Business School
-
భారత్‌లో టాప్ బిజినెస్ స్కూల్ ఇదే..
మేనేజ్మెంట్ విద్యలో మెరికల్లాంటి విద్యార్థులను సానబెట్టి ప్రపంచ సంస్థలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అందిస్తోంది. ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో, వ్యాపార ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ, ఉన్నత స్థాయిలో, విశ్వవ్యాప్తంగా రాణిస్తున్నారు. దేశంలోని బిజినెస్ స్కూల్స్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అగ్రస్థానంలో నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ 2024 విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్‌లో ఐఎస్బీ 31వ ర్యాంకింగ్‌ను దక్కించుకుంది. గత ఏడాది ఐఎస్బీ 39వ స్థానంలో ఉండగా ఈసారి ఏకంగా 31 స్థానానికి దూసుకుపోయింది. మరోవైపు ఆసియాలోని టాప్ బీ స్కూల్స్‌లో 6 నుంచి 5వ స్థానానికి చేరుకుంది. రీసెర్చ్‌పరంగా భారత్‌లో నంబర్‌వన్ ర్యాకింగ్ను దక్కించుకోగా అంతర్జాతీయంగా 52వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థను 2001లో స్థాపించారు. 260 ఎకరాల్లో (110 హెక్టార్లు) ఇది విస్తరించి ఉంది. ఇందులో 130 నుంచి 210 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేలా ఏర్పాటు చేశారు. -
ప్రపంచంలోనే మేటి ఇండియన్ బీస్కూళ్లు..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్ల జాబితాలో నాలుగు ఇండియన్ బీస్కూళ్లు చోటు సంపాదించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2024లో భాగంగా ప్రపంచంలోని 100 మేటి బిజినెస్ స్కూళ్ల జాబితాను తయారు చేశారు. అందులో ఐఐఎం బెంగళూరు-48వ స్థానం, గతేడాది టాప్ ర్యాంక్‌లో ఉన్న ఐఐఎం అహ్మదాబాద్ ఈ ఏడాది 53వ స్థానంలో నిలిచింది. ఐఐఎం కలకత్తా, ఐఎస్బీ వరుసగా 59, 78వ స్థానాల్లో ఉన్నాయి. ఐఎస్బీ మినహా అన్ని సంస్థలు గతేడాదితో పోలిస్తే వాటి స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి. ఐఐఎం ఇండోర్, ఐఐఎం లక్నో, ఐఐఎం ఉదయపూర్లు 150-200 ర్యాంకింగ్ జాబితాలో ఉన్నాయి. ఐఎంఐ దిల్లీ, ఎండీఐ గురుగావ్, ఎక్స్ఎల్ఆర్ఐలు 201-250 బ్యాండ్‌లో, ఐఎంఐ కోల్‌కతా 251+ ర్యాంకింగ్‌లో నిలిచాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా మొదటి 50 సంస్థల్లో నిలిచిన ఏకైక ఇండియన్ ఇన్స్టిట్యూట్గా ఐఐఎం బెంగళూరు నిలిచింది. దీనిలో ఇది 31వ స్థానంలో ఉంది. గత సంవత్సరం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకత్తా, ఐఎస్బీ వరుసస్థానాల్లో నిలిచాయి. -
కెనడాలో హత్యకు గురైన భారతీయ విద్యార్థి
టొరంటో: కెనడాలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న భారతీయ విద్యార్థి ఒకరు దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని కరీంపూర్ చావ్లా గ్రామానికి చెందిన గుర్విందర్ నాథ్(24) టొరంటోలోని బ్రామ్టన్లో ఉంటూ బిజినెస్ స్కూల్లో చదువుకుంటున్నాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మిస్సిస్సౌగాలో ఈ నెల 9న అర్థరాత్రి దాటాక 2.10 గంటల సమయంలో నాథ్ ఒక ఇంట్లో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా కొందరు దుండగులు తీవ్రంగా కొట్టి అతడి దగ్గరున్న విలువైన వస్తువులతోపాటు, కారును తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన నాథ్‌ను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 14న నాథ్ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచాడు. దుండగులు అతడి కారును అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో వదిలేసి వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కారులో పలు ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. నాథ్, దుండగులకు మధ్య గతంలో ఎటువంటి పరిచయం లేదన్నారు. అతడి కారు ఎత్తుకెళ్లేందుకే దుండుగులు పిజ్జా డెలివరీ చేసినట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై టొరంటోలోని భారత్ కాన్సుల్ జనరల్ సిద్ధార్థ నాథ్ విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. ఈ నెల 27న నాథ్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2021 జులైలో కెనడా వెళ్లిన నాథ్ చివరి సెమిస్టర్లో ఉన్నాడని, చదువు పూర్తయ్యాక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నాడని అతడి స్నేహితులు తెలిపారు. ఆదివారం నాథ్ స్మత్యర్థం సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసౌగాలో కొవ్వొత్తులతో నివాళులరి్పంచారు. -
దేశంలో నంబర్‌వన్ బిజినెస్ స్కూల్ ‘ఐఎస్బీ’
సాక్షి, రాయదుర్గం: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ స్కూల్‌గా మరోసారి గుర్తింపు పొందింది. అదేవిధంగా ప్రపంచంలో 29వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్–2023ని సోమవారం ప్రకటించారు. గతేడాది ప్రపంచస్థాయిలో 38వ స్థానంలో ఉన్న ఐఎస్బీ ఈసారి 29వ స్థానంలో నిలవడం విశేషం. ఈ ర్యాంకులతో ఐఎస్బీ అసాధారణమైన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లకు మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్లయింది. ఇక భవిష్యత్‌లో అనుకూలించే ప్రోగ్రామ్‌ల విభాగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ర్యాంకు పొందిన ఐఎస్బీ.. ఎఫ్టీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ఓపెన్ ర్యాంకింగ్ 2023లో దేశంలో మూడవ స్థానం, ప్రపంచంలో 65వ స్థానంలో నిలిచింది. కాగా గ్రోత్ పారామీటర్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఐఎస్బీ డిప్యూటీ డీన్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెర్నింగ్ ప్రొఫెసర్ దీపామణి మాట్లాడుతూ ఎఫ్టీ ర్యాంకింగ్‌లో ఉన్నతస్థానంతో పాటు భవిష్యత్తు ఉపయోగం పారామీటర్‌లో నంబర్ వన్ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుత ర్యాంకింగ్ తాము మరింతగా కష్టించి పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సమిష్టి కృషికి ఇది నిదర్శనమన్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్తో భేటీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే! -
ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్ కళాశాల ర్యాగింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్పల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేయగా.. మరో అయిదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహ్మద్ ఇమాద్, సోహైల్, వర్షిత్, గణేష్, వాసుదేవ్ వర్మ నే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇంత జరిగిన నిర్లక్ష్యంగా వ్యవహరించినా కాలేజీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారు. కాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి(ఐబీఎస్) కళాశాలలో విద్యార్థి హిమాంక్ బన్సాల్‌పై సీనియర్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన జరిగిన ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక్క విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని దాదాపు 10 మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. హాస్టల్ గధిలో బంధించి బాధితుడిపై కూర్చొని, పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలను వీడియో తీయగా.. బాధిత విద్యార్థి దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దాడికి పాల్పడిన 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. కారణం అదేనా! అయితే ఐసీఎఫ్ఏఐ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. కొంతకాలం లవ్ చేసుకున్నాక వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని అవమానిస్తూ పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తన బంధువైన సీనియర్ విద్యార్థికి చెప్పింది. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. అతడు తన స్నేహితులను వెంటబెట్టుకుని హాస్టల్లో ఉన్న యువకుడిపై దాడి చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ 15 నుంచి 20 మంది సీనియర్లు తన హాస్టల్ గదిలోకి చొరబడి కొట్టారని బన్సల్ ఫిర్యాదులో పేర్కొన్నారు -
ఐబీఎస్ విద్యార్థుల మధ్య గొడవ.. కేటీఆర్‌కు వీడియో పోస్టు
సాక్షి, హైదరాబాద్: ఓ కళాశాలలో విద్యార్థుల చాటింగ్ వ్యవహారం గొడవలకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. అయితే జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ చేశారని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు, సైబరాబాద్ కమిషనర్‌కు షేర్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి (ఐబీఎస్) కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ఇక్ఫాయి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరూ తమ స్నేహితులకు విషయం చెప్పారు. రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఈ విషయం ఇరువర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ గొడవ పడొద్దని రాజీ కుదిర్చి పంపారు. అయితే.. ఓ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు.దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత గొడవ వైరల్ చేస్తున్నారు: సీఐ ఇక్ఫాయి కళాశాల విద్యార్థుల మధ్య ఈ నెల ఒకటో 1న గొడవ జరిగింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి.. వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే.. కావాలని ఎవరో విద్యార్థులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. చదవండి: మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..! -
వీఎస్బీతో డిజిటల్ స్కాలర్ అవగాహన ఒప్పందం
సాక్షి, అమరావతి : వీఐటీ ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్.. డిజిటల్ స్కాలర్‌తో అవగాహాన ఒప్పందం చేసుకుంది. గురువారం వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. డిజిటల్ స్కాలర్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డా ఎస్.వి.కోటా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ డిజిటల్ స్కాలర్ అనేది డిజిటల్ మార్కెటింగ్ విద్యను అందించే సంస్థ, డిజిటల్ మార్కెటింగ్ సేవల్లో దిగ్గజమైన ఎకోవీఎమ్ఈ అనుబంధ సంస్థ. ఎకోవీఎంఈ బ్యాంకులు, హోటళ్లు, ఉత్పత్తి తయారీ పరిశ్రమలు, విద్యాసంస్థలకు తన డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందిస్తోంది. 2019లో మొట్టమొదటిసారిగా సాంప్రదాయ మార్కెటింగ్ కోసం ఖర్చును మించి డిజిటల్ మార్కెటింగ్‌పై పెడుతున్న ఖర్చు పెరుగుతోంది. దీనికి కారణం వినియోగదారులు ఆన్లైన్ మాధ్యమాలలో ఎక్కువగా ఉన్నారు. సాంకేతిక పురోగతితో సరైన సమయంలో డిజిటల్ పరికరాల్లో వినియోగదారులను చేరుకోవడానికి ఏఐ, మెషీన్ లెర్నింగ్ వంటివి అవసరమైన మార్కెటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి’’ అని అన్నారు. అనంతరం వీఐటీ-ఎపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, డీన్ డా ఎస్. జయవేలు మాట్లాడుతూ.. ‘‘ డిజిటల్ మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ బీబీఏ ప్రోగ్రాం ద్వారా డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న డిమాండ్‌ను ఈ ప్రోగ్రాం పరిష్కరిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు ఏకకాలంలో అకాడమిక్, రియల్ టైం నైపుణ్యాలను నేర్చుకోవటం జరుగుతుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత వారికి ధృవీకరణ పత్రం అందించబడుతుంది. బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థులు కంటెంట్ మేనేజర్స్, స్ట్రాటజిస్ట్స్, వర్చువల్ రియాలిటీ డెవలపర్స్ అండ్ ఎడిటర్స్, ఎస్ఈఓ, ఎసీఈఎమ్ స్పెషలిస్ట్స్, యూఎక్స్ డిజైనర్, ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్స్, డైరెక్టర్స్, ఎనలిస్ట్స్, ఏఐ స్పెషలిస్ట్స్ వంటి ఉద్యోగాలలో ప్రవేశించవచ్చు.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ-ఏపీ రిజిస్ట్రార్ డా.. సి.ఎల్.వి. శివకుమార్,ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు బెంగళూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 25వ తేదీన బెంగళూరుకు వెళ్లనున్నారు. ఆయన 26వ తేదీ కూడా అక్కడే ఉంటారు. 27న తాడేపల్లి నివాసానికి తిరిగి వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూలులో సీటు వచ్చిందని, తన కుమార్తెను పారిస్‌కు పంపేందుకు వైఎస్ జగన్ బెంగళూరుకు వెళుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్‌లో ఇన్సీడ్ ఒకటి. అక్కడ హర్షారెడ్డి మాస్టర్స్ చేయనున్నారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్ సాధించారు. ఇప్పటికే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ(ఎంఎన్సీ)లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా.. దానిని వదులుకుని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేయడానికి మొగ్గుచూపారు. -
ఎయిర్పోర్ట్ సిటీలో ఎడ్యుపోర్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సిటీలో అద్భుతమైన విద్యాసంస్థ అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ‘ఎడ్యుపోర్టు’రూపుదిద్దుకోనుంది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిరొట్రోపొలిస్ లిమిటెడ్ (జీహెచ్‌ఏఎల్) ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే సెయింట్‌మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రానున్న మూడేళ్లలో వినియోగంలోకి తేవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా విద్య, పరిశోధనా సంస్థలను అభివృద్ధి చేసే లక్ష్యంతో జీహెచ్‌ఏఎల్ ఈ అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ‘ఎడ్యుపోర్ట్’పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానమై ఉంటుంది. అన్ని వయసులు, నేపథ్యాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన అధ్యయన కోర్సులను ఇందులో అందుబాటులోకి తెస్తారు. ఓ నాలెడ్జ్ హబ్‌గా.. ఇక ఈ ఎడ్యుపోర్ట్ను ఓ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. లెర్నింగ్, ట్రైనింగ్, రీసెర్చ్, ఇన్నొవేషన్ సెంటర్‌గా ఈ ఎడ్యుపోర్ట్లో బిజినెస్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, ఏవియేషన్ అకాడమీ, ఎయిరోస్పేస్ ఇంజ నీరింగ్, ఫ్లైట్ ట్రైనింగ్, సిమ్యులేటర్ ట్రైనింగ్, ఇంజిన్ మెయింటెనెన్స్ వంటి వాటిలో బోధన, శిక్షణ ఉంటాయి. ఇక ఈ ఎడ్యుకేషన్ క్లస్టర్లో చిన్మయ విద్యాలయ, షూలిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జీఎమ్మార్ ఏవియేషన్ అకాడమీ, ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్, సీఎఫ్ఎం సౌత్ ఏసియా ట్రైనింగ్ సెంటర్, ప్రాట్ అండ్ విట్నీ ఇండియా ట్రైనింగ్ సెంటర్ వంటి సంస్థలు భాగం పంచుకోనున్నాయి. మరోవైపు రెసిడెన్షియల్ అకడమిక్ సదుపాయం కలిగిన సాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం కోసం సెయింట్ మేరీస్ ఎడ్యుకేషన్ సొసైటీతో ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమని జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు బిజినెస్ మేనేజర్ జీబీఎస్ రాజు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పారు. ఎయిర్‌పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈవో అమన్‌కపూర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సిటీలో ఏర్పాటవుతున్న మొదటి విద్యాసంస్థ ఇది. ప్రపంచస్థాయి విద్య, పరిశోధనా సంస్థలను నెలకొల్పి, ఉన్నత విద్యను అందించే వ్యవస్థను నెలకొల్పాలన్న మా లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది’అని వ్యాఖ్యానించారు. -
ఐఎండీ ర్యాంకింగ్‌లో 6 మెట్లు తగ్గిన భారత్
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రముఖ బిజినెస్ స్కూల్ ‘ఐఎండీ’ తాజాగా ప్రకటించిన వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ వెనకపడింది. మొత్తం 63 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 6 మెట్లు తగ్గి 59వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడి, అభివృద్ధి, సంసిద్ధత ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను విడుదలచేయగా.. చైనా (42), రష్యా (47), దక్షిణ ఆఫ్రికా (50)వ స్థానాల్లో నిలిచి, బ్రిక్స్ దేశాల జాబితాలో భారత్‌ను వెనక్కునెట్టాయి. విద్యపై వ్యయం (ప్రతి విద్యార్థికి) తక్కువగా ఉండడం వంటివి ర్యాంకును గణనీయంగా తగ్గించాయని ఐఎండీ బిజినెస్ స్కూల్ స్విట్జర్లాండ్, సింగపూర్ సీనియర్ ఎకనామిస్ట్ జోస్ కాబల్లెరో వ్యాఖ్యానించారు. జీడీపీతో పాటు శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యం, ఆరోగ్య వ్యవస్థ ప్రభావం కూడా భారత ర్యాంక్ తగ్గడానికి కారణాలుగా నిలిచాయన్నారు. జాబితాలో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో.. డెన్మార్క్(2), స్వీడన్(3), ఆస్ట్రియా (4), లక్సెంబర్గ్ (5) ర్యాంకుల్లో నిలిచాయి. -
టాలెంట్‌లో తగ్గిన భారత్
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కి చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్ వార్షిక టాలెంట్ ర్యాంకింగ్‌లో ఈసారి భారత్ రెండు స్థానాలు దిగజారి 53వ స్థానానికి పరిమితమైంది. అయిదోసారీ స్విట్జర్లాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. 63 దేశాలతో ఐఎండీ బిజినెస్ స్కూల్ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో టాప్–5 స్థానాల్లో డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఆసియా దేశాల్లో మాత్రం సింగపూర్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గ్లోబల్ లిస్టులో మాత్రం సింగపూర్‌కు 13వ స్థానం దక్కింది. విద్యపై పెట్టే పెట్టుబడులు ఇతర సంపన్న దేశాల సగటుతో పోల్చినా తక్కువగా ఉండటం, నిపుణులైన విదేశీయులను ఆకర్షించడంలో సమస్యలు ఎదుర్కొంటుండటం తదితర అంశాల కారణంగా చైనా ర్యాంకింగ్ 39కి పరిమితమైంది. భారత్ విషయానికొస్తే.. టాలెంట్ పూల్‌లో సగటు స్థాయి కన్నా మెరుగ్గా ఉందని (సంసిద్ధత ప్రాతిపదికన 30వ స్థానం), మరోవైపు టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులో మాత్రం వెనుకబడి ఉందని (63వ స్థానం) ఐఎండీ బిజినెస్ స్కూల్ పేర్కొంది. టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులు, ఆకర్షణ, సంసిద్ధత అనే మూడు అంశాల ప్రాతిపదికన ర్యాంకులను నిర్ణయిస్తారు. -
ఇష్టపడి చదవండి
పుట్టపర్తి టౌన్ : ఇష్టపడి చదివితే లక్ష్యం ఎంత పెద్దదైనా సులభంగా సాధించవచ్చని సంస్కృతీ విద్యాసంస్థల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సంస్కృతీ స్కూల్స్ ఆఫ్ బిజినెస్‌లో ఫ్రెషర్స్‌డే వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జూనియర్, సీనియర్స్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయ వేషధారణలో విద్యార్థినులు ర్యాంప్ వాక్ నిర్వహించారు. కళాశాల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కష్టపడేతత్వంతోపాటు నెపుణ్యాలను పెం పొందించుకోవడంపై విద్యార్థులు దృష్టిసారిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. ప్రిన్సిపల్ శ్రీనివాసన్, సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు. -
పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాం
-
బిజినెస్ స్కూల్ ప్రారంభించిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం బిజినెస్ స్కూల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా పాల్గొన్నారు. షూలిచ్, జీఎంఆర్ సంయుక్తంగా ఈ బిజినెస్ స్కూల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఈ బిజినెస్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. -
సిరిసిల్లలో ఐఐఏఎం?
- పెద్దూరులో భూములు పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్ - 1600 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తింపు - డీజీపీఎస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు - ఖరారైతే తెలంగాణలోనే తొలి బిజినెస్ స్కూల్ సిరిసిల్ల : సిరిసిల్ల ప్రాంతంలో ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ (ఐఐఏఎం) బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జగిత్యాల సబ్ కలెక్టర్ శ్రీకేశ్ లట్కర్ బుధవారం సిరిసిల్ల మండలం పెద్దూరు శివారులో ప్రభుత్వ భూములను పరిశీలించారు. పెద్దూరులో సర్వే నంబర్ 405, 408, పెద్దబోనాలలో సర్వే నంబర్ 164, 149, సర్దాపూర్ సర్వే నంబర్ 61, వెంకటాపూర్ సర్వే నంబర్ 119లో మూడువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇందులో గుట్టలను మినహాయిస్తే 1600 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఐఐఏఎం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరిన నేపథ్యంలో సిరిసిల్ల ప్రాంతంలో అనువైన స్థలం కోసం సర్వే చేస్తున్నట్లు జేసీ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. గుర్తించిన మూడువేల ఎకరాల భూములను సర్వే చేసేందుకు డిప్రెషన్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (డీజీపీఎస్)ను ఏర్పాటు చేసేందుకు సెంట్రల్ సర్వే అధికారులకు ప్రతిపాదనలు పంపాలని సబ్‌కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ను జేసీ ఆదేశించారు. రూ.18 లక్షల వ్యయంతో డీజీపీఎస్ శాటిలైట్ సిస్టమ్‌తో భూసర్వే చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న 1600 ఎకరాల్లో ఐఐఏఎంతోపాటు ఇతర సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సిరిసిల్లలో ఇప్పటికే రెండో బైపాస్ రోడ్డు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు కోరారు. ప్రస్తుతం ఐఐఏఎం కోసం సేకరిస్తున్న భూమి కూడా బైపాస్ రోడ్డును ఆనుకునే ఉంది. దీంతో చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పే అవకాశముంది. ఐఐఏఎం దరిచేరితే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. సిరిసిల్ల ఐటీ మంత్రి కె.తారకరామారావు సొంత నియోజకవర్గం కావడంతో ఐటీ పరిశ్రమలను ఈ ప్రాంతానికి ఆహ్వానించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు మంత్రి చొరవ చూపుతున్నారు. -
ప్రకృతే ఒక బిజినెస్ స్కూల్!
‘‘మనిషిలోనే మ్యానర్స్ ఉండదు గానీ... క్రియేషన్‌లోనే కామర్స్ ఇమిడి ఉందిరా’’ అన్నాడు మా బావ తాత్వికంగా. ‘‘అదేంటి బావా... ఏదో గొప్పగా చెప్పినట్టే అనిపిస్తుంటుందిగానీ నువ్వేం చెప్పావో అర్థం కాదు’’ అన్నాను నేను. ‘‘మొన్నెవడో ఓ కూత కూశాడ్రా. నాకు సంపాదన చేత కాదట. బిజినెస్ అంటే తెలియదట. లేకపోతే ఎంతో సంపాదించేవాడినట. వాడో పిచ్చోడు. అసలు బిజినెస్ పుట్టుపూర్వోత్తరాలేమిటో నాకు తెలిసినట్టుగా ఎవడికీ తెలియదు. నీకో విషయం తెలుసా? చెట్లూ, జంతువులూ కలిసి మొట్టమొదటిసారిగా కామర్స్‌ను కనిపెట్టాయి, ట్రేడ్‌ను టేకప్ చేశాయి. బిజినెస్ బిగిన్ చేశాయి’’ అన్నాడు మా బావ ఏడేడు పధ్నాలుగు లోకాల్లోని సమస్త కార్పొరేట్ సంస్థలూ నాలోనే ఇమిడి ఉన్నాయిరా అన్నట్లుగా నా వైపు చూస్తూ. ‘‘కొయ్... కొయ్ చెట్లూ, జంతువులూ కలిసి బిజినెస్ చేయడమేంటి బావా?’’ ‘‘మనమంతా జన్మించడానికి ఎంతో ముందుగానే ప్రకృతి మాత ఈ బిజినెస్‌ను ప్రసవించిందిరా. ప్రకృతిని కాస్త పరిశీలనగా చూశాక నాకీ విషయం అర్థమైంది. చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని ఆహారం తయారు చేసుకుంటాయి. దానికి అవసరమైన కార్బన్ డై ఆక్సైడ్‌ను మిగతా జంతువులన్నీ తమ శ్వాసక్రియ ద్వారా చెట్లకు అందిస్తాయి. ఇలా వస్తుమార్పిడి విధానంతో జీవిద్దామని చెట్లూ, జంతువులూ ఒక బిజినెస్ అగ్రిమెంటుకు వచ్చాయన్నమాట. బార్టర్ సిస్టమ్ ఆధారంగా ఎన్నో ఏళ్లుగా ఈ గ్లోబల్ కామర్స్ ఇలా కొనసాగుతోందన్నమాట’’. ‘‘మరి బిజినెస్ అన్న తర్వాత బ్రోకర్లూ, దళారీలూ, కమీషన్ ఏజెంట్లూ ఉంటారు కదా బావా? నువ్వు గొప్పగా చెబుతున్న ప్రకృతిలో వాళ్లెక్కడ?’’ ‘‘అవున్రా... ఇక వాణిజ్యం-వ్యాపారం అన్న తర్వాత బ్రోకరూ, కమిషన్ ఏజెంట్లూ ఉండకపోతే ఎలా? అందుకే ప్రకృతి వాళ్లనూ తయారు చేసింది. ఉదాహరణకు ఒక పువ్వు పూసిందనుకో. అది కాయగా మారడానికి సంపర్కం అవసరం. అందుకే పుప్పొడి... అండాశయాన్ని చేరడానికి వీలుగా సీతాకోకచిలుకలనూ, తుమ్మెదలనూ, హమ్మింగ్ పక్షుల వంటి వాటినీ బ్రోకర్లుగా తయారు చేసుకుంది. వాటికి తేనే-మకరందాలను కమీషన్‌గా చెల్లిస్తూ వాటిని చెట్టు తన కమీషన్ ఏజెంట్లుగా చేసుకుందన్నమాట’’ ‘‘నువ్వెంత చెప్పినా నమ్మబుద్ధి కావడం లేదు. మరి డబ్బు మాటో?’’ ‘‘ఇందాక నేను చెప్పిన కమిషన్ ఏజెంట్ల పని తర్వాత చెట్టు పండ్లను కాస్తుంది. కానీ ఇలా కాస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ గింజ మళ్లీ వేరే చోట నాటుకునేలా చేయాలి. వాస్తవానికి చెట్టు తన వ్యాప్తి కోసం ఒక్క గింజనే తయారు చేసుకుంటే సరిపోయేది కదా. కానీ అక్కడితో ఆగలేదది. బిజినెస్ ఎక్స్పాన్షన్ కార్యక్రమం కింద... తన గింజ చుట్టూ గుజ్జు లాంటిదాన్ని తయారు చేసింది. అది మామిడీ, జామా, దానిమ్మా, నేరేడూ, ఇంకేదైనా కావచ్చు. అలా గింజ చుట్టూ ఉండే గుజ్జును కాసేపు మన మానవ పరిభాషలో డబ్బు అనుకుందాం. దీన్ని ఉడతల్లాంటి జంతువులకూ, మిడతల్లాంటి కీటకాలకూ, పిట్టలకూ పిల్లలకూ ఆశ పెట్టి తన గుజ్జునవి గింజతో సహా తినేలా చేసుకుని... ఎక్కడెక్కడికో తరలించేలా చేస్తుంది. అక్కడ మళ్లీ తన బీజం ఫలించేలా చూస్తుంది. సదరు గుజ్జే సుదూర భవిష్యత్తులో డబ్బు అనే కాన్సెప్ట్‌కు దారితీసేలాంటి ఆలోచన మనిషికి వచ్చేలా చేసిందిరా ప్రకృతి. డబ్బు పుట్టుకకు బాటలు ఇలా పడ్డాయన్నమాట’’ ‘‘మరి కొందరు కలెక్షన్ ఏజెంట్లు డబ్బులు నొక్కేయడాలూ, చిట్ఫండ్సూ, ఫైనాన్సు కంపెనీలు పెట్టి బోర్డులు తిప్పేయడాలూ చేస్తుంటారు కదా... వాళ్లూ ఉన్నారా ప్రకృతిలో?’’ ‘‘ఎందుకు లేరూ? ఉడతల్లాంటి కొన్ని జీవులైతే మొక్క మొలిచేందుకే వీల్లేకుండా గింజలను కరకరా కొరికి తినేస్తాయి. ఇలాగే మరికొన్ని జీవులూ విత్తుల్ని పరపరా నమిలి మింగేసి, ఎప్పటికీ మొలకెత్తకుండా చేస్తాయి. అంటే... వీళ్లేలాంటివాళ్లూ...? కలెక్షన్స్ గట్రా చేశాక డబ్బును సొంతానికి వాడుకునే వాళ్లూ, వసూళ్లు చేశాక బోర్డు తిప్పేసి డబ్బు నొక్కేసే వాళ్లూ ఈ టైపన్నమాట. ఇప్పుడు చెప్పు... ఈ టాటాలూ, బిర్లాలూ, అంబానీలు నా దగ్గరికి ట్యూషన్‌కు వచ్చి ఒక్క గంట ప్రైవేటు చెప్పించుకుంటే తమ సంస్థలను అద్భుతంగా నడిపించేస్తారా, చెయ్యరా?’’ ‘‘మరి.. ఇంత తెలిసినవాడివి నువ్వెందుకు బిజినెస్ చేసి సంపాదించవు?’’ ‘‘ఒరే... కురుక్షేత్రంలో ఆయుధం పట్టని కృష్ణుడికి యుద్ధం తెలియకనా సమరం చేయనిది? నన్ను బావా అని పిలుస్తూ కూడా ఈ ప్రశ్న అడగడానికి సిగ్గులేదూ?’’ అని నాకింత గడ్డిపెట్టాడు తన ‘ట్రేడ్’మార్క్ నవ్వు నవ్వుతూ మా బిజినెస్ బావ. ప్రపంచంలోని ఫస్ట్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలన్నీ తన నోటిలోనే కనిపింపజేసేలా ఉందా నవ్వు! - యాసీన్ -
ఐబీఎస్ హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మక ‘ఆస్కార్స్’
హైదరాబాద్: హైదరాబాద్ ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్ ప్రతిష్టాత్మక కేస్ సెంటర్స్ వార్షిక బిజినెస్ ఎడ్యుకేషన్ ‘ఆస్కార్స్’ అవార్డును గెలుచుకుంది. ఒక ప్రత్యేక అంశానికి సంబంధించి అత్యుత్తమ అధ్యయనం, లేఖనానికి ప్రపంచ స్థాయిలో ఈ అవార్డు గుర్తింపును ఇస్తుంది. ‘‘డిజిటల్ మార్కెటింగ్ ఎట్ నైక్: ఫ్రం కమ్యూనికేషన్ టు డైలాగ్’’ శీర్షికన జరిపిన కేస్ స్టడీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘‘నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్’ విభాగంలో ఈ కేస్ అవార్డును పొందినట్లు ఒక ప్రకటన తెలిపింది. పోటీపూర్వక మార్కెట్లో సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ప్రపంచస్థాయి స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం నైక్ ఎలా విజయం సాధించగలిగిందన్నది అధ్యయన సారాంశం.