ఇప్పటికే బ్లూప్రింట్ ఖరారు
వైఫై అందుబాటులోకి రావడానికి మరో ఏడాది
24 గంటలు పనిచేస్తున్నాం
న్యూఢిల్లీ: విద్యుత్తు చార్జీల తగ్గింపు, ఉచిత నీటి పథకంపై త్వరలో ఓ ప్రకటన వెలువడనుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. ఎన్నికల హామీలలో ముఖ్యమైనవైన విద్యుత్తు, నీటి సరఫరా హామీల అమలుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిందన్నారు. నగర మంతా వైఫై అందుబాటులోకి తీసుకురావడానికి మాత్రం ఏడాది పడుతుందని ఆయన చెప్పారు.
భారీ మెజారిటీతో గెలిపించడ ంద్వారా ప్రజలు తమపై పెద్ద బాధ్యతను మోపారని ఆయన చెప్పారు. తాము 24 గంటలు పనిచేస్తున్నామని తెలిపారు. మాటలు తగ్గించి, పని బాగా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్, నీటి సరఫరా విషయంలో ప్రజలకు తమ ప్రభుత్వంపై ఎన్నో ఆశలున్నాయని, వాటిని నెరవేర్చబోతున్నామని తెలిపారు.
విద్యుత్తు చార్జీల తగ్గింపు, ఉచిత నీటిపై త్వరలో శుభవార్త: సీఎం
Published Sat, Feb 21 2015 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement