పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. ఎందరికో చేతినిండా పని. కానీ కరోనా కారణంగా దాదాపు ఆరునెలలుగా పనిలేక పస్తులున్న వివిధ వృత్తుల వారికి ఇప్పుడిప్పుడే కాస్త ఊరట లభిస్తుంది. ముందున్నవి శుభముహూర్తాల రోజులు కావడంతో చేతినిండా పని దొరకనుంది. కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడుకల్లో జాగ్రత్తలు చాలా అవసరం అని తెలుపుతున్నారు.
సాక్షి, నిర్మల్ చైన్‌గేట్: కరోనా సంక్షోభంలో చిక్కుకున్న వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పండుగలకు తోడు వరుసగా శుభముహూర్తాలు ఉండటంతో వ్యాపార సంస్థలు కళకళలాడుతున్నాయి. గత నెల 29 నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లో పెళ్లి సందడి కనిపిస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలు కుంటున్న వ్యాపార వాణిజ్య సంస్థలకు బతుకమ్మ పండుగలతో గిరాకీ పెరిగింది. రానున్న పెళ్లి ముహూర్తాలతో మరింత జోరందుకుంది. జనతా కర్ఫ్యూతో మొదలై మూడు నెలల పాటు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేశారు. ఆ మూడు నెలల్లో ముహూర్తాలు ఉన్నప్పటికీ పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత కొన్ని ముహూర్తాలు వచ్చినా తక్కువ మందితో వివాహాలు జరిపించారు. ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసుకుందామని కలలు కన్నవారు వాయిదా వేసుకోలేక, కా నిచ్చేద్దామనుకున్న వారు ఇంటి ముందర పాత పద్ధతుల్లో పచ్చని పందిళ్లు వేసి మమ అనిపించేశారు. చదవండి: కాజల్ అగర్వాల్ వెరీ వెరీ స్పెషల్
మూడు నెలలు సందడే సందడి
శుభముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిజ ఆశ్వీయుజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసాల్లోనూ శుభముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. గత నెల 18 నుంచి ఎంగేజ్‌మెంట్ పత్రిక రాసుకోవడం వంటి కార్యక్రమాలు మొదలు పెట్టారు. మంచి రోజులు కావడంతో పెళ్లికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శుభ ముహూర్తాలతో దాదాపు మూడు నెలల పాటు పెళ్లిల సందడి ఉండే అవకాశాలున్నాయి. 2021 జనవరి రెండో వారం నుంచి నాలుగు నెలలపాటు ముహూర్తాలకు బ్రేక్ పడనుండటంతో ఈ సీజన్లోనే శుభకార్యాలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈనెల 4 నుంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. జనవరి 16నుంచి నాలుగు నెలల పాటు ఈ శుభ ముహూర్తాలకు విరామం రానుంది.
మార్కెట్‌కు కొత్త శోభ..
మార్కెట్లలో దసరా బతుకమ్మ పండుగలతో మొదలైన సందడి వచ్చే రెండు మూడు నెలల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది నెలలుగా కరోనాతో ప్రజలు రాక బోసిపోయిన వ్యాపారాలన్నీ ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. దీంతో వ్యాపార కూడళ్ల దగ్గర రద్దీ పెరిగింది. వస్త్రాలు, బంగారం దు కాణాలు, లేడీస్ ఎంపోరియాలు, ఫర్నీచర్, స్టీల్ పాత్రల దుకాణాలు ఇలా పెళ్లిళ్లకు అవసరమైన అన్ని రకాల వస్తువుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లికి కావలసిన సామగ్రి కొనడానికి వస్తున్న ప్రజలతో దుకాణాలన్నీ మునుపటి కళను సంతరించుకున్నాయి. దసరాకు మొదలైన షాపింగ్ కళ నేటికీ కొనసాగుతోంది. కరో నాతో కొట్టుమిట్టాడిన వ్యాపారస్తులు ప్రస్తుతం కాస్త ఊపిరితీసుకుంటున్నారు.
వృత్తులకు ఊరట
ఇన్నాళ్లు ఉపాధి కోల్పోయిన వేలాది మంది వివిధ వృత్తుల వాళ్లకు ఇ ప్పు డు కొంత ఊరట కలుగుతోంది. ప్రధానంగా వంటవారు, క్యాటరింగ్ , డె కరేటర్స్ , టెంట్‌హౌస్, ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఫంక్షన్ హాల్స్, స్వర్ణకారులు, ఫర్నీచర్ తయారీదారులు, దర్జీలు, కార్లు, జీపులు, బస్సుల యజమానులు, డ్రైవర్లు, సన్నాయివాయిద్య కళాకారులకు పని దొరకనుంది. ఇక పెళ్లి వేడుకల్లో పాల్గొనే కులవృత్తుల వారైన చాకలి, మంగలి వారికి కూడా ఉపాధి లభించనుంది. ఇంతకాలం చేతిలో పని లేక ఇబ్బందిపడ్డ వే లాది కుటుంబాలకు ప్రస్తుతం పని లభిస్తుండటంతో వారు బిజీ అ య్యా రు. నెలల తరబడిగా చేయడానికి పనులు లేక చాలా మంది ఇతర పనుల కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే రెడీమేడ్ వస్త్రాల రాకతో ఉపాధి కో ల్పోయి న దర్జీలు కరోనా కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దసరా సీ జన్‌తోపాటు పెళ్లిళ్ల సీజన్ రావడంతో వారికి కొంత ఉపశమనం కలిగింది.
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే సుమా..
కరోనా కంగారు కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది.. కానీ జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా పూర్తిగా మాయం కాలేదని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలలో కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్నారు. వేడుకలు చేస్తూ.. పెద్ద సంఖ్యలో జనం ఒక దగ్గర గుమిగూడటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని తెలుపుతున్నారు. సానిటైజర్ల వాడకం తప్పనిసరి అని తెలుపుతున్నారు. సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలని అజాగ్రత్తగా ఉండకూడదని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment