అధికారంలోకి వస్తే ఉచితంగా మంచినీరు: చంద్రబాబు | Free water scheme, If TDP will come to power, says Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే ఉచితంగా మంచినీరు: చంద్రబాబు

Published Sat, Jan 11 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

అధికారంలోకి వస్తే ఉచితంగా మంచినీరు: చంద్రబాబు

అధికారంలోకి వస్తే ఉచితంగా మంచినీరు: చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మంచినీటిని పూర్తి ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో బెల్ట్‌షాపుల ద్వారా మద్యం లభ్యమవుతోందని, కానీ కొన్ని చోట్ల మంచినీరు మాత్రం లభించటంలేదన్నారు.
 
  శుక్రవారమిక్కడ ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన డ్వాక్రా మహిళలతో చంద్రబాబు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమవతి పాల్గొన్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో లైంగిక దాడికి గురైన బాలికలకు సాయం చేసేందుకుగాను కృష్ణా జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆచంట సునీత రూ.5 వేల చొప్పున ఈ సందర్భంగా చంద్రబాబుకు అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement