మేనేజ్‌మెంట్ విద్యలో మెరికల్లాంటి విద్యార్థులను సానబెట్టి ప్రపంచ సంస్థలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అందిస్తోంది. ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో, వ్యాపార ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ, ఉన్నత స్థాయిలో, విశ్వవ్యాప్తంగా రాణిస్తున్నారు.
దేశంలోని బిజినెస్ స్కూల్స్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అగ్రస్థానంలో నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్‌టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ 2024 విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
ప్రపంచంలోని అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్‌లో ఐఎస్‌బీ 31వ ర్యాంకింగ్‌ను దక్కించుకుంది. గత ఏడాది ఐఎస్‌బీ 39వ స్థానంలో ఉండగా ఈసారి ఏకంగా 31 స్థానానికి దూసుకుపోయింది. మరోవైపు ఆసియాలోని టాప్ బీ స్కూల్స్‌లో 6 నుంచి 5వ స్థానానికి చేరుకుంది. రీసెర్చ్‌పరంగా భారత్‌లో నంబర్‌వన్ ర్యాకింగ్‌ను దక్కించుకోగా అంతర్జాతీయంగా 52వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థను 2001లో స్థాపించారు. 260 ఎకరాల్లో (110 హెక్టార్లు) ఇది విస్తరించి ఉంది. ఇందులో 130 నుంచి 210 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేలా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment