సభలో సుష్మాను గుర్తు చేసిన బన్సూరీ | bansuri swarajs parliament speech in lok sabha | Sakshi
Sakshi News home page

సభలో సుష్మాను గుర్తు చేసిన బన్సూరీ

Published Mon, Jul 1 2024 1:53 PM | Last Updated on Mon, Jul 1 2024 3:49 PM

bansuri swarajs parliament speech in lok sabha

న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి గెలుపొంది, పార్లమెంట్‌లో కాలుమోపిన బన్సూరీ స్వరాజ్ తన తల్లి, బీజేపీ సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌ను గుర్తుకు తెచ్చారు. తన తల్లి మాదిరిగానే సంస్కృతంలో పార్లమెంట్ సభ్యత్వం తీసుకున్న ఆమె సుష్మా జ్ఞాపకాలను అందరికీ గుర్తు చేశారు.

తాజాగా లోక్‌సభలో ఆమె ప్రసంగిస్తున్నప్పుడు అక్కడున్నవారికి సుష్మా స్వరాజ్ శైలి కనిపించింది. బన్సూరీ తన తల్లి సుష్మా స్వరాజ్ మాదిరిగానే తన అభిప్రాయాలను సభలో బలంగా వినిపించారు. ఆ సమయంలో ఆమె హావభావాలు తల్లి సుష్మ మాదిరిగానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

బన్సూరీ తన తల్లి సుష్మా స్వరాజ్  మాదిరిగానే సభలో ప్రసంగిస్తున్నప్పుడు తన వేలు పైకెత్తి సమస్యలపై ఘాటుగా తన స్పందనను తెలియజేశారు. సోమవారం సభలో ఆమె తీరుతెన్నులు సరిగ్గా సుష్మా స్వరాజ్‌ను పోలివున్నాయని సీనియర్‌ నేతలు అంటున్నారు. సుష్మా స్వరాజ్ తీరులోనే బన్సూరీ.. గౌరవనీయ స్పీకర్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లలో తొలిసారిగా  మాటలు, చేతలు ఒకటిగా ఉండే ప్రభుత్వం వచ్చిందని ఆమె అ‍న్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement