business organizations
-
శుభ ఘడియలు షురూ..
పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. ఎందరికో చేతినిండా పని. కానీ కరోనా కారణంగా దాదాపు ఆరునెలలుగా పనిలేక పస్తులున్న వివిధ వృత్తుల వారికి ఇప్పుడిప్పుడే కాస్త ఊరట లభిస్తుంది. ముందున్నవి శుభముహూర్తాల రోజులు కావడంతో చేతినిండా పని దొరకనుంది. కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడుకల్లో జాగ్రత్తలు చాలా అవసరం అని తెలుపుతున్నారు. సాక్షి, నిర్మల్ చైన్‌గేట్: కరోనా సంక్షోభంలో చిక్కుకున్న వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పండుగలకు తోడు వరుసగా శుభముహూర్తాలు ఉండటంతో వ్యాపార సంస్థలు కళకళలాడుతున్నాయి. గత నెల 29 నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లో పెళ్లి సందడి కనిపిస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలు కుంటున్న వ్యాపార వాణిజ్య సంస్థలకు బతుకమ్మ పండుగలతో గిరాకీ పెరిగింది. రానున్న పెళ్లి ముహూర్తాలతో మరింత జోరందుకుంది. జనతా కర్ఫ్యూతో మొదలై మూడు నెలల పాటు కఠినంగా లాక్డౌన్ అమలు చేశారు. ఆ మూడు నెలల్లో ముహూర్తాలు ఉన్నప్పటికీ పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత కొన్ని ముహూర్తాలు వచ్చినా తక్కువ మందితో వివాహాలు జరిపించారు. ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసుకుందామని కలలు కన్నవారు వాయిదా వేసుకోలేక, కా నిచ్చేద్దామనుకున్న వారు ఇంటి ముందర పాత పద్ధతుల్లో పచ్చని పందిళ్లు వేసి మమ అనిపించేశారు. చదవండి: కాజల్ అగర్వాల్ వెరీ వెరీ స్పెషల్ మూడు నెలలు సందడే సందడి శుభముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిజ ఆశ్వీయుజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసాల్లోనూ శుభముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. గత నెల 18 నుంచి ఎంగేజ్మెంట్ పత్రిక రాసుకోవడం వంటి కార్యక్రమాలు మొదలు పెట్టారు. మంచి రోజులు కావడంతో పెళ్లికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శుభ ముహూర్తాలతో దాదాపు మూడు నెలల పాటు పెళ్లిల సందడి ఉండే అవకాశాలున్నాయి. 2021 జనవరి రెండో వారం నుంచి నాలుగు నెలలపాటు ముహూర్తాలకు బ్రేక్ పడనుండటంతో ఈ సీజన్లోనే శుభకార్యాలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈనెల 4 నుంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. జనవరి 16నుంచి నాలుగు నెలల పాటు ఈ శుభ ముహూర్తాలకు విరామం రానుంది. మార్కెట్‌కు కొత్త శోభ.. మార్కెట్లలో దసరా బతుకమ్మ పండుగలతో మొదలైన సందడి వచ్చే రెండు మూడు నెలల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది నెలలుగా కరోనాతో ప్రజలు రాక బోసిపోయిన వ్యాపారాలన్నీ ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. దీంతో వ్యాపార కూడళ్ల దగ్గర రద్దీ పెరిగింది. వస్త్రాలు, బంగారం దు కాణాలు, లేడీస్ ఎంపోరియాలు, ఫర్నీచర్, స్టీల్ పాత్రల దుకాణాలు ఇలా పెళ్లిళ్లకు అవసరమైన అన్ని రకాల వస్తువుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లికి కావలసిన సామగ్రి కొనడానికి వస్తున్న ప్రజలతో దుకాణాలన్నీ మునుపటి కళను సంతరించుకున్నాయి. దసరాకు మొదలైన షాపింగ్ కళ నేటికీ కొనసాగుతోంది. కరో నాతో కొట్టుమిట్టాడిన వ్యాపారస్తులు ప్రస్తుతం కాస్త ఊపిరితీసుకుంటున్నారు. వృత్తులకు ఊరట ఇన్నాళ్లు ఉపాధి కోల్పోయిన వేలాది మంది వివిధ వృత్తుల వాళ్లకు ఇ ప్పు డు కొంత ఊరట కలుగుతోంది. ప్రధానంగా వంటవారు, క్యాటరింగ్ , డె కరేటర్స్ , టెంట్‌హౌస్, ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఫంక్షన్ హాల్స్, స్వర్ణకారులు, ఫర్నీచర్ తయారీదారులు, దర్జీలు, కార్లు, జీపులు, బస్సుల యజమానులు, డ్రైవర్లు, సన్నాయివాయిద్య కళాకారులకు పని దొరకనుంది. ఇక పెళ్లి వేడుకల్లో పాల్గొనే కులవృత్తుల వారైన చాకలి, మంగలి వారికి కూడా ఉపాధి లభించనుంది. ఇంతకాలం చేతిలో పని లేక ఇబ్బందిపడ్డ వే లాది కుటుంబాలకు ప్రస్తుతం పని లభిస్తుండటంతో వారు బిజీ అ య్యా రు. నెలల తరబడిగా చేయడానికి పనులు లేక చాలా మంది ఇతర పనుల కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే రెడీమేడ్ వస్త్రాల రాకతో ఉపాధి కో ల్పోయి న దర్జీలు కరోనా కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దసరా సీ జన్తోపాటు పెళ్లిళ్ల సీజన్ రావడంతో వారికి కొంత ఉపశమనం కలిగింది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే సుమా.. కరోనా కంగారు కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది.. కానీ జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా పూర్తిగా మాయం కాలేదని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలలో కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్నారు. వేడుకలు చేస్తూ.. పెద్ద సంఖ్యలో జనం ఒక దగ్గర గుమిగూడటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని తెలుపుతున్నారు. సానిటైజర్ల వాడకం తప్పనిసరి అని తెలుపుతున్నారు. సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలని అజాగ్రత్తగా ఉండకూడదని సూచిస్తున్నారు. -
వ్యాపారానికి అడ్డంకులు తొలగించండి
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ కంపెనీల వ్యాపార వ్యయాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ కోరారు. అమెరికన్ కంపెనీలు భారత్‌లో వ్యాపారాలు నిర్వహించుకోవడానికి గల అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. డేటా లోకలైజేషన్ వంటి ఆంక్షల వల్ల డేటా భద్రత బలహీనపడుతుందని, వ్యాపారాల నిర్వహణ వ్యయాలు పెరిగిపోతాయని.. ఇలాంటి వాటిని తొలగించాలని రాస్ చెప్పారు. భారత పర్యటనలో భాగంగా ట్రేడ్ విండ్స్ ఫోరం అండ్ ట్రేడ్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్‌తో వాణిజ్య చర్చలు జరపడం, అమెరికా–ఇండియా సీఈవో ఫోరం ద్వారా సమస్యాత్మక అంశాలను పరిష్కరించుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. అధిక టారిఫ్‌ల భారం.. ‘ప్రస్తుతం భారత మార్కెట్లో అమెరికా వ్యాపార సంస్థలు అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నాయి. టారిఫ్‌లు, టారిఫ్యేతర అంశాలూ ఇందుకు కారణంగా ఉంటున్నాయి. వివిధ నియంత్రణ చట్టాలు విదేశీ సంస్థలకు ప్రతికూలంగా ఉంటున్నాయి. భారత్‌లో సగటున టారిఫ్‌ల రేటు ప్రపంచంలో ఇతర దేశాలన్నింటి కన్నా చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు ఆటోమొబైల్‌పై అమెరికాలో సుంకాలు 2.5 శాతం మాత్రమే కాగా.. భారత్‌లో 60 శాతం ఉంటున్నాయి. మోటార్‌సైకిళ్లపై 50 శాతం, ఆల్కహాలిక్ బేవరేజెస్‌పై ఏకంగా 150 శాతం ఉంటున్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉంది‘ అని రాస్ పేర్కొన్నారు. వైద్య పరికరాల ధరలపై నియంత్రణ, ఎలక్ట్రానిక్స్.. టెలికమ్యూనికేషన్స్ ఉత్పత్తుల రేట్లపై ఆంక్షలు మొదలైనవి అమెరికా కంపెనీలకు పెద్ద అడ్డంకులుగా ఉంటున్నాయన్నారు. భారత్ నుంచి దిగుమతయ్యే రూటర్లు, స్విచ్‌లు, సెల్‌ఫోన్స్ విడిభాగాలు మొదలైన వాటిపై అమెరికాలో సుంకాలు సున్నా స్థాయిలో ఉండగా.. భారత్‌లో మాత్రం అత్యధికంగా 20 శాతంగా ఉన్నాయని రాస్ చెప్పారు. త్వరలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఇలాంటి అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
డిసెంబర్లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు 2018 డిసెంబర్లో రూ.94,726 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం నెల నవంబర్‌లో నమోదైన రూ. 97,637 కోట్లతో పోలిస్తే వసూళ్లు కొంత తగ్గాయి. డిసెంబర్లో వసూలైన రూ.94,726 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) పరిమాణం రూ.16,442 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.22,459 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ.47,936 కోట్లు, సెస్సు రూ. 7,888 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. 9 నెలల్లో రూ.8.71 లక్షల కోట్లు.. 2018–19 బడ్జెట్లో కేంద్రం వార్షికంగా జీఎస్టీ వసూళ్లు రూ.13.48 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది. అంటే.. నెలకు సుమారు రూ. 1.12 లక్షల కోట్లు నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో (ఏప్రిల్–డిసెంబర్) పరిశీలిస్తే.. జీఎస్టీ వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్, అక్టోబర్‌లో మాత్రమే ఇవి రూ.1 లక్ష కోట్లు దాటాయి. కొత్త రిటర్న్ ఫారంల నోటిఫికేషన్: కాగా జీఎస్టీ విధానం కింద జూన్ 30 నాటికి వ్యాపార సంస్థలు దాఖలు చేయాల్సిన వార్షిక జీఎస్టీ రిటర్న్ కొత్త ఫారంలను కేంద్రం నోటిఫై చేసింది. మరోవైపు, 2017 జులై–2018 సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారిపై లేట్ ఫీజు నుంచి మినహాయింపునివ్వాలని సీబీఐసీ నిర్ణయించింది. అయితే, ఆయా సంస్థలు 2019 మార్చి 31 నాటికి మొత్తం 15 నెలల వ్యవధి రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. -
లూటీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) గురించి కేంద్రం ఎప్పుడు మాట్లాడినా ప్రజలు అత్యధికంగా వినియోగించే నిత్యావసరాల ధరలు తగ్గుతాయనే చెబుతోంది. జీఎస్టీ అమలు నేపథ్యంలో కేంద్రం కొన్ని పన్ను విధివిధానాలను కూడా ఖరారు చేసింది. అయితే చాలామంది వ్యాపారులు అవేవీ పట్టించుకోవట్లేదు. ఉదాహరణకు.. వ్యాపారులు పన్నులకు సంబంధించి పారదర్శకంగా వ్యవహరించాలి. తక్కువ పన్నులున్న వస్తువుల ధరలను సామాన్యులకు బదిలీ చేయాలి. మినహాయింపుల్లో ఉన్న వస్తువుల జాబితా కనిపించేలా బోర్డును ఏర్పాటు చేయాలి. ఏ వస్తువులపై ఎంత జీఎస్టీ అనేది ప్రదర్శించాలి. గతంలో ఏ వస్తువు ఎంత పన్ను ఉండేది, ప్రస్తుతమెంత అనేది స్పష్టంగా వివరించాలి. కానీ, రాష్ట్రంలోని ఏ రిటైల్ షాపుల్లోనూ ఇలాంటి బోర్డులేవీ కనిపించవు. గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) అంటేనే అన్ని రకాల పన్నులు కలిపి వినియోగదారుడికి విక్రయించే ధర అని అర్థం. కానీ, వ్యాపారులు ఎంఆర్పీ మీద జీఎస్టీ విధిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. సూపర్ మార్కెట్లు, మాల్స్‌లలో సంగతేంటి? నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు ఇలా దైనందిన జీవితంలో వినియోగించే అత్యధిక వస్తువులపై కేంద్రం జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చింది. అయితే అమలులో మాత్రం వ్యాపారులు దీన్ని పట్టించుకోవట్లేదు. పన్నులు లేని వాటిపైన కూడా జీఎస్టీ పేరిట సొమ్ము చేసుకుంటున్నారు. సూపర్మార్కెట్లు, పెద్ద పెద్ద మాల్స్‌లలో కూడా ఈ తంతు బాగానే కనిపిస్తుంది. బియ్యం, పప్పులు, ఉప్పుల వంటి ఉత్పత్తులు ప్యాకింగ్ చేసి, రిజిస్టర్ ట్రేడ్ మార్క్ ఉంటేనే 5 శాతం పన్ను వసూలు చేయాలి. కానీ, అవేవీ పట్టించుకోకుండా ప్యాకింగ్ ఉన్నా లేకున్నా సరే అన్నింటికీ ఒకే రకమైన పన్ను వసూలు చేస్తున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ (సీఏటీసీఓ) మాజీ సెక్రటరీ ప్రొఫెసర్ ఎ.బాలకిషన్ వ్యాఖ్యానించారు. ‘‘బిల్లులో జీఎస్టీ విధింపునకు సంబంధించి ఇస్తున్న వివరాలు కూడా గందరగోళంగా ఉంటున్నాయి. కొందరు ఏ వస్తువుకు ఎంత సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ అని వేర్వేరుగా ఇస్తుంటే, మరికొందరేమో బిల్లు మొత్తానికి కలిపి సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ అని ఇస్తున్నారు.దీంతో ఏ వస్తువుపై ఎంత పన్ను పడిందో వినియోగదారులకు తెలియడం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ దోపిడీని నియంత్రించడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ విఫలమవుతున్నాయని తెలిపారు. కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు... పన్ను ప్రయోజనాలను బదలాయించని వ్యాపారులు, సంస్థలపై ఫిర్యాదుల కోసం కేంద్రం యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీని ఏర్పాటు చేసింది. యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీలో కేంద్రం, రాష్ట్రం నుంచి ఇద్దరేసి అధికారుల చొప్పున మొత్తం నలుగురి బృందం ఉంటుంది. వినియోగదారులు నేరుగా యాంటీ ప్రాఫిటరింగ్ బృందానికి ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్ర స్థాయి ఫిర్యాదులకు స్క్రీనింగ్ కమిటీలో, జాతీయ స్థాయి ఫిర్యాదులకు స్టాండింగ్ కమిటీలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులు స్వీకరించాక ఆయా కమిటీలు విచారణ నిమిత్తం డైరెక్టర్ జనరల్ సేఫ్‌గార్డ్స్‌కు బదిలీ చేస్తారు. డీజీ సేఫ్‌గార్డ్స్ 2–3 నెలల్లో విచారణ నివేదికను యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీకి అందజేస్తుంది. ఈ సంస్థ ఏం చేస్తుందంటే.. జీఎస్టీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించని వ్యాపార సంస్థలు, కంపెనీలను గుర్తించి వినియోగదారులకు ప్రయోజనాలను అందిస్తుంది. ఒకవేళ లబ్ధిదారులను గుర్తించలేని పక్షంలో ఆ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి బదలాయిస్తుంది. పదేపదే ఇలాంటి పొరపాట్లు చేసే వ్యాపార సంస్థలు, కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దవుతాయి. రెస్టారెంట్లలో కూలింగ్ చార్జీల వసూలు... జీఎస్టీ కంటే ముందు హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లులపై వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ చార్జీ వసూలు చేసేవారు. కానీ, జీఎస్టీ అమలయ్యాక వీటన్నింటి స్థానంలో 18 శాతం జీఎస్టీ శ్లాబును కేటాయించారు. అయితే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో జీఎస్టీతో పాటూ ఫుడ్‌ను సర్వ్ చేసినందుకు గాను సర్వీస్ చార్జీ, వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్స్ మీద కూలింగ్ చార్జెస్ కూడా వసూలు చేస్తున్నాయి. ఇవి కూడా ఎంఆర్పీ కంటే 3–5 శాతం మేర అధికంగా ఉంటున్నాయని ఓ కస్టమర్ వాపోయారు. రెస్టారెంట్లలోని మెనూ కార్డులో మెనూ ధరల్లో జీఎస్టీ పన్నును కూడా కలిపి ధరలను చూపించాలి. అప్పుడే కస్టమర్‌కు ఆర్డర్ ఇవ్వక ముందే బిల్లు ఎంతవుతుందో తెలుస్తుంది. ‘‘జీఎస్టీ అమలయ్యాక రెస్టారెంట్లలో తిన్న బిల్లుపై ఎక్కువ వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి’’ అని . రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ అధికారి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. జీఎస్టీ అమలయ్యాక నెల రోజుల్లోనే 68 కేసులు నమోదయ్యాయని చెప్పారాయన. మొబైల్ టీం ఊసేలేదు... వ్యాపారులకు అధికారుల నుంచి వేధింపులు ఉండకూడదనే ఉద్దేశంతో వ్యాపార సంస్థలపై దాడులు చేయవద్దని, ఇతర రకాలుగా వేధించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇదే ఆసరాగా జీఎస్టీ అమలునే అధికార యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. జీఎస్టీ అమలుకు వ్యాపారుల వద్ద నుంచి సన్నద్ధత, ఏర్పాట్లకు సంబంధించి చెక్‌లిస్ట్ తీసుకున్న అధికారులు అది వాస్తవంగా అమలవుతుందా? లేదా అని పరిశీలించడం లేదు. నిబంధనలు పాటిస్తున్నారా లేదా పరిశీలించకపోతే ఎలా అని వినియోగదారులు ప్రశ్నిస్తుంటే.. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ అమలు తర్వాత చెక్‌పోస్టులను రాష్ట్రం ఎత్తేసింది. తెలంగాణలో మొత్తం 16 చెక్పోస్ట్లుండేవి. వాటి స్థానంలో తనిఖీల కోసం ప్రత్యేకంగా మొబైల్ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలి. కానీ, నేటికీ అవి కార్యరూపం దాల్చలేదని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. చెక్‌పోస్ట్ ఉద్యోగుల్ని ఖాళీగా ఉంచారన్నారు. నిఘా లేకపోవటంతో స్థానికంగా ఉత్పత్తులను తయారు చేసి ఇతర ప్రాంతాల్లో, రాష్ట్రాలకు సరఫరా చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. రూ.50 వేలు జరిమానా.. జైలు శిక్ష ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేసినా లేదా ఇతరత్రా మార్గాల ద్వారా పన్నులు వసూలు చేసినా రాష్ట్ర తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేయొచ్చు. ‘‘ప్రస్తుతానికైతే సీఎల్‌ఎం–టీఎస్ఎట్దిరేట్ఎన్ఐసీ.ఇన్‌కు మెయిల్ చేయాలి. టోల్‌ఫ్రీ నంబర్ లేదు. అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే విడుదల చేస్తాం’’అని సంబంధిత శాఖ అధికారి తెలిపారు. ఎంఆర్పీ ధరలోనే 10–35 శాతం వరకు లాభం కలిపి ఉంటుంది. అలాంటప్పుడు ఎంఆర్పీ మీద అదనంగా 3–5 శాతం వరకు వసూలు చేయడం అన్యాయం. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారనేవే అని ఆయన పేర్కొన్నారు. తాగునీరు నిత్యావసర వస్తువు. దీన్ని రిటైల్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. తయారీ సంస్థలు, రిటైలర్లు, డీలర్లు, ప్యాకర్లు, విక్రయదారులు అందరూ ఎంఆర్పీ ప్రకారమే విక్రయించాలి. మల్టీ ప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, హైవే ప్రక్కల దుకాణాల దగ్గర ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. మొదటిసారి నేరానికి రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా, రెండోసారి నేరానికి 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. సీన్ 1 శ్రీనివాస్ కుటుంబంతో సహా వరంగల్‌కు బయలుదేరాడు. దార్లో టీ తాగుదామని భువనగిరి– ఆలేరు మధ్య హైవేలోని ఓ షాపు వద్ద కారు ఆపాడు. టీతో పాటూ ఓ లేస్ ప్యాకెట్ కూడా తీసుకున్నాడు. దీని ధర రూ.10. కానీ, షాపు యజమాని వసూలు చేసింది మాత్రం రూ.15. అదేంటని అడిగితే.. ‘‘హోల్‌సెల్లర్ నాకే కాదు ఇక్కడున్న అన్ని షాపులకూ మేం కొనే సామాను మీద రూ.5 వేలు ఎక్కువ చార్జీ చేస్తుండు. ఎందుకనడిగితే జీఎస్టీ అంటుండు. కావాలంటే సరుకు తీసుకో! లేదంటే లేదని బెదిరిస్తుండు. అందుకే మేమూ కస్టమర్ల నుంచి ఎంఆర్పీపై అదనంగా వసూలు చేయాల్సి వస్తుం దో సార్’’ ఇదీ షాపు యజమాని సమాధానం. లూటీ ఎంత? ఇలా ఒక్క లేస్ ప్యాకెట్ కాదు!! ప్రతి వస్తువు మీద అదనంగా చెల్లించాల్సిందే. అక్కడున్న 105 షాపులదీ ఇదే పరిస్థితి. అంటే ఒక్కో షాపు రోజుకు అన్ని ఉత్పత్తుల మీద కలిపి రూ.1,500 అదనంగా వసూలు చేస్తుంటే.. 105 షాపులది కలిపి రూ.1.57 లక్షలు అదనమన్నమాట. ఓ చిన్న ప్రాంతంలో నెలకు రూ.47.25 లక్షలు జీఎస్టీ పేరిట లూటీ చేస్తున్నారన్నమాట. సీన్ 2 నారాయణ వరంగల్‌లోని కరీమాబాద్‌లో ఓ శారీ సెంటర్ యజమాని. పండుగ సీజన్ కావడంతో రెడీమేడ్ డ్రెస్‌లు, చీరలు కొందామని చార్మినార్‌లోని దివాన్ దేవిడీకి వచ్చాడు. ఓ హోల్‌సేల్ షాపుకెళితే.. ‘‘ఏది కొన్నా సరే 12% జీఎస్టీ! కార్డు మీద అయితే 5% అదనం!!’’ అనే బోర్డు చూసి షాకయ్యాడు. నిజానికి జీఎస్టీ శ్లాబుల్లో రూ.1,000 లోపు ధర ఉండే చీరలపై జీఎస్టీ 5 శాతమే. కానీ, ఇక్కడలాంటివేవీ వర్తించవు. ఆ ఒక్క షాపే కాదు అక్కడున్న ఏ హోల్ సేల్ షాపుకెళ్లినా సేమ్ సీన్. దీంతో చేసేదేమీ లేక ఉత్తి చేతులతో ఇంటికి తిరిగెళ్లలేక... చేతిలో ఉన్న సొమ్ముతో కొంత ఖరీదు చేసి మరికొంత జీఎస్టీ పేరు మీద సమర్పించేసి బయలుదేరాడు. లూటీ ఎంత? చార్మినార్‌లోని దివాన్ దేవిడీ, మదీనా, పత్తర్‌ఘట్టీ ప్రాంతాలు హోల్‌సేల్ బట్టల షాపులకు నిలయం. రాష్ట్రంలోని ఏ రిటైల్ షాపులైనా సరే ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తుంటాయి. ఇక్కడ సుమారు 15 వేల షాపులుంటాయని అంచనా. ఒక్కో షాపు ఎంతలేదన్నా కనీసం రోజుకు సగటున రూ.5 లక్షల వ్యాపారం చేస్తే ఇందులో కనీసం రూ.2 లక్షల వరకు అన్‌రిజిస్టర్ ఖాతాలోనే జమ అవుతాయి.అంటే బిల్లింగ్‌లో లేకుండా జీఎస్టీ రూపంలో ఆయా షాపులు జనాల నుంచి వసూలు చేసే సొమ్ము రోజుకు సుమారు రూ.300 కోట్లన్న మాట!!. ...పైరెండు సంఘటనలు శ్రీనివాస్, నారాయణకే కాదండోయ్!! మనలో చాలా మందికి అనుభవమే. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తర్వాతైతే మరీనూ!! ఒకరేమో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తుంటే.. మరొకరు జీఎస్టీ నుంచి మినహాయించిన ఉత్పత్తులపైన కూడా పన్ను వసూ లు చేసేస్తున్నారు. ఇంకొకరేమో విభాగాల వారీగా కాకుండా అన్ని రకాల ఉత్పత్తులకూ ఒకే రకమైన జీఎస్టీని వసూలు చేస్తున్నారు. దండుకునే తీరేదైనా మొత్తంగా సామాన్యులపై జీఎస్టీ పేరిట లూట్ జరుగుతోంది. -
‘సేవల్లో’ కుటుంబ సంస్థల వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరళీకరణ కారణంగా దేశంలో స్వతంత్ర కుటుంబ వ్యాపార సంస్థలు (స్టాండలోన్ ఫ్యామిలీ ఫరమ్స్) వృద్ధి చెందుతున్నాయి. తయారీ రంగంలో కుటుంబ వ్యాపార సంస్థలు, సేవల రంగంలో స్వతంత్ర కుటుంబ వ్యాపార సంస్థలు వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నట్లు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లోని ఫ్యామిలీ ఎంటర్ప్రైజ్ సెంటర్ థామస్ స్కమిధినీ స్టడీ నివేదించింది. ♦ డాక్టర్ నుపుర్ పవన్ బంగ్, ప్రొఫెసర్ కవిల్ రామచంద్రన్, ప్రొఫెసర్ సౌగతా రాయ్ (ఐఐఎం కోల్‌కతా)ల బృందం 1990–2015 మధ్య కాలంలో ఇండియన్ ఫ్యామిలీ బిజినెస్‌ల తీరుపై పరిశోధన జరిపింది. దీనికోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో నమోదైన 4,809 కంపెనీలను పరిగణలోకి తీసుకుంది. ♦ ఆయా కంపెనీలను షేర్‌హోల్డింగ్, మేనేజ్మెంట్ నియంత్రణలను బట్టి రెండు రకాలుగా విభజించారు. కుటుంబ వ్యాపార సంస్థలు (ఎఫ్బీ), కుటుంబేతర వ్యాపార సంస్థలు (ఎన్‌ఎఫ్‌బీ). ఎఫ్బీలను కూడా కుటుంబ వ్యాపార సమూహ అనుబంధ సంస్థలు (ఎఫ్బీజీఎఫ్), స్వతంత్ర కుటుంబ వ్యాపార సంస్థలు (ఎస్ఎఫ్ఎఫ్) అని 2 రకాలుగా విభజించింది. ఎన్ఎఫ్బీలను ప్రభుత్వ యాజమాన్య సంస్థలు (ఎస్ఓఈ), బహుళజాతి అనుబంధ సంస్థలు (ఎంఎన్సీ), వ్యాపార బృంద అనుబంధ సంస్థలు (ఓబీజీఎఫ్)గా విభజించింది. ♦ 73 శాతం స్వతంత్య్ర కుటుంబ వ్యాపార సంస్థలు 1981–1995 మధ్య ప్రారంభమైతే... ఈ సమయంలో ప్రారంభమైన ఓబీజీఎఫ్ సంస్థలు 49 శాతమే. స్వతంత్ర కుటుంబ సంస్థలకు టోకు వర్తకం, ఆర్ధిక సేవలు, సమాచార సాంకేతిక (ఐటీ) రంగాలంటే అత్యంత ప్రీతిపాత్రం. అందుకే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం వృద్ధి వాటా పెరుగుతోంది. -
వ్యాపారంపై యోగా ముద్ర
అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో వాణిజ్య, వ్యాపార సంస్థలు.. యోగాకు సంబంధించిన అనేక ఉత్పత్తులు, సేవలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. యోగా నేర్పించే ఈ-గైడ్లు, చాపలు, ఆధునిక యోగా పరికరాలు, యోగా దుస్తులు వంటి 500 రకాలకు పైగా వస్తువులతో స్నాప్‌డీల్ ఇంటర్నెట్ విక్రయ సంస్థ యోగా స్టోర్‌ను ప్రారంభించింది. ఈ వారంలో 150 పైగా వస్తువులపై ప్రత్యేక రాయితీలు కూడా అందిస్తోంది. అలాగే.. ఆరోగ్య సేవలు అందించే వీఎల్సీసీ సంస్థ తన కేంద్రాలన్నింటిలో ఉచిత యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఫ్రీకల్చర్, రీబాక్ వంటి సంస్థలు యోగా టీ-షర్టులు, ఇతర దుస్తులను మార్కెట్లోకి తెచ్చాయి. ఈబే వెబ్సైట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్టోర్‌లో యోగా సీడీలు, డీవీడీలను విక్రయానికి పెట్టారు. ఇక యాత్రా.కామ్ వంటి ప్రయాణ వెబ్సైట్లు.. వినియోగదారుల కోసం ప్రత్యేక యోగా ప్యాకేజీలు ప్రకటించాయి. ఉత్తరాన హృషికేశ్, దక్షిణాన కోవళం వంటి ప్రాంతాల్లో మూడు నుంచి పది రోజుల యోగా విహార యాత్రల ప్యాకేజీలను ప్రకటించిన యాత్రా.కామ్.. కనీసం రూ. 30,000 నుంచి గరిష్టంగా రూ. 96,500 వరకూ ధరలు నిర్ణయించింది. -
వ్యాపారాభివృద్ధికి... మేనేజ్మెంట్ కన్సల్టెంట్
అట్టహాసంగా ప్రారంభించిన వ్యాపార సంస్థ ఆశించినంతగా విజయవంతం కావడం లేదు. కంపెనీ ఉత్పత్తులపై వినియోగదారులు ఆసక్తి చూపట్లేదు. సంస్థ ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అభివృద్ధి ఆగిపోయింది. నష్టాలే మిగులుతున్నాయి. లోపాలు ఎక్కడున్నాయో కనిపెట్టలేకపోతున్నారు, వాటిని ఎలా సరిదిద్దాలో తెలియడం లేదు. ఈ సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం.. మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌ను ఆశ్రయించడం. కంపెనీని గాడిన పెట్టి, లాభాల బాట పట్టించడం ఎలాగో కన్సల్టెంట్ విడమరిచి చెబుతాడు. వ్యూహాలు రూపొందిస్తాడు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆపద్బాంధవుడిలా ఆదుకుంటాడు. వ్యాపారంపై ఆసక్తి ఉన్న యువతకు సరిగ్గా నప్పే నయా కెరీర్... మేనేజ్మెంట్ కన్సల్టెంట్. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటుండడంతో కన్సల్టెంట్లకు చేతినిండా పని దొరుకుతోంది. అదేస్థాయిలో ఆదాయం ఖాతాలోకి చేరుతోంది. కంపెనీ లాభాల్లో కన్సల్టెంట్‌కు వాటా కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాభివృద్ధి కోసం మేనేజ్మెంట్ కన్సల్టెంట్లను నియమించుకుంటున్నాయి. నిపుణులకు రూ.లక్షల వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇక కన్సల్టింగ్ సంస్థల్లో లెక్కలేనన్ని ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించబోయే ఎంటర్‌ప్రెన్యూర్స్ సైతం మేనేజ్మెంట్ కన్సల్టెంట్లను సంప్రదిస్తున్నారు. వ్యాపారంలో మెళకువలు తెలుసుకుంటున్నారు. సొంత బిజినెస్ ప్రారంభించి పది మందికి ఉపాధి చూపాలనే ఆశయం ఉన్నవారు మొదట మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా కొన్నాళ్లు పనిచేసి అనుభవం సంపాదించిన తర్వాత రంగంలోకి దిగితే విజయం సాధించడం ఖాయమని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. కన్సల్టెంట్లకు క్లయింట్లను బట్టి ఆదాయం ఉంటుంది. తమ సూచనలతో బిజినెస్ పెరిగితే వచ్చిన లాభాల్లో కొంత శాతాన్ని కమీషన్‌గా తీసుకుంటారు. సొంతంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకుంటే ఆదాయం భారీగానే ఉంటుంది. ఈ వృత్తిలోకి ప్రవేశించడానికి ఎంబీఏ డిగ్రీ ఒక పాస్‌పోర్ట్ లాంటిది. అయితే, ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు కూడా ఇందులో రాణిస్తున్నారు. నైపుణ్యాలు మేనేజ్మెంట్ కన్సల్టెంట్లకు కంపెనీ డేటాను విశ్లేషించడానికి అనలిటికల్ నైపుణ్యాలు, క్లయింట్లను ఒప్పించడానికి మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎప్పటికప్పుడు వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకోవడానికి లెర్నింగ్ స్కిల్స్ అవసరం. కన్సల్టెంట్ సరైన సలహాలు ఇవ్వకుంటే కంపెనీ తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి నూటికి నూరు శాతం అంకితభావంతో పనిచేయాలి. ఇందులో పని ఒత్తిళ్లు, సవాళ్లు అధికంగా ఉంటాయి. వాటిని తట్టుకొనే నేర్పు చాలా ముఖ్యం. అర్హతలు కన్సల్టింగ్ జాబ్‌ను సొంతం చేసుకోవాలంటే ప్రముఖ విద్యాసంస్థ నుంచి మేనేజ్మెంట్ డిగ్రీని అందుకోవాలి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, ఎంబీఏలో చేరొచ్చు. ఈ కోర్సు చదివితే మేనేజ్మెంట్ అసోసియేట్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు. వేతనాలు అనుభవం, ప్రతిభ కలిగిన మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల ఆదాయాలకు ఆకాశమే హద్దు అని చెప్పుకోవచ్చు. ప్రారంభంలో ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వేతన ప్యాకేజీ అందుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత ఈ ప్యాకేజీ రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెరుగుతుంది. అనుభవం ఆధారంగా జీతభత్యాల్లో పెరుగుదల ఉంటుంది. పదేళ్ల అనుభవంతో లీడర్షిప్ హోదాకు చేరుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు 1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)-అహ్మదాబాద్ వెబ్సైట్: www.iimahd.ernet.in 2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)-బెంగళూరు వెబ్సైట్: www.iimb.ernet.in 3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)-కలకత్తా వెబ్సైట్: www.iimcal.ac.in 4. ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్-ఢిల్లీ వెబ్సైట్: http://fms.edu/ 5. ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: http://imi.edu/ 6. మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: జ్ట్టిఞ://ఝఛీజీ.్చఛి.జీ/ 7. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ-ఘజియాబాద్ వెబ్సైట్: http://imt.edu/ వ్యాపార వ్యూహాల్లో కీలకం మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్‌కు కెరీర్‌పరంగా ఉత్తమ మార్గం..కన్సల్టెంట్‌గా స్థిరపడడం. వ్యాపార, వాణిజ్య వ్యూహాల్లో వీరిది కీలకపాత్ర. అకడమిక్, జాబ్ కన్సల్టెన్సీలకు ధీటుగా ప్రస్తుతం మేనేజ్మెంట్ కన్సల్టెంట్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రతిభ, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే ఈ రంగంలో విజయవంతం కావచ్చు. వ్యాపార విస్తరణకు అనుకూల, ప్రతికూల అంశాలను విశ్లేషించగలగడం, మార్కెట్ పరిస్థితులను అంచనా వేయగ లిగే సామర్థ్యం ఉండాలి. గ్లోబలైజేషన్‌తో వ్యాపార లావాదేవీల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, ఎనలిటికల్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే కెరీర్లో విజేతగా నిలవొచ్చు. - ప్రొఫెసర్ కల్యాణ్ సి.చేజర్ల, ప్లేస్‌మెంట్స్, ఫ్యాక ల్టీ ఇన్ ఆపరేషన్స్ ఏరియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ- హైదరాబాద్ -
కాసుల పేరు
టెక్నాలజీతో పరుగులు పెడుతున్న జనాన్ని అందుకోవడానికి బడాచోటా వ్యాపార సంస్థలు కూడా ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నాయి. ఆన్లైన్లో దూసుకుపోతూ బిజినెస్ పెంచుకుంటున్నాయి. చెప్పుల నుంచి కేశతైలం వరకు అన్ని వస్తువులు సింగిల్ క్లిక్‌తో కస్టమర్లకు చేరుస్తున్నాయి. ప్రత్యేకంగా పోర్టల్స్ క్రియేట్ చేసుకుని మరీ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాయి. వెబ్‌లోకంలో వ్యాపారం చేయాలంటే పోర్టల్‌కు క్యాచీ నేమ్ ఉండాలి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ముందుగానే డొమైన్ నేమ్స్‌ను బ్లాక్ చేసి అట్టే పెట్టుకుంటున్నారు. పలు వ్యాపార సంస్థలు, సెలబ్రిటీలు, ట్రెండీ పేర్లతో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసుకుని బిజినెస్ చేసుకుంటున్నారు. సదరు డొమైన్‌నేమ్స్ అవసరం అయిన వారికి లక్షలు చెల్లిస్తే గానీ రైట్స్ ఇవ్వడం లేదు. సిటీలో ఈ తరహా నవతరం బిజినెస్ ఇపుడు ఊపందుకుంది. హైదరాబాద్ పేరుతో ఓ వెబ్ పోర్టల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా..? దానికి డొమైన్‌నేమ్ ‘హైదరాబాద్.కామ్’అని పెట్టాలని మీరు ఫిక్సయితే మాత్రం కష్టమేనండోయ్. ఇదే డొమైన్ నేమ్‌తో మీరు వెబ్‌పేజ్ క్రియేట్ చేయాలంటే మాత్రం అక్షరాలా ఐదు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేంటి డొమైన్‌నేమ్ రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు రూ.500 మించి ఉండదంటారా..! ఆ పేరుకున్న క్రేజ్ అలాంటిది మరి. ఎప్పుడో పదేళ్ల కిందట రిజిస్టర్ అయిన ఈ డొమైన్‌నేమ్ మీకు రూ.500కు దొరుకుతుందనుకుంటే పొరపాటే మరి. ఇదొక్కటే కాదు డొమైన్‌నేమ్స్ పేరిట కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తోంది. ఇటీవల నగరంలో ‘డొమైన్‌నేమ్ ఓనర్స్ అసోసియేషన్’ రెండు సార్లు సమావేశమైంది కూడా. ముందుచూపు ఉన్న వాడే మనిషోయ్! అని ఎవరన్నారో కానీ, ఫ్యూచర్ సెన్స్‌తో కోట్లు ఆర్జిస్తున్న వారు ఎందరో ఉన్నారు. సినిమా పేర్లు, రాజకీయ పార్టీల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే.. కొందరు కాస్త వెరైటీ పేర్లను డొమైన్నేమ్స్గా రిజిస్టర్ చేసుకుని పెట్టుకుంటున్నారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న పేరు ఎవరికైనా అవసరం వచ్చిందనుకోండి.. వారి పంట పండినట్టే. వెబ్సైట్ నిర్మాణం మొదలైనప్పుడే ఈ డొమైన్‌నేమ్స్ వ్యాపారం పురుడు పోసుకుంది. మన దేశంలో ఓ పదేళ్ల నుంచి డొమైన్‌నేమ్ బిజినెస్ ఊపందుకుంది. నగరాలు, ప్రముఖ వ్యక్తుల పేర్లతో కొందరు బోలెడన్ని డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసేశారు. ‘చిరంజీవి.కామ్’ ఇలా రిజిస్టర్ అయ్యిందే. ఆ పేరుని చిరంజీవికి ఇవ్వడానికి సదరు డొమైన్‌నేమ్ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్టు చెబుతారు. సిటీలో డొమైన్‌నేమ్ బిజినెస్ చేసే వాళ్లు నగరాలు, ప్రముఖుల పేర్లే కాదు పత్రికల పేర్లు, పాపులర్ పదాలనూ వదలడం లేదు. ఇంతైతే ఓకే.. డొమైన్‌నేమ్స్ క్యాష్ చేసుకుంటున్న వ్యక్తులు సిటీలో ఓ వంద మందికిపైగానే ఉన్నారు. వీరొక్కక్కరూ వందల్లో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. విదేశాలకు వెళ్లిన టెకీలు బుర్రకు పదనుపెట్టి మరీ డొమైన్‌నేమ్స్ బుక్ చేసుకుంటున్నారు. మన దేశంలో ఉన్న వ్యాపారాలు, వ్యవహారాలను అప్డేట్ చేసుకుంటూ డొమైన్‌నేమ్స్ తయారు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ పేర్లు కావాల్సిన వారికి చుక్కలు చూపెడుతున్నారు. ఎదుటివారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో పాఠశాలలకు సంబంధించి ఓ వెబ్సైట్ పెట్టి బిజినెస్ చేయాలనుకున్న ఓ వ్యక్తి ‘స్కూల్ల్యాబ్. కామ్’ అనే వెబ్‌సైట్‌ని రిజిస్టర్ చేసుకుందామని ప్రయత్నించగా.. అది రెండేళ్ల కిందటే బుక్ అయిపోయినట్టు తెలుసుకున్నాడు. ఆరా తీస్తే అమెరికాలోని ఓ తెలుగాయన ఆ పేరు రిజిస్టర్ చేసుకున్నట్టు తెలుసుకున్నాడు. ఏం చేస్తాడు.. ఆ అమెరికా బుల్లోడికి రూ.35 వేలు సమర్పించుకుని ఆ డొమైన్‌నేమ్ సొంతం చేసుకున్నాడు. జై తెలంగాణ.. తెలంగాణ వచ్చాక ఆ పేరుకు ఎంత డిమాండ్ ఉంటుందో ముందో ఊహించిన కొందరు నాలుగైదేళ్ల కిందటే రకరకాల పేర్లతో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసుకుని పెట్టుకున్నారు. తెలంగాణస్టేట్.కామ్, తెలంగాణఫుడీస్.కామ్, తెలంగాణ.జువెలరీస్.కామ్.. ఇలా ఓ పాతిక, యాభై పేర్లను బుక్ చేసేశారు. ఏ బడాబాబుకైనా వాటి అవసరం పడితే ఆ డొమైన్‌నేమ్ ఓనర్ పంట పండినట్టే. నేమ్ అండ్ డొమైన్‌నేమ్.. ఈ ట్రెండ్ గురించి డొమైన్‌నేమ్ అండ్ వెబ్సైట్ బిజినెస్ చేస్తున్న బ్రియోఫ్యాక్టర్స్ ఎండీ రాజశేఖర్ ఏమంటారంటే.. ‘గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు మన నగరంలో డొమైన్నేమ్ల యజమానుల సంఖ్య బాగా వేగంగా పెరుగుతోంది. ఎంతలా అంటే.. బిడ్డకు పేరు పెట్టిన వెంటనే ఆ పేరుతో డొమైన్నేమ్లు క్రియేట్ చేసుకుంటున్నారు కొందరు. అదేంటంటే.. ఏమో ఏం చెప్పగలం వీడు పెద్దయ్యాక సెలెబ్రిటీ అయితే వాడి పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలంటే ఎలా? అంటున్నారు కొందరు తల్లిదండ్రులు. నిజానికి ఇది మంచి పరిణామమే. మన సెలిబ్రెటీలలో చాలామందికి వారి పేరుతో వారివద్ద డొమైన్‌నేమ్స్ లేవు. అలాగే ప్రస్తుతం ప్రతి వ్యాపారానికి వెబ్సైట్ కంపల్సరీ. అందుకే కొందరు ముందుగానే ఊహించి కొన్ని రకాల డొమైన్‌నేమ్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు’ అని చెప్పారు. ఇంకెందుకాలస్యం.. మీరు కూడా డొమైన్‌నేమ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి వెళ్లి మీకు తోచిన నాలుగు క్రియేటివ్ పదాలతో డొమైన్నేమ్లు రిజిస్టర్ చేసుకుని పెట్టుకోండి. డొమైన్‌నేమ్స్ రూపంలో మీ అదృష్టం మీ తలుపు తట్టొచ్చు.. ధనలక్ష్మి మీ నట్టింట్లో తిష్టవేయొచ్చు. - భువనేశ్వరి -
పిల్లలను పనిలో పెట్టుకుంటే శిక్షార్హులు
సీనియర్ సివిల్ జడ్జి సీతారామకృష్ణారావు మార్కాపురం టౌన్ : వ్యాపార సంస్థలు, గృహాల్లో పద్నాలుగేళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా శిక్షార్హులవుతారని సీనియర్ సివిల్ జడ్జి కె.సీతారామకృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం ఐసీడీఎస్ అర్బన్ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పదేళ్ల క్రితం బాల కార్మికులు ఎక్కువగా ఉండేవారని, ప్రస్తుతం కొంతమేర బాల కార్మికుల సంఖ్య తగ్గిందని చెప్పారు. పిల్లలను తప్పక బడికి పంపించేలా తల్లిదండ్రుల్లో చైతన్యం తేవాలని సూచించారు. చైల్డ్‌లై న్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.కిశోర్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని 250 పట్టణాల్లో చైల్డ్‌లైన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో 13 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు గుర్తించగా, అనధికారికంగా ఈ సంఖ్యకు ఎన్నోరెట్లు ఎక్కువగా బాల కార్మికులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. బాలకార్మికులను అరికట్టడంలో అంగన్వాడీ సిబ్బంది పనితీరు బాగుందని ప్రశంసించారు. తప్పిపోయిన, వీధి బాలలు, ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలలు, బాల్యవివాహాలకు బలవుతున్న బాలలు, అంగవైకల్యం, భిక్షాటన చేస్తున్న బాలలు, అనాథ బాలలను గుర్తించి 1098 నంబర్‌కు ఫోన్ చేసినట్లయితే చైల్డ్‌లైన్ ద్వారా వారికి రక్షణ కల్పించి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ వై.ధనలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు, న్యాయవాది ఝాన్సీ, చైల్డ్ లైన్ బృంద సభ్యుడు సీతారామమూర్తి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
బంద్ సక్సెస్
మూతపడిన విద్యా,వ్యాపార సంస్థలు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం ధర్నా, రాస్తారోకోలతో దద్ధరిల్లిన జిల్లా తిరుపతి, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు బుధవారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమైక్యవాదులు సోనియాగాంధీ, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలతో పట్టణాలు, పలె ్లలు దద్ధరిల్లాయి. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఆధ్వ ర్యంలో సమైక్యవాదులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యకర్తలతో కలసి పట్టణ వీధుల్లో స్కూటర్ ర్యాలీ చేపట్టి బంద్‌ను పర్యవేక్షించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు మానవహారం నిర్మించి రాస్తారోకో నిర్వహించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మదనపల్లె-చిత్తూరు మార్గంలో బసినికొండ వద్ద వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. చిత్తూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. నిరసనకారులు గాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే సీకే.బాబు అనుచరులు, టీడీ పీ కార్యకర్తలు విడివిడిగా గాంధీ విగ్రహం కూడలిలో ఆందోళన చేపట్టారు. తిరుపతి భవానీనగర్ సర్కిల్లో సాప్స్ ఆధ్వర్యం లో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాప్స్ నాయకులు సోనియా, సుష్మాస్వరాజ్ దిష్టి బొమ్మలను తగులబెట్టి నిరసన తెలిపారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించగా తెలుగు మహిళలు చీపుర్లతో రోడ్డు శుభ్రం చేసి విభజనకు నిరసన తెలిపారు. టౌన్‌క్లబ్ కూడలిలో ఎన్జీవో జేఏసీ, తిరుపతి ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకారులు సోనియా, రాహుల్‌గాంధీ, చిదంబరం దిష్టి బొమ్మలను పాదరక్షలతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం వాటిని తగులబెట్టారు. మబ్బు చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాల యాలు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నడవలేదు. సమెక్యవాదులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర ్త డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో బంగారుపాళెంలో బంద్ జరిగింది. కార్యకర్తలు ర్యాలీ, ధర్నా నిర్వహించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. తవణంపల్లి, యాదమరి మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం వద్ద చెన్నై జాతీయ రహదారిపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పుత్తూరు, నగరిలో మధ్యాహ్నం వరకు బంద్ సంపూర్ణంగా జరిగింది. పుంగనూరులో వైఎస్ఆర్ సీపీ నాయకులు రెడ్డెప్ప, నాగభూషణం, వెంకటరెడ్డియాదవ్, నాగరాజరెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. నిరసనకారులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. యూపీఏ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలమనేరు నియోజకవర్గంలోని అన్ని మండలా ల్లో వైఎస్ఆర్ సీపీ నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. పలమనేరులో కార్యకర్తలు, సమైక్యవాదులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. బస్సు లు డిపోలకే పరిమితమయ్యాయి. పట్టణంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవే ట్ కార్యాలయాలు మూతపడ్డాయి. శ్రీకాళహస్తిలో గుమ్మడి బాలకృష్ణారెడ్డి, మిద్దెల హరి తదితరుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. సమైక్యవాదులు ఏపీ సీడ్స్, సూపర్‌బజార్, ఆర్టీసీ కూడళ్లలో రాస్తారోకో చేశారు. టీడీపీ కార్యకర్తలు విడిగా బంద్‌ను పర్యవేక్షించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఆయా మండలాలకు చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పీలేరులో బస్సులు నడవలేదు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. వైఎస్ఆర్ సీపీ నాయకులు, సమైక్యవాదులతో కలసి ర్యాలీ చేపట్టి పీలేరు క్రాస్‌రోడ్స్‌లో రాస్తారోకో నిర్వహించారు.