సుష్మ, వెంకయ్యలకు కారు కూడా లేదు | Real estate tops Union cabinet ministers’ asset chart, few invest in stocks | Sakshi
Sakshi News home page

సుష్మ, వెంకయ్యలకు కారు కూడా లేదు

Published Wed, Feb 3 2016 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

సుష్మ, వెంకయ్యలకు కారు కూడా లేదు

సుష్మ, వెంకయ్యలకు కారు కూడా లేదు

కేంద్ర మంత్రుల ఆస్తుల ప్రకటన
* పీఎంవో వెబ్‌సైట్‌లో వివరాలు
* రియల్ ఎస్టేట్ రంగంలోనే ఎక్కువ మందికి ఆస్తులు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) వెల్లడించింది. దీని ప్రకారం ఎక్కువ మంది మంత్రులు రియల్ ఎస్టేట్ రంగంలోనే తమ ఆస్తులున్నట్లు తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వీరి ఆస్తుల వివరాలను పీఎంవో తన వెబ్‌సైట్‌లో ఉంచింది. 2016 జనవరి 30 నాటికి ఈ వివరాలను అప్‌డేట్ చేసినట్టు వెల్లడించింది.  కీలక మంత్రులైన రాజ్‌నాథ్‌సింగ్, గడ్కరీ, పరీకర్,  తదితరుల వివరాలను ప్రకటించాల్సి ఉంది.
 
వెంకయ్యనాయుడు: ఈయనకు స్థిర, చరాస్తులూ లేవు. రూ. 38వేల  నగదు, రూ. 28.07 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. భార్యపేరుతో రూ.8కోట్ల ఆస్తులు ఉన్నాయి. భార్యకు  రూ.26 లక్షలు అప్పుగా ఇచ్చారు.

సుష్మాస్వరాజ్: ఈమె స్థిర, చరాస్తులు, ఆభరణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తం విలువ రూ. 5.35 కోట్లు  చేతిలోని డబ్బు రూ. 22,616.
 
అశోక్ గజపతిరాజు: సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు(5.06 కోట్లు), ఎఫ్‌డీలు(1.51 కోట్లు), షేర్లు, బాండ్లు (1.12 కోట్లు), సాగు భూమి(62.06 సెంట్లు) వాణిజ్య భూమి (1.20 సెంట్లు), ఇల్లు(రూ.25లక్షలు).

జేపీ నడ్డా: సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో రూ. 15లక్షలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు(10 లక్షలు), బీమా పాలసీలు (15లక్షలు)తోపాటు 1.45 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి.
 
రవిశంకర్ ప్రసాద్: బ్యాంకు డిపాజిట్లు (9.25కోట్లు), బాండ్లు, డిబెంచర్లు తదితరాలు కలుపుకుని రూ. 10కోట్లున్నాయి.
 
రామ్‌విలాస్ పాశ్వాన్: స్థిర, చరాస్తులు, బ్యాంకు బాలెన్సు కలుపుకుని 35 లక్షలుండగా.. భార్య పేరుతో 34 లక్షల ఆస్తులతోపాటు ఓ పెట్రోల్ బంక్ ఉంది.
 
ఉమాభారతి:  రూ. 4.75 కోట్ల ఆస్తులు
 సదానంద గౌడ: స్థిర,చరాస్తులు, బాండ్లు, బ్యాంకు బాలెన్సు అన్నీకలిపి రూ. 14 కోట్లు.
 
సురేశ్‌ప్రభు: కోటిన్నర వరకు ఆస్తులున్నాయి.
 
స్మృతిఇరానీ: 1.75 కోట్ల విలువైన స్థిరాస్తులు, బ్యాంకకులో రూ.35లక్షలు.
 
మహేశ్‌శర్మ: ఐదు ఇళు ్ల(రూ. 19.19 కోట్లు), రూ. 7.5 కోట్ల సేవింగ్స్, డిపాజిట్లు.
 
జితేందర్‌సింగ్: జమ్మూలో ఇల్లు(రూ. 1.97 కోట్లు), వ్యవసాయ భూమి(రూ. 33 లక్షలు)
 
రాధామోహన్‌సింగ్: రూ. 62 లక్షల స్థిరాస్తి.
 
థావర్‌చంద్ గెహ్లాట్:
స్థిర, చరాస్తుల విలువ రెండున్నర కోట్లు.
 
బీరేంద్రసింగ్:  స్థిర, చరాస్తులు, బ్యాంకు, డిపాజిట్ల మొత్తం విలువ రూ.2.6 కోట్లు.
 
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్: స్థిర, చరాస్తులతోపాటు బ్యాంకు అకౌంట్లు, బంగారు ఆభరణాలు కలిపి రూ. 12 కోట్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement