
నవీన్ నిశ్చితార్థం చిత్రం (పైల్)
చిక్కడపల్లి: ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి పెళ్ళికి ముందు రోజు పరారయ్యాడు. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ భీంరెడ్డి తెలిపినమేరకు.. చిక్కడపల్లి పీ అండ్ టీ క్వార్టర్స్‌కు చెందిన యువతి(25,) మియాపూర్‌కు చెందిన నవీన్ నాలుగేళ్ళుగా ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యులు కూడా పెళ్ళికి ఆంగీకరించారు. ఫిబ్రవరి 28 న వీరి నిశ్చితార్థం జరిగింది. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే పెళ్లికి రెండు రోజుల ముందు నవీన్ యువతికి పోన్ చేసి పెళ్ళి వాయిదా చేసుకుందామని బలవంతం చేశాడు. అయితే కారణం మాత్రం చెప్పలేదు. తమకుముఖ్యమైన పనులున్నాయని కుటుంబసభ్యులు కూడా పేర్కొన్నారు. దీంతో యువతి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో కేసు నమోదు చేశారు. నవీన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment