జిల్లాలో గ్రూ తెలుగుదేశం పార్టీపులు, ఎవరి మధ్య విభేదాలు లేవని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.
నెల్లూరు : జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపులు, ఎవరి మధ్య విభేదాలు లేవని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వీఆర్‌సీ మైదానంలో బుధవారం రాత్రి జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడారు. తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నించడం తగదన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా సీమాంధ్ర ఎదగాలంటే చంద్రబాబు సీఎం కావల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి రెండు పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ సమష్టి కృషితో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. కొత్తగా వచ్చిన నేతలతో పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. విభేదాలను పక్కనపెట్టి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సుపరిపాలన అందించగలిగే సత్తా చంద్రబాబుకే ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుందన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీలోకి వచ్చిన తాను సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్ర విభజన తనను బాధించిందని, అందుకే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరానన్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కోవూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. చంద్రబాబు ఆశీస్సులతో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీద మస్తాన్‌రావు, బల్లి దుర్గాప్రసాద్, పరసా రత్నం, కురుగొండ్ల రామకృష్ణ, పార్టీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కరణం బల రాం, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వర్ల రామయ్య, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు మాట్లాడారు.
పార్టీలో పలువురి చేరిక
చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు పలువురు టీడీపీలో చేరారు. వీరిలో మాజీ కార్పొరేటర్లు కిన్నెర ప్రసాద్, సాయిలలిత, స్వర్ణా వెంకయ్య, బీసీ నేత పద్మజయాదవ్ తదితరులు ఉన్నారు.
దామోదర జోషి కుటుంబానికి రూ.3 లక్షల సాయం
సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఎన్జీఓ నాయకుడు దామోదరజోషి కుటుంబానికి సుజనా ఫౌండేషన్ అధినేత సుజనాచౌదరి రూ.3 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును ఆయన కుటుంబసభ్యులకు అందజేసేందుకు చంద్రబాబు చేతుల మీదుగా బీద రవిచంద్రకు అందజేశారు.