Free water scheme
-
ఉచిత తాగునీటి పథకానికి తాజా మార్గదర్శకాలివే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం అమలుపై మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ తాజాగా గురువారం మరిన్ని మార్గదర్శకాలు జారీచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మురికి వాడలు, అన్ని గృహవినియోగ నల్లాలకు డిసెంబరు 2020 నుంచి డిసెంబరు 2021 వరకు నీటిబిల్లులు మాఫీ చేయనున్నారు. ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు, రెండో నల్లా కనెక్షన్ కలిగిన వినియోగదారులకు కూడా మాఫీ వర్తించనుంది. జనవరి 2022 నుంచి మురికి వాడలు మినహా ఇతర ప్రాంతాల వినియోగదారులకు నీటివినియోగం ఆధారంగా నీటిమీటరు రీడింగ్‌తో బిల్లులు జారీ చేయనున్నారు. ఇప్పటికే వాటర్సెస్ చెల్లించిన వినియోగదారులకు భవిష్యత్‌లో వారి కనెక్షన్‌కు జారీచేసే బిల్లులో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. ఆధార్ అనుసంధానం చేసుకోని వినియోగదారులకు 13 నెలల నీటిబిల్లు జారీ చేయనున్నారు. దీనిపై ఎలాంటి వడ్డీ, అపరాధ రుసుం ఉండదు. (చదవండి: ప్లాట్.. పాస్‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు) -
Hyderabad: ఉచిత నీటి పథకానికి సమీపిస్తున్న గడువు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని పొందేందుకు వినియోగదారులు తమ కనెక్షన్ నంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు జలమండలి ఈ నెల 31 చివరి గడువు విధించిన విషయం విదితమే. మహానగరంలో మొత్తం 9.84 లక్షల నల్లాలు ఉండగా ఈ నెల 17 వరకు సుమారు 50 శాతం మంది మా త్రమే నమోదు ప్రక్రి యను పూర్తిచేసుకున్నారు. వారం రోజులుగా అన్ని డివిజన్లలో కలిపి సుమారు 20 వేల మంది అనుసంధానం పూర్తి చేసుకున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ నెల 31తో గడువు తీరనుండడంతో ఎంత మంది ముందుకొస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉచితానికీ బద్ధకమేనా.. ► నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి జలమండలి 13 నెలల సమయమిచ్చినా సిటీజన్లు ముందుకు రాకపోవడం గమనార్హం. నగరంలో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లున్న పలువురు వినియోగదారులు వాటిని అద్దెకిచ్చి ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివాసం ఉంటున్నారు. వీరికి అనుసంధానం చేసుకునే విషయంలో పలు ఇబ్బందులున్నాయి. ► వాణిజ్య నల్లాలు మినహా సుమారు 4.10 లక్షల మంది వినియోగదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 31తో గడువు ముగియనుండడంతో అర్హత కలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవాలని జలమండలి సూచించింది. లేని పక్షంలో ఈ 13 నెలల నీటి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ► ఈ బిల్లుపై పెనాల్టీ, వడ్డీ మాత్రం విధించబోమని బోర్డు స్పష్టం చేసింది. ఒకేసారి వేలల్లో నీటి బిల్లు చూసి వినియోగదారులు బెంబేలెత్తకుండా నాలుగు వాయిదాల్లో 13 నెలల బిల్లును చెల్లించే వెసులుబాటు ను కల్పించనున్నట్లు తెలిపింది. ► ఉచిత నీటిపథకానికి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచే సదరు వినియోగదారులు నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల నీటిని పొందుతారు. అప్పటివరకు నీటి బిల్లు చెల్లించాల్సిందే. (చదవండి: జీహెచ్ఎంసీ పరిధిలో ఇది అతి పెద్ద ఫ్లైఓవర్..) మీటర్లు తప్పనిసరి... ప్రతి గృహవినియోగ నల్లాకూ నీటి మీటరును సైతం వినియోగదారులు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే మీటర్లు ఉంటే అవి పని చేసే స్థితిలో ఉండాల్సిందే. ఈ మీటరు రీడింగ్ ఆధారంగా నెలకు 20 వేల లీటర్ల కంటే అధిక వినియోగం ఉన్న వినియోగదారుల నుంచి నీటిబిల్లు విధిగా వసూలు చేయనున్నారు. అపార్ట్మెంట్లలో ఉన్న అన్ని ఫ్లాట్ల యజమానులు అనుసంధానాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయా ఫ్లాట్ల వినియోగదారులకు నీటి బిల్లులు తథ్యం. (చదవండి: ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్) -
నల్లా-ఆధార్ లింక్ చేశారా? లేదంటే.. ఏకంగా 9 నెలల బిల్లు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా పథకానికి ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకునే గడువు ఈ నెల 15తో ముగియనుంది. కానీ మహానగరం పరిధిలో ఇంకా 4.19 లక్షలమంది గృహ వినియోగదారులు తమ ఆధార్ నెంబరును నల్లా కనెక్షన్ నెంబరుతో అనుసంధానం చేసుకోకపోవడం గమనార్హం. వీరిలో అత్యధికంగా అపార్ట్మెంట్ వాసులే ఉన్నారు. మొత్తంగా జలమండలి పరిధిలో 9.77 లక్షల మేర గృహవినియోగ నల్లాలుండగా..ఇందులో ఇప్పటివరకు 5.58 లక్షల మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పొందేందుకు ఆధార్ అనుసంధానంతోపాటు ప్రతీ నల్లాకు నీటి మీటరును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు సుమారు 5.70 లక్షలమంది నీటిమీటర్లను ఏర్పాటుచేసుకున్నారు. మరో 4.07 లక్షల నల్లాలకు నీటిమీటర్లు లేవని వాటర్‌బోర్డు పరిశీలనలో తేలింది. ఈ వారంలోగా ఆధార్ అనుసంధానం చేసుకోవడంతోపాటు నల్లాకు నీటిమీటరును ఏర్పాటుచేసుకోని పక్షంలో సదరు వినియోగదారులు ఏకంగా 9 నెలల నీటిబిల్లు చెల్లించాల్సి ఉంటుందని వాటర్‌బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం నీటిమీటర్లున్న వారు సైతం తమ నీటి మీటరు పనిచేస్తుందో లేదో తనిఖీచేసుకోవాలని సూచించింది. కాగా నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న ప్రతీ ఫ్లాట్ వినియోగదారులు తమ ఆధార్‌ను నల్లా కనెక్షన్ నెంబరుకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోని వారికి నీటిబిల్లును జారీచేస్తామని జలమండలి ప్రకటించింది. కాగానగరంలో అపార్ట్మెంట్ల వాసులు కోవిడ్,లాక్డౌన్, వర్క్‌ఫ్రం హోం కారణంగా స్వస్థలాలకు తరలి వెళ్లడం, ఇతర దేశాల్లో నివసించడం వెరసి ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. అనుసంధానం ఇలా చేసుకోండి.. నల్లాకనెక్షన్ నెంబర్‌కు ఆధార్ అనుసంధానాన్ని డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.హైదరాబాద్‌వాటర్.జిఓవి.ఐఎన్ వెబ్సైట్లో లాగిన్ అయి పూర్తి చేసుకోవడం లేదా సమీప మీ సేవా కేంద్రాలను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జలమండలి సూచించింది. ఇతర వివరాలకు 155313 జలమండలి కాల్‌సెంటర్‌ను సంప్రదించాలని కోరింది. -
ఉచిత నీటి పథకానికి గడువు పెంపు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం పొందేందుకు గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ జలమండలి నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశంతో ఈ వెసులుబాటు కల్పించింది. వినియోగదారులు తమ నల్లాలకు నూతన మీటర్‌ను ఏర్పాటు చేసుకోవడం, కనెక్షన్ నంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 వరకు నీటిబిల్లుల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక అపార్ట్మెంట్లలోనూ ప్రతి ఫ్లాట్ వినియోగదారుడూ నల్లా క్యాన్ నంబరుకు ఆధార్ నంబరును జత చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అనుసంధానం పూర్తయిన వారికే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేసుకోని పక్షంలో సదరు వినియోగదారులకు డిసెంబరు-2020 నుంచి ఆగస్టు-2021 మధ్యకాలానికి నీటిబిల్లు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఆధార్ అనుసంధానానికి సమీప మీ సేవ కేంద్రాల్లో, లేదా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.హైదరాబాద్ వాటర్‌జీఓవీ.ఐఎన్ సైట్‌ను, ఇతర వివరాలకు కస్టమర్ కేర్ నంబరు 155313ని సంప్రదించాలని సూచించింది. -
ఉచిత నీటికి ‘ఆక్యుపెన్సీ’ గండం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకానికి ఆక్యుపెన్సీ ధ్రువీకరణ గండంలా పరిణమింంది. మహానగర శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో వేలాది నివాసాలు 200 చదరపు అడుగుల్లోపే ఉన్నాయి. వీటిలో చాలా భవనాలు 2012 ఏప్రిల్ 7 తర్వాత నిర్మింనవే. కానీ ఈ భవనాలకు విధిగా జీహెచ్ఎంసీ నుంచి జారీచేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ సమర్పిస్తేనే నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం వర్తిస్తుందని మున్సిపల్ పరిపాలన శాఖ తాజాగా వర్గదర్శకాలు జారీచేసింది. కానీ ఆక్యుపెన్సీ జారీచేసే విషయంలో బల్దియా చుక్కలు చూపుతోంది. చాలా మంది వినిÄñæగదారులు ఆక్యుపెన్సీ ధ్రువీకరణ కోసం బల్దియా క్షేత్రస్థాయి కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు ధ్రువీకరణ జారీకి ససేమిరా అంటుండడం గమనార్హం. ఇదే సమయమయంలో వినియోగదారులకు డిసెంబరు–2020 నుంచి జూన్–2021 మధ్యకాలానికి జలమండలి నీటి బిల్లులు జారీచేసింది. ఈ బిల్లులు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సుమారు ర.5వేల నుంచి ర.10 వేల మధ్యన ఉన్నాయి. దీంతో వినియోగదారుల గుండె గుభిల్లుమంటోంది. నిబంధనలు సడలించాల్సిందే.. గ్రేటర్ పరిధిలో సుమారు 10.80 లక్షల నల్లాలున్నాయి. వీటిలో సుమారు 8 లక్షల వరకు గృహ వినియోగ నల్లాలు (డొమెస్టిక్) ఉన్నా యి. మరో రెండు లక్షల వరకు మురికివాడల (స్లమ్స్)కు సంబంధించిన నల్లాలున్నాయి. ఇప్పటికే స్లమ్స్ వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం అమలవుతోంది. ఇదే తరహాలో డొమెస్టిక్ నల్లాలకు సైతం ఆక్యుపెన్సీ ధ్రువీకరణతో సంబంధం లేకుండా కేవలం నల్లా కనెక్షన్ నెంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకోవడం, నల్లాకు నీటిమీటరును ఏర్పాటు చేసుకున్న వెంటనే ఉచిత నీటి పథకానికి అర్హులను చేయాలని వేలాదిమంది శివారు వాసులు డిమాండ్ చేస్తున్నారు. మార్గదర్శకాలు అమలు చేస్తున్నాం.. ఉచిత తాగునీటి పథకం అమలుకు మున్సిపల్ పరిపాలన శాఖ జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నాం. 2012 ఏప్రిల్‌కు ముందు నిర్మింన భవనాలకు సంబంధిత మున్సిపాలిటీ జారీ చేసిన ఇంటి నిర్మాణ అనుమతులు, నిర్మాణ ప్లాన్‌ను జలమండలికి సమర్పించాల్సి ఉంటుంది. 2012 ఏప్రిల్ 7 తర్వాత నిర్మింన భవనాలకు ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తప్పనిసరి అని మున్సిపల్ పరిపాలనశాఖ స్పష్టంచేసింది. ప్రతి నల్లాకూ నీటి మీటరును ఏర్పాటు చేసుకోవడం, నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్ నంబరును అనుసంధానం చేసుకున్న అనంతరమే ఈ పథకానికి అర్హత పొందుతారు. – ప్రవీణ్‌కుమార్, జలమండలి రెవెన్యూ విభాగం డైరెక్టర్ -
ఉచిత నీటి పథకానికి తప్పని తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: ఉచిత నీటి సరఫరా పథకం కింద లబ్ధి పొందేందుకు అవసరమైన ‘నల్లా కనెక్షన్–ఆధార్’ అనుసంధానం నగరంలో ప్రహసనంగా మారింది. ముఖ్యంగా 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకాన్ని పొందేందుకు అపార్ట్మెంట్లలో ప్రతీ ఫ్లాట్ యజమాని విధిగా నల్లా కనెక్షన్‌కు ఆధార్ నెంబరు అనుసంధానం చేసుకోవాలన్న నిబంధన కష్టతరంగా మారింది. గ్రేటర్ పరిధిలో సుమారు లక్ష వరకు ఫ్లాట్స్ యజమానులున్నారు. వీరంతా తమ ఆధార్ నెంబరును అనుసంధానం చేసుకునే క్రమంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబరును ప్రస్తుతం చాలా మంది వినియోగించని కారణంగా ఓటీపీ పాత నెంబరుకు వెళ్లడం.. పలు అపార్ట్మెంట్లలో ప్రస్తుతం ఉన్న బల్క్ నల్లా కనెక్షన్ బిల్డర్ పేరిట ఉండడం..కొన్ని చోట్ల అపార్ట్మెంట్లో అప్పటికే నల్లా కనెక్షన్ నెంబరుకు అనుసంధానమైన ఒక ఫ్లాట్ యజమానికి ఓటీపీ వెళుతోంది. సదరు వ్యక్తి అందుబాటులో లేని పక్షంలో సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు వెబ్సైట్లో తరచూ తలెత్తుతోన్న సాంకేతిక సమస్యలు వినియోగదారులకు చుక్కలు చూపుతుండడం గమనార్హం. వినియోగదారుల సౌకర్యార్థం ఈ ప్రక్రియను జలమండలి క్షేత్రస్థాయి సిబ్బంది ఆధ్వర్యంలో లేదా మీ సేవా కేంద్రాల్లో పూర్తిచేసుకునే అవకాశం కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఆధార్ అనుసంధానం తప్పనిసరి.. జలమండలి పరిధిలో మొత్తంగా 9.80 లక్షల నల్లాలున్నాయి. వీటిలో ఇప్పటివరకు సుమారు 2 లక్షల మంది మాత్రమే తమ ఆధార్ నెంబరును నల్లా కనెక్షన్ నెంబరు(క్యాన్)కు అనుసంధానం చేసుకోవడం గమనార్హం. మెజార్టీ వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తిచేసుకోకపోవడంతో మున్సిపల్ పరిపాలన శాఖ అనుమతితో జలమండలి ఏప్రిల్ 30 వరకు గడువును పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల ఉచిత పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరన్న నిబంధన విధించడంతో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఫ్లాట్స్ వినియోగదారుల ఆధార్ అనుసంధానం ఇలా.. ► అపార్ట్మెంట్ వాసులు ముందుగా జలమండలి వెబ్సైట్..https://bms.hyderabadwater.gov.in/20kl/ను సంప్రదించాలి. ఇందులో ఉచిత నీళ్ల పథకం..ఆధార్ అనుసంధానం అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ► ముందుగా తమ అపార్ట్మెంట్కున్న నల్లా కనెక్షన్ (క్యాన్)కు అనుసంధానమైన మొబైల్ నెంబరుకు ఓటీపీ వెళ్తుంది. ► ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఎక్స్ఎల్ షీట్ ఓపెన్ అవుతుంది. ► ఇందులో ఫ్లాట్ యజమాని పేరు, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ (పీటీఐఎన్) నెంబరు, ఆధార్ నెంబరును నమోదు చేయాలి. ► ఆధార్ నెంబరుకు లింక్‌చేసిన మొబైల్ నెంబరుకు మరో ఓటీపీ మెసేజ్ వెళుతుంది. దీన్ని ఎంటర్‌చేస్తేనే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. ► ప్రతీ ఫ్లాట్ వినియోగదారుడూ విధిగా ఈ ప్రక్రియను వేర్వేరుగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ► సుమారు 50 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ వాసులు అందరూ ఒకేసారి కాకుండా రోజుకు పది మంది చొప్పున ఈప్రక్రియను చేపడితేనే అనుసంధానం సులువు అవుతుంది. ► ఈ సమస్యలో ఇబ్బందులుంటే జలమండలి క్షేత్రస్థాయి కార్యాలయాలు లేదా 155313 కాల్‌సెంటర్ నెంబరును సంప్రదించాలని జలమండలి సూచించింది. -
అపార్ట్మెంట్ వాసులూ.. మేల్కోండి!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ప్రకటించిన నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని పొందాలనుకునే అపార్ట్మెంట్లలోని ప్రతి ఫ్లాట్ వినియోగదారుడూ విధిగా నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను జలమండలి వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హైదరాబాద్ వాటర్.జీఓవీ.ఐఎన్’ను సంప్రదించి పూర్తిచేసుకోవాలి. సాధారణంగా ప్రతి అపార్ట్‌మెంట్‌కూ ఒకే నల్లా కనెక్షన్ (బల్క్) ఉంటుంది. కానీ ఫ్లాట్స్ మాత్రం 10 నుంచి 100 వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఫ్లాట్ వినియోగదారుని ఆధార్‌ను కూడా నల్లా కనెక్షన్ నంబరుకు అనుసంధానించాల్సి ఉంటుందని జలమండలి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అట్లయితే అనర్హులే.. నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా పొందాలనుకున్న ప్రతీ వినియోగదారుడు ఈ నెల 31లోగా తమ నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిన విషయం విదితమే. మురికివాడలు మినహా ఇతర గృహ వినియోగదారులు సైతం నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్‌ను మీ సేవ కేంద్రాల్లో అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ప్రతి గృహ వినియోగదారుడూ తమ నల్లాకున్న మీటర్ పని చేస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి. లేని పక్షంలో కొత్త మీటరును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటరు పని చేయని పక్షంలో ఉచిత నీటి పథకానికి అనర్హులని జలమండలి ప్రకటించింది. ఆధార్ అనుసంధానం ఇలా.. అపార్ట్మెంట్ వాసులు ముందుగా జలమండలి వెబ్సైట్.. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హైదరాబాద్ వాటర్.జీఓవీ.ఐఎన్’ను సంప్రదించాలి. ఇందులో ఆధార్ అనుసంధానం అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ముందుగా తమ అపార్ట్మెంట్కున్న నల్లా కనెక్షన్ (క్యాన్)కు అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ వెళుతుంది.ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఎక్స్ఎల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫ్లాట్ యజమాని పేరు, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటికేషన్ (పీటీఐఎన్)నంబరు, ఆధార్‌ను నమోదు చేయాలి.ఆధార్ నంబరుకు లింక్ చేసిన మొబైల్ నంబరుకు మరో ఓటీపీ మెసేజ్వెళుతుంది. దీన్ని ఎంటర్ చేస్తేనే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతి ఫ్లాట్ వినియోగదారుడూ విధిగా ఈ ప్రక్రియను వేర్వేరుగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సుమారు 50 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ వాసులు అందరూ ఒకేసారి కాకుండా రోజుకు పది మంది చొప్పున ఈ ప్రక్రియను చేపడితేనే అనుసంధానం సులువవుతుంది. ఈ సమస్యలో ఇబ్బందులుంటే జలమండలి క్షేత్రస్థాయి కార్యాలయాలు లేదా 155313 కాల్‌సెంటర్ నంబరులో సంప్రదించాలని జలమండలి అధికారులు సూచించారు. -
9 లక్షల కుటుంబాలకు ఉచిత తాగునీరు
రహమత్‌నగర్ (హైదరాబాద్): గ్రేటర్ పరిధిలో 9 లక్షల కుటుంబాలకు నెలకు 20 వేల లీటర్ల మేర స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉచిత సరఫరా ద్వారా ఏటా రూ.500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా.. పథకాన్ని అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ రహమత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్లో ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్ధానిక లబ్ధిదారులకు జీరో బిల్లులు అందించారు. అనంతరం సమా వేశంలో మాట్లాడుతూ.. రాజధానికి దాదాపు 200 కి.మీ. దూరం నుంచి కృష్ణా, గోదావరి జలాలను తరలించి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు శుద్ధిచేసి నగర ప్రజల తాగునీటి అవసరాలను ప్రభుత్వం తీరుస్తోందన్నారు. రాబో యే తరాలకు మంచినీటి సమస్య లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధంచేశారని తెలిపారు. ఎస్పీఆర్హిల్స్ రిజర్వాయర్‌కు రూ.8కోట్లు మంజూరు చేసి అద నపు నీటి నిల్వ సామర్థ్యం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్లో ఖాళీ స్థలంలో రజకులు, నాయీ బ్రాహ్మణులకు కేటాయించి నివాసాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు జలమండలి రూపొందించిన బ్రోచర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనా«థ్, నాగేందర్, వివేక్, ముఠాగోపాల్, మున్సిపల్ పరిపాలన ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, ఎమ్మెల్సీ మల్లేశ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిలు పాల్గొన్నారు. -
కుళాయి.. లేదోయి..!
భీమవరం టౌన్: అమృత్ పథకం అమలులో ఉన్న పురపాలక సంఘాల్లో పేదరికానికి దిగువన ఉన్న వారికి ఉచితంగా కుళాయి కనెక్షన్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మధ్య తరగతి వర్గాలు కుళాయి కనెక్షన్‌కు ఒకేసారి సొమ్ము చెల్లించలేని పక్షంలో 8 వాయిదాలుగా చెల్లించవచ్చని కూడా ప్రకటించింది. గతంలో దివంగతనేత వైఎస్ హయాంలో ప్రకటించిన పేదలకు రూ.200కు కుళాయి కనెక్షన్ పథకం అమలులో ఉంది. ప్రస్తుత ప్రభుత్వం పేదలకు కుళాయి కనెక్షన్ ఉచితమని అందుకు అవసరమైన రోడ్డు కటింగ్, పైప్‌లైన్ అన్ని ఖర్చులను పురపాలక సంఘాలు భరిస్తాయని ప్రకటించింది. రూ.200 కూడా చెల్లించనవసరం లేకుండా, అన్ని ఖర్చులతో కలిపి ఉచితంగా కుళాయి కనెక్షన్ అందిస్తున్నామని అధికారపక్ష నాయకులు గొప్పగానే చెప్పుకున్నారు. దిమ్మతిరుగుతున్న షరతులు ఉచిత కుళాయి కనెక్షన్ అంటూనే కొన్ని నియమనిబంధనలు కూడా ప్రభుత్వం విధించింది. జీఓ ఎంఎస్ నం.159 ది.17–05–2018 తేదీ మున్సి పల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు పరిశీలిస్తే ఇంటి పన్ను ఏడాదికి రూ.500 తక్కువ ఉన్న పేదలకు మాత్రమే ఉచిత కుళాయి కనెక్షన్ లభిస్తుంది. దీంతో నిరుపేదలకు ఉచితంగా కుళాయి దక్కుతుందో లేదో అర్థంకాని పరిస్థితి. పట్టణాల్లో గతంలోనే ఇంటి పన్నులు భారీగా పెంచారు. రూ.500లోపు అర్థసంవత్సరానికే అధిక శాతం మందికి పన్ను వస్తుంది. ఇక ఏడాదికి రూ.500 అంటే ఉచిత కుళాయి గగనంగానే కనిపిస్తోంది. ప్రభుత్వం దృష్టికి.. భీమవరం మున్సిపల్ కౌన్సిలర్లు ఉచిత కుళాయి కనెక్షన్లో ఉన్న నిబంధనలు పేదలకు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు కౌన్సిల్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. పట్టణాల్లో ఇంటి పన్ను అధికంగానే ఉందని అలాంటి సమయంలో పేదలు ఉచిత కుళాయి పొందాలంటే ఏడాదికి రూ.500లోపే ఇంటి పన్ను కలిగి ఉండాలన్న నిబంధన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం ఇంటి పన్ను ఏడాదికి రూ.1,000 చెల్లించాలన్న నిబంధన ఉంటే పేదలకు న్యాయం జరుగుతుందని కోరారు. దీనిపై గత రెండు సమావేశాలుగా పురపాలక అధ్యక్షుడు కె.గోవిందరావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు, ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని ప్రకటించారు. ప్రభుత్వ స్పందన కరువు ఇప్పటివరకూ ఈ జీఓలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఆరు నెలలకే రూ.500 ఇంటి పన్ను చెల్లించే పేదలకు గతంలో రూ.200కే కుళాయి కనెక్షన్ దక్కేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా కనుమరుగయ్యేలా కనిపిస్తోంది. ఏడాదికి రూ.500 ఇంటి పన్ను నిబంధన తొలగించి ఇప్పుడు అమలు జరుగుతున్న విధంగానే రూ.200కే కుళాయి కనెక్షన్ ఇచ్చి రోడ్డు కటింగ్ చార్జీలను కూడా పురపాలక సంఘాలే ఉచితంగా భరిస్తే బాగుంటుందని కౌన్సిలర్లు సూచిస్తున్నారు. వైఎస్ హయాం నుంచి ఇప్పటి వరకూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమాని ఇప్పటివరకూ తెల్ల రేషన్‌కార్డు కలిగి ఆరు నెలలకే రూ.500 లోపు పన్ను చెల్లించే పేదలందరికీ రూ.200కే కుళాయి కనెక్షన్ మంజూరు చేస్తున్నారు. కుళాయి కనెక్షన్ నిమిత్తం రోడ్డు కటింగ్ చార్జీలు కూడా పురపాలక సంఘాలే భరించాలని అప్పట్లో వైఎస్సార్ ఆదేశించారు. అయితే ఆర్థిక సమస్యలతో ఉన్న పురపాలక సంఘాలు రోడ్డు కటింగ్ చార్జీలు భరించలేమని చెప్పాయి. ఆ తర్వాత వైఎస్ ప్రభుత్వమే మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే వరం ప్రకటించింది. అయినా పురపాలకులు కుళాయి కనెక్షన్ నిమిత్తం రోడ్డు కటింగ్ చార్జీలను పేదలపైనే భారం మోపారు. ఏడాదికి రూ.1,000 పన్ను చెల్లించే పేదలు, మధ్యతరగతి కుటుంబాలు కూడా రూ.200కే కుళాయి కనెక్షన్ పొందేగలిగే అవకాశం ఏర్పడింది. కాని ఇప్పటి ప్రభుత్వం ఏడాదికి రూ.500 ఇంటి పన్ను చెల్లించేవారికి మాత్రమే ఉచిత కుళాయి అని చెప్పడం వలన చాలా మందికి ఈ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. -
ఉచిత వైఫై, పింక్ టాయిలెట్లు!
లక్నో: ప్రముఖ ప్రదేశాల్లో ఉచిత వైఫై, మహిళల కోసం ప్రత్యేకంగా ‘పింక్ టాయిలెట్లు’, ఉచిత మంచినీటి కనెక్షన్లు.. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇస్తున్న హామీలివి. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఆదివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ తదితరులతో కలసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం యోగి మాట్లాడుతూ, ఎలాంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు. నవంబర్–డిసెంబర్లో 16 మున్సిపల్ కార్పొరే షన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 652 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉచిత కమ్యూనిటీ టాయిలెట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.20 వేల గ్రాంటు, జంతువులకు షెల్టర్లు, ఈ–టెండరింగ్.. తదితర 28 హామీలను మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చింది. మరోవైపు బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ విడుదల చేసినది సంకల్ప్ పత్ర కాదని, ఛల్ పత్ర (ప్రజలను మోసగించే పత్రం) అని సమాజ్‌వాదీ పార్టీ విమర్శించింది. గతంలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని కాంగ్రెస్ ఆరోపించింది. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగనున్న తొలి ముఖ్య ఎన్నికలు కావడంతో.. ఆయనకు పాలనకు ఇవి పరీక్షగా మారనున్నాయి. -
విద్యుత్తు చార్జీల తగ్గింపు, ఉచిత నీటిపై త్వరలో శుభవార్త: సీఎం
ఇప్పటికే బ్లూప్రింట్ ఖరారు వైఫై అందుబాటులోకి రావడానికి మరో ఏడాది 24 గంటలు పనిచేస్తున్నాం న్యూఢిల్లీ: విద్యుత్తు చార్జీల తగ్గింపు, ఉచిత నీటి పథకంపై త్వరలో ఓ ప్రకటన వెలువడనుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. ఎన్నికల హామీలలో ముఖ్యమైనవైన విద్యుత్తు, నీటి సరఫరా హామీల అమలుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిందన్నారు. నగర మంతా వైఫై అందుబాటులోకి తీసుకురావడానికి మాత్రం ఏడాది పడుతుందని ఆయన చెప్పారు. భారీ మెజారిటీతో గెలిపించడ ంద్వారా ప్రజలు తమపై పెద్ద బాధ్యతను మోపారని ఆయన చెప్పారు. తాము 24 గంటలు పనిచేస్తున్నామని తెలిపారు. మాటలు తగ్గించి, పని బాగా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్, నీటి సరఫరా విషయంలో ప్రజలకు తమ ప్రభుత్వంపై ఎన్నో ఆశలున్నాయని, వాటిని నెరవేర్చబోతున్నామని తెలిపారు. -
అధికారంలోకి వస్తే ఉచితంగా మంచినీరు: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మంచినీటిని పూర్తి ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో బెల్ట్‌షాపుల ద్వారా మద్యం లభ్యమవుతోందని, కానీ కొన్ని చోట్ల మంచినీరు మాత్రం లభించటంలేదన్నారు. శుక్రవారమిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన డ్వాక్రా మహిళలతో చంద్రబాబు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమవతి పాల్గొన్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో లైంగిక దాడికి గురైన బాలికలకు సాయం చేసేందుకుగాను కృష్ణా జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆచంట సునీత రూ.5 వేల చొప్పున ఈ సందర్భంగా చంద్రబాబుకు అందచేశారు.