the bill
-
మూజువాణి ఓటుతో అంగీకారం !
- కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదాకు సభ ఆమోదం - విపక్షాల ఆందోళనల మధ్యనే బిల్లుకు అంగీకారం - ముసాయిదా బిల్లును చించేసి వ్యతిరేకతను తెలియజేసిన విపక్షాలు సాక్షి, బెంగళూరు: బీబీఎంపీని మూడు విభాగాలుగా విభజించేందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదా బిల్లుకు శాసనసభలో మూజువాణి ఓటుతో అంగీకారం లభించింది. విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్యనే ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. ముసాయిదా బిల్లు ప్రతులను చించివేసిన బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేయక తప్పలేదు. అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం.... కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదా బిల్లు ఆమోదానికి గాను సోమవారం ఏర్పాటైన ప్రత్యేక శాసనసభ సమావేశం అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధానికి వేదికైంది. కర్ణాటక మున్సిపల్ యాక్ట్ సవరణల ముసాయిదా బిల్లును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరఫున రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర ఈ ముసాయిదా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టారు. బెంగళూరు అభివృద్ధి కోసమంటూ ప్రత్యేక చట్టాలేవీ ఇప్పటి వరకు లేవని టి.బి.జయచంద్ర పేర్కొన్నారు. అందుకే ఇప్పటికే ఎన్నోసార్లు హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి ‘అక్షింతలు’ కూడా పడ్డాయని, అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో ‘చెత్త నగరం’గా బెంగళూరు నగరం అపఖ్యాతిని మూటగట్టుకుందని అన్నా రు. అందుకే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం బీ.ఎస్ పాటిల్‌తో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ ఇచ్చిన మధ్యం తర నివేదిక మేరకు బీబీఎంపీని విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలి పారు. పాలికె పునఃరచన జరిగే వరకు బీబీఎంపీ పరిధిలోని నియామకాలు, పథకాలు, పన్నుల వసూళ్లు, ఆస్తిహక్కు ఇవన్నీ రాష్ట్ర ప్ర భుత్వ ఆధీనంలోనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బీబీఎంపీలో ఉన్న ఉద్యోగులు, అధికారులు విభజన అనంతరం మహానగర పాలికెలో కొనసాగుతారని, ఇతర విషయా లు కొత్త పాలికె ఏర్పాటు అనంతరం చర్చించనున్నట్లు చెప్పారు. అయితే విపక్షాలు మాత్రం రాష్ట్ర ప్ర భుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డాయి. కేవ లం తమ అధికార దాహం కోసమే బీబీఎంపీని విభజించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ సందర్భంగా జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ. కాంగ్రె స్ ప్రభుత్వం కేవలం తన ప్రయోజనాల కోసమే హడావుడిగా ఈ బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. ‘అసలు బీబీఎంపీని ఎన్ని విభాగాలుగా విభజించాలనుకున్నారు? ఒక వేళ బీబీ ఎంపీని విభజిస్తే నగరంలోని చెత్త సమస్యను ఎవరికి అప్పగిస్తారు? డ్రెయినేజీ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు?’ అని ప్రభుత్వాన్ని ప్ర శ్నించారు. బీబీఎంపీని విభజిస్తే భవిష్యత్తులో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వ స్తుందని పేర్కొన్నారు. కేవలం తమ ప్రభుత్వ పరిధిలోనే బెంగళూరు అభివృద్ధి జరిగిందని కుమారస్వామి తెలిపారు. అనంతరం బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ మాట్లాడుతూ....బెంగళూరు అఖండంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. బీబీఎంపీలో అవినీతి చో టు చేసుకొని ఉంటే ఈ విషయంపై విచారణ జరిపి, బాధ్యులను శిక్షిం చాలి తప్పితే బీబీఎంపీనే విభజించాలనడం ఎంత వరకు సమంజసమని అన్నారు. బీబీఎంపీ విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన బి.ఎస్.పాటిల్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను ఇచ్చే వరకు ప్రభుత్వం వేచి చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, సోమవారం రాత్రి విధానసభలో ఆమోదం పొందిన బిల్లు విధానపరిషత్‌కు చేరింది.ఇక బీబీఎంపీ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లులోని ముఖ్యాంశాలు.... - మరోసారి బెంగళూరు మహానగర పాలికె ఏర్పాటు - బృహత్ బెంగళూరులోని బృహత్ పదం రద్దు - బీబీఎంపీని మూడు విభాగాలుగా చేసే ఉద్దేశం - ప్రస్తుతం బీబీఎంపీలో ఉన్న 12 స్థాయీ సమితిలను రద్దు చేయడం, ఇంతకు ముందు బెంగళూరు మహానగర పాలికెలో ఉన్న విధంగా 4 సమితిల ఏర్పాటు - విభజన పూర్తయ్యే వరకు పాలనాధికారి ఆధ్వర్యంలోనే బీబీఎంపీ కార్యక్రమాలు -
ఫిబ్రవరిలో మోటారు వాహనాల సవరణ బిల్లు!
న్యూఢిల్లీ: రహదారి భద్రతలో ప్రపంచస్థాయి ప్రమాణాలను తీసుకొచ్చేలా మోటారు వాహనాల చట్టానికి సవరణపై కేబినెట్ నోట్‌ను ఇప్పటికే పంపామని, ఫిబ్రవరిలో కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ మంగళవారం ఢిల్లీలో తెలిపారు. సవరణ ప్రతిపాదనపై ప్రధాని మోదీ పలు సూచనలు చేశారన్నారు. బిల్లులో వీటినీ పొందుపరిచి చేరుస్తామని ... కేబినెట్ ఆమోదం తర్వాత తదుపరి పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామన్నారు. కాగా, రామసేతును ధ్వంసం చేయకుండానే సేతుసముద్రం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ మార్గంపై అధ్యయనం చేసి అఫిడవిట్ రూపొందించామని, ప్రధాని ఆమోదించాక దాన్ని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని గడ్కారీ తెలిపారు. పండ్లు, కూరగాయలను రైతులు స్వేచ్ఛగా విక్రయించుకునేలా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం పరిధి నుంచి వాటిని తప్పించడంపై రాష్ట్రాలను సంప్రదిస్తామని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మంగళవారం తిరువనంతపురంలో తెలిపారు. మరోవైపు జీఎస్టీ అమలుపై రాష్ట్రాలకు ఏడాది సమయాన్ని అదనంగా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. -
బిల్లుల షాక్!
రూ. వేలల్లో రావడంతో వినియోగదారుల ఆందోళన ‘ప్రజావాణి’లో అధికారులకు ఫిర్యాదు పి.లక్ష్మి... ఇంటి విద్యుత్తు సర్వీసు మీటరు నంబరు 442. సాధారణంగా ప్రతి నెల రూ.135 నుంచి రూ.150 వరకు బిల్లు వచ్చేది. ఈనెల బిల్లు మాత్రం ఒక్కసారిగా రూ. 6,772 వచ్చింది. కె.రాజేశ్వరి... ఇంటి మీటరు నంబరు 304. ఇప్పటివరకు నెలకు రూ. 116 నుంచి రూ. 130 మధ్యే బిల్లు వచ్చేది. ఈసారి ఏకంగా రూ. 1,035 వచ్చింది. సర్వాలక్ష్మి... ఇంటి విద్యుత్తు మీటరు నంబరు 423. ప్రతి నెల బిల్లు రూ. 142 నుంచి రూ. 160 వరకు మాత్రమే వచ్చేది. ఈనెల మాత్రం వెయ్యి రూపాయలకు పైగా బిల్లును విద్యుత్తు సిబ్బంది ఆమె చేతికి ఇచ్చారు. ఎం.మంగ... ఇంటి మీటరు నంబరు 465. ఈ సర్వీసుకు ఇప్పటివరకు రూ. 149 మించి ఏ నెలా బిల్లు రాలేదు. ఈసారి మాత్రం రూ. 939 చెల్లించాలని బిల్లు వచ్చింది. బైపా పెంటయ్యమ్మ... ఇంటి సర్వీసు నంబరు 555. గతంలో ప్రభుత్వం ఎస్సీలకు 50 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా ఇవ్వడంతో ఆమె ఐదు నెలల క్రితమే కుల ధ్రువీకరణపత్రం అధికారులకు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు బిల్లు రాలేదు. ఈనెల మాత్రం రూ. 850 చెల్లించాలంటూ ఆమెకు బిల్లు వచ్చింది. ఈ విద్యుత్తు బిల్లుల బాధితులంతా జిల్లాలోని నాతవరం మండలంలో చమ్మచింత గ్రామానికి చెందినవారు. వారికే కాదు ఈ మండలంలో పలువురు వినియోగదారులకు ఇలాగే అధిక బిల్లులు రావడంతో నిర్ఘాంతపోయారు. పెద్దగా విద్యుత్తు వినియోగించని తమ ఇళ్లకు అదీ సరఫరాలో అధిక కోతలు విధిస్తున్న సమయంలో రూ. వేలల్లో బిల్లులు రావడమేమిటని ఆందోళన చెందుతున్నారు. దీంతో కొంతమంది సోమవారం విద్యుత్తు సబ్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బిల్లులను సరి చేయించాలంటూ ఏఈ వెంకట్రావుకు విన్నవించారు. - నాతవరం -
రియల్ఎస్టేట్ నేల చూపులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థిరాస్తి రంగంపై రాష్ట్ర విభజన అంశం తీవ్ర ప్రభావం చూపింది. భూముల క్రయ విక్రయాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలతో వెలుగువెలిగిన జిల్లా ప్రస్తుతం వెలవెలబోతోంది. రియల్ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులతో కళకళలాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లు అంశం తెరమీదకు వచ్చిందే తడవు జిల్లాలో రియల్టీ రంగం పల్టీలు కొట్టడం ప్రారంభమైంది. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం నేపథ్యంలో 2005 నుంచి ఆనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న స్థిరాస్తి వ్యాపారం.. 2013 ఆరంభంలో కొంత పుంజుకుంది. ఊహించనిరీతిలో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు మొగ్గు చూపడమే తరువాయి మళ్లీ రియల్ బూమ్ ఢామ్ అయ్యింది. రాష్ర్ట ఖజానాకు ఆదాయార్జన శాఖల్లో ఒక్కటైన రిజిస్ట్రేషన్ల శాఖ... భూముల క్రయవిక్రయాలు తగ్గిపోవడంతో నిర్దేశిత లక్ష్యాల సాధనలో చతికిలపడింది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రియల్టీ రంగం పూర్వవైభవం సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల రాకతో గతంలో నగర శివార్లలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే క్రమంలో బడా బిల్డర్లు కూడా కొత్త ప్రాజెక్టులను నగర శివార్లలో చేపట్టేందుకు మొగ్గు చూపారు. దీంతో స్థలాల విలువ అనూహ్యంగా పెరిగింది. సొంతింటి కలలు కన్న సామాన్య, వేతన జీవుల ఆశలపై ఆకాశాన్నంటిన భూములు, ఫ్లాట్ల ధరలు నీళ్లు జల్లాయి. ఈ క్రమంలోనే గతేడాది జూన్‌లో తెలంగాణ బిల్లును కేంద్రం కదిలించేదే తడువు... రిజిస్ట్రేషన్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. కాగా ఆదిబట్ల, అప్పా, నార్సింగి జంక్షన్లు సహా ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాల్లో మాత్రం కొద్దిమేర స్థలాల కొనుగోళ్లు సాగుతున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చే అవకాశాలు మెండుగా ఉండడంతో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం రియల్ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఢామ్! జిల్లాలో గతేడాది జనవరి-ఏప్రిల్ వరకు 1,02,714 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. రూ.698.31 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఇదే కాలానికి 62,106 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా...రూ.425.05 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అంటే 2013 తొలి నాలుగు నెలలతో పోలిస్తే 39.13 శాతం ఆదాయం తగ్గిపోయిందన్నమాట. జిల్లాలోని రంగారెడ్డి, రంగారెడ్డి తూర్పు రిజిస్ట్రేషన్ శాఖల్లో 2013 జనవరి కంటే ఈ సారి 24.05 శాతం రాబడి పడిపోయింది. అలాగే ఫిబ్రవరిలో 21.99 శాతం తగ్గింది. ఇదే నెలలో తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడంతో దీని ప్రభావం మార్చి నెలపై స్పష్టంగా కనిపించింది. గత ఏడాది మార్చిలో రూ.313.84 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది మార్చిలో కేవలం రూ.121.12 కోట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ల శాఖ ఆర్జించింది. కేవలం ఈ ఒక్కనెలలోనే 61.40 శాతం రాబడిలో తేడా రావడం గమనార్హం. రాష్ర్ట విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తికావడం, అపాయింటెడ్ డే కూడా సమీపిస్తుండడంతో స్థిరాస్తి రంగం మరింత కుదేలయ్యే అవకాశంలేకపోలేదు. వాస్తవానికి నగర శివార్లలో అత్యధికంగా తెలంగాణేతరులే ప్లాట్లను కొనుగోలు చేశారు. దీంట్లో వ్యాపారవేత్తలు, ఉద్యోగులేగాకుండా.. వివిధ రంగాల్లో స్థిరపడ్డ ఆనేకులు ఇక్కడ భూముల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలో రియల్టీ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. దీంతో జిల్లాలో చాలామంది రియల్టర్లుగా, బ్రోకర్లుగా అవతారమెత్తారు. వారి జీవన ప్రమాణాల్లో మార్పులు వచ్చాయి. తాజాగా ఈ రంగం ఢమాల్ అనడంతో వీరు దిగాలు చెందుతున్నారు. అయితే, సామాన్యులు మాత్రం పెరిగిన ధరల్లో స్థిరత్వం వస్తుందనే భరోసాతో ఉన్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగానికి జవసత్వాలు కల్పించి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో కొంత భరోసా కలుగుతున్నా... సీమాంధ్ర రాజధానిలో పెట్టుబడులు పెట్టే దిశగా వ్యాపారవేత్తలు ఆలోచనలు సాగిస్తుండడం ఇక్కడి రియల్టర్లను కలవరపరుస్తోంది. -
బంద్ సక్సెస్
మూతపడిన విద్యా,వ్యాపార సంస్థలు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం ధర్నా, రాస్తారోకోలతో దద్ధరిల్లిన జిల్లా తిరుపతి, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు బుధవారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమైక్యవాదులు సోనియాగాంధీ, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలతో పట్టణాలు, పలె ్లలు దద్ధరిల్లాయి. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఆధ్వ ర్యంలో సమైక్యవాదులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యకర్తలతో కలసి పట్టణ వీధుల్లో స్కూటర్ ర్యాలీ చేపట్టి బంద్‌ను పర్యవేక్షించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు మానవహారం నిర్మించి రాస్తారోకో నిర్వహించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మదనపల్లె-చిత్తూరు మార్గంలో బసినికొండ వద్ద వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. చిత్తూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. నిరసనకారులు గాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే సీకే.బాబు అనుచరులు, టీడీ పీ కార్యకర్తలు విడివిడిగా గాంధీ విగ్రహం కూడలిలో ఆందోళన చేపట్టారు. తిరుపతి భవానీనగర్ సర్కిల్లో సాప్స్ ఆధ్వర్యం లో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాప్స్ నాయకులు సోనియా, సుష్మాస్వరాజ్ దిష్టి బొమ్మలను తగులబెట్టి నిరసన తెలిపారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించగా తెలుగు మహిళలు చీపుర్లతో రోడ్డు శుభ్రం చేసి విభజనకు నిరసన తెలిపారు. టౌన్‌క్లబ్ కూడలిలో ఎన్జీవో జేఏసీ, తిరుపతి ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకారులు సోనియా, రాహుల్‌గాంధీ, చిదంబరం దిష్టి బొమ్మలను పాదరక్షలతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం వాటిని తగులబెట్టారు. మబ్బు చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాల యాలు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నడవలేదు. సమెక్యవాదులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర ్త డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో బంగారుపాళెంలో బంద్ జరిగింది. కార్యకర్తలు ర్యాలీ, ధర్నా నిర్వహించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. తవణంపల్లి, యాదమరి మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం వద్ద చెన్నై జాతీయ రహదారిపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పుత్తూరు, నగరిలో మధ్యాహ్నం వరకు బంద్ సంపూర్ణంగా జరిగింది. పుంగనూరులో వైఎస్ఆర్ సీపీ నాయకులు రెడ్డెప్ప, నాగభూషణం, వెంకటరెడ్డియాదవ్, నాగరాజరెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. నిరసనకారులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. యూపీఏ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలమనేరు నియోజకవర్గంలోని అన్ని మండలా ల్లో వైఎస్ఆర్ సీపీ నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. పలమనేరులో కార్యకర్తలు, సమైక్యవాదులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. బస్సు లు డిపోలకే పరిమితమయ్యాయి. పట్టణంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవే ట్ కార్యాలయాలు మూతపడ్డాయి. శ్రీకాళహస్తిలో గుమ్మడి బాలకృష్ణారెడ్డి, మిద్దెల హరి తదితరుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. సమైక్యవాదులు ఏపీ సీడ్స్, సూపర్‌బజార్, ఆర్టీసీ కూడళ్లలో రాస్తారోకో చేశారు. టీడీపీ కార్యకర్తలు విడిగా బంద్‌ను పర్యవేక్షించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఆయా మండలాలకు చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పీలేరులో బస్సులు నడవలేదు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. వైఎస్ఆర్ సీపీ నాయకులు, సమైక్యవాదులతో కలసి ర్యాలీ చేపట్టి పీలేరు క్రాస్‌రోడ్స్‌లో రాస్తారోకో నిర్వహించారు.