global ranking
-
రూ.50 వేల కోట్ల టర్నోవర్‌ను దాటిన మలబార్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రూ.50 వేల కోట్లను మించి రికార్డు వార్షిక టర్నోవర్ సాధించిందని సంస్థ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ తెలిపారు. సోమాజిగూడ మలబార్ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ లగ్జరీ ప్రోడక్ట్స్‌లో మలబార్ గ్రూప్ 19వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.51,218 కోట్ల వార్షిక రిటైల్ గ్లోబల్ టర్నోవర్ సాధించింది’’ అన్నారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికల్లో భాగంగా దేశ, విదేశాల్లో వచ్చే ఏడాదిలో 100 కొత్త షోరూములు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా అదనంగా 7 వేల మందికి ఉపాధి కలి్పస్తామని అహమ్మద్ పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే మేటి ఇండియన్ బీస్కూళ్లు..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్ల జాబితాలో నాలుగు ఇండియన్ బీస్కూళ్లు చోటు సంపాదించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2024లో భాగంగా ప్రపంచంలోని 100 మేటి బిజినెస్ స్కూళ్ల జాబితాను తయారు చేశారు. అందులో ఐఐఎం బెంగళూరు-48వ స్థానం, గతేడాది టాప్ ర్యాంక్‌లో ఉన్న ఐఐఎం అహ్మదాబాద్ ఈ ఏడాది 53వ స్థానంలో నిలిచింది. ఐఐఎం కలకత్తా, ఐఎస్బీ వరుసగా 59, 78వ స్థానాల్లో ఉన్నాయి. ఐఎస్బీ మినహా అన్ని సంస్థలు గతేడాదితో పోలిస్తే వాటి స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి. ఐఐఎం ఇండోర్, ఐఐఎం లక్నో, ఐఐఎం ఉదయపూర్లు 150-200 ర్యాంకింగ్ జాబితాలో ఉన్నాయి. ఐఎంఐ దిల్లీ, ఎండీఐ గురుగావ్, ఎక్స్ఎల్ఆర్ఐలు 201-250 బ్యాండ్‌లో, ఐఎంఐ కోల్‌కతా 251+ ర్యాంకింగ్‌లో నిలిచాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా మొదటి 50 సంస్థల్లో నిలిచిన ఏకైక ఇండియన్ ఇన్స్టిట్యూట్గా ఐఐఎం బెంగళూరు నిలిచింది. దీనిలో ఇది 31వ స్థానంలో ఉంది. గత సంవత్సరం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకత్తా, ఐఎస్బీ వరుసస్థానాల్లో నిలిచాయి. -
వేగం పెంచిన ఇండియా.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఇలా..
భారతదేశం టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో 5జీ సేవలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫలితంగా డౌన్లోడ్ స్పీడ్ మరింత పెరుగుతోంది. దీంతో ఇండియా గొప్ప పురోగతిని చూపించి తాజాగా మంచి ర్యాంక్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో ఇండియా ప్రస్తుతం 47వ స్థానం పొందినట్లు ఊక్లా (Ookla) నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలకంటే భారత్ ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచింది. కొన్ని G20 దేశాలైన మెక్సికో (90వ స్థానం), టర్కీ (68వ), యూకే (62వ), జపాన్ (58వ), బ్రెజిల్ ( 50వ స్థానం), దక్షిణాఫ్రికా (48వ స్థానం) కూడా ఇండియా కంటే వెనుకబడి ఉన్నట్లు ఊక్లా ఎంటర్ప్రైజ్ ప్రిన్సిపల్ ఇండస్ట్రీ అనలిస్ట్ సిల్వియా కెచిచే తెలిపారు. 5జీ సర్వీస్ ప్రారంభమైన తరువాత దేశంలో ఇంటర్నెట్ వేగం దాదాపు 3.59 రేట్లు పెరిగింది. సెప్టెంబర్ 2022లో డౌన్లోడ్ స్పీడ్ 13.87 Mbpsగా ఉండేది. కాగా 2023 ఆగష్టులో డౌన్లోడ్ స్పీడ్ 50.21 Mbpsకి చేరింది. ఈ కారణంగానే గ్లోబల్ ర్యాంకింగ్‌లో 119 స్థానాల నుంచి 47వ స్థానానికి చేరింది. ఇప్పటికే చాలా సర్వీసులు 4జీ నుంచి 5జీకి అప్డేట్ అవుతున్నాయి. 2003లో మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన చివరి రాష్ట్రాలలో జమ్మూ & కాశ్మీర్ ఒకటి. ఇక్కడ భద్రతా సమస్యలు, ఇంటర్నెట్ షట్డౌన్ల కారణంగా.. మొబైల్ నెట్వర్క్ సేవల్లో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడేవి. నేడు అక్కడ కూడా పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది. ఇదీ చదవండి: ఒక్క నెయిల్ పాలిష్ ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు! ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచడానికి.. ఎయిర్టెల్ 'Airtel Xstream AirFiber'ని ఢిల్లీ, ముంబైలలో ఆగస్ట్ 2023లో ప్రారంభించింది. కాగా ఇప్పుడు జియో ఇటీవల ఎయిర్ ఫైబర్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ సర్వీస్ మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. -
Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే?
సాక్షి,ముంబై: ఫార్చ్యూన్ ప్రచురించిన 2022 గ్లోబల్-500 ర్యాంకింగ్స్‌లో బీమారంగ సంస్థ ఎల్ఐసీ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఐదు ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా నాలుగు ప్రైవేటు రంగానికి చెందినవి. ప్రైవేటు రంగంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ప్రత్యేకతను చాటుకుంది. (Edible Oil: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!) వరుసగా 19వ సంవత్సరం కూడా తాజా గ్లోబల్ 500 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించుకోవడమేకాదు తన ర్యాంక్‌ను మరింత మెరుగుపర్చుకుంది రిలయన్స్. ఈ జాబితాలో భారతదేశపు అత్యున్నత ర్యాంక్‌సాధించిన ప్రైవేట్ రంగ సంస్థగా రిలయన్స్ నిలిచింది. ఈ ఏడాది 51 స్థానాలు మెరుగుపడి 104వ స్థానానికి చేరుకుంది. 2021 ఏడాదిలో ఈ జాబితాలో రిలయన్స్ ర్యాంక్ 155 మాత్రమే. అయితే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్‌లో నిలిచిన ప్రైవేట్ రంగ కంపెనీలు టాటా మోటార్స్, టాట్ స్టీల్ ,రాజేష్ ఎక్స్‌పోర్ట్స్. కాగా గత ఏడాది ఐపీవోకు వచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏకైక ప్రభుత్వరంగ సంస్థ మాత్రమే కావడం విశేషం. ఈ సంవత్సరం ర్యాంకింగ్‌లో రిలయన్స్‌ను అధిగమించి మరీ 98వ స్థానంతో అగ్రస్థానంలో నిలిచింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 142వ స్థానంలో ఉంది. ఐవోసీఎల్ భారతీయ కంపెనీలలో మూడో అత్యుత్తమ ర్యాంకును సాధించింది. ఓఎన్జీసీ 190వ స్థానంతో భారతీయ కంపెనీలలో నాల్గవ స్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 236వ స్థానం, భారత్ పెట్రోలియం 295వ స్థానంలో ఉన్నాయి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో మార్చి 31, 2022 లేదా అంతకు ముందు ముగిసిన సంబంధిత ఆర్థిక సంవత్సరాల్లోని మొత్తం రాబడుల ఆధారంగా కంపెనీలకు ర్యాంక్‌లను కేటాయిస్తుంది. (ఇదీ చదవండి: నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!) -
రిలయన్స్ జియో అరుదైన ఘనత
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా కార్యకలాపాలు నిర్వహించే సంస్థల జాబితాలో జియోకు అత్యుత్తమ ’ఎ–’ లీడర్షిప్ రేటింగ్ దక్కింది. లాభాపేక్ష రహిత సంస్థ సీడీపీ, 2021 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఈ జాబితాలో, భారత్ నుంచి లీడర్షిప్ ర్యాంకింగ్ దక్కించుకున్న ఏకైక టెలికం/డిజిటల్ సంస్థ రిలయన్స్ జియోనే. మరో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ’సి’ రేటింగ్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ గల 272 కంపెనీలను ఈ జాబితా కోసం మరింపు చేసినట్లు సీడీపీ తెలిపింది. వాతావరణ మార్పులు, అడవులు.. నీటి సంరక్షణ వంటి అంశాల్లో ఆయా కంపెనీల పనితీరు, వాటి పారదర్శకత స్థాయి ఆధారంగా రేటింగ్‌లు ఇచ్చినట్లు పేర్కొంది. గతేడాది ’బి’ రేటింగ్ నుంచి జియో ఈ ఏడాది మరో అంచె ఎదిగింది. భారతి ఎయిర్టెల్ రేటింగ్ 2020లో ’డి–’ నుంచి ఈసారి ’సి’ స్థాయికి మెరుగుపడింది. చదవండి: ట్రాయ్‌కు రిలయన్స్ జియో ఫిర్యాదు! ఎందుకంటే.. -
గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో దేశీ దిగ్గజాలు డీలా..రిలయన్స్‌తో పాటు
ముంబై: ప్రయివేట్ రంగంలోని టాప్–500 గ్లోబల్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజాలు వెనకడుగు వేశాయి. అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ర్యాంకులు నీరసించాయి. జూలై 15 కటాఫ్‌గా పరిగణిస్తూ హురున్ గ్లోబల్ రూపొందించిన టాప్–500 తాజా జాబితాలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌సహా.. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్, ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ద్వయం, టెలికం బ్లూచిప్ భారతీ ఎయిర్టెల్ డీలా పడ్డాయి.అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా రూపొందించే ఈ జాబితాలో గతేడాది 11 దేశీ కంపెనీలకు మాత్రమే జాబితాలో చోటు లభించగా తాజాగా 12కు చేరింది. వివరాలు ఇవీ.. విలువ పెరిగినా..: ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 11 శాతం బలపడి 188 బిలియన్ డాలర్లను తాకినప్పటికీ కంపెనీ ర్యాంకు మూడంచెలు తగ్గి 57కు చేరింది. ఈ బాటలో 164 బిలియన్ డాలర్ల విలువతో టీసీఎస్ 75 నుంచి 74వ ర్యాంకుకు నీరసించగా.. 113 బిలియన్ డాలర్ల విలువ గల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 19 పొజిషన్లు క్షీణించి 124వ స్థానానికి చేరింది. ఇక హెచ్డీఎఫ్సీ 52 అంచెలు జారి 301వ ర్యాంకును తాకింది. అయితే ఈ కాలంలో కంపెనీ మార్కెట్ విలువ 1 శాతం పుంజుకుని 56.7 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! కోటక్ మహీంద్రా బ్యాంక్ విలువ 8% తగ్గి 46.6 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. 96 ప్లేస్‌లు క్షీణించి 380వ ర్యాంకుకు చేరింది. కాగా.. బ్యాంకింగ్ బ్లూచిప్ ఐసీఐసీఐ విలువ 36 శాతం జంప్‌చేసి 62 బిలియన్ డాలర్లను అందుకోవడంతో 48 స్థానాలు మెరుగుపడి 268వ ర్యాంకుకు ఎగసింది. కొత్తగా 3 కంపెనీలు గ్లోబల్ టాప్–500 జాబితాలో కొత్తగా దేశీ దిగ్గజాలు విప్రో(457వ ర్యాంకు), ఏషియన్ పెయింట్స్(477), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(498)కు చోటు లభించింది. దేశీయంగా స్టార్టప్‌ల జోరు కొనసాగుతుండటంతో ఇకపై జాబితాలోకి మరిన్ని కంపెనీలు చేరే వీలున్నట్లు హురున్ నివేదిక అభిప్రాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ మార్కెట్ విలువ 15 శాతం పురోగమించి 2.4 లక్షల కోట్ల డాలర్లను తాకింది. తద్వారా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్(గూగుల్) తదుపరి ర్యాంకులను ఆక్రమించాయి. జాబితాలో 243 కంపెనీలతో యూఎస్ టాప్ ర్యాంకును కైవసం చేసుకోగా.. చైనా(47), జపాన్(30), యూకే(24) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
విదేశీ విద్య కలలు కల్లలేనా?
న్యూఢిల్లీ: విదేశాల్లో చదువుకోవాలనుకొం టోన్న 48 శాతం మంది భారతీయ విద్యార్థులపై కోవిడ్ ప్రభావం చూపుతోందని అంతర్జాతీయ విద్యాసంస్థలకు గ్లోబల్ ర్యాంకింగ్ ఇచ్చే క్వాక్వారెల్లీ సైమండ్స్ (క్యూఎస్) రిపోర్టు వెల్లడించింది. ఇప్పటికే ఖరీదైన విదేశీ విద్య, కోవిడ్ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు మరింత సన్నగిల్లడంతో విద్యార్థులు ఇతర అవకాశాలవైపు చూడాల్సి వస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ‘‘ఇండియన్ స్టూడెంట్స్ మొబిలిటీ రిపోర్ట్ 2020, ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ ఆన్ హయ్యర్ ఎడ్యురేషన్ ఛాయిసెస్’’అన్న పేరుతో భారత దేశంలోని విశ్వవిద్యాలయాలూ, కళాశాలలకు రేటింగ్ ఇచ్చే లండన్‌కి చెందిన క్యూఎస్ సంస్థ అధ్యయనం చేసింది. ఇటీవలికాలంలో విదేశీ విద్యనభ్యసించేందుకు సంసిద్ధమౌతోన్న 48.46 శాతం భారతీయ విద్యార్థులపై కోవిడ్ ప్రభావం ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. అయితే ఇందులోని చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ యేతర విద్యార్థులు విదేశాల్లో చదువుకోవా లన్న తమ అభిప్రాయాన్ని పునఃపరిశీలించుకుంటున్నట్టు రిపోర్టు వెల్లడించింది. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (స్టెమ్) విద్యార్థులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలకు డిమాండ్ ఉండవచ్చుననీ, నాన్‌స్టెమ్ విద్యార్థులకు అవకాశాలు తగ్గొచ్చని రిపోర్టు తెలిపింది. విదేశీ విద్యకోసం వెళ్ళే విద్యార్థులపై ప్రభావంతో పాటు, దేశంలో కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే విద్యార్థులపై సైతం కోవిడ్ ప్రభావం ఉండవచ్చునని రిపోర్టు వెల్లడించింది. -
జీడీపీలో 7కు తగ్గిన భారత్ ర్యాంక్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల్లో భారత్ ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి దిగజారింది. 2018లో జీడీపీ పరంగా 2.72 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో బ్రిటన్, ఫ్రాన్స్‌ల తర్వాత స్థానానికి వెళ్లింది. టాప్ 6 దేశాల్లో... అమెరికా (20.5 ట్రిలియన్ డాలర్లు), చైనా (13.6 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.9 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (3.9 ట్రిలియన్ డాలర్లు), బ్రిటన్ (2.82 ట్రిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (2.77 ట్రిలియన్ డాలర్లు) భారత్ కంటే ముందున్నాయి. 2024 నాటికి జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. 2017లో భారత్ ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. స్వల్ప తేడాతో బ్రిటన్ను కూడా దాటేసింది. 2017లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, బ్రిటన్ జీడీపీ 2.64 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ జీడీపీ 2.59 ట్రిలియన్ డాలర్లకే పరిమితం కాగా, తిరిగి 2018లో భారత్‌ను దాటి ఈ రెండు దేశాలు ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి( 5.8%) పడిపోవడం గమనార్హం. 2018–19 సంవత్సరానికి కూడా జీడీపీ 6.8%కి క్షీణించింది. కరెన్సీ విలువల్లో హెచ్చుతగ్గులు, జీడీపీ వృద్ధి నిదానించడం అంతర్జాతీయ జీడీపీ ర్యాంకుల్లో భారత్ కిందకు రావడానికి కారణాలుగా ఈఅండ్‌వై ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. ఎగుమతులు తగ్గడం, డిమాండ్ పడిపోవడం వంటి పరిస్థితులను గుర్తు చేశారు. వృద్ధి తిరిగి గాడిన పడాలంటే ద్రవ్య ప్రోత్సాహకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. -
అంతులేని అంతరం
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలకు అద్దంపట్టే ‘గ్లోబల్ ర్యాంకింగ్’లో భారత పరిస్థితి ఏ మాత్రం మారలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) 149 దేశాలపై వెలువరించిన జెండర్ గ్యాప్ రిపోర్టు, 2018 ప్రకారం భారత్ ర్యాంకు 108. గత సంవత్సరంలోనూ భారత్ ఇదే ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాలు, విద్య, ఆరోగ్యం– మనుగడ, రాజకీయ సాధికారత అంశాల (సబ్ ఇండెక్స్) ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ఈ ర్యాంకులిచ్చింది. నివేదిక ప్రకారం భారత్ వేతన వ్యత్యాసాలను తగ్గించడంలో కొంత ప్రగతి సాధించింది. విద్యా రంగంలో 114వ స్థానంతో మెరుగైన పనితీరు కొనసాగించింది. స్త్రీలను ఆర్థికవ్యవహారాల్లో భాగస్వామిగా చేయడం, అవకాశాలు కల్పించడంలో వెనకబడింది. ఈ విభాగంలో భారత్ 142వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. రాజకీయ సాధికారత విషయంలో గత ఏడాది 15వ ర్యాంక్రాగా, ఈసారి 19కి పడిపోయింది. స్త్రీల ‘ఆరోగ్యం– మనుగడ’ సూచీలో అట్టడుగుకు చేరింది. గత సంవత్సరం 141 స్థానంలో వుండగా ఈ యేడాది 147 స్థానానికి దిగజారింది. ఆర్మీనియా (148), చైనా (149) చివరి రెండు స్థానాల్లో వున్నాయి. ఈ విభాగంలో ఒకటో స్థానానికి చేరిన దేశాల్లో శ్రీలంక కూడా వుండటం విశేషం. ర్యాంకింగ్‌పరంగా తొలి 8 స్థానాల్లోని దేశాలు తమ దేశాల్లో 80 శాతం వరకు అసమానతలను రూపు మాపాయని నివేదిక తెలిపింది. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే స్త్రీ పురుష అంతరాలను పూడ్చే దిశగా దక్షిణాసియాలో మెరుగైన కృషి జరిగిందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సగటు తీసుకుంటే రాజకీయ సాధికారత విషయంలో ఎక్కువ అంతరం (77.1శాతం)ఉంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాల విషయంలోనూ (41.9శాతం) అంతరం ఎక్కువగా వుంది. విద్య (4.4శాతం),ఆరోగ్యం– మనుగడ (4.6శాతం) అంశాల్లో వ్యత్యాసాలను బాగా తగ్గించగలిగారు. మార్పు ఇలా మందగమనంతో సాగితే స్త్రీ పురుషుల మధ్య అంతరాలను మొత్తంగా రూపు మాపాలంటే మరో 108 ఏళ్లు పడుతుందని నివేదిక పేర్కొంది. 48వ ర్యాంకు సాధించిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ దక్షిణాసియా విభాగంలో టాప్ ర్యాంకు (48) సాధించింది. రాజకీయ సాధికారత విషయంలో ముందడుగేసి బంగ్లాదేశ్ మెరుగైన ర్యాంక్ పొందింది. అంతర్జాతీయంగా 8వ ర్యాంకు సాధించిన ఫిలిప్పీన్స్.. ఆసియాలో ర్యాంకింగ్ పరంగా తొలి స్థానంలో వుంది. చైనా 100 నుంచి 103కి దిగజారింది. పాకిస్తాన్ చివరి నుంచి రెండో స్థానంలో వుండగా, యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్ చివరి స్థానంలో వుంది. అగ్రస్థానాన ఐస్‌ల్యాండ్ ఐరోపాలోని ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్ వరసగా మొదటి మూడు ర్యాంకులు సాధించాయి. ఫిన్లాండ్, నికరాగువా, రువాండా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. బ్రిటన్ 15, కెనడా 16, అమెరికా 51, ఆస్ట్రేలియా 53వ ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. -
భారత్ నుంచి కేవలం ఆరు యూనివర్సిటీలే!
న్యూఢిల్లీ : గ్లోబల్ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో మన యూనివర్సిటీలు చాలా తక్కువగా చోటు దక్కించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ 2018లో టాప్-400లో కేవలం భారత్ నుంచి కేవలం ఆరు యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఐదు ఐఐటీలే. కేవలం ఒక్క యూనివర్సిటీ మాత్రమే నాన్-ఐఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఉంది. అది కూడా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ). ర్యాంకింగ్స్‌లో టాప్ భారత యూనివర్సిటీగా ఉన్న ఐఐటీ-ఢిల్లీ, 172 స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది దీని ర్యాంక్ 185. జాబితాలో ఉన్న ఇతర యూనివర్సిటీలు ఐఐటీ-బొంబై 179వ ర్యాంకును, ఐఐఎస్సీ 190వ ర్యాంకును, ఐఐటీ-మద్రాసు 264 ర్యాంకును, ఐఐటీ-కాన్పూర్ 293 ర్యాంకును, ఐఐటీ ఖరగ్‌పూర్ 308 ర్యాంకును సొంతం చేసుకున్నాయి. ఐఐటీ-బొంబై ర్యాంకింగ్ గతేడాది కంటే దాదాపు 40 స్థానాలు పైకి ఎగబాకింది. అయితే రెండేళ్ల పాటు పైకి ఎగిసిన ఐఐటీ-మద్రాసు ర్యాంకింగ్ 2018లో 15 స్థానాలు పడిపోయింది. గతేడాది ఐఐటీ-మద్రాసు ర్యాంకింగ్ 249. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రతేడాది విడుదల అవుతాయి. మొత్తంగా ఈ ర్యాంకింగ్స్‌లో టాప్-3 బెస్ట్ వర్సిటీలుగా మసాచుసెట్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ యూనివర్సిటీలు మంచి ప్రదర్శన కనబర్చినట్టు తెలిసింది. -
గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఐఐటీలు ఢమాల్
న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు) గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఢమాల్ మనిపించాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ మంగళవారం విడుదలచేసిన 2016-17 ర్యాంకింగ్స్‌లో ఐఐటీలు తమ స్థానాలను కోల్పోయాయి. ఈ ర్యాంకింగ్‌లో వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ప్రపంచంలో బెస్ట్‌గా నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో ఇండియాలో అత్యున్నత సంస్థగా మళ్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు బెంగళూరే చోటు దక్కించుకుంది. కానీ టాప్ 150 స్థానం నుంచి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ పడిపోయిందని క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. అయితే ఐఐటీ మద్రాసు మాత్రం టాప్ 250 స్థానాన్ని చేధించి, ఐదు స్థానాలు పైకి ఎగబాకినట్టు ర్యాంకింగ్ల్లో తెలిసింది. 10 ఇండియన్ యూనివర్సిటీలో తొమ్మిది 700 ర్యాంకింగ్‌లో నిలిచాయి. అయితే గతేడాది కంటే ఈ యూనివర్సిటీలు తమ ఈ ర్యాంక్‌లను కోల్పోయాయి. అకాడమిక్, ఎంప్లాయర్ రిప్యూటేషన్ రెండింటి ర్యాంకింగ్‌లోనూ ఈ ఇన్స్టిట్యూట్లు పేలవమైన ప్రదర్శన కనబర్చినట్టు ర్యాంకింగ్ రిపోర్టు వెల్లడించింది. వరల్డ్ టాప్ 100 రీసెర్చ్ ఇంపాక్ట్ ర్యాంకింగ్‌లో కూడా భారత్ నుంచి కేవలం నాలుగు ఇన్స్టిట్యూట్లు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు రీసెర్చ్ రిపోర్టు తెలిపింది. భారత్ బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్గా ఐఐఎస్సీ 11వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ర్యాంకింగ్‌లో పడిపోవడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయని క్యూఎస్ ఇంటిలిజెంట్ యూనిట్ రీసెర్చ్ హెడ్ బెన్ సౌటర్ తెలిపారు. పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లు తక్కువగా ఉండట, ఇతర దేశాలనుంచి పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లను ఇండియా నియమించుకోవడం ర్యాంకింగ్‌లను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ పోటీదారులను ఇండియా పెంచుకుని ఫర్ఫార్మెన్స్ను ఇండియా మెరుగుపరుచుకోవాలని ఈ ర్యాంకింగ్‌లు సూచిస్తున్నట్టు సౌటర్ తెలిపారు. 2004 నుంచి యూఎస్ ఇన్స్టిట్యూషన్సే ఈ ర్యాకింగ్‌లో టాప్ 3 స్థానాలను ఆక్రమించుకుంటూ వస్తున్నాయి.