
న్యూఢిల్లీ: రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. ఆమె హర్యానాలోని జింద్‌లోగల నంద్‌గర్ గ్రామానికి చెందినవారు. రేఖా గుప్తాకు ముందు ఢిల్లీకి సీఎంలుగా పనిచేసిన సుష్మా స్వరాజ్, కేజ్రీవాల్ కూడా హర్యానాకు చెందినవారే కావడం విశేషం. ఈ ముగ్గురికీ హర్యానాతో ఉన్న సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రేఖా గుప్తా(Rekha Gupta) తాత మణిరామ్ కుటుంబం నందఘర్‌లో ఉండేది. రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ బ్యాంక్ మేనేజర్‌గా పదోన్నతి పొందిన సమయంలో వారి కుటుంబం ఢిల్లీకి చేరుకుంది. రేఖా గుప్తా కంటే ముందు ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హర్యానాకు చెందినవారే. అలాగే బీజేపీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ కూడా హర్యానాతో సంబంధం కలిగివున్నారు.

రేఖా గుప్తా
రేఖ గుప్తా 1974, జూలై 19న జన్మించారు. రేఖ తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. రేఖ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారి ఆమె 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత ఆమె ఆప్ అభ్యర్థి వందన చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆమె వందనను భారీ ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీకి దిగిన ఆప్ అభ్యర్థి వందనకు 38605 ఓట్లు రాగా, రేఖా గుప్తాకు 68200 ఓట్లు వచ్చాయి.

అరవింద్ కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) 1968లో హర్యానాలోని హిసార్‌లో జన్మించారు. 1991లో ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 1992లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లోని ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. కేజ్రీవాల్ తొలుత ఢిల్లీలోని ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయంలో నియమితులయ్యారు. ఆయన 2006 లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, అరుణా రాయ్ వంటి ఇతర సహోద్యోగులతో కలిసి సమాచార హక్కు చట్టం కోసం ప్రచారాన్ని ప్రారంభించారు.

సుష్మా స్వరాజ్
సుష్మా స్వరాజ్(Sushma Swaraj) 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. అంబాలా కంటోన్మెంట్‌లోని ఎస్‌డీ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. అనంతరం పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బీ డిగ్రీని పొందారు. సుష్మా 1975 జూలై 13న భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారిలో సుష్మా రెండవ వ్యక్తి. ఆమె 57 రోజుల పాటు సీఎంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తాతో పాటు ప్రమాణం చేయనున్న ఆరుగురు మంత్రులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment