రాజ్‌భవన్ సిబ్బందికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదేశం
మర్యాదపూర్వకంగా గవర్నర్‌ని కలిసిన మిసెస్ ఇండియా సుష్మా ముప్పిడి
లక్డీకాపూల్: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నింటికీ మిసెస్ ఇండియా 2024 ముప్పిడి సుష్మాను ఆహ్వానించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. తెలంగాణకు చెందిన మహిళ మిసెస్ ఇండియాగా ఎన్నిక కావడం రాష్ట్రం గర్వపడే విషయమన్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను రాజ్‌భవన్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లల తల్లి అయిన సుష్మా మిసెస్ ఇండియా టైటిల్ సాధించి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు.
భావోద్వేగానికి లోనైనా..
తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తనను ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ఆహా్వనించినప్పుడు ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు మిసెస్ ఇండియా సుష్మా తెలిపారు. గవర్నర్‌ను కలిసిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిసెస్ ఇండియా అవార్డును తాను ఉత్తమ సాంస్కృతిక దుస్తులతో పొందిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఫిబ్రవరిలో పారిస్‌లో జరిగే అంతర్జాతీయ మిసెస్ వరల్డ్ పోటీల్లో తాను పాల్గొంటున్నానని, తనకు సినీ స్టార్స్ సుమంత, ప్రియాంక చోప్రాలు రోల్డ్ మోడల్ అని సుష్మా పేర్కొన్నారు.
నేపథ్యం..
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సుష్మా చదువు పూర్తైన తర్వాత గుంటూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్‌గా కొంత కాలం పనిచేశారు. తెలంగాణకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ముప్పిడి వెంకట్ రెడ్డికి కోడలైన తర్వాత సుష్మా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కొంత కాలంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఆమె, ఆ రంగాన్ని వదిలి ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించారు. ఆ రంగంలో రాణిస్తూనే మిసెస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్‌లో కలంకారి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి: ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా?
Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!
Comments
Please login to add a commentAdd a comment