అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. బహిరంగ సభల్లో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి హింసను ప్రేరేపించి అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని చెబుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద టీడీపీ గుర్తింపుని రద్దు చెయ్యాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు నవ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రమౌళి.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చంద్రమౌళి లేఖ రాశారు. ఈ లేఖలో.. గత ఏడాది డిసెంబర్‌లో నెల్లూరు జిల్లా కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోగా నలుగురు గాయపడ్డారని, ఈ ఏడాది జనవరి 2న గుంటూరులో జరిగిన సభలో మరో ముగ్గురు చనిపోయారని, ఇక ఇదే నెలలో పుంగనూరులో కార్యకర్తలను రెచ్చగొట్టి ఏకంగా పోలీసులపైనే రాళ్ళ దాడికి పాల్పడేలా చేసి చంద్రబాబు హింసకు తెరతీశారన్నారు.
ప్రజా ప్రతినిధుల చట్టం ఆర్టికల్-2 ప్రకారం ఏ రాజకీయ పార్టీ హింసాత్మక కార్యక్రమాలను రెచ్చగొట్టకూడదు. ఈ చట్టాన్ని అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించినందుకు తెలుగుదేశం పార్టీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను చంద్రమౌళి కోరారు.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలలోనూ రాజకీయాలా ?
Comments
Please login to add a commentAdd a comment