Wedding time
-
Voting urgent than marriage: ఓటుకు సుముహూర్తం!
మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు. కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వదార్పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్‌ను పోలింగ్ స్టేషన్ ముందు ఏఎన్ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్‌ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువుఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో! – సాక్షి, నేషనల్ డెస్క్ -
శుభ ఘడియలు షురూ..
పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. ఎందరికో చేతినిండా పని. కానీ కరోనా కారణంగా దాదాపు ఆరునెలలుగా పనిలేక పస్తులున్న వివిధ వృత్తుల వారికి ఇప్పుడిప్పుడే కాస్త ఊరట లభిస్తుంది. ముందున్నవి శుభముహూర్తాల రోజులు కావడంతో చేతినిండా పని దొరకనుంది. కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడుకల్లో జాగ్రత్తలు చాలా అవసరం అని తెలుపుతున్నారు. సాక్షి, నిర్మల్ చైన్‌గేట్: కరోనా సంక్షోభంలో చిక్కుకున్న వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పండుగలకు తోడు వరుసగా శుభముహూర్తాలు ఉండటంతో వ్యాపార సంస్థలు కళకళలాడుతున్నాయి. గత నెల 29 నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లో పెళ్లి సందడి కనిపిస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలు కుంటున్న వ్యాపార వాణిజ్య సంస్థలకు బతుకమ్మ పండుగలతో గిరాకీ పెరిగింది. రానున్న పెళ్లి ముహూర్తాలతో మరింత జోరందుకుంది. జనతా కర్ఫ్యూతో మొదలై మూడు నెలల పాటు కఠినంగా లాక్డౌన్ అమలు చేశారు. ఆ మూడు నెలల్లో ముహూర్తాలు ఉన్నప్పటికీ పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత కొన్ని ముహూర్తాలు వచ్చినా తక్కువ మందితో వివాహాలు జరిపించారు. ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసుకుందామని కలలు కన్నవారు వాయిదా వేసుకోలేక, కా నిచ్చేద్దామనుకున్న వారు ఇంటి ముందర పాత పద్ధతుల్లో పచ్చని పందిళ్లు వేసి మమ అనిపించేశారు. చదవండి: కాజల్ అగర్వాల్ వెరీ వెరీ స్పెషల్ మూడు నెలలు సందడే సందడి శుభముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిజ ఆశ్వీయుజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసాల్లోనూ శుభముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. గత నెల 18 నుంచి ఎంగేజ్మెంట్ పత్రిక రాసుకోవడం వంటి కార్యక్రమాలు మొదలు పెట్టారు. మంచి రోజులు కావడంతో పెళ్లికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శుభ ముహూర్తాలతో దాదాపు మూడు నెలల పాటు పెళ్లిల సందడి ఉండే అవకాశాలున్నాయి. 2021 జనవరి రెండో వారం నుంచి నాలుగు నెలలపాటు ముహూర్తాలకు బ్రేక్ పడనుండటంతో ఈ సీజన్లోనే శుభకార్యాలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈనెల 4 నుంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. జనవరి 16నుంచి నాలుగు నెలల పాటు ఈ శుభ ముహూర్తాలకు విరామం రానుంది. మార్కెట్‌కు కొత్త శోభ.. మార్కెట్లలో దసరా బతుకమ్మ పండుగలతో మొదలైన సందడి వచ్చే రెండు మూడు నెలల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది నెలలుగా కరోనాతో ప్రజలు రాక బోసిపోయిన వ్యాపారాలన్నీ ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. దీంతో వ్యాపార కూడళ్ల దగ్గర రద్దీ పెరిగింది. వస్త్రాలు, బంగారం దు కాణాలు, లేడీస్ ఎంపోరియాలు, ఫర్నీచర్, స్టీల్ పాత్రల దుకాణాలు ఇలా పెళ్లిళ్లకు అవసరమైన అన్ని రకాల వస్తువుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లికి కావలసిన సామగ్రి కొనడానికి వస్తున్న ప్రజలతో దుకాణాలన్నీ మునుపటి కళను సంతరించుకున్నాయి. దసరాకు మొదలైన షాపింగ్ కళ నేటికీ కొనసాగుతోంది. కరో నాతో కొట్టుమిట్టాడిన వ్యాపారస్తులు ప్రస్తుతం కాస్త ఊపిరితీసుకుంటున్నారు. వృత్తులకు ఊరట ఇన్నాళ్లు ఉపాధి కోల్పోయిన వేలాది మంది వివిధ వృత్తుల వాళ్లకు ఇ ప్పు డు కొంత ఊరట కలుగుతోంది. ప్రధానంగా వంటవారు, క్యాటరింగ్ , డె కరేటర్స్ , టెంట్‌హౌస్, ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఫంక్షన్ హాల్స్, స్వర్ణకారులు, ఫర్నీచర్ తయారీదారులు, దర్జీలు, కార్లు, జీపులు, బస్సుల యజమానులు, డ్రైవర్లు, సన్నాయివాయిద్య కళాకారులకు పని దొరకనుంది. ఇక పెళ్లి వేడుకల్లో పాల్గొనే కులవృత్తుల వారైన చాకలి, మంగలి వారికి కూడా ఉపాధి లభించనుంది. ఇంతకాలం చేతిలో పని లేక ఇబ్బందిపడ్డ వే లాది కుటుంబాలకు ప్రస్తుతం పని లభిస్తుండటంతో వారు బిజీ అ య్యా రు. నెలల తరబడిగా చేయడానికి పనులు లేక చాలా మంది ఇతర పనుల కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే రెడీమేడ్ వస్త్రాల రాకతో ఉపాధి కో ల్పోయి న దర్జీలు కరోనా కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దసరా సీ జన్తోపాటు పెళ్లిళ్ల సీజన్ రావడంతో వారికి కొంత ఉపశమనం కలిగింది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే సుమా.. కరోనా కంగారు కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది.. కానీ జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా పూర్తిగా మాయం కాలేదని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలలో కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్నారు. వేడుకలు చేస్తూ.. పెద్ద సంఖ్యలో జనం ఒక దగ్గర గుమిగూడటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని తెలుపుతున్నారు. సానిటైజర్ల వాడకం తప్పనిసరి అని తెలుపుతున్నారు. సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలని అజాగ్రత్తగా ఉండకూడదని సూచిస్తున్నారు. -
ప్రేమించి..పెళ్లికి ముందు ప్లేటు ఫిరాయింపు
చిక్కడపల్లి: ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి పెళ్ళికి ముందు రోజు పరారయ్యాడు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ భీంరెడ్డి తెలిపినమేరకు.. చిక్కడపల్లి పీ అండ్ టీ క్వార్టర్స్‌కు చెందిన యువతి(25,) మియాపూర్‌కు చెందిన నవీన్ నాలుగేళ్ళుగా ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యులు కూడా పెళ్ళికి ఆంగీకరించారు. ఫిబ్రవరి 28 న వీరి నిశ్చితార్థం జరిగింది. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు నవీన్ యువతికి పోన్ చేసి పెళ్ళి వాయిదా చేసుకుందామని బలవంతం చేశాడు. అయితే కారణం మాత్రం చెప్పలేదు. తమకుముఖ్యమైన పనులున్నాయని కుటుంబసభ్యులు కూడా పేర్కొన్నారు. దీంతో యువతి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో కేసు నమోదు చేశారు. నవీన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
నమ్మించి.. వంచించి..
విశాఖపట్నం, రావికమతం: రెండేళ్లుగా ప్రేమించాడు... కులాలు వేరైనా వివాహం చేసుకుంటానన్నాడు.తీరా వివాహ ముహూర్తం సమయానికి పరారై యువతికి తీరని ఆవేదన మిగిల్చాడు. న్యాయం చేయాలని కోరుతూ ఆ దళిత యువతి అత్తింటి ముందు గురువారం ఆందోళనకు దిగింది. కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని మర్రివలస గ్రామానికి చెందిన దళిత యువతి కొత్తి హరితేజ (20) అదే గ్రామం కాపు సామాజిక వర్గానికి చెందిన గూటాల శివాజి (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరైనా.. హరితేజ విశాఖలో బీఎస్సీ నర్సింగ్ చేస్తుండగా శివాజి పీజీ చేసి గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కులాలు వేరైనా పెద్దల అంగీకారం లేకున్నా వివాహం చేసుకుంటానని నమ్మించడంతో ఇరువురూ మరింత దగ్గరయ్యారు. అయితే శివాజీకి గర్నికం గ్రామానికి చెందిన మరొక యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న హరితేజ గ్రామ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లింది. పెద్దలు సైతం ప్రేమించిన యువతికి న్యాయం చేయాలని హితవు పలికారు.తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని అవసరమైతే హరితేజకు నష్టపరిహారం చెల్లిస్తామని శివాజి రాజీకి ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా.. వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. దీనిపై ఆమె కొత్తకోట సీఐ కోటేశ్వరరావును ఆశ్రయించింది. ఆయన శివాజీ, తల్లిదండ్రులకు ఇటీవల కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వివాహానికి ఒప్పుకున్న శివాజి పెద్దల సమక్షంలో పూచీకత్తులు కూడా రాశాడు. ఈ మేరకు గురువారం రోలుగంటలోని దేవాలయంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. అయితే ముహూర్త సమయం వరకూ వచ్చేస్తున్నానంటూ చెప్పిన శివాజీ ఆపై ముహూర్తం దాటిపోయినా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయానని గుర్తించిన పెండ్లికుమార్తె హరితేజ మర్రివలసలో అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రియుడు శివాజి, అతని తల్లిదండ్రులు భవాని, తాతబ్బాయితోపాటు గర్నికం, బైలపూడి గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తకోట ఏఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మాయి ‘ఆడ’పిల్ల కాదు మనపిల్లే!
ఆత్మీయం అమ్మాయి పుట్టగానే ఆడపిల్ల పుట్టిందంటారు. అందులో అనౌచిత్యం లేదు. ఇక్కడ పుట్టిన ఓ మొలక, మరొక వంశవృక్షానికి వేరుగా మారి, వివిధ శాఖలు, కొమ్మలు, పుష్పాలు, ఫలాలతో పదికాలాలు పచ్చగా ఉండడానికి దృఢత్వాన్నిస్తుంది. అందుకే అమ్మాయిని ‘ఆడ’ పిల్ల అంటారు. వివాహసమయంలో పాలికలలో నవధాన్యాలు మొలకెత్తించి నీళ్ళలో వదలడమనే ఆచారం దీనినే సూచిస్తుంది. నీళ్ళలో కలిసిన విత్తనం మరేదో ఒడ్డుకు చేరి, మొక్క మొలిచి, పెద్ద వృక్షమైనట్లే ఇక్కడ పుట్టిన అమ్మాయి, మరొక ఇంటి వంశానికి మూలమవుతుందని అర్థం. మన ఇంటి ఆడపిల్ల మరో ఇంటి వారికి మూలంగా మారడం మనకు కూడా ఆనందదాయకమే. అయితే, ఆమె మరో ఇంటికి వెళ్లినంత మాత్రాన మన ఇంటికి చెందినది కాకుండా పోదు, ఆమె జీవించి ఉన్నంత కాలం ఫలానా వారి ఆడపడచు అనే అంటారు. ఆడపడచు మన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమగా, ఆదరంగా, అభిమానంగా చూసి, చీరా సారే పెట్టి పంపిస్తాం. అది మన కనీస ధర్మం. మర్యాద. మన ఇంటి ఆడపిల్లతో బంధం తెగిపోకుండా ఉండేందుకే గృహప్రవేశానికైనా, మరే శుభకార్యానికైనా ఆమెను తీసుకు వస్తాం. మర్యాద చేస్తాం.