హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరళీకరణ కారణంగా దేశంలో స్వతంత్ర కుటుంబ వ్యాపార సంస్థలు (స్టాండలోన్ ఫ్యామిలీ ఫరమ్స్) వృద్ధి చెందుతున్నాయి. తయారీ రంగంలో కుటుంబ వ్యాపార సంస్థలు, సేవల రంగంలో స్వతంత్ర కుటుంబ వ్యాపార సంస్థలు వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నట్లు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లోని ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజ్ సెంటర్ థామస్ స్కమిధినీ స్టడీ నివేదించింది.
♦ డాక్టర్ నుపుర్ పవన్ బంగ్, ప్రొఫెసర్ కవిల్ రామచంద్రన్, ప్రొఫెసర్ సౌగతా రాయ్ (ఐఐఎం కోల్‌కతా)ల బృందం 1990–2015 మధ్య కాలంలో ఇండియన్ ఫ్యామిలీ బిజినెస్‌ల తీరుపై పరిశోధన జరిపింది. దీనికోసం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నమోదైన 4,809 కంపెనీలను పరిగణలోకి తీసుకుంది.
♦ ఆయా కంపెనీలను షేర్‌హోల్డింగ్, మేనేజ్‌మెంట్ నియంత్రణలను బట్టి రెండు రకాలుగా విభజించారు. కుటుంబ వ్యాపార సంస్థలు (ఎఫ్‌బీ), కుటుంబేతర వ్యాపార సంస్థలు (ఎన్‌ఎఫ్‌బీ). ఎఫ్‌బీలను కూడా కుటుంబ వ్యాపార సమూహ అనుబంధ సంస్థలు (ఎఫ్‌బీజీఎఫ్), స్వతంత్ర కుటుంబ వ్యాపార సంస్థలు (ఎస్‌ఎఫ్‌ఎఫ్) అని 2 రకాలుగా విభజించింది. ఎన్‌ఎఫ్‌బీలను ప్రభుత్వ యాజమాన్య సంస్థలు (ఎస్‌ఓఈ), బహుళజాతి అనుబంధ సంస్థలు (ఎంఎన్‌సీ), వ్యాపార బృంద అనుబంధ సంస్థలు (ఓబీజీఎఫ్)గా విభజించింది.
♦ 73 శాతం స్వతంత్య్ర కుటుంబ వ్యాపార సంస్థలు 1981–1995 మధ్య ప్రారంభమైతే... ఈ సమయంలో ప్రారంభమైన ఓబీజీఎఫ్ సంస్థలు 49 శాతమే. స్వతంత్ర కుటుంబ సంస్థలకు టోకు వర్తకం, ఆర్ధిక సేవలు, సమాచార సాంకేతిక (ఐటీ) రంగాలంటే అత్యంత ప్రీతిపాత్రం. అందుకే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం వృద్ధి వాటా పెరుగుతోంది.
‘సేవల్లో’ కుటుంబ సంస్థల వృద్ధి
Published Wed, Sep 27 2017 12:31 AM | Last Updated on Wed, Sep 27 2017 12:31 AM
Advertisement