Swaraj
-
సభలో సుష్మాను గుర్తు చేసిన బన్సూరీ
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి గెలుపొంది, పార్లమెంట్లో కాలుమోపిన బన్సూరీ స్వరాజ్ తన తల్లి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను గుర్తుకు తెచ్చారు. తన తల్లి మాదిరిగానే సంస్కృతంలో పార్లమెంట్ సభ్యత్వం తీసుకున్న ఆమె సుష్మా జ్ఞాపకాలను అందరికీ గుర్తు చేశారు.తాజాగా లోక్‌సభలో ఆమె ప్రసంగిస్తున్నప్పుడు అక్కడున్నవారికి సుష్మా స్వరాజ్ శైలి కనిపించింది. బన్సూరీ తన తల్లి సుష్మా స్వరాజ్ మాదిరిగానే తన అభిప్రాయాలను సభలో బలంగా వినిపించారు. ఆ సమయంలో ఆమె హావభావాలు తల్లి సుష్మ మాదిరిగానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.బన్సూరీ తన తల్లి సుష్మా స్వరాజ్ మాదిరిగానే సభలో ప్రసంగిస్తున్నప్పుడు తన వేలు పైకెత్తి సమస్యలపై ఘాటుగా తన స్పందనను తెలియజేశారు. సోమవారం సభలో ఆమె తీరుతెన్నులు సరిగ్గా సుష్మా స్వరాజ్‌ను పోలివున్నాయని సీనియర్ నేతలు అంటున్నారు. సుష్మా స్వరాజ్ తీరులోనే బన్సూరీ.. గౌరవనీయ స్పీకర్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లలో తొలిసారిగా మాటలు, చేతలు ఒకటిగా ఉండే ప్రభుత్వం వచ్చిందని ఆమె అన్నారు. अध्यक्ष जी.... जब बांसुरी स्वराज ने मां सुषमा स्टाइल में दिया लोकसभा में भाषण, देखिए#loksabha | #bansuriswaraj pic.twitter.com/D993ySEFIg— NDTV India (@ndtvindia) July 1, 2024 -
సుష్మాస్వరాజ్ పొరపాటు చేశారు!
న్యూఢిల్లీః ప్రసిద్ధ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అద్భుత రచనలు చేసిన మహాశ్వేతాదేవి సామాజిక న్యాయంకోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఇతర మంత్రుల మధ్య ఎంతో పేరుగాంచిన ఆమె... రచయిత మహా శ్వేతాదేవి మరణంపై సంతాపం ప్రకటించడంలో మాత్రం తప్పిదం చేశారు. ఎప్పుడూ ఎంతో ఆచితూచి మాట్లాడే సుష్మా... శ్వేతాదేవి రచనలను కోట్ చేయడంలో మాత్రం అనుకోని పొరపాటు చేశారు. విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అనుకోని తప్పిదం చేశారు. ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల సంతాపం తెలపడంలో భాగంగా ఆమె రచించని రెండు పుస్తకాలను కోడ్ చేసి, తప్పులో కాలేశారు. ఆశాపూర్ణా దేవి రాసిన 'ప్రథమ్ ప్రతిశ్రుతి', 'బకుల్ కథ' పుస్తకాలను.. మహాశ్వేతాదేవి రాసినట్లుగా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మహాశ్వేతాదేవి రచరనలు తనపై శాశ్వత ముద్రను వేశాయంటూ సుష్మాస్వరాజ్... శ్వేతా రచించని రెండు పుస్తకాల పేర్లను తన ట్విట్టర్ సందేశంలో రాశారు. అయితే విషయాన్ని ట్విట్టర్ వినియోగదారులు కొందరు చూసి.. తెలిపే వరకూ కూడా ఆమె గమనించలేదు. అనంతరం తప్పును తెలుసుకొన్న సుష్మా.. వెంటనే పుస్తకాల పేర్లను పేర్కొన్న రెండో ట్వీట్ ను డిలీట్ చేశారు. అయితే సుష్మా తన పొరపాటు మెసేజ్ ను వెంటనే డిలీట్ చేసినా.. ప్రజలు మాత్రం ఆమెను వదల్లేదు. ఆమె డిలీట్ చేసిన మెసేజ్ ఫొటోలను పోస్ట్ చేసి, ఇది ఆమె పట్టని తనానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. అజ్ఞానానికి నిదర్శనమని అభివర్ణించారు. సామాజసేవకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాశ్వేతాదేవి మరణం విషయం తెలిసిన వెంటనే గొప్ప రచయితను కోల్పోయామంటూ ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా.. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం తెలిపిన విషయం విదితమే. -
ఎస్సీ వర్గీకరణ హామీని విస్మరిస్తారా?
- కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌పై మండిపడ్డ ఎమ్మార్పీఎస్ - జంతర్‌మంతర్ వద్ద రెండోరోజుకు చేరుకున్న నిరసనలు సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన నిరసన బుధవారం రెండో రోజుకు చేరుకుంది. మాదిగ న్యాయవాదులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2012లో వర్గీకర ణ కోసం మాదిగ లాయర్లు చేపట్టిన దీక్షలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మాస్వరాజ్ పాల్గొని మద్దతిచ్చిన విషయాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాదిగ లాయర్ల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బైరపాక దయాకర్ గుర్తు చేశారు. నాడు వర్గీకరణకు హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి వచ్చాక విస్మరించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ చేయించి వర్గీకరణ సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రే యకు కృష్ణమాదిగ వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 25 రోజులపాటు కొనసాగనున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరిని మందకృష్ణ ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పంపిణీ జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందని సీపీఐ ఎంపీ డి.రాజా అభిప్రాయపడ్డారు. -
యూపీఏ పాలనలో దేశం దివాళా
కేంద్ర మంత్రి సిద్ధేశ్వర్ దావణగెరె : పదేళ్ల యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, దీంతో పున శ్చేతనం చేసేందుకు పలు కఠిన చర్యలు తీసుకోవడం అనివార్యమైందని పౌర విమాన యాన శాఖ సహాయ మంత్రి జీఎం.సిద్ధేశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన నగరంలో జన సంపర్క కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైలు చార్జీల పెంపు ప్రతిపాదన గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారే చేపట్టిందని, దాన్ని ఇప్పుడు అమలు చేశామన్నారు. రైల్వే ప్రయాణ ధరల పెంపు అనివార్యమైందన్నారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం, భద్రత, సౌకర్యాల కల్పన కోసం ఈ ధరల పెంపుదల అనివార్యమైందన్నారు. దేశ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ రైతులకు మద్దతు ధరలు, ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. హరిహర-బెంగళూరు మధ్య ఇంటర్ సిటీ రైలు సౌకర్య కల్పన విషయాన్ని త్వరలోనే రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ దృష్టికి తీసుకె ళతానన్నారు. విపక్ష ముఖ్య సచేతకులు డాక్టర్ శివయోగిస్వామి మాట్లాడుతూ... ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎంపీ. రేణుకాచార్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.రామచంద్ర, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అణబేరు జీవనమూర్తి, కొండజ్జి జయప్రకాశ్, యశవంతరావ్ జాదవ్ పాల్గొన్నారు. -
సంపన్న భారత్ తో 'సార్క్' కు మేలు
భూటాన్ పార్లమెంటులో మోడీ ప్రసంగం భారత్‌లో ప్రభుత్వ మార్పు భూటాన్‌తో బంధంపై ప్రభావం చూపదు గతంలో భారత్ ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తామన్న ప్రధానమంత్రి ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతానికి ఇరు దేశాల నిర్ణయం మోడీ పర్యటన దిగ్విజయం: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ థింపు: బలమైన, సుసంపన్నమైన భారతదేశం.. భూటాన్ సహా పొరుగు దేశాల అభివృద్ధికి సాయపడగలదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. భారత్ సుసంపన్నమైతే సార్క్ దేశాలన్నిటికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. మోడీ రెండు రోజుల భూటాన్ పర్యటన సోమవారం ముగిసింది. పర్యటన ముగించే ముందు ఆయన భూటాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. భారత్‌లో ప్రభుత్వం మారిపోయినప్పటికీ.. భూటాన్‌తో సంబంధాలపై ఆ ప్రభావం ఉండబోదని.. తమ దేశం గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మోడీ స్పష్టంచేశారు. భూటాన్ జాతీయ శాసనసభ స్పీకర్ జిగ్మేజాంగ్పో ఆహ్వాన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. భారత్ ఎంత బలంగా ఉంటే.. భూటాన్‌కు అంత మంచిదని పేర్కొన్నారు. బలమైన, సుసంపన్నమైన భారత్ ఈ ప్రాంతంలోని చిన్న దేశాలకు సాయపడగలదని చెప్పారు. తన అంతరాత్మ ప్రబోధం మేరకే భారత ప్రధానమంత్రిగా తన తొలి పర్యటనకు భూటాన్‌ను ఎంపిక చేసుకున్నానని మోడీ తెలిపారు. ‘‘ఇంత గొప్ప విజయం (ఎన్నికల్లో) తర్వాత.. ఏదైనా పెద్ద బలమైన దేశంలో ముందుగా పర్యటించాలని, తద్వారా చాలా కీర్తి వస్తుందనే ఆలోచన సాధారణంగా ఉంటుంది. కానీ.. నేను ముందు భూటాన్‌ను సందర్శించాలని నా అంతరాత్మ చెప్పింది. ఇందుకు ప్రణాళిక ఏదీ లేదు. అది మామూలు చర్య’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. తమ భూభాగాన్ని భారత్‌కు వ్యతిరేకంగా వినియోగించుకునేందుకు అనుమతించబోమని భూటాన్ కూడా హామీ ఇచ్చింది. ఈశాన్య భారత్ మిలిటెంట్లు భూటాన్‌లో తలదాచుకుంటున్న నేపథ్యంలో ఆ దేశం ఈ హామీ ఇచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపు... మోడీ పర్యటన సందర్భంగా.. రెండు దేశాలూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకోవాలని నిర్ణయించాయని అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. భూటాన్, భారత్ ఈశాన్య రాష్ట్రాల మధ్య క్రీడల నిర్వహణ, సంయుక్త పరిశోధన కోసం హిమాలయ విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి చర్యలతో ఈ బంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. పాల పొడి, గోధుమలు, ఆహార నూనెలు, పప్పుధాన్యాలు, బాస్మతియేతర బియ్యం వంటి ఎగుమతులపై భూటాన్‌కు నిషేధం నుంచి, పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు భారత్ తెలియజేసింది. అలాగే.. భారత్‌లో చదువుకునే భూటాన్ విద్యార్థులకు ఇచ్చే నెహ్రూ - వాంగ్‌చుక్ స్కాలర్షిప్ను ఏడాదికి రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఖోలాంగ్చు విద్యుత్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన భారత్ - భూటాన్ భాగస్వామ్యంతో భూటాన్‌లో నిర్మిస్తున్న 600 మెగావాట్ల సామర్థ్యం గల ఖోలాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ సోమవారం శంకుస్థాపన చేశారు. భూటాన్ పార్లమెంటులో ప్రసంగించిన అనంతరం.. ఆయన పార్లమెంటు ఆవరణ నుంచే ఎలక్ట్రానిక్ మీట నొక్కటం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇటీవలే భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ తొలి విదేశీ పర్యటనకు ఎంచుకున్న భూటాన్ పర్యటన దిగ్విజయమయిందని.. ఆయనతో పాటు పర్యటనకు వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మీడియాతో పేర్కొన్నారు. భూటాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలని పొరుగు దేశం చైనా ఇటీవలి కాలంలో తీవ్ర యత్నాలు చేస్తున్న నేపథ్యంలో మోడీ తొలిసారిగా భూటాన్ పర్యటనకు వెళ్లి ఆ దేశంతో భారత్ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నించటం విశేషం. ఈ పర్యటనలో మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్లు కూడా ఉన్నారు. భూటాన్ - భారత్ మైత్రి సంతోషకరం: చైనా భారత్ - భూటాన్‌ల మధ్య సంబంధాలు మోడీ పర్యటనతో బలోపేతం అవటం సంతోషకరమని చైనా స్పందించింది. భూటాన్‌తో తాము దౌత్య సంబంధాలు నెలకొల్పలేదని.. అయితే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, పర్యటనలు ఉన్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి హువాచున్యింగ్ పేర్కొన్నారు. భారత్-టిబెట్ల మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న భూటాన్ 1951 నుంచి ఒంటరిగా ఉంది. చైనాతో సరిహద్దు వివాదం నేపధ్యంలో భూటాన్ - చైనాల మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు లేవు. మోడీ ప్రసంగానికి చప్పట్లు ప్రధాని మోడీకి భూటాన్ పార్లమెంటులో అరుదైన గౌరవం లభించింది. మోడీ 45 నిమిషాల ప్రసంగం ముగిసిన తర్వాత.. ఆ దేశ ఎంపీలు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి చప్పట్లతో అభినందనలు తెలిపారు. భూటాన్‌లో దుష్టాత్మలను తరిమివేయటానికి (దెయ్యాలను) చప్పట్లు కొడతారు కానీ.. అభినందనలు తెలిపేందుకు కాదు. కానీ మోడీ ప్రసంగం తర్వాత ఉభయసభల ఎంపీలందరూ చప్పట్లతో అభినందించటం విశేషం. మోడీ హిందీలో ప్రసంగించగా.. స్థానిక దుబాసీ ఆయన ప్రసంగాన్ని భూటానీస్లోకి తర్జుమా చేసి వినిపించారు. భారత్ నుంచి తెప్పించిన వాహనంలోనే.. భారత ప్రధాని నరేంద్రమోడీ థింపులో సైతం భారత్ నుంచి విమానంలో తెప్పించుకున్న ప్రత్యేక వాహనంలోనే ప్రయాణించారు. భద్రత రీత్యా ప్రత్యేకంగా రూపొందించిన బీఎండబ్ల్యూ 7 కారులోనే ఆయన ప్రయాణించారని.. అది భారత్‌లోకెల్లా అత్యంత భద్రమైన వాహనమని స్థానిక మీడియా పేర్కొంది. -
బంద్ సక్సెస్
మూతపడిన విద్యా,వ్యాపార సంస్థలు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం ధర్నా, రాస్తారోకోలతో దద్ధరిల్లిన జిల్లా తిరుపతి, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు బుధవారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమైక్యవాదులు సోనియాగాంధీ, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలతో పట్టణాలు, పలె ్లలు దద్ధరిల్లాయి. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఆధ్వ ర్యంలో సమైక్యవాదులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యకర్తలతో కలసి పట్టణ వీధుల్లో స్కూటర్ ర్యాలీ చేపట్టి బంద్‌ను పర్యవేక్షించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు మానవహారం నిర్మించి రాస్తారోకో నిర్వహించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మదనపల్లె-చిత్తూరు మార్గంలో బసినికొండ వద్ద వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. చిత్తూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. నిరసనకారులు గాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే సీకే.బాబు అనుచరులు, టీడీ పీ కార్యకర్తలు విడివిడిగా గాంధీ విగ్రహం కూడలిలో ఆందోళన చేపట్టారు. తిరుపతి భవానీనగర్ సర్కిల్లో సాప్స్ ఆధ్వర్యం లో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాప్స్ నాయకులు సోనియా, సుష్మాస్వరాజ్ దిష్టి బొమ్మలను తగులబెట్టి నిరసన తెలిపారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించగా తెలుగు మహిళలు చీపుర్లతో రోడ్డు శుభ్రం చేసి విభజనకు నిరసన తెలిపారు. టౌన్‌క్లబ్ కూడలిలో ఎన్జీవో జేఏసీ, తిరుపతి ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకారులు సోనియా, రాహుల్‌గాంధీ, చిదంబరం దిష్టి బొమ్మలను పాదరక్షలతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం వాటిని తగులబెట్టారు. మబ్బు చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాల యాలు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నడవలేదు. సమెక్యవాదులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర ్త డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో బంగారుపాళెంలో బంద్ జరిగింది. కార్యకర్తలు ర్యాలీ, ధర్నా నిర్వహించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. తవణంపల్లి, యాదమరి మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం వద్ద చెన్నై జాతీయ రహదారిపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పుత్తూరు, నగరిలో మధ్యాహ్నం వరకు బంద్ సంపూర్ణంగా జరిగింది. పుంగనూరులో వైఎస్ఆర్ సీపీ నాయకులు రెడ్డెప్ప, నాగభూషణం, వెంకటరెడ్డియాదవ్, నాగరాజరెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. నిరసనకారులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. యూపీఏ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలమనేరు నియోజకవర్గంలోని అన్ని మండలా ల్లో వైఎస్ఆర్ సీపీ నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. పలమనేరులో కార్యకర్తలు, సమైక్యవాదులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. బస్సు లు డిపోలకే పరిమితమయ్యాయి. పట్టణంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవే ట్ కార్యాలయాలు మూతపడ్డాయి. శ్రీకాళహస్తిలో గుమ్మడి బాలకృష్ణారెడ్డి, మిద్దెల హరి తదితరుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. సమైక్యవాదులు ఏపీ సీడ్స్, సూపర్‌బజార్, ఆర్టీసీ కూడళ్లలో రాస్తారోకో చేశారు. టీడీపీ కార్యకర్తలు విడిగా బంద్‌ను పర్యవేక్షించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఆయా మండలాలకు చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పీలేరులో బస్సులు నడవలేదు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. వైఎస్ఆర్ సీపీ నాయకులు, సమైక్యవాదులతో కలసి ర్యాలీ చేపట్టి పీలేరు క్రాస్‌రోడ్స్‌లో రాస్తారోకో నిర్వహించారు.