ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్ల జాబితాలో నాలుగు ఇండియన్ బీస్కూళ్లు చోటు సంపాదించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2024లో భాగంగా ప్రపంచంలోని 100 మేటి బిజినెస్ స్కూళ్ల జాబితాను తయారు చేశారు. అందులో ఐఐఎం బెంగళూరు-48వ స్థానం, గతేడాది టాప్ ర్యాంక్‌లో ఉన్న ఐఐఎం అహ్మదాబాద్ ఈ ఏడాది 53వ స్థానంలో నిలిచింది. ఐఐఎం కలకత్తా, ఐఎస్‌బీ వరుసగా 59, 78వ స్థానాల్లో ఉన్నాయి. ఐఎస్‌బీ మినహా అన్ని సంస్థలు గతేడాదితో పోలిస్తే వాటి స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి.
ఐఐఎం ఇండోర్, ఐఐఎం లక్నో, ఐఐఎం ఉదయపూర్‌లు 150-200 ర్యాంకింగ్ జాబితాలో ఉన్నాయి. ఐఎంఐ దిల్లీ, ఎండీఐ గురుగావ్, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలు 201-250 బ్యాండ్‌లో, ఐఎంఐ కోల్‌కతా 251+ ర్యాంకింగ్‌లో నిలిచాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా మొదటి 50 సంస్థల్లో నిలిచిన ఏకైక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐఎం బెంగళూరు నిలిచింది. దీనిలో ఇది 31వ స్థానంలో ఉంది.
గత సంవత్సరం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకత్తా, ఐఎస్‌బీ వరుసస్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment