బంద్ సక్సెస్
- మూతపడిన విద్యా,వ్యాపార సంస్థలు
- ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం
- ధర్నా, రాస్తారోకోలతో దద్ధరిల్లిన జిల్లా
తిరుపతి, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు బుధవారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమైక్యవాదులు సోనియాగాంధీ, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలతో పట్టణాలు, పలె ్లలు దద్ధరిల్లాయి.
మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఆధ్వ ర్యంలో సమైక్యవాదులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యకర్తలతో కలసి పట్టణ వీధుల్లో స్కూటర్ ర్యాలీ చేపట్టి బంద్‌ను పర్యవేక్షించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు మానవహారం నిర్మించి రాస్తారోకో నిర్వహించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మదనపల్లె-చిత్తూరు మార్గంలో బసినికొండ వద్ద వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
చిత్తూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. నిరసనకారులు గాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే సీకే.బాబు అనుచరులు, టీడీ పీ కార్యకర్తలు విడివిడిగా గాంధీ విగ్రహం కూడలిలో ఆందోళన చేపట్టారు.
తిరుపతి భవానీనగర్ సర్కిల్‌లో సాప్స్ ఆధ్వర్యం లో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాప్స్ నాయకులు సోనియా, సుష్మాస్వరాజ్ దిష్టి బొమ్మలను తగులబెట్టి నిరసన తెలిపారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించగా తెలుగు మహిళలు చీపుర్లతో రోడ్డు శుభ్రం చేసి విభజనకు నిరసన తెలిపారు. టౌన్‌క్లబ్ కూడలిలో ఎన్జీవో జేఏసీ, తిరుపతి ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకారులు సోనియా, రాహుల్‌గాంధీ, చిదంబరం దిష్టి బొమ్మలను పాదరక్షలతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం వాటిని తగులబెట్టారు. మబ్బు చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుప్పంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాల యాలు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నడవలేదు. సమెక్యవాదులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
వైఎస్‌ఆర్ సీపీ పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర ్త డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో బంగారుపాళెంలో బంద్ జరిగింది. కార్యకర్తలు ర్యాలీ, ధర్నా నిర్వహించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. తవణంపల్లి, యాదమరి మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది.
సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం వద్ద చెన్నై జాతీయ రహదారిపై వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పుత్తూరు, నగరిలో మధ్యాహ్నం వరకు బంద్ సంపూర్ణంగా జరిగింది.
పుంగనూరులో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు రెడ్డెప్ప, నాగభూషణం, వెంకటరెడ్డియాదవ్, నాగరాజరెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. నిరసనకారులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. యూపీఏ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పలమనేరు నియోజకవర్గంలోని అన్ని మండలా ల్లో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. పలమనేరులో కార్యకర్తలు, సమైక్యవాదులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. బస్సు లు డిపోలకే పరిమితమయ్యాయి. పట్టణంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవే ట్ కార్యాలయాలు మూతపడ్డాయి.
శ్రీకాళహస్తిలో గుమ్మడి బాలకృష్ణారెడ్డి, మిద్దెల హరి తదితరుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. సమైక్యవాదులు ఏపీ సీడ్స్, సూపర్‌బజార్, ఆర్‌టీసీ కూడళ్లలో రాస్తారోకో చేశారు. టీడీపీ కార్యకర్తలు విడిగా బంద్‌ను పర్యవేక్షించారు.
చంద్రగిరి నియోజకవర్గంలో ఆయా మండలాలకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
పీలేరులో బస్సులు నడవలేదు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, సమైక్యవాదులతో కలసి ర్యాలీ చేపట్టి పీలేరు క్రాస్‌రోడ్స్‌లో రాస్తారోకో నిర్వహించారు.