Sushma
-
Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి?
న్యూఢిల్లీ: రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. ఆమె హర్యానాలోని జింద్లోగల నంద్‌గర్ గ్రామానికి చెందినవారు. రేఖా గుప్తాకు ముందు ఢిల్లీకి సీఎంలుగా పనిచేసిన సుష్మా స్వరాజ్, కేజ్రీవాల్ కూడా హర్యానాకు చెందినవారే కావడం విశేషం. ఈ ముగ్గురికీ హర్యానాతో ఉన్న సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.రేఖా గుప్తా(Rekha Gupta) తాత మణిరామ్ కుటుంబం నందఘర్లో ఉండేది. రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ బ్యాంక్ మేనేజర్‌గా పదోన్నతి పొందిన సమయంలో వారి కుటుంబం ఢిల్లీకి చేరుకుంది. రేఖా గుప్తా కంటే ముందు ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హర్యానాకు చెందినవారే. అలాగే బీజేపీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ కూడా హర్యానాతో సంబంధం కలిగివున్నారు.రేఖా గుప్తారేఖ గుప్తా 1974, జూలై 19న జన్మించారు. రేఖ తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. రేఖ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారి ఆమె 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత ఆమె ఆప్ అభ్యర్థి వందన చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆమె వందనను భారీ ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీకి దిగిన ఆప్ అభ్యర్థి వందనకు 38605 ఓట్లు రాగా, రేఖా గుప్తాకు 68200 ఓట్లు వచ్చాయి.అరవింద్ కేజ్రీవాల్అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) 1968లో హర్యానాలోని హిసార్‌లో జన్మించారు. 1991లో ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 1992లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లోని ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. కేజ్రీవాల్ తొలుత ఢిల్లీలోని ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయంలో నియమితులయ్యారు. ఆయన 2006 లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, అరుణా రాయ్ వంటి ఇతర సహోద్యోగులతో కలిసి సమాచార హక్కు చట్టం కోసం ప్రచారాన్ని ప్రారంభించారు.సుష్మా స్వరాజ్సుష్మా స్వరాజ్(Sushma Swaraj) 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. అంబాలా కంటోన్మెంట్‌లోని ఎస్డీ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. అనంతరం పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బీ డిగ్రీని పొందారు. సుష్మా 1975 జూలై 13న భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారిలో సుష్మా రెండవ వ్యక్తి. ఆమె 57 రోజుల పాటు సీఎంగా ఉన్నారు.ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తాతో పాటు ప్రమాణం చేయనున్న ఆరుగురు మంత్రులు వీరే.. -
చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!
ఇకత్ చీరతో వేడుకలో వెలిగిపోతాం. నారాయణపేట మెటీరియల్‌తో డిజైనర్ బ్లవుజ్ కుట్టించుకుంటాం. మన సంప్రదాయ వస్త్రధారణ మనల్ని ఫ్యాషన్ పెరేడ్లో తళుక్కుమని తారల్లా మెరిపిస్తోంది. ఇవి ఇంత అందంగా ఎలా తయారవుతాయి. ఒక డిజైన్ని విజువలైజ్ చేసి వస్త్రం మీద ఆవిష్కరించే చేనేతకారులు ఏం చదువుతారు... ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేశారు మిసెస్ ఇండియా (Mrs India) విజేత సుష్మ. ఈ వస్త్రాలను నేసే చేతులను, ఆ వేళ్ల మధ్య జాలువారుతున్న కళాత్మకతను దగ్గరగా చూడాలనిపించింది. పోచంపల్లి బాట పట్టారామె. కళాత్మకత అంతా చేనేతకారుల చేతల్లోనే తప్ప వారి జీవితాల్లో కనిపించలేదు. నూటికి రెండు–మూడు కుటుంబాలు ఆర్థికంగా బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఈ కళను తమ తరంతో స్వస్తి పలకాలనుకుంటున్న వాళ్లే. మరి... ఇంత అందమైన కళ తర్వాతి తరాలకు కొనసాగకపోతే? ఒక ప్రశ్నార్థకం. దానికి సమాధానంగా ఆమె తనను తాను చేనేతలకు ప్రమోటర్‌గా మార్చుకున్నారు. చేనేతకారుల జీవితాలకు దర్పణంగా నిలిచే డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తాను పాల్గొనే ఫ్యాషన్ పెరేడ్లు, బ్యూటీ కాంటెస్ట్‌లలో మన చేనేతలను ప్రదర్శిస్తున్నారు. ఆ చేనేతలతోనే విజయాలు సొంతం చేసుకుంటున్నారు. స్వతహాగా ఎంటర్ప్రెన్యూర్ అయిన సుష్మా ముప్పిడి (Sushma Muppidi) మన హస్తకళలు, చేనేతలను ప్రపంచవేదిక మీదకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేశారు.వైఫల్యమూ అర్థవంతమే! చీరాలకు చెందిన సుష్మ ముప్పిడి బీటెక్, ఎంబీఏ చేశారు. కొంతకాలం గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతోపాటు మరో ప్రైవేట్ కాలేజ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేశారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగం... ఈ జర్నీలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఉద్యోగం కోసం తన హండ్రెడ్‌పర్సెంట్ ఇస్తోంది. పిల్లల కోసం గడిపే సమయం తగ్గిపోతోంది. వెనక్కి చూస్తే తనకు మిగిలిందేమిటి? సివిల్ సర్వీసెస్ ప్రయత్నం సఫలం కాలేదు. ఉనికి లేని సాధారణ ఉద్యోగంతో తనకు వచ్చే సంతృప్తి ఏమిటి? సమాజానికి పని చేయడంలో సంతృప్తి ఉంటుంది, తనకో గుర్తింపునిచ్చే పనిలో సంతోషం ఉంటుంది. ఇలా అనుకున్న తర్వాత యూత్‌లో సోషల్ అవేర్నెస్ కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొనవడం విజేతగా నిలవడం జరిగింది. సోషల్ ఇనిషియేటివ్, వెల్ స్పోకెన్, బెస్ట్ కల్చరల్ డ్రెస్, మిసెస్ ఫ్యాషనిష్టా వంటి గుర్తింపులతోపాటు ‘యూఎమ్బీ ఎలైట్ మిసెస్ ఇండియా 2024’ విజేతగా నిలిచారు. ఈ ఏడాది మార్చి ఒకటిన ఇటలీలోని మిలన్ నగరంలో, ఎనిమిదవ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగే ఫ్యాషన్ షోలలో భారత చేనేతలు అసోం సిల్క్, మల్బరీ సిల్క్లను ప్రదర్శించనున్నారు. జూన్‌లో యూఎస్, ఫ్లోరిడాలో జరిగే మిసెస్ యూనివర్సల్ వేదిక మీద మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు సుష్మ. ఇవన్నీ ఆత్మసంతృప్తినిచ్చే పనులు. ఇక తనకు రాబడి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ నుంచి యూఎస్, దుబాయ్, సింగపూర్లలో డైమండ్ బిజినెస్ (Diamond Business) నిర్వహిస్తున్నారు. ‘‘జీవితంలో గెలవాలి, నా కోసం కొన్ని సంతోషాలను పూస గుచ్చుకోవాలి. నన్ను నేను ప్రశంసించుకోవడానికి సమాజానికి నా వంతు సర్వీస్ ఇవ్వాలి’’ అన్నారు సుష్మ. ‘‘వయసు దేనికీ అడ్డంకి కాదు. అంతా మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఒక ముందడుగు వేయండి. సక్సెస్ అవుతామా, విఫలమవుతామా అనే సందేహాలు వద్దు. ఏ ప్రయత్నమూ చేయకపోవడం కంటే ప్రయత్నించి విఫలమైనా కూడా అది అర్థవంతమయిన వైఫల్యమే. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు’’ అని మహిళలకు సందేశమిచ్చారు. ఇది నా చేయూత పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్లలకు వెళ్లి స్వయంగా పరిశీలించాను. మన చేనేత కుటుంబాలు కళకు దూరం కాకుండా ఉండాలన్నా, ఇతరులు ఈ కళాత్మక వృత్తిని చేపట్టాలన్నా ఇది ఉపాధికి సోపానంగా ఉండాలి. అందుకోసం చేనేతలను కార్పొరేట్ స్థాయికి చేరుస్తాను. సమావేశాలకు ఉపయోగించే ఫైల్ ఫోల్డర్స్, ఇంట్లో ఉపయోగించే సోఫా కవర్స్, వేడుకల్లో ధరించే బ్లేజర్స్ వంటి ప్రయోగాలు చేసి మన చేనేతలను ప్రపంచవేదికలకు తీసుకెళ్లాలనేదే నా ప్రయత్నం. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎల్లలు దాటి విదేశాలకు విస్తరించాను. చదవండి: అన్నదాత మెచ్చిన రైతుబిడ్డకాబట్టి నాకున్న ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుని మన చేనేతలను ప్రమోట్ చేయగలుగుతున్నాను. కలంకారీ కళ కోసం అయితే ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించి కలంకారీ కళాకారులకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. పారిస్, యూఎస్ కార్యక్రమాల తర్వాత ఆ పని. సివిల్స్ సాధించినా కూడా ప్రత్యేకంగా ఒక అంశం మీద సమగ్రంగా పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక కళాత్మక సమాజానికి ఇస్తున్న సర్వీస్ నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. ప్రపంచ ఫ్యాషన్ వేదిక మీద మన భారతీయ చేనేతకు ప్రాతినిధ్యం వహించాలి. మన నేతలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనేది నా లక్ష్యం. – సుష్మ ముప్పిడి, మిసెస్ ఇండియా– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
అధికారిక కార్యక్రమాలన్నింటికీ... ఆమెకు ఆహ్వానం..
లక్డీకాపూల్: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నింటికీ మిసెస్ ఇండియా 2024 ముప్పిడి సుష్మాను ఆహ్వానించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. తెలంగాణకు చెందిన మహిళ మిసెస్ ఇండియాగా ఎన్నిక కావడం రాష్ట్రం గర్వపడే విషయమన్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను రాజ్‌భవన్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లల తల్లి అయిన సుష్మా మిసెస్ ఇండియా టైటిల్ సాధించి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. భావోద్వేగానికి లోనైనా.. తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తనను ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ఆహా్వనించినప్పుడు ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు మిసెస్ ఇండియా సుష్మా తెలిపారు. గవర్నర్‌ను కలిసిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిసెస్ ఇండియా అవార్డును తాను ఉత్తమ సాంస్కృతిక దుస్తులతో పొందిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఫిబ్రవరిలో పారిస్‌లో జరిగే అంతర్జాతీయ మిసెస్ వరల్డ్ పోటీల్లో తాను పాల్గొంటున్నానని, తనకు సినీ స్టార్స్ సుమంత, ప్రియాంక చోప్రాలు రోల్డ్ మోడల్ అని సుష్మా పేర్కొన్నారు. నేపథ్యం.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సుష్మా చదువు పూర్తైన తర్వాత గుంటూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్‌గా కొంత కాలం పనిచేశారు. తెలంగాణకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ముప్పిడి వెంకట్ రెడ్డికి కోడలైన తర్వాత సుష్మా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కొంత కాలంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఆమె, ఆ రంగాన్ని వదిలి ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించారు. ఆ రంగంలో రాణిస్తూనే మిసెస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్‌లో కలంకారి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇవీ చదవండి: ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా?Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్! -
‘ఒకే పన్ను’కు పెద్ద రంగాలే దన్ను
జీఎస్టీని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను రేటు అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతి పెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి. ఒకే పన్ను అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్‌లను తగ్గించి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధి కోసం జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.దేశంలో ఏడేళ్ల క్రితం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తొలిసారి ప్రవేశపెట్టినప్పుడు దాని అమలుపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందేహాల నివృత్తి జరక్కుండానే జీఎస్టీ అమలుకు నిర్ణయం తీసుకోవడం దుందుడుకు చర్యగా కొందరు అభివర్ణించారు కూడా!అంతకు ఏడాది క్రితమే పెద్దనోట్ల రద్దు జరిగిందని, ఆ నష్టం నుంచి తేరుకోకముందే అరకొరగా జీఎస్టీని అమలు చేయడం సరికాదని వాదించారు. ఆర్థికవేత్తలు, పన్ను నిపుణులు చాలామంది జీఎస్టీ అమలు విఫలం కాక తప్పదన్న హెచ్చరికలూ జారీ చేశారు. అయితే అన్ని అభ్యంతరాలను తోసిరాజని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముందడుగు వేయడం తెలివైన పనే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే అనుమానాలు తీర్చడంలో, జీఎస్టీలో భాగస్వాములైన వారందరి అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వడంలో ఏళ్లు పూళ్లు అవడం ఖాయం. కానీ ఒక్క విషయమైతే ఇక్కడ చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను ఉండాలన్న జీఎస్టీ లక్ష్యం పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలనూ దీని పరిధిలోకి తీసుకు రాగలిగితేనే నెరవేరుతుంది.జీఎస్టీపై సాధికార కమిటీదేశవ్యాప్తంగా ఒకే పన్ను అన్న అంశంపై సుమారు 18 ఏళ్లు చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నులు, రాష్టాల పన్నుల స్థానంలో ఒకటే పన్ను ఉండాలన్నది 1999 నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఆలోచన. విజయ్ కేల్కర్ నివేదిక ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రతిపాదించింది. తద్వారా పన్ను వసూళ్లు మెరుగవుతాయని, ఆర్థిక వ్యవస్థల ఏకీకరణ సాధ్యమవుతుందని అంచనా వేశారు. జీఎస్టీ అమల్లో ఉన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు బాగున్నట్లు అప్పటికే జరిగిన పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి కూడా. జీఎస్టీపై 2000లో ఆర్థిక మంత్రులతో కూడిన ఒక సాధికార కమిటీ ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అసిమ్‌దాస్ గుప్తా ఆ కమిటీకి నేతృత్వం వహించారు. ఇప్పటి జీఎస్టీ కౌన్సిల్ తొలి రూపం ఆ కమిటీనే. దాని సిఫారసులను అనుసరించి అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, ఆదాయ వ్యవహారాల్లో ఏకాభిప్రాయ సాధన సూత్రాలుగా జీఎస్టీ కౌన్సిల్ పని చేస్తుంది. చర్చోపచర్చల తరువాత ఈ కమిటీ జీఎస్టీ బిల్లు తొలి ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందుకు సుమారు ఇరవై ఏళ్లు పట్టింది. అప్పటికీ కొన్ని అభ్యంతరాలు ఉండగా... 2016 నాటికి గానీ స్థూలమైన ఏకాభిప్రాయం కుదరలేదు.మెరుగుపడిన పన్ను వసూళ్లు!ఒకే ఒక్క పన్ను అన్న లక్ష్యంతో మొదలైన జీఎస్టీలో సంక్లిష్టతలు వచ్చేందుకు ఒక కారణం... తమ ఆదాయం పడిపోతుందన్న రాష్ట్రాల బెంగ. ఫలితంగా... ఒకే పన్ను స్థానంలో పలు రకాల పన్ను రేట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ, అంతర్రాష్ట్ర రవాణాపై సమీకృత జీఎస్టీ ఇలా పలు రకాల పన్నులు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా... ఐదు నుంచి 28 శాతం వరకూ నాలుగు విభాగాల పన్ను రేట్లను నిర్ధారించారు. అంతేకాదు... తమకు అత్యధిక ఆదాయాన్నిచ్చే పెట్రోలు, మద్యం జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండాలని రాష్ట్రాలు పట్టుబట్టాయి. జీఎస్టీ అమలు సమయంలో ఈ పన్ను ద్వారా తగినంత ఆదాయం వస్తుందా? అన్న అనుమానాలు రాష్ట్రాలకు ఉండేది. అయితే ఈ అనుమానాలు వట్టివేనని తేలిపోయింది. వాస్తవానికి పన్ను వసూళ్లు మునుపటి కంటే బాగా మెరుగయ్యాయి. జీఎస్టీ తాజా గణాంకాలను పరిశీలిస్తే గత జూన్ నెలలో వసూళ్లు 1.74 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టిన తొలి ఏడాది ఈ మొత్తం నెలకు 90 వేల కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్రాల సొంత ఆదాయం కూడా జీఎస్టీ అమలు తరువాత పెరిగినట్లు ఆర్బీఐ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. అంటే... రాష్ట్రాలు జీఎస్టీ విషయంలో ఏర్పాటు చేసిన కాంపెన్సేషన్ లేకుండా సొంత ఆదాయాలతోనే వ్యవహారాలు చక్కబెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఈ కాంపెన్సేషన్ అనేది ముందు ఐదేళ్లు ఉంటుందని అనుకున్నారు కానీ... కోవిడ్ కారణంగా 2026 వరకూ పొడిగించారు. ఆదాయం ఇప్పటి మాదిరే పెరుగుతూ ఉంటే ఈ ఏర్పాటును రద్దు చేయవచ్చు.చిన్న వ్యాపారులకు మేలే జరిగింది!మొత్తమ్మీద జీఎస్టీ అమలులో కొన్ని ఆటుపోట్లు ఉన్నాయన్నది వాస్తవం. పద్ధతులను సులువు చేసే విషయంలో, మరీ ముఖ్యంగా రెడ్టేప్ను తగ్గించడంలో! అయితే ఇతర సమస్యలేవైనా వచ్చినా వాటి పరిష్కారం కోసం రాష్ట్రాలు తరచూ జీఎస్టీ కౌన్సిల్ రూపంలో సమావేశమవుతూండటం గమనార్హం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తేవడం ఎలా అనే సవాలును కంప్యూటర్ల సాయంతో అధిగమించారు. జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారులకు నష్టం జరుగుతుందని కొంతమంది భయపడ్డారు కానీ.. వాస్తవానికి జరిగింది మేలే. లక్షలాది చిన్న వ్యాపారులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైపోయారు.జీఎస్టీ పరిధిలోకి పెట్రోలుజీఎస్టీ అమలుతో సామాన్యులపై పన్ను భారం ఎక్కువ అవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు కానీ దీనికి కూడా సరైన హేతువు ఏదీ లేదని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. వినియోగమవుతున్న వస్తువుల్లో 60 శాతం వాటికి అతి తక్కువ పన్ను రేట్లు (సున్నా లేదంటే ఐదు శాతం) ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కేవలం మూడు శాతం వస్తువులపై మాత్రమే 28 శాతం అత్యధిక పన్ను పడుతోంది. అయినా ఒక్క విషయాన్ని మాత్రం మనం అంగీకరించాల్సి ఉంటుంది. జీఎస్టీ పన్ను రేట్లను మరింతగా హేతుబద్ధీకరించాలి. ఒకే పన్ను రేటు అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్‌లను తగ్గించి దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు.ఇక రెండో అంశం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. విద్యుత్తు, భూమి వంటి వాటిని కూడా చేర్చాలన్న వాదన ఉంది. తొలి దశలో భాగంగా వైమానిక ఇంధనం, సహజవాయువులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. పెట్రోలు, డీజిళ్లను కూడా చేర్చడం ఇప్పటికే ఆలస్యమైందని చెప్పాలి. రాష్ట్రాలకు సంబంధించి అతి పెద్ద ఆదాయ వనరుగా ఉండటం వల్ల మద్యం అమ్మకాలపై జీఎస్టీ అనేది కొంచెం సున్నితమైన అంశం అవుతుంది. అయితే నేడు కాకపోతే రేపు అయినా సరే... ఈ మార్పు అనివార్యం.అప్పిలేట్ ట్రిబ్యునల్ అవసరంజీఎస్టీ కౌన్సిల్ ఇటీవలి సమావేశాల్లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలు జరిగాయి. జీఎస్టీకి ముందు కాలం నాటి వివాదాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. అదే సమయంలో జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరాన్ని కూడా కౌన్సిల్ గుర్తించింది. జీఎస్టీ అమలును మరింత సమర్ధంగా మార్చేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతిపెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన, దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్ -
సభలో సుష్మాను గుర్తు చేసిన బన్సూరీ
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి గెలుపొంది, పార్లమెంట్లో కాలుమోపిన బన్సూరీ స్వరాజ్ తన తల్లి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను గుర్తుకు తెచ్చారు. తన తల్లి మాదిరిగానే సంస్కృతంలో పార్లమెంట్ సభ్యత్వం తీసుకున్న ఆమె సుష్మా జ్ఞాపకాలను అందరికీ గుర్తు చేశారు.తాజాగా లోక్‌సభలో ఆమె ప్రసంగిస్తున్నప్పుడు అక్కడున్నవారికి సుష్మా స్వరాజ్ శైలి కనిపించింది. బన్సూరీ తన తల్లి సుష్మా స్వరాజ్ మాదిరిగానే తన అభిప్రాయాలను సభలో బలంగా వినిపించారు. ఆ సమయంలో ఆమె హావభావాలు తల్లి సుష్మ మాదిరిగానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.బన్సూరీ తన తల్లి సుష్మా స్వరాజ్ మాదిరిగానే సభలో ప్రసంగిస్తున్నప్పుడు తన వేలు పైకెత్తి సమస్యలపై ఘాటుగా తన స్పందనను తెలియజేశారు. సోమవారం సభలో ఆమె తీరుతెన్నులు సరిగ్గా సుష్మా స్వరాజ్‌ను పోలివున్నాయని సీనియర్ నేతలు అంటున్నారు. సుష్మా స్వరాజ్ తీరులోనే బన్సూరీ.. గౌరవనీయ స్పీకర్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లలో తొలిసారిగా మాటలు, చేతలు ఒకటిగా ఉండే ప్రభుత్వం వచ్చిందని ఆమె అన్నారు. अध्यक्ष जी.... जब बांसुरी स्वराज ने मां सुषमा स्टाइल में दिया लोकसभा में भाषण, देखिए#loksabha | #bansuriswaraj pic.twitter.com/D993ySEFIg— NDTV India (@ndtvindia) July 1, 2024 -
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ మొదలైంది. గల్ఫ్ ముడిచమురుపై భారత్ ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. పైగా యుద్ధం ముదిరితే ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. అత్యధిక లాభాలనిచ్చే యూరోపియన్ మార్కెట్లకు భారత్ తన సరుకులు రవాణా చేయడం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా అన్నది!పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలు భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. తీవ్రత, నష్టం ఏమిటన్నవి ఇంకా అంచనా వేయాల్సే ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో బాహ్య పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ముప్పు కాగలవని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఉక్రెయిన్ , రష్యా మధ్య 2022లో యుద్ధం మొదలైన తరువాత పలు దేశాల్లో పరిస్థితులు మారినట్లే పశ్చిమాసియా పరిణామాలు కూడా అంతర్జాతీయంగానే కాకుండా, స్థానికంగానూ కలకలం సృష్టించనున్నాయి. పరిస్థితి సద్దు మణగకుంటే... లేదా మరింత దిగజారితే ఇప్పటికే ఎదురవుతున్న పలు సవాళ్లను తట్టుకోవడం కష్టమని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. అంతేకాదు... కొన్ని అసందిగ్ధ పరిస్థితులు ఎదు ర్కోవాల్సి రావచ్చు అని కూడా ఆమె సూచనప్రాయంగా తెలిపారు. సప్లై చెయిన్ లో వచ్చే ఇబ్బందుల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు కేంద్ర మంత్రి. ఆర్థిక పరిపుష్టి మార్గంలో కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వ్యాఖ్యలు అర్థం చేసుకోదగ్గవే. ప్రపంచంలోని భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి) 7 శాతం కంటే ఎక్కువ ఉండవచ్చునని ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్న వేళ అంతర్జా తీయ సంస్థలు కూడా తమ అంచనాలను సవరించుకుంటున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంత ర్జాతీయ ద్రవ్యనిధి – ఐఎంఎఫ్) ఇటీవలే భారత్ జీడీపీ వృద్ధిరేటును 6.5 నుంచి 6.8 శాతానికి సవరించింది. ప్రపంచ బ్యాంకు కూడా 6.4 నుంచి 6.6 శాతానికీ, ‘స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్’ 6.4 నుంచి 6.8 శాతానికీ ఈ ఆర్థిక సంవత్సరపు భారత జీడీపీ రేటును సవరించాయి. అయితే ఈ అద్భుతమైన పురోగతిని అంతర్జాతీయ అంశాలు నిరాశా పూరితం చేసే అవకాశం ఉంది. రానున్న వారాల్లో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు ఒక దశ దాటాయంటే మాత్రం ఇప్పటివరకూ హెచ్చరికలు అనుకుంటున్న పలు ఘటనలు వాస్తవం కావచ్చు. ఒకవేళ ఇరాన్ తన హోర్ముజ్ జలసంధి ద్వారా ముడిచమురు, సహజవాయువు రవాణాలను నిలిపివేసిందని అనుకుందాం. పెర్షియన్ , ఒమాన్ గల్ఫ్‌లను కలిపే ఈ సన్నటి రవాణా మార్గాన్ని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గంగా యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ గుర్తించింది. పర్షియన్ గల్ఫ్ నుంచి రవాణా అయ్యే ముడిచమురులో 80 శాతం ఈ జలసంధి ద్వారానే ఖండాలు మారుతుంది. భారత దేశం కూడా ఈ ప్రాంతపు ముడిచమురుపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మనపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. భారత్ ఉపయోగించే ముడిచమురులో 30 శాతం వరకూ రష్యా నుంచే వస్తున్నా మిగిలిన మొత్తం సౌదీ అరేబియా, పశ్చిమాసియా, యూఏఈ వంటి దేశాల నుంచే వస్తూండటం గమనార్హం. హోర్ముజ్ జలసంధి ఎంత కీలకమో దీనిద్వారా అర్థం చేసుకోవచ్చు. రెండో అంశం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే సూయిజ్ కాలువను కూడా మూసివేసే అవకాశం ఉంది. ఆసియా నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఈ కాలువకు వెళ్లే మార్గం బాబ్ ఎల్–మందేబ్ అనే చిన్న కాలువ దగ్గరి నుంచి మొదలవుతుంది. యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్న ప్రాంతమిదే. వీరంతా హమాస్‌కు మద్దతుగా ఉన్నవారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రవాణా కొంత ‘కేప్ ఆఫ్ గుడ్‌హోప్’ (దక్షిణాఫ్రికా) మీదుగా మళ్లింది. ఫలితంగా రవాణ ఖర్చులు పెరిగిపోవడమే కాదు... సమయం కూడా ఎక్కువవుతోంది. పరిస్థితి ముదిరితే అత్య ధిక లాభాలనిచ్చే యూరోపియన్ మార్కెట్లకు భారత్ తన సరుకులు రవాణా చేయడం కష్టమవుతుంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఎగుమతులు స్తంభించిపోతే వాణిజ్య ప్రవాహాలు తీవ్రస్థాయిలో ప్రభావితమవుతాయి.మూడో ప్రమాదం ఇంకోటి ఉంది. యుద్ధం ముదిరితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. బారెల్‌కు 75–80 డాలర్ల అత్యంత తక్కువ శ్రేణి ధరలు ఇప్పటికే లేకుండాపోయాయి. ప్రస్తుతం బ్రెంట్ ముడిచమురు ధరలు 87 నుంచి 89 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇప్పటికైతే ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య ఘర్షణ ఈ ధరల మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇంకొంచెం తీవ్రమైతే అవి పెరగడం ఖాయం.ముడిచమురు ధరలు పెరిగితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోతాయి. కరెంట్ అకౌంట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోలు, డీజిళ్ల ధరలు పెంచాలని చమురు కంపెనీలు ఇప్పటికే కోరుతూండటం గమనార్హం. ఇది బహుశా ఎన్నికల తరువాతే జరగవచ్చు. అయినా, ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడటం ఖాయం. ముడి చమురుకు మనం పెట్టే ఖర్చు మాటెలా ఉన్నా... పశ్చిమాసియా మీద అలుముకున్న యుద్ధమేఘాలు తొలగకపోతే మన వ్యూహా త్మక అవసరాల కోసం స్థిరంగా చమురు అందుబాటులో ఉండటమూ అత్యంత కీలకమే. మన దేశ చమురు అవసరాల్లో 80 శాతం దిగు మతులతోనే తీరుతున్నాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే?... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా? అన్నది. ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదు కానీ... మనకు మిత్రదేశాలే అయిన ఇజ్రాయెల్, ఇరాన్ లకు నిగ్రహం పాటించమని కోరడం మాత్రం చేయదగ్గ పనే. ముడిచమురు విషయానికి వస్తే ఇటీవలి కాలంలో వేర్వేరు మార్గాల ద్వారా కొను గోలు చేయడం కొంచెం ఎక్కువైంది. అలాగని గల్ఫ్ నుంచి వచ్చే లోటు మొత్తం భర్తీ అవుతుందని కాదు. కానీ ఈ మార్గాల గుండా వచ్చే ఇతర సరుకుల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయాలు వెత కడం అసాధ్యం. కానీ ఈ ప్రవాహానికి ఆటంకాలు ఎదురుకావొచ్చు. ఇలాంటి పరిణామాలే ఎదురైతే రానూ పోనూ సరుకుల ఖర్చులు తడిసి మోపెడవుతాయి.ఘర్షణ తాలూకు ఇతర ప్రభావాలను ఇప్పుడే అంచనా వేయ లేము. కానీ ఉదాహరణకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు వేర్వేరు లోహాల ధరలు అమాంతం పెరిగాయి. సన్ ఫ్లవర్ నూనెలు దొరక్కుండా పోయాయి. ఇలాగే పశ్చిమాసియాలో యుద్ధం లాంటి వాతావరణం ఏదైనా ఏర్పడితే భారత ఆర్థిక వ్యవస్థపై అనూహ్య పరిణామాలు తప్పకుండా ఉంటాయి. నిజానికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం ఏ దేశానికీ సాధ్యం కాదు. అందుకే... పశ్చిమాసియా ప్రాంతంలో అత్యంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని మాత్రమే ఎవరైనా కోరుకోగలిగేది!సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఓఎన్ డీసీతో ఈ–కామర్స్ విప్లవం?
ఈ–కామర్స్ రంగంలో ఈ మధ్యకాలంలో ఓ విషయం హల్చల్ చేస్తోంది. భారత రిటైల్ రంగాన్ని సమూలంగా మార్చేయగల సత్తా ఉందని చెప్పు కుంటున్న దాని పేరు... ‘ఓఎన్ డీసీ’. వస్తువులు అమ్ముకునే వారికీ, కొనేవారికీ వేదికగా నిలవగల, అందరికీ అందుబాటులో ఉండే నెట్వర్క్ ఇది. స్థూలంగా చెప్పాలంటే దేశంలోని లక్షలాది చిన్న కంపెనీలు అతితక్కువ ఖర్చుతో ఈ–కామర్స్ ప్లాట్ఫార్మ్పై తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ ప్లాట్ఫార్మ్కు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోంది. అలాగని ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ప్రైవేట్ రంగంలోనే లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగనుంది. ఈ–రిటైలింగ్ దేశం నలుమూలలకూ విస్తరించేందుకు ఇదో గొప్ప సాధనమవుతుందని అంచనా! ‘ఓఎన్ డీసీ’ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. వ్యాపారులు, వినియోగ దారులిద్దరికీ చాలా అనుకూలంగా ఉండే ఈ ప్లాట్ఫార్మ్కు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోంది. అలాగని ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ప్రైవేట్ రంగంలోనే లాభాపేక్ష లేని సంస్థగా కొన సాగనుంది. బ్యాంకుల్లాంటి ఆర్థిక సంస్థలు, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలెకని వంటివారు ఈ ఓఎన్ డీసీకి దన్నుగా నిలిచారు. నందన్ నీలెకని ఈ మొత్తం ప్రయత్నానికి సూత్రధారి అని కూడా చెబుతున్నారు. ఈ– కామర్స్ రంగాన్ని ప్రజాస్వామ్య పథం పట్టించే సామర్థ్యమున్న అతి పెద్ద ఆవిష్కరణ ఇదని నందన్ చెబుతున్నారు. ఓఎన్ డీసీకి ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినా ఈ విషయం అర్థమవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ప్లాట్‌ఫార్మ్‌లపై ఏ సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే వాటిల్లో ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మకాల్లో గరిష్ఠంగా 35 శాతం కమిషన్‌ను ఈ ప్లాట్ఫార్మ్లు పొందుతూంటాయి. ఓఎన్ డీసీలో ఈ అవసరం ఉండదు. వినియోగదారులకూ ఇది వర్తిస్తుంది. చిన్న చిన్న కంపెనీలు నేరుగా ఓఎన్ డీసీ ప్లాట్ఫార్మ్పై తమ ఉత్పత్తులను అమ్ము కునేందుకు వీలేర్పడుతోంది. ఈ ఉత్పత్తులను వినియోగదారులు మాత్రమే కాకుండా... అమెజాన్ వంటి పెద్ద రిటైయిలర్లూ కొనుగోలు చేయవచ్చు. ఓఎన్ డీసీలో కమిషన్ కేవలం రెండు నుంచి ఐదు శాతం మాత్రమే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే దేశంలోని లక్షలాది చిన్న కంపెనీలు అతితక్కువ ఖర్చుతో ఈ–కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లపై తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఓఎన్ డీసీని అప్పుడే యూపీఐతో పోలు స్తున్నారు. దేశంలో ఇప్పటికే భారీ విజయం సాధించిన ఈ చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు, లేదా యూపీఐలోనే భాగంగా మారేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. యూపీఐ సాయంతో గూగుల్ పే, ఫోన్ పే, జియో, అమెజాన్ వంటి అనేక పేమెంట్ పోర్టళ్ల నుంచి చెల్లింపులు చేయవచ్చునన్నది మనకు తెలిసిన విషయమే. ఓఎన్ డీసీ ఆలోచన చాలా బాగున్నప్పటికీ ప్రస్తుతానికి అది బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. మైక్రోసాఫ్ట్, పేటీఎం, ఫోన్ పే వంటి దిగ్గజ కంపెనీలూ దీంట్లో భాగస్వాములయ్యాయి. ఓఎన్ డీసీ నెట్‌వర్క్‌ను వినియోగదారులు భిన్నరీతుల్లో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కొన్ని వివాదాలూ వస్తున్నాయి. ఉదాహరణకు... కొంత మంది ఓఎన్ డీసీ నెట్‌వర్క్‌పై ఆహారాన్ని ఆర్డర్ చేస్తూండటం. జొమాటో, స్విగ్గీ వంటి అప్లికేషన్ల జోలికి పోకుండా వినియోగదారులు నేరుగా ఓఎన్ డీసీ ప్లాట్ఫార్మ్ పైనే ఫుడ్ ఆర్డర్లు పెడుతూండటం... కమిషన్లు తక్కువగా ఉన్న కారణంగా ధరలు తక్కువగా ఉండటం రెస్టారెంట్లను ఆకర్షిస్తోంది. స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలు తమను నియంత్రిస్తున్నాయన్న భావనలో ఉన్న రెస్టారెంట్లు ఇప్పుడు ఓఎన్ డీసీ వైపు మళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. సమస్యల్లా ఒక్కటే. సరకుల రవాణా బాధ్యత ఏ కంపెనీ తీసుకోవాలి? ఈ నైపుణ్యం డెలివరీ అప్లికేషన్లది! ఒకవేళ ఆర్డర్లు సరైన సమయానికి వినియోగదారులకు చేరకపోతే, అందిన సరుకులు సక్రమంగా లేకపోతే బాధ్యత ఎవరిది? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఫుడ్ డెలివరీకి మాత్రమే కాదు, ఇతర విక్రయాలకూ ఈ సమస్యల పరిష్కారం అత్యవసరం. రవాణా సమస్యల పరిష్కారానికి ‘లాజిస్టిక్స్’ రంగంలోని స్టార్టప్‌లతో ప్రయత్నాలు మొదలయ్యాయని ఓఎన్ డీసీ చెబుతోంది. డెలివరీ సమస్యలను ఇవి చూసుకుంటాయని అంటోంది. అయితే కొన్ని అంశాలను ఇంకా సరిచేయాల్సిన అవసరముంది. డిస్కౌంట్లు, తక్కువ కమిషన్ వంటివి ఇలాగే ఎక్కువ కాలంపాటు కొనసాగే అవకాశాలు తక్కువ. ఓఎన్ డీసీ నిర్వాహకులు కూడా పలు సంద ర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నెట్వర్క్ ఆరంభానికీ, ప్రాచుర్యానికీ ఈ డిస్కౌంట్లు ఉపయోగపడతాయి కానీ... దీర్ఘకాలంలో వీటి రూపురేఖలు మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటాయని వారు చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఓఎన్ డీసీలో 36,000 మంది విక్రయదారులున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ సాధించిన పురోగతి ఇది. అలాగే నెట్వర్క్ భాగస్వాముల సంఖ్య 45గా ఉంది. సగటున వారానికి 13 వేల రిటైల్ ఆర్డర్లు వస్తూండగా... గరిష్ఠంగా ఒక్క రోజులో 25 వేల వ్యవహారాలు నడిచాయి. ఈ–రిటైల్ రంగం సామర్థ్యం భారీ ఎత్తున పెరగనుందని కూడా ఓఎన్ డీసీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. సుమారు 14 కోట్ల మంది ఆన్లైన్ వినియో గదారులతో చైనా, అమెరికా తరువాత భారత్ మూడో స్థానంలో ఉందని లెక్క. అయితే దేశంలో ఈ–రిటైల్ చొచ్చుకుపోయింది చాలా తక్కువ. చైనాలో 25 శాతం ప్రాంతాలకు విస్తరించగా, కొరియాలో ఇది 26 శాతంగా ఉంది. అలాగే యూకేలో ఈ–రిటైల్ విస్తరణ 23 శాతముంటే, భారత్‌లో కేవలం 4.3 మాత్రమే. దేశంలో ఉండే 75 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులను పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువ. బెయిన్ అండ్ ఆక్సీల్ సంస్థ లెక్కల ప్రకారం 2027 నాటికి దాదాపు కోటీ యాభై లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఆన్లైన్ క్రయ విక్రయాలకు దిగనున్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 60 లక్షలు మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఓఎన్ డీసీకి ప్రాధాన్యమేర్పడుతోంది. ఈ–రీటెయిలింగ్ దేశం నలుమూలకూ విస్తరించేందుకు ఇదో గొప్ప సాధనమవుతుందని అంచనా. ఓఎన్ డీసీ పుట్టి నెలలు కూడా గడవకముందే దీనిపై కొందరు ఇది పనిచేయదని పెదవి విరిచేస్తున్నారు. పనిభారం ఎక్కువవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీలు ఓఎన్ డీసీలో భాగం కాకపోతే విజయవంతమయ్యే అవకాశాలు తక్కువన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. గూగుల్ ఈ నెట్‌వర్క్‌లో భాగస్వామి అవుతుందని గత ఏడాది మధ్యలో కొన్ని వదంతులైతే వచ్చాయి. కానీ ఆ తరువాత ఎలాంటి సద్దు లేదు. ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఓఎన్ డీసీలో చేరలేదు. అయితే వాల్‌మార్ట్‌కే చెందిన ఫోన్ పే ఇప్పటికే ఇందులో భాగస్వామి కావడం గమనార్హం. ఫోన్ పే... ‘పిన్ కోడ్’ అనే ప్రత్యేకమైన అప్లికేషన్‌తో ఓఎన్డీసీలో చేరింది. ఓలా, ఊబర్‌లను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ రంగంలో ఇప్పటివరకూ బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ‘నమ్మ యాత్రి’ అన్న రైడ్ హెయి లింగ్ సంస్థ మాత్రమే ఓఎన్ డీసీలో భాగంగా ఉంది. ఓఎన్ డీసీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నెట్వర్క్. పూర్తి సామర్థ్యాన్ని అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఈ నెట్‌వర్క్‌లో ఇప్పుడే భాగస్వాములుగా చేరాలనీ, భవిష్యత్తులో చేర్చుకోమనీ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించడం దీని అభివృద్ధికి అంతగా సహకరించేది కాదు. ఓఎన్డీసీ జయాపజయాలు ఆర్థికంగా ఎంతమేరకు అనుకూలం అన్నది భాగస్వాముల చేరిక, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలపై ఆధారపడి ఉంది. యూపీఐ, ఆధార్ల మాదిరిగా ఓఎన్డీసీ కూడా విప్లవాత్మకమైన ఆలోచనైతే అది దాని సృజనాత్మక డిజైన్ కారణంగానే అవు తుంది కానీ ప్రభుత్వ మార్గదర్శకత్వాల కారణంగా కాదు. ఈ కొత్త ఈ–కామర్స్ ప్రపంచం ఎలా పరిణమించనుందో తెలుసుకోవాలంటే వేచి చూడటం కంటే వేరు మార్గం లేదు. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఆర్థిక వ్యవహారాల జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కష్టకాలంలోనూ ఎగురుతున్న గుర్రాలు
కనీసం వందకోట్ల డాలర్ల విలువను సాధించగలిగిన స్టార్టప్ సంస్థలను యూనికార్న్‌లు అంటున్నారు. 2022 నాటికి భారత్ 100 యూనికార్న్‌ల మైలురాయిని తాకింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇవి ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అమెరికా, చైనా తర్వాత ఎక్కువ యూనికార్న్‌లను కలిగిన దేశం మనదే. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను వీటి అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్‌ల శరవేగ వ్యాప్తి గురించి అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. ఉక్రెయిన్‌లో సైనిక సంఘర్షణ, పెరుగుతున్న అంతర్జాతీయ వడ్డీరేట్లు అనే ద్వంద్వ తాకిడి నుంచి కోలుకోవడానికి ఆర్థిక వ్యవస్థ మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ, ఒక రంగం మాత్రం శరవేగంగా పెరుగుతోంది. బాహ్య పరిణామాలకు ఈ రంగం ఏమాత్రం ప్రభావితం కానట్లు కనిపిస్తోంది. ఆ రంగం ఏదో కాదు, యూనికార్న్‌లు అని పేరొందిన భారీ స్టార్టప్ సంస్థలు. ఈ సంవత్సరం భారత్ 100 యూనికార్న్‌ల మైలురాయిని తాకింది. 2011లో దేశంలో తొలి స్టార్టప్ వెంచర్ యూనికార్న్‌గా మారి దశాబ్దం గడిచింది. ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత యూనికార్న్ సంస్థలు అధికంగా ఉన్న మూడో దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఉమ్మడిగా చూస్తే ఈ వంద స్టార్టప్ సంస్థలు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వీటి మొత్తం విలువ ఇప్పుడు 333 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ఒక బిలియన్ డాలర్ల విలువను మార్కెట్లో సాధించిన స్టార్టప్ కంపెనీని యూనికార్న్ అని పిలుస్తున్నారు. ఒక దశాబ్దం క్రితం ఇలాంటి వెంచర్లు చాలా అరుదుగా ఉండేవి కాబట్టి పూర్వకాలపు పౌరాణిక ఒంటికొమ్ము రెక్కల గుర్రాల్లాగా వీటిని వర్ణించేవారు. కానీ ఇప్పుడు, అమెరికా 487 యూనికార్న్ సంస్థలనూ, చైనా 301 సంస్థలనూ కలిగి ఉన్నాయి. ఇప్పుడు యూనికార్న్ అనే పదం డెకాకార్న్ వరకు విస్తరిస్తోంది. అంటే కనీసం 10 బిలియన్ డాలర్ల విలువ గల సంస్థలుగా ఇవి ఎదుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఫ్లిప్‌కార్ట్, నైకా, బైజూస్, స్విగ్గీ వంటి కొన్ని స్టార్టప్ సంస్థలు 10 బిలియన్ డాలర్ల నిధులు సేకరించిన వెంచర్లుగా నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2020 సంవత్సరం నుంచే యూనికార్న్ వెంచర్లు బాగా పెరుగుతూండటమే. మరో మాటలో చెప్పాలంటే, మహమ్మారి తర్వాతే ఇవి విస్తరిస్తున్నాయి. ఆ సంవత్సరం దేశంలో 11 యూనికార్న్ సంస్థలు ఆవిర్బవించాయి. 2021లో వీటి సంఖ్య రికార్డు స్థాయిలో 44. ఈ ఏడాది గత ఆరునెలల కాలంలో 16 ఏర్పడటం విశేషం. ‘ఇంక్42’ సంస్థ ప్రకారం, 2025 నాటికి దేశంలో 250 యూనికార్న్‌లు ఏర్పడతాయని అంచనా. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ దూకుడుగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల యూనికార్న్‌లలో ఫండింగ్ కాస్త తగ్గుముఖం పట్టింది కానీ, 2022లో కూడా ఇన్నోవేషన్, స్టార్టప్‌ల ఎకో–సిస్టమ్ ఇప్పటికీ వికాస దశలోనే సాగుతోంది. ఫండింగ్‌కి సంబంధించి కాస్త ఆందోళన ఉన్నప్పటికీ అనేక స్టార్టప్‌లు ఈ సంవత్సరం కూడా యూనికార్న్ క్లబ్లో చేరనున్నాయి. మహమ్మారి కాలంలో ఆఫీసుకు నేరుగా వెళ్లి పనిచేసే పద్ధతి నుంచి, ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి ప్రపంచం మారిపోయింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి... ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లవైపు సృజనాత్మక ఆవిష్కరణలను మళ్లించింది. ఇళ్లనుంచి బయటకు వెళ్లడంలో అవరోధాలు ఏర్పడటంతో ప్రజాజీవితంలో ఇంటర్నెట్ మరింత పెద్ద పాత్ర వహించే స్థాయికి పరిణమించింది. కాబట్టి రిటైల్ కొనుగోళ్లు చేయడం, ఆర్థిక లావాదేవీలను సాగించడం, బిజినెస్‌ను నిర్వహించడంతో పాటు విద్య సైతం ఆన్లైన్ యాక్టివిటీగా మారిపోయింది. పేటీఎం, మొబివిక్ వంటి ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ కంపెనీల ద్వారా డిజిటల్ చెల్లింపులు విస్తృతరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్కెట్ వంటి తాజా స్టార్టప్‌లు దేశంలోని 2వ, 3వ శ్రేణి నగరాల్లో వేగంగా విస్తరించాయి. యూనికార్న్ ప్రపంచం విస్తరణకు మరొక కారణం సులభమైన ఫండింగ్. దేశంలో డిజిటల్ ఎకో సిస్టమ్ విస్తరణకు అపారమైన అవకాశం ఉంటుందని మదుపుదారులు గ్రహిస్తున్నారు. దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి ఇప్పటికీ సాపేక్షికంగా తక్కువ స్థాయిలో, అంటే 41 శాతంగానే కొనసాగుతోంది. అంటే ఈ రంగంలో పెరుగుదలకు అపారమైన అవకాశాలు ఉన్నట్లే లెక్క. అయితే ఆన్లైన్ స్పేస్‌లో వినియోగదారుల సంఖ్య ఇప్పటికీ ఏడు శాతంగా మాత్రమే నమోదైంది. వాట్సాప్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్న వారు సైతం ఫిజికల్ రిటైల్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారని తాజా డేటా చెబుతోంది. దేశంలోని 44 కోట్లమంది వాట్సాప్ యూజర్లలో 15 శాతంమంది మాత్రమే ఆన్లైన్లో కొంటున్నారు. ఈ నేపథ్యంలో, వచ్చే అయిదు లేదా పది సంవత్సరాల కాలంలో వెంచర్ కేపిటల్ ఫండ్స్ దీర్ఘకాలిక అంచనాల ప్రాతిపదికపై మదుపు పెట్టడానికి సిద్ధపడటం ఖాయం అని తేలుతోంది. గత సంవత్సరం నుంచి చైనాలో టెక్ కంపెనీలపై రెగ్యులేటరీ నిబంధనలను పెంచుతున్న నేపథ్యంలోనే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో వెంచర్ కేపిటలిస్టులు మన దేశంలోని పరిణామాలపై తాజాగా దృష్టి సారిస్తున్నారు. మొత్తంమీద చూస్తే, లాభదాయకమైన ఐడియాలపైనే మదుపుదారులు డబ్బు పెడతారన్నది నిజం. గత కొన్ని సంవత్సరాల్లో ప్రారంభమైన అనేక స్టార్టప్ సంస్థలు ఫిన్‌టెక్, ఈ–కామర్స్ లేదా సాఫ్ట్వేర్ సర్వీస్ కేటగిరీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది. కొన్ని సమస్యలను ఎంపిక చేయడం కష్టమే అవుతుంది గానీ, నైకా సంస్థ ఆన్లెన్ మార్కెట్లో సౌందర్య ఉత్పత్తుల విషయంలో గ్యాప్ ఉన్నట్లు కనుగొన్నది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలకు కూడా మార్కెట్లో స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని మీషో సంస్థ కనుగొంది. దేశంలో అత్యధిక సంఖ్యలో యూనికార్న్‌లను (33) కలిగి ఉన్న ఫిన్ టెక్ సంస్థలు రిటైల్ వినియోగదారులతోపాటు వ్యాపార సంస్థల డిజిటల్ చెల్లింపుల అవసరాలను కూడా పూరించడంలో అధిక కృషి చేస్తున్నాయి. ఆన్లైన్ బిజినెస్‌లలో ఉన్న ఖాళీలను పూరించడంలో సాయపడేందుకు ‘సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్’ స్టార్టప్‌లు ముందుకొస్తున్నాయి. ఎడ్యుకేషన్ లేదా ఎడ్టెక్ వెంచర్లుగా పేరొందిన సంస్థలు బైజూస్ వంటి డెకాకార్న్‌ల వికాసానికి దారితీశాయి. మహమ్మారి కాలంలో ఆరోగ్య సంరక్షణ మరో ప్రాధాన్య రంగంగా ముందుకొచ్చింది. ఆరోగ్య రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం వల్ల ఇన్నోవస్సెర్, ఫార్మియాసీ, క్యూర్‌ఫిట్, ప్రిస్టిన్ కేర్ వంటి శైశవదశలోని యూనికార్న్‌ల ఆవిర్భావానికి తావిచ్చాయి. యూనికార్న్‌లు ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయనడంలో సందేహమే లేదు. ప్రత్యేకించి ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను యూనికార్న్‌ల అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్‌ల శరవేగ అభివృద్ధి గురించి మరీ అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. కొన్ని యూనికార్న్‌లు హైరింగ్ రంగంలో అడుగుపెట్టాయి. అయితే మొత్తం ఉపాధిరంగంలో తమదైన పాత్ర పోషించడానికి తగినంత పెద్ద మొత్తంలో ఇలాంటి వెంచర్లకు నిధులు లభ్యం కావడం లేదన్నది వాస్తవం. అదే సమయంలో, స్టార్టప్‌లు, యూనికార్న్‌లు, డెకాకార్న్‌ల వంటి వెంచర్లను దీర్ఘకాలిక దృష్టితోనే అంచనా వేయాలి. కాలం గడిచేకొద్దీ ఈ తరహా వెంచర్లు దేశాన్ని మరింత వేగంగా డిజిటల్ యుగంలోకి తీసుకెళతాయి. అంతే కాకుండా అంతిమంగా అసమానతలను తగ్గించడం వైపు దేశాన్ని నడిపిస్తాయి. అంతిమంగా, యూనికార్న్‌లను ఒంటరి ద్వీపాల్లాగా చూడకూడదు. దేశ వాణిజ్య వాతావరణంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే ఉత్ప్రేరకాలుగా ఇవి పనిచేస్తాయి. సాంకేతికత ఆధారంగా పనిచేసే స్టార్టప్‌లు వేటికవి విడివిడిగా ఉంటాయి కానీ సాంప్రదాయికమైన ఇటుకలు, ఫిరంగి తయారీ పరిశ్రమల్లో సైతం ఇవి సృజనాత్మకతను పెంచుతున్నాయి. ‘బిగ్ టెక్’ కంపెనీ విదేశాల్లోనూ స్టార్టప్‌ల నుంచే ఆవిర్భవించింది. ప్రపంచమంతటా ఇప్పుడు స్టార్టప్‌ల రాజ్యం నడుస్తోంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త ఫైనాన్షియల్ జర్నలిస్టు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సరిత, సుష్మలకు కాంస్యాలు
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు రెండు కాంస్యాలతో మెరిశారు. 59 కేజీల విభాగంలో సరిత, 55 కేజీల కేటగిరీలో సుష్మ కంచు పతకాలు గెలిచారు. ఆరంభ బౌట్లలో ఓడినా తర్వాతి రెండు బౌ ట్లలో వరుసగా దిల్‌ఫుజా ఇంబెటొవా (ఉజ్బెకిస్తాన్)పై 11–0 తేడాతో (టెక్నికల్ సుపీరియార్టీ)...ఆ తర్వాత దియానా కయుమొవా (కజకిస్తాన్)పై 5–2తో సరిత గెలిచింది. సుష్మ కూడా ఇదే తరహాలో ఆల్టిన్ షగయెవా (కజకిస్తాన్)పై 5–0తో, ఆపై సర్బినాజ్ జెన్‌బెవా (ఉజ్బెకిస్తాన్)ను 12–0 తే డాతో ఓడించి కాంస్యం ఖాయం చేసుకుంది. ఈ ఈ వెంట్ పురుషుల విభాగంలో గ్రీకో రోమన్ రెజ్ల ర్లు ఇప్పటికే ఐదు కాంస్యాలు గెలవడంతో ఓవరాల్ గా భారత్ పతకాల సంఖ్య ఏడు కాంస్యాలకు చేరింది. -
పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది
పురుషులతోపాటు మహిళలు దాదాపు అన్నిరంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా నిత్య పూజల నుంచి కైంకర్యాల దాకా అంతా మగ పూజారులు, పండితులు మాత్రమే చూసుకోవడం చూస్తున్నాం. కానీ అమెరికాలో పండితుల పీటమీద సుష్మా ద్వివేది కూర్చుని పెళ్లిళ్లు జరిపిస్తూ కొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. కుల, మత భేదం లేకుండా పెళ్లిళ్లు చేయడమే గాక, పూజలు, వ్రతాలు కూడా నిర్వహిస్తోంది. భారత సంతతికి చెందిన సుష్మ కెనడాలో పెరిగిన అమ్మాయి. 2013లో వివేక్ జిందాల్‌తో పెళ్లి జరిగింది. వీరి పెళ్లితోపాటు వివేక్ జిందాల్ తోబుట్టువు ఒకరి పెళ్లికూడా అదే సమయంలో ఏర్పాటు చేశారు. కానీ అది ఒక ట్రాన్స్‌జెండర్ పెళ్లి. దీంతో సుష్మా వాళ్ల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగినప్పటికీ తోబుట్టువు పెళ్లి అలా జరగలేదు. అప్పుడు అంతా బాధపడ్డారు. ఆ పెళ్లి కూడా సంప్రదాయబద్ధంగా జరిగితే బావుండును అని సుష్మకు అనిపించింది. కానీ అలా జరగలేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటోన్న వారికి పరిష్కారం చూపాలని అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించింది సుష్మ. తొలి బిడ్డ ప్రసవ సమయంలో... నెలలు నిండిన సుష్మ ఆసుపత్రిలో చేరింది. అక్కడ కాన్పు సవ్యంగా జరగడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ఓ జంటకు పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎనస్థీషియా డాక్టర్ ద్వారా తెలిసింది. ఆ జంట పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణమని ఆమె చెప్పడంతో సుష్మ మరోసారి ఆలోచనలో పడింది. అరగంట ఆలోచించి ఆ జంటకు తానే పెళ్లిచే యిస్తానని చెప్పింది. ప్రసవం అయ్యి బెడ్‌మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న సుష్మ గదిలోకి ఆ జంట రాగా అక్కడ ఉన్న నర్సులు పాట పాడగా ఆ జంటకు పెళ్లి తంతుని ముగించింది సుష్మ. ఈ కార్యక్రమం మొత్తాన్ని వివేక్ ఐఫోన్లో వీడియో తీశారు. ఆ తరువాత ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా సుష్మ పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో ఉన్న పెళ్లిమంత్రాలను నేర్చుకుని పెళ్లిళ్లు చేయడం ప్రారంభించింది. బామ్మ దగ్గర నేర్చుకుని.. ప్రారంభంలో అంతా సుష్మను వ్యతిరేకించినప్పటికీ వాటన్నింటి దాటుకుని ముందుకు సాగుతూ అమెరికాలోనే తొలి మహిళా పురోహితురాలిగా నిలిచింది. ఇదే రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాత హిందూ సంప్రదాయాల గురించి లోతుగా తెలిసిన బామ్మతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుంది. అంతేగాక బామ్మతో కలిసి... పూజలు, పెళ్లికి ఏయేమంత్రాలు చదువుతారు? వాటిని ఎలా ఉచ్చరించాలి? సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన క్రతువుల గురించి వివిధ గ్రంథాలను చదివి పెళ్లిమంత్రాలను ఆపోశన పట్టింది. అంతేగాక 88 ఏళ్ల బామ్మ ఇచ్చిన ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని అనేక పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటిదాకా దాదాపు యాభై పెళ్లిళ్లు చేసింది. అరగంట పెళ్లి.. ఎంతో చక్కగా పెళ్లిళ్లు చేస్తోన్నసుష్మా.. మరింతమందికి తన సేవలు అందించేందుకు 2016లో ‘పర్పుల్ పండిట్ ప్రాజెక్ట్’ పేరిట న్యూయార్క్‌లో సంస్థను ప్రారంభించింది. దీనిద్వారా పెళ్లితోపాటు అనేక మతపరమైన సేవలను అందిస్తోంది. దక్షిణాసియాలోని ‘గే’ కమ్యూనిటీ వాళ్లకు అరగంటలో పెళ్లి చేస్తుంది. సంప్రదాయ హిందూ పెళ్లిళ్లను మూడుగంటల్లో పూర్తి చేస్తోంది. అంతేగాక తన భర్త నిర్వహిస్తోన్న ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ ‘డెయిలీ హార్వెస్ట్’కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి ఒకపక్క సంసారాన్ని, మరోపక్క కంపెనీ బాధ్యతలనూ నిర్వర్తిస్తూనే పౌరోహిత్యం కూడా అంతే సజావుగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని కామెంట్లు వస్తున్నాయి. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుష్మ మరిన్ని పెళ్లిళ్లతో ముందుకు సాగాలని కోరుకుందాం. బాలింతగా ఆస్పత్రి బెడ్‌పైన ఉండి మరీ పెళ్లి జరిపిస్తున్న సుష్మ -
ఆన్‌లైన్‌లోనూ అత్యుత్తమ బోధన
Sushma Boppana About Infinity Learn: కోవిడ్ తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ అభ్యసనానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీచైతన్య విద్యాసంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఇన్ఫినిటీ లెర్న్’ అనే ఎడ్యుటెక్ సంస్థను ప్రారంభించింది. నీట్, జేఈఈ విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు అందిస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా బోధనానునుభవంతో ఆన్‌లైన్‌లోనూ అత్యుత్తమ శిక్షణ అందించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని ‘ఇన్ఫినిటీ లెర్న్’ సహ వ్యవస్థాపకురాలు సుష్మ బొప్పన పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇన్ఫినిటీ లెర్న్’ గురించి ఆమె మాటల్లోనే... నాణ్యమైన కంటెంట్ ఇతర సంస్థలకు భిన్నంగా నాణ్యమైన కంటెంట్ అందించే ప్రధాన లక్ష్యంగా ‘ఇన్ఫినిటీ లెర్న్’ను తీర్చిదిద్దాం. ఆఫ్‌లైన్‌లో బోధిస్తున్న విధానానికి దీటుగా డిజిటల్‌లోనూ అత్యుత్తమ శిక్షణ అందించే ఏర్పాటు చేశాం. విద్యార్థులకు కేవలం ఆన్లైన్లో పాఠాలు చెప్పడం, హోమ్‌వర్క్‌లు కేటాయించడమే కాకుండా ఆ విద్యార్థికి సబ్జెక్టుపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాం. గత 36 ఏళ్లుగా శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా సాధించిన అనుభవం ఈ వ్యూహాలు అమలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. నీట్, జేఈఈపై దృష్టి మొదటగా నీట్, జేఈఈపై దృష్టి సారించాం. నీట్ లాంగ్‌టర్మ్ శిక్షణకు దేశవ్యాప్తంగా విద్యార్థులు చేరుతున్నారు. టెస్ట్ సిరీస్‌కూ ఆదరణ లభిస్తోంది. 2023 నాటికి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతోపాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్, ఇంగ్లీషు లాంగ్వేజ్ పాఠాలు, కంప్యూటర్ కోర్సులు అందించే ఆలోచన ఉంది. 2024 నాటికి శ్రీచైతన్య విద్యార్థులు కాకుండా మరో 10 లక్షల మంది విద్యార్థులు నేరుగా ‘ఇన్ఫినిటీ లెర్న్’ ప్రయోజనాలు పొందేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ‘అమెజాన్ అకాడమీ’తోనూ ఒప్పందం కుదుర్చుకుని నీట్, జేఈఈ పరీక్షల పూర్తి కోర్సులను అందిస్తున్నాం. నీట్–2021లో రికార్డుస్థాయి ఫలితాలు సాధించాం. వచ్చే ఏడాది మరిన్ని ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. ప్రణాళిక, పర్యవేక్షణ ఇన్ఫినిటీ లెర్న్‌లో విద్యార్థి స్థాయికనుగుణంగా బోధన ఉంటుంది. అప్పుడే విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతుందనేది మా నమ్మకం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాన్సెప్ట్ ఓరియెంటెడ్, ప్రాబ్లమ్ ఓరియెంటెడ్, న్యూమరికల్ అంశాలుగా విద్యార్థుల అవసరాల మేరకు కంటెంట్ అందిస్తున్నాం. ఆన్‌ౖలñ న్లో విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకునే విధంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. తరగతిలో నేర్చుకున్న అంశాలను హోమ్ వర్క్ ద్వారా సాధన చేయడం, అందులో విద్యార్థులకు ఎదురైన అనుభవాలు, సందేహాలు నివేదికల రూపంలో అధ్యాపకుడికి చే రతాయి. వాటిని తర్వాత తరగతిలో ఉపాధ్యాయుడు విశ్లేషించి సందేహాలుంటే నివృత్తి చేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు అంశాలపై పట్టు పెంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే వారు పరీక్షల్లోనూ రాణించగలుగుతారు. టెక్నాలజీ వినియోగం తరగతి గదిలో స్మార్ట్ బోర్డులను ఏర్పాటు చేసి ‘హైబ్రిడ్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ను రూపొందించాం. నీట్ లాంగ్‌టర్మ్ విద్యార్థులందరికీ దీన్ని అమలు చేస్తున్నాం. తద్వారా ఆన్లైన్ ప్లాట్‌ఫాంను మరింత మెరుగుపరుస్తున్నాం. ఉపాధ్యాయ ఆధారిత బోధన కంటే విషయ ఆధారిత బోధనకు ప్రాధాన్యతనిస్తున్నాం. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేటపుడు టెక్నాలజీ సమస్యలు తలెత్తకుండా అప్లికేషన్ తయారుచేశాం. పాఠాలు, స్టడీమెటీరియల్, యానిమేషన్ అంశాలను జోడించి బోధన సాగిస్తున్నాం. స్కాలర్షిప్ టెస్ట్ శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతోపాటు ఇతర విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల అవసరాలు తీర్చేలా దీన్ని రూపొందించాం. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో నిపుణులైన అధ్యాపకులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోలేనిచోట విద్యార్థులకు ప్రయోజనం కలగాలని భావించాం. నామమాత్రపు ధర నిర్ణయించి కోర్సులను అందిస్తున్నాం. రూ.99 నుంచి కోర్సు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ‘స్కోర్’ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ అందిస్తున్నాం. -
వెండితెరపై చెన్నూరు చిన్నది..!
సాక్షి, చెన్నూర్: చిన్ననాటి నుంచి ఆమెకు నాటకాలు, డ్రామాలు అంటే మక్కువ. ఆ మక్కువే నేడు సినిమాలో చాన్స్ దక్కించింది. చదువుకునే సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంలో వెబ్‌సీరిస్‌లోకి అడుగుపెట్టింది. “వరంగల్ వందన’ వెబ్‌సీరిస్‌లో తన నటనకు మంచి మార్కులు దక్కించుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో నంబర్‌వన్ స్థానంలోకి చేరింది. ఇటీవల సినిమాలో సైతం చాన్స్ దక్కించుకుంది. ఫలితంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం నుంచి వెండితెరపై మెరవనున్న తొలి మహిళగా సుష్మగోపాల్ నిలవనుంది. సినీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డితో సుష్మగోపాల్ చెన్నూర్‌కు చెందిన సుష్మ... చెన్నూర్‌కు చెందిన ప్రైవేట్ వైద్యుడు తిప్పార్తి వేణుగోపాల్, శ్రీకళ దంపతుల కుమార్తె సుష్మగోపాల్. చెన్నూర్‌లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంది. 2019న హైదరాబాద్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా.. వరంగల్ వందన వెబ్‌సీరిస్‌లో చాన్స్ దక్కింది. రచయిత ప్రజా ప్రభాకర్, డైరెక్టర్ శృతి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెబ్ సీరిస్‌లో నటించింది. ఇప్పటివరకు 80కి పైగా వెబ్ సీరిస్‌లో నటించిన సుష్మగోపాల్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండింగ్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. ఓవైపు వెబ్‌సీరిస్‌లో నటిస్తూనే ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిగ్రీ చేస్తూ మరోవైపు వెబ్ సీరిస్‌ల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం సినిమాలో నటించే చాన్స్ రావడంతో సుష్మగోపాల్తో పాటు ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో .. సినీ రంగ ప్రవేశం వెబ్‌సిరీస్‌లో రాణిస్తున్న సుష్మగోపాల్కు ఒక్కసారిగా వెండితెరపై నటించే అవకాశం వచ్చింది. సినీ నటుడు అలీ, నరేశ్ నటిస్తున్న అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాను శ్రీపురం కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. సినిమాలో ప్రధాన పాత్రధారి చెల్లె పాత్రలో సుష్మ నటిస్తోంది. 10 లక్షల చేరువలో వెబ్‌సీరిస్ వరంగల్ వందన వెబ్‌సీరిస్ ఏడాదికి లక్ష మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. దీంతో వరంగల్ కలెక్టర్ పాటిల్ ప్రశాంత్‌జీవన్ వెబ్ సిరీస్ బృందాన్ని అభినందించి మెమోంటో అందజేశారు. ప్రస్తుతం వరంగల్ వందన యూట్యూబ్ వెబ్ సిరీస్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 10లక్షల సబ్ స్క్రైబర్‌కు చేరువలో ఉంది. సుష్మగోపాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 50వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. చదువుతో పాటు... చదువుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లాను. మా అన్నయ్య విష్ణు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్ చదువుతూనే వెబ్‌సిరీస్‌లో నటించాను. మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఓ సినిమాలో చాన్స్ వచ్చింది. రానున్న రోజుల్లో మంచి పేరు తీసుకువచ్చే పాత్ర చేస్తా. మంచి నటిగా పేరు సంపాదించాలనేదే నా లక్ష్యం. – తిప్పార్తి సుష్మగోపాల్, సినీనటి, చెన్నూర్ -
ఆమె అవసరం
రోడ్డు మీద ఉన్నాం. రద్దీలో ఉన్నాం. అత్యవసరంగా పక్కకు వెళ్లాలి. మగాళ్లయితే ఏదో ఒక పక్కకు వెళ్లొచ్చేస్తారు. ఆడవాళ్ల మాటేమిటి? సిటీల్లో పెద్ద సమస్య ఇది! ‘షీ’ అని ఉన్న చోటును చూసుకుని వచ్చే అవసరమా ఏమన్నానా?! సుష్మకూ ఇలాంటి సమస్యే ఎదురైంది. బాగా ఆలోచించి.. ‘షీ’నే అవసరం ఉన్న దగ్గరకు రప్పించే మొబైల్ ‘షీ’ టాయ్‌లెట్‌ను ప్లాన్ చేసింది. ఇది ఆమె పరిచయం మాత్రమే కాదు. ‘ఆమె’ పరిచయం కూడా. చదవండి. సుష్మను అభినందించడానికి మీకింకా అనేక కారణాలు కనిపిస్తాయి. సుష్మ కళ్లెంపూడి వైజాగ్‌లో పుట్టి పెరిగింది. గీతం యూనివర్శిటీలో బీటెక్ చేసి హైదరాబాద్‌లో సత్యం కంప్యూటర్స్‌లో ఉద్యోగం. ఇదంతా 2004లో. ఆ తర్వాత ఏడాది కోదాడ కుర్రాడు సుధీర్‌ని పెళ్లి చేసుకుని యూఎస్‌లో అడుగుపెట్టింది. తిరిగి పన్నెండేళ్ల తర్వాత దంపతులు కుటుంబం సహా ఇండియాకి వచ్చారు. ఇండియాకి ఏదైనా చేయాలని వచ్చారు. ‘సంపాదనలో విరామం– సమాజానికి సహాయం’ అని స్టెల్లా అనే అమెరికన్ ఫ్యామిలీ ఫ్రెండ్ చెప్పిన సూక్తిని ఒంటపట్టించుకుని మరీ ఇండియాకి వచ్చారీ దంపతులు. బాగా ఆలోచించాక.. మహిళలకు ఇల్లు దాటి బయటికి వచ్చినప్పుడు ఎదురయ్యే వాష్‌రూమ్ ఇబ్బందికి చెక్ పెట్టడం కోసం ‘షీ మొబైల్ టాయిలెట్’ అనే కాన్సెప్ట్‌ని రూపొందించుకున్నారు సుష్మ. ‘‘అయితే అందుకు బీజం పడింది మాత్రం అమెరికా వెళ్లకముందే..’’ అని చెప్పారామె. పెళ్లికి ముందు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు సెలవు రోజుల్లో ఫ్రెండ్స్‌తో కోఠీ వంటి రద్దీగా ఉండే మార్కెట్ స్థలాలకు వెళ్లినప్పుడు ఎదురైన అవసరాన్ని, అసౌకర్యాన్ని గుర్తు చేసుకున్నారు.‘మీ వాష్‌రూమ్ వాడుకుంటాం’ అని దుకాణాలు, రెస్టారెంట్ల వాళ్లను అడగడం ఎంత ఇబ్బందిగా ఉండేదో తలుచుకున్నారు. షిరిడీకి వెళ్లేటప్పుడు బస్ ప్రయాణం కదా అని నీళ్లు తక్కువగా తాగినప్పటికీ ఏసీ బస్సు కావడంతో వాష్‌రూమ్ అవసరం తప్పని సరి అయిన సందర్భాన్ని వివరించారు. హిస్టరెక్టమీ చేయించుకున్న తన అత్తగారు కోదాడ నుంచి హైదరాబాద్‌కి బస్సులో ప్రయాణించేటప్పుడు ఎదుర్కొన్న విపత్కర పరిస్థితినీ ప్రస్తావించారు. వీటన్నింటి తర్వాత ఇండియాలో.. ఏడేళ్ల కొడుకు వేదాన్ష్ కోదాడ, వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో స్కూల్లో వాష్‌రూమ్ బాగాలేదని మొండికేయడం, బహిరంగంగా మూత్ర విసర్జన ఎందుకు చేయాలని ప్రశ్నించడంతో ఈ సమస్య తీవ్రతను మరోసారి సమీక్షించుకున్నారు సుష్మ. ఇండియాలో స్వచ్భారత్లు వచ్చినా, నగరాల్లో సులభ్ కాంప్లెక్స్లున్నా వాష్‌రూమ్ అవసరాన్ని భర్తీ చేసే స్థాయిలో సర్వీస్ లేదని గమనించారు. ‘‘పెద్ద మాల్స్‌లో షాపింగ్ చేసే వాళ్లకు ఆ మాల్సే వాష్‌రూమ్ సర్వీస్నిస్తున్నాయి. కానీ సామాన్య మహిళల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఆ మహిళలు రోజు వారీ పనులు, కొనుగోళ్ల కోసం కోసం బహిరంగ మార్కెట్ మీదనే ఆధారపడుతున్నారు. మళ్లీ వాళ్లు ఇంటికి వెళ్లే వరకు ఊపిరి బిగపట్టినంత ఆ నరకాన్ని భరిస్తూనే ఉండాలి. వీటన్నిటికీ పరిష్కారంగా నాకు వచ్చిన ఆలోచనే ఈ ‘మొబైల్ షీ టాయిలెట్స్’’ అన్నారు సుష్మ. ఇండియా అంతే... అనుకోరాదు ‘‘ఊహ తెలిసిన తర్వాత అమెరికా సమాజాన్ని మాత్రమే చూసిన మా పెద్దబ్బాయి వేదాన్ష్‌కు భారతీయ సమాజం పరిచయం కావాలనే ఆలోచనతో కార్పొరేట్ స్కూల్ కాకుండా కొంతకాలం పాటు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం. ‘మా తాతగారిల్లు, మా నాన్న చదివిన స్కూలు’ అని ఫొటోల్లో చూడడం కాదు, పిల్లలకు ప్రాక్టికల్‌గా అనుభవంలోకి రావాలనేదే మా ఆలోచన. స్కూలుకి వెళ్లిన మొదటి రోజు నుంచి ‘స్కూల్లో వాష్‌రూమ్‌తో మొదలు పెట్టి స్కూల్లో బెంచీల్లేవేంటి, బిల్డింగ్‌కి పగుళ్లున్నాయేంటి’ అని రోజుకో కంప్లయింట్ చేసేవాడు. దాంతో మా మామగారు (జలగం రంగారావు) పూనుకుని స్కూల్ రిపేర్లు, బెంచ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌కు అవసరమైన మెటీరియల్ డొనేట్ చేశారు. మన కళ్ల ముందున్న ప్రతి సమస్యకూ ‘ఇండియాలో ఇంతే’ అని సమాధానం చెప్పుకోవడం కాదు, మనవంతుగా ఓ పరిష్కారాన్ని ఆలోచించాలి’’ అని చెప్పారు సుష్మ. కరెంటు ఉత్పత్తి ఆఫ్రికాలో మొబైల్ టాయిలెట్ వ్యర్థాల నుంచి వాళ్లు కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు, హ్యూమన్ వేస్ట్ ఎరువుగా మారే టెక్నాలజీని ఫాలో అవుతున్నారు వాళ్లు. వినడానికి మనకు విచిత్రంగా ఉండవచ్చు కానీ, చైనాలో స్కూళ్లలో పండించే కూరగాయలు, పండ్లకు ఎరువు ఆయా స్కూళ్ల టాయిలెట్ల హ్యూమన్ వేస్టే. మామూలుగా అయితే హ్యూమన్ వేస్ట్ ఎరువుగా మారడానికి ఆరు నెలలు పడుతుంది. పార్థివ దేహాన్ని దహనం చేసే టెక్నాలజీని ఇక్కడ ప్రవేశ పెడితే నిమిషాల్లో బూడిదయిపోతుంది. దానిని హరితహారంలో మొక్కలకు ఉపయోగించవచ్చు. ఇలా పూర్తి స్థాయిలో ఒక వాహనం తయారు చేయాలంటే పదిలక్షలు ఖర్చవుతుంది. అయితే మొదటగా ప్రాథమికంగా ఉపయోగించుకోగలిగిన పరిస్థితిలో వాహనాన్ని తయారు చేయమని చెప్పారు జీహెచ్ఎంసీ వాళ్లు. నా ఆలోచన సంక్రాంతి నాటికి ఆచరణలోకి వస్తుంది. ఆ తర్వాత షీ టాయిలెట్స్‌ను దేశమంతటికీ విస్తరిస్తాను’’ అని భవిష్యత్తు ప్రణాళిలను వివరించారు సుష్మ. స్కూళ్లను అద్దెకిద్దాం ప్రభుత్వ భవనం లేకపోతే అద్దె భవనంలో స్కూళ్లు నడపడం గురించి మాత్రమే మనకు తెలుసు. సుష్మ మాటల్లో మన పాఠశాలలు అనుసరించదగిన మరో సూచన కూడా తెలియవచ్చింది. ‘‘అమెరికాలో వారాంతాలు, ఇతర సెలవు రోజుల్లో స్కూలు ఆవరణను, గదులను సమావేశాలకు అద్దెకిస్తారు. పాఠశాల భవనాలను చక్కగా నిర్వహించుకుంటే మన దగ్గర కూడా అలా రెంట్కిచ్చి ఆ వచ్చే డబ్బుతో స్కూల్‌కి అవసరమైన పనులు చేసుకోవచ్చు’’ అని తెలిపారు సుష్మ. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోహనాచారి మూడు దేశాల ఆచరణ షీ మొబైల్ టాయిలెట్ వాహనం ‘‘నేను, నా భర్త సుధీర్ అమెరికా, కెనడా, యూకెల్లో ఉద్యోగాలు చేశాం. యూకె టెక్నాలజీ సాయంతో నైరోబీ, ఉగాండా, కెన్యాల్లో టాయిలెట్ల నిర్వహణ తీరును మనదేశంలో షీ టాయిలెట్ల కోసమే స్టడీ చేశాను. ఒక వెహికల్లో టాయిలెట్ కమోడ్, వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఆ వాహనాన్ని అందుబాటులో ఉంచాలనేది మా ఉద్దేశం. మహిళలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఒక పార్ట్ పుణె నుంచి, మరో పార్ట్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫరా బాద్ నుంచి తీసుకు వచ్చాక మరికొంత వర్క్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. ఇందుకోసం జీహెచ్ఎంసీని సంప్రదించాం. అడిషనల్ కమీషనర్ హరిచందన సానుకూలంగా స్పందించారు’’ అని చెప్పారు సుష్మ. కాఫీ విత్ ప్రిన్సిపల్ పిల్లలు వేదాన్ష్, జేష్ణవ్లతో సుష్మ దంపతులు స్కూల్ నిర్వహణ గురించి పూర్తిగా ప్రభుత్వాల మీదనే ఆధారపడడం కాదు, పేరెంట్స్ కూడా బాధ్యత పంచుకోవాలి. అప్పుడే సమస్యలు మొగ్గదశలోనే తీరిపోతాయి. అలా నాకు వచ్చిన ఇంకో ఆలోచనే ‘టీ విత్ హెడ్ మాస్టర్’. యూఎస్‌లో ‘కాఫీ విత్ ప్రిన్సిపల్’ ప్రోగ్రామ్ ఉంటుంది. విద్యార్థుల పేరెంట్స్ తప్పని సరిగా ప్రిన్సిపల్‌ని కలుస్తారు. పేరెంట్స్ స్కూల్‌కి అవసరమైన సర్వీస్ కూడా చేస్తారు. ఇదే కాన్సెప్ట్‌ని మా వెంకటాపురం స్కూల్ నుంచి ‘టీ విత్ హెడ్మాస్టర్’ అని ప్రారంభించామన్నమాట. అలా ఏపీ, తెలంగాణల్లో పాతిక స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ పెట్టి, వాళ్లకు గైడెన్స్ కోసం కొన్ని సమావేశాలకు నేను స్వయంగా హాజరయ్యాను. ఏపీ విద్యామంత్రి, తెలంగాణ విద్యామంత్రిని కలిసి కాన్సెప్ట్ వివరించాం. గత ఏపీ ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ కాన్సెప్ట్‌ని అడాప్ట్ చేసుకుని బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకు వర్తింప చేసింది. – సుష్మ, మొబైల్ షీ టాయిలెట్స్ ఫౌండర్ -
ఓఐసీ సదస్సులో తొలిసారి భారత గళం
-
సరికొత్తగా...
భరద్వాజ్ బంకుపల్లి, నవీన్ బాబు, విశాల్ కురడా, స్వాతి భీమిరెడ్డి, సాహితి దాసరి, సుష్మ, జెస్సికా, మెర్సీ దాయం ముఖ్య తారలుగా శ్రీకరబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్యామల గణేష్ సమర్పణలో దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్నారు. వరంగల్ భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో చిత్రీకరించిన తొలి సీన్‌కి ఎమ్మెల్యే కొండా సురేఖ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు క్లాప్ ఇచ్చారు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ అధినేత సంపత్‌రావు గౌరవ దర్శకత్వం వహించారు. మంచి కథతో రూపొందుతోన్న ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని అతిథులు పేర్కొన్నారు. ఇటీవల వస్తున్న చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథతో ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుల్లపల్లి శ్రీనివాస్. -
కలకలం రేపుతున్న లేడీ డాక్టర్ ఆత్మహత్య!
విజయవాడ: ఓ మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన విజయవాడ అశోక్‌నగర్‌లో వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న లేడీ డాక్టర్ సుష్మ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త సునీల్ వేధింపుల వల్లే సుష్మ మృతి చెందిందని, భర్త హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు వైద్యురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. వీరికి ఏడేళ్ల పాప ఉంది. ఈ ఘటనపై సుష్మ కుటుంబీకులు తరఫు న్యాయవాది మాట్లాడుతూ... ప్రాథమిక ఆధారాల ప్రకారం సుష్మది కచ్చితంగా హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మృతురాలి ఒంటిమీద కూడా గాయాలు ఉన్నాయని తెలిపారు. మృతురాలి తల్లి గీత మాట్లాడుతూ... తన కుమార్తె చనిపోయేంత పిరికిది కాదని అన్నారు. భర్త వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తూ సుష్మ మృతదేహంతో ఆందోళనకు దిగారు. సునీల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజులు గడిచినా కుటుంబసభ్యులు సుష్మ అంత్యక్రియలు చేయలేదు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడతామని పోలీసులు తెలిపారు. -
కువైట్‌లో కత్తిపోటుకు గురైన భారత నర్సు
కువైట్: కువైట్‌లో భారత నర్సు కత్తిపోటుకు గురైంది. ఆమెను నగరంలోని ఫార్వానియా ఆసుపత్రికి తరలించారు. కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన గోపికా షాజీకుమార్ అక్కడే అల్ జహ్రా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమెపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కువైట్‌లోని భారత ఎంబసీని ఆదేశించినని, కువైట్‌లో భారతీయుల రక్షణ కోసం భారత ఎంబసీ కృషి చేస్తుందని సుష్మా ట్వీట్ చేశారు. గత వారం ఓమన్‌లో డెంటల్ క్లినిక్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన షెబిన్ జీవా (31) హత్యకు గురైంది. -
గ్యాంగ్‌స్టర్ భార్య దారుణహత్య
గుర్గావ్: దేశరాజధాని ఢిల్లీ శివారున ఉన్న హరియాణాలోని గుర్గావ్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు గ్యాంగ్‌స్టర్ భార్యను కాల్చిచంపారు. గ్యాంగ్‌స్టర్ అశోక్ రతి భార్య సుష్మా (28) తన ఎనిమిదేళ్ల కూతురును స్కూలులో వదిలిపెట్టి ఇంటికి తిరిగివస్తుండగా ఆమెపై కాల్పులు జరిపారు. ఇద్దరు లేదా ముగ్గురు దుండగులు ఈ దాడిలో పాల్గొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుష్మా శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయని, ఆమె అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు తెలిపారు. అశోక్ రతి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. గుర్గావ్ పక్కన అలీపూర్ గ్రామంలో సుష్మా ఉంటోంది. తన భర్త నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరు నెలల క్రితం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశోక్ గతంలో అత్త, బావమరిదిని హత్య చేశాడని, ఈ కేసులో అతనికి జీవిత కారాగార శిక్ష పడినట్టు పోలీసులు చెప్పారు. దోపిడీ, హత్యాయత్నం, హత్య వంటి 26 కేసులు అతనిపై నమోదయ్యాయి. -
సుష్మాస్వరాజ్ పొరపాటు చేశారు!
న్యూఢిల్లీః ప్రసిద్ధ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అద్భుత రచనలు చేసిన మహాశ్వేతాదేవి సామాజిక న్యాయంకోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఇతర మంత్రుల మధ్య ఎంతో పేరుగాంచిన ఆమె... రచయిత మహా శ్వేతాదేవి మరణంపై సంతాపం ప్రకటించడంలో మాత్రం తప్పిదం చేశారు. ఎప్పుడూ ఎంతో ఆచితూచి మాట్లాడే సుష్మా... శ్వేతాదేవి రచనలను కోట్ చేయడంలో మాత్రం అనుకోని పొరపాటు చేశారు. విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అనుకోని తప్పిదం చేశారు. ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల సంతాపం తెలపడంలో భాగంగా ఆమె రచించని రెండు పుస్తకాలను కోడ్ చేసి, తప్పులో కాలేశారు. ఆశాపూర్ణా దేవి రాసిన 'ప్రథమ్ ప్రతిశ్రుతి', 'బకుల్ కథ' పుస్తకాలను.. మహాశ్వేతాదేవి రాసినట్లుగా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మహాశ్వేతాదేవి రచరనలు తనపై శాశ్వత ముద్రను వేశాయంటూ సుష్మాస్వరాజ్... శ్వేతా రచించని రెండు పుస్తకాల పేర్లను తన ట్విట్టర్ సందేశంలో రాశారు. అయితే విషయాన్ని ట్విట్టర్ వినియోగదారులు కొందరు చూసి.. తెలిపే వరకూ కూడా ఆమె గమనించలేదు. అనంతరం తప్పును తెలుసుకొన్న సుష్మా.. వెంటనే పుస్తకాల పేర్లను పేర్కొన్న రెండో ట్వీట్ ను డిలీట్ చేశారు. అయితే సుష్మా తన పొరపాటు మెసేజ్ ను వెంటనే డిలీట్ చేసినా.. ప్రజలు మాత్రం ఆమెను వదల్లేదు. ఆమె డిలీట్ చేసిన మెసేజ్ ఫొటోలను పోస్ట్ చేసి, ఇది ఆమె పట్టని తనానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. అజ్ఞానానికి నిదర్శనమని అభివర్ణించారు. సామాజసేవకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాశ్వేతాదేవి మరణం విషయం తెలిసిన వెంటనే గొప్ప రచయితను కోల్పోయామంటూ ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా.. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం తెలిపిన విషయం విదితమే. -
సుష్మ కిడ్నాప్ కథ సుఖాంతం
శ్రీకాళహస్తి: తొమ్మిదో తరగతి విద్యార్థిని సుష్మ కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. శ్రీకాళహస్తిలోని తెలుగుగంగ కాలనీలో మూడు రోజుల క్రితం సుష్మ అపహరణకు గురైన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఆమెను ఆర్టీసీ బస్టాండ్ వద్ద వదిలి వెళ్లారు. స్థానికులు సుష్మను టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు కిడ్నాప్ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా సుష్మ ఆచూకీ కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
నేపాల్ లో సమావేశమైన సుష్మా, అజీజ్
పొఖారా : నేపాల్ లో జరుగుతున్న సార్క్ సమావేశాలకు హాజరైన భారత విదేశ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం పాకిస్తాన్ విదేశ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో ఈ ఏడాది నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్రమోదీకి పాక్ ప్రభుత్వం ఆహ్వానించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పంపిన ఆహ్వాన ప్రతిని సర్తాజ్ అజీజ్ సుష్మా స్వరాజ్‌కు అందచేశారు. అలాగే ఈ నెల 31న అమెరికాలో ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యే అవకాశముందని సర్తాజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు సహా ద్వైపాక్షిక అంశాలపై సుష్మాస్వరాజ్ సర్తాజ్ అజీజ్ చర్చలు జరిపారు. ముఖ్యంగా పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తును వేగవంతం చేయాలని భారత్ గట్టిగా సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త విచారణ బృందం ఈ నెల 27న భారత్ రానుంది. 28 ఉదయం పఠాన్ కోట్కు వెళ్లి వివరాలు సేకరించనుంది. ఈ ఏడాది జనవరి 2న పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగి ఏడుగురు భారత భద్రతాసిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పాకిస్తాన్, భారత దేశాల నాయకుల మధ్య జరిగిన మొదటి అధికారిక సమావేశం ఇది. గతేడాది డిసెంబర్ తర్వాత ఇస్లామాబాద్, న్యూ ఢిల్లీ మధ్య సమగ్ర ద్వైపాక్షిక సంబంధాలపై జనవరిలో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు పఠాన్ కోట్ దాడుల కారణంగా వాయిదా పడ్డాయి. -
నేపాల్ చేరుకున్న సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ : సార్క్ సమావేశాల కోసం భారత విదేశ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం నేపాల్ చేరుకున్నారు. రేపటి నుంచి నేపాల్ లో జరగనున్న విదేశాంగ మంత్రుల స్థాయి సార్క్ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. సుష్మా నేపాల్ లోని పొఖారా చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఓ ట్వీట్ లో తెలిపారు. మరోవైపు సార్క్ సమావేశాల సందర్భంలో పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తో సుష్మాస్వరాజ్ సమావేశం అయ్యే అవకాశం ఉందని పాకిస్తానీ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి కారణంగా వాయిదాపడిన ఇండియా, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలపై సుష్మా, అజీజ్ లు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సుష్మ, వెంకయ్యలకు కారు కూడా లేదు
కేంద్ర మంత్రుల ఆస్తుల ప్రకటన * పీఎంవో వెబ్సైట్లో వివరాలు * రియల్ ఎస్టేట్ రంగంలోనే ఎక్కువ మందికి ఆస్తులు న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) వెల్లడించింది. దీని ప్రకారం ఎక్కువ మంది మంత్రులు రియల్ ఎస్టేట్ రంగంలోనే తమ ఆస్తులున్నట్లు తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వీరి ఆస్తుల వివరాలను పీఎంవో తన వెబ్సైట్లో ఉంచింది. 2016 జనవరి 30 నాటికి ఈ వివరాలను అప్డేట్ చేసినట్టు వెల్లడించింది. కీలక మంత్రులైన రాజ్‌నాథ్‌సింగ్, గడ్కరీ, పరీకర్, తదితరుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. వెంకయ్యనాయుడు: ఈయనకు స్థిర, చరాస్తులూ లేవు. రూ. 38వేల నగదు, రూ. 28.07 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. భార్యపేరుతో రూ.8కోట్ల ఆస్తులు ఉన్నాయి. భార్యకు రూ.26 లక్షలు అప్పుగా ఇచ్చారు. సుష్మాస్వరాజ్: ఈమె స్థిర, చరాస్తులు, ఆభరణాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల మొత్తం విలువ రూ. 5.35 కోట్లు చేతిలోని డబ్బు రూ. 22,616. అశోక్ గజపతిరాజు: సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు(5.06 కోట్లు), ఎఫ్డీలు(1.51 కోట్లు), షేర్లు, బాండ్లు (1.12 కోట్లు), సాగు భూమి(62.06 సెంట్లు) వాణిజ్య భూమి (1.20 సెంట్లు), ఇల్లు(రూ.25లక్షలు). జేపీ నడ్డా: సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో రూ. 15లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్లు(10 లక్షలు), బీమా పాలసీలు (15లక్షలు)తోపాటు 1.45 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. రవిశంకర్ ప్రసాద్: బ్యాంకు డిపాజిట్లు (9.25కోట్లు), బాండ్లు, డిబెంచర్లు తదితరాలు కలుపుకుని రూ. 10కోట్లున్నాయి. రామ్‌విలాస్ పాశ్వాన్: స్థిర, చరాస్తులు, బ్యాంకు బాలెన్సు కలుపుకుని 35 లక్షలుండగా.. భార్య పేరుతో 34 లక్షల ఆస్తులతోపాటు ఓ పెట్రోల్ బంక్ ఉంది. ఉమాభారతి: రూ. 4.75 కోట్ల ఆస్తులు సదానంద గౌడ: స్థిర,చరాస్తులు, బాండ్లు, బ్యాంకు బాలెన్సు అన్నీకలిపి రూ. 14 కోట్లు. సురేశ్‌ప్రభు: కోటిన్నర వరకు ఆస్తులున్నాయి. స్మృతిఇరానీ: 1.75 కోట్ల విలువైన స్థిరాస్తులు, బ్యాంకకులో రూ.35లక్షలు. మహేశ్‌శర్మ: ఐదు ఇళు ్ల(రూ. 19.19 కోట్లు), రూ. 7.5 కోట్ల సేవింగ్స్, డిపాజిట్లు. జితేందర్‌సింగ్: జమ్మూలో ఇల్లు(రూ. 1.97 కోట్లు), వ్యవసాయ భూమి(రూ. 33 లక్షలు) రాధామోహన్‌సింగ్: రూ. 62 లక్షల స్థిరాస్తి. థావర్‌చంద్ గెహ్లాట్: స్థిర, చరాస్తుల విలువ రెండున్నర కోట్లు. బీరేంద్రసింగ్: స్థిర, చరాస్తులు, బ్యాంకు, డిపాజిట్ల మొత్తం విలువ రూ.2.6 కోట్లు. హర్సిమ్రత్ కౌర్ బాదల్: స్థిర, చరాస్తులతోపాటు బ్యాంకు అకౌంట్లు, బంగారు ఆభరణాలు కలిపి రూ. 12 కోట్లున్నాయి. -
మహిళా వ్యాపారవేత్తలకు ప్రత్యేక 'మార్కెట్'..!
మహిళా వ్యాపారవేత్తలకు విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ హామీల వర్షం కురిపించారు. క్యాప్టివ్ మార్కెట్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. రెండు రోజుల ఇంటరాక్టివ్ టూర్ సందర్భంగా ముంబైలోని మహిళా స్వయం సహాయక బృందాలతో మాట్లాడిన ఆమె... కేంద్రంలోని మోదీ సర్కారు ఇప్పటికే సాధించిన విజయాలను వివరించారు. మహిళాభివృద్ధకి తమ ప్రభుత్వం కృషిచేస్తోందని సుష్మా స్వరాజ్ అన్నారు. మహిళలు తమ ఉత్పత్తులను ఒకే దుకాణంలో అమ్మడం వల్ల తగినంత ఆదాయం పొందలేకపోతున్నారని, అందుకే మహిళల కోసం ప్రత్యేక క్యాప్టివ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయడంవల్ల అమ్మకాలు సులభంగా జరిపేందుకు అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 'జన్ ధన్ యోజన' పథకం అంతర్జాతీయ వేదికపై అత్యంత గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు. విద్యా సంస్థలు, మరమగ్గాలు, చిన్నతరహా పరిశ్రమల నుంచి వచ్చిన ప్రతినిధులతో సుష్మా మాట్టాడారు. ఎన్డీయే ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొందని, ఉక్రెయిన్, ఇరాక్, లిబియా, యెమెన్ వంటి దేశాలనుంచి భారతీయులను తమ ప్రభుత్వం తరలించిందని సుష్మా చెప్పారు. యెమన్ నుంచి భారతీయులను రప్పించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అందుకు 28 దేశాలను అభ్యర్థించామని తెలిపారు. ఒకప్పుడు మోదీకి వీసా ఇవ్వడానికి అభ్యంతరం చెప్పిన అమెరికాలో.. ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతులు చాచి ఆయనను ఆహ్వానించడం ఎంతో విశేషమని చెప్పారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై దాడి వెనుక పోలీసులు?
-
దాడి వెనుక ఆ ఇద్దరు ఎస్ఐలు?
అనంతపురం శివార్లలోని పాపంపేటలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సహా ఆమె తల్లిదండ్రులపై జరిగిన దాడి వెనుక ఇద్దరు ఎస్ఐల పాత్ర ఉందా? అంటే సంఘటనా స్థలిని పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. ఈ నెల 12న రాత్రి పాపంపేటలో జరిగిన ఘటనకు స్థానిక రెండో పట్టణ పోలీసుస్టేషన్లో పని చేస్తున్న ఇద్దరు ఎస్ఐలే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. పాపంపేటలోని ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో రాజేశ్వరి, చంద్రన్న దంపతులు నివాసముంటున్నారు. వారి కుమార్తె సుష్మా బెంగళూరులో నోబుల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇంజినీర్‌గా పని చేస్తోంది. సుష్మా కుటుంబానికి, పక్కింటి వారికి ఓ ప్రహారీ నిర్మాణ విషయంలో ఏడాదిన్నర నుంచి వివాదం ఉంది. ఈ విషయంపై బాధితులు చంద్రన్న, రాజేశ్వరి, సుష్మా స్థానిక టూ టౌన్ సీఐ శుభకుమార్కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు..కొంతమందిని సీఐ అదుపులోకి తీసుకుని విచారణ చేసి వదిలేశారు. వెంటనే రంగంలోకి ది గిన ఎస్ఐలు కొంతమందిని ఉసిగొల్పి సు ష్మాపై దాడి చేయించినట్లు తె లిసింది. అంతటితో ఆగక ఆమెను వివస్త్రను చేసి అవమానించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కూడా రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఎస్ఐపై అనేక ఆరోపణలు వచ్చినా, అతనిపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులు వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారు... రెండో పట్టణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు రాజేశ్వరి, సుష్మా గురువారం విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి పక్కనున్న నారాయణమ్మ, శ్రీకాంత్, హరి, శివప్రసాద్, నలిని, తదితరులు తమ కుమార్తెను వివస్త్రను చేసి అవమానిస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాజేశ్వరి కన్నీరుమున్నీరయ్యారు. ఎస్ఐలతో పాటు సీఐ కలసి తమ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. -
మోదీకి నక్లెస్..సుష్మాకు టై
-
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం
-
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం
న్యూఢిల్లీ: లలిత్ గేట్ వ్యవహారంపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గురువారం లోక్‌సభలో ఆవేశంగా ప్రసంగించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆమె కొట్టి పారేశారు. లలిత్ మెదీ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లలిత్ మోదీ కోసం తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. సిఫార్సు చేసిన ఆధారాటు ఉంటే బయటపెట్టాలని, తనపై ఆరోపణలకు సంబంధించి చర్చ జరగాలన్నారు. లలిత్ గేట్‌పై కాంగ్రెస్ తో చర్చకు తాను సిధ్దమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో చర్చకు తాను సిద్ధమే అని, వారి ప్రశ్నలకు సమాధానం ఉందని తెలిపారు. రెండు నెలలుగా తనపై మీడియాపై దుష్ప్రచారం జరుగుతుందని సుష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను తన దగ్గర ధీటైన సమాధానం ఉందని పేర్కొన్నారు. తన స్థానంలో సోనియా గాంధీ ఉంటే ఏం చేసేవారని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. లలిత్ మోదీకి సంబంధించిన అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వానికే వదిలేశానని, సిఫార్స్ చేసినట్లు ఉన్న మెయిల్, లేఖ ఉంటే చూపించాలని సుష్మా స్వరాజ్ ప్రశ్నల వర్షం కురిపించారు. -
వాళ్లేం తప్పు చేయలేదు!
సుష్మ, రాజే, చౌహాన్‌కు దన్నుగా నిలిచిన బీజేపీ న్యూఢిల్లీ: వ్యాపమ్, లలిత్‌గేట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు దన్నుగా నిలవాలని బీజేపీ నిర్ణయించింది. వారు ఎలాంటి తప్పు చేయలేదని, రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. బుధవారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సుమారు 45 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేంద్రం చేపడుతున్న మంచి పనులతో పార్టీ ఎంపీలు సగర్వంగా తలెత్తుకోవాలన్నారు. పేదల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సిందిగా సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిజాయితీతో చక్కగా పనిచేస్తున్నారని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కితాబిచ్చారు. లలిత్‌కు ఎలాంటి సాయం చేయలేదు లలిత్ మోదీకి ఎలాంటి సాయం చేయలేదని సుష్మ ఎంపీలకు వివరించినట్లు భేటీ అనంతరం పార్టీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విలేకరులకు తెలిపారు. ‘నేను ఆయనకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూర్చలేదు. భారత్ నుంచి పారిపోయేందుకు సాయపడలేదు. ఆయనకు ట్రావెల్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఏనాడూ అడగలేదు. భారత్‌తో సంబంధాలపై ప్రభావం చూపకుండా లలిత్ అంశంపై నిర్ణయం తీసుకోవాలని మాత్రమే బ్రిటిష్ అధికారులకు చెప్పాను. కాంగ్రెస్ పార్టీ గోరంతను కొండంత చూపేందుకు యత్నిస్తోంది’ అని సుష్మ అన్నట్లు నఖ్వీ పేర్కొన్నారు. -
సుష్మా ఇంటిని ముట్టడించేందుకు యత్నం
న్యూఢిల్లీ: మాజీ ఐపిఎల్ చీఫ్ లలిత్ మెదీ వీసా వివాదంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శనివారం హస్తినలో ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని సుష్మా ఇంటిని ముట్టడిం చేందుకు ఆప్ శ్రేణులు ప్రయత్నించాయి. భారీ ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు సుష్మా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత ఆందోళనల నేపథ్యంలో సుష్మా ఇంటి వద్ద బందోబస్తు పెంచిన పోలీసులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను తోసుకొని సుష్మా ఇంటి ముట్టడికి ఆప్ కార్యకర్తలు ప్రయత్నించారు. మంత్రి పదవికి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. లలిత్ మోదీ వీసా వ్యవహారంలో చిక్కుల్లో పడిన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మానవతా దృక్పథంతోనే ఈ సాయం చేశానని వివరణ ఇచ్చినా.. ఈ వ్యవహారంలో ఆమెకు లబ్ధి చేకూరిందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మరోవైపు సుష్మా స్వరాజ్ న్యూయార్క్ బయల్దేరి వెళ్లిపోయారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఆమె న్యూయార్క్ వెళ్లారు. లలిత్ మోదీ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో ఆమె న్యూయార్క్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కొట్టుకున్న కౌన్సిలర్లు
కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ సమావేశం రణరంగంగా మారిం ది. కౌన్సిలర్లు పరస్పరం దాడులు చేసుకోవడంతో నాలుగు గం టలపాటు ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు లాఠీచార్జి చేసి పరి స్థితిని అదుపులోకి తెచ్చారు. మున్సిపల్ ప్యానల్, కాంట్రాక్టు కమిటీ ఎన్నికల కోసం శని వారం చైర్పర్సన్ సుష్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రొటోకాల్‌ను పాటించడం లేదంటూ ముందుగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు కమిషనర్ తో వాగ్వాదానికి దిగారు.అదే సమయంలో సమావేశ మందిరంలోకి అడుగుపెట్టిన వైస్ చైర్మన్ మసూద్ అలీ చైర్పర్సన్ పోడియం పక్కన కుర్చీ వేయించుకు ని కూర్చున్నారు. ఇందుకు టీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ అధికారులపై విమర్శలకు దిగారు. పోడియం ముందుకు వచ్చి ఆందోళన చేశా రు. దీంతో చైర్పర్సన్ సమావేశాన్ని అరగంటపాటు వాయిదా వేసి బయటకు వెళ్లిపోయారు. కుర్చీలు విసురుకుని ఇదే తరుణంలో వైస్ చైర్మన్, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీ లు విసురుకున్నారు. కొట్టుకున్నారు. దీంతో టీఆర్ఎస్ కౌన్సిలర్ భూంరెడ్డి పెదవులకు గాయం కావడం తో వైస్ చైర్మన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ కౌన్సిలర్లు కార్యాలయం ఎదుట బైఠాయిం చారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని వైస్‌చైర్మన్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. వైస్ చైర్మన్ మున్సిపల్ అతిథి గృహంలోకి వెళ్లడంతో టీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులను తోసివేసి తలుపును ధ్వంసం చేసి బయటకు పడేశారు. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన పోలీసులు టీఆర్ఎస్ నేతలను పక్కకు తోసి వేశారు. వైస్ చైర్మన్‌ను బయటకు తీసుకువచ్చి కారులో ఎక్కించేందుకు యత్నించారు. ఇదే సమయంలో ఇరు పార్టీలవారు పరస్పరం దాడికి దిగారు. ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. వారిని నిలువరించినా ప్రయోజనం లేకపోవడంతో వైస్ చైర్మన్‌ను తిరిగి అతిథి గృహంలోకి తీసుకెళ్లారు. లా ఠీచార్జి చేసి గొడవకు దిగినవారిని తరిమికొట్టి, వైస్‌చైర్మన్‌ను, ఆయన కుమారుడిని బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించి ఠాణాకు తరలించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆందోళన విరమించారు. కేసులు నమోదు మున్సిపల్ సమావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్‌చైర్మన్ మసూద్, కౌన్సిలర్ జమీల్‌తో పాటు టీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు భూంరెడ్డి, సంగిమోహన్, ముప్పారపు ఆనంద్, కుంభాల రవి, అంజద్, మాసుల లక్ష్మీనారాయణలపై కేసులు నమోదు చేశా రు. ఇరు వర్గాలవారు పరస్పరం చేసుకున్న పిర్యాదు ల మేరకు కేసులు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. -
'మాయ' ఆడియో ఆవిష్కరణ
-
నాసా-స్పేస్ కాంటెస్ట్‌లో ప్రపంచ నం.1గా శ్రీచైతన్య
హైదరాబాద్: అమెరికా, నాసా (నేషనల్ స్పేస్ సొసైటీ)లు సంయుక్తంగా చేపట్టిన ప్రపంచ స్థాయి నాసా-స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ చరిత్రలో ఒకే సంవత్సరంలో అత్యధిక ప్రాజెక్టుల(13) విజేతగా శ్రీచైతన్య రికార్డు సృష్టించినట్టు శ్రీచైతన్య స్కూల్ డెరైక్టర్లు సీమ, సుష్మలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో-2, రెండో స్థానంలో-5, మూడో స్థానంలో-3, ఇతర స్థానాల్లో-3 ప్రాజెక్టులు తమ విద్యార్థులు కైవసం చేసుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రపంచంలో ఒకే విద్యాసంస్థ నుంచి అత్యధికంగా ఎంపికైన విద్యార్థుల సంఖ్య(55)లో గానీ, అత్యధిక విన్నింగ్ ప్రాజెక్టుల(13-62 శాతం) సంఖ్యలో గానీ తమ సంస్థ నంబర్-1గా నిలిచిందన్నారు. -
ప్రేమ పులకింతలు...
ప్రేమజల్లులో తడిసి ముద్దవ్వని వాడంటూ ఉండడు. అది పెళ్లికి ముందు అయినా సరే... తర్వాతైనా సరే. ప్రేమజల్లులో మాత్రం తడవడం తథ్యం. అలా ప్రేమ పలకరింపుతో పులకరించిన ఓ మధ్యతరగతి కుర్రాడి కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘నేనూ.. నా ప్రేమకథ’. శేఖర్, సుష్మా జంటగా నటిస్తున్నారు. వర్ధన్ దర్శకుడు. వర్మ, పనుకు రమేశ్‌బాబు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే మధ్య తరగతి కుర్రాడి ప్రేమకథ ఇది. కోపతాపాలు, ప్రేమ ముచ్చట్లతో సహజం, స్వచ్ఛంగా ఈ కథ సాగుతుంది. యువతరాన్ని ఆకట్టుకునే అంశాలన్నీ ఇందులో ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘ప్రేమలో వచ్చే పొరపొచ్చాలను హీరోహీరోయిన్లు ఎలా అధిగమించారు? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. మన పొరుగునే జరుగుతున్న కథలా అత్యంత సహజంగా ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు. హైదరాబాద్, గోవా, బ్యాంకాక్, శ్రీలంకల్లో ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించాం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డీటీఎస్ వర్క్ జరుగుతోంది. మే తొలివారంలో పాటల్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: నగేశ్ ఆచార్య, సంగీతం: చిన్ని చరణ్, మిథున్ ఎం.ఎస్, సమర్పణ: వింగ్ కమాండర్ కె.ఎస్.రావు, నిర్మాణం: దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్, శాస్తా మీడియా. -
సుష్మా వ్యాఖ్యలపై మండిపాటు
కాకినాడలో సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ఎంపీలు పదవులకు రాజీనామా చేయక పోవడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు జెడ్పీ సెంటర్లో గుంజీలు తీసి నిరసన తెలిపారు. సమైక్య ఉద్యమంపై బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేసి, అగ్రనేతల బొమ్మలకు పేడ, మట్టి పూశారు. కార్యాలయంలో ఉన్న బీజేపీ నాయకులు బయటకొచ్చి దుర్భాషలాడడంతో ఆగ్రహంతో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. సీఐ జి.దేవకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకొని జేఏసీ జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాథ్, ఉపాధ్యాయ జేఏసీ నేతలు కవిశేఖర్, ప్రదీప్‌కుమార్ సహా 100 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన అనంతరం సొంత పూచీ కత్తుపై విడిచిపెట్టారు. రాజానగరంలో మహిళలు సుష్మా స్వరాజ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకపోతే సీమాంధ్రలో తిరగనివ్వబోమంటూ అమలాపురంలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు.