగా అందులో రెండు సభ్యత్వాలు (మైనారిటీ పురుషుడు, మైనారిటీ మహిళ) నామినేషన్ ప్రాతిపదికన భర్తీ అవుతాయి. మిగిలిన ముగ్గురూ ఎన్నిక కావలసి ఉంటుంది. ఆ ముగ్గురు సభ్యులనూ ఏక గ్రీవంగా ఎన్నుకునేలా చేయడంలో నేతలు విఫలమైనందున ఈ నెల 27న జరిగే పాలక మండలి ప్రత్యేక సమావేశంలో పోటీ అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉండగా వాటిలో 34 తెలుగుదేశం దక్కించుకున్నందున కో ఆప్షన్ సభ్యులు కూడా అదే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న గోరంట్ల ఎన్నిక ప్రాతిపదికన జరిగే మూడు పదవులనూ తనకు అత్యంత విధేయులైన వారికి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ తరఫున కూరాకుల తులసి, మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, గత కౌన్సిల్లో డిప్యూటీ మేయర్‌గా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ (బాక్స్ ప్రసాద్), రిటైర్డు జడ్జి సంజీవరావు, రెడ్డి మణి బరిలో ఉన్నారు. వీరిలో ముందుగా రెండు పదవులకు వెలుగుకుమారి, సంజీవరావులను ప్రతిపాదించగా తాజాగా మార్పు చేసి తన ముఖ్యఅనుచరులైన మజ్జి పద్మ, బాక్స్ ప్రసాద్, రెడ్డి మణిలకు కట్టబెట్టాలని గోరంట్ల ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా నీటిపారుదల శాఖ రిటైర్డు ఇంజనీరు చంద్రశేఖరరావు కూడా కో ఆప్షన్ సభ్యత్వం కోసం గోరంట్లతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ నాయకులు గరిమెళ్ల చిట్టిబాబు, కె.వి.పాపారావు కో ఆప్షన్ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. మూడు పదవుల్లో ఒకటి మిత్రపక్షమైన తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గోరంట్ల నామినేటెడ్ పోస్టు ఇస్తాననడం బీజేపీ వారికి రుచించడం లేదు. 27న సమావేశం గరం..గరం! రెండు నామినేటెడ్ పోస్టుల్లో ఒకదాన్ని టీడీపీకి చెందిన హబీబుల్లా ఖాన్‌కు ఇవ్వనున్నట్టు సమాచారం. టీడీపీకే చెందిన జాన్ భాషా, కరీంఖాన్ ఎవరికి వారే తమ జీవిత భాగస్వామికి రెండో పోస్టును ఇప్పించుకోవాలని పోటీ పడుతున్నట్టు సమాచారం. అయితే రెండో నామినేటెడ్ పోస్టును బీజేపీకి ఇస్తానని, ఈ నెల 26లోగా తేల్చుకోవాలని గోరంట్ల చెప్పినట్టు తెలుస్తోంది. ఆ పోస్టుకు బీజేపీలో అర్హులు ఎవరూ లేరని తెలిసే ఆయన ఈ ‘ఆఫర్’ ఇచ్చారని, అన్ని పదవులూ తన వర్గానికి దక్కాలన్నదే ఆయన వ్యూహమని చెపుతున్నారు. వాస్తవంగా జూలై మూడున జరిగిన తొలి కౌన్సిల్ సమావేశంలోనే కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే అప్పటికి అభ్యర్థులను ఎంపిక చేయలేక వాయిదా వేశారు. దీంతో ఈ నెల 27న ఆ ప్రక్రియను పూర్తి చేయడానికే ప్రత్యేకంగా నగర పాలక మండలి సమావేశం నిర్వహిస్తున్నారు. పదవుల కోసం టీడీపీ సభ్యుల మధ్య పోటీ నెలకొనడంతో సమావేశంలో వాడి వేడి వాతావరణం ఏర్పడుతుందని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. -
గదిపై ముదిరిన రగడ!
* టీడీపీపీ కార్యాలయ బోర్డు తొలగించిన తృణమూల్ * స్పీకర్ తమకు ఇచ్చారని వెల్లడి * ఆ గది 30 ఏళ్లుగా తమదేనంటున్న టీడీపీపీ సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో కార్యాలయాల కేటాయింపు వ్యవహారం తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. మంగళవారం టీడీపీపీ ఆఫీసులోకి ప్రవేశించిన తృణమూల్ ఎంపీలు దీన్ని స్పీకర్ తమకు కేటాయించినట్లు పేర్కొనటంతో వివాదం మొదలైంది. టీడీపీ వినియోగిస్తున్న ఐదో నంబర్ గదిని లోక్‌సభ స్పీకర్ గత ఆగస్టు 6న టీఎంసీకి కేటాయించారు. టీడీపీకి మూడో అంతస్తులోని గది కేటాయించారు. దీంతో కొందరు తృణమూల్ ఎంపీలు మంగళవారం ఐదో నంబర్ గది వద్దకు వచ్చి తమ పేర్లతో బోర్డులను ఏర్పాటు చేయించారు. టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలోని బోర్డులను తొలగించారు. కార్యాలయాన్ని తమకు కేటాయిస్తున్నట్టు స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను చూపుతూ కార్యాలయం లోపలికి వె ళ్లారు. మధ్యాహ్నం 2.30 గంటలప్పుడు భేటీ అయ్యారు. టీడీపీ కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నా పట్టించుకోలేదు. టీడీపీపీ నేత సుజనాచౌదరి విషయం తెలిసి అక్కడకు చేరుకున్నారు. 30 ఏళ్లుగా ఇదే కార్యాలయాన్ని టీడీపీకి కేటాయిస్తున్నారని, గత రెండు లోక్‌సభల్లోనూ తమకు ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా ఇదే కార్యాలయాన్ని కొనసాగించారంటూ వాగ్వాదానికి దిగారు. స్పీకర్ సూచించినట్లుగా 135, 136 గదులకు మారేందుకు అభ్యంతరం తెలిపారు. ఇరు పార్టీల నాయకులతో చర్చించి పరిష్కరిస్తామని స్పీకర్ హామీ ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. -
టీడీపీకి షాక్
ఎత్తుకు పై ఎత్తులు, నిముషాల వ్యవధిలో జరిగి పోయిన అనూహ్య పరిణామాలు అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చాయి. జెడ్పీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా గెలవాలనుకున్న తెలుగుదేశం ఆశలు నెరవేరలేదు. పార్టీకి ఝలక్ ఇచ్చిన పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఈదర హరిబాబు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పార్టీ అభ్యర్థిని ఒక్క ఓటు తేడాతో ఓడించడంతో పార్టీ నేతలు ఖంగు తినాల్సి వచ్చింది. ఊహించని పరిణామంతో అప్పటి దాకా గెలుపు ఉత్సాహంలో ఉన్న తెలుగుదేశం జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి అందరూ నిరుత్సాహంలో మునిగిపోయారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనూహ్య మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అడ్డదారిలో గెలవాలనుకున్న తెలుగుదేశం పార్టీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా వినియోగించకునే అవకాశం లేకుండా ఒక తప్పుడు కేసులో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించి తన కుట్రకు తెరలేపింది. గెలుపు కోసం తప్పుడు కేసు పెట్టించి పోలీసులను తెలుగు తమ్ముళ్లలాగా మార్చినా ఫలితం దక్కలేదు. గత నెల 20న ఘటన జరిగిందంటూ ఈ నెల 10వ తేదీ రాత్రి ఫిర్యాదు చేస్తే కనీసం విచారణ కూడా చేయకుండా 80 మంది పోలీసులతో ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసిన తరహాలో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించినా ఉపయోగం లేకుండా పోయింది. ఒంగోలులోని పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. కో-ఆప్షన్ సభ్యులు కూడా తమ వారే గెలవడంతో జెడ్పీ చైర్మన్ తమదే అన్న ధీమాతో ఉన్న తెలుగుదేశం పార్టీకి సొంత సభ్యుడు ఈదర హరిబాబు ఇచ్చిన ఝలక్‌తో సీన్ రివర్స్ అయ్యింది. జెడ్పీ చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవిని కూడా పోగొట్టుకున్న దేశం నేతలు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఈదర హరిబాబు అసంతృప్తితో ఉన్నాడని గుర్తించినా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక సమయంలో తెలుగుదేశం పార్టీకే ఓటు వేయడంతో వారు దృష్టి పెట్టలేదు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి కోసం కందుకూరు జెడ్పీటీసీ సభ్యుడు కంచర్ల శ్రీకాంత్‌చౌదరి టీడీపీ తరఫున డాక్టర్ మన్నె రవీంద్ర పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను మర్రిపూడి జెడ్పీటీసీ తుళ్ళూరి వెంకట నరసింహం బలపరిచారు. ఈలోగా ఈదర హరిబాబు లేచి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నానని చెప్పడంతో ఏవరైనా ప్రతిపాదించి, బలపరచాలని కలెక్టర్ సూచించారు. దీంతో వైఎస్సార్ సీపీ తన వ్యూహం మార్చుకుని తమ అభ్యర్థిని బరిలో దింపకుండా ఈదర హరిబాబుకు మద్దతు ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని కనిగిరి జెడ్పీటీసీ దంతులూరి ప్రకాశం ప్రతిపాదించగా, పెద్దారవీడు జెడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి బలపరిచారు. వైఎస్సార్ సీపీ తరఫున చైర్మన్ అభ్యర్ధిగా పోటీ చేయాల్సిన డాక్టర్ నూకసాని బాలాజీని వైస్ చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టింది. సమావేశంలోనే ఉన్న మంత్రి శిద్దా రాఘవరావు, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్యేల సమక్షంలోనే జరిగిన ఈ పరిణామాలతో వారు కొద్దిసేపు నిశ్చేష్టులయ్యారు. తర్వాత బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో అతని నామినేషన్ చెల్లదంటూ అడ్డగోలు వాదనకు దిగారు. కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నించారు. ఈ విషయంపై జాప్యం జరుగుతుండంతో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపుసురేష్ ఎన్నికల నిబంధనను ప్రత్యేకంగా చదివి వినిపిస్తూ తొందరగా ఎన్నిక నిర్వహించాలంటూ అభ్యర్థించారు. ఎన్నికల కమిషన్ సలహా తీసుకునేందుకు యత్నిస్తున్నానని, వచ్చింది రెండు నామినేషన్లే కనుక ఈదర హరిబాబు దాఖలు చేసిన నామినేషన్ విషయమై స్పష్టత కోసం వేచి ఉన్నామని చెప్పడంతో అయోమయం నెలకొంది. అయితే ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగుదేశం జెడ్పీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఈదర హరిబాబుకు అతని ఓటుతోపాటు వైఎస్సార్సీపీ అభ్యర్థులు 27 మంది మద్దతు కలిసి 28 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి అయిన మన్నె రవీంద్రకు టీడీపీ సభ్యుల 24 ఓట్లు, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన ముగ్గురు సభ్యులతో కలిసి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈదర జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ నూకసాని బాలాజీ పేరును వెలిగండ్ల జెడ్పీటీసీ రామన తిరుపతిరెడ్డి ప్రతిపాదించగా, ఇంకొల్లు జెడ్పీటీసీ పీ.వెంకట రమణ బలపరిచారు. దీంతో ఆయన కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులు 26 మంది, అతని ఓటు, టీడీపీ నుంచి ఈదర హరిబాబు ఓటు కలిపి 28 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి పటాపంజుల కోటేశ్వరమ్మను సంతనూతలపాడు జెడ్పీటీసీ అభ్యర్థి తన్నీరు శ్రీనివాసరావు ప్రతిపాదించగా, కందుకూరు జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్‌చౌదరి బలపరిచారు. అయితే ఈమెకు కేవలం 27 ఓట్లు మాత్రమే రావడంతో డాక్టర్ నూకసాని బాలాజీ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా విజయం దక్కడంతో ఒక్కసారిగా ఈదర హరిబాబు తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ఎన్నిక కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నడిరోడ్డుపై ఇనుప ముళ్లకంచెలు వేసి పాస్ లేకుండా ఎవ్వరూ లోపలికి రాకుండా చర్యలు తీసుకున్నారు. మీడియాను కూడా సెల్ఫోన్లతో లోపలికి అనుమతించలేదు. చైర్మన్ ఈదర హరిబాబు ప్రొఫైల్ పేరు: ఈదర హరిబాబు తండ్రి: చెంచయ్య స్వస్థలం : నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు వయస్సు: 59 సంవత్సరాలు విద్యార్హతలు: పదో తరగతి వరకు అమ్మనబ్రోలులో చదివారు. ఇంటర్మీడియెట్ చీరాల వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో పూర్తిచేశారు. అనంతరం బీఎస్సీ గ్రాడ్యుయేషన్‌ను ఒంగోలు సీఎస్ఆర్ శర్మా కాలేజీలో చదివారు. ఈ సందర్భంగా ఆయన పీఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ జీవితం: తొలుత స్వగ్రామమైన అమ్మనబ్రోలు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం మండల ఉపాధ్యక్షునిగాను, 1994లో ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందారు. ఇవి కాకుండా ఏటా క్రమం తప్పకుండా ఎన్టీఆర్ కళాపరిషత్, విద్యార్థి పరిషత్, కర్షక పరిషత్, భారతీయం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ ప్రొఫైల్ పేరు: డాక్టర్ నూకసాని బాలాజీ తండ్రి: కోటయ్య, తల్లి : కామేశ్వరమ్మ స్వస్థలం : బింగినపల్లి, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా వయస్సు: 53 విద్యార్హతలు: ఎంఏ ఎకనామిక్స్, ఎంఫిల్, పీహెచ్డీ రాజకీయ జీవితం: కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా బీసీ సెల్ చైర్మన్‌గా రెండు పర్యాయాలు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా 2007 నుంచి 2010 వరకు పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2011 మే 27న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఇటీవలే పుల్లలచెరువు జెడ్పీటీసీగా గెలుపొందారు. -
‘చెయ్యి’చ్చిన ‘దేశం’
* చంద్రబాబు మాటను ఖాతరు చేయని తమ్ముళ్లు * జిల్లా నాయకత్వం సూచనల మేరకు గులాబీకి మద్దతు * టీడీపీ నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డ కాంగ్రెస్ * ‘దేశం’ మద్దతుతో జెడ్పీని వశం చేసుకున్న టీఆర్ఎస్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ ‘చెయ్యి’చ్చింది. రంగారెడ్డి జిల్లా పరిషత్ పీఠం టీఆర్ఎస్ ఖాతాలో పడేందుకు సంపూర్ణ సహకారం అందించింది. కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇరుపార్టీలు కలిసికట్టుగా సాగాలంటూ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. కానీ జిల్లా పార్టీ అధినేత ఆదేశాన్ని పట్టించుకోకుండా ఆత్మప్రభోదానుసారం వ్యవహరించాలంటూ సభ్యులకు సూచించింది. దీంతో గులాబీ శిబిరంతో కుదిరిన అంతర్గత ఒప్పంద ం నేపథ్యంలో తమ్ముళ్లు కాంగ్రెస్‌కు మొండిచేయి చూపారు. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు, రంగారెడ్డిలో టీడీపీకి జిల్లా పరిషత్‌ను వదిలేలా ఇరుపార్టీల మధ్య పరస్పర అవగాహన కుదిరింది. ఈ క్రమంలో కారుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్‌తో జతకట్టడం తప్పనిసరని చంద్రబాబు తేల్చిచెప్పారు. అయితే, తొలుత పగ్గాలెవరు చేపట్టాలనే అంశంపై ఇరుపార్టీల్లో పేచీ నెలకొంది. దీంతో మెట్టుదిగిన కాంగ్రెస్ తొలుత జెడ్పీ కుర్చీని టీడీపీకి వదిలేయడానికి ముందుకొచ్చింది. అప్పటికే టీఆర్ఎస్తో బేరం కుదుర్చుకున్న తెలుగు తమ్ముళ్లు ఈ ఫార్ములాపై నోరు మెదపలేదు. ఇద్దరు జెడ్పీటీసీలు అప్పటికే టీఆర్ఎస్ గూటికి చేర డం, మరికొందరు కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారంతో వారితో దోస్తీకి విముఖత చూపింది. చైర్మన్ బరిలో నిలిచినా.. తమకు సంపూర్ణ సహకారం అందించకపోవచ్చనే అపనమ్మకాన్ని వెలిబుచ్చారు. ఈ పరిణామాలతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం నేరుగా చంద్రబాబుతోనే సంప్రదింపులు జరిపింది. టీడీపీ జిల్లా నాయకత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిందేనని ఖరాకండిగా చెప్పారు. అప్పటికే టీఆర్ఎస్తో రాయబేరాలు కుదుర్చుకున్న పార్టీ నేతలు.. తమ సభ్యులను కూడా వారి శిబిరానికే తరలించారు. జిల్లా పరిషత్ ఎన్నికకు సైతం కలిసే వచ్చిన టీడీపీ జెడ్పీటీసీలు, ఒకే గదిలో కూర్చొని మంత్రి మహేందర్‌రెడ్డి సూచనల మేరకు నడుచుకున్నారు. టీడీపీ చెయ్యిచ్చిందనే విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ చేష్టలుడిగి చూస్తుండడం మినహా ఏమీ చేయలేకపోయింది. ‘దేశం’లో అసంతృప్తి జ్వాలలు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని జిల్లా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సరూర్‌నగర్ జెడ్పీటీసీ జిల్లెల నరేందర్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్‌తో పదవీకాలాన్ని పంచుకోవాలని చంద్రబాబు స్పష్టంచేస్తే జిల్లా నాయకులు కొందరు టీఆర్ఎస్కు ఓటేయాలని తమపై ఒత్తిడి చేశారని వాపోయారు. త్వరలోనే కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. ఫలించిన మహేందర్ వ్యూహం! రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి జిల్లా రాజకీయాల్లో మరోసారి తనపట్టు నిలబెట్టుకున్నారు. జెడ్పీ పీఠాన్ని దకి ్కంచుకోవడానికి సరిపడా సంఖ్యాబలం లేనప్పటికీ, తన వ్యూహరచనతో ప్రత్యర్థుల శిబిరాలను కొల్లగొట్టారు. అత్యధిక సీట్లున్న కాంగ్రెస్‌లో చీలిక తేవడం ద్వారా బలాబ లాలను సమం చేసిన ఆయన.. పాత మిత్రులైన ‘దేశం’ నేతలను తనవైపు తిప్పుకోగలిగారు. పాతపార్టీలో వైరివర్గంగా వ్యవహరించిన నాయకుల స్నేహ హస్తంతో జెడ్పీని వశం చేసుకున్నారు. యాదవరెడ్డి ఓటు టీఆర్ఎస్కే..! ఎమ్మెల్సీ, నవాబ్‌పేట జెడ్పీటీసీ యాదవరెడ్డి కారెక్కారు. శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేసిన ఆయన తాజాగా జరిగిన జెడ్పీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే అండగా నిలిచారు. కాంగ్రెస్ తరుఫున గెలిచిన ఆయన వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చున్నా, ఓటు మాత్రం గులాబీకి వేశారు. దీంతో ఆయన ఇక కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల టీఆర్ఎస్ కండువా క ప్పుకున్న రాజేంద్రనగర్ జెడ్పీటీసీ ముంగి జ్యోతి కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. -
జనస్వామ్యం ఖూనీ
-
జనస్వామ్యం ఖూనీ
అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ గూండాగిరీ ఇడుపులపాయలో పోలీసుల వీరంగం సాక్షి, పులివెందుల/వేంపల్లె, కడప, నెల్లూరు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని తెలుగుదేశం సాగిస్తున్న గూండాగిరీకి అంతులేకుండా పోతోంది. ప్రజాస్వామ్యాన్ని వలువలూడదీసి ఖూనీ చేస్తున్నారని, అధికార బలంతో తమ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఇటు గవర్నరుకు, అటు రాష్ట్రపతితో సహా కేంద్ర హోంమంత్రికి సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అయినా సరే దేశం ఆగడాలు కించిత్తు కూడా ఆగలేదు. సరికదా... మరింత రెచ్చిపోయింది. ఆఖరికి శనివారంనాడు పులివెందులలోనే పోలీసుల చేత తనిఖీలు చేయించింది. ఎలాంటి వారంటూ లేకుండా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గెస్ట్‌హౌస్‌లో, పొలాల్లో పోలీసులు స్వైరవిహారం చేశారంటే ఇది ఏ స్థాయి దారుణమన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ చిత్రమేంటంటే... పోలీసులు అలా సోదాలు చేసింది వైఎస్సార్సీపీ జెడ్పీటీసీల కోసమట!! తమ వారు కిడ్నాపైనట్టు వైఎస్సార్సీపీ నెల్లూరు జెడ్పీటీసీలిద్దరి తరఫున ఫిర్యాదు దాఖలైందని, అందుకోసమే ఇడుపుల పాయలో వెదికామన్నది పోలీసుల వివరణ. అసలు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు కిడ్నాపైతే వెదకాల్సింది ఎక్కడ? టీడీపీ నేతల ఇళ్లలోనా లేక వైఎస్సార్సీపీ అధిపతికి చెందిన తోటలోనా? ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ సంఘటన పూర్వాపరాలివీ... నెల్లూరు జిల్లా పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో అక్కడ మొత్తం 46 స్థానాలుండగా 31 సీట్లను వైఎస్సార్ సీపీ గెల్చుకుంది. టీడీపీకి 15 మాత్రమే దక్కాయి. అయితే రాష్ట్రంలో అధికారం దక్కటంతో దీన్ని చేజిక్కించుకోవడానికి టీడీపీ కుట్రలకు తెరలేపింది. ఫలితంగా ఈ నెల 5న చైర్మన్ ఎన్నిక జరిగేటపుడు దేశం సభ్యులు వీరంగం సృష్టించారు. కలెక్టర్, పోలీసుల సమక్షంలోనే ఈ ఘర్షణలు జరిగినా వారు నిలువరించలేదు సరికదా.. పరిస్థితి అదుపు తప్పిందంటూ ఎన్నికను వాయిదా వేశారు. దీంతో ఈనెల 8 నుంచీ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలంతా ఒక్కటిగా ఇడుపులపాయలో మకాం వేశారు. అయితే వాయిదా పడిన ఎన్నిక మళ్లీ ఆదివారం నాడు జరగనున్న నేపథ్యంలో టీడీపీ నేతలు తమ కుట్రలకు మరింత పదును పెట్టారు. తమ వారిని కిడ్నాప్ చేశారంటూ ఇద్దరు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీల బంధువులతో కేసులు పెట్టించారు. కావలి జెడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కిడ్నాప్ చేశారంటూ కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకూరుపేట జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణయ్యను సైతం బొమ్మిరెడ్డి కిడ్నాప్ చేసినట్లు కేసు పెట్టారు. వైఎస్సార్సీపీకి చెందిన సభ్యుల్ని ఆ పార్టీ నేతలు కిడ్నాప్ చేయటమేంటన్నది సామాన్యులకు అర్థం కాకపోయినా... ఆ కేసుల్ని ఆసరాగా తీసుకుని నెల్లూరు పోలీసులు పులివెందులపై దండెత్తారు. మూకుమ్మడిగా ఇడుపులపాయకు వెళ్లారు. శనివారం ఉదయం 10.30 సమయంలో నెల్లూరు రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో పులివెందుల సీఐ మహేశ్వరరెడ్డితో పాటు మరో 100 మంది పోలీసులు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో తనిఖీలకు దిగారు. ఒక్కసారిగా ఎస్టేట్‌లో భారీగా పోలీసు బలగాలు మోహరించటంతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. తీరా ఆరాతీయగా... నెల్లూరు జెడ్పీటీసీలు ఇద్దరు కిడ్నాప్ అయినట్లు వారి బంధువులు ఫిర్యాదు చేశారని, వారిచ్చిన సమాచారం మేరకు సోదాలకు దిగామని పోలీసులు చెప్పారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు ఎలా చేస్తారంటూ నెల్లూరు జెడ్పీటీసీలు, వైఎస్ఆర్ సీపీ నాయకులు గట్టిగా ప్రశ్నించారు. కొంతసేపు పోలీసులతో వాగ్వాదం నడిచింది. ఇంతలో తమకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయని.. అందుకు అనుగుణంగానే ఈ ఇద్దరిని కిడ్నాప్ చేసి ఇడుపులపాయలో ఉంచారన్న సమాచారం మేరకు, వారి బంధువుల సమక్షంలో సోదాలు చేస్తున్నామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌లో ఎలాంటి అనుమతి లేకుండా తనిఖీలు చేయటంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా నిరసించినా ఫలితం లేకపోయింది. ఇంతలో మీడియా ప్రతినిధులు రావటంతో పోలీసులు గేటు లోపలికి వచ్చి... సాయంత్రం 5.30 వరకు అక్కడే ఉన్నారు. ఇడుపులపాయ చుట్టుపక్కలి ప్రాంతాలతో పాటు తోటల్లో, పార్కుల్లో పోలీసులు కలియతిరిగారు. ఎక్కడైనా జెడ్పీటీసీలు ఉన్నారేమోనని అనుమానంతో వెదికినట్లు చెప్పారు. అక్కడితో ఆగకుండా... జెడ్పీటీసీలంతా నెల్లూరుకు బయల్దేరగా, ఆ బస్సులో కూడా తనిఖీలు చేశారు. చివరికి కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు చెప్పిన జెడ్పీటీసీలు అక్కడ లేకపోవటంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా తాజా కుట్రల నేపథ్యంలో హైకోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో ఆదివారం జరిగే ఎన్నికయినా సజావుగా నిర్వహిస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు వాయిదా పడిందంటే... ఈ నెల 5న నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరుగుతుండగా టీడీపీ నేతలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోనే దూషణలకు దిగారు. వెంకటగిరి ఎమ్మెల్యే కె.రామకృష్ణ వీరంగం సృష్టించి, కలెక్టర్ శ్రీకాంత్ ముందున్న మైక్‌ను విసిరికొట్టారు. ఆయన్ను దూషించారు. అయినా కలెక్టర్ నోరు మెదపలేదు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులపై దాడికి దిగారు. మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కలెక్టర్ , ఎస్పీ అక్కడే ఉన్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అనంతరం ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తరవాత జెడ్పీ హాల్లో వీరంగం సృష్టించిన రామకృష్ణపై జెడ్పీ సీఈఓ జితేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 353,447 రెడ్‌విత్ 34 పీడీ పీపీయాక్ట్(నాన్‌బెయిలబుల్) కింద కేసులు పెట్టారు. అయితే టీడీపీ నేతలు ఒత్తిడి చేయటంతో పాటు సాక్షాత్తు ప్రభుత్వాధినేత సైతం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ వెళ్లి శనివారం తిరిగి నెల్లూరుకు వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణను పోలీసులు లైట్ తీసుకున్నారు. సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆయన 40 వాహనాలతో సిటీలో 10 కిలోమీటర్ల మేర ర్యాలీ జరిపి.. తరవాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూర్చోగా... పోలీసులు బెయిల్ ఇస్తున్నట్లు చెప్పి పంపించేశారు. అక్కడికెళ్లిన మీడియాను ఇన్స్పెక్టర్ అడ్డుకోవడం గమనార్హం. నెల్లూరు జెడ్పీని దక్కించుకుంటాం నెల్లూరు జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు శాయశక్తులా కృషి చేస్తామని నెల్లూరు జెడ్పీటీసీలు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి స్పష్టం చేశారు. శనివారం ఇడుపులపాయలో పోలీసుల తనిఖీ సంగతి తెలియగానే ఆయన అక్కడికి చేరుకున్నారు. అనంతరం జెట్పీటీసీలతో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ తరపున గెలిచి.. ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం తమకు లేదని.. ధైర్యంగా వైఎస్ఆర్ సీపీకి ఓట్లేస్తామని వారు చెప్పారు. టీడీపీ ప్రలోభాలకు లొంగి కొంతమంది వెళ్లినా కావాల్సిన బలం ఉందని వారు స్పష్టంచేశారు. ఖాకీ విప్పి పచ్చచొక్కాలు వేసుకోండి నెల్లూరు జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్ మొదలైంది. వారు టీడీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారు. అందుకని ఖాకీ చొక్కాలు విప్పి.. పచ్చచొక్కాలు వేసుకుంటే బాగుంటుంది. పోలీసుల పనితీరు సరిగా లేకపోవటం వల్లే జెడ్పీ ఎన్నిక వాయిదా పడింది. ఇలా చేసే బదులు పోలీసులు టీడీపీలో చేరిపోతే బాగుంటుంది. - పులివెందులలో కాకాని గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లె వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సీఎం ఆదేశాల మేరకే దాడులు రాష్ట్రంలో నెల్లూరు రాజకీయాలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ ఆ పేరును టీడీపీ నేతలు మంటగలిపారు. 50 ఏళ్ల నెల్లూరు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఈనెల 5వ తేదీన నెల్లూరు జడ్పీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఐఏఎస్ అధికారిపైనే టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పోలీసులు కేసు పెట్టారు కానీ అరెస్టు చేసిన పాపాన పోలేదు. టీటీడీ ఎన్ని చేసినా నెల్లూరు జెడ్పీలో గెలుపు మాదే. - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడుతున్నారు మేం మహిళలం అని కూడా చూడకుండా నెల్లూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు జెడ్పీటీసీలను కిడ్నాప్ చేశారనే నెపంతో పోలీసులు ఇక్కడ తనిఖీలు చేయడం బాధాకరం. ఈ నెల 7న మేమంతా తమిళనాడులో ఉండగా అక్కడ కూడా తమిళ పోలీసుల సాయంతో మా శిబిరంలో తనిఖీలు చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రాణం పోయేంతవరకు వైఎస్ఆర్ సీపీలోనే ఉంటాం. నెల్లూరు జెడ్పీని కైవసం చేసుకుంటాం. ఆదివారంనాటి ఎన్నికల్లోనైనా పోలీసులు ప్రేక్షకుల్లా మారకుండా శాంతిభద్రతలు కాపాడతారని అనుకుంటున్నాం. - నెల్లూరు మహిళా జెడ్పీటీసీల ఆవేదన -
టీఆర్ఎస్లోకి తెలుగు తమ్ముళ్లు?
కేటీఆర్‌తో తలసాని సహా ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల సంప్రదింపులు శ్రావణమాసంలో ముహూర్తం! అనర్హత వేటుకు అందకుండా ప్రణాళిక హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న 15 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు మూకుమ్మడిగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను సాకుగా చూపుతూ.. ఈ ఎమ్మెల్యేలు ఆషాఢమాసం తరువాత శ్రావణమాసం తొలివారంలో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ టీడీపీ ఫ్లోర్‌లీడర్ పదవిని ఆశించి భంగపడ్డ హైదరాబాద్ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పార్టీ మారే బృందానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనతోపాటు గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్‌గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌లతోపాటు మహబూబ్‌నగర్ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీరితో కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంప్రదింపులు జరిపినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి పార్టీ మారే విషయాన్ని కొట్టిపారేస్తున్నా.. భవిష్యత్ రాజకీయ అవసరాల నేపథ్యంలో కార్యకర్తల ఒత్తిడి పేరుతో గులాబీ కండువా కప్పుకునేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం. ఏపీ సీఎంగా చంద్రబాబు విద్యుత్, పోలవరం, సాగునీరు, గవర్నర్‌కు కీలకాధికారాల అంశాల్లో తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుందని, ఈ పరిస్థితుల్లో పార్టీలో ఉంటే రాజకీయంగా ఆత్మహత్యేనని వీరంతా భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఐదుగురు, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హత వేటుకు అందకుండా.. టీఆర్ఎస్లో చేర్చేందుకు కేటీఆర్ పావులు కదిపారు. -
ఉద్యోగాల కోతే బాబు విజన్
‘ఇంటికో ఉద్యోగం’... ‘నిరుద్యోగులకు నెలకు 2వేల భృతి’... ‘జాబు కావాలంటే బాబు రావాలి’... మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువసామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం బాబుకే చెల్లింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో గతంలో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నినాదాలు ఇవి. యువతను ప్రలోభపెట్టడానికి చంద్రబాబు చేయని ప్రచారం లేదు. ఇవ్వని వాగ్దానం లేదు. అయితే ఫలితాలు వచ్చి నెల గడవక ముందే బాబుగారి అసలు స్వరూపం బట్టబయల య్యింది. కొత్తగా ఉద్యోగాలివ్వడం మాట అటుంచి ఉన్న ఉద్యోగాలకే ఆయన ఎసరు పెట్టారు. వివిధ సంస్థలలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసే స్తున్నారు. ఉద్యోగాలు తీసేయడం, పనిచేసే సంస్థలను మూసేయడంలో బాబుగారు బహునేర్పరి. ఆయనగారి గత చరిత్రంతా ఈ తీసివేతలు... మూసివేతలే... గతంలో అధికారంలో ఉండగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చంద్రబాబు వాటిలోని వేలాదిమంది ఉద్యోగుల ఉపాధికి దెబ్బకొట్టారు. అంతేకాదు ప్రపంచ బ్యాంకుతో ఓ ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం ప్రారంభించారు. దశలవారీగా ప్రభుత్వరంగ సంస్థలను మూసేయడం, ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం ఆ పథకం ఉద్దేశం. అందుకోసం జీవో నంబర్ 58ని కూడా ఆయన జారీ చేశారు. ఆయన విజన్ ఉద్యోగుల తొలగింపే. 2020 నాటికి లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మన బాబుగారు. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనేక వాగ్దానాలు చేశారు. అందులో అత్యంత కీలకమైనది ‘ఇంటికో ఉద్యోగం’. రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లున్నాయి. ఇంటికో ఉద్యోగమంటే మాటలా.. అన్ని ఉద్యోగాలు ఇస్తున్నారా...? బాధ్యతగలిగిన నాయకులు ఏదైనా మాట్లాడుతున్నారంటే చిత్తశుద్ధి ఉండనక్కరలేదా? సాధ్యాసాధ్యాలను చూడనక్కరలేదా? బాబుగారు అన్నీ చూసుకునే ప్రజల కోసం ఆ హామీలిచ్చారని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అయితే మరి ఇప్పుడు నెల గడచిపోయినా బాబుగారు తన హామీలపై నోరు ఎందుకు మెదపడం లేదు? ఏ హామీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎందుకు చెప్పడం లేదు? వ్యవసాయ రుణాల మాఫీపై ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్న చందానే మిగిలిన హామీలనూ అటకెక్కించేస్తారా? నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సందేహాలివి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగానూ చంద్రబాబు మాటలు సమస్యను పక్కదోవ పట్టించేలానే ఉన్నాయి. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కానక్కరలేదని, ప్రైవేటు ఉద్యోగాలు కూడానని ఆయన అంటున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపినా కూడా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలు. భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఐటీ, సేవారంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల లోపే. అలాంటిది మరో 3 కోట్ల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారు? దానికేమైనా ప్రణాళిక బాబు వద్ద సిద్ధంగా ఉందా? అందుకోసం ఆయన ఏం చేయబోతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఉద్యోగాలపై స్పష్టత ఏది? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ‘ఇంటికో ఉద్యోగం’ హామీపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దానిపై స్పష్టత ఏదని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబురావాలంటూ ఎన్నికలకుముందు టీవీల్లో పదేపదే ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. అసలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారా లేదా.. అందుకోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు... అని ప్రశ్నించారు. వీటికి అధికారపక్షం నుంచి అసలు సమాధానమే లేదు. అత్యంత కీలకమైన ఈ అంశంపై శాసన సభలో జరిగిన చర్చ ఎందుకనో మీడియాలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కొత్త ప్రభుత్వం తీరు చూసి నిట్టూరుస్తున్నారు. అసలు ఉద్యోగం వస్తుందా...? వచ్చే వరకూ నిరుద్యోగ భృతి ఇస్తారా..? ఇవి జవాబు దొరకని మిలియన్ డాలర్ల ప్రశ్నలే. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీలను చూసి యువత ఎంతో కొంత ఆశపడబట్టే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. పదవినధిష్టించిన తర్వాత మరి ఆ యువతకు ఆయనిచ్చే భరోసా ఏమిటి? ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిపై ఇప్పటికీ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? 3.5 కోట్ల మందికి ఉద్యోగాలెప్పుడు ఇస్తారు... ఈ లోగా ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు..? వంటి విషయాలపై చంద్రబాబుకు ఎలాంటి క్లారిటీ లేదు. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలను వెల్లడించే గవర్నర్ ప్రసంగంలోనూ నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రణాళికా లేదు. నిరుద్యోగ సమస్యకు బాబు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదని దీన్ని బట్టి అర్థమౌతుంది. ఇవ్వడం అటుంచి.. ఉన్నవి హుష్‌కాకి.. వర్తమానానికి వస్తే... ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు... ఉన్న ఉద్యోగాలు పీకేసే పని బాబుగారు మొదలుపెట్టారు. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. పదేళ్ల నుంచి వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువ సామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం చంద్రబాబుకే చెల్లింది. వీరే కాదు గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న 3,600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బాబు ఉద్వాసన పలికారు. 15 వేల రూపాయలలోపు గౌరవవేతనంతో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల కుటుంబాలన్నీ ఇప్పుడు వీధిన పడ్డాయి. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో 4 వేల మంది, జలయజ్ఞం భూసేకరణలో 7 వేల మంది ఉద్యోగులను త్వరలోనే ఇంటికి పంపించనున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని భావించామని, ఇలా తమ పొట్టకొడతారని ఊహించలేదని ఆ ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్క గృహనిర్మాణ సంస్థే కాదు.... అన్ని సంస్థలలోని తాత్కాలిక, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొత్త ప్రభుత్వం తొలగిస్తోంది. బాబు రాకతో జాబు పోక అన్నట్లయిందని ఉద్యోగులు బాధపడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ పదవుల్లోని వారు రాజీనామాలు చేయడం మామూలే. కానీ పొట్టచేతబట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న చిరు వేతన జీవులను రాజకీయ కోణంలో చూడడం, వారి ఉపాధిని దెబ్బకొట్టడం సబబేనా? గత ప్రభుత్వంలో ఉద్యోగాలలో చేరిన వారిని ఇపుడు తొలగించేయడం ఏ తరహా రాజకీయం? తొలగింపులు, మూసివేతలే బాబుగారి ట్రాక్ రికార్డు ఉద్యోగులను తొలగించడం, ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడంలో బాబుగారిది అందెవేసిన చేయి. గతంలో ఆయన పాలనలో అమలైన ప్రపంచబ్యాంకు ఆర్థిక సంస్కరణలకు బలైంది ఉద్యోగులే. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురుపోసుకుంటూనే సాగింది. ఉన్న ఉద్యోగాలను తొలగించడమే పనిగా పెట్టుకునే చంద్రబాబు కొత్త ఉద్యోగాలిస్తానంటే నమ్మొ చ్చా...? ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచబ్యాంకుతో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ఉద్యోగుల కుదింపునకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా చంద్రబాబు జారీ చేశారు. దాని ప్రకారం 1998లో 747, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారని గణాంకాలు చెబుతున్నాయి. అలా లక్షమంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకు ముందు చంద్రబాబు తన విజన్ 2020 ని ఆవిష్కరించారు. బాబు అనేక ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. పలు సంస్థలను మూసేశారు. రాష్ట్రంలో 127 ప్రభుత్వ, సహకార రంగ సంస్థలు ఉన్నాయి. వాటిలో చంద్రబాబు 14 మూసేశారు. 11 సంస్థలను అమ్మేశారు. మరో పదిసంస్థలను అమ్మడానికి రంగం సిద్ధం చేశారు. ఈ సంస్థలలోని 21 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఏపీఈఆర్పీ కింద తొలిదశలో నంద్యాల, రాజమండ్రి, నెల్లూరు, ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లులతో పాటు నిజాం షుగర్స్, ఆల్విన్ వాచ్ కంపెనీలను మూసేశారు. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ, మధునగర్ షుగర్ మిల్లు, లచ్చయ్యపేట షుగర్ మిల్లు, మెంబోజిపల్లి డిస్టిలరీ, చాగల్లు డిస్టిలరీ ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. రెండో దశలో ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌తో పాటు బెవరేజ్, టెక్స్టైల్స్, కోళ్లు -మాంసం అభివృద్ధి కార్పొరేషన్లు, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, వికలాంగుల సంస్థల్లోని ఉద్యోగులనూ తొలగించాలనుకున్నారు. 2004 ఎన్నికల్లో బాబు ఓటమితో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎకనమిక్ సర్వే చెబుతున్న నిజాలు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషియో ఎకనమిక్స్ సర్వే 2012-2013 ప్రకారం...2000 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రంగాల్లో.. అంటే పబ్లిక్ , ప్రైవేట్ రంగాలు రెండింటిలో కలిపి ఉద్యోగుల సంఖ్య 20,71,642. 2004 మార్చి నాటికి మొత్తంగా ఉద్యోగులు లేదా ఉద్యోగాల సంఖ్య 20,11,645. అంటే కేవలం నాలుగేళ్లలోనే చంద్రబాబు హయాంలో తగ్గిన ఉద్యోగాలు దాదాపు 60,000.వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చివరి సంవత్సరం 2009 మార్చి నాటికి ఈ సంఖ్య 20,82,800. అంటే వైఎస్ పాలనలో 71,155 ఉద్యోగాలు పెరిగాయి.{పైవేటు రంగాన్ని తీసుకున్నా 2000 మార్చి నాటికి 5,68,362 ఉద్యోగాలు ఉం టే అది 2004 మార్చి నాటికి 5,67,666. అంటే బాబు పాలన చివరి నాలుగేళ్లు తీసుకున్నా ప్రైవేటు ఉద్యోగాలు పెరగకపోగా 696 తగ్గాయి.2009 మార్చి నాటికి ప్రైవేటు ఉద్యోగాలు 7,24,916. అంటే 1,59,250 ఉద్యోగాలు పెరిగాయి. మభ్యపెట్టడం వెన్నతోపెట్టిన విద్య ఏరుదాటేందుకు ఎన్నో చెబుతాం అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎట్టా అని వెనకటికెవడో అన్నాట్ట. బాబుగారిది అచ్చు ఇలాంటి పాలసీనే. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ ఆయన అంతగా గుర్తుపెట్టుకోరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయాల్సి వచ్చినా వాటికి ఎలాగోలా తూట్లు పొడిచేస్తారు. అదీ ఆయన ట్రాక్ రికార్డు. మద్యనిషేధం ఎత్తివేత, కిలో 2 రూపాయల బియ్యం ధర రూ.5.25కు పెంపు వంటివి ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కూడా రైతు రుణాల మాఫీ గురించి అన్నివైపులా ఒత్తిడి పెరగడంతో ఓ కమిటీ వేసేశారు. నిజానికి రుణమాఫీ ఆచరణ సాధ్యమేనా అని ఎన్నికల సంఘం చంద్రబాబును వివరణ అడిగితేనే నిక్కినీలిగీ చివరికి ఏదో సమాధానమిచ్చారు. అందులో చెప్పిన విధంగానే రుణమాఫీని అమలుచేసేయొచ్చు కదా? మరలా అధ్య యనానికి ఓ కమిటీ ఎందుకు? అంటే అసలు ఏమీ అధ్యయనం చేయకుండానే వెనకా ముందూ చూసుకోకుండానే హామీ ఇచ్చేశారు? మేనిఫెస్టోలో పెడుతున్నామంటే దాని సాధ్యాసాధ్యాలను ముందుగా బేరీజు వేసుకోనక్కరలేదా? ఇప్పుడు కొత్తగా కమిటీ ఏమిటి? ఇది కాలయాపన కోసం కాదా? ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పాత రుణాలు కడితే గానీ కొత్తగా రుణాలిచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పైగా పాతరుణాలు కట్టాలని నోటీ సులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను గందరగోళంలో ముంచి కమిటీలతో కాలయాపన చేయడం సబబేనా? ఇంటికో ఉద్యోగం విషయంలోనూ బాబు ఇలాంటి గందరగోళాన్నే సృష్టించాలని చూస్తున్నారు. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యో గమే కానక్కరలేదు ప్రైవేటు ఉద్యోగమైనా ఉద్యోగమేనని ఆయన అంటున్నారు. అలాగే ఉద్యోగమంటే ఉద్యోగమే మేమే ఇవ్వనక్కరలేదు.. ఎవరిచ్చినామేమిచ్చినట్టేనంటూ రాష్ట్రంలో ఎక్కడ ఏ కొట్టులో ఎవరికి ఏ గుమస్తా ఉద్యోగమొచ్చినా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..! చంద్రబాబు అమ్మేసిన ప్రభుత్వరంగ, సహకార సంస్థలివే.. ► ఆల్విన్ సనత్‌నగర్ భూములు ► రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ ► నిజాం షుగర్స్ (నాలుగు యూనిట్లు) ► మధునగర్ షుగర్ మిల్లు ► లచ్చయ్యపేట షుగర్ మిల్లు ► మొంబోజిపల్లి డిస్టిలరీ ► చాగల్లు డిస్టిలరీ ► హనుమాన్ జంక్షన్ షుగర్స్ ► నంద్యాల షుగర్స్ ► పాలకొల్లు షుగర్స్ ► గురజాల షుగర్స్ ► ఇంకొల్లు నూలు మిల్లు ► ఆదిలాబాద్ నూలు మిల్లు ► నెల్లూరు నూలు మిల్లు ► యడ్లపాడు నూలు మిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషియో ఎకనమిక్ సర్వే 2012-13 గణాంకాలివి... 2000- 2004 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని ఉద్యోగాలు తగ్గిన విషయాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి. 2009 నాటికి వైఎస్ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు పెరిగిన విషయం కూడా ఈ గణాంకాల ద్వారా తెలుసుకోవచ్చు. - పోతుకూరు శ్రీనివాసరావు -
సోమిరెడ్డికి ఎమ్మెల్సీ దక్కేనా?
గవర్నర్ కోటాలో ఇస్తారనే ఆశాభావం పదవి ఇచ్చి నెల్లూరులో పట్టు సాధించే దిశగా బాబు అడుగులు నెల్లూరు: తెలుగుదేశంలో ఎమ్మెల్సీ పదవుల రగడ ప్రారంభమైంది. ఈ రేసులో గత ఎన్నికల్లో ఓటమి పాలైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆది నుంచి పార్టీ జెండా మోస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఎందుకివ్వరని ఆయన సహచరులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు పోరాటం చేయడానికి సిద్ధపడుతామని వారు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్సీ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి ప్రాబల్యం తగ్గించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు ఆయన సహచరులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌కు బదులుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని కేటాయించినట్లు చెబుతున్నారు. నెల్లూరు రూరల్‌లో అయితే సోమిరెడ్డి సునాయాసంగా గెలిచే వారని, అయితే ఆ స్థానాన్ని పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి కేటాయించారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే సోమిరెడ్డి మాత్రం తనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే ఆశతో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తనపై సదభిప్రాయం ఉందని గవర్నర్ కోటాలో లేదా పార్టీ కోటాలో కాని తనకు ఎమ్మెల్సీ దక్కుతుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనలాంటి సీనియర్ నేతలైన గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్, బాబూ రాజేంద్రప్రసాద్ లాంటి వారికి వారి జిల్లాల్లో అవకాశం రావడంతో పదవులు కల్పిస్తున్నారని, అదే తరహాలో సమయం వచ్చినపుడు తనకు కూడా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే పార్టీ నేతలు మాత్రం సోమిరెడ్డికి ఎమ్మెల్సీ దక్కే అవకాశం లేదని అంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని పని చేయ లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు దృష్టి నెల్లూరు జిల్లా మీద పడ్డట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ప్రాతినిధ్యం పెంచుకోవడానికి ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునే యత్నంలో ఉన్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వాకాటి నారాయణరెడ్డి లాంటి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలపై తెలుగుదేశం కన్నేసినట్లు తెలిసింది. ఇటీవల మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడి పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మరో కాంగ్రెస్ నాయకుడు చాట్ల నరసింహారావు సోమవారం తెలుగుదేశంలో చేరారు. నెల్లూరు జిల్లాలో కోల్పోయిన పార్టీ పట్టును పునరుద్ధరించుకునేందుకు సోమిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ప్రతిపక్షపార్టీల మాటలకు తూటాలు పేల్చగల నాయకుడు సోమిరెడ్డి ఒక్కరే ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు వ్యూహరచనలో భాగంగా, మంత్రిగా ఉన్న నారాయణకు గుంటూరు నుంచి అవకాశం కల్పించి, సోమిరెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
కార్యకర్తలకు అందుబాటులో ఉంటా: లోకేష్
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా నారా లోకేష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా లేకుండా అందరు కార్యకర్తలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని లోకేష్ తెలిపారు. కాగా పార్టీ కార్యకర్తల సంక్షేమనిధికి సమన్వయకర్తగా లోకేష్ నియమితుడైన కొద్ది సేపటికే అనేక మంది టిడిపి సీనియర్ నాయకులు బుధవారం తమ విరాళాలను నేరుగా కార్యాలయానికి పంపించటం విశేషం. -
టీ-టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి
తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నేతగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపికయ్యారు. అలాగే, శాసనసభాపక్ష నేతగా తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో నాయకుల ఎంపిక ప్రక్రియను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూర్తి చేసినట్లయింది. ఇక అసెంబ్లీలోడిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రేవంత్ రెడ్డి, ఆర్. కృష్ణయ్యలను ఎంపిక చేశారు. శాసన మండలిలో టీడీపీ పక్ష నాయకుడిగా అరికెల నర్సారెడ్డి వ్యవహరించనున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో విప్‌గా సండ్ర వెంకట వీరయ్యను నియమించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం చేసిన బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్యను మాత్రం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థాయితోనే చంద్రబాబు సరిపెట్టేశారు. ముందునుంచి తెలంగాణ టీడీపీ ఫోరం ఛైర్మన్‌గా వ్యవహరించిన ఎర్రబెల్లికే టీ-టీడీఎల్పీ పీఠాన్ని కట్టబెట్టారు. -
ముహూర్తంపై టీడీపీ మల్లగుల్లాలు
-
19 లేదా 23 నుంచి ఏపీ అసెంబ్లీ భేటీ
* ముహూర్తంపై టీడీపీ మల్లగుల్లాలు * ఎన్నికల ఫలితాలు వచ్చి ఈ 16కు నెల పూర్తి * ఈ లోగా ఆంధ్రా అసెంబ్లీ సమావేశం లేనట్లే * 12వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ భేటీ! * ఆ తర్వాత రెండు రోజులు సెలవు దినాలు * 16 లేదా 23 తేదీల్లో ముహూర్తం నిర్ణయం * ప్రొటెం స్పీకర్ ఎంపికపై టీడీపీ నేతల చర్చ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల తేదీలపై అధికార తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పదేళ్ల తరువాత అధికారంలోకి రావడం, పైగా విభజనానంతర అవశేష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు కావడంతో మంచి ముహూర్తాల కోసం పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడం తెలిసిందే. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణాల కోసం కూడా టీడీపీ నేతలు పండితులతో చర్చించి ముహూర్తాన్ని నిర్ణయించారు. 8వ తేదీ ఉదయం 11.15 గంటలకు ప్రమాణం చేయాలని ముందు నిర్ణయించినా దాన్ని తరువాత అదే రోజు సాయంత్రానికి మార్చారు. ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ తొలి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు గత నెల 16వ తేదీనే వెలువడినా రాష్ట్ర విభజనకు సంబంధించి అపాయింటెడ్ డే జూన్ రెండో తేదీ వరకు ఉండడంతో ఎమ్మెల్యేల ప్రమాణాలకు వీలు లేకుండాపోయింది. ఆ తరువాత కూడా ప్రభుత్వ ఏర్పాటు ముహూర్తం 8వ తేదీగా నిర్ణయించడంతో సభ్యుల ప్రమాణాలకు మరిన్ని రోజులు ఆగక తప్పడం లేదు. ఈ నెల 16వ తేదీ నాటికి ఫలితాలు వచ్చి నెల రోజులు పూర్తవుతాయి. ఆలోగా ప్రమాణాలు చేయడానికి టీడీపీ నేతలకు సరైన ముహూర్తాలు కుదరడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 9న ప్రారంభమై 12వ తేదీ వరకు జరగనుంది. ఈ తేదీల్లో ఏపీ అసెంబ్లీనీ సమావేశపరిస్తే రెండు ప్రాంతాల సభ్యులు, మంత్రులు ఒకేసారి రావడం, ఇప్పుడున్న వసతులు అరకొరగా ఉండడంతో గందరగోళ పరిస్థితులు తలె త్తనున్నాయి. 14, 15 తేదీలు సెలవు దినాలు. దీంతో 16వ తేదీ తరువాతే ఏపీ అసెంబ్లీని సమావేశపర్చే వీలుంది. ఈ రోజుల్లో మంచి ముహూర్తాలు ఏమున్నాయా? అని అధికార టీడీపీ సీనియర్ నేతలు పండితులతో చర్చిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ చవితి కావడం, 17వ తేదీ తిథి పంచమి అయినా ఆ రోజు మంగళవారం కావడంతో అదీ సమావేశాలకు పనికిరాదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను చంద్రబాబు కలసిన సమయంలోనూ అసెంబ్లీ సమావేశాల తేదీలపై ప్రస్తావన వచ్చింది. 15, 16, 17 తేదీల్లో తనకు వేరే షెడ్యూల్ కార్యక్రమాలున్నాయని, ఆ తరువాత తేదీల్లో సమావేశం పెట్టుకోవాలని బాబుకు గవర్నర్ సూచించినట్లు సమాచారం. దీంతో టీడీపీ నేతలు తదుపరి ముహూర్తాలపై దృష్టి సారించారు. 19న సప్తమి మంచి ముహూర్తమని, అది కాదనుకుంటే 23వ తేదీ ఏకాదశి ఉంది కనుక ఆ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున అసెంబ్లీని సమావేశపరిస్తే మంచిదని పండితులు టీడీపీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో ఏదో ఒక తేదీ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతున్నందున ఈ లోగానే అసెంబ్లీని సమావేశపరిచాలని భావిస్తున్నారు. ప్రొటెం స్పీకర్ ఎవరో..! అసెంబ్లీలో సభ్యులతో ప్రమాణం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరికి అవకాశం దక్కుతుందో అన్నది టీడీపీలో చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుత సభకు ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తుంటారు. ప్రస్తుత సభలో కె.ఇ.కృష్ణమూర్తి (డోన్), పతివాడ నారాయణస్వామినాయుడు (నెలిమర్ల)లు ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. వీరిద్దరూ చంద్రబాబు కేబినెట్లో బెర్తులను ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో మంత్రిపదవికి అవకాశం లేని వారిని ప్రొటెం స్పీకర్‌గా చేయనున్నారు. ఒకవేళ ఇద్దరికీ కేబినెట్లో చోటు దక్కితే కనుక వేరొకరిని ఎంపికచేయాలి. ఈ ఇద్దరి తరువాత ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కోడెల శివప్రసాదరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడులు ఉన్నారు. వీరూ కేబినెట్ పదవులను కోరుకుంటుండటంతో ఎవరిని ఎంపికచేస్తారన్నది సందిగ్ధంగా మారింది. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనందున ఆయనను ప్రొటెం స్పీకర్ చేయవచ ్చని చెప్తున్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని ఎంపికచేయనున్నారో ముందుగా తనకు సమాచారం ఇవ్వాలని గవర్నర్ నరసింహన్ టీడీపీ నేతలకు సూచించారు. -
హైదరాబాద్ నుంచే ఆంధ్రప్రదేశ్ పాలన!: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు విశ్రమించననీ, తాను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని అయినా హైదరాబాద్‌ను వదలనని, ఇక్కడ్నుంచే పాలన సాగిస్తానని చంద్రబాబునాయుుడు స్పష్టంచేశారు. వారంలో ఒకరోజు తెలంగాణ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తానని టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగింది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలతోపాటు ఓడిపోయిన అభ్యర్థులు, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరైన ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ బలమైన రాజకీయ శక్తి అనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయని, 2019 నాటికి అధికారంలోకి రావడమే కర్తవ్యమని చెప్పారు. తెలుగుదేశం పాలన వల్లే తెలంగాణ ఈరోజు మిగులు బడ్జెట్లో ఉందని, అభివృద్ధి కార్యక్రమాల్లో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టిన ఘనత టీడీపీదేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ మునిగిపోయిందని, ఇక కోలుకునే అవకాశమే లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ లపై ఆశలు పెట్టుకున్నా... అంతర్గత విభేదాల కారణంగా ఓటమిపాలయ్యామని, భవిష్యత్తులో నేతలంతా కలసి కట్టుగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ టీడీపీ సార థులు ఎల్.రమణ, ఆర్.కృష్ణయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీ టి.దేవేందర్ గౌడ్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎ.రేవంత్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సాయన్న, ప్రకాశ్ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, ధర్మారెడ్డి, ఇతర నాయకులు కె. అరవింద్‌కుమార్ గౌడ్, పి. రాములు, సీతాదయాకర్ రెడ్డి, లక్ష్మీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచే ‘దేశం’ మహానాడు
-
నేడు, రేపు మహానాడు
గండిపేట తెలుగు విజయంలో ఏర్పాట్లు పూర్తి హాజరు కానున్న 20 వేల మంది ప్రతినిధులు పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడు మంగళవారం నుంచి రెండు రోజుల పాటు రంగారెడ్డి జిల్లా గండిపేటలోని తెలుగువిజయంలో జరగనుంది. మహానాడుకు సుమారు 20 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. పదేళ్ల తర్వాత టీడీపీ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో అధికారాన్ని చేపట్టనున్న నేపథ్యంలో మహానాడు ఉత్సాహభరిత వాతావరణంలో జరగనుంది. మహానాడు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు 17 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీల పర్యవేక్షణలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహానాడుకు వచ్చే ప్రతినిధులకు తెలుగు విజయంలోనే బస ఏర్పాటు చేయనున్నారు. రెండు రోజుల మహానాడులో తెలుగుదేశం విజయం-తెలుగుజాతి, కార్యకర్తలకు అంకితం.. 2014లో జరిగిన స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల సమీక్ష.. అవినీతి రహిత భారతదేశం-సంస్కరణలు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రణాళిక అమలు చేస్తాం, తెలంగాణ ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలుకు పోరాడతాం.. పేదరికం లేని సమాజం, తెలుగుదేశం ఆశయం.. రాజకీయ తీర్మానం.. భారతదేశ విదేశాంగ విధానం- తెలుగుదేశం పాత్రపై చేసే తీర్మానాలపై పార్టీ ప్రతినిధులు చర్చిస్తారు. తొలి రోజు ప్రతినిధుల నమోదు ఉంటుంది. ఆ తరువాత చంద్రబాబు మహానాడులో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ప్రారంభిస్తారు. పార్టీ జెండా ఆవిష్కరణ, మా తెలుగుతల్లికి గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు మొదలవుతాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక, గత మహానాడు నుంచి ఇప్పటి వరకూ మరణించిన నేతలు, కార్యకర్తలకు నివాళి అనంతరం పార్టీ జమా ఖర్చులు ప్రవేశపెడతారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మహానాడులో ప్రారంభోపన్యాసం చేస్తారు. రెండోరోజు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా నివాళులు, ఎన్టీఆర్ పురస్కారాల ప్రదానం ఉంటుంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేయటం వంటి అంశాలపై చర్చిస్తారు. రెండో రోజు సాయంత్రం అయిదున్నర గంటలకు చంద్రబాబు ముగింపు ఉపన్యాసం ఉంటుందని మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. -
9న చంద్రబాబు ప్రమాణం!
-
9న చంద్రబాబు ప్రమాణం!
* ఆరోజున 9 లేదా 18 మంది ప్రమాణం * యనమల, గంటా, నిమ్మకాయల, కళాల్లో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవి * మంత్రివర్గం, ఇతర పదవుల కోసం 45 మందితో జాబితా రూపొందించిన బాబు సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ, గుంటూరుల మధ్యన ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు.. మరో ఎనిమిది మంది లేదంటే 17 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. శుక్రవారం సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల సంఘం చైర్మన్ మురళీకృష్ణ నేతృత్వంలో ఉద్యోగుల ప్రతినిధి బృందం చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం, సచివాలయం నుంచి విధుల నిర్వహణ అంశం ప్రస్తావనకు రాగా.. జూన్ ఏడు, ఎనిమిది తేదీల వరకూ మంచి రోజులు లేవని.. ఆ తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు వారితో పేర్కొన్నారు. 9న ఏకాదశి కావటంతో ఆ రోజునే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ప్రమాణం చేసిన వెంటనే సచివాలయానికి వచ్చి కార్యకలాపాలు ప్రారంభిస్తానని ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పారు. బాబు తన మంత్రివర్గంలో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నారు. కిమిడి కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కె.ఇ.కృష్ణమూర్తిల్లో ఎవరైనా ఇద్దరికి డిప్యూటీ సీఎం అవకాశం లభిస్తుంది. హోంశాఖను కె.ఇ.కృష్ణమూర్తి లేదా పల్లె రఘునాథరెడ్డిల్లో ఒకరికి ఇస్తారని తెలిసింది. ఒకవేళ కేఈకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే మోదుగుల వేణుగోపాలరెడ్డికి హోంశాఖ ఇచ్చే అవకాశాలున్నాయి. రెవెన్యూ శాఖకు కిమిడి కళా వెంకట్రావు పేరు పరిశీలిస్తున్నారు. స్పీకర్ పదవికి ధూళిపాళ్ల నరేంద్రకుమార్, డాక్టర్ కోడెల శివప్రసాదరావుల పేర్లు పరిశీలిస్తున్నారు. 45 మందితో బాబు జాబితా... మంత్రివర్గంలో స్థానం కల్పించటంతో పాటు సభాపతి, ఉప సభాపతి, చీఫ్ విప్, విప్ల పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు సుమారు 45 మందితో కూడిన ఒక జాబితాను తయారు చేశారు. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ జాబితాలో యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, కె.ఇ.కృష్ణమూర్తి, బి.కె.పార్థసారథి, కిమిడి కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప, తోట త్రిమూర్తులు, మండలి బుద్ధప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, డి.కె.సత్యప్రభ, వనమాడి వెంకటేశ్వరరావు, గౌతు శ్యామసుందర శివాజీ, కాగిత వెంకట్రావు, పితాని సత్యనారాయణ, ముడియం శ్రీనివాస్, పీతల సుజాత, నక్కా ఆనందబాబు, గొల్లపల్లి సూర్యారావు, కె.ఎస్.జవహర్, రావెల కిషోర్‌బాబు, యామినీ బాల, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమామహేశ్వరరావు, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పరిటాల సునీత, దామచర్ల జనార్థన్, సిద్ధా రాఘవరావు, కురుగొండ రామకృష్ణ, మోదుగుల వేణుగోపాలరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బి.సి.జనార్దనరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఎస్.వి.సతీష్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, కె.అచ్చన్నాయుడు, ఎన్.ఎం.డి.ఫారూఖ్, కలవపూడి శివల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును కలిసిన ఆమంచి ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం చంద్రబాబును కలిశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన నవోద యం పార్టీ తరఫున గెలుపొందారు. బాబుతో భేటీ అనంతరం ఆమంచి మీడి యాతో మాట్లాడుతూ తాను టీడీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతానని చెప్పారు. -
'మహానాడు.. తెలుగుదేశం నేతల పండుగ'
హైదరాబాద్ : మహానాడు తెలుగుదేశం నేతల పండుగ అని ఆపార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ 1983 నుంచి మహానాడును టీడీపీ ఆనవాయితీగా జరుపుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న్టట్లు వర్ల రామయ్య అన్నారు. కాగా తెలుగుదేశం మహానాడును పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడును మరోసారి ఎన్నుకోవటం వరకే పరిమితం చేయనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్ గండిపేటలో జరగనున్న మహానాడులో పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశాలు లేవని సమాచారం. వచ్చే నెల రెండో తేదీ నుంచి రాష్ట్రం రెండుగా విడిపోనుంది. దీంతో రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఈ మహానాడులో రెండు రాష్ట్రాలకు విడివిడిగా అధ్యక్షులను ఎన్నుకోకుండా పార్టీ అధ్యక్షుడి గా చంద్రబాబును మాత్రమే ఎన్నుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి సాధారణ ఎన్నికల సమయంలో ఒక కమిటీని నియమించారు. ప్రస్తుతానికి ఆ కమిటీనే యధాతథంగా కొనసాగించనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారంగా ఉంది. -
కళ్లుగప్పి.. కొల్లగొట్టి..
కోట్ల విలువైన ఇసుక కంట పడిందంటే చాలు.. వారు చెలరేగిపోతారు. అనుమతులతో వారికి ఎలాంటి పనీ లేదు.. నిబంధనలను యథేచ్ఛగా ఇసుకలో తొక్కేస్తారు. అధికారుల కళ్లుగప్పి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి.. నిశి వేళ.. ఆ ఇసుకను దర్జాగా తవ్వేసి.. తరలించేసి.. కాసులు పండించుకుంటారు. బహుశా! ‘అధికార’ అండ ఉండడంవల్లనేమో! వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు సైతం మొక్కుబడి జరిమానాలతో సరిపెట్టేస్తున్నారు. సాక్షి, కాకినాడ : జిల్లాలో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులూ లేకుండా అడ్డగోలుగా తవ్వేసి.. దొరికినంతా దోచుకుంటోంది. జిల్లాలోని 28 ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు గడువు ముగిసి ఏడాది కావస్తోంది. ప్రస్తుతం పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో.. అన్నాబత్తుల వెంకటరమణమూర్తికి చెందిన సర్వే నంబర్ 53, 54, 55 పరిధిలో విస్తరించి ఉన్న 17 ఎకరాల పట్టా భూముల్లో.. సుమారు 2,15,624 క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికితీసి అమ్ముకునేందుకు మాత్రమే అనుమతులున్నాయి. మిగిలిన రీచ్‌లకు అనుమతుల్లేవు. స్టాక్ పాయింట్లకు, -రవాణాకు కూడా అనుమతులు లేవు. మూడు నెలలుగా అధికారులు వరుస ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. దీనిని అవకాశంగా తీసుకొని, ఇసుకాసురులు బరితెగించారు. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయల విలువైన ఇసుకను కొల్లగొట్టి, పగటిపూట దానిని దర్జాగా అమ్ముకొని సొమ్ములు చేసుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారికి దన్నుగా నిలిచినవారే ఇప్పుడు పార్టీలు మారి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టారు. దీంతో ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొంతమంది తెలుగుదేశం ప్రజాప్రతినిధుల అండదండలతో ఇసుకను యథేచ్ఛగా తవ్వేసి, అమ్ముకుంటున్నారు. కొల్లగొడుతున్నదిలా.. కోరుమిల్లి, కపిలేశ్వరపురం రీచ్‌లతో పాటు అయినవిల్లి మండలం శానిపల్లిలంక, కొండుకుదురులంక, పొట్టిలంక, తొగరపాయ; పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం, మొండెపులంక శివారు పుచ్చల్లంక, ఎల్.గన్నవరం శివారు నడిగాడి తదితర ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ నిరంతరాయంగా ఈ తవ్వకాలు సాగుతున్నాయి. ఇసుక తవ్వి ట్రాక్టర్‌కు లోడ్ (యూనిట్) చేయడానికి నలుగురు పని చేస్తున్నారు. వీరికి రూ.200 నుంచి రూ.400 చొప్పున చెల్లిస్తున్నారు. ప్రతి రీచ్ నుంచి కనీసం పది ట్రాక్టర్లకు తక్కువ కాకుండా ప్రతి రోజూ ఇసుక తవ్వుతున్నారు. దీనిని రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ చేస్తున్నారు. అక్కడ నుంచి లారీల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. రెండు యూనిట్లకు గతంలో రూ.2వేల నుంచి రూ.2500 వరకూ వసూలు చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఇసుక దొరకని పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఏకంగా రూ.5,500 వరకూ గుంజుతున్నారు. పది కిలోమీటర్ల లోపు దూరమైతే రూ.1000, ఆ తర్వాత కిలోమీటర్‌కు కొంత మొత్తం చొప్పున రవాణా చార్జీ అదనంగా వసూలు చేస్తున్నారు. మరోపక్క పశ్చిమ గోదావరి నుంచి కూడా ప్రతి రోజూ వందలాది లారీలు చించినాడ, సిద్ధాంతం వంతెనల మీదుగా జిల్లాలోకి వస్తున్నా పట్టించుకుంటున్నవారే కరువయ్యారు. ‘అధికార’ నేతలకు వాటాలు.. ఇసుక మాఫియాలో ఒకప్పుడు చక్రం తిప్పిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల అండదండలు ప్రస్తుతం పుష్కలంగా ఉండడంతో ‘అనుమతులతో మాకు పనేంటి?’ అన్న ధోరణిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. బహిరంగంగా సాగుతున్న ఈ ఇసుక అక్రమ వ్యాపారంలో కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సైతం భాగస్వామ్యం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇసుక లీజుదారుల నుంచి పర్సంటేజీలు తీసుకునేవారని.. ఇప్పుడు అనుమతులు లేనందున వాటాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో చేసిన ఖర్చును ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా రాబట్టుకొనేందుకు ‘అధికార’ నేతలు ఎత్తులు వేస్తున్నట్టు పలువురు బాహాటంగానే అంటున్నారు. పట్టుబడినా పట్టించుకోరు నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్లకు మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే మాత్రం బైండోవర్ చేసి కోర్టుకు సరెండర్ చేస్తారు. అలాగే, లారీలైతే మొదటిసారి రూ.10 వేలు రెండోసారి రూ.25 వేలు జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే బైండోవర్ చేస్తారు. కానీ జిల్లాలో తనిఖీల్లో ఎక్కడైనా ఇసుకతో ట్రాక్టర్ పట్టుబడినా అధికారులు విధిస్తున్న జరిమానా కేవలం రూ.2500 నుంచి రూ.5 వేలు మాత్రమే ఉంటోంది. దీంతో ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించేసి, కేవలం ఒక్క రోజులోనే ఆ ట్రాక్టర్‌ను విడిపించుకుని మళ్లీ యథేచ్ఛగా అక్రమ దందా సాగిస్తున్నారు. ఒకవేళ బైండోవర్ చేసే పరిస్థితి వస్తే అధికారులను అక్రమార్కులు ‘మేనేజ్’ చేసేస్తున్నారు. -
అరాచక బాబులతో జాగ్రత్త !
►రాష్ట్రంలో రక్తపుటేరులు పారించిన బాబు ►ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేని రోజులు ►రైతన్న నెత్తురూ కళ్లజూసిన నారాసురుడు ►ఉద్యోగులనూ రాచి రంపాన పెట్టిన ఉన్మాది నెల రోజులకు పైగా సాగిన ప్రచార పర్వానికి తెర పడింది. చరిత్రలో నిలిచిపోయే పోలింగ్‌కు నేడు సర్వం సిద్ధమైంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. గత చరిత్ర తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ ఈ సందర్భంగా వరుసగా కళ్లముందు కదలాడుతున్నాయి. ప్రజాప్రతినిధులకే రక్షణ కరువైన భయానక రోజులు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. బెజవాడ నడిబొడ్డున నిరాహార దీక్షలో ఉన్న ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగాను ‘తెలుగు’ తమ్ముళ్లతో తెగనరికించిన ‘నారా’జకీయం మనసులో మెదులుతోంది. చిల్లర ప్రచార పాకులాటలో మల్లెల బాబ్జీని బలిపశువును చేసిన వైనం అందరి మనసుల్లోనూ ఇంకా తాజాగానే ఉంది. పాలక బాబుల అండదండలతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పడగ విప్పి బుసలు కొట్టిన ఫ్యాక్షనిజం, వందలాది మందిని పొట్టన పెట్టుకుని అది పారించిన నెత్తుటి మరకలు ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి. నీటి ‘తీరు’వాపై గళమెత్తినందుకు కాల్ధరిలో, కార్పొరేట్ల తొత్తుగా మారి పొట్ట కొడతారా అన్నందుకు చిన గంజాంలో, ఇవేం కరెంటు చార్జీలని ప్రశ్నించినందుకు రాజధాని నడిబొడ్డున బషీర్‌బాగ్‌లో... అన్నదాతలను పిట్టల్లా కాల్చి పొట్టన పెట్టుకున్న చరిత్ర ఇప్పటికీ తాజాగానే ఉంది. నిత్యం మూడు హత్యలూ ఆరు దౌర్జన్యాలుగా సాగిన చంద్రబాబు నరహంతక పాలన ఎన్నటికీ మర్చిపోలేనిదే...! చిల్లర ప్రచారం కోసం మల్లెల బాబ్జీని.. తెలుగుదేశం పార్టీ దేదీప్యంగా వెలిగిపోతున్న 1984వ సంవత్సరం అది. ఎన్టీ రామారావు ప్రభుత్వ తొలి వార్షికోత్సవాన్ని హైదరాబాద్ లాల్‌బహుదూర్ స్టేడియంలో జనవరి 9న ఘనంగా నిర్వహించిన సందర్భమది. చిల్లర ప్రచారం కోసం నారా చంద్రబాబునాయుడు ఆడిన నాట కంలో మల్లెల బాబ్జీ అనే యువకుడి ప్రాణమే పోయింది. ఎన్టీ రామారావుపై అతి చిన్న కత్తిని మల్లె ల బాబ్జీ విసరడంతో ఆయన బొటన వేలికి చిన్న గాయమైంది. అంతే.. ఎల్లోమీడియా, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్‌పై హత్యాయత్నమం టూ గోబెల్స్ ప్రచారాన్ని గోడెక్కి మరీచేశారు. టీడీపీకి సానుభూతి పెంచేందుకు బాబు ఆడించిన నాటకంలో బాబ్జీ పాత్రధారి అయ్యారు. సీఎంపై హత్యాయత్నం కేసు పేరుతో బాబ్జీని జైలులో పెట్టారు. ఏడాది తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక బాబుగారి నాటకానికి తాను బలిపీఠం ఎక్కానని బాబ్జీ తెలుసుకున్నాడు. ఎన్టీఆర్ పెద్దమనసు చేసుకుని చిన్న కేసే కదా బాబ్జీని వదిలేయాలన్నారు. అంతే కాదు బాబ్జీకి మూడు లక్షల రూపాయలను పరిహారంగా ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. తీరా బాబ్జీకి ఇచ్చిం ది కేవలం రూ.30 వేలే. అప్పటికే కు టుంబం అల్లరికావడం, ఏడాదిపాటు జైలులో ఉండటంతో మల్లెల బాబ్జీ మానసికంగా కుంగిపోయాడు. చంద్రబాబు ఇస్తానన్న డబ్బు కోసం చెప్పులు అరిగేలా తిరిగినా కనీసం దర్శనభాగ్యం కూడా లభించలేదు. చివరికి 1987 నవంబర్ 30న విజయవాడలోని కనకదుర్గలాడ్జిలో ఫ్యానుకు ఉరి వేసుకొన్నాడు. అప్పుట్లో అందరూ బాబ్జీది హత్యేనని ఆరోపించారు. ఆ సమయంలో బాబ్జీ జేబులో స్వదస్తూరితో ఉన్న లేఖలో కఠోర నిజాలు వెలుగుచూశాయి. చంద్రబాబు తనకు రూ.3లక్షలు ఇస్తామని చెబితే ఎన్టీఆర్‌పై చిన్నపాటి చాకు విసిరానని, తీరా ఇచ్చింది రూ.30వేలేనని, హత్యాయత్నం డ్రామాను చంద్రబాబే ఆడించారని బాబ్జీ ఆ లేఖలో పేర్కొన్నాడు. చిల్లర ప్రచారం కోసం మల్లెల బాబ్జీ ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు గత చరిత్ర తెలియనట్టే నటనలో జీవిస్తూ నటరత్న నందమూరి తారకరామారావు నటననే మరిపిస్తున్నారు. అన్నదాత హంతకులెవరు ? బషీర్‌బాగ్ దమనకాండ అది ఆగస్టు 28, 2000. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ అప్పటి ప్రతిపక్షపార్టీలు నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో 2000 సంవత్సరంలో జరిగిన పోలీసు కాల్పుల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలస్వామి(22), ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన రామకృష్ణలు మృతి చెందారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు తన హయాంలో.. కర్షకుడిపై విరుచుకుపడ్డాడు వ్యవసాయం దండగన్నాడు కళ్లు తిరిగేలా కరెంటు బిల్లులిచ్చాడు మోటార్లకు మీటర్లు బిగించాడు హార్స్పవర్ రేటును పెంచేశాడు రకరకాల చార్జీలతో పిప్పిచేశాడు నీటి తీరువానూ పెంచాడు నిస్సహాయులను దొంగల్లా చూశాడు వేలాది కేసులు పెట్టించాడు బషీర్‌బాగ్, కాల్దరి, చినగంజాం.. ఊరేదైనా ఉద్యమంపై ఉక్కుపాదం మోపాడు బక్కరైతు గుండెలపై తుపాకీ ఎక్కుపెట్టాడు. చినగంజాంలో రైతులను చంపేశాడు అది ఫిబ్రవరి 11, 2000 సంవత్సరం. ప్రకాశం జిల్లా చినగంజాం. ఓ బహుళ జాతి సంస్థను ఆనాటి టీడీపీ సర్కార్ వెనకేసుకు రావడాన్ని రైతులు నిరసించారు. ఉప్పు తయూరీ వల్ల పంట భూవుులు నిరుపయోగవువుతాయుని ఆందోళన వ్యక్తం చేశారు. కడుపు వుండి రోడ్డెక్కిన రైతులపై పోలీసులు పాశవికంగా కాల్పులు జరిపారు. దీంతో రాజుబంగారు పాలేనికి చెందిన కుక్కల పుల్లారెడ్డి, మూలగానివారి పాలేనికి చెందిన రాజు రాఘవ రెడ్డి బలయ్యూరు. అనంత.. రక్త చరిత్ర ►చంద్రబాబు దన్నుతో చెలరేగిన దేశం నేతలు.. ► ప్రతిపక్ష పార్టీ నేతల ఊచకోత టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో అనంతపురం జిల్లాలో రక్తం ఏరులైపారింది. చంద్రబాబు కనుసైగలతో పరిటాల రవి తన ప్రైవేటు సైన్యంతో ప్రతిపక్ష పార్టీ నేతలను ఊచకోత కోయించారు. బాబు హయాంలో 200 మందికిపైగా హత్యకు గురయ్యారు. 130 మందికిపైగా నేతల ఆచూకీ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. వర్గాధిప్యతమే లక్ష్యంగా పీపుల్స్‌వార్‌లో పనిచేసిన పరిటాల రవి 1993లో పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తరువాత టీడీపీ తీర్థం పుచ్చుకుని.. రాజకీయ అరంగేట్రం చేశారు. కొద్ది రోజులకు ఆయన కుడిభుజం పోతుల సురేష్ పీపుల్స్‌వార్‌లో క్రియాశీలకమయ్యారు. 1993 అక్టోబరు 24న, మద్దెలచెర్వు సూరి ఇంట్లో టీవీ బాంబును పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో సూరి తల్లి సాకమ్మ, సోదరుడు రఘునాథరెడ్డి, సోదరి పద్మావతి, చంద్రశేఖర్(7), నారాయణప్ప దుర్మరణం చెందారు. దీనిపై ఆగ్రహించిన పీపుల్స్‌వార్ పోతుల సురేష్‌ను బహిష్కరించింది. దీంతో రీఆర్గనైజింగ్ కమిటీ(ఆర్వోసీ)ని ప్రారంభించారు. 1994లో పరిటాల పెనుకొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రైవేటు సైన్యం ఆర్వోసీ రెచ్చిపోయింది. దొరికినవారిని దొరికినట్లుగా ఊచకోత కోసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిటాల ప్రైవేటు సైన్యం పెనుకొండ, ధర్మవరం, తాడిపత్రి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేసింది. చంద్రబాబు దన్నుగా నిలవడంతో వారి ఆగడాలకు హద్దులేకుండా పోయింది. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే సానే రమణారెడ్డి, తాడిపత్రి మండలం యాడికి ఎంపీపీ బాలా సతీష్ తదితరులను దారుణంగా నరికి చంపారు. దాదాపు 200 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్వోసీ చేతిలో హతమయ్యారు. ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల్లో 130 మందికి పైగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కిడ్నాప్‌నకు గురయ్యారు. వీటిపై వివిధ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదైనా ఇప్పటివరకు వారి ఆచూకీ తెలియడం లేదు. అదృశ్యమైనఅత్యధికులను చంపి శవాలను రామగిరి బంగారు గనుల్లో పారవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 1995 నుంచి 2003 వరకూ ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ అనంతపురం జిల్లాలో హత్యకాండపై తెలుగుదేశం సర్కారును అప్పటి విపక్షాలు నిలదీసినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. పరిటాల ప్రైవేటు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన రెడ్‌స్టార్ అనే నక్సల్ గ్రూపుపై బాబు పోలీసులను ఉసిగొల్పి ఎన్కౌంటర్లు చేయించారు. ఇదీ చంద్రబాబు అనంత.. రక్తచరిత్ర! ఆడపడుచులపై అమానుషం ‘మహిళా ఓట్లతోనే అధికారంలోకి వచ్చాం.. వారంతా మా పక్షమే’... అప్పట్లో చంద్రబాబు పదేపదే చెప్పిన మాటలివి. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో తమకు ఏం జరిగిందని ఏ స్త్రీమూర్తిని అడిగినా ఆ నాటి ఘటనలు తలచుకుని మండిపడుతుంది. ఎన్నికల నాడు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించిన అంగన్వాడీలను ఇందిరా పార్క్ సాక్షిగా గుర్రాలతో తొక్కించిన వైనం... చంకలో పసిపిల్లలతో ఆందోళన చేస్తున్నా పోలీసులతో తరిమి తరిమి కొట్టించిన పాశవిక సన్నివేశం.. గుక్కెడు నీటి కోసం జన్మభూమిలో నిలదీస్తే తెలుగుసేన రూపంలో దండెత్తిన వైనం.. తండా మహిళలపై ‘దేశం’ తమ్ముళ్ల దారుణం.. ఎన్నని చెప్పేది? ఏమని చెప్పేది అని మహిళాలోకం ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమ గుండెలపై ఇంకా గుర్రపు డెక్కల ముద్రలు చెరిగిపోలేదని, తమ వీపులపై లాఠీదెబ్బల గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని.. ఆక్రో శిస్తుంది. మహిళా సాధికారత గురించి మహా గొప్పగా చెబుతున్న బాబు.. తన నైజాన్ని మార్చుకున్నాడంటే నమ్మం అంటోంది. కర్నూలులో రక్తకాసారం ⇒ టీడీపీ హయాంలో తమ్ముళ్ల కల్లోలం.. ప్రత్యర్థును వేటాడి మరీ చంపిన వైనం ⇒ కర్నూలు జిల్లాలో టీడీపీ హయాంలో తమ్ముళ్లు కల్లోలం సృష్టించారు. - పత్తికొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే శేషిరెడ్డి, కోడుమూరు కాంగ్రెస్ నాయకుడు పర్రప్పను 1996 ఏప్రిల్ 18న టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు. - హుసేనాపురానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నాగిరెడ్డి డోన్ నుంచి ఆటోలో వెళ్తుండగా కాపు కాసి టీడీపీవారు వేటకొడవళ్లతో హత్య చేశారు. - కౌతాళం మండలానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు మర్రెగౌడును ఆదోని ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వర్గీయులు హత్య చేశారు. - టీడీపీ నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు, అతని అనుచరులు ఒకే రోజు ఆరుగురు ప్రత్యర్థులను దారుణంగా హత్య చేశారు. - మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డిని కర్నూలు కొత్త బస్టాండ్‌లో అప్పటి తెలుగుదేశం నేత బెరైడ్డి అనుచరులు అత్యంత దారుణంగా హత్య చేశారు. - నందికొట్కూరు కాంగ్రెస్ నాయకుడు మాండ్ర గిడ్డారెడ్డి నామినేషన్‌కు హాజరైన పూడూరు వెంకటేశ్వర్లును బెరైడ్డి అనుచరులు హత్య చేశారు. బ్రాహ్మణకొట్కూరుకు చెందిన సాంబ శివారెడ్డి, చౌట్కూరు జనార్ధనరెడ్డి సోదరులు, మల్యాల టీకారెడ్డి, నంది కొట్కూరు ఉస్మాన్ బాషా, నెహ్రూనగర్‌కు చెందిన శ్రీరాములు, విలేకరి కృష్ణలింగ ప్రసాద్, దామగట్ల పుల్లారెడ్డి, లక్ష్మిరెడ్డి, ముచ్చుమర్రి స్వామిరెడ్డి, మర్రి వెంకటస్వామి తదితరులు కూడా టీడీపీ హయాం లో బెరైడ్డి వర్గీయుల చేతిలో హతమయ్యారు. కాల్దరిలో కర్షకులను కాల్చేశాడు పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్దరి రైల్వే స్టేషన్లో 1996 సెప్టెంబర్ 6న.. నీటి తీరువా, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని రైతులు రైల్‌రోకో చేపట్టారు. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే పోలీసులు నేరుగా తుపాకులను గురిపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో కాల్దరి గ్రామానికి చెందిన రైతు ఆలపాటి రామచంద్రరావు, వేలివెన్ను గ్రామానికి చెందిన రైతు గన్నమని కష్ణారావు అక్కడికక్కడే పిట్టల్లా రాలిపోయూరు. ఉద్యోగుల ఉసురు తీశాడు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కె.అప్పారావు. మరికొద్ది నెలల్లో రిటైర్ కావాల్సిన ఆయనను.. తోటి అధికారుల ముందు బాబు చేసిన అవమానం పొట్టన పెట్టుకుంది. టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా బాబు తీవ్ర పదజాలంతో మందలించడంతో అప్పారావు బాగా చిన్నబుచ్చుకున్నారు. అది టీవీ చానెళ్లలో కూడా ప్రముఖంగా రావడం, బంధుమిత్రులు, తెలిసిన వారు ఫోన్లు చేసి ఏం జరిగిందంటూ ఆరా తీయడంతో అయిన వారందరిలోనూ నవ్వులపాలయ్యానన్న భావనతో కుంగిపోయారు. దాంతో సన్నిహిత మిత్రుడు రాత్రి భోజనానికి పిలిచినా వెళ్లలేదు. మర్నాడు ఉదయం ఆఫీసుకు బయలు దేరుతూ, గుండెపోటుతో కారు వద్దే కుప్పకూలారు.. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చంద్రబాబు వైఖరికి అద్దం పట్టే సంఘటన. అందలమెక్కిస్తే అంతం చూశాడు దుర్మార్గుడు.. మేకవన్నె పులి గాడ్సేనే మించిన వాడు అభినవ ఔరంగజేబు.. మిడత..! మూర్తీభవించిన పదవీ కాంక్ష ప్రజాస్వామ్య హంతకుడు.. కుట్రకు కొలువు గూడుపుఠాణీకి గురువు.. మోసానికి మూలస్తంభం గుండెల్లో చిచ్చు పెట్టినవాడు.. గొడ్డు కన్నా హీనం చీమల పుట్టలో పాములా చేరిన వాడు .. ఇవన్నీ గిట్టని వారి మాటలు కావు. ఎన్నికల వేళ ఎవరి పేరు చెప్పుకుంటూ చంద్రబాబు ఊరూరా ఓట్లడుక్కుంటున్నారో, ఆ అన్నగారే స్వయానా అన్నమాటలు! దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. బాబు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుద రాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా నయవంచనకు, వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు! వెన్నుపోటుకు గురై అధికారం కోల్పోయిన అనంతరం బాబును దునుమాడుతూ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు.. గాంధీని చంపిన గాడ్సే కన్నా హీనుడని వాపోయారు. మూర్తీభవించిన పదవీ కాంక్షతో మోసం చేశాడని ఆవేదన చెందారు. అధర్మమని ఘోషించారు. ఆఖరికి.. అన్యాయమై..పోయారు! -
...సైకిల్లర్
' టీడీపీ పాలిట గుదిబండలా చంద్రబాబు ' ఆయన సారథ్యంలో ‘అలా... అట్టడుగుకు’ ' క్రమంగా తగ్గుతూ వస్తున్న టీడీపీ ఓట్ల శాతం ' ఎన్నికల గణాంకాలు చెబుతున్న వాస్తవమిది ' ప్రజల తిరస్కారానికి నిదర్శనం కె.సుధాకర్‌రెడ్డి: ఎన్నికలొస్తే చాలు... చంద్రబాబుకు చిత్త చాంచల్యం చెప్పలేనంతగా పెరిగిపోతుంది. ‘వస్తున్నా... నేనే వస్తున్నా’ అంటూ ప్రతి రోజూ కనీసం పదిసార్లయినా ప్రకటించుకుంటారు. ‘టీడీపీని అధికారంలోకి తెస్తున్నా’ అంటూ జోరీగను తలదన్నేలా... జనం చెవులు చిల్లులు పడేలా ఊదరగొడతారు. ఆ వెంటనే పచ్చ మీడియాకూ పూనకం పట్టేస్తుంది. ‘అవునవును... బాబే వస్తాడు... దున్నేస్తాడు’, ‘టీడీపీకి తిరుగు లేదు’ అంటూ రాజగురువు సారథ్యంలో ఎల్లో శిబిరం పిచ్చెత్తిపోతుంది. ‘రుజువు కావాలంటే సర్వేలివిగో’ అంటూ సొల్లు పోగేసి సంబరపడిపోతుంది. తీరా చూస్తే జనం టీడీపీని యథాప్రకారంగా మర్చిపోలేని రీతిలో ఓడిస్తారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి బాబు ఇటు టీడీపీ పగ్గాలను, అటు సీఎం గద్దెనూ చేజిక్కించుకున్నప్పటి నుంచీ ప్రతి ఎన్నికల్లోనూ రుజువవుతూ వస్తున్న వాస్తవమే ఇది. ఒక్క 1999 మాత్రం ఇందుకు మినహాయింపుగా కన్పించినా ఆ ఎన్నికల్లో కేవలం వాజ్‌పేయి గాలితో గట్టెక్కారే తప్ప అందులో బాబు ఘనతేమీ లేదు. 1995 నుంచీ ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే తెలిసేదొక్కటే.. చంద్రబాబు పచ్చ పత్రికల ప్రచారమే ప్రాణవాయువుగా నెట్టుకొస్తున్నారు తప్ప ప్రజలను ఏనాడూ నమ్మలేదు. వారి బాగోగులను ఎన్నడూ పట్టించుకోలేదు. దాంతో సహజంగానే ప్రజలు కూడా చంద్రబాబును ఏనాడూ నమ్మలేదు. పొరపాటున కూడా ఆయనను నమ్ముకోలేదు! గాలి సరే.. సైకిలేది టీడీపీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, ఎంతసేపూ తన సొంత ఇమేజీ పెంచుకోవడానికి బాబు పడ్డ తాపత్రయం వల్ల పార్టీ గ్రాఫ్ అధఃపాతాళానికి పడిపోయింది. చెప్పింది ఏనాడూ చేయని, పొరపాటున కూడా మాటపై నిలబడని బాబు వైఖరి వల్ల టీడీపీ ఎప్పటికప్పుడు ప్రజల్లో చులకనవుతూనే వస్తోంది. చివరికి ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోందే కనీస స్థాయి ఫలితాలు కూడా దక్కించుకోలేని స్థితికి టీడీపీని చంద్రబాబు దిగజార్చారంటూ సొంత పార్టీ నేతలే వాపోతున్న పరిస్థితి! రెండు దశాబ్దాలుగా ఎన్నికల్లో టీడీపీకి తగ్గుతూ వస్తున్న ఓట్ల శాతాన్ని తలచుకుని వారంతా ఆవేదన చెందుతున్నారు. 1995లో ఎన్టీఆర్ నుంచి పార్టీని, అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు, ఒక్క 1999ని మినహాయిస్తే అన్ని ఎన్నికల్లోనూ ఘోర పరాజయమే చవిచూస్తూ వస్తున్నారు. ఆయన భస్మాసుర హస్తం బారిన పడి టీడీపీ నానాటికీ కుదేలవుతూనే వస్తోంది. 1982లో ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత 1995 దాకా పార్టీ ఆయన నాయకత్వంలోనే కొనసాగింది. వైస్రాయ్ కుట్రతో మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు 1995 సెప్టెంబర్ నుంచి పార్టీని తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ ఆయన సారథ్యంలో టీడీపీకి వరుస పరాజయాలే. అది మాత్రమే కాదు టీడీపీ ఓటు బ్యాంకు స్థిరంగా పడిపోతోంది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 46.21 శాతం ఓట్లు వచ్చాయి. 1999 ఎన్నికల్లో వాజ్‌పేయి గాలి పుణ్యాన 43.87% ఓట్లతో పరువు దక్కించుకుంది. ఆ తర్వాత నుంచీ బాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు ఆయన్ను అస్స లు నమ్మలేదు. బీజేపీతో అంటకాగినా ఛీ పొమ్మన్నారు. అలా కాదని ఆ తర్వాత అటు టీఆర్ఎస్, ఇటు వామపక్షాలన్నింటినీ కలుపుకుని ‘మహా కూటమి’ అంటూ మాయ వేషాలేసినా మట్టికరిపించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 37.59 శాతం ఓట్లే వచ్చాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనైతే మరీ దారుణంగా 28.12 శాతం ఓట్లతో కుదేలైంది. వైఎస్ ఐదేళ్ల పాలనకు జనం జై కొట్టారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి ప్రతిఫలించింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీకి 44.82 శాతం ఓట్లొచ్చాయి. బాబు పగ్గాలు చేపట్టాక 1996 ఎన్నికల్లో 32.59 శాతం, 1998 లో 31.97 శాతం ఓట్లొచ్చాయి. ఇక 2004లో టీడీపీ 33.12 శాతానికి, 2009లో ఏకంగా 25 శాతం ఓట్లకు పడిపోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అక్షరాలా మట్టికరిచింది. దాదాపు 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే అన్ని చోట్లా బాబు సారథ్యంలో దిగ్విజయంగా దారుణ పరాజయాన్ని మూట గట్టుకుంది. అనేక చోట్ల మూడో స్థానానికి దిగజారింది. పలు స్థానాల్లోనైతే డిపాజిట్లు కోల్పోయి బిక్కముఖం వేసింది. దాంతో ప్రస్తుతం టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. 2004లో బీజేపీతో పొత్తు ఫలించకపోవడంతో 2009లో టీఆర్ఎస్, వామపక్షాలతో అంటకాగారు. అయినా తలకు బొప్పి కట్టడంతో వాటిని వదిలి ఈసారి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. బాబు ఏనాడూ ప్రజలను నమ్ముకోకపోవడమే ఆయన పరాజయాల పరంపరకు ప్రధాన కారణమని అంతా అంటుంటారు. ‘‘ప్రజాక్షేమం పట్టక అధికారం కోల్పోయినా బాబు గుణపాఠం నేర్వలేదు. ప్రజల పక్షాన ఉద్యమాలు చేసిన పాపాన పోలేదు. ము ఖ్యంగా నాలుగేళ్లకు పైగా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా కంటక పాలనను కనీసం ప్రశ్నించలేదు. పెపైచ్చు చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఏకంగా పాలక కాంగ్రెస్‌తో అన్నింటా కుమ్మక్కయ్యారు. అందుకు ప్రతిఫలాన్ని మరో ఘోర పరాజయం రూపంలో అనుభవించక తప్పదు’’ అన్నది ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్న మాట. బాబు... ఓ ధృతరాష్ట్ర కౌగిలి కూటమి మిత్రులకు చంద్రబాబుది సాక్షాత్తూ ధృతరాష్ట్ర కౌగిలే! ఇది 2004లో బీజేపీకి బాగా తెలిసొచ్చింది. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత 2009 ఎన్నికల్లో ఎటూ పాలు పోని స్థితిలో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐలను ముగ్గులోకి లాగి మహాకూటమి కట్టారు బాబు. కానీ బాబును నమ్ముకున్న పాపానికి టీఆర్ఎస్ వంటి ఉద్యమ పార్టీ కూడా మర్చిపోలేని పరాజయాన్ని చవిచూసింది. ఇక సీపీఎం, సీపీఐ అయితే బాబు పుణ్యాన నిండా మునిగాయి. నగదు బదిలీ పథకం, ఉచిత కలర్ టీవీలు, 12 గంటలు ఉచిత విద్యుత్, అన్ని రకాల రుణాల మాఫీ, వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగ భృతి, ఉచిత విద్య... ఇలా బాబు ఏకంగా 40 రకాలైన ఆల్‌ఫ్రీ హామీలు గుప్పించినా ప్రజలు మాత్రం ఆయనను ఏమాత్రం నమ్మలేదు. దాంతో 30 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ పరాజయాన్ని 2009లో చవిచూసింది. పార్టీకి అంత తక్కువ ఓట్ల శాతం రావడం అదే తొలిసారి! -
బాబు..తేనెపూసిన కత్తి
తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నగా చెబుతున్నాను దుర్మార్గుడు.. మేకవన్నె పులి గాడ్సేనే మించిన వాడు అభినవ ఔరంగజేబు.. మిడత..! మూర్తీభవించిన పదవీ కాంక్ష ప్రజాస్వామ్య హంతకుడు.. కుట్రకు కొలువు గూడుపుఠాణీకి గురువు.. మోసానికి మూలస్తంభం గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు.. గొడ్డు కన్నా హీనం చీమల పుట్టలో పాములా చేరిన వాడు తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. నాటి నుంచి నేటి వరకూ జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజా న్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో; నిజమేదో అబద్ధమేదో; ఆశయమేదో ఆశేదో మీకు తెలియాలనే ఈ ప్రయత్నం. నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే. ఇవన్నీ గిట్టని వారి మాటలు కావు. ఎన్నికల వేళ ఎవరి పేరు చెప్పుకుంటూ చంద్రబాబు ఊరూరా ఓట్లడుక్కుంటున్నారో, ఆ అన్నగారే స్వయానా అన్నమాటలు! దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. బాబు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుద రాజాలు. అల్లుడని నమ్మిన వాని చేతిలోనే అడ్డంగా నయవంచనకు, వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు! పిల్లనిచ్చిన మామనే ఇంతగా క్షోభ పెట్టి, ఆయనతో ఇన్ని రకాలుగా తన కీర్తిగానం చేయించుకున్న పుణ్య చరితుడు నారా బాబు. వెన్నుపోటుకు గురై అధికారం కోల్పోయిన అనంతరం బాబును దునుమాడుతూ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఆయన మాటల్లోనే చదవండి... బాబు ఒక చిన్న మిడత 224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది, (1995లో) లోలోన గూడుపుఠాణీ ఆరంభించారు. దీనికిగురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబు నాయుడు! నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉంటూ, మంత్రులపై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు తెలుగుదేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్న మిడత. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించి, చేరదీస్తున్న గ్రూపుల గురించి పట్టిం చుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందని, అతడి వల్ల ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందని, అతని వల్ల ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందని, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురౌతుందని, అధికారం కోసం ఆ పెద్దమనిషి ఇంతటి అల్పమైన నీచమైన దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడని నేనూహించలేకపోయాను. నా మీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీపట్ల శ్రద్ధాభక్తులతో, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ నా కార్యకర్తలకూ ఏ నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది! చంద్రబాబు... ఆ పెద్దమనిషి.... ఆ మేకవన్నె పులి... ఆ తేనెపూసిన కత్తి తయారుచేసిన కుట్రదారులకే జరిగింది!! అతడి పక్కన చేరి, కుహనా కార్యకర్తలుగా చెలామణై, దళారీలుగా ఉన్నవారికే జరిగింది!!! పేరు చెప్పేందుకూ అనర్హుడే ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడు. నా విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాటిచ్చాడు. కానీ అతని మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేనిన్ని పదవులిచ్చాను. కానీ ఆయన మాత్రం తనకంటూ ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధంగా (1994 ఎన్నికల్లో) మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు! కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130, 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండేవాళ్లు. మాకిది కావాలి, అది కావాలంటూ కోరేవారు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం కూడా నాకిష్టం లేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అందరికీ 5 లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్నికల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకి వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఆయన మనసులో చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్ ఏ ప్లాన్డ్ ట్రెచెరీ! మరో ఔరంగజేబు చరిత్రను చూస్తే... తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లున్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు... ఔరంగజేబు. అలాంటి దురదృష్టకరమైన విధానం మళ్లీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభవించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజాస్వామ్యానికిది చిన్నతనం. (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటుకు కొద్ది రోజుల ముందు) నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లినప్పుడు అక్కడ కూడా ఈ మహానుభావుడే, ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో... అవమానకరంగా వ్యవహరించారో... తెలుగుజాతిని కించపరిచారో... ఆ మహానుభావుడే, ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగుదేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయకుడు’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు? గాడ్సేను మించినవాడు ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు! ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు... ఎన్టీఆర్లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన నేరం? బాబును చరిత్ర క్షమించదు అయామ్ ద లయన్. నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. కాబట్టి నాకెలా అవమానం జరిగింది, నా వాళు,్ల నా అన్నవాళ్లు నన్నే విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడిగట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ క్షమించదు. మీకు ఏ విధమైన రాజకీయం కావాలి? ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి? అది నిర్ణయించుకోవాల్సింది మీరే. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి ఓ చక్కని రూపం దిద్దగలుగుతుందో, అలాంటి పార్టీకే మీరు నిర్భయంగా ఓటేయండి. ఓటు మీ జన్మహక్కు. దాన్ని నిరుపయోగం చేయకండి. పిరికితనంతో దాన్ని మరో రకంగా ఉపయోగించకండి.... ఇది ‘అన్న’ మాట. -
సైకిల్ ఓటు కోసం.. హవాలా రూటు
రూ.కోట్లతో గట్టెక్కాలనుకుంటున్న టీడీపీ సరికొత్త మార్గంలో అభ్యర్థులకు అందుతున్న సొమ్ము హైదరాబాద్‌లోని బడా వ్యాపారులతో ఒప్పందం నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున తరలింపు నిద్రాణ స్థితిలో నిఘా యంత్రాంగం జనం అభిమానాన్ని.. వారి కష్టాలకు చలించి, వాటిని తీర్చడానికి శ్రమించడం ద్వారా సొంతం చేసుకోవడం తెలియని వారు ధనంతో దాన్ని ‘కొనుగోలు’ చేయగలమనుకోవడంలో ఆశ్చర్యం లేదు. స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల్లోనే డబ్బు సంచులు కుమ్మరించిన తెలుగుదేశం.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహాన్నే సృష్టించి గట్టెక్కాలనుకుంటోంది. నీతి తప్పాలనుకునే వారికి నిఘాలు ఓ లెక్క కాదంటూ.. ఎన్నికల కమిషన్ ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంతటి నిఘా ఉంచినా.. టీడీపీ అంచనాలకు అందని స్థాయిలో ఖర్చు చేస్తోంది. పోలింగ్ నాటికి మరిన్ని రెట్లు వెచ్చించడానికి దారులూ సిద్ధం చేసుకుంది. సాక్షి, రాజమండ్రి : జిల్లాలో ఇప్పటికే నియోజకవర్గానికి రూ.మూడు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్లు ఖర్చు చేసేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు.. పోలింగ్ నాటికి మరింత విచ్చల విడిగా వెదజల్లేందుకు అవసరమైన నోట్ల కట్టలను ‘హవాలా’ రూట్లో రప్పించునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ ప్రముఖుడు ఉభయ గోదావరి జిల్లాల్లో తన పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పంపిణీ చేసేందుకు ప్రధానంగా హవాలాను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఏమిటీ హవాలా.. రాజధానిలో ఉండి వ్యాపారం చేసే వివిధ వస్తువుల రాష్ట్రస్థాయి పంపిణీదారులకు, జిల్లాలోని రీజనల్ పంపిణీదారులు, హోల్‌సేలర్లకు మధ్య రోజూ వ్యాపార లావాదేవీల్లో భాగంగా రూ.కోట్లు చలామణీ అవుతాయి. ఇందులో కొంత బ్యాంకు డిపాజిట్ల ద్వారా, మరి కొంత నగదు రూపంలో చేతులు మారుతుంది. రోజూ హైదరాబాద్ నుంచి వచ్చే పంపిణీదారుల ప్రతినిధులు ఈ డబ్బును నగదు, చెక్కులు, డీడీల రూపంలో వసూలు చేసుకుని వెళుతుంటారు. ఈ డబ్బును స్థానికంగా అవసరమైన అభ్యర్థులకు సర్దుబాటు చేసి ఫలితంగా కమిషన్ పొందడమే హవాలా. ఇక్కడ చెల్లించిన మొత్తాన్ని తక్షణం లేదా కొంత కాలం తర్వాత హైదరాబాద్ వ్యాపారులకు కమీషన్‌తో సహా పార్టీ చెల్లించేస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నలుగురు బడా వ్యాపారులు, రాజమండ్రిలో ముగ్గురు స్థానిక వ్యాపారుల సహకారంతో డబ్బు పంపిణీకి టీడీపీ అభ్యర్థులు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వీరంతా గతం నుంచీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత విశ్వసనీయంగా పనిచేసే వ్యక్తులు. కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుపుతున్న వీరు హైదరాబాద్‌లో అక్కడి ముఖ్య నేతలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జిల్లాలోని వివిధ హోల్‌సేల్ వ్యాపారాలు చేస్తున్న వారు నోటిమాటే హామీగా రూ.కోట్లు పార్టీకి ఇప్పిస్తారు. అందుకుగాను రూ.లక్షకు రూ.200 కమిషన్ లభిస్తుంది. కమిషన్‌లో కొంత హైదరాబాద్ వ్యక్తులు తీసుకోగా కొంత స్థానిక వ్యాపారులు తీసుకుంటారు. అవసరమైతే ఈ పద్ధతిలో ఎన్ని కోట్లయినా సర్దుబాటు చేసేందుకు హవాలాదారులు సిద్ధంగా ఉంటారు. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో ఉండే తమ రిటైలర్లు, సబ్ డీలర్లను సంప్రదించి ఈ వ్యాపారులు స్థానిక టీడీపీ నేతలకు డబ్బు సర్దుబాటు చేస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ వారు ఈ మూడు ప్రాంతాల నుంచి చుట్టుపక్కల అసెంబ్లీ నియోజక వర్గాలకు భారీగా డబ్బు చేరవేస్తున్నట్టు సమాచారం. ఇలా రూ.కోట్లు సర్దుబాటు చేయడానికి.. తక్కువ వ్యవధిలో కమీషన్ వస్తుందన్న ఆశ ఓ కారణం కాగా.. రాజకీయపరమైన ఒత్తిళ్లు, మొహమాటాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. -
సొంత ప్రయోజనాల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు:చిరంజీవి
చంద్రబాబుది ఆఖరిపోరాటం: చిరంజీవి సాక్షి, విశాఖపట్నం : సొంత ప్రయోజనాలను కాపాడుకొనేందుకే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని కేంద్ర మంత్రి, ఏపీ కాంగ్రెస్ ప్రచార సారథి చిరంజీవి చెప్పారు. ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి రాజకీయ జీవితం అయిపోయినట్టేనని, అందుకే ఎలాగైనా గెలవాలని సాధ్యంకాని హామీలను గుప్పిస్తూ ఆఖరిపోరాటం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిరంజీవి బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు స్వార్థపరుడని చెప్పారు. ఆయన స్వార్థ ప్రయోజనాలకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, దేశ ప్రయోజనాల కోసం కాదని తెలిపారు. బాబు మళ్లీ అధికారంలోకి వస్తే బషీరాబాగ్ ఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు బీసీలు, మహిళలకు ఇచ్చిన డిక్లరేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే ఎక్కువ మంది భూ బకాసురులున్నారని, వారికి అప్పుడు చంద్రబాబు కల్పించిన వెసులుబాటులే తర్వాతివారికి కొనసాగింపుగా మారాయని చెప్పారు. బీజేపీలో ఏకవ్యక్తి పాలన నడుస్తోందని, మోడీది హిట్లర్ తత్వమని చెప్పారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. -
యాదవుల గుస్సా!
చీరాల, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి యాదవులు అధికంగా టీడీపీ వెంట నడిచారు. పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలుగా ఉండేవారు. అభ్యర్థులెవరైనా సరే నిక్కచ్చిగా పార్టీ కోసమే పనిచేసేవారు. టీడీపీతో అప్పట్లో యాదవ సామాజిక వర్గానికి విడదీయరాని బంధం ఉండేది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కూడా పార్టీలో యాదవ సామాజికవర్గానికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఈ క్రమంలోనే జిల్లాలో చిమాటా సాంబు, మారుబోయిన మాలకొండయ్య, పాలేటి రామారావు వంటి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారు. టీడీపీ పగ్గాలు చంద్రబాబునాయుడు చేతికి వచ్చాక యాదవ సామాజిక వర్గంపై చిన్నచూపు చూడటం మెదలు పెట్టాడు. అందుకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక్క నియోజకవర్గంలో కూడా యాదవ సామాజిక వర్గానికి టీడీపీ టికెట్ కేటాయించ లేదు. జిల్లాలో మూడు లక్షలకు పైచీలుకు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, మార్కాపురం, చీరాల, ఒంగోలు నియోజవర్గాల్లో వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే సామర్థ్యం వీరికి ఉంది. ఆది నుంచి ఎక్కువ మంది తెలుగుదేశంలో ఉన్నా వీరికి ఈ సారి ఎక్కడా రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోవడంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పలు స్థానాల కోసం యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ చిమాటా సాంబు, గోర్ల శ్రీనివాస్‌యాదవ్, ఎంఎం కొండయ్య, వైవీ సుబ్బారావు వంటి నేతలు ప్రయత్నించినా బాబు కరుణించలేదు. దీంతో ఆ సామాజిక వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ముందు నుంచీ పార్టీ కోసం శ్రమించిన త మకు ప్రాధాన్యత లేకుండా చేయడం అన్యాయమంటున్నారు. యాదవులను టీడీపీ విస్మరించింది బుర్ల రాము, అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ యాదవులను పూర్తిగా విస్మరించింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా యాదవులు బాబుకు అండగా ఉన్నారు. జిల్లాలో 3 లక్షలకు పైచీలుక ఉన్న యాదవులకు టీడీపీ ఒక్క సీటు కూడా కేటాయించకపొవడం అన్యాయం. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు సముచిత స్థానం కల్పించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని సైతం యాదవులకు కేటాయించింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరలైనా వైఎస్సార్ సీపీ మాత్రం యాద వ సామాజికవర్గానికి చెందిన నూకసాని బాలాజీని బరిలోకి దించింది. కనిగిరి అసెంబ్లీ సీటును కూడా బుర్ర మధుసూదన్ యాదవ్‌కు ఇవ్వడంతో యాదవులాంతా వైఎస్సార్ సీపీకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. యాదవులను గుర్తించిన వైఎస్సార్ సీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో సముచిత స్థానం కల్పించింది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా అధిక ప్రాధాన్యత కల్పించింది. కనిగిరి నియోజకవర్గం నుంచి బుర్రా మధుసూదన్‌యాదవ్‌కు టికెట్ కేటాయించింది. జనరల్‌కు రిజర్వ్ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీకి అవకాశం కల్పించింది. కొద్దోగొప్పో కాంగ్రెస్ పార్టీ కూడా యాదవులకు ప్రాధాన్యం ఇచ్చింది. కందుకూరు నుంచి రాచగొర్ల వెంక ట్రావ్, అద్దంకి నుంచి గాలం లక్ష్మికి అవకాశం కల్పించారు. అయితే చివర్లో గాలం లక్ష్మి స్థానంలో ఈదా సుధాకర్‌రెడ్డిని మార్చారు. -
కుమ్ములాట
లోకేష్ పర్యటనతో మరింత బహిర్గతం దామచర్లకు వ్యతిరేకంగా పావులు కదిపిన ప్రత్యర్థి వర్గం ఒంగోలులో ప్రచారం చేయకుండానే వెళ్లిన లోకేష్ ఆవేదనకు లోనైన అభ్యర్థి జనార్దన్ ఒంగోలు జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ ఒక రోజు పర్యటన నిమిత్తం జిల్లాకు రావడంతో పార్టీలో విభేదాలు మరింతగా బహిర్గతమయ్యాయి. లోకేష్ ఒక రోజు ముందు రాత్రి జిల్లాకు చేరుకున్నా, అతని పర్యటనను ఆలస్యం చేయించేందుకు ఒక వర్గం ప్రయత్నించి, సఫలీకృతం అయ్యింది. తద్వారా ఒంగోలు పర్యటనలో ఆయన ప్రసంగించకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. షెడ్యూలు ప్రకారం జిల్లాలో మార్టూరు, అద్దంకి, ఒంగోలు సభల్లో లోకేష్ ప్రసంగించాల్సి ఉంది. మొదటి సమావేశం మార్టూరులో సాయంత్రం ఐదు గంటలకు జరిగింది. రెండవ సమావేశం అద్దంకిలో ముగిసేసరికి రాత్రి తొమ్మిది గంటలు దాటింది. అక్కడి నుంచి ఒంగోలుకు రాత్రి 9.55 గంటలకు చేరుకున్నారు. ఎన్నికలకోడ్ అమలులో ఉండటంతో ఒంగోలులో ఆయన ప్రచారం చేయలేక పోయారు. 1.ఒంగోలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ శాసనసభ అభ్యర్థిగా రంగంలో ఉన్న విషయం తెలిసిందే. 2.దామచర్లపై వ్యతిరేకత ఉన్న ఒక వర్గం ఒంగోలులో లోకేష్‌ను ప్రచారం చేయ నీయకుండా చేసినట్లు తెలిసింది. 3. నగర శివారు ప్రాంతానికి వచ్చిన లోకేష్, అక్కడ నుంచే వెనుదిరిగి నెల్లూరు వెళ్లారు. దీంతో అసహనానికి గురైన దామచర్ల పోలీసులపై తన ప్రతాపాన్ని చూపించి, వారే సభను అడ్డుకున్నార ంటూ, దుర్భాషలాడారు. 4.ఇదిలా ఉండగా, జనార్దన్ కూడా జనసమీకరణ చేపట్టే బాధ్యతను తమ పార్టీ వర్గాలకు ఇవ్వలేదని తెలిసింది. 5.అంతర్గత కుమ్ములాటల వల్ల తమ పార్టీనాయకులను నమ్మే పరిస్థితిలో ఆయన లేరని సమాచారం. 6.దీంతో ప్రైవేటు వ్యక్తుల ద్వారా జన సమీకరణ చేయించినట్లు సమాచారం. 7.ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు ఆయనపై వ్యతిరేకత పెంచుకున్నట్లు తెలిసింది. 8.జనార్దన్ నిజానికి కందుకూరు నియోజకవర్గం కోరుకున్నారు.ఒంగోలులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఢీకొని గెలిచే శక్తి లేదని భావించిన ఆయన, కందుకూరులో పోటీ చేయాలని భావించారు. దీనిపై పలు మార్లు పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకున్నట్లు తెలిసింది. 9.కందుకూరును దివి శివరాంకు కేటాయించి, వద్దన్న ఒంగోలును జనార్దన్‌కు కేటాయించారు. 10.పార్టీ కోసం కృషి చేస్తున్న తనకు కోరిన సీటు ఇవ్వక పోవడంపై జనార్దన్ ఒకింత కినుక వహించారు. 11.దీనికితోడు లోకేష్ ఒంగోలుకు ప్రాధాన్యం ఇవ్వకుండా వెళ్లడం మరింత ఆవేదనకు గురి చేసినట్లు సమాచారం. 12. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన మంగళవారం జరగాల్సిన ఓ సమావేశానికి గైర్హాజరయ్యారు. -
హరికృష్ణను సైడ్ చేసి బాలయ్యను లైన్ లోకి..
-
ఓట్ల కోసం రూ. 300 కోట్లు!!
-
ఓట్ల కోసం రూ. 300 కోట్లు!!
తెలంగాణలో ఉనికి కోసం తెలుగుదేశం పార్టీ పాట్లు 72 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల కోసం పంపిణీ! 30 చోట్ల ఒక్కో స్థానానికి రూ. 5 కోట్ల వరకూ నిధులు మరో 30 స్థానాల్లో ఉనికి కోసం అదనపు నిధులు హైదరాబాద్ నుంచే జిల్లాలకు నోట్ల కట్టలు సరఫరా ముగ్గురు పారిశ్రామికవేత్త ఎంపీలకు బాధ్యతలు విజయరమణారావు ఎపిసోడ్‌తో మరిన్ని జాగ్రత్తలు కోసం కోట్లు కుమ్మరించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసి పక్కాగా అమలు చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. క్షేత్ర స్థారుులో బీజేపీ ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. అందుకు బీజేపీ శ్రేణులు నిక్కచ్చిగా తిరస్కరిస్తున్నాయి. వురోవైపు తెలంగాణ ద్రోహుల పార్టీగా వుుద్రపడటంతో.. సొంత పార్టీ శ్రేణులకూ ప్రజల్లోకి వెళ్లడం కష్టవువుతోంది. వుున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో సరిగ్గా నామినేషన్లూ వేయులేని దుస్థితి గవునించిన టీడీపీ ఇక సార్వత్రిక ఎన్నికల్లో ‘ఓటుకు నోటు’ పథకాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పొత్తు కారణంగా బీజేపీకి వదిలేసిన 47 సీట్లు పోగా, పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న 72 సీట్లలో ఏ నియోజకవర్గానికి ఎంత మొత్తం వెచ్చించాలో లెక్కలు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం రాజకీయువర్గాల్లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం.. టీడీపీ పోటీ చేస్తున్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు వెచ్చించేందుకు చంద్రబాబు కోటరీ తయారు చేసిన పక్కా ప్లాన్ ప్రకారం రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు తెలంగాణ జిల్లాల్లోని నియోజకవర్గాలకు అందజేస్తారని సమాచారం. ఆ మొత్తాన్ని విడతల వారీగా ఆయా నియోజకవర్గాలకు పంపించే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. రెండు రోజుల కిందట పెద్దపల్లి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు వ్యక్తిగత సహాయకుడు రాజమౌళి ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా పట్టుకున్న రూ. 90 లక్షలు తొలి విడతలో భాగమేనని చెప్తున్నారు. ఇదే తరహాలోనే వురో ఆర్టీసీ బస్సులో మరో రూ. 5 కోట్ల వరకు తరలివెళ్లినట్లు పోలీస్ యంత్రాంగం అనుమానిస్తున్న విషయం తెలిసిందే. పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిఘా వర్గాలు దీనిపై దర్యాప్తు కూడా జరుపుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల కోసం టీడీపీ భారీ ఎత్తున డబ్బులు సేకరించి, పంపిణీ కోసం అసెంబ్లీ సెగ్మెంట్లకు తరలిస్తుందన్న సమాచారం కూడా ఈ సంఘటన తరువాతే పూర్తిస్థాయిలో రూఢీ అవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా పంపిణీ ప్రక్రియ తెలంగాణలోని పది జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఎంత మేర నిధులు పంపించాలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనకు సన్నిహితులైన ముగ్గురు రాజ్యసభ సభ్యులకు జాబితా ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరో పారిశ్రామిక వేత్తతో కలిసి వీరు ఎన్నికల కోసం నిధులు సిద్ధంగా ఉంచారని సమాచారం. తెలంగాణ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నాయకుడి ద్వారా ముందుగా ఎంపిక చేసిన నియోజకవర్గాలకు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంచులు తరలుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే తొలివిడత పంపిణీ కార్యక్రమం పూర్తికాగా, కొన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు అందలేదని.. వాళ్లు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు, రాజ్యసభ సభ్యుడికి ఫోన్లు చేసి లబోదిబో మంటున్నారని తెలుస్తోంది. ఈ అభ్యర్థులకు రెండో కేటగిరీ కింద నామినేషన్ల ఉపసంహరణల తరువాత ‘మూటలు’ వెళ్లనున్నట్లు సమాచారం. మూడు కేటగిరీలుగా వర్గీకరించి మరీ... మొదటి కేటగిరీలోని 30 నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థికి రూ. 5 కోట్ల దాకా అందజేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా పార్లమెంటు నియోజకవర్గం నుంచి కోటీశ్వరుడైన అభ్యర్థి ఉంటే ఆయనతో అదనంగా ఒక్కొక్కరికి రూ. 2 కోట్లు ఇప్పిస్తారనీ పేర్కొన్నాయి. ఈ నియోజకవర్గాల్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ద్వారా కాంగ్రెస్, టీఆర్ఎస్లకు టీడీపీ గట్టి పోటీ ఇస్తుందన్న సంకేతాలు పంపించాలని, అదృష్టం కలిసొస్తే విజయం సాధించవచ్చని ఆ పార్టీ నేతల ప్రణాళికగా చెప్తున్నారు. ఇక రెండో కేటగిరీలో గుర్తించిన మరో 30 స్థానాలను డబ్బుల పంపిణీ ద్వారా కనీసం గౌరవప్రదమైన ఓట్లతో మూడోస్థానంలో నిలిచే నియోజకవర్గాలుగా గుర్తించారని.. ఇక్కడ రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు వెచ్చించాలనే ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ వాదం అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ, మహబూబ్‌నగర్ వంటి జిల్లాలు ఈ కోవలోకి వస్తాయని చెప్తున్నారు. మిగతా సొమ్మును ఘోరంగా ఓడిపోతామని తెలిసినా పోటీలో నిలిచిన వారికి, బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో రెబెల్స్‌గా బరిలో నిలిచి పోటీ ఇచ్చే నేతలకు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. డబ్బుల పంపిణీ విషయం విజయ రమ ణరావు ఎపిసోడ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించడంతో ఈ ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. -
విశాఖ లోక్‌సభ బరిలో ‘గంటా’?
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు పోటీకి ససేమిరా అంటున్న గంటా విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కష్టాలు వెంటాడుతున్నాయి. విశాఖ లోక్‌సభకు పోటీచేయాలని తెలుగుదేశం అధిష్టానం నుంచి తాజాగా ఒత్తిడి రావడంతో ఆయన షాక్ అయ్యారు. బీజేపీని బుజ్జగించి విశాఖ లోక్‌సభ స్థానం బదులు కాకినాడ కేటాయించేందుకు ఇరు పార్టీల మధ్య ఇప్పటికే అంగీకారం కుదిరినట్టు సమాచారం. దీంతో ఆరునూరైనా విశాఖ లోక్‌సభ నుంచే గంటాను బరిలో దింపేందుకు పార్టీ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. కానీ, గంటా మాత్రం విశాఖ లోక్‌సభ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ససేమిరా అంటున్నట్టు తెలిసింది. ఈ స్థానంలో వైఎస్సార్సీపీ నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేదా షర్మిల పోటీచేస్తారన్న ప్రచారంతో ముందేఆయన చేతులెత్తేశారు. వారిద్దరిలో ఎవరు బరిలో నిలిచినా ఢీకొనే సత్తాలేదనే పోటీకి విముఖత చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు లోక్‌సభకు కాకుండా అనకాపల్లి అసెంబ్లీ సీటు కోసం ఆయన ప్రయత్నించారు. అక్కడ సర్వేల ద్వారా దారుణ పరాభవం తప్పదని తేలడంతో భీమిలీ వైపు దృష్టి సారించారు. తాజాగా అధినేత చంద్రబాబు గంటాను రెండు రోజుల కిందట తన వద్దకు పిలిపించుకుని విశాఖ ఎంపీగా బరిలో దిగాల్సిందేనని, లేకుంటే వేరే స్థానం కష్టమని తేల్చిచెప్పడంతో ఎటూతేల్చుకోలేకపోతున్నట్టు తెలిసింది. నిర్ణయించుకోవడానికి గడువు కోరి అనుచరగణంతో మంతనాల్లోనే మునిగితేలినట్టు సమాచారం. పోటీచేసి ఓటమి మూటగట్టుకునేకంటే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటేనే మేలేమోనని అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. -
కాంగ్రెస్, టీడీపీలను ఓడిద్దాం: సీపీఎం
38 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన.. త్వరలో మరో జాబితా! హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, బీజేపీలను ఓడించాలని సీపీఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కడికక్కడే పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కమిటీ శుక్రవారమిక్కడ భేటీ అయింది. 38 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, ఎన్నికల సర్దుబాట్లు, పొత్తులు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై చర్చించింది. సీపీఐతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించింది. 38 నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు.. పత్తిక కుమార్ (పాలకొండ), సీదరపు అప్పారావు (సాలూరు), యందవ మన్మధరావు (పార్వతీపురం), సీహెచ్ నర్సింగరావు (గాజువాక), రెడ్డిపల్లి కేఎస్వీ కుమార్ (విశాఖ ఈస్ట్), బొట్టా ఈశ్వరమ్మ (విశాఖ వెస్ట్), రొబ్బి భాగ్యలక్ష్మి (విశాఖ నార్త్), పెతకంశెట్టి వెంకట్‌రెడ్డి (విశాఖ సౌత్), ఎస్.రమేష్ (భీమిలి), డేగల అప్పలరాజు (ఎస్ కోట), కిల్లో సురేంద్ర (అరకు), సింగిరెడ్డి అచ్చారావు (రంపచోడవరం), కేతా గోపాలన్ (ఆచంట), తెల్లం రామకృష్ణ (పోలవరం), సీహెచ్ బాబూరావు (విజయవాడ సెంట్రల్), బోయి సత్యబాబు (విజయవాడ వెస్ట్), దోనేపూడి కాశీనాథ్ (విజయవాడ ఈస్ట్), ఎం.ప్రభాకర్ (తిరువూరు), ఆంజనేయులు (మైలవరం), నాగమణి (జగ్గయ్యపేట), కె.కళ్యాణ్ (నందిగామ), జేవీ రాఘవులు (మంగళగిరి), గద్దె చలమయ్య (సత్తెనపల్లి), నక్కా వజ్రాంజలి (వేమూరు), జాలా అంజయ్య (సంతనూతలపాడు), జీవీ కొండారెడ్డి (ఒంగోలు), జొన్నలగడ్డ వెంకమరావు (కోవూరు), మామిళ్లపల్లి మోహన్‌రావు (సర్వేపల్లి), కటికాల వెంకటేశ్వర్లు (వెంకటగిరి), దుగ్గిరాల అన్నపూర్ణమ్మ (సూళ్లూరుపేట), కందారపు మురళి (తిరుపతి), ఒంట్రి వెంకటరమణ (శ్రీకాళహస్తి), దేశాండి అరుణాచలం (సత్యవేడు), ఎంఎ గఫూర్ (కర్నూలు), కుప్పా వెంకటేశ్వర్లు (ఆదోని), విప్పల రాంభూపాల్‌రెడ్డి (అనంతపురం అర్బన్), బోదిరెడ్డి నారాయణ (కడప) -
టీడీపీ నేత దీపక్‌రెడ్డి ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశించండి
రూ. 6,781 కోట్ల వివాదాస్పద ఆస్తులపై హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా నాయకుడు జి.దీపక్‌రెడ్డి ఆస్తులపై దర్యాప్తునకు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)లను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అదే జిల్లాకు చెందిన మార్పు డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యుడు వి.సుధీర్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ జాయింట్ డెరైక్టర్లతో పాటు జి.దీపక్‌రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం ఈ నెల 15న విచారణకు రానున్నది. ‘దీపక్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో 2009-10 ఆర్థిక సంవత్సరానికి తన వార్షిక ఆదాయం రూ. 3.27 లక్షలుగా, తన భార్య ఆదాయం రూ. 1.98 లక్షలుగా పేర్కొన్నారు. వాటాలు, ఇతర చరాస్తులు తన పేరు మీద రూ. 4.59 కోట్లు, తన భార్య పేరున రూ. 1.76 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే తన పేరున రూ. 5.86 కోట్ల విలువైన స్థిరాస్తులు, తన భార్య పేరున రూ. 16.86 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చూపించారు. అంతేకాక వివాదాల్లో రూ. 6,781.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అఫిడవిట్‌ను బట్టి చూస్తే దీపక్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ ఆస్తుల వివరాలను ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్స్‌లో వెల్లడించలేదు. కేవలం ఆదాయం రూ. 5 లక్షలుగా మాత్రమే చూపారు. వివాదంలో ఉన్నట్లు చెబుతున్న ఆస్తులన్నీ ప్రస్తుతం దీపక్‌రెడ్డి స్వాధీనంలోనే ఉన్నాయి. వాటినెలా సంపాదించారో తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ, ఈడీల దర్యాప్తుకు ఆదేశాలివ్వండి’ అని పిటిషనర్ తన పిటిషన్లో కోర్టుకు విన్నవించారు. -
భంగపడ్డ మల్లునాయుడు
సిట్టింగ్ ఎమ్మెల్యేకే చోడవరం టికెట్ మెజార్టీ ఓటర్లున్న సామాజికవర్గాలను విస్మరించిన చంద్రబాబు! చోడవరం, న్యూస్‌లైన్ : ఒకప్పుడు టీడీపీని భుజాన మోసిన సామాజిక వర్గాలకు నేడు ఆ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదని సీనియర్ నాయకులు మథనపడుతున్నారు. మెజార్టీ ఓటర్లున్న కులాలను పదేళ్లుగా ఆ పార్టీ పక్కన పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి చోడవరం నియోజకవర్గంలో వెలమ సామాజికవర్గానికి చెందిన గూనూరు మిలట్రీ నాయుడుకు ఐదుసార్లు టికెట్టు ఇచ్చారు. మూడు సార్లు ఆయన గెలుపొందారు. ఎన్టీ రామారావు ఉన్నంతకాలం జిల్లాలో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి చోడవరం టికెట్టు మాత్రం మిలట్రీకే ఇచ్చారు. అప్పటి నుంచి మిలట్రీ సామాజికవర్గానికి చెందిన వారంతా టీడీపీతోనే ఎక్కువ శాతం ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 90వేలకుపైగా ఓటర్లు ఉన్న కాపు సామాజిక వర్గానికి, సుమారు 30 వేల మంది ఉన్న యాదవులకు ఆ పార్టీ ఎప్పుడూ ఎమ్మెల్యే టికెటు ఇవ్వలేదు. ఒక పర్యాయం స్థానికం కాని గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఇచ్చింది. చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆ పార్టీ నుంచి మిలట్రీ తప్పుకున్నారు. అప్పటి నుంచి ఆయన సామాజికి వర్గానికి చెందిన ప్రస్తుత ం గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌గా ఉన్న గూనూరు మల్లునాయుడు, ఆయన అన్న గూనూరు పెదబాబు టీడీపీని భుజాన వేసుకొని మోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 2009 ఎన్నికల్లో చోడవరం టికెట్టు తనకే ఇవ్వాలని గూనూరు మల్లునాయుడు కాపు సామాజికవర్గం నుంచి బత్తుల తాతయ్యబాబు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చూద్దామని వీరికి చంద్రబాబు చెప్పడంతో మల్లునాయుడు వెనక్కి తగ్గారు. అధినేత ఇచ్చిన హామీ మేరకు ఈసారి ఎలాగైనా టికెట్టు తనకే వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీని అంటిబెట్టుకొని గోవాడ సుగర్స్, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి అన్నివిధాలా శ్రమించి మంచి ఫలితాలు సాధించారు. అయ్యన్నపాత్రుడు మద్దతుతో చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. రెండో సారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు కే పార్టీ టికెట్టు ఇచ్చింది. పార్టీ పుట్టిన దగ్గర నుంచి భుజాన మోస్తున్న తమను కాదని కనీసం ఒక్కశాతం కూడా ఓట్లు లేని రాజుకి టిక్కెట్టు ఇవ్వడం మల్లునాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతోపాటు బత్తులతాతయ్యబాబు, వియ్యపు అప్పారావుతోపాటు మరింతకొంత మంది సీనియర్లు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం వెల్లగక్కుతున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే అయిన తర్వాత తన సొంత ప్రయోజనాల కోసం కొంత కాలం పార్టీని పట్టించుకోకుండా వదిలేసిన రాజును స్వయాన చంద్రబాబే మందలించిన విషయాన్ని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు. రాజును ప్రకటించిన తర్వాత ఆయనతో సమవుజ్జీగా ఉన్న ఆ పార్టీ నాయకులంతా అంటీముట్టనట్టు ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. -
బాబుకు జేఎంసీ షాక్
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు(జేఎంసీ) ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు. చంద్రబాబు నిరంకుశ పోకడలు, నమ్మకద్రోహానికి నిరసనగా ఆ పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీ జిల్లా పగ్గాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో, కష్టకాలంలో ఆ పార్టీ భారం మోసిన జం గాలపల్లి శ్రీనివాసులుకు చంద్రబాబు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పు డు డీకే కుటుంబానికి టికెట్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో తన అభిప్రాయానికి విలువ ఇవ్వని పార్టీలో కొనసాగలేక జంగాలపల్లి శ్రీనివాసులు బయటకు వచ్చారు. జిల్లా తెలుగుదేశం నాయకులకు కూడా ఒకరకంగా ఇది పెద్దషాకే. పార్టీలో కష్టపడి పని చేస్తూ జిల్లా అధ్యక్ష స్థానం లో ఉన్న వ్యక్తికే విలువ ఇవ్వకపోతే రేపు ఎన్నికల్లో కష్టపడి పనిచేసినా తమకెంతమాత్రం గౌరవమిస్తారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. చిత్తూరులో తొలి నుంచి ట్రస్టు ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజల్లో జంగాలపల్లికి పేరుంది. గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగారు. 2009లో పీఆర్పీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి సీకే బాబు చేతిలో 1500 ఓట్ల తేడాతో ఓడిపోయూ రు. తర్వాత టీడీపీలో చేరారు. జిల్లా నాయకత్వం తీసుకునేందుకు, పార్టీ కోసం డబ్బులు ఖర్చుచేసేందుకు అందరూ వెనుకాడుతున్న తరుణంలో జిల్లా బాధ్యతలను తలకెత్తుకుని పనిచేశారు. అయినా చంద్రబాబు సామాజికవర్గం తొలి నుంచి చిత్తూరు టికెట్టు రానివ్వకుండా జంగాలపల్లికి అడ్డుపడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరులో బలోపేతమైన వైఎస్సార్సీపీ జంగాలపల్లి శ్రీనివాసులు వైఎస్సార్సీపీలో చేరడంతో చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని ఆయన అనుచరవర్గం, బంధువులు వైఎస్సార్సీపీ వైపు రానున్నారు. తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలపడుతుంది. అంతేగాక గెలుపుదిశగా పయనించడానికి అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీలోని బలిజ సామాజికవర్గానికి చెందిన ప్రధానమైన వర్గం వైఎస్సార్సీపీ వైపు మరలనుంది. ఇప్పటికే ఏఎస్ మనోహర్‌ను ఇక్కడ బలిజ సామాజికవర్గం నుంచే పార్టీ సమన్వయకర్తగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి ఇంకా ప్రాధాన్యం ఇచ్చి మరొక ముఖ్య నాయకుడిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ క్రమంలో చిత్తూరు నియోజకవర్గంలో ఓట్లపరంగా అధిక సంఖ్యలో ఉన్న బలిజ సామాజికవర్గం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలవనుంది. మరికొంత మంది వైఎస్సార్సీపీ బాట బాబు వైఖరితో విసిగిపోయిన ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కూడా త్వరలో వైఎస్సార్సీపీ బాట పట్టనున్నారు. సొంత జిల్లాలో చంద్రబాబుకు ఇది దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయమే. ఇప్పటికే మదనపల్లెలో అసెంబ్లీ టికెట్టు బీజేపీకి వదిలేసిన కారణంగా తమ్ముళ్ల తిరుగుబాటు చంద్రబాబుకు సమస్యగా ఉంది. ఈ క్రమంలో చిత్తూరు నియోజకవర్గంలోనూ పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చుపెట్టగలిగే వారికే టికెట్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని, జంగాలపల్లి శ్రీనివాసులుకు మొండిచేయి చూపడంతో ఆయన జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పగ్గాలు చంద్రబాబుకు చేతికి వచ్చిన తర్వాత సొంత జిల్లాలో ఇంత పెద్ద స్థాయిలో షాక్ ఇవ్వడం ఇదే తొలిసారి అని, ఎన్నికల ముందు ఇప్పటికిప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉండేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి తీసుకుంటే చేతి నుంచి నిర్వహణ ఖర్చులు, ఇతర ఖర్చులు వారే పెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో ఆ దిశగా ఆలోచన చేయూలంటేనే టీడీపీ నాయకులు వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ దాఖలు కార్యక్రమం ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లాలోనే జంగాలపల్లి రాజీనామాతో టీడీపీ చుక్కాని లేని నావలాగా తయారైనట్లే. -
ఆత్మగౌరవం నిద్రాణం
* కాలరేఖపై కరిగిపోయి సూడో కాంగ్రెస్‌గా మారిన టీడీపీ * కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ పార్టీలో ఇప్పుడు అన్నీ కాంగ్రెస్ ముఖాలే * ఎన్టీఆర్ హయాంలో కార్యకర్తలకు పెద్దపీట.. ఇప్పుడు కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్ * నాడు సంక్షేమం.. నేడు సంక్షోభం.. కె.సుధాకర్‌రెడ్డి: పార్టీ ప్రస్థానం- తెలుగుదేశం అప్పుడు.. తెలుగుదేశం ప్రారంభించిన కొత్తలో.. ఎన్టీఆర్ ఇంటివద్ద ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటల నుంచే తన కోసం వచ్చే సందర్శకులను కలిసేవారు. ఎవరొచ్చినా ఒక్కొక్కరు వరుసలో వస్తూ కలిసివెళ్లే వారు. ఆ సమయంలో దేశంలో పేరెన్నికగన్న పారిశ్రామిక వేత్తలు సూటు బూటు వేసు కుని చేతిలో చిన్న సైజు సూట్‌కేసుతో వచ్చారు. పరిచయాలయ్యాక ఒక చెక్ బుక్ తీసి కోట్లలో అంకె వేసి పార్టీ ఖర్చుల కోసం మా తరఫున ఓ చిన్న కానుక అని ఎన్టీఆర్ చేతిలో పెట్టారు. అది చూసిన ఎన్టీఆర్ మండి పడ్డారు. మీరు మమ్మల్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారా? ఏమిటిదంతా..! అంటూ నిలదీశారు. ఇంకోసారి ఇలాంటివి చేయకండి బ్రదర్ అంటూ కోపంగా చెక్కును వెనక్కిచ్చేశారు. ఇప్పుడు... ఎన్టీఆర్‌ను గద్దెదింపి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు ఇంటివద్ద సందర్శకులకు అనుమతి లేదు. ఆ పరిసరాల్లో కార్యకర్తల జాడే కనిపించదు. కొంత హడావిడి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సూటు బూటు వేసుకున్న కొందరు అక్కడ ఏవేవో పనుల్లో నిమగ్నమవుతూ హడావిడి చేస్తుంటారు. వారి అనుమతి లేకుండా పార్టీ నేతలు సైతం గేటుదాటి లోనికి వెళ్లే పరిస్థితి ఉండదు. ఎవరైనా సూటు బూటు వేసుకుని నల్లటి సూట్‌కేసులతో వస్తే వారికి జరగాల్సిన సపర్యలన్నీ జరిగిపోతాయి. వారు నేరుగా ఇంట్లోకెళ్లి వెయిటింగ్ హాల్లో ఆసీనులవుతారు. వారెందుకొచ్చారో ఆ పరిసరాల్లో తచ్చాడే నేతలకు కూడా తెలియదు. వారు నాయకుడితో మాట్లాడి వెళ్లిపోయిన తర్వాతే నేతలెవరైనా కలవాలంటే కలుసుకోవచ్చు. అది కూడా ఓ మోస్తరు స్థాయున్న వారికైతేనే ప్రవేశం. కార్యకర్తలెవరైనా కలవాలనుకుంటే ఎన్టీఆర్ పేరుతో నిర్మించిన ట్రస్టుభవన్కే రావాలి. అక్కడే గంటల తరబడి నిరీక్షించాలి. నాయకుడెప్పుడొస్తారో కూడా చెప్పే వారుండరు. వచ్చాక ఎప్పుడు కలుస్తారో తెలియదు. ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన ఘనత ఆగస్టు సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తన శిబిరంలో చేరుతున్నట్లుగా చంద్రబాబు ప్రచా రం చేయించారు. ఆగస్టు నెలంతా ఇలాంటి డ్రామా నడిపి ఎమ్మెల్యేలపై మైండ్ గేమ్ ఆడి వారందరినీ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేలను తిరిగి ఆహ్వానించడానికి ఎన్టీఆర్ వైస్రాయ్ హోటర్కు బయలుదేరగా టాంక్‌బండ్‌పై ఆయన వాహనంపై చెప్పులేయించారు. ఎమ్మెల్యేలను హోటల్ గదుల్లో బంధించి ప్రతిరోజూ రాత్రి వారిని రకరకాల ప్రలోభాలకు గురిచేశారు. 19822014.. రెండు దశలు.. రెండు పార్శ్వాలు! పార్టీ స్థాపించిన తొలినాళ్లలో ఎన్టీఆర్‌ను చూస్తే కార్యకర్తలకు జోష్...! కార్యకర్తల జోష్ చూస్తుంటే ఎన్టీఆర్ అంతకన్నా హుషారుగా నా తమ్ముళ్లారా...! అంటూ మరింత ఉత్సాహం కలిగించేవారు. ఇదంతా తొలినాళ్లలో ఉన్న కోలాహలం...! ఇప్పుడు పార్టీలో ఆ పరిస్థితి లేదు. ముప్పయి ఏళ్లలోనే వృద్ధాప్యం ఆవరించింది. పార్టీ పరంగా చూస్తే టీడీపీలో 1982 నుంచి 1995 వరకు ఒక దశ. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన 1995 నుంచి 2014 వరకు రెండో దశ. ఈ రెండు దశల్లోనూ పార్టీలోని రెండు పార్శ్వాలు ఆవిష్కృతమయ్యాయి. రెండు కుట్రలు ఎన్టీఆర్‌ను గద్దె దింపడమే ధ్యేయంగా రెండు కుట్రలు జరిగాయి. ఒకటి 1984లో నాదెండ్ల భాస్కరరావు చేశారు. రెండోది సొంత అల్లుడు చంద్రబాబు చేశారు. దానికి ప్రజాస్వామ్య పరిరక్షణ అని పేరుపెట్టి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కారు. టీడీపీ ఏర్పా టు సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు.. సొంత మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానని సవాలు చేశారు. ఆయనపై పోటీ చేయనప్పటికీ తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే కుటుం బ సభ్యులతో రకరకాలుగా ఒత్తిళ్లు చేయించి టీడీపీలో చేరారు. మొదట్లో చంద్రబాబు చేరికను ఎన్టీఆర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కుటుంబ సభ్యుల ఒత్తిళ్లతో కాదనలేకపోయారు. అప్పటి నుంచే పార్టీలో చంద్రబాబు ముద్ర పడింది. టీడీపీ దారి తప్పింది. జామాతా దశమ గ్రహ.. ఓటమన్నది లేని ఎన్టీఆర్‌కు తన జీవితంలో అత్యంత దారుణమైన ఓటమి ఎదురైంది చంద్రబాబుతోనే. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కి ఏడాది కూడా గడవకముందే 1995 ఆగస్టులో అత్యంత నాటకీయంగా, కుట్ర పూరితంగా ఎన్టీఆర్‌ను గద్దెదించిన చంద్రబాబు అప్పటి నుంచి మళ్లీ పార్టీలో ఎన్టీఆర్ కుటుంబీకుల ప్రభావం లేకుండా జాగ్రత్తపడ్డారు. ఎన్టీఆర్‌ను దింపడానికి ఆయన కుటుంబ సభ్యులనే పావులుగా ఉపయోగించుకున్న బాబు అధికారం చేపట్టగానే ఒక్కొక్కరినీ దూరం పెట్టారు. హరికృష్ణకు పార్టీలో ప్రాధాన్యతను క్రమంగా తగ్గించడం, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీకి దూరం చేయడం అందులో భాగమే. చంద్రబాబు కుటిల నీతికి, దుర్మార్గానికి ఎన్టీఆర్ ఎలా బలయ్యారో.. ఎంత వేదన అనుభవించారో చంద్రబాబును ‘జామాతా దశమ గ్రహ’ అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగమే ప్రత్యక్ష నిదర్శనం. సంక్షేమాన్ని మింగి.. రెండు రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే హార్స్పవర్ విద్యుత్, జనతా వస్త్రాలు... ఇలా సంక్షేమ ఎజెం డాతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే.. చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత సంక్షేమ కార్యక్రమాలకు పుల్‌స్టాప్ పెట్టేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వలేనని దాన్ని మొదట 3.50 రూపాయలు పెంచారు. ఆతర్వాత 5.25 రూపాయలకు పెంచారు. జనతా వస్త్రాలను ఎత్తేశారు. ఎన్టీఆర్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తే దాన్ని ఎత్తివేయడమే కాకుండా ఊరూరా బెల్ట్ షాపులను తెరిపించారు. గ్రామంలో వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారెవరైనా ఉంటే వారు మరణిస్తేనే మరొకరికి మంజూరు చేశారు. ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదు. సమ్మెకు దిగుతామన్నందుకు కార్మిక సంఘాలనే నిషేధిస్తానన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గించమన్న పాపానికి జనంపై (బషీర్‌బాగ్‌లో) ఏకంగా కాల్పులు జరిపించారు. డ్రాక్రా మహిళలపై ఇందిరాపార్క్ వద్ద వాటర్ కేనన్లు ప్రయోగించి గుర్రాలతో తొక్కించారు. ఇలాంటివి చంద్రబాబు పాలనలోని లెక్కలేనన్ని ఉన్నాయి. ఆయన పాలనపై ‘చంద్రబాబు జమానా అవినీతి ఖజానా’ అని సీపీఎం ఒక పుస్తకాన్నే ప్రచురించింది. బాబు నాయకత్వంలో చతికిలపడిన టీడీపీ 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ అగ్రనేత వాజ్‌పేయి ప్రభంజనం, కార్గిల్ యుద్ధ ప్రభావం కారణంగా మళ్లీ అధికారంలోకి రాగలిగారు. చంద్రబాబు జీవితంలో అది కూడా బీజేపీ అండతో ఒ ఒక్కసారి మాత్రమే అధికారంలోకి రాగలిగారు. 2004 నుంచి 2014 దశాబ్దకాలంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. 2004 లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీతో పాటు అన్ని ఎన్నికలను ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసుకున్నా గెలవలేకపోయారు. 2009 తర్వాత జరిగిన ఏ ఉపఎన్నికలోనూ చంద్రబాబు పార్టీని గెలిపించలేకపోయారు. ఎన్టీఆర్కే అన్యాయం జరిగింది. నువ్వెంత? పార్టీ 33 వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా రెండు రోజుల కిందట పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం జరిపారు. ఎలాంటి ఉత్సాహం లేకుండా చాలా సాదాసీదాగా ఆ కార్యక్రమం ముగిసింది. కార్యకర్తలందరినీ రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తనపై ఉందని ఆ సందర్భంగా చంద్రబాబు చెబుతూ, అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తానన్నారు. అయితే ఆయన అధికారంలోకి వస్తే ఎలాంటి న్యాయం చేస్తారనడానికి ఒక ఉదాహరణ ఇది. ఎన్టీఆర్‌ను గద్దె దింపి 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ప్రతిరోజూ సచివాలయం నుంచి హైదర్‌గూడలోని పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ కొద్దిసేపు గడిపి ఇంటికెళ్లేవారు. ఒకరోజు ఆయన పార్టీ కార్యాలయానికి రావడానికి ముందు పార్టీలో ఒక స్థాయి ఉన్న నాయకుడొకరు వచ్చి కార్యాలయం మెట్ల వద్ద నిలబడి పదవుల విషయంలో పార్టీ తనకు అన్యాయం చేసిందంటూ తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ‘పార్టీలో మొదటి నుంచి జెండా మోస్తున్నా.. ఆస్తులు పోయాయి.. నాకు (ఒక కార్పొరేషన్‌లోని డెరైక్టర్) పదవి ఇవ్వకుండా అన్యాయం చేశార’ంటూ ఆ వ్యక్తి బిగ్గరగా అరుస్తున్నారు. అంతలో లోపలనుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి మాణిక్‌రెడ్డి బయటకొచ్చి.. ‘ఏంటయ్యా! అప్పటి నుంచి తెగ అరుస్తున్నవ్. పో..పోవయ్యా..! ఈ పార్టీలో ఎన్టీఆర్కే అన్యాయం జరిగింది. నిన్నడిగినోళ్లెవరు..! అంటూ గట్టిగా సమాధానమిచ్చారు. ఆ ఒక్క సమాధానంతో వచ్చిన వ్యక్తి మళ్లీ మాట్లాడలేదు. మరెప్పుడూ పార్టీ కార్యాలయం మెట్లెక్కలేదు. పార్టీలో ఇప్పుడన్నీ కాంగ్రెస్ ముఖాలే ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు ఆ తర్వాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. పైగా తన శరీరంలో 30 శాతం కాంగ్రెస్ రక్తం ఉందని నిండు శాసనసభలో ప్రకటించారు. అధికారంలో ఉన్నంతకాలం కాంగ్రెస్‌ను దూరం పెట్టినా ఆ తర్వాత కాలంలో మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం చంద్రబాబు కాంగ్రెస్‌కు సన్నిహితమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర ప్రజలు ఆందోళనబాట పట్టినప్పుడు తాపీగా తన ఇంట్లో నుంచే రెండు కళ్లు, కొప్పరి చిప్పలు, తండ్రీకొడుకులు.. అంటూ రకరకాల థియరీలు చెబుతూ కాలక్షేపం చేశారు. ఆ తర్వాత పరిణామాల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరితే ఆ పార్టీలు బలపడుతాయని చెబుతూ కాంగ్రెస్ నేతలందరినీ టీడీపీలో చేర్పించుకుంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇప్పుడన్నీ ‘గాంధీభవన్’లో చూసిన ముఖాలే కనిపిస్తున్నాయి. -
టీఆర్ఎస్ ఉప ఎన్నికల పార్టీ
సాధారణ ఎన్నికల్లో గెలవలేదు: వరంగల్ ప్రజాగర్జనలో చంద్రబాబ వరంగల్: ‘తెలంగాణ రాష్ట్ర సమితి ఉప ఎన్నికల పార్టీ. సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ ఎప్పుడూ గెలవ లేదు. కేసీఆర్ మోసగాడు.. వసూళ్ల రాజా.. మాట తప్పే మనిషి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం అప్పగిస్తా అని అంటూనే తెలుగుజాతిని మళ్లీ కలుపుతా అని చంద్రబాబు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన బహిరంగ సభ బుధవారం జరిగింది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘కేసీఆర్ మోసగాడు.. మాటలు చెబుతాడు.. తెలంగాణ రాదనే ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రంలో కూలీ పని చేస్తా అన్నాడు. ఇప్పుడు రాష్ట్రం వచ్చాక మేస్త్రీ పని చేస్తా అంటున్నాడు. తెలంగాణ రాదనుకుని ‘ఎస్సీని ముఖ్యమంత్రి, మైనారిటీని ఉప ముఖ్యమంత్రి చేస్తా’ అన్నాడు. తెలంగాణ వచ్చాక మాట మార్చాడు. రోజుకో మాట చెబుతున్నాడు. తెలంగాణ తన వల్లే వచ్చిందని ఒంటెలు, ఏనుగులపై ఊరేగాడు. వారం తర్వాత కాంగ్రెస్ మోసం చేసిందని... పూర్తి తెలంగాణ ఇవ్వలేదని అన్నాడు. ఇప్పుడు రాజకీయ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులనైనా జైల్లో పెడతానంటున్నాడు. ఫామ్‌హౌజ్‌లో పడుకుని ఎకరానికి కోటి రూపాయల లాభం అంటున్నాడు. 13 ఏళ్లలో జరిగిన అవినీతిని వెలికితీస్తే కేసీఆర్ కుటుంబం శాశ్వతంగా జైల్లోనే ఉంటుంది. కేసీఆర్ వసూళ్ల రాజా. కుటుంబంలో ఒకరికి సినిమాలు, మరొకరికి కాలేజీలు, ఇంకొకరికి వ్యాపారం అప్పజెప్పాడు.’ అని చంద్రబాబు విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రజలు అన్యాకాంత్రం అవుతారని హెచ్చరించారు. ‘తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదు. కేంద్ర మంత్రిగా ఉండి ఒక్క ఊరికి ఒక్క పనీ చేయలేదు. నేను సవాల్ చేస్తున్నా.. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమిటో చెప్పాలి. నేను మా ఊరిని అభివృద్ధి చేయలేదు. దరాబాద్ను అభివృద్ధి చేశా. తెలంగాణను వదలను. ఇక్కడే ఉంటా. బీసీలకు రాజ్యాధికారం అప్పగిస్తా. తెలుగుజాతిని మళ్లీ కలుపుతా’ అని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ సాధన ఘనత అమరవీరులకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని... ఈ విషయాన్ని ఆయనే చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కువ శాతం జనాభా బీసీ వర్గాల వారేనని, తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. సోనియాగాంధీ దుష్ట రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పార్టీ అని విమర్శించారు. గిట్టని వారిపై సీబీఐని ప్రయోగిస్తుందని వ్యాఖ్యానించారు. ‘రజనీకాంత్ రోబో యాక్టివ్‌గా ఉంటుంది. సోనియా రోబో(ప్రధాని మన్మోహన్) అవినీతి, అసమర్థ రోబో.. కాంగ్రెస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో దేశం, రాష్ట్రం వెనక్కిపోయాయి’ అని అన్నారు. భవిష్యత్తులో టీడీపీ జాతీయ పార్టీగా ఉంటుందన్నారు. -
బాబు ‘కొత్త’ జపం.. బీసీలకు ‘కోత’ నిజం
టీడీపీ అధినేత తీరుపై గుర్రుగా శెట్టి బలిజలు ‘తూర్పు’లో ఒక సీటుకే పరిమితం చేసిన వైనం బలం ఉన్న నియోజకవర్గాల్లో సైతం దక్కని అవకాశం కొత్తగా పార్టీలోకి వస్తున్న వారిపైనే మోజు పశ్చిమగోదావరిలోనూ ఇదే తరహా రాజకీయం కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరుపై ఉభయ గోదావరి జిల్లాల్లోని శెట్టిబలిజ సామాజికవర్గం గుర్రుగా ఉంది. సీట్ల కేటాయింపులో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఇప్పుడున్న సీట్లలోనే కోత పెట్టడంపై వారు రగిలిపోతున్నారు. బీసీల్లో బలమైన సామాజికవర్గంగా ఉన్నా.. చంద్రబాబు మొండిచేయి చూపుతున్నారని శెట్టిబలిజ నాయకులు మండిపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లు, ఐదు పార్లమెంటు స్థానాలున్నాయి. అత్యధికంగా 19 నియోజకవర్గాలు ఉన్న తూర్పుగోదావరిలో ఇప్పుడు బీసీలకున్న సీట్లకే కోతపెట్టి ఉన్నత వర్గాలకు కట్టబెడుతున్న బాబు తీరుపై వారు అంతర్మథనం చెందుతున్నారు. శెట్టిబలిజ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న తూర్పుగోదావరిలో ఒక స్థానానికే పరిమితం చేస్తున్న తీరుపై ఆ వర్గం నిప్పులు చెరుగుతోంది. బీసీలకు పెద్దపీట వేస్తామని వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న చంద్రబాబు ఆచరణకు వచ్చేసరికి తూర్పుగోదావరిలో కాకినాడ రూరల్ సీటుకే పరిమితం చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మె ల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్తిబాబును ఖాయం చేసిన చంద్రబాబు మరో రెండు సీట్లు ఇచ్చే అవకాశమున్నా తమకు కా కుండా లాగేసుకున్నారని ఆ వర్గం నుంచి నిరసన వ్యక్తమవుతోంది. రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల్లో శెట్టిబలిజ సామాజికవర్గ ఓటు బ్యాంకు గణనీయమైన సంఖ్యలోనే ఉంది. టీడీపీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. గత ఎన్నికల్లో ఆర్థికంగా ఇబ్బందులెదురైనా పోటీచేసి ఓటమిపాలైన అతనిని కరివేపాకులా వాడుకుని వదిలేశారని ఆ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హఠాత్తుగా ఉన్నత వర్గానికి చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును పార్టీలోకి చేర్చుకుని టికెట్టు ఖాయం చేయడాన్ని ఆ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడలేక సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ సామాజికవర్గం బలంగా ఉన్న మరో నియోజకవర్గం రామచంద్రపురం. అక్కడి నుంచి టికెట్ ఆశించిన అదే సామాజివర్గానికి చెందిన కట్టా సూర్యనారాయణ, కొప్పిశెట్టి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే మేడిశెట్టి వీరభద్రరావులను కాదన్నారు. ఒకప్పుడు టీడీపీని కాలదన్ని వెళ్లిపోయిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును తిరిగి టీడీపీలో చేర్చుకుని టికెట్ ఖాయంచేయడాన్ని ఆ వర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానాన్ని శెట్టిబలిజ సామాజివర్గానికి చెందిన వాసంశెట్టి సత్యకు ఇవ్వగా ఈసారి ఆ సీటు కూడా వారికి కాకుండా చేశారు. శెట్టిబలిజలను పక్కనబెట్టి పార్టీలోకి వచ్చీ రాగానే ఉన్నత వర్గానికి చెందిన మాజీమంత్రి తోట నరసింహంకు కట్టబెట్టడం తమను అణగదొక్కడానికేననే అభిప్రాయం బీసీల నుంచి వ్యక్తమవుతోంది. తుని టికెట్ యాదవ సామాజికవర్గానికి, రాజమండ్రి రూరల్ టిక్కెట్ చేనేత వర్గానికి ఇస్తున్నామని చెబుతున్న బాబు బలమైన తమ వర్గానికి ఒక్కటితోనే సరిపెడతారా అని వారు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా టీడీపీలో దాదాపు ఇదే పరిస్థితి కన్పిస్తోంది. అక్కడున్న 15 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి ఆచంట ఒక్కటే శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన గుబ్బల తమ్మయ్యకు ఇచ్చే ఆలోచనతో ఆ పార్టీ ఉన్నట్టుగా కన్పిస్తోంది. ఇదే కారణంతో ఆయనకు ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే.. మాజీమంత్రి పితాని సత్యనారాయణ టీడీపీలోకి వస్తే ఈ సీటు ఆయనకు కట్టబెట్టాలనుకుంటున్నారనే ప్రచారం పార్టీలో ఉంది. బీసీలు గణనీయంగా ఉన్న ఆచంటతో పాటు దెందులూరు, పాలకొల్లు స్థానాలు తమకు కేటాయించాలని ఆ సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ఆచంటకే తమను పరిమితం చేసే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టుగా కన్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శెట్టిబలిజ సామాజికవర్గానికి రెండు జిల్లాలకు రెండు మంత్రి పదవులు (పిల్లి సుభాష్‌చంద్రబోస్, పితాని సత్యనారాయణ)లకు ఇచ్చి ఆ వర్గానికి సముచిత స్థానం కల్పించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. అదే స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉభయగోదావరి జిల్లాల నుంచి ఆ వర్గానికి చెందిన మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావుకు ఎమ్మెల్సీలు పదవులతో సముచిత స్థానం కల్పించారు. ఉభయగోదావరి జిల్లాల్లో అదే రీతిలో బీసీలకు సముచిత రీతిలో అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. కానీ బీసీల పార్టీగా చెప్పుకుంటోన్న బాబు మాత్రం తమకు దక్కాల్సిన సీట్లకు కోతపెడుతున్నారని ఆగ్రహంతో ఉన్న ఆ వర్గం వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటోంది. రాజమండ్రిలో బీసీ గర్జన అంటూ పార్టీరహితంగా బీసీలను ఒక వేదికపైకి తీసుకువచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య ఇటీవల టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన ఆయన ఆ పార్టీ నుంచి సముచిత స్థాయిలో సీట్లు సాధించే దిశగా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. -
ఆంధ్రాకు బీసీని సీఎం చేస్తావా..?
చంద్రబాబుకు జూపల్లి ప్రశ్న హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోయాయని.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఒక్కశాతం కూడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. పచ్చి అబద్ధాలు, పూటకోమాటతో పబ్బం గడుపుకోవాలన్న ప్రయత్నమే తప్ప.. బాబుకు బీసీలపై ప్రేమ లేదని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాదనే బీసీలను సీఎం చేస్తానంటూ చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒకవేళ ఇక్కడ అవకాశం ఉంటే చంద్రబాబు లేదా లోకేష్ ముందుకొచ్చేవారని చెప్పారు. 1983 నుండి ఇప్పటిదాకా సీఎంగా బీసీని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మరి ఆంధ్రాకు బీసీని సీఎం చేస్తావా? అని జూపల్లి సవాల్ చేశారు. -
టీడీపీ చంద్రబాబుది కాదు
‘తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌దే. ఆ పార్టీని స్థాపించింది చంద్రబాబు కాదు, నాలాగే పార్టీలో చేరిన వాళ్లల్లో ఆయన కూడా ఒకరు’ అని మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా జోగిపేట నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. తాను టీడీపీకి రాజీనామా చేశానని, బాధ్యత గల వ్యక్తిగా పార్టీకి మూడు రోజుల సమయం ఇచ్చానని, కాని చంద్రబాబు నుంచి స్పందన లేదన్నారు. అవసరమనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని.. కోపంగా ఊగిపోతూ అన్నారు. పార్టీ కండువా వేసుకోకుండా, గుర్తు చెప్పకుండా అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ‘పార్టీని నేను కాదన్నా.. అభ్యర్థులు నన్ను కాదనడం లేదు’ అని ఆయన అన్నారు. నాకున్న చరిష్మాతో అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. రాజీనామా చేసినట్లు ప్రకటించాక మీరు ప్రచారం చేయటంపై ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని విలేకర్లు ప్రశ్నించగా అసహనాన్ని వ్యక్తం చేశారు. -
టీడీపీకి మద్దతు ప్రకటించిన కృష్ణయ్య
ఇక దేశం గూటికి చేరడం లాంఛనమే! చేవెళ్ల ఎంపీ టికెట్‌తో పాటు పార్టీలో కీలక బాధ్యతలు అధినేత నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న సీనియర్ బీసీ నేతలు బీజేపీ కూడా ‘బీసీ సీఎం’ అంటున్నా పట్టించుకోని కృష్ణయ్య హైదరాబాద్: తెలంగాణలో మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీని బీసీ కార్డుతో పైకిలేపే విఫలయత్నానికి అంకురార్పణ జరిగింది. కొద్దిరోజులుగా తెలంగాణలో ‘బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న పార్టీకే తమ అండ’ అని ప్రకటనలు చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య... తెలుగుదేశం పార్టీకే తమ మద్దతు అని శనివారం సాయంత్రం ప్రకటన చేశారు. ‘‘అన్ని పార్టీలకు ఆఫర్ ఇచ్చినా ఎవరూ ముందుకు రానందున బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న టీడీపీకి మద్దతు ఇవ్వాలని 42 బీసీ సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి..’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ‘తెలంగాణలో బీసీనే సీఎం..’ అని ఇటీవలే బీజేపీ కూడా ప్రకటించినా.. కృష్ణయ్య ఎక్కడా ఆ పార్టీ పేరెత్తకపోవడం గమనార్హం. కృష్ణయ్య ప్రకటనతో ఆయన టీడీపీలో చేరడం ఖరారైపోయింది. సోమవారంలోపు ఆయన ఇతర బీసీ సంఘాల నేతలతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో బీసీ సంఘాల నేతలతో మరోమారు సమావేశమై కాంగ్రెస్, టీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించి.. పచ్చకండువా కప్పుకోనున్నట్లు సమాచారం. టీడీపీలో చేరిన వెంటనే కృష్ణయ్యకు టీటీడీపీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దాంతో పాటు చేవెళ్ల లోకసభ టికెట్ గానీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏదో ఒక శాసనసభ స్థానం టికెట్గానీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రణాళిక ప్రకారమే కృష్ణయ్యకు ఎర..: బీసీ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ జిల్లాల్లో పేరున్న కృష్ణయ్యకు ఎర వేయడం ద్వారా బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారని చెప్పుకొనే ఈ ప్రయత్నానికి నెలరోజుల కిందే బీజం పడింది. బీసీలకు చట్టసభల్లో సగం సీట్లు ఇవ్వాలని కోరేందుకు వెళ్లిన కృష్ణయ్యతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు... 294 సీట్లలో 150 సీట్లు బీసీలకు ఇస్తామని, తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని, టీడీపీలో చేరితే చేవెళ్ల టికెట్టిచ్చి పార్లమెంటుకు పంపుతానని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి సానుకూలత వ్యక్తం చేసిన కృష్ణయ్య బాబుతో పలుమార్లు మంతనాలు జరిపారు. నాలుగో తేదీన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘బీసీని సీఎం చేయాలి.. కృష్ణయ్యకే ఆ పదవి ఇస్తానని చంద్రబాబు ప్రకటించాలి’ అని బీసీ నేతలతో చెప్పించారు. ఇటీవల ఏకంగా.. ‘బీసీ సీఎం కృష్ణయ్యే’ అంటూ జిల్లా అధ్యక్షులతో తీర్మానింపజేశారు కూడా. పార్టీలో చేరాక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని బాబు హామీ ఇవ్వడంతో కృష్ణయ్య టీడీపీకి మద్దతిస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేతల ఆగ్రహం..: ‘‘బీసీల కోసం ఉద్యమించిన నాయకుడిని పార్టీలోకి తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. బీసీ సెల్‌కు అధ్యక్షుడిని చేసినా సంతోషిస్తాం. కానీ సీఎం అభ్యర్థిగానో, టీటీడీపీ అధ్యక్షుడిగానో కొత్తగా వచ్చిన నాయకుడిని ప్రకటిస్తే సహించేది లేదు..’’ అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకున్నా పార్టీలోనే కొనసాగుతున్న తమకు కొత్త దేవుడు కృష్ణయ్య అంటే ఎలా భరిస్తామని ప్రశ్నిస్తున్నారు. అర్దరాత్రి వరకు సమావేశం: చంద్రబాబు శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో టీడీపీ తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితి, రాబోయే ఎన్నికలపై చర్చించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి, ఎన్నికల ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీల కూర్పుపై సమాలోచనలు జరిపారు. భేటీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. -
లేనిది ఉన్నట్టు..టీడీపీ కనికట్టు
సాక్షి, ఏలూరు: కాంగ్రెస్ పార్టీ చేతిలో కత్తిలా మారి రాష్ట్ర విభజనకు కారణమైన తెలుగుదేశం పార్టీ తన పాపాన్ని కప్పిపుచ్చుకునేందు కు.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందుకోసం ఆదినుంచీ అలవాటైన గోబెల్స్ ప్రచారాన్ని మరోమారు నిస్సిగ్గుగా ప్రయోగి స్తోంది. ప్రజల విశ్వాసం కోల్పోవడంతో ఎన్నికల్లో ఓట్లు అడిగే ధైర్యం చేయలేకపోతున్న టీడీపీ నేతలు తమ పార్టీకి లేని బలాన్ని ఉన్నట్టుగా అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టారు. తొలినుంచీ కాంగ్రెస్ పార్టీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టీడీపీ నేతలు తమ పార్టీలోకి వస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను చూపించి అన్ని పార్టీల నాయకులు తమ పార్టీలో చేరిపోతున్నారంటూ మౌఖిక ప్రచారం చేరుుస్తున్నారు. ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడని వారిని సైతం రేపోమాపో టీడీపీలో చేరిపోతున్నారంటూ తప్పుడు ప్రచారం చేరుుస్తున్నారు. గోబెల్స్ ప్రచారాన్ని పునాదులుగా చేసుకుని టక్కు టమార గారడీ విద్యలను ప్రదర్శించడం ద్వారా ప్రజలను మోసగించడం అలవాటు చేసుకున్న పార్టీ అధినేత అలాంటి ప్రచారాన్ని ముమ్మరం చేయూలని జిల్లా నేతలకు ఆదేశాలిచ్చారు. దీంతో స్థానిక నేతలు తమకు నియోజకవర్గాల్లో ఏ మాత్రం ఓటింగ్ లేకపోయినప్పటికీ టీడీపీకి ‘బావుందంట కదా’ అనే ప్రచారం చేయిస్తున్నారు. నిజానికి ప్రజల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది, దానిని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడేందుకు ఆ పార్టీ నేతలు కుతంత్రాలు పన్నుతున్నారు. తిమ్మిని బమ్మిని చేస్తూ... సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఓ నాయకుడు పొరుగు జిల్లాలోని ఓ లాడ్జిలో సభ్యసమాజం తలదించుకునే పనిచేస్తూ పోలీసులకు దొరికిపోరుు పరువు పోగొట్టుకున్నాడు. కొన్నిరోజుల అనంతరం ఆ వ్యక్తిని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దింపుతున్నట్టు నాయకులు ప్రకటించారు. ఆ వ్యక్తికి పార్టీ అభ్యర్థిత్వం కట్టబెడుతున్నందువల్ల ఆ నియోజకవర్గంలో టీడీపీ బాగా బలం పుంజుకుందంటూ ప్రచారం చేరుుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకించి కొందరు వ్యక్తులను నియమించినట్టు సమాచారం. ఓ పార్లమెంటరీ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి కుటుంబంపైనా కొంతకాలం క్రితం ఆరోపణలు వచ్చా రుు. ఆయన కుమారుడు ఓ మహిళను వేధిం చారంటూ కేసు నమోదైంది. దీనిపై పెద్ద రగడ చోటుచేసుకుంది. మరోవైపు పదవులు అనుభవించడం తప్ప ప్రజలకు సేవచేయ డం తెలియని ఆ పెద్దాయనకు చెక్‌పెట్టి సమైక్యాంధ్ర ద్రోహిగా ముద్ర వేయించుకున్న మరో పెద్దాయనను బరిలో దించాలని టీడీపీ భావిస్తోంది. జనం కోసం ఎప్పుడూ ఏమీ చేయని ఆ ఇద్దరు పెద్దమనుషులు ఇప్పుడు పదవి కోసం తిట్టుకుంటున్నారు. వీరిపై క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకతను గోబెల్స్ ప్రచారంతో తొక్కిపెట్టాలని తమ్ముళ్లు చూస్తున్నప్పటికీ కుదరడం లేదు. మరో అసెంబ్లీ నియోజకవర్గంలో జూదరులకు, సెటిల్మెంట్లు చేసేవారికి అండగా నిల వటం.. కోడిపందాల్లో పాల్గొనడమే కాకుం డా అధికారులపై చేరుు చేసుకోవడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైతం చాలా గొప్పవాడంటూ ప్రచారం చేరుుస్తున్నారు. ఆయన ఎవరు పిలిచినా వెళతాడని, ప్రతి ఒక్కరి సమస్యల్నీ పట్టించుకుంటారంటూ రంగులు అద్దుతున్నారు. అలాంటి వ్యక్తికి మళ్లీ పదవి వస్తే తమలాం టి వాళ్లు నియోజకవర్గంలో తిరగలేని పరి స్థితి దాపురిస్తుందని సామాన్య ప్రజలు భయపడుతుంటే.. అధికారులు విధులు నిర్వర్తించలేమంటూ గగ్గోలు పెడుతున్నారు. వీలు దొరికినప్పుడల్లా పార్టీ అధినేతకు పాదపూజ చేసే మరో నాయకుడు తాను చాలా గొప్ప వ్యక్తిని అన్నట్టుగా నటిస్తున్నారు. విద్యాసంస్థలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే అపకీర్తిని మూటగట్టుకున్న ఆయన సమైక్యాంధ్ర కోసం తీవ్రంగా పోరాడుతున్నట్టుగా ఫోజులిచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి చాలా గొప్పవాడంటూ పనిగట్టుకుని ప్రచారం చేరుుస్తున్నారు. పదవిలో ఉన్నంత కాలం ప్రజలను పట్టించుకోని ఓ నాయకుడు తనను మించిన ప్రజాసేవకుడు లేడం టూ ఆ పొరుగు నియోజకవర్గానికి చెందిన నేత ప్రచారం చేరుుంచుకుంటున్నారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నిప్పులు చెరుగుతుంటే ఆయన మాత్రం కాంగ్రెస్ నేతల విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. అభివృద్ధిని పక్కనపెట్టేసి అడపాదడపా అగ్ని ప్రమాద బాధితులను పలకరించి అదే చాలా ఎక్కువ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. వేరేవాళ్లూ వచ్చేస్తున్నారట.. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీలోకి రావడాన్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారుు. వారు రాకతో పార్టీ మూడు ముక్కలైంది. ఈ వాస్తవాల్ని కప్పిపుచ్చుతన్న ఆ పార్టీ జిల్లా నాయకులు అదే తరహాలో చాలామంది నాయకులు తమ పార్టీలో చేరిపోతున్నారనే ప్రచారానికి తెరలేపారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ తమ పార్టీలో చేరబోతున్నారంటూ రెండురోజుల క్రితం టీడీపీ నేతలు కొత్త ప్రచారానికి తెరలేపారు. ఇం దుకోసం కొన్ని బృందాలను నియమించి మరీ ఊరూరా ప్రచారాన్ని ఊదరగొట్టిం చారు. తద్వారా ప్రజల్ని అయోమయూనికి గురి చేశారు. ఈ విషయం తెలిసి గ్రంధి శ్రీనివాస్ తాను వేరే ఏ పార్టీలోకి వెళ్లేది లేదని, తన ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని వీడేది లేదని స్పష్టం చేశారు. అరుునప్పటికీ టీడీపీ నేతలు విష ప్రచారాన్ని మానలేదు. ఇలా ప్రతిచోట టీడీపీ నాయకులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, రాష్ట్ర విభజన విషయంలో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీలోకి వలసలు ఎక్కువయ్యూయంటూ ప్రచారం చేరుుస్తున్నారు. అయితే ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఆల్ ఫ్రీ మంత్రం జపించినా ప్రజలు విశ్వసించకపోవడం టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతోంది. -
ఓరుగల్లులో ‘దేశం’ డీలా
వరంగల్: ఉత్తర తెలంగాణలో కీలక జిల్లా వరంగల్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. దశాబ్దం క్రితం వరకు వరంగల్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు మసకబారింది. తెలంగాణ ఉద్యమంతో వెనుకబడ్డామని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత పుంజుకుంటామని ఆశించిన పార్టీ పెద్దల అభిప్రాయం తప్పని స్పష్టమవుతోంది. బలమైన పునాదులు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పుకునే ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండాపోయింది. నియోజకవర్గ ఇంచార్జి పదవులు ఖాళీగానే ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాయకుల కొరత ఉంది. ఆ ప్రాభవం నేడేది..? 1999 ఎన్నికల్లో టీడీపీ జిల్లాలోని వరంగల్, హన్మకొండ లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అప్పుడు జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. వీటిలో ఆరు స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు. 2004 ఎన్నికల్లో రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో ఫర్వాలేదనిపించేలా ఫలితాలు వచ్చినా తర్వాత పరిణామాలతో క్రమంగా పార్టీ పలచబడుతోంది. 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్న టీడీపీ.. నర్సంపేట, పాలకుర్తి, ములుగు, డోర్నకల్ స్థానాలను గెలుచుకుంది. ప్రజావ్యతిరేకతతో పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీని తెలంగాణపై అస్పష్ట వైఖరి జిల్లాలో బాగా దెబ్బతీసింది. తెలంగాణ ఉద్యమం తీవ్రతతో రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతం, విశ్వసనీయత లేని విధానాలతో జిల్లాలోని కీలక నేతలు ఇతర పార్టీల్లోకి గతంలోనే వెళ్లిపోయారు. ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కీలక నేతలతో కలిసి ద్వితీయశ్రేణి నాయకులు టీఆర్ఎస్లో చేరారు. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లో భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి టీడీపీని వీడిన సందర్భంలో పార్టీకి భారీగా నష్టం జరిగింది. రెండేళ్ల క్రితమే పార్టీ దాదాపు సగానికిపైగా ఖాళీ అయింది. ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ వెళ్లి పోవడంతో ఎన్నికల తరుణంలో జిల్లాలో పార్టీ డీలా పడిపోయింది. స్థానిక ఎన్నికలే కాదు.. సాధారణ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆ పార్టీకి జిల్లాలో నాయకులే లేకుండా పోయారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఏళ్లుగా టీడీపీకి ఇంచార్జీలే లేరు. రిజర్వుడు నియోజకవర్గాలకు సైతం ఇతర వర్గాల వారికి బాధ్యతలు అప్పగించడంతో పార్టీ అధినేత చెబుతున్న బడుగుల అనుకూల నినాదం నవ్వులపాలవుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. * స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ) నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్చార్జి లేరు. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి బలమైన సెగ్మెంట్‌గా ఉండేది. కడియం శ్రీహరి పార్టీ మారడంతో అక్కడ టీడీపీ పరిస్థితి మారిపోయింది. ఎస్సీ నియోజకవర్గానికి అదే సామాజికవర్గం నేతలను ఇంచార్జీగా నియమించ లేదు. కట్ట మనోజ్‌రెడ్డికి సమన్వయ బాధ్యతలిచ్చారు. దీనిపై టీడీపీలోనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇక్కడ నాయకులే లేరు. * మరో ఎస్సీ నియోజకవర్గం వర్ధన్నపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ మహాకూటమి తరఫున టీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేశారు. తర్వాత ఎస్సీ వర్గానికి చెందిన ఏ నేతకూ ఇక్కడ ఇంచార్జి బాధ్యతలు అప్పగించ లేదు. బీసీ వర్గానికి చెందిన ఈగ మల్లేశంకు బాధ్యతలు అప్పగించారు. 2009 వరకు ఇది టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గంగా ఉండేది. రిజర్వు నియోజకవర్గంలో ఈ వర్గానికి చెందిన వారిని ఇంచార్జీగా నియమించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇక్కడ టీడీపీకి నాయకులే లేరు. * ఎస్టీ రిజర్వుడ్ సెగ్మెంట్ మహబూబాబాద్‌లోనూ తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరు. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. ఈ నియోజకవర్గ ఇంచార్జి లేకుండానే పార్టీ నడుస్తోంది. ఇటీవలి వరకు సమన్వయ బాధ్యతలు చూసిన నెహ్రూనాయక్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇక్కడ ఎవరూ దొరకడం లేదు. * ఎస్టీ నియోజకవర్గం డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. ఈ షాక్ నుంచి పార్టీ తేరుకునే పరిస్థితి లేదు. నియోజకవర్గ స్థాయి నేత ఎవరూ లేకపోవడంతో పోటీకి అభ్యర్థలు దొరకడం లేదు. * వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనూ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు నేతలు ముందుకు రావడం లేదు. పాలకుర్తి, నర్సంపేట, ములుగు నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
ఇదేంట్రా ‘బాబూ’!
*గంటా బృందానికి చంద్రబాబు షాక్ *భవిష్యత్తుపై హామీ ఇస్తారనుకుంటే జెడ్పీ ఎన్నికల బాధ్యత *అధినేతతో భేటీ తర్వాత మరింత అయోమయం గంటా బృందం తెలుగుదేశంలో చేరిన ముహూర్తం ఏ మాత్రం బాగున్నట్టు లేదు. వీరికి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. సొంత క్యాడర్ కలసి రాక, తెలుగుదేశం క్యాడర్ అంగీకరించక అష్టకష్టాలు పడుతున్న ఈ బృందానికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కూడా ఊరట లభించడం లేదు. వేల మందిని కూడగట్టి ప్రజాగర్జన పెట్టి అయ్యన్నపాత్రుడితో తిట్లుతిని అభాసుపాలైన గంటా బృందానికి మరో షాక్ తగిలింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పార్టీలో తమ భవిష్యత్, సీట్ల గురించి చంద్రబాబుతో మాట్లాడదామని హైదరాబాద్ వెళ్లిన గంటా బృందానికి ఎటువంటి హామీ లభించకపోగా, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత వచ్చి పడింది. ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీలో చేరి, అక్కడి పరిణామాలతో తీవ్ర నిరాశకు గురైన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శాసన సభ్యులు ముత్తం శెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూర్తి(కన్నబాబు)లు మూడు రోజుల పాటు చంద్రబాబుపైనా అలిగారు. ఆయన సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పిస్తే ఎందు కు మందలించలేదని మధనపడ్డారు. ఆ కోపం తో చంద్రబాబు నిర్వహించిన సమీక్షకు హాజరుకాలేదు. విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు వీ డ్కోలు పలకలేదు. గంటా ఇంట్లో నిరసన సమావేశాన్ని ఏర్పాటుచేసి పార్టీ పర్యవేక్షకుడైన నారాయణను పిలిచి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రాకపోవడం, మరో పక్క నియోజక వర్గాల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతుండడంతో గత్యంతరం లేక ఆదివారం వీరంతా హైదరాబాద్ బాటపట్టా రు. నారాయణ సమక్షంలో చంద్రబాబును కల సిన వీరికి ఊరట లభించకపోగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బాధ్యత మీద పడింది. వీరి భవిష్యత్‌పై ఎటువంటి హామీ ఇవ్వని చంద్రబాబు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిం చి తీసుకురావాలని స్పష్టం చేశారు. నియోజక వర్గాల్లో తెలుగుదేశం క్యాడర్ తమతో కలసిరావడం లేదని చెప్పుకొనే అవకాశాన్ని కూడా ఆయన వీరికి ఇవ్వలేదు. భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాస్‌ను కాదని మాజీ శాసన సభ్యుడు అప్పల నరసింహరాజు ఎన్నికల ఏర్పాట్లు చేసుకుపోతున్నారు. పెందుర్తిని వదిలేసి ఉత్తర నియోజక వర్గంలో పనిచేస్తున్న పంచకర్లకు ఇ క్కడా, అక్కడా వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. ఇక టికెట్టే రాదని చెబుతున్న వెంకట్రామయ్యను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. యలమంచిలి లో ఇంతకాలం తమకు నరకం చూపించిన కన్నబాబుతో కలిసేదే లేదని దేశం నేతలు తెగేసి చెబుతున్నారు. ప్రతి ఎన్నికలకు నియోజక వర్గం మారే గంటా పరిస్థితి దయనీయంగా ఉంది. ఎక్కడ నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్న ఆయనకు ఎక్కడ పనిచేయాలో అర్థం కావడం లేదు. ఈ అంశాలపై కాస్త స్పష్టత కోసం హైదరబాద్ వెళ్లిన గంటా బృందం చంద్రబాబుతో భేటీ తర్వాత మరింత అయోమయంలో పడిపోయింది. -
ఆయనొస్తే రైతుకు కడగండే
తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే రైతులకు ఇబ్బందులు తప్పవని ఎంపీ ఎస్పీవెరైడ్డి అన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు విధానాల కారణంగా వ్యవసాయం పనికిరాని రంగంగా మిగిలిపోవడం ఖాయమన్నారు. బండిఆత్మకూరు మాజీ సర్పంచ్ రాజంరెడ్డి సుజాతమ్మ, ఆమె తనయుడు భారత్ గ్యాస్ నిర్వాహకుడు మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీతోపాటు వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు బుడ్డా శేషిరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ 2004 సంవత్సరానికి ముందు చంద్రబాబు హయాంలో ఎదుర్కొన్న కష్టాలను రైతులు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు. శ్రీశైలం జలాశయంలోకి వచ్చే వరదనీటిని కరెంటు ఉత్పత్తి పేరుతో నాగార్జున సాగర్‌కు తరలించి నీటి కొరతకు కారణమయ్యారన్నారు. ఆయన హయాంలో డ్యాంకు పూర్తిస్థాయి(854 అడుగులు) నీటిమట్టం చేరేది కాదన్నా రు. దీంతో కేసీకెనాల్, ఎస్సార్బీసీ రైతాం గం సాగునీరు అందక దుర్బర పరిస్థితులు ఎదుర్కొన్నారన్నారు. ఆయన అధికారంలోకి వస్తే అదే పరిస్థితి పునరావృతమవుతుందన్నారు. జగన్ ఈ ప్రాంత వాసి కావడంతో సాగునీటికి ఎటువంటి డోకా ఉండదని, దీన్ని దృష్టిలో ఉంచుకు ని వైఎస్సార్‌కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. శిల్పా సోదరులు నాయకులను పక్కదారి పట్టిస్తున్నారు.. శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీలో చేరడమే కాకుండా మిగతా నాయకులను కూడా తమ వెంట తీసుకెళ్లి వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని ఎస్పీవెరైడ్డి విమర్శించారు. డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి నాయకులను ఓడిం చి తగు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనతో పాటు బుడ్డా రాజశేఖర్రెడ్డ్డి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చి న వారేని, ఇక్కడి రైతుల కష్ట సుఖాలు తెలిసిన వారం కాబట్టి నిరంతరం అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామ ని హామీ ఇచ్చారు. శిల్పా చక్రపాణిరెడ్డికి శ్రీశైలం నియోజకవర్గంలో ఇల్లు కూడా లేదని, అలాంటి నాయకుడు ఇక్కడి ప్రజ లకు ఎలా అందుబాటులో ఉంటారో ఆలోచించాలన్నారు. ఎన్నికల నేపథ్యం లో మాయ మాటలు చెబుతూ లబ్ధి పొం దడానికి ప్రయత్నిస్తున్నారని, ఓడిపోతే ఇక ప్రజలకు కనిపించడన్నారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో భద్రారెడ్డి, బుచ్చిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, నాగకృష్ణ, హమాలిబాషా తదితరులున్నారు. -
ఖమ్మం విప్లవాల గుమ్మం
‘ఖమ్మం విప్లవాల గుమ్మం.. పోరాటాల ఖిల్లా.. నా హయాంలోనే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో టీడీపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాగర్జన సభకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా చంద్రబాబు హాజరై ప్రసగించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో రాజీవ్‌సాగర్ పూర్తి కాలేదని, ఇందిరాసాగర్ కాంట్రాక్టర్ల వరంగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టులతో పాటు మొండికుంట, పాలెంవాగు, కిన్నెరసాని ప్రాజెక్టులను ప్రభుత్వం విస్మరించిందని.. ఈ ప్రాజెక్టులన్నింటిని టీడీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తుందన్నారు. జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద లక్షా యాభై వేల ఎకరాల్లో పంటలు వేశారని, నీటి విడుదల లేక ఈ పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. వేసిన పంటలకు నీళ్లివ్వాలని జిల్లా రైతుల పక్షాన గవర్నర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆధునిక చట్టంతో పునరావాసం కల్పించేలా, వారికి పూర్తిగా న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందన్నారు. ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలో పంటలకు నీళ్లందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లా ప్రజలకు ఏదో చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇక్కడ అభివృద్ధినే విస్మరించిందన్నారు. భద్రాచలంలో గిరిజన యూనివర్శిటీ, కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీ, కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు టీడీపీ కృషి చేస్తుందన్నారు. ఖమ్మంను హైదరాబాద్‌కు దీటైన నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా నుంచి ఇండియాలో ఎక్కడికైనా వెళ్లేందుకు విమానాశ్రయం ఏర్పాటు చేయిస్తానన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణికి తన ప్రభుత్వ హయాంలో రూ.663 కోట్లు రుణం ఇప్పించి ఆదుకున్నానన్నారు. జిల్లా అభివృద్ధికి పాటు పడకుండా నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలిపించేలా ప్రజలు ఆశీర్వదించాలన్నారు.ఈ సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే జిల్లా అభివృద్ధి జరిగిందని, గత ప్రభుత్వం అభివృద్ధిలో జిల్లాను విస్మరించిందన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నవ తెలంగాణలో ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పోలవరంతో 2 లక్షల మంది గిరిజనులు నిర్వాసితులవుతున్నారన్నారు. కొత్త భూ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత టీడీపీపై ఉందని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. ప్రజాగర్జన సభలో తెలంగాణ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణ, విజయరమణారావు, ఉమా మాధవరెడ్డి, రమేష్ రాథోడ్, గుండు సుధారాణి, రేవూరిప్రకాశ్రెడ్డి, సీతక్క, ఈ. పెద్దిరెడ్డి, రావులపాటి సీతారామారావు, ప్రకాశ్‌గౌడ్, అరవింద్‌కుమార్‌గౌడ్, జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య, బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, బాణోతు మోహన్‌లాల్, మద్దినేని బేబిస్వర్ణకుమారి, నాగప్రసాద్, కోనేరు సత్యనారాయణ, ఫణీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఘనత వైఎస్సార్‌దే..
ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి గల్లా జయదేవ్ ముందు తన తల్లి అరుణ చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో చెప్పాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. 25 ఏళ్ల పాటు వారి కుటుంబ సభ్యులు పదవులు అనుభవించి, ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో... అవి ఏమిటో గుంటూరు ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో బాలశౌరి విలేకరులతో మాట్లాడారు. ఇంట్లో కూర్చునే ఉద్యోగాలు ఇప్పిస్తానని గల్లా హామీలు ఇస్తున్నారని, అంటే ఎవరి అన్నం వారు వండుకోవడం, ఎవరి బట్టలు వారు ఉతు క్కోవడం వంటి ఉద్యోగాలేనా అని ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం ఇవే నేను మీకు ఇచ్చే ఉద్యోగాలని చెప్పి జయదేవ్ చంద్రగిరి వెళ్లిపోతారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దివాళాకోరు రాజకీయాలను మానుకోవాలని బాలశౌరి హితవు పలికారు. ఆ పార్టీ నేతలు అత్యంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా గెలవలేక పోయారని చెప్పారు. చంద్రబాబు రాసిన రెండు లేఖల కారణంగానే పెద్దమ్మ సోనియాగాంధీ, చిన్నమ్మ సుష్మాస్వరాజ్‌లు రాష్ట్ర విభజనకు నాంది పలికారని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పర్యటనకు వచ్చినా తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ ఘనత వైఎస్సార్‌దే.. రాష్ట్ర రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన ఘనత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ఆ మహా నేతను రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌లో చూసుకుంటున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గుంటూరులో ఐటీ హాబ్ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని తెలిపారు. దీనిపై ఇప్పటికే జననేత జగన్‌తో పలుమార్లు చర్చించానని చెప్పారు. కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనే అంశం ప్రభుత్వం నియమించే క మిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. సామాజిక వర్గాలను అడ్డుపెట్టుకుని ఎన్ని పార్టీలు ఏర్పడినా సాధించగలింది ఏమీ లేదన్నారు. సీట్లతో సంబంధం లేదు... అసెంబ్లీ సీట్ల కేటాయింపులో తనకు ఎటువంటి సంబంధం లేదని బాలశౌరి స్పష్టం చేశారు. సీట్లు విషయంలో తాను ఎటువంటి జోక్యం చేసుకోవటం లేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సర్వేల ఆధారంగా జిల్లాలో సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, రాతంశెట్టి సీతారామాంజనేయులు, థామస్ నాయుడులు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో చేరిన టీడీపీ మహిళా నేత
తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి బుధవారం హైదారాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కొన్ని రోజులుగా డోలాయమానంలో ఉన్న ప్రేమలతారెడ్డి.. ఎట్టకేలకు టీడీపీని వీడారు. గతంలో ఆమె టీడీపీ హయాంలో రెండు సార్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, చిటకోడూరు ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె చిటకోడూరు పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్నారు. కొంతకాలంగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ప్రేమలతారెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పలుమార్లు కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి టీఆర్ఎస్లో చేరారు. కాగా ప్రేమలతారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బరిలో ఉండేందుకే టీఆర్ఎస్ గూటికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె వెంట జనగామ టీడీపీ నేతలు నారోజు రామేశ్వరాచారి, మధుసూదన్, రాందయాకర్, బాలనర్సయ్య, బాల్నె సోమయ్య, పోటె శ్రీనివాస్, మేకల భాగ్యమ్మ, రాంరెడ్డి, మల్లేషం కూడా టీఆర్ఎస్లో చేరారు. ఇదిలాఉండగా ప్రేమలతారెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరడంతో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి సరిగా స్పందించకపోవడంతో ఆమె పార్టీని వీడినట్టు శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కేయూ జేఏసీ నేతలు టీఆర్ఎస్లోకి.. వరంగల్ : రెండు రోజుల క్రితం కేసీఆర్‌ను కలిసి ఈ ఎన్నికల్లో తమకు రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరిన కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నాయకుల్లో వీరెందర్, చిర్ర రాజు టీఆర్ఎస్లో చేరారు. విద్యార్థి నాయకులను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు యత్నిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, జిల్లా ఇంచార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బక్కనాగరాజు, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, యాకూబ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గల్లా సమావేశానికి సినీ డెరైక్షన్
గుంటూరు: తెలుగుదేశం పార్టీలో చేరిన గల్లా జయదేవ్ తొలిసారిగా బుధవారం గుంటూరు వస్తున్న సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు మంగళవారం ఆ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరగనున్న గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పార్టీ నాయకులు, సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నాయకులతో చర్చించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహణ, అలంకరణ, సమావేశం ఏర్పాట్లు తదితర అంశాలపై తదితర అంశాలపై రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావుతో చర్చించారు. బృందావన్ గార్డెన్స్‌లో జయదేవ్ తీసుకున్న ఇంటి వాస్తుపరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్‌ను కలసి ర్యాలీకి సంబంధించిన విషయాలను వివరించారు. -
తర్జనగర్జన
తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న ప్రజా గర్జన వేదిక మారింది. ఏయూ మైదానం నుంచి ఆర్కే బీచ్‌కు తరలింది. కాంగ్రెస్‌ను వీడిన మాజీ మంత్రి గంటా శ్రీని వాసరావు బృందాన్ని తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తూ చంద్రబాబు నాయు డు సమక్షంలో ఈ నెల 12న నిర్వహించతలపెట్టిన ఈ గర్జన మొదటినుంచి వివాదాస్పదంగానే తయారైంది. నిజానికి ఈ నెల 8న మహిళా దినోత్సవ సభను భారీగా నిర్వహించి గంటా బృందాన్ని చేర్చుకోవాలని పార్టీ పెద్దలు భావించారు. కానీ మహిళా దినోత్సవ సభలో తాము చేరడం బాగోదని గంటా బృందం భావించింది. ఆధికారంలో ఉండగా మూడు నెలల క్రితం తన కుమార్తె వివాహాన్ని, నెల రోజుల క్రితం సహచర శాసన సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాస్ కుమార్తె వివాహాన్ని భారీగా నిర్వహించిన ఏయూ మైదానంలో గర్జన సభను పెట్టాలని గంటా నిర్ణయించారు. గంటా కుమార్తె వివాహ సమయంలో ఆయన మంత్రిగా ఉండడంతో ఏయూ మైదానానికి దారితీసే రహదారులను జీవీఎంసీ రెండు కోట్ల రూపాయలతో పునర్నిర్మించింది. ఏయూ పాలకవర్గం కూడా వీరికి దాసోహమై సకల సదుపాయాలు కల్పించింది. అదే రీతిలో ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతాయని అనుకొన్న గంటాకు పోలీసు కమిషనర్ షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా మైదానం ఇవ్వడానికి ఏయూ వీసీ, సంబంధిత అనుమతులివ్వడానికి జీవీఎంసీ ముందుకు రాగా పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డి మాత్రం ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరించారు. ఎన్నికల సమయంలో విద్యా సంస్థల ప్రాంగణంలో సభలు నిర్వహించడం చట్టవిరుద్ధమంటూ స్పష్టం చేసి పోలీసు అనుమతిని నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తెలియక హడావుడిగా వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియాన్ని సందర్శించిన నేతలు ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా వద్దనుకొన్నారు. చేసేది లేక తొలుత వద్దకుకొన్న ఆర్కే బీచ్‌లోనే సభ పెట్టాలని నిర్ణయించారు. గంటా బృందం 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరినప్పుడు ఆర్కే బీచ్‌లోనే సభ జరిగింది. గంటా తదితరులు 2009 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ప్రజారాజ్యం పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత గంటా ప్రోద్భలంతో బీచ్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సభ కూడా విఫలమైంది. సెంటిమెంట్‌గా బీచ్‌లో సభ నిర్వహిస్తే మంచిజరగదన్న అభిప్రాయం వీరిలో నాటుకొంది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇష్టం లేకపోయినా బీచ్‌లోనే సభ జరపాల్సి వస్తోంది. బీచ్‌లో సభ విజయవంతం కావాలంటే లక్షల్లో జనాన్ని తరలించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అంత సీన్ లేదని స్థానిక దేశం నేతలు సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించిన సీనియర్‌నేత యనమల రామకృష్ణుడుకి స్పష్టం చేశారు. 12 వ తేదీన సెలవు దినం కూడా కానందున బీచ్‌లో పెద్దగా జనం ఉండరని, పూర్తిగా తాము తీసుకువచ్చేవారితోనే సభ నిర్వహించడం కష్టమని వారు అవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం అధికారంలో ఉండి తమను వేధింపులకు గురిచేసిన గంటా బృందం కోసం ఏర్పాటు చేస్తున్న సభకు తాము దూరంగా ఉంటామని మొదటి నుంచి పార్టీలో ఉన్న క్యాడర్ భీష్మించుకుకూర్చోవడం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆరునూరైనా బీచ్‌లో భారీగా సభ జరపాల్సిందేనని అధిష్టానం అదేశించడంతో చేసేది లేక ఏర్పాట్లలో నేతలు నిమగ్నమయ్యారు. -
టీఢీపీ సంకుల సమరం
‘ఆలు లేదు.. చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం..’ అన్నట్లు ఇంకా స్థానిక ఎన్నికలు జరగలేదు.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవలేదు.. అప్పుడే ఆ పార్టీలో పలువురు మేయర్ సీటుపైన కర్చీఫ్ వేసేశారు. అందులోనూ ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలంతా పోటీపడుతుండడం సం‘కుల’ సమరంలా మారిందని ఆ పార్టీలోని మిగిలిన నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వరకు నేతలను, కార్యకర్తల్ని ఏదోవిధంగా కలిసికట్టుగా ఉంచాలని అధిష్టానం భావిస్తుంటే అర్థంతరంగా వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు నేతల మధ్య మొండిచెయ్యి చూపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు చంద్రబాబు పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తామని చెబుతుంటే.. మరోవైపు మహిళా అధ్యక్షురాలికి మొండి చెయ్యి చూపడంపై విమర్శలు వస్తున్నాయి. మరో సీనియర్ నేత కోగంటి రామారావుకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఆయన సతీమణి విమలకుమారి తాజా మాజీ కార్పొరేటర్. కోగంటి చంద్రబాబు పాదయాత్ర పైలాన్ నిర్మాణానికి రూ.40 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. అటువంటి వ్యక్తిని మేయర్ పోటీ నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇతర సామాజికవర్గాల నేతల ఆగ్రహం పార్టీలో బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు పోటీపడి పోట్లాడుకోవడాన్ని మిగిలిన సామాజికవర్గాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోని కీలక పదవులతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు, కార్పొరేటర్ టికెట్లను సైతం వదలకుండా పోటీ పడుతుండడంతో మిగిలిన వర్గాలు కేవలం కాడిమోయడానికే తప్ప తమకు ఏమాత్రం గుర్తింపు లేదా అనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నుంచి మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచి, ఒకసారి ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన ఎరుబోతు రమణరావు(బీసీ)కి ఇప్పటి వరకు డివిజన్‌ను ఖరారు చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. పార్టీ కష్టకాలంలో రమణరావు కౌన్సిల్లో ఒంటరి పోరాటం చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కనీసం ఇటువంటి వ్యక్తుల్ని సంప్రదించకపోవడం పార్టీలో ఇతర సామాజికవర్గాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతోంది. -
చెత్తతో పబ్బం గడుస్తుందా?
* చంద్రబాబు తీరుపై టీడీపీ సీనియర్ల ఆగ్రహం * పార్టీని కాంగ్రెస్ నేతలతో నింపేస్తున్నారు * ప్యాకేజీలిస్తామని మరీ తీసుకొస్తున్నారు.. * ముందు నుంచి ఉన్నవారికీ టికెట్లు దక్కే స్థితి లేదని అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నేపథ్యంలో పార్టీ నుంచి సీనియర్ నేతలు వెళ్లిపోతుంటే.. ఇతర పార్టీల్లో అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతున్న నేతలందరినీ చేర్చుకోవడం... ఇలా పబ్బం గడుపుకోవచ్చన్న రీతిలో అధినాయకత్వం నడిపిస్తున్న వ్యవహారాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కుదిపేస్తున్నాయి. ప్రజల్లో చులకనైన నేతలందరినీ చేర్చుకుని పార్టీని నింపేస్తున్న అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిపై టీడీపీ నేతల నుంచే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 2004, 2009 ఎన్నికల్లో వరుస పరాజయాల నుంచి పార్టీ ఇప్పటికీ కోలుకోకపోగా.. గత ఐదేళ్లలో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పలువురు పొలిట్‌బ్యూరో సభ్యులు, మరెంతో మంది నేతలు టీడీపీని వీడివెళ్లిపోయారు. టీడీపీపై నమ్మకం కోల్పోయిన కారణంగా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే.. ఆ స్థానాలను భర్తీ చేయడానికన్నట్టు పనికిరాని సరుకును సైతం చేర్పించుకుంటున్నారని పార్టీలోని పాతతరం సీనియర్ నేతలు మండిపడుతున్నారు. అది కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేసి అక్కడ అవకాశాలు దొరకని కాంగ్రెస్ నేతలందరినీ చేర్చుకుని మొత్తం పార్టీని కాంగ్రెస్ మయం చేస్తున్నారన్న అసంతృప్తి తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనేకసార్లు పార్టీలు మారిన వారిని సైతం ప్యాకేజీలిస్తామని ఆశలు పెట్టి మరీ పార్టీలోకి తీసుకోవడం.. టీడీపీ దయనీయస్థితిని తెలియజేస్తోందని కోస్తాకు చెందిన మాజీ మంత్రి ఒకరు అసంతృప్తి వ్యక్తంచేశారు. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌లో చేరడానికి తనకు అనేక అవకాశాలొచ్చినా పార్టీ కోసం వదులుకున్నాననీ, కానీ ఇప్పు డు కాంగ్రెస్‌లో పనికిరాని చెత్తగా తయారైన వాళ్లను కూడా చేర్చుకుంటుంటే టీడీపీ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన ఉందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా తథ్యమని, టీడీపీ పోరాడేది ప్రతిపక్ష హోదాకేనని.. ఇలాంటి నేతలందరినీ తీసుకుంటే ఆ హోదా కూడా దక్కదని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచీ ఉన్నవారికి మొండిచేయే... రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న చివరి నిమిషం వరకు అధికారంలో కొనసాగిన కొందరు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో వెళ్లడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. మాజీ మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పార్టీలో చేరినా టికెట్ ఇవ్వలేమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పడంతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న వారిని ఏరికోరి మరీ టీడీపీలో చేర్చుకున్నారని మరో సీనియర్ టీడీపీ నేత రుసరుసలాడారు. పార్టీకేదో బలం ఉంది కాబట్టి నేతలు ఆకర్షితులవుతున్నారన్న ప్రచారం చేసుకోవడానికి ఇలా ఇష్టానుసారంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోటరీలో కీలకపాత్ర పోషించే ఎంపీలు గరికపాటి మోహనరావు, సి.ఎం.రమేష్, సుజనాచౌదరి తదితరులు ఆయా నేతల ఇళ్లకు వెళ్లి గంటల తరబడి చర్చలతో అనేక విధాలుగా ఒప్పించి మరీ చంద్రబాబును కలిపిస్తున్నారని.. దీనివల్ల పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలెవరికీ టికెట్లు కూడా దక్కే పరిస్థితి లేదని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు. అయ్యన్న, కోడెల బహిరంగ విమర్శలు... ఎక్కడా దిక్కులేక ఈ రకంగా చేర్పించుకుంటున్న నేతల విషయంలో కోడెల శివప్రసాదరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితర పార్టీ సీనియర్లు బహిరంగంగానే చంద్రబాబు వైఖరిని తప్పుపడుతున్నారు. టీడీపీ కార్యకర్తల హత్యకు కారకులను, దొంగలను పార్టీలో చేర్చుకోవటం ఎంతవరకూ సబబో ఆలోచించాలని చంద్రబాబు కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే ప్రశ్నించారు. టీడీపీ అంతా కాంగ్రెస్ మయమవుతోందని, ఇది మంచి పరిణామం కాదని, టీడీపీలో కాంగ్రెస్ విలీనమైందని అందరూ భావిస్తున్నారని కోడెల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలోని మరికొందరు సీనియర్లు కొద్ది రోజులుగా ఇదే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. -
సారథి ఎంపికపై ‘దేశం’లో ఉత్కంఠ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం రాత్రి పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించినప్పటికీ, చర్చలు కొలిక్కి రాకపోవడంతో సారథి ఖరారు శుక్రవారానికి వాయిదా పడింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన పి.మహేందర్‌రెడ్డి ఇటీవల టీఆర్ఎస్ పంచన చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఈ పదవిని భర్తీ చేసే అంశంపై తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుభాష్యాదవ్తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధ్యక్షుడి ఎంపికపై సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గతంలో జిల్లా నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహా సామాజిక సమీకరణలో భాగంగా బీసీ వర్గానికి చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు అధ్యక్ష పదవి ఇచ్చే అంశంపై చర్చించారు. ఓ దశలో పార్టీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌యాదవ్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ, ఎన్నికల వేళ సీనియర్లకు పగ్గాలు అప్పగించడమే శ్రేయస్కరమని అంచనాకొచ్చిన బాబు... ఎమ్మెల్యేలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇరువురు శాసనసభ్యులకు స్పష్టం చేశారు. ఎవరి సారథ్యంలోనైనా పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మీరు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఖరారుపై శుక్రవారం తన నిర్ణయం వెల్లడిస్తానని చంద్రబాబు తెలిపినట్లు పార్టీ వర్గాలు వివరించాయి. సత్తా చాటండి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని, సమర్థ అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల్లో పార్టీ పటిష్టంగా ఉందని, సమష్టిగా రాణించడం ద్వారా మెజార్టీ వార్డులు దక్కించుకోవాలని అన్నారు. ఎన్నికల్లేని శివారు ప్రాంతాల్లోని నేతలకు కూడా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించాలని జిల్లా నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు. -
పార్టీలో గ్రూపుల్లేవు: సోమిరెడ్డి
నెల్లూరు : జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపులు, ఎవరి మధ్య విభేదాలు లేవని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో బుధవారం రాత్రి జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడారు. తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నించడం తగదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా సీమాంధ్ర ఎదగాలంటే చంద్రబాబు సీఎం కావల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి రెండు పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ సమష్టి కృషితో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. కొత్తగా వచ్చిన నేతలతో పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. విభేదాలను పక్కనపెట్టి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సుపరిపాలన అందించగలిగే సత్తా చంద్రబాబుకే ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుందన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీలోకి వచ్చిన తాను సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్ర విభజన తనను బాధించిందని, అందుకే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరానన్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కోవూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. చంద్రబాబు ఆశీస్సులతో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీద మస్తాన్‌రావు, బల్లి దుర్గాప్రసాద్, పరసా రత్నం, కురుగొండ్ల రామకృష్ణ, పార్టీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కరణం బల రాం, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వర్ల రామయ్య, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు మాట్లాడారు. పార్టీలో పలువురి చేరిక చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు పలువురు టీడీపీలో చేరారు. వీరిలో మాజీ కార్పొరేటర్లు కిన్నెర ప్రసాద్, సాయిలలిత, స్వర్ణా వెంకయ్య, బీసీ నేత పద్మజయాదవ్ తదితరులు ఉన్నారు. దామోదర జోషి కుటుంబానికి రూ.3 లక్షల సాయం సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఎన్జీఓ నాయకుడు దామోదరజోషి కుటుంబానికి సుజనా ఫౌండేషన్ అధినేత సుజనాచౌదరి రూ.3 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును ఆయన కుటుంబసభ్యులకు అందజేసేందుకు చంద్రబాబు చేతుల మీదుగా బీద రవిచంద్రకు అందజేశారు. -
మాగుంట కుటుంబానికి ‘బాబు’ ఎర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఒక అసెంబ్లీ సీటు మహిళలకు ఇస్తామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఆ సీటును కూడా కాంగ్రెస్ నుంచి వలస తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఆ సీటును మాగుంట కుటుంబ సభ్యులకు కేటాయించే వాతావరణం కనిపిస్తోంది. ధనబలం వున్న వారి కోసం వలలు విసిరి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబునాయుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట పార్వతమ్మను పార్టీలోకి తీసుకురావడానికి తెర చాటుమంతనాల వేగం పెంచారు. ఇందులో భాగంగానే తమ దారెటో నిర్ణయించుకోవడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి నెల్లూరులోని తమ కార్యాలయంలో ఆదివారం మద్దతుదారుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధాటికి తట్టుకోవాలంటే వందలు, వేల కోట్లున్న ధనవంతులను పోటీకి దించడమే ఏకైక మార్గంగా టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఇలాంటి వారికి ఎల్లో కార్పెట్ స్వాగతం పలికి వారు కోరిన సీట్లు కేటాయించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. పదేళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారి నుంచి తీవ్ర నిరసన ఎదురవుతున్నా అవసరమైతే అలాంటి వారినే వదులుకుని కొత్త వారికి టికెట్లు ఇచ్చేలా టీడీపీ అధినేత పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి చంద్రబాబు టికెట్లు ఖరారు చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావం చూపగల మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని ఎలాగైనా తమ వైపునకు లాక్కోవడానికి తమ పార్టీ ముఖ్య నేతలను ఆయన రంగంలోకి దించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డిని, ఆయన వదిన పార్వతమ్మను పార్టీలోకి రావాలంటూ వారి మీద ఒత్తిడి పెంచుతున్నారు. శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ, పార్వతమ్మకు ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చంద్రబాబు తన సన్నిహిత నాయకుల ద్వారా మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. శ్రీనివాసులురెడ్డిని ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయించడం ద్వారా ఆ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున ధన సహాయం అందించి ఎన్నికల్లో వెయ్యి రూపాయల నోట్లు పారించే ఎత్తుగడకు తెర లేపారు. నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి పార్వతమ్మను పోటీ చేయించి అక్కడ కూడా విరివిగా ధన ప్రవాహం పారించాలనేది చంద్రబాబు ఎత్తుగడగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఉదయగిరి పార్టీ ఇన్చార్జిగా ఉన్న బొల్లినేని రామారావు పార్టీ హై కమాండ్ సూచించినంత డబ్బు ఖర్చు పెట్టే ధైర్యం చేయలేక వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో ఆదాల ప్రభాకరరెడ్డి తన మద్దతు దారుడు ఒంటేరు వేణుగోపాలరెడ్డికి ఆ టికెట్ ఇప్పించే ప్రయత్నాలకు తెర లేపారు. అయితే చంద్రబాబు మాత్రం పార్వతమ్మను ఇక్కడి నుంచి పోటీచేయించే ఆలోచన చేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను ఒప్పించో, టికెట్లు ఎర వేసో తమ పార్టీలోకి లాక్కొచ్చే పనిచేస్తున్న ఇద్దరు టీడీపీ ముఖ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మీద ఒత్తిడి పెంచారని తెలిసింది. టికెట్లు ఖరారు చేయాల్సిన సమయం దగ్గర పడుతున్నందువల్ల వెంటనే నిర్ణయం తెలియ చేయాలని వారు రకరకాల మార్గాల్లో మాగుంట కుటుంబాన్ని ఒత్తిడి చేయిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం నెల్లూరులోని తన కార్యాలయంలో మద్దతుదారులతో సమావేశమయ్యారు. తమకు వస్తున్న ఆఫర్ల గురించి వివరించి ఏ పార్టీలోకి వెళితే బాగుంటుందనే అభిప్రాయలు సేకరించారు. ఒకటి,రెండు రోజుల్లో ఒంగోలులో కూడా మద్దతుదారులతో సమావేశమై ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే తమ నాయకుడు ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ, అనేక రకాల ఆలోచనల్లో మాత్రమే ఉన్నారని ఆదివారం నాటి సమావేశానికి హాజరైన ఒక నాయకుడు సాక్షి ప్రతినిధికి చెప్పారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వలస నాయకులను తీసుకుని వచ్చి టికెట్ల పందేరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. -
ఖాళీ చేయటానికి టీడీపీ బ్రాందీ సీసా కాదు
గురువుకే పంగనామాలు పెట్టిన చరిత్ర కేసీఆర్‌ది: బాబు టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటిస్తాం.. కేంద్రంలో చక్రం తిప్పుతాం తెలంగాణలో టీడీపీ అధికారంలోకొస్తే బీసీ నేతకు సీఎం పదవి బాబుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించాలని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కలలు కంటున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. ఖాళీ చేసేందుకు టీడీపీ బ్రాందీ సీసా కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజకీయం అంతా తన వద్దే నేర్చుకున్నారని.. గురువుకే పంగనామాలు పెట్టిన చరిత్ర కేసీఆర్‌ది అని ఆక్రోశం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, పరిగి నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు టీ ఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలు, నేతలకు ధైర్యం చెప్పేందుకు చంద్రబాబు శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో పార్టీ జిల్లా విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని 45 సీట్లు కేటాయించటం వల్ల తాము అధికారంలోకి రాలేకపోయామని పేర్కొన్నారు. టీఆర్ఎస్తో తెగతెంపులు చే సుకున్న తరువాత గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 45 మంది కార్పొరేటర్లను గెలుపించుకోగలిగామన్నారు. తనను సీబీఐ కేసుల్లో ఇరికించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీని త్వరలో జాతీయ పార్టీగా ప్రకటిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లో టీడీపీ విజయం సాధించడం ద్వారా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే బలహీనవర్గాలకు చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటం కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఇదిలావుంటే.. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి శనివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. -
‘దేశం’కు ఇద్దరు అధ్యక్షులు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యనాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటుండగా వారిని కాపాడుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు జిల్లాలో ఒకే కమిటీ ఉండగా, తాజాగా రెండు కమిటీలుగా విభజించారు. తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు వేర్వేరుగా జిల్లా అధ్యక్షులను గురువారం నియమించారు. మిగతా పదవుల్లో కొనసాగుతున్న వారిని ఆయా జిల్లా కమిటీల కింద కొనసాగుతారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్లో రెండు జిల్లా కమిటీలు ఉండగా, తాజాగా కాంగ్రెస్, బీజేపీల్లోనూ రెండు జిల్లా కమిటీలుగా విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తూర్పునకు అరిగెల నాగేశ్వర్రావు.. తూర్పు ప్రాంతానికి పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావును నియమించారు. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటకు చెందిన ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో 2000-2004 వరకు రెండు సార్లు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. 2002-2005 వరకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర నిర్వహణ కార్యదర్శిగా ఉన్న ఆయనను తూర్పు జిల్లా అధ్యక్షునిగా నియమించారు. రెండు సార్లు ఆసిఫాబాద్ నుంచి ఎంపీపీ, ఒకసారి జెడ్పీటీసీగా వ్యవహరించారు. ఆయన భార్య అరిగెల లక్ష్మి కూడా ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. పశ్చిమ ప్రాంతానికి లోలం శ్యాంసుందర్.. పశ్చిమ ప్రాంతానికి లోలం శ్యాంసుందర్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. 2001-2006 వరకు జెడ్పీ చైర్మన్గాా పనిచేశారు. లోకేశ్వరం మండలం పిప్పిరి గ్రామానికి చెందిన ఆయన 1995 నుంచి పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా, పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. 2010-12 వరకు టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం నిర్మల్‌లో ఉంటున్నారు. -
వేట
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను వెతుక్కునే పనిలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు టీడీపీ నాయకులు గాలం వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో పూర్తిగా పట్టుకోల్పోవడంతో ఆ పార్టీ నాయకులను తెలుగుదేశంలోకి లాగాలని, పార్టీ అధిష్టానం జిల్లాలోని కొంత మంది నాయకులకు పురమాయించింది. దీంతో టీడీపీ నాయకులు అభ్యర్థుల కోసం కాంగ్రెస్ నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌ను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని తమ పార్టీలోకి రావాల్సిందిగా టీడీపీ నేతలు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన ఇంత వరకు స్పందించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే తిరుపతినాయుడును పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తిరుపతినాయుడు ఇది వరకు తెలుగుదేశం తరఫున పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్టు లభించకపోవడంతో ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదించగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆదిమూలపు సురేష్‌ను కూడా టీడీపీ వైపునకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకు ఆయన సుముఖత చూపడం లేదని తెలిసింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోసం కూడా జిల్లా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి ఆహ్వానించిన విషయాన్ని తెలుసుకున్న అక్కడి కార్యకర్తలు పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మాజీ ప్రజారాజ్యం నాయకులపైన కూడా టీడీపీ గురిపెట్టింది. కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడంపై టీడీపీ కార్యకర్తలు, నాయకులు అధిష్టానం వైఖరిని ఖండిస్తున్నారు. ఏళ్ల తరబడి జెండాలు మోస్తూ డబ్బు ఖర్చుపెట్టుకుంటున్న తమను పక్కనపెట్టి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకులను పిలిచి వారికి పెద్దపీట వేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పలువురు నేతలు పార్టీపై కినుక వహించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది పార్టీని వీడేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు టీడీపీ టికెట్టు ఇస్తే హైదరాబాద్ వెళ్లి అధినేత ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు. టీడీపీలో వస్తున్న ఈ వ్యతిరేకతను అధిష్టానం ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సి ఉంది. -
‘దేశం’ కసరత్తు
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా అధ్యక్షుడి రాజీనామాతో పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన జిల్లా తెలుగుదేశం పార్టీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమిం చింది. గోడం నగేష్ రాజీనామాతో ఖాళీ అయి న స్థానాన్ని భర్తీ చేసేలా పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు చేపట్టారు. జిల్లా అధ్యక్షుడి స్థానానికి ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులు అబ్దుల్‌కలాం, అరిగెల నాగేశ్వర్రావుతోపాటు, నిర్మల్ ప్రాంత నాయకుడు, జెడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాం సుందర్ పేర్లను పరిశీలిస్తున్నారు. టీ టీడీపీ నేత ల సమావేశం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించగా.. జిల్లాలోని పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖాళీ అయిన జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయం చర్చకొచ్చింది. అయితే తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో టీఆర్ఎస్ మాదిరిగా జిల్లాను రెండుగా విభజించి తూర్పు, పశ్చిమ జిల్లాలకు వేర్వేరు అధ్యక్షులను నియమించాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని నేతలు భావిస్తున్నారు. సోయం బాపూరావుకు ‘దేశం’ గాలం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు సోయం బాపూరావుకు తెలుగుదేశం పార్టీ గాలం వేస్తోం ది. తమ పార్టీలో చేరాలని ఎంపీ రాథోడ్ రమే ష్ బాబూరావుతో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గోండు సామాజికవర్గానికి చెందిన నగేష్ రాజీనామాతో అదే సామాజిక వ ర్గానికి చెందిన నాయకున్ని పార్టీలో చేర్చుకునేం దుకు నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అలాగే బీజేపీ నాయకులు కూడా బాబూరావు తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. -
ఖాళీ దిశగా ‘దేశం’
టీడీపీకి జిల్లా అధ్యక్షుడు గొడాం నగేష్ గుడ్‌బై సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కేడర్ చాలావరకు పార్టీకి దూరం అయింది. తాజాగా, తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేక వైఖరి, పార్టీలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్ టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్వగ్రామమైన బజార్హత్నూర్ మండ లం జాతర్లలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతానని కూడా వెల్లడించారు. చంద్రబాబు టీ-బిల్లును అడ్డుకునేందుకు చేసిన ఒత్తిళ్లు, కార్యకర్తల అభిమతం మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. బీజేపీ వైపు ‘పాయల్’ చూపు.. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాయల్ శంకర్ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేసేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. బుధవారం నియోజకవర్గంలోని జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల నాయకులతో ఆదిలాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి, బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర పడి న వెంటనే జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బిల్లు విషయమై ఇన్నాళ్లు వేచి చూసే ధోరణితో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. ఎంపీ రాథోడ్ రమేష్‌తో విభేదాలు ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్‌ల మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా కొనసాగుతోం ది. ఈ ఇద్దరు పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిం చారు. ఎంపీ నెల రోజుల క్రితం చేపట్టిన పల్లెనిద్ర విషయం లో కూడా వీరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యా యి. పార్టీ అంతర్గత సమావేశాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నగేష్ వ్యతిరేకించినట్లు చర్చ జరిగింది. మరోవైపు ఎంపీ రమేశ్ బోథ్ నియోజకవర్గంలో నగేష్ వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషించారనే విమర్శలు ఉన్నాయి. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఆ వర్గం నాయకులకు పనులు ఇవ్వడం వంటివి చేశా రు. ఒక్కో సందర్భంలో ఇరువురు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదులు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుధవారం నగేష్ జాతర్లలో నిర్వహించిన ఈ సమావేశానికి రాథోడ్ రమేష్ వర్గం నాయకులకు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. ఈ సమావేశానికి వెళ్లవద్దని ఢిల్లీలో ఉన్న రాథోడ్ రమేష్ తన వర్గం నేతలకు ఫోన్లు చేసి చెయడం స్థానికంగా చర్చనీయాంశమమైంది. బోథ్‌కు టీడీపీ అభ్యర్థి కరువు నగేష్ టీడీపికి గుడ్‌బై చెప్పడంతో బోథ్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు పర్యాయాలు నగేష్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆయన తండ్రి రామారావు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. -
ఖాళీ దిశగా ‘దేశం’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కేడర్ చాలావరకు పార్టీకి దూరం అయింది. తాజాగా, తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేక వైఖరి, పార్టీలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్ టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్వగ్రామమైన బజార్హత్నూర్ మండలం జాతర్లలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతానని కూడా వెల్లడించారు. చంద్రబాబు టీ-బిల్లును అడ్డుకునేందుకు చేసిన ఒత్తిళ్లు, కార్యకర్తల అభిమతం మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. బీజేపీ వైపు ‘పాయల్’ చూపు.. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాయల్ శంకర్ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేసేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. బుధవారం నియోజకవర్గంలోని జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల నాయకులతో ఆదిలాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి, బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర పడిన వెంటనే జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బిల్లు విషయమై ఇన్నాళ్లు వేచి చూసే ధోరణితో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. ఎంపీ రాథోడ్ రమేష్‌తో విభేదాలు ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్‌ల మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ ఇద్దరు పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. ఎంపీ నెల రోజుల క్రితం చేపట్టిన పల్లెనిద్ర విషయంలో కూడా వీరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నగేష్ వ్యతిరేకించినట్లు చర్చ జరిగింది. మరోవైపు ఎంపీ రమేశ్ బోథ్ నియోజకవర్గంలో నగేష్ వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషించారనే విమర్శలు ఉన్నాయి. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఆ వర్గం నాయకులకు పనులు ఇవ్వడం వంటివి చేశారు. ఒక్కో సందర్భంలో ఇరువురు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదులు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుధవారం నగేష్ జాతర్లలో నిర్వహించిన ఈ సమావేశానికి రాథోడ్ రమేష్ వర్గం నాయకులకు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. ఈ సమావేశానికి వెళ్లవద్దని ఢిల్లీలో ఉన్న రాథోడ్ రమేష్ తన వర్గం నేతలకు ఫోన్లు చేసి చెయడం స్థానికంగా చర్చనీయాంశమమైంది. బోథ్‌కు టీడీపీ అభ్యర్థి కరువు నగేష్ టీడీపికి గుడ్‌బై చెప్పడంతో బోథ్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు పర్యాయాలు నగేష్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆయన తండ్రి రామారావు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో ఇక్కడ నగేష్‌కు ప్రత్యామ్నయంగా నియోజకవర్గ స్థాయి నాయకులుగా ఎవరూ తెరపైకి రాలేదు. ద్వితీయ శ్రేణి నాయకులుగా ఎదగకుండా నగేష్ ముందునుంచి జాగ్రత్త పడ్డారనే విమర్శలున్నాయి. మొత్తం మీద ఇక్కడ, ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థి ప్రశ్నార్థకంగా తయారైంది. మరో నియోజకవర్గ ఇన్చార్జి కూడా.. తూర్పు జిల్లాకు చెందిన మరో నియోజకవర్గ ఇన్చార్జి కూడా టీడీపీకి రాజీనామా చెప్పాలనే యోచనలో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న ఆయనతో టీఆర్ఎస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. ఆయన కూడా నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో ఒకటి, రెండు రోజుల్లో సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. వారి మనోభావాల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. -
ఓటు రాజకీయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రానున్న ఎన్నికల్లో ఎలాగైనా పరువు నిలుపుకోవాలన్న తాపత్రయంతో ఉన్న అధికార పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల మనసు మార్చి తమవైపు ఎలాగూ తిప్పుకోలేమనుకున్న వారు అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1,33,898 మంది ఓటర్లు కొత్తగా పెరిగారు. మార్పు చేర్పుల్లో 73,121 మంది ఓట్లను తొలగించారు. ఓట్లు కోల్పోయిన వారిలో దాదాపు 40 వేల మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉన్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఒక్క ఒంగోలు నగరంలోనే 12 వేలకుపైగా ఓటర్లను తొలగించారని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 5 వేల ఓట్ల వరకు తొలగించినట్లు సమాచారం. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే నోరు మెదిపేందుకు నిరాకరిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లబ్ధి చేకూర్చేందుకే వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ నాయకులు అధికారులను ప్రశ్నించగా విచారణ జరుపుతామని మాత్రమే సమాధానమిస్తున్నారు. ఒంగోలు శివారులోని కొప్పోలులో 35 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లు తొలగించారు. వీరు అదే గ్రామంలో ఏళ్ల తరబడి ఉంటూ గతంలో కూడా ఓట్లు వేసిన వారే. అయితే వీరి ఓట్లను కూడా తొలగించడంతో స్థానిక తహసీల్దార్‌ను ఆశ్రయించారు. దీనిపై వైఎస్సార్ సీపీ నాయకుడు రత్తయ్య మాట్లాడుతూ ఓట్ల తొలగింపుపై అధికారులను ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ మెజారిటీని తగ్గించేందుకే ఆ పార్టీకి చెందిన వారి ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. తొలగించిన ఓట్లను తిరిగి చేర్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
ఢీ అంటే ఢీ!
ఖమ్మంరూరల్/సత్తుపల్లి, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరింత రాజుకుంటోంది. పార్టీలో రెండు శిబిరాలకు నాయకత్వం వహిస్తున్న ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావులు ఎక్కడా వెనక్కు తగ్గకుండా వ్యవహరిస్తుండడంతో తెలుగుతమ్ముళ్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. శుక్రవారం ఎంపీ నామా నాగేశ్వరరావు జిల్లాలో రెండు చోట్ల పర్యటించగా, ఆ రెండు కార్యక్రమాలనూ తుమ్మల వర్గీయులు బహిష్కరించారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు కోట అయిన సత్తుపల్లి నియోజకవర్గంలో అయితే ఓరకంగా ఫైటింగే జరిగింది. నామా వస్తున్న విషయం తమకు తెలియదని, తమకు చెప్పని కార్యక్రమాలకు ఎందుకు వెళతామని తుమ్మల వర్గీయులు కార్యక్రమానికి డుమ్మా కొట్టగా, తుమ్మల మేనల్లుడు ఏకంగా నామా కాన్వాయ్‌కే అడ్డం తిరిగాడు. నామా వర్గీయులు ఆయనను తోసేసి ముందుకెళ్లారు. అయితే, సత్తుపల్లిలో తాము పార్టీ కార్యక్రమానికి వెళ్లలేదని, తమ ట్రస్ట్ కార్యక్రమానికి వెళ్లామని ఎంపీ నామా వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా, కూసుమంచిలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి తుమ్మల వర్గం ఎందుకు డుమ్మా కొట్టిందనేదానికి మాత్రం సమాధానం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ రెండు గ్రూపులు మరిన్ని జగడాలకు దిగుతాయని, ఈ ప్రభావం ఎన్నికల్లో విజయావకాశాలపై తప్పకుండా ఉంటుందని క్షేత్రస్థాయి తలలు పట్టుకుంటోంది. ముఖ్యనాయకులు వచ్చినా... కూసుమంచి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఆ పార్టీ పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో తుమ్మల వర్గానికి చెందిన ఏ ఒక్క నాయకుడు, కార్యకర్త పాల్గొనకపోవడం గమనార్హం. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎన్నికల పరిశీలకులు, జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ తదితర నాయకులు హాజరైనా తుమ్మల వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు అటువైపు కన్నెత్తి చూడలేదు. అసలు తమకు ఈ సమావేశానికి ఆహ్వానమే లేదని తుమ్మల వర్గానికి చెందిన ఓ నాయకుడు వాపోయాడు. పై స్థాయి నాయకులు వర్గాలుగా విడిపోయి పార్టీని భ్రష్ఠుపట్టిస్తున్నారని ఆ నాయకుడు ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. అయితే, తుమ్మల వర్గీయులు లేకుండా నామా వర్గమే ఈ సమావేశాన్ని తూతూమంత్రంగా ముగించుకుని వెళ్లిపోయింది. నామా వాహనాన్ని అడ్డగించిన తుమ్మల మేనల్ల్లుడు.. ఆటోడ్రైవర్లకు యూనిఫాం పంపిణీ చేసేందుకని ఎంపీ నామా శుక్రవారం సత్తుపల్లిలో పర్యటించగా తుమ్మల వర్గం తన ప్రతాపాన్ని చూపింది. తుమ్మల మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించడం, ఇప్పుడు కూడా ఆయన వర్గీయుడు సండ్ర ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడంతో ఇక్కడ తుమ్మల వర్గానిదే పైచేయి. అయితే, కావాలని నామా వర్గీయులు ఎంపీని సత్తుపల్లికి రప్పించారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కార్యక్రమానికి తుమ్మల గ్రూపును ఆహ్వానించకుండానే పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. నామా నాగేశ్వరరావు ప్రదర్శనగా ఓపెన్‌టాప్ జీప్‌లో బయలుదేరి వెళ్తుండగా రామాలయం వద్ద తుమ్మల నాగేశ్వరరావు మేనల్లుడు కొప్పుల ప్రవీణ్ నామా వాహనానికి అడ్డంగా నిల్చొని హల్చల్ చేశారు. దీంతో నామాకు రక్షణగా వచ్చిన కార్యకర్తలు ఆయనను పక్కకు తోసేశారు. అయినా సభావేదిక వద్దకు వచ్చి ఘర్షణ పడ్డాడు. నామా నాగేశ్వరరావు ప్రదర్శనకు అడ్డుపడతారనే ప్రచారం జరగటంతో వెదురు కర్రలతో ప్రదర్శన మొత్తం పదిమంది కార్యకర్తలు రక్షణగా వెళ్లారు. పార్టీ కార్యక్రమం కాదు: ఎంపీ నామా ఇది పార్టీ కార్యక్రమం కాదు.. దయచేసి వివాదం చేయకండి అంటూ ఎంపీ నామా నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ వేరు.. సామాజిక కార్యక్రమం వేరు. ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారని నేను ఊహించలేదంటూ బదులిచ్చారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరా... ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటనపై సండ్ర వెంకటవీరయ్య ఎప్పటికప్పుడు ఆరా తీసే పనిలో పడ్డారు. ఎవరెవరూ నామా వెంట ఉన్నారు.. అనే సమాచారాన్ని సేకరించే పనిలో ఆయన అనుచరులు నిమగ్నమయ్యారు. -
టీడీపీ డీలా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరి చిప్పల సమన్యాయం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నిండా ముంచిందనే చెప్పాలి. బలమైన తెలంగాణ సెంటిమెంటు నేపథ్యంలో జిల్లాలో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. కొద్దో గొప్పో కార్యకర్తలు కష్టనష్టాలకు తట్టుకొని నిలబడినప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ సెంటిమెంటును గౌరవించే పార్టీల్లో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా ఆ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జిలను వెతుక్కునే పనిలోనే ఉంది. ఐదు నియోజకవర్గాల్లో ఇంతవరకు ఇన్చార్జిలనే నియమించలేదు. పార్టీకి చెప్పుకోవడానికి జిల్లాలో ఒకే ఒక అసెంబ్లీ సీటుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే జిల్లాను వదిలేసి సేఫ్ జోన్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి దాదాపు ఆయన మానసికంగా సిద్ధమైనట్టు సమాచారం. చంద్రబాబునాయుడుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని బట్టి ఆయనకు టికెట్ ఖాయమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన పునాదులు లేవు. ఈ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలే దిక్కు లేరు. సిద్దిపేటలో హరీష్‌రావు, సంగారెడ్డిలో జగ్గారెడ్డి, పటాన్చెరులో నందీశ్వర్‌గౌడ్ బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి గ్రామస్థాయిలో కార్యకర్తలు కూడా లేరు. సిద్దిపేటలో హరీష్‌రావును రాజకీయంగా ఢీకొట్టగల తెలుగుదేశం అభ్యర్థులు లేరనే చెప్పాలి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి నాయకుడిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంతంతగానే ఉంది. పలు గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నా మండల కమిటీ నాయకత్వం వారిని ముందుకు నడిపే స్థితిలో లేదు. ఈ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలో చాలా గ్రామాల్లో పార్టీకి కార్యకర్తలే లేరు. గతంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీలలో చేరారు. పటాన్చెరులో కొంతమేరకు నందమూరి కుటుంబానికి అభిమానులున్నా, చంద్రబాబునాయుడు వైఖరిపై నందమూరి హరికృష్ట తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అక్కడి కార్యకర్తల్లో స్తబ్దత ఏర్పడింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ పార్టీ ఉనికి అంతంతమాత్రంగానే ఉంది. సంగారెడ్డిలో ఐదు మంది సభ్యుల కమిటీ ఉన్నా ఒక్క నేత కూడా ముందుకొచ్చి జగ్గారెడ్డిని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నమే చేయడం లేదు. ఆందోల్ నియోజకవర్గంలో పార్టీ స్వల్పంగా క్యాడర్ ఉన్నప్పటికీ వాళ్లు కూడా మాజీ మంత్రి, నియోజకవర్గం ఇన్చార్జి బాబుమోహన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బహుసభ్య కమిటీలతో మొదటికే మోసం... ఇన్ని సమస్యల నేపధ్యంలో పార్టీని పటిష్ట పరిచి, గ్రామస్థాయిలో పార్టీని పునర్నిర్మాణం చేసేందుకు కొన్ని నియోజకవర్గాల్లో బహుసభ్య కమిటీని వేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో వీలును బట్టి ముగ్గురు నుంచి ఐదు మందితో కూడిన సమన్వయ కమిటీలు వేశారు.ఈ కమిటీలతో పార్టీకి కొత్త తలనొప్పులు వచ్చాయి. ఇంత మందిలో ఎవరికి టికెట్ ఇస్తారో తెలియని పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు చేసి పార్టీని నడిపించడం వృథాప్రయాస అనే ధోరణిలో నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఎవరినో ఒక్కరినే ఇన్చార్జిగా వేయాలని ఈ కమిటీ సభ్యులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎవరికి ఇన్చార్జి పదవి అప్పగిస్తే మిగిలిన వారి నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయేనని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రేపు, మాపు అంటూ కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. -
టిడిపీలో రాజ్యసభ సీట్ల చిచ్చు
-
టీడీపీలో సీట్ల చిచ్చు
రాజ్యసభ అభ్యర్థులుగా గరికపాటి, సీతారామలక్ష్మి బాబు అన్యాయం చేశారంటూ మోత్కుపల్లి, సోమిరెడ్డి ఆగ్రహం సమైక్యం కోసం రాజీనామా చేసిన తనకు టికెట్ ఇవ్వాలన్న హరికృష్ణ విజ్ఞప్తిని పట్టించుకోని చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థులుగా గరికపాటి, సీతారామలక్ష్మిల పేర్లు ఖరారు పొలిట్‌బ్యూరో నేతలతో ఏకాంత సమావేశాల్లో అభ్యర్థుల పేర్లు చెప్పిన చంద్రబాబు పార్టీ అధినేత అన్యాయం చేశారంటూ మోత్కుపల్లి, సోమిరెడ్డిల తీవ్ర ఆగ్రహం సమైక్యం కోసం రాజీనామా చేసిన తనకు టికెట్ ఇవ్వాలని హరికృష్ణ విజ్ఞప్తి బావమరిది వినతిని సైతం పక్కనపెట్టిన టీడీపీ అధ్యక్షుడు.. సీటు నిరాకరణ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చిచ్చు రేపింది. పార్టీ నేతల నిరసనలు, ఆగ్రహావేశాల మధ్య పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో అన్యాయం చేశారంటూ చంద్రబాబుపై పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయగా.. మరో నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుతిరిగారు. సమైక్యాంధ్ర కోసం పదవికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ తనకు మరోసారి అవకాశమివ్వాలని కోరినా పక్కనపెట్టటంతో ఆయన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ తరఫున రాజ్యసభ బరిలో దింపడానికి ఇద్దరు నేతల పేర్లను ఖరారు చేయటంలో తీవ్ర అసంతృప్తులు, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు మాత్రం ముందుగా తాను అనుకున్నట్టే గరికపాటి మోహన్‌రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ముందునుంచి భావిస్తున్నట్టుగానే మరో స్థానం కోసం పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పేరును ఖరారు చేశారు. చంద్రబాబు నివాసంలో ఆయన అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ పేర్లను చెప్పి ఆమోదింపజేశారు. అనంతరం రాత్రి విలేకరుల సమావేశంలో వీరిద్దరి పేర్లను ప్రకటించారు. మంగళవారం వీరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసిన వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వీరిని ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు. సాధారణ ఎన్నికల తర్వాత అయితే మోత్కుపల్లికి రాజ్యసభ టికెట్ ఇచ్చే వాడినన్నారు. గరికపాటి టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు వియ్యంకుడు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. సీతారామలక్ష్మి కూడా సంపన్నురాలే. ఆమె భర్త సత్యనారాయణ జగదీష్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీకి అధిపతి. నేతలతో ఏకాంత చర్చలు: ప్రస్తుతం ప్రాంతీయ భావోద్వేగాలు నెలకొన్న పరిస్థితుల్లో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఒక్కో సీటు ఇవ్వాలని టీడీపీ నేతలు పొలిట్‌బ్యూరో భేటీలో సూచించారు. ఈ సందర్భంగా బాబు నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి గరికపాటి, సీమాంధ్ర నుంచి నారాయణ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ పి.నారాయణ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు నిమ్మకాయల చినరాజప్ప, తోట సీతారామలక్ష్మిల పేర్లను వారికి చెప్పారు. గతంలో కార్పొరేట్ సంస్థలు నడిపే వ్యక్తులకు సీట్లు ఇచ్చామన్న విమర్శలు ఉన్నందున ఈసారి అలా జరక్కుండా చూడాల్సిందిగా వారు కోరారు. మోత్కుపల్లి ఆగ్రహం.. బుజ్జగింపులు: ఎంతో కాలంగా పార్టీకి సేవచేస్తుంటే ఈ రకంగా అవమానించడం దారుణమని చంద్రబాబు నివాసంలోనే నేతల వద్ద మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో తాను పార్టీని కాపాడేందుకు ముందున్నానని, ఎన్టీఆర్ భవన్‌కు ఎవ్వరూ రాని సమయంలో తాను అక్కడే తిష్టవేసి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించానని, అలాంటి తనకు రాజ్యసభ సీటు ఇవ్వకుండా ఆర్థికంగా బలవంతులైన వారికి పెద్దపీట వేయటం దారుణమని మండిపడ్డారు. ఆవేశంగా చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చారు. టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, చింతమనేని ప్రభాకర్ పరుగున వచ్చి ఆయన్ను నిలువరించారు. నామా ఆయనకు నచ్చచెప్పి తిరిగి బాబు నివాసంలోకి తీసుకెళ్లారు. బాబు విలేకరుల సమావేశం ముగిసే వరకూ నామా, ముద్దుకృష్ణమ తదితరులు ఆయన్ను బుజ్జగిస్తూనే ఉన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ సీటు కోరుకుంటే ఆ సీటు ఇస్తారని, ఎన్నికల ఖర్చు మొత్తాన్ని పార్టీ భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని హామీలు ఇచ్చారు. అయినా ఆయన శాంతించలేదు. అర్ధంతరంగా సోమిరెడ్డి నిష్ర్కమణ..: రాజ్యసభ సీటును ఆశించిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పొలిట్‌బ్యూరో సమావేశం నుంచి అర్ధంతరంగా నిష్ర్కమించారు. తన పేరు పరిశీలన దశలోనే తిరస్కరించారని పసిగట్టిన ఆయన చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ అయ్యి అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయం చెప్పాల్సి ఉన్నప్పటికి వెనుదిరిగారు. ఫోన్లో కూడా ఆయన ఎవ్వరికీ స్పందించకుండా స్విచాఫ్ చేశారు. హరికృష్ణ కోరికా మన్నించలేదు..: సుదీర్ఘ విరామం తరువాత జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశానికి నందమూరి హరికృష్ణ హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తాను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నందున ఈసారి సీటు తనకే కేటాయించాల్సిందిగా కోరారు. రాజ్యసభ సీటును ఆశిస్తూ సమావేశంలో పాల్గొనటం సరికాదని బయటకు వెళ్లారు. చంద్రబాబు మాత్రం బావమరిది విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పొలిట్‌బ్యూరో సమావేశానికి ముందు చంద్రబాబు టీడీఎల్పీ కార్యాలయంలో శాసనసభ్యులతో సమావేశమయ్యారు. మరో ఎంపీ సి.ఎం.రమేష్ కాంగ్రెస్ తరఫున రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగిన జె.సి.దివాకర్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలతో రాజ్యసభ ఎన్నికలపై చర్చలు జరిపారు. -
పెద్దల సీటు కోసం ‘తమ్ముళ్ల’ పోరు
అధినేత చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల్లో అసంతృప్తి కోటరీకే పీట వేస్తున్నారని.. డబ్బే కొలమానంగా మారిందని ఆగ్రహం టికెట్ కోసం గరికపాటి యత్నాలు.. అడ్డుకునేందుకు సుజనా వ్యూహం బాలకృష్ణను రాజ్యసభకు పంపించే ఎత్తుగడలో చంద్రబాబునాయుడు బాలయ్యను పార్టీకి దూరంగా ఉంచి.. ప్రచారానికే వాడుకునే ఎత్తుగడ! రాజ్యసభపై హామీ లభించకపోవటంతో మోత్కుపల్లి అసంతృప్తి గళం మరోసారి సీటు ఆశిస్తున్న కంభంపాటి.. ‘రాజగురువు’ ద్వారా సిఫారసు! రేసులో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు వ్యాపార ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ టికెట్ల విషయమై తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తీవ్రమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ భవిష్యత్తెలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్న నేతలు ఈసారి ఎలాగైనా రాజ్యసభ సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు ఒక నేత రాష్ట్ర రాజధానిలోని ఒక స్టార్ హోటల్లో విందు మంత్రాంగం నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న రెండు కళ్ల సిద్ధాంతం రాజ్యసభకూ వర్తింపచేస్తుండటం ఆ నేతకు తలనొప్పిగా తయారైంది. మరోవైపు చంద్రబాబు తన సన్నిహితులకు, డబ్బున్న వారికి టికెట్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిసారీ డబ్బు కొలమానంగా మారిందని, ఈసారీ అలాంటి అభ్యర్థులే ఎంపికకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పైగా ప్రతిసారీ ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, చంద్రబాబు కోటరీలో ఒకరికి టికెట్ ఇస్తున్నారని పార్టీ నేతల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ ఎన్నో విధాలుగా నష్టపోయిన వారికి గుర్తింపు ఉండట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలఢీ అంటే ఢీ టీడీపీ రాజకీయాలను శాసిస్తూ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఇద్దరు పారిశ్రామికవేత్తలు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఒకరికొకరు ఢీఅంటే ఢీ అనే పరిస్థితికి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహన్‌రావుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తుంటే.. ఆయనకు టికెట్ రాకుండా చేయాలని రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి.. చంద్రబాబు కుమారుడు లోకేష్ ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గరికపాటిని రాజ్యసభకు ఎంపిక చేస్తే పార్టీలో, ఢిల్లీలో తన ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన భావనగా చెప్తున్నారు. గరికపాటికి చెక్ పెట్టేందుకే రాజ్యసభకు బాలకృష్ణ, మోత్కుపల్లి నర్సింహులు పేర్లు ఖరారయ్యాయని సుజనాచౌదరికి చెందిన టీవీ చానెల్లో విస్తృత ప్రచారం చేస్తుండటం విశేషం. బాలకృష్ణను తెరపైకి తెచ్చిన బాబు... మరోవైపు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ మీద పట్టు సాధించుకోవాలని భావిస్తున్న నందమూరి బాలకృష్ణను ఎలాగైనా రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం నేరుగా బాలకృష్ణకు చెప్తే అంగీకరించే అవకాశం లేనందున ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకరిని రాజ్యసభకు పంపించాలంటూ పార్టీ నేతల ద్వారా డిమాండ్ చేయిస్తున్నారు. అందులో భాగంగానే తన సన్నిహితుడి టీవీ చానల్లో బాలకృష్ణకు రాజ్యసభ సీటు ఖరారైందనే వార్తలను ప్రసారం చేయించినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజ్యసభకు పంపడం ద్వారా పార్టీలో బాలకృష్ణ జోక్యం ఉండకుండా దూరం చేయడం, ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించుకోవడం వరకు పరిమితం చేయొచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. అసంతృప్తి గళమిప్పిన మోత్కుపల్లి రాజ్యసభ టికెట్ విషయంలో చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ రాకపోవటంతో తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం అసంతృప్తి గళం విప్పారు. గరికపాటి మోహనరావుకు టిక్కెట్టు దాదాపు ఖరారైందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు బిల్యానాయక్‌తో పాటు పలువురు నేతలతో హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహించి సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత మోత్కుపల్లి తరఫున ఆ నాయకులు చంద్రబాబును కలిశారు. నల్గొండ జిల్లా నేతలు చాలా మంది వెళ్లినా ఉమా మాధవరెడ్డి, వేనేపల్లి చందర్రావు మాత్రం రాలేదు. రేసులో చాలా మందే.. సీమాంధ్ర ప్రాంతం నుంచి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ (బాబ్జీ), నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి బోండా ఉమామహేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతామాల క్ష్మి టీడీపీ నుంచి రాజ్యసభకు టికెట్ కోసం పోటీపడుతున్నారు. పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు కూడా రాజ్యసభ టికెట్‌ను ఆశిస్తున్నారు. గతంలో ఎంపీగా పనిచేసి మరోసారి సీటు ఆశిస్తున్న పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహనరావు జాతీయ పార్టీల నేతలతో పాటు పార్టీకి రాజగురువుగా ఉన్న ఒక పత్రికాధిపతి ద్వారా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో కరీంనగర్ జిల్లాకు రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి పదవులేవీ ఇవ్వలేదని, ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు అవకాశం కల్పించాలని ఆ జిల్లా పార్టీ నాయకురాలు గండ్ర నళిని ఇటీవలే చంద్రబాబును కలసి వివరించారు. అలాగే విశాఖపట్నం మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి కోసం మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య, మాజీ ఎంపీ కిమిడి కళావెంకట్రావు ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు కావలి ప్రతిభాభారతి, జె.ఆర్.పుష్పరాజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.షరీఫ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీద రవిచంద్రయాదవ్, పంచుమర్తి అనూరాధ, ఎం.అరవిందకుమార్‌గౌడ్ పేర్లను చంద్రబాబు పరిశీలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
సారు...బిజీ!
సీమాంధ్రలో కాంగ్రెస్ పక్షాన గెలవలేమని గ్రహించి మరో గత్యంతరం లేక ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ ఒకరు టీడీపీలో చేరాలని భావించారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ వస్తానంటే వద్దంటానా అంటూ టీడీపీ నాయకత్వం నుంచి వెంటనే గ్రీన్‌సిగ్నల్ లభించింది. రాష్ట్రాన్ని విభజించండి కానీ సమన్యాయం చేయాలంటూ ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సదరు ఎంపీ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఇక సమయం చూసుకుని టీడీపీలో చేరడమొక్కటే మిగిలింది. కానీ కొద్ది రోజుల కిందట నుంచి పరిస్థితి తారుమారైందట. ఎంపీ గారి సీటుపై చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన అధికార పార్టీ మంత్రిగారి పుత్రరత్నం కన్నేశారు. టికెటిస్తే జిల్లాలో మొత్తం ఎన్నికల ఖర్చే కాకుండా ఓ పది కోట్లు పార్టీకి చందాగా ఇస్తానని కూడా ఆయన హామీనిచ్చారట. లాభసాటి బేరం రావడంతో సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీని పార్టీలో చేర్చుకునే విషయాన్ని బాబుగారు పక్కనపెట్టారట. గతంలో ఎప్పుడు ఫోన్ చేసినా... చెప్పండి రావుగారు అని ఎంతో పాతమిత్రుడిలా అప్యాయంగా పలకరించే చంద్రబాబు ఇప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తటం లేదట. ఎంపీ గారి నుంచి ఫోన్ అని చెప్పగానే.. సార్ బిజీగా ఉన్నారని చెప్పండి అని వ్యక్తిగత సిబ్బందికి ఆదేశాలు వెళుతున్నాయట! అటుఇటుగా మొత్తమ్మీద విషయం తెలుసుకున్న ఎంపీగారు తనను టీడీపీ అధినేత వద్దకు తీసుకెళ్లడంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన జిల్లా నేతలకు ఫోన్లు చేసి చెడామడా తిట్టేస్తున్నారట. ఆ ఎంపీగారి తిట్లను భరించలేక మధ్యవర్తులు సైతం ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదట. ఇదీ సంగతి!! -
ఖాళీ అవుతున్న టీడీపీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఒక్కొక్కరుగా వీడుతుం డటంతో ఖాళీ అవుతోంది. ఏళ్ల తరబడి పార్టీ పల్లకి మోసిన నేతలు గుడ్‌బై చెబుతుండటంతో పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు జోగు రామన్న, చారి.. మాజీ మంత్రి బోడ జనార్దన్.. నిర్మల్, కాగజ్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జీలు సత్యనారాయణగౌడ్, పాల్వాయి రాజ్యలక్ష్మి పార్టీని వీడారు. ఇటీవల సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు తెలుగుదేశం పార్టీకి రాంరాం చెప్పారు. తాజాగా పదేళ్లుగా మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖ న్యాయవాది, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ ప్రతాప్ గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు గోడం నగేశ్‌కు గురువారం ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఆ తర్వాత మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై, ఎంపీ రాథోడ్ రమేశ్, జిల్లా అధ్యక్షుడు గోడం నగేశ్‌లపై విమర్శలు చేశారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ముఖేశ్ కూడా అదేబాటలో పయనిస్తున్నట్లు సమాచారం. మరికొందరు కూడా రాజీనామా బాటలో ఉండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజీనామా బాటలో మరికొందరు.. తెలుగుదేశం పార్టీకి జిల్లాలో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు కొందరికే ప్రాధాన్యత ఇస్తుండటంపై నిరసన వ్యక్తమవుతోంది. ఎంపీ రాథోడ్ రమేశ్, ఎమ్మెల్యే గోడం నగేశ్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారిచ్చిన సమాచారంతోనే పార్టీ పదవులు కేటాయిస్తున్నారంటూ కేడర్ బహిరంగంగానే చర్చిస్తోంది. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుంటే... బోథ్, ఖానాపూర్‌లు మినహాయిస్తే అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ సీనియర్లు సృష్టించిన బహునాయకత్వం తలనొప్పవుతోంది. ఈ నేపథ్యంలో కొందరు నేతలకే ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబును, ఆయన కోటరీని నమ్ముకుని టీడీపీలో కొనసాగలేమంటూ ఇప్పటికే చాలా మంది పార్టీ నుంచి తప్పుకున్నారు. మరికొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఏదేమైనా జిల్లాలో టీడీపీ కోటలకు బీటలు బారుతుండగా.. నాయకులు, కార్యకర్తల ప్రతిఘటన, వలసబాట అధిష్టానాన్ని అతలాకుతలం చేస్తోంది. -
చంద్రగిరి ఇన్చార్జి ఎవరో ?
సాక్షి, తిరుపతి :సంక్రాంతి సంబరాల పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 13, 14 తేదీల్లో స్వగ్రామం నారావారిపల్లెలో బస చేసినా, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జిపై ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో తెలుగుతమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చే స్తున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లో కేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి పండుగకు చంద్రబాబు స్వగ్రామానికి వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడ ఉండడంతో సొంత నియోజకవర్గంలో నాయకత్వ లోటును భర్తీ చేస్తారని, పండుగరోజు తమకు ఉత్సాహం నింపే నిర్ణయాన్ని ప్రకటిస్తారని తమ్ముళ్లు ఆ శించారు. అలాంటిదేమీ జరగకపోగా, మంత్రి గల్లా అరుణకుమారి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరితే ఎదురయ్యే అసంతృప్తులు, అలకలను తగ్గించి సర్దుబాటు చేసే బాధ్యత చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌పై ఉంచినట్లు సమాచారం. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉన్న పలమనేరు, పీ లేరు, జీడీ నెల్లూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించడంలోనూ నిర్ణయం తీసుకోలేకపోయారు. వచ్చేవారే చూస్తారు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలోని టీ డీపీ నేతలను చంద్రబాబునాయుడు 13వ తేదీ రాత్రి పది గంటల సమయంలో ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి విషయం తెలుగుతమ్ముళ్లు లేవనెత్తగా ‘వచ్చే అతను చూసుకుం టాడు, మీరేం డబ్బులు పెట్టద్దు, వాళ్లే పెట్టుకుంటారు. అందరూ కలసికట్టుగా పనిచేయండి. నియోజకవర్గ ఇన్చార్జ్గా మంచివాళ్లనే వే స్తాను’ అంటూ చంద్రబాబు తమ్ముళ్లకు హితబోధ చేశారు. ఇన్చార్జిగా ఎవరు వస్తారనే పే రు మాత్రం బయట పెట్టలేదు. అదే సమయం లో ‘పార్టీలోకి అందరూ వస్తారు. వచ్చేవారిని కాదనకండి, పార్టీలో నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నించేవారిని ఆపే ప్రయత్నం చేయండి’ అంటూ తమ్ముళ్లకు సూచిం చినట్లు సమాచారం. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నగరి శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు, చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారుడు నారా గిరీష్ పేర్లు వినపడుతున్నాయి. నగరిలో సమీకరణాలు మారి మాజీ మంత్రి చెంగారెడ్డి వర్గం సైకిల్ ఎక్కితే, గాలి ముద్దుకృష్ణమనాయుడు ను చంద్రగిరి నుంచి బరిలోకి దింపాలని అధినేత ఆలోచిస్తున్నట్లు చంద్రగిరి నియోజకవర్గ తమ్ముళ్లు చెబుతున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు బలమైన అభ్యర్థి అవుతారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇది కుదరకపోతే నారా కుటుంబం నుంచి నారా గిరీష్ పేరు తమ్ముళ్ల నోళ్లలో నానుతోంది. గతంలో నారా రామ్మూర్తినాయుడు ఇక్కడే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందటం, నియోజకవర్గంలో వీరి కుటుంబానికి అభిమానులు ఉండటంతో యువత కోటాలో నారా గిరీష్‌ను అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీలోని ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో గల్లా అరుణ ఆగమనం తరువాతే అధినేత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. -
అధికారంలోకి వస్తే ఉచితంగా మంచినీరు: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మంచినీటిని పూర్తి ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో బెల్ట్‌షాపుల ద్వారా మద్యం లభ్యమవుతోందని, కానీ కొన్ని చోట్ల మంచినీరు మాత్రం లభించటంలేదన్నారు. శుక్రవారమిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన డ్వాక్రా మహిళలతో చంద్రబాబు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమవతి పాల్గొన్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో లైంగిక దాడికి గురైన బాలికలకు సాయం చేసేందుకుగాను కృష్ణా జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆచంట సునీత రూ.5 వేల చొప్పున ఈ సందర్భంగా చంద్రబాబుకు అందచేశారు. -
దేశం కుతకుత!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా తెలుగుదేశం పార్టీలో పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించడంపై పరిటాల వర్గం భగ్గుమంటోంది. తమను రాజకీయంగా దెబ్బతీయడానికే పయ్యావుల కేశవ్ జేసీ బ్రదర్స్‌ను టీడీపీలోకి తెస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇస్తే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని ప్రకటించిన పరిటాల సునీత.. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. పరిటాల సునీత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ విశ్లేషకుల మెదళ్లకు పనిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. పరిటాల రవీంద్ర, పయ్యావుల కేశవ్ 1994 ఎన్నికల్లో ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పరిటాల రవీంద్ర, ఉరవకొండ నియోజకవర్గం నుంచిపయ్యావుల కేశవ్ గెలుపొంది, శాసనసభలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పరిటాల రవీంద్రకు చోటు దక్కింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో జిల్లా నుంచి గెలుపొందిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒక్క పరిటాల రవీంద్ర మాత్రమే ఎన్టీఆర్ వైపు నిలిచారు. పయ్యావుల కేశవ్ సహా తక్కిన 11 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు దన్నుగా నిలిచారు. మనస్థాపంతో ఎన్టీఆర్ మరణించిన తర్వాత పరిటాల రవీంద్ర అప్పటి సీఎం చంద్రబాబు గూటికే చేరారు. జిల్లాలో పరిటాల రవీంద్ర ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు పయ్యావుల కేశవ్‌ను చంద్రబాబు ఎగదోశారు. ఇది జిల్లా టీడీపీలో వర్గ విభేదాలకు మొగ్గతొడిగేలా చేసింది. పరిటాల రవి కన్నుమూసే వరకూ ఇరు వర్గాలు ఉప్పునిప్పులా ఉండేవి. పరిటాల రవి చనిపోయిన తర్వాత జిల్లాలో టీడీపీపై పయ్యావుల కేశవ్ ఆధిపత్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు. పయ్యావుల కేశవ్, జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాల మధ్య ఆది నుంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జేసీ దివాకర్‌రెడ్డి ఒంటరయ్యారు. ఇదే సమయంలో జేసీ బ్రదర్స్‌ను టీడీపీలోకి తేవడానికి పయ్యావుల కేశవ్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం రెండేళ్లుగా వ్యక్తమవుతోంది. మంగళవారం అది కార్యరూపం దాల్చింది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇవ్వాలని నిర్ణయించడంపై పరిటాల సునీత భగ్గుమంటున్నారు. ఇదే అంశంపై శాసనసభ లాబీల్లోనే పయ్యావుల కేశవ్‌ను ఆమె నిలదీశారు. జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి తేవడంలో తన పాత్ర ఏమీ లేదంటూ పయ్యావుల కేశవ్ ఇచ్చిన వివరణను పరిటాల సునీత కొట్టిపారేశారు. స్కూలు పిల్లాడిని అడిగినా జేసీ బ్రదర్స్‌ను పయ్యావుల కేశవ్ టీడీపీలోకి తెస్తున్నారని చెబుతున్నారని కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ఆది నుంచి తమను వ్యతిరేకిస్తోన్న పయ్యావుల కేశవ్ రాజకీయంగా తమను దెబ్బతీయడానికే టీడీపీలోకి జేసీ బ్రదర్స్‌ను తెస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది. పరిటాల రవి హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డిని నిందితునిగా చేర్చారని.. అలాంటి వ్యక్తి కుటుంబానికి టీడీపీ దన్నుగా నిలవడం ఏ మేరకు సబబు అని పరిటాల సునీత ప్రశ్నిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతలు, కార్యకర్తలను జేసీ కుటుంబం వేధిస్తూ వస్తోందని.. అలాంటి కుటుంబానికి నీడనిస్తే శ్రేణులకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా పరిటాల సునీత మాట్లాడుతూ జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇస్తే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. పరిటాల సునీత బెట్టు చేస్తోండటంతోనే జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరే ముహూర్తం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోందనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇచ్చే ముహూర్తాన్ని మంగళవారం ఖరారు చేసిన నేపథ్యంలో పరిటాల సునీత క్రియాశీలకమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై తమ అనుచరులతో జోరుగా చర్చలు సాగిస్తున్నారు. తాడిపత్రిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా చేసిన ప్రకటనకు పరిటాల సునీత కట్టుబడతారా..? మరేదైనా సంచలన నిర్ణయం ప్రకటిస్తారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. -
అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరితీయాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరి తీయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అలాంటి వారిని నలుగురిని ఉరితీస్తే అత్యాచారాలు ఆగిపోతాయన్నారు. శనివారం ఎన్టీ ఆర్ భవన్లో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్, నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గాల డ్వాక్రా మిహ ళలతో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో.. డ్వాక్రా మహిళల్ని ప్రతిరోజూ ఎన్టీఆర్ భవన్‌కు తరలించి వారితో బాబును అభినందించే కార్యక్రమం నిర్వహిస్తూ ప్రచారం చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమాలు గత రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. సోమవారం కూడా ఇలాంటి ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా, శనివారం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలోని ఓ ఆశ్రమంలో బాలికలపై కొన్ని రోజులుగా అత్యాచారం జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. నిర్భయ చట్టం సరిగా అమలు కావటం లేదన్నారు. -
రాష్ట్ర విభజనపై టీడీపీ వైఖరి ప్రకటించాలి
పర్చూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాన్ని వెల్లడించకుండా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ వెంటనే తన వైఖరి ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. సోమవారం పర్చూరు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందన్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై కేంద్రం చేస్తున్న కుట్రలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు భాగస్వాములయ్యారని ఆరోపించారు. కేవలం కేంద్రానికి గులాంగిరీ చేయలేదన్న సాకుతో రాష్ట్రాన్ని విభజించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. టీడీపీ విధానం చెప్పకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, రామోజీరావుల ఆస్తులను పరిరక్షించేందుకు కేసీఆర్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనను వైఎస్సార్ సీపీ ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకుంటుందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారని సర్వేలు సైతం చెబుతున్నాయన్నారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రలోని 175 స్థానాల్లో 150 స్థానాలు కచ్చితంగా గెలిచే శక్తి వైఎస్సార్ సీపీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతాయన్నారు. ముందుగా స్థానిక బొమ్మల సెంటర్లోని అంబేద్కర్, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి జూపూడి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మనుబోతు వెంకటరెడ్డి, దళిత నేతలు జూపూడి మార్కు, జంగా అనిల్, నలిగల కిషోర్, గేరా స్వరాజ్‌కుమార్, బండి రాంబాబు, బిళ్లా బాబురావు, రేగులగడ్డ దయారావు, విష్ణుమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు యద్దనపూడి హరిప్రసాద్, కొసనా రాంప్రసాద్, గాజుల రమేష్, తమ్మా అమ్మిరెడ్డి, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కొల్లా శ్రీహరిరావు, ఆకుల మధుబాబు, పొదిలి రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణపై బాబుకు చిత్తశుద్ధి లేదు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి లేదని, ఆయన రెండుకళ్ల సిద్ధాంతంతో మతిస్థిమితం కోల్పోయి వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. తెలంగాణపై 2008లో ఇచ్చిన లేఖను పట్టుకుని వేలాడుతున్న తెలంగాణ టీడీపీ నేతలు, ఇటీవల చంద్రబాబు, ఆ పార్టీ సీమాంధ్ర నేతల వైఖరిని ఎందుకు నిలదీయరని ఆయన ప్రశ్నించారు. బాబుకు తొత్తులుగా మారిన టీటీడీపీ నేతలు ఇకనైనా తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. బుధవారం ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్‌లోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలే గుణపాఠం చెప్తారు మొదటి నుంచి తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ తెలంగాణకు అడ్డంకి మారిన చంద్రబాబును, ఆ పార్టీ తెలంగాణ నాయకులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని రామన్న హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నేతలు పచ్చి అవకాశవాదిగా మారిన చంద్రబాబుతో తెగదెంపులు చేసుకుంటారా? లేక టీడీపీలో ఉంటూ తెలంగాణ ద్రోహులుగా మిగులుతారా తేల్చుకోవాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు తొత్తులుగా మారిన టీటీడీపీ నేతలు మొసలికన్నీరు మాని ఓట్లేసిన తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించి మానవత్వం చాటుకోవాలని సూచించారు. రెండుకళ్ల సిద్ధాంతంతో ప్రత్యేక తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా మారిన చంద్రబాబును వీడకపోతే తెలంగాణలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులకు పుట్టగతులుండవని హెచ్చరించారు. పల్లెనిద్ర పేరిట దొంగనాటకం టీడీపీకి చెందిన సీమాంధ్ర నాయకులు రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేఖ ఇస్తే.. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ మాత్రం హైదరాబాద్‌కు దూరంగా ఉండటంపై ఆంతర్యమేమిటని రామన్న ప్రశ్నించారు. పల్లెనిద్ర పేరిట దొంగనాటకం ఆడుతున్న రాథోడ్ రమేశ్ కూడా తెలంగాణ వ్యతిరేకే అని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విభజనకు వ్యతిరేకంగా రాష్ర్టపతిని కలిసిన సీమాంధ్ర నేతలకు ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ నేతల నుంచి విభజనకు అనుకూలంగా ఎందుకు లేఖ ఇప్పించలేకపోయారని అన్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు, దిగజారుడు, దివాళాకోరు రాజకీయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరనుకుంటే పొరపాటేనని, టీడీపీ నేతలకు సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్న టీటీడీపీ నేతలందరూ ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తే మంచిదని, లేదంటే తెలంగాణ ద్రోహులుగా మిగలడం ఖాయమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ కీలకపాత్ర వహిస్తుంద ని అభిప్రాయపడ్డారు. 24 జిల్లాలతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఒకే విధమైన ఉచిత విద్యను అందించడంతో పాటు విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, విద్యుత్ తదితర ప్రధాన వనరులపై దృష్టి సారిస్తామని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి, సాజిద్‌ఖాన్, బండారి సతీశ్, రౌతు మనోహర్, ఆరె రాజన్న, మేకల ఆనంద్ పాల్గొన్నారు. -
చంద్రబాబు చెప్పినట్లే విభజన
రాష్ట్రాన్ని విడదీయడానికి ఆయన చెప్పిన పద్ధతులనే కేంద్రం పాటిస్తోంది వైఎస్సార్ సీపీ నాయకుడు కొణతాల ధ్వజం అఖిలపక్షం పెట్టాలని అక్టోబర్ 7న చంద్రబాబు అడిగారు.. వీరు పెట్టారు సమన్యాయమంటూ ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చోగానే జీవోఎం ఏర్పాటు చేశారు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో టీడీపీ అధినేత మాట్లాడాకే విభజన నిర్ణయం రాష్ట్రంలోనే ఉన్న తెలంగాణకు విజయమ్మను ఎందుకు వెళ్లనీయలేదో సీఎం జవాబు చెప్పాలి వరద బాధిత రైతులకు కేంద్ర సాయం కోసం జగన్ ప్రధాని, రాష్ట్రపతిల అపాయింట్మెంట్ కోరారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పిన పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం తమ పార్టీని ఇరుకున పెట్టేందుకే అంటూ బాబు మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ‘‘బాబు మర్చిపోయారేమోగానీ, అక్టోబర్ ఏడో తేదీన ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చుంటూ స్పష్టంగా ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఆయన అఖిలపక్ష సమావేశం అన్నాకే ఈ రోజు సమావేశం పెట్టారు. సమన్యాయం చేయాలని ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చున్నాకే విభజన తరువాత ఏర్పడబోయే సమస్యల పరిష్కారం కోసం కేంద్రం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు 7వ తేదీన ఢిల్లీలో దీక్షకు కూర్చుంటే 8వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడాకే రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయింది. ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లి వచ్చాకే కేంద్ర మంత్రివర్గం రాష్ట్రవిభజన నిర్ణయానికి ఆమోదం తెలిపింది’’ అని కొణతాల వివరించారు. శుక్ర వారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు ఢిల్లీ దీక్ష తరువాత ఆ పార్టీ నేతలే తమ అధినేత దీక్ష విజయవంతమైందని ప్రకటించుకుంటూ.. ఆ దీక్షకు కేంద్రం తలవంచే విభజన సమస్యలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం వేశారని చెప్పుకున్నారని గుర్తు చేశారు. జులై 30న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తెలంగాణ అనుకూల ప్రకటన తీసుకున్న తరువాత కూడా చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆ నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. కొత్త రాజధాని నిర్మానానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని కూడా డిమాండ్ చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పటికీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. చంద్రబాబు పైకి మాట్లాడేది ఒక రకంగా ఉంటుందని, చేసేది మరో రకంగా ఉంటుందని కొణతాల తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరి సహకారంతోనే విభజన ప్రక్రియ వేగంగా జరుగుతుండడం దురదృష్టకరంగా అభివర్ణించారు. విజయమ్మ యాత్రను అడ్డుకుంది ప్రజలు కాదు, పోలీసులే.. గతంలో వరంగల్ జిల్లా ఓదార్పుయాత్రకు బయలుదేరిన జగన్మోహన్రెడ్డిని అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు కూడా తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్లనీయకుండా చేయడం ద్వారా అప్పటి ఘటనను పునరావృత్తం చేసిందని కొణతాల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయమ్మ పర్యటనను అడ్డుకున్నది ప్రజలు కాదని, పోలీసులేనని గుర్తు చేశారు. వరద వల్ల న ష్టపోయిన రైతుల పరామర్శకు వెళ్లిన విజయమ్మను ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆదరించారని, దీంతో జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను, పోలీసులను అడ్డంపెట్టుకొని ఆమెను నల్లగొండ జిల్లా ప్రజల దగ్గరకు వెళ్లకుండా చేశారన్నారు. విజయమ్మ వెంట ఉన్న పార్టీ నేతలందరినీ భయభ్రాంతులకు గురిచేశారన్నారు. తాను గట్టి సమైక్యవాదినని చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే పోలీసుయంత్రాంగం ఈ సరికే రాష్ట్ర విభజన జరిగిపోయిందన్న రీతిలో వ్యవహరించడం.. ఆయన మంత్రివర్గంలో పనిచేసే మంత్రులే రెచ్చగొట్టడం వంటి ఘటనలు బాధాకరమన్నారు. ఇదే సమయంలో అదే ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన చేస్తుంటే ఎలాంటి ఆటంకాలూ లేకుండా పూర్తి వెసులుబాటు కల్పించారని అన్నారు. వైఎస్సార్ సీపీ అంటే ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు.. విజయమ్మను ప్రజల వద్దకు వెళ్లనీయకుండా చేయడాన్ని బట్టే.. ప్రభుత్వ పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతలా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చని కొణతాల అన్నారు. రాష్ట్రంలోనే ఉన్న ఒక ప్రాంతానికి విజయమ్మను ఎందుకు వెళ్లనీయలేదో స్పష్టంగా జవాబు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతున్న సమయంలోనే ఇలాంటి ఘటనలు శోచనీయమని.. ఈ రకంగా ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సినముఖ్యమంత్రి వేరొక పార్టీ గౌరవాధ్యక్షురాలికి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. విభజన ప్రక్రియకు ముందే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో తిరగడానికి వీలులేదన్నట్టు నిర్ణయాలు తీసుకునే వ్యక్తికి.. ఈ సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొ నసాగే హక్కులేదని ధ్వజమెత్తారు. రక్షణ కల్పించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన మంత్రివర్గంలోని మంత్రులను నియంత్రించుకోలేరు.. తన చేతిలో ఉన్న విభజన ప్రక్రియను ఆపడం ఆయనకు చేతకాదని సీఎంపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రధాని, రాష్ట్రపతిల అపాయింట్మెంట్ కోరారు.. వరదలలో నష్టపోయిన రైతులకు కేంద్ర సాయం కోరేందుకు తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల అపాయింట్మెంట్ కోరారని కొణతాల చెప్పారు. రాష్ట్రపతి నుంచి వచ్చే అపాయింట్మెంట్ను బట్టి ఆయనను వీలుంటే హైదరాబాద్‌లో లేదంటే ఢిల్లీలో కలుస్తారన్నారు. రైతులను ఆదుకునే అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను వారి దృష్టికి తీసుకువస్తారన్నారు. విభజన ప్రక్రియకు సంబంధించి 11 అంశాలపై జీవోఏంకు సూచనలు చేయాలంటూ కేంద్రం రాసిన లేఖ శుక్రవారం పార్టీ కార్యాలయానికి అందిందని చెప్పారు. దానిపై పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ పార్టీ మొదట నుంచీ సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటుందని.. కేంద్రం జీవోఎంను ఏర్పాటు చేసినప్పడు దానిని సైమన్ కమీషన్‌తో పోల్చుతూ, బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించామని గుర్తు చేశారు. తమ పార్టీ సమైక్యవాద వైఖరికి, కేంద్రం లేఖకు పొసగదని అనిపిస్తోందన్నారు. ఏది ఏమైనా లేఖపై పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. -
టీడీపీని ఇబ్బందిపెట్టేందుకే.. : చంద్రబాబు
సాక్షి, గుంటూరు/విజయవాడ: తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేందుకే కేంద్ర హోంశాఖ బుధవారం ఓ లేఖ పంపిందని, 11 అంశాలపై సమాచారం ఇవ్వాలని కోరిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. ఆయన గురువారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, బాపట్ల నియోజకవర్గాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగాను, అంతకుముందు విజయవాడలో విలేకరులతోను ఆయన మాట్లాడారు. అఖిలపక్ష పార్టీల నుంచి విభజనపై సమాచారం తెలుసుకునేందుకే కేంద్రప్రభుత్వం డ్రామాలాడుతోందని విమర్శించారు. గతంలో వేసిన ప్రణబ్, రోశయ్య, శ్రీకృష్ణ, ఆంటోనీ కమిటీలు ఏం తేల్చాయో ముందు తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. 2008లో తానిచ్చిన లేఖైపై రాద్దాంతం చేస్తున్నారని, తెలుగువారికి సమన్యాయం చేయాలని, రెండుప్రాంతాలవారిని కూర్చోబెట్టి విభజించాలని తాను లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. తాను కేంద్రానికి రాసిన వందల లెటర్లకు స్పందించలేదని, విభజనపై రాసిన లేఖకు మాత్రం నానా యాగీ చేస్తున్నారని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశానికి మీరు వెళతారా, ఎవరినైనా పంపుతారా, ఎంతమందిని పంపుతారు, ఇప్పటికీ విభజనను సమర్థిస్తారా.. అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై మీకు కూడా బాధ్యత ఉందని, మీరు అర్థం చేసుకోకపోతే ఏ ఉద్దేశంతో అగుతున్నారో సందేహించాల్సి వస్తుందంటూ ఎదురుదాడికి దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటిలేటర్లపై ఉన్నాయని, వాటిని తీసేస్తే ఫినిష్ అయిపోవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని రైతులు అత్మహత్య చేసుకోకుండా కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితమవుతుందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరదబాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము ఏపార్టీతో పొత్తు పెట్టుకునేది ఇప్పుడే చెప్పలేమన్నారు. విభజన బిల్లు అస్లెంబ్లీలో చర్చకు వస్తే సీమాంధ్ర ప్రాంతవాసిగా మీరు దేనికి మద్దతు ఇస్తారని ప్రశ్నించగా విలేకర్లపై అసహనం ప్రదర్శిస్తూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. పెదనందిపాడులో పాఠశాల విద్యార్థులు జై సమైక్యాంధ్ర అని నినదించినప్పుడు.. మీరంతా టీవీలు చూసి సమైక్యమని అరుస్తున్నారా అని ప్రశ్నించారు. -
వరద ప్రాంతాలకు టీడీపీ ఉత్తుత్తి సాయం
పార్టీ కార్యాలయం నుంచి ఆర్భాటంగా బయలుదేరిన ట్రక్కులు... తిరిగి అక్కడికే చేరుకున్న వైనం సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయం అందిస్తామంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన వాహనాలు తిరిగి అదే పార్టీ కార్యాలయానికి చేరుకోవడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. వరద బాధితులకు సహాయం అందిస్తామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన తర్వాత కొంత సామగ్రిని బాధిత ప్రాంతాలకు పంపుతున్నామంటూ సోమవారం పార్టీ నేతలు హడావుడి చేశారు. వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నామంటూ కొన్ని ట్రక్కులను ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు జెండా ఊపి ప్రారంభించారు. ఆ ట్రక్కులను ఎక్కడకు పంపుతున్నారో తెలుసుకుందామని ఒక మీడియా చానెల్ వాటిని వెంబడించగా అసలు సంగతి బయటపడింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి బయలుదేరిన ఆ ట్రక్కులు పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, బంజారాహిల్స్ రోడ్డు నెంబరు ఒకటి మీదుగా వెళ్లి, రోడ్డు నెంబరు 10, బసవతారకం కేన్సర్ ఆసుపత్రి మీదుగా తిరిగి టీడీపీ కార్యాలయానికి చేరుకున్నాయి. టీడీపీ వైఖరిని, ద్రోహాన్ని ఆ చానెల్ బట్టబయలు చేయడంతో ఆ పార్టీ నేతలకు దిమ్మదిరిగింది. వెనువెంటనే రంగంలోకి దిగిన నేతలు ఆ వాహనాలను మళ్లీ పంపించే పనిలో పడ్డారు. -
ఇది పార్టీ సభ కాదు..సమైక్య సభ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని నేతలకు వినిపించేలా, విభజనకు లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి కనువిప్పు కలిగేలా సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. ఇదొక పార్టీ సమావేశం కాదని, సమైక్యంగా ఉండాలని కోరుతూ నిర్వహించే సభ కనుక అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆమె శనివారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో పార్టీ నేతలతో కలిసి సభా ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 26వ తేదీ జరుపబోయే ఈ సభలో రాజకీయాలకు అతీతంగా సమైక్య రాష్ట్రం కోరుకునే వారందరూ పాల్గొనాలనేది పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అభిమతమని, అందువల్ల ఉద్యోగులు సహా అన్ని వర్గాలవారూ పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సభకు ఎంత మంది హాజరవుతారనేది అంచనాలు వేయడం లేదని, కానీ అనూహ్యమైన రీతిలో జన స్పందన ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాల నుంచీ కూడా సమైక్యం కోరుకునే వారు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అన్నారు. భారీగా ఏర్పాట్లు: భారీగా తరలివచ్చే వారందరికీ పార్టీ తరఫున ఏర్పాట్లు చేస్తున్నామని శోభా నాగిరెడ్డి చెప్పారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే వారు ఎక్కడికి రావాలి, వాహనాల పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి వంటి విషయాలకు సంబంధించిన సమాచారం జిల్లా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని, అక్కడ సంప్రదించాలని కోరారు. అలాగే సమావేశ స్థలికి వచ్చేటపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాగులు వంటివి తీసుకురావద్దని ఆమె సూచించారు. మొన్నటి వరకూ సుమారు 70 రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేశారని, జీతాలు రాకున్నా చిత్తశుద్ధితో వారు సమైక్యాంధ్ర కోసం పాటుపడ్డారని ఆమె అభినందిస్తూ సభ విజయవంతం కావడానికి ఎన్జీవో సోదరుల సహకారం తీసుకుంటామన్నారు. ఒక రాజకీయ పార్టీగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి జగన్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ప్రజా సంఘాలు కూడా ఈ సమావేశానికి మద్దతునివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సభ నిర్వహణపై చర్చలు.. హైదరాబాద్ నగర సంయుక్త కమిషనర్(ఎస్బీ) మల్లారెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డిలు శనివారం ఎల్బీ స్టేడియంకు చేరుకొని సభ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. అనంతరం సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రాథమికంగా స్టేడియం పరిస్థితిని వివరించారు. ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, తెల్లం బాలరాజు, విశ్వరూప్, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, ద్వారంపూడి, కొడాలి నాని, ఇతర నేతలు బి.జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, తలశిల రఘురాం, చల్లా మధుసూదన్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఆదం విజయకుమార్, అవినాష్‌గౌడ్ తదితరులు ఎల్బీ స్టేడియంను సందర్శించిన వారిలో ఉన్నారు. -
లగడపాటి దారి ఎడారేనా
= ఏకాకిగా మారుతున్న వైనం = విజయవాడలో పురందేశ్వరి చిచ్చు సాక్షి, విజయవాడ : విజయవాడ ఎంపీ రాజగోపాల్ ఏకాకిగా మారుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమనే అనిపిస్తోంది. సమైక్యవాదానికి నాయకుడిగా చెప్పుకునే రాజగోపాల్ నియోజకవర్గంలోకి వచ్చి కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విభజన జరిగితే సీమాంధ్రకు ఏం సాధించుకోవాలనే అంశంపై నగరానికి చెందిన ప్రముఖులతో సమావేశం అయినా ఎవరూ స్పందించలేదు. పురందేశ్వరి తీరుపై సమైక్యవాదులు విరుచుకుపడ్డారు. జిల్లాలో ఒకటిరెండుచోట్ల పురందేశ్వరి దిష్టిబొమ్మలు దహనం చేశారు. తెలుగుదేశం నేతలుకూడా పురందేశ్వరి విభజన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తోందని విరుచుకుపడ్డారు. అయితే ఎంపీ వర్గం నుంచి ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోలేదు. గురువారం నగరంలో చోటుచేసుకున్న పరిణామాలను ఎంపీకి వివరించేందుకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్రం, ఎంపీ వర్గంలోని మరికొందరితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. పురందేశ్వరి సమావేశం, రాజగోపాల్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన ఆరోపణలపై స్పందించి సమావేశం పెట్టాలని ఎంపీ కార్యాలయం నుంచి స్థానిక ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి. అయితే ఈ వివాదంలోకి తమను లాగవద్దంటూ వారు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. సమైక్యంధ్ర కోసం 78 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే తన ల్యాంకో సంస్థ నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం, విద్యుత్ సమ్మె రోజుల్లోనే ల్యాంకో ద్వారా వంద కోట్ల రూపాయల లాభాలు గడించినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ వర్గాలు కూడా రాజగోపాల్‌పై గుర్రుగా ఉన్నాయి. 2009లో సమైక్యవాదిగా హడావిడి చేసినా 2013కి వచ్చే సరికి రాజీనామాని ఆమోదింపజేసుకోకుండా అడుతున్న డ్రామాలతో రాజగోపాల్ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఓటర్ల దృష్టిలో కూడా పలుచనయ్యారు. ఈ నెల 21న విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి 24 కల్లా రాజీనామా ఆమోదింపజేసుకుని వచ్చి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ప్రగల్భాలు పలికిన రాజగోపాల్ నెల రోజులు దగ్గర పడుతున్నా అడ్రస్ లేరు. ఢిల్లీలో స్పీకర్ కార్యాలయం ముందు హడావిడి చేయడానికే పరిమితమయ్యారు. తన రాజీనామా ఆమోదించాలంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నారని వస్తున్న వార్తల పట్ల కూడా సమైక్యవాదులు రాజగోపాల్‌పై మండిపడుతున్నారు. విభజనకు కారకులంటూ బొత్స సత్యనారాయణ, చిరంజీవిపై పరోక్షంగా రాజగోపాల్ ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్‌లోని కాపు సామాజిక వర్గం కూడా రాజగోపాల్‌కు దూరం అయ్యింది. -
జంతర్ మంతర్ వద్ద టీడీపీ ఎంపీల ధర్నా
రాష్ట్ర విభజనపై న్యాయం చేయాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఆదివారం ఆ పార్టీ ఎంపీలు పాల్గొని నిరసన తెలిపారు. కాగా విభజనపై స్పష్టమైన వైఖరేంటో చెప్పకుండానే ఢిల్లీలో దీక్ష చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తిరిగి రానున్నారు. మధ్యాహ్నం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. అనంతరం హైదరాబాద్ బయల్దేరుతారు. -
వ్యూహాత్మక అస్త్రసన్యాసం
ప్రధానమైన అవకాశాలన్నింటినీ ఒక్కొక్కటిగా జారవిడుస్తున్న చంద్రబాబు సీడబ్ల్యూసీ నిర్ణయం సమయంలోనే వ్యతిరేకించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కానీ ఆ నిర్ణయంపై స్పందించడానికే ఇష్టపడని వైనం.. పైపెచ్చు రాజధానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలని డిమాండ్ ఇప్పుడు జీవోఎం ఏర్పాటవుతున్న సమయంలో ఢిల్లీలో దీక్ష డ్రామా సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తన ముందున్న అత్యంత ప్రధానమైన అవకాశాలన్నింటినీ ఒక్కొక్కటిగా జారవిడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ విభజన అనివార్యమన్న పరిస్థితులను సృష్టిస్తున్నప్పటికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఇరు ప్రాంతాల్లో కేవలం తన రాజకీయ భవిష్యత్తును బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన ముందున్న అస్త్రాలన్నింటినీ క్రమపద్ధతిలో వదిలేస్తున్నారు. దాంతో కాంగ్రెస్‌కు తన పని మరింత సులభమయ్యే మార్గాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగానే కల్పిస్తున్నారు. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయడానికన్నా ముందే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోబోతున్నారని చంద్రబాబుకు స్పష్టమైన సంకేతాలున్నా.. అడ్డుకునే ప్రయత్నం కాదు కదా దానిపై స్పందించడానికే ఇష్టపడలేదు. సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత అయినా.. నిర్ణయాన్ని ప్రశ్నించి అడ్డుకుంటామనిగానీ, అసెంబ్లీ సమావేశపరిస్తే ప్రభుత్వాన్ని గద్దెదించుతామనిగానీ హెచ్చరించలేదు. అప్పుడే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బాబు డిమాండ్ చేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి రాజకీయ సంక్షోభం సృష్టించాలని వివిధ రూపాల్లో వచ్చిన డిమాండ్‌ను ఆయన అవహేళన చేశారు. అలా చేయకపోగా సీమాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్లు కావాలని కోరుతూ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సమర్థించారు. ఆ రోజు సీమాంధ్రలో ఇంకా ఉద్యమం తీవ్రరూపం దాల్చలేదని, చంద్రబాబు ఏదో తొందరపాటులో అలా మాట్లాడి ఉంటారని అనుకున్నా... సీమాంధ్రలో ఉద్యమం ఎగిసిపడుతున్న తర్వాత కూడా తన ముందున్న అస్త్రాలను సంధించడానికి బాబు సిద్ధపడలేదు. కేంద్ర మంత్రిమండలి ముందుకు తెలంగాణ నోట్ రాకముందే, నోట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలపడానికి ముందే.. అసెంబ్లీలో సమైక్యం కోసం తీర్మానం చేద్దామన్న ప్రతిపాదనను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని కొందరు పార్టీ నేతలు ఆయన దృష్టికి తెచ్చినప్పుడు.. ‘నాకు వేరే వాళ్లు చెప్పేస్థాయికి వచ్చారా...’ అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. నిజానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం తరఫున ఆయనే ముందుకొచ్చి అసెంబ్లీ పెట్టండని డిమాండ్ చేసినా.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఇప్పటికే తీర్మానం చేసినా దాని ఫలితం వేరుగా ఉండేది. తీరా కేంద్ర మంత్రిమండలి నోట్‌కు ఆమోదముద్ర వేసిన తర్వాత న్యాయం కావాలంటూ ఢిల్లీకి వెళ్లి అక్కడ దీక్ష చేపట్టడంపై పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఇరు ప్రాంతాల్లో ఓట్లు, సీట్లే లక్ష్యం!: అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యంగా ఉంచాలన్న తీర్మానం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రతిపాదిస్తే, చంద్రబాబు ప్రతిష్టకుపోయి ప్రతి విమర్శలకు దిగారు. నిజానికి చంద్రబాబే స్వయంగా ముందుకొచ్చి ఆ ప్రతిపాదన తెచ్చినా ఆయనకు అడ్డుచెప్పేవారు కూడా ఎవరూ లేరు. పైగా రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు స్వాగతించేవారు. అలా చేయకుండా సీమాంధ్రకు తీవ్ర అన్యాయం చేశారని సొంత పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత నేడో రేపో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఏర్పాటు కాబోతున్న దశలో ఢిల్లీలో దీక్షకు దిగారు. పోనీ ఆయనేమైనా సమైక్యం కోసం దీక్ష చేస్తున్నారా అంటే అదీ కాదు. న్యాయం చేయమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కోరుతూ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్ర చరిత్రలో మరువలేని అన్యాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు న్యాయం జరగాలంటూ మాట్లాడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. విభజనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపి జీవోఎం ఏర్పాటవుతున్న తరుణంలో న్యాయం చేయాలంటూ ఢిల్లీలో దీక్షకు దిగడమంటే... జీవోఎం తొందరగా ఏర్పాటు చేసి సీమాంధ్రకు చేయాల్సిన న్యాయం చేసి రాష్ట్ర విభజన ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలన్న డిమాండ్, ఎత్తుగడ కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విభజన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు.. సీమాంధ్రకు న్యాయం జరగాలంటే జీవోఎం ముందు చెప్పుకోండని గత కొద్దిరోజులుగా పేర్కొంటున్నారు. దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేలా ఇప్పుడు న్యాయం చేయమంటూ దీక్షకు దిగారని, అంటే ఇదంతా ఒక పథకం ప్రకారం కాంగ్రెస్, చంద్రబాబు కలిసే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అటు తెలంగాణ ప్రాంతంలో తన కుమారుడిని పోటీ చేయించి, ఇటు సీమాంధ్ర ప్రజలకు తాను న్యాయం చేయించానని చెప్పుకుంటూ ఇరు ప్రాంతాల్లో సీట్లు, ఓట్ల లెక్కలను చంద్రబాబు పక్కాగా వేసుకున్నారని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన రోజునే అంగీకరించేది లేదని చంద్రబాబు తన నిర్ణయాన్ని చెప్పి ఉంటే తెలంగాణలో కొన్ని సీట్లు తగ్గుతాయని భయపడిన కారణంగానే నిర్ణయాన్ని సమర్థించారు. ఇప్పుడు న్యాయం పేరుతో విభజన పూర్తయిన తర్వాత సీమాంధ్రలో సీట్లపై దృష్టి పెట్టి బాబు ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అయోమయ ‘దేశం’
సాక్షి, చిత్తూరు: రాష్ర్ట విభజన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగుతమ్ముళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆయన సొంత జిల్లాలో టీడీపీ శ్రేణులు సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుకు వెళ్లలేక, అధినేత ఇచ్చిన ‘గడపగడపకు తెలుగుదేశం’ పిలుపును స్వాగతించలేక అయోమయంలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వడంతో పాటు తాజాగా రాజధాని ఏర్పాటుపై ప్రకటనలు చేస్తుంటే ప్రజల్లోకి ఎలా వెళ్లాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ అనుభవం సాక్షాత్తు పార్టీ జిల్లా నా యకులకే అంతర్గత సమావేశాల్లో ఎదురవుతోంది. దీం తో వీరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరాలకే పరిమితమవుతున్నారు. చిత్తూరులో జరుగుతున్న టీడీపీ దీక్షా శిబిరంలో మధ్యాహ్నం తరువాత ముఖ్యనాయకులు ఎవరూ కని పించడంలేదు. చిత్తూరు పట్టణంలో పార్టీ అధ్యక్షుడు జంగాలపల్లి, ఇతర నాయకులు కొద్దిసేపు కూర్చుని వెళ్లిపోతున్నారు. తిరుపతి నియోజకవర్గంలోనూ ఇదే పరి స్థితి. నియోజకవర్గ ఇన్చార్జి చదలవాడ అప్పుడప్పుడు శిబిరం వద్దకు వచ్చి ఉపన్యాసం ఇచ్చి వెళ్లడం మినహా నిర్దిష్టమైన ఆందోళన కార్యక్రమాలు ఇంతవరకు చేపట్టలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల ఉనికి సమైక్యాంధ్రలో అసలు లేదు. సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మేల్యే హేమలత కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటివరకు పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు ఇంతవరకు రిలే దీక్షలు చేపట్టిన అనవాళ్లు లేవు. నగరి టీడీపీ ఎమ్మెల్యే పత్రికల్లో రోజూ ఎవరో ఒకరిమీద విమర్శలు గుప్పిం చటం మినహా పుత్తూరు, నగరి పట్టణాల్లో ఇంతవరకు ఆయన స్వయంగా పాల్గొన్న పెద్ద సమైక్యాంధ్ర ఆందోళన కార్యక్రమం ఒక్కటీలేదు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. తెలుగు తమ్ముళ్లు సమైక్యాంధ్రపై తమ పార్టీ వాణి అనుకూలమని చెప్పలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఎవరూ రోడ్లపైకి వచ్చి సమైక్యవాదులతో కలిసి ధైర్యంగా ఉద్యమాలు చేసే పరిస్థితి కనపడటం లేదు. అన్నిచోట్ల రిలేదీక్ష పేరిట టెంట్లు వేసుకుని కాలం వెళ్లబుచ్చుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి ఇన్చార్జే లేకపోవటంతో ఇక్కడ అసలు సమైక్యాంధ్ర కోసం ఉద్యమించే టీడీపీ నాయకుడు లేడు. కార్యకర్తలు ఎవరికి వారు తమకెందుకులే అన్న ధోరణిలో ఉన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలోనూ టీడీపీ నాయకత్వ లోపం ఉండడంతో సమైక్యాంధ్ర ఉద్యమం గురించి ఇక్కడా మాట్లాడేవారు లేరు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకత్వ లోపం ఉంది. ఇక్కడ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. దీనికి తోడు కార్యకర్తలు సమైక్యాంధ్ర పేరిట జనం వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో రెండవ శ్రేణి నాయకత్వం ఉన్నా వీరు తమకెందుకులే అన్నట్లు ఉంటున్నారు. ఇంతవరకు విభజనకు వ్యతిరేకంగా పెద్దగా టీడీపీ తరఫున ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. సీఎం ప్రాతి నిథ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలోనూ టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ కూడా నియోజకవర్గం స్థాయి లో పార్టీ శ్రేణులను ఉద్యమం వైపు నడిపించే నాయకులు లేరు. సమైక్య ఉద్యమంలో ధైర్యం చేసి ముందుకెళ్తే జేఏసీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనల వద్ద టీడీపీ వైఖరి చెప్పాలని నిలదీసే పరిస్థితి ఉంది. దీంతో జేఏసీ దీక్షా శిబిరాల వైపు టీడీపీ నాయకులు అసలు తొంగిచూడడం లేదు. -
అవనిగడ్డ ఏకగ్రీవంకు తెదేపా చూపు