
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం
న్యూఢిల్లీ: లలిత్ గేట్ వ్యవహారంపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గురువారం లోక్సభలో ఆవేశంగా ప్రసంగించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆమె కొట్టి పారేశారు. లలిత్ మెదీ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లలిత్ మోదీ కోసం తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. సిఫార్సు చేసిన ఆధారాటు ఉంటే బయటపెట్టాలని, తనపై ఆరోపణలకు సంబంధించి చర్చ జరగాలన్నారు.
లలిత్ గేట్పై కాంగ్రెస్ తో చర్చకు తాను సిధ్దమని స్పష్టం చేశారు. కాంగ్రెస్తో చర్చకు తాను సిద్ధమే అని, వారి ప్రశ్నలకు సమాధానం ఉందని తెలిపారు. రెండు నెలలుగా తనపై మీడియాపై దుష్ప్రచారం జరుగుతుందని సుష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను తన దగ్గర ధీటైన సమాధానం ఉందని పేర్కొన్నారు. తన స్థానంలో సోనియా గాంధీ ఉంటే ఏం చేసేవారని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. లలిత్ మోదీకి సంబంధించిన అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వానికే వదిలేశానని, సిఫార్స్ చేసినట్లు ఉన్న మెయిల్, లేఖ ఉంటే చూపించాలని సుష్మా స్వరాజ్ ప్రశ్నల వర్షం కురిపించారు.