
భరద్వాజ్ బంకుపల్లి, నవీన్ బాబు, విశాల్ కురడా, స్వాతి భీమిరెడ్డి, సాహితి దాసరి, సుష్మ, జెస్సికా, మెర్సీ దాయం ముఖ్య తారలుగా శ్రీకరబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్యామల గణేష్ సమర్పణలో దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్నారు. వరంగల్ భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో చిత్రీకరించిన తొలి సీన్‌కి ఎమ్మెల్యే కొండా సురేఖ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు క్లాప్ ఇచ్చారు. ఎన్‌ఎస్‌ఆర్ గ్రూప్ అధినేత సంపత్‌రావు గౌరవ దర్శకత్వం వహించారు. మంచి కథతో రూపొందుతోన్న ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని అతిథులు పేర్కొన్నారు. ఇటీవల వస్తున్న చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథతో ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుల్లపల్లి శ్రీనివాస్.
Comments
Please login to add a commentAdd a comment