న్యూఢిల్లీ : గ్లోబల్ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో మన యూనివర్సిటీలు చాలా తక్కువగా చోటు దక్కించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ 2018లో టాప్-400లో కేవలం భారత్ నుంచి కేవలం ఆరు యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఐదు ఐఐటీలే. కేవలం ఒక్క యూనివర్సిటీ మాత్రమే నాన్-ఐఐటీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అది కూడా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ).
ర్యాంకింగ్స్‌లో టాప్ భారత యూనివర్సిటీగా ఉన్న ఐఐటీ-ఢిల్లీ, 172 స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది దీని ర్యాంక్ 185. జాబితాలో ఉన్న ఇతర యూనివర్సిటీలు ఐఐటీ-బొంబై 179వ ర్యాంకును, ఐఐఎస్‌సీ 190వ ర్యాంకును, ఐఐటీ-మద్రాసు 264 ర్యాంకును, ఐఐటీ-కాన్పూర్ 293 ర్యాంకును, ఐఐటీ ఖరగ్‌పూర్ 308 ర్యాంకును సొంతం చేసుకున్నాయి. ఐఐటీ-బొంబై ర్యాంకింగ్ గతేడాది కంటే దాదాపు 40 స్థానాలు పైకి ఎగబాకింది. అయితే రెండేళ్ల పాటు పైకి ఎగిసిన ఐఐటీ-మద్రాసు ర్యాంకింగ్ 2018లో 15 స్థానాలు పడిపోయింది. గతేడాది ఐఐటీ-మద్రాసు ర్యాంకింగ్ 249.
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రతేడాది విడుదల అవుతాయి. మొత్తంగా ఈ ర్యాంకింగ్స్‌లో టాప్-3 బెస్ట్ వర్సిటీలుగా మసాచుసెట్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ యూనివర్సిటీలు మంచి ప్రదర్శన కనబర్చినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment