తొమ్మిదో తరగతి విద్యార్థిని సుష్మ కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది.
శ్రీకాళహస్తి: తొమ్మిదో తరగతి విద్యార్థిని సుష్మ కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. శ్రీకాళహస్తిలోని తెలుగుగంగ కాలనీలో మూడు రోజుల క్రితం సుష్మ అపహరణకు గురైన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఆమెను ఆర్టీసీ బస్టాండ్ వద్ద వదిలి వెళ్లారు. స్థానికులు సుష్మను టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు కిడ్నాప్ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా సుష్మ ఆచూకీ కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.