indian universities
-
దేశంలో ఐఐటీ బాంబే టాప్
సాక్షి, అమరావతి: భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ప్రతిష్టాత్మక క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్–2025లో భారతీయ వర్సిటీలు మెరుగైన ర్యాంకింగ్స్ దక్కించుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 61 శాతం భారతీయ వర్సిటీలు తమ ర్యాంకులను మెరుగుపర్చుకోగా.. 24 శాతం వర్సిటీలు పాత ర్యాంకులనే పొందాయి. కేవలం 9 శాతం వర్సిటీల ర్యాంకులు క్షీణించాయి. అలాగే మూడు కొత్త విశ్వవిద్యాయాలకు క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కింది. జాతీయ స్థాయిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) బాంబే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)–బెంగళూరు, ఐఐటీ ఖరగ్‌పూర్ నిలిచాయి. మెరుగైన ర్యాంకింగ్స్.. ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో ఐఐటీ బాంబే గతేడాది 149వ స్థానంలో ఉండగా.. ఈసారి 118వ ర్యాంక్ దక్కించుకుంది. ఐఐటీ ఢిల్లీ 197వ స్థానం నుంచి 150కి చేరుకుంది. ఐఐఎస్సీ 225 నుంచి 211వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఐఐటీ ఖరగ్‌పూర్ 271 నుంచి 222కు, ఐఐటీ మద్రాస్ 278 నుంచి 263వ ర్యాంకులకు చేరుకున్నాయి. ఐఐటీ కాన్పూర్ ర్యాంకు గతేడాది కంటే స్వల్పంగా తగ్గి 227వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి కనబర్చింది. ఈ వర్సిటీ 407వ ర్యాంక్ నుంచి 328వ ర్యాంకుకు చేరుకొని దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఐఐటీ రూరీ్కకి 335, ఐఐటీ గౌహతికి 477, అన్నా వర్సిటీలకు 383వ ర్యాంక్ వచి్చంది. ఐఐటీ ఇండోర్ 454 నుంచి 477వ ర్యాంక్‌కు పడిపోయింది. జాతీయ స్థాయిలో మొదటి 15 స్థానాల్లో ఐఐటీ వారణాసి (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 531వ స్థానం), జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ(580), శూలినీ వర్సిటీ ఆఫ్ బయో టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (587) వర్సిటీలున్నాయి. ఈ ఏడాది కొత్తగా సింబయాసిస్ ఇంటర్నేషనల్(డీమ్డ్) వర్సిటీ 641–650 ర్యాంకు పరిధిలో.. అలాగే దేశంలో 16వ స్థానం దక్కించుకుంది. టాప్–20లో ఐఐటీ హైదరాబాద్ (681–690), చండీగఢ్ వర్సిటీ (691–700), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి (701–710), యూనివర్సిటీ ఆఫ్ ముంబై (711–720) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వెల్లూరు (791–800), ఎస్ఆర్ఎం చెన్నై (1,000–1,200) చోటు దక్కించుకున్నాయి. 13 ఏళ్లుగా వరల్డ్ నంబర్ వన్‌గా ఎంఐటీ ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుసగా 13వసారి ఎంఐటీ అత్యుత్తమ ఇన్స్టిట్యూట్గా టైటిల్‌ను నిలుపుకుంది. మొత్తం 1,500 విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను కేటాయించగా.. అమెరికా నుంచి అత్యధికంగా 197, బ్రిటన్ నుంచి 90, మెయిన్ ల్యాండ్ చైనా నుంచి 71 వర్సిటీలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ –10 కళాశాలలు/విశ్వవిద్యాలయాలుమసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం హార్వర్డ్ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఈటీహెచ్ జూరిచ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -
భారత వర్సిటీలకు అగ్రాసనం
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాత క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) ఆసియా వర్సిటీల ర్యాంకింగ్స్‌లో భారత్ అత్యధిక విద్యా సంస్థలతో అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం 856 విద్యా సంస్థలతో క్యూఎస్ ఆసియా వర్సిటీ ర్యాంకులను విడుదల చేసింది. ఈ జాబితాలో 148 వర్సిటీలతో భారత్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. గతేడాదితో పోలిస్తే కొత్తగా 37 భారతీయ వర్సిటీలు ర్యాంకులు పొందాయి. టాప్–100 ర్యాంకుల్లో ఏడు భారతీయ వర్సిటీలకు చోటు దక్కింది. క్యూఎస్ సంస్థ అంతర్జాతీయంగా ఉన్నత విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన వర్సిటీలకు 11 సూచికల్లో విశ్లేషించి ర్యాంకులను ఇస్తోంది. దేశంలో ఐఐటీ బాంబే టాప్ ఆసియా క్యూఎస్ ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు మునుపటి ఎడిషన్‌తో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. ఐఐటీ–బాంబే గతేడాది మాదిరిగానే 40వ ర్యాంకులో కొనసాగుతూ భారత్‌లో ఉత్తమ వర్సిటీగా నిలిచింది. ఆ తర్వాత ఐఐటీ–ఢిల్లీ (46), ఐఐటీ–మద్రాస్ (53) స్థిరంగా ఉన్నాయి. ఐఐఎస్సీ బెంగళూరు (58), ఐఐటీ ఖరగ్‌పూర్ (59), ఐఐటీ కాన్పూర్ (63), ఢిల్లీ వర్సిటీ(94) వందలోపు ర్యాంకులు సాధించాయి. 100–200 ర్యాంకింగ్స్‌లో ఐఐటీ గౌహతి 111, ఐఐటీ రూర్కీ 116వ ర్యాంకులో నిలిచాయి. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ 117, బెనారస్ హిందూ వర్సిటీలకు 199, గతేడాది 185 స్థానంలో ఉన్న ఛండీగఢ్ వర్సిటీ 149కి వచ్చింది. కోయంబత్తూరులోని భారతీయార్ వర్సిటీ 205 నుంచి 171కి, అమిటీ వర్సిటీ 200 నుంచి 186కి, వెల్లూరులోని విట్ పది స్థానాలు మెరుగుపర్చుకుని 163 ర్యాంకును సొంతం చేసుకున్నాయి. ఆసియా టాప్ వర్సిటీ ‘పెకింగ్’ భారత్ తర్వాత క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌లో చైనా 133, జపాన్ 96 వర్సిటీలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మయన్మార్, కంబోడియా, నేపాల్ తొలిసారిగా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన పెకింగ్ విశ్వవిద్యాలయం వరుసగా రెండవ ఏడాది టాప్ వర్సిటీగా నిలిచింది. హాంకాంగ్ విశ్వవిద్యాలయం 4వ స్థానం నుంచి రెండవ స్థానానికి ఎగబాకింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్) ఈ ఏడాది రెండో స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయింది. నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ (ఎన్టీయూ) ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. ఏపీ నుంచి ఐదు ప్రభుత్వ వర్సిటీలు తెలుగు రాష్ట్రాల నుంచి 12 వర్సిటీలకు క్యూఎస్ ఆసియా వర్సిటీల జాబితాలో స్థానం లభించింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జపాన్‌కు చెందిన కుమామోటో వర్సిటీతో సమానంగా 228 ర్యాంకును పంచుకుంటోంది. ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్ (301–350), ఉస్మానియా, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర (451–500), అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ (551–600), గుంటూరులోని ఆచార్య నాగార్జున (601–650), విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ, అనంతపురంలోని జేఎన్టీయూ (651–700), ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌లోని ఐసీఎఫ్ఏఐ, గుంటూరులోని కేఎల్‌యూ, విశాఖలోని గీతమ్, విజ్ఞాన్ వర్సిటీలు ఉన్నాయి. టాప్ 10 ఆసియా విశ్వవిద్యాలయాలివీ.. ♦ పెకింగ్ విశ్వవిద్యాలయం (చైనా) ♦ హాంకాంగ్ విశ్వవిద్యాలయం (హాంకాంగ్ ఎస్ఏఆర్) ♦ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (సింగపూర్) ♦ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (సింగపూర్) ♦ సింగువా విశ్వవిద్యాలయం (చైనా) ♦ జెజియాంగ్ విశ్వవిద్యాలయం (చైనా) ♦ ఫుడాన్ విశ్వవిద్యాలయం (చైనా) ♦ యోన్సీ విశ్వవిద్యాలయం (సౌత్ కొరియా) ♦ కొరియా విశ్వవిద్యాలయం (సౌత్ కొరియా) ♦ చైనీస్ యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్ (హాంకాంగ్ ఎస్ఏఆర్) -
మన వర్సిటీలు ప్రపంచంలో మేటి
న్యూఢిల్లీ: విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో అమల్లోకి తీసుకొచి్చన విధానాలు, తీసుకున్న నిర్ణయాలతో భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన వర్సిటీలు ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో కేవలం 12 భారతీయ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య 45కు చేరుకుందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్ఐటీల సంఖ్య పెరిగిందని చెప్పారు. నవ భారత నిర్మాణంలో అవి విశిష్టమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన తన అమెరికా పర్యటనను మోదీ ప్రస్తావించారు. మన దేశ యువత పట్ల ప్రపంచానికి విశ్వాసం పెరిగిందన్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటివల్ల అంతరిక్షం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ వంటి కీలక రంగాల్లో మన దేశ యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. మన విద్యా వ్యవస్థకు ఘన చరిత్ర మైక్రాన్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారత్‌లో పెట్టుబడులు భారీగా పెట్టబోతున్నాయని, మనదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక సూచిక అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ యూనివర్సిటీ అంటే కేవలం ఒక విద్యాలయం కాదని, ఒక ఉద్యమమని వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు సంతోషానికి, సౌభాగ్యానికి వనరులుగా నిలిచాయని చెప్పారు. భారతీయ విద్యావ్యవస్థకు ఘన చరిత్ర ఉందన్నారు. విదేశీయుల నిరంతర దాడుల వల్ల భారతీయ విద్యావ్యవస్థ కుప్పకూలిందని, తద్వారా అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం అనంతరం వర్సిటీలు నైపుణ్యం కలిగిన యువతను దేశానికి అందించాయని, అభివృద్ధికి పాటుపడ్డాయని మోదీ ప్రశంసించారు. ‘యుగే యుగే భారత్’ మ్యూజియం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గిరిజన ప్రదర్శనశాలలు(మ్యూజియమ్స్) ఏర్పాటు చేశామని, ఢిల్లీలోని ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ ద్వారా స్వతంత్ర భారత్ అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకోవచ్చని నరేంద్ర మోదీ చెప్పారు. ‘యుగే యుగే భారత్’ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని ఢిల్లీలో నిర్మిస్తున్నామని తెలిపారు. మన స్టార్టప్ కంపెనీల సంఖ్య లక్ష మార్కును దాటిందన్నారు. 2014లో కేవలం వందల సంఖ్యలోనే స్టార్టప్‌లు ఉండేవన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవనాలు, నార్త్ క్యాంపస్ అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి ప్రధాని పునాదిరాయి వేశారు. ఢిల్లీ యూనివర్సిటీ 1922 మే 1న ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ వర్సిటీలో 86 డిపార్ట్మెంట్లు, 90 కాలేజీలు ఉన్నాయి. మెట్రో రైలులో మోదీ ప్రయాణం ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన మెట్రో రైలులో వచ్చారు. రైలులో విద్యార్థులతో సరదాగా సంభాíÙంచారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన మెట్రో రైలు ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. ఓటీటీల్లో ప్రసారమవుతున్న కొత్త వెబ్ సిరీస్‌ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఏ వెబ్ సిరీస్ బాగుంది? ఏ రీల్స్ బాగున్నాయో వారు చెప్పగలరని పేర్కొన్నారు. మాట్లాడేందుకు విద్యార్థుల వద్ద ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. సైన్స్ నుంచి ఓటీటీల్లోని కొత్త వెబ్ సిరీస్‌ల దాకా చాలా విషయాలను వారితో మాట్లాడొచ్చని వెల్లడించారు. ఏ ఒక్క అంశాన్నీ వారు వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. భూగోళంపై ఉన్న అన్ని అంశాలను విద్యార్థులు చక్కగా చర్చించగలరని ట్వీట్ చేశారు. -
టాప్ వర్సిటీల జాబితాలో ఐఐటీలు
న్యూఢిల్లీ : ప్రపంచ యూనివర్సిటీ ర్యాంక్‌ల జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐఎస్ బెంగళూర్, ఐఐటీ ఢిల్లీలు టాప్ 200లో చోటుదక్కించుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే టాప్ 1000 వర్సిటీల జాబితాలో భారత యూనివర్సిటీల సంఖ్య 20 నుంచి 24కు పెరగడం గమనార్హం. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2019లో గత ఏడాదితో పోలిస్తే తాజా జాబితాలో ఐఐటీ బాంబే 17 స్ధానాలు మెరుగుపరుచుకుని 162వ ర్యాంక్‌లో నిలవడం ద్వారా దేశంలోనే టాప్ ఇనిస్టిట్యూట్‌గా పేరొందింది. ఐఐటీ ఢిల్లీ 172వ స్ధానంలో నిలిచింది. ఐఐసీ బెంగళూర్ సైతం ఐఐటీ ఢిల్లీని తోసిపుచ్చి 170వ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంకింగ్ జాబితాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి విశ్వసనీయత ఉంది. 15వ సారి ప్రకటించిన ఈ ర్యాంకింగస్లో వరుసగా ఏడవ సంవత్సరం సైతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ యూనివర్సిటీగా నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలకు చెందిన ప్రముఖ 1000 విశ్వవిద్యాలయాల ర్యాంకులను ఈ జాబితా వెల్లడిస్తుంది. ఈ జాబితాలో భారత్ నుంచి 24 యూనివర్సిటీలు చోటు దక్కించుకోగా, ఏడు వర్సిటీలు తమ ర్యాంకును మెరుగుపరుచకున్నాయని, 9 సంస్థలు నిలకడగా ఉండగా, 5 వర్సిటీలు కొత్తగా చోటు దక్కించుకున్నాయని క్యూఎస్ రీసెర్చి డైరెక్టర్ బెన్ సోటర్ పేర్కొన్నారు. -
భారత్ నుంచి కేవలం ఆరు యూనివర్సిటీలే!
న్యూఢిల్లీ : గ్లోబల్ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో మన యూనివర్సిటీలు చాలా తక్కువగా చోటు దక్కించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ 2018లో టాప్-400లో కేవలం భారత్ నుంచి కేవలం ఆరు యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఐదు ఐఐటీలే. కేవలం ఒక్క యూనివర్సిటీ మాత్రమే నాన్-ఐఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఉంది. అది కూడా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ). ర్యాంకింగ్స్‌లో టాప్ భారత యూనివర్సిటీగా ఉన్న ఐఐటీ-ఢిల్లీ, 172 స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది దీని ర్యాంక్ 185. జాబితాలో ఉన్న ఇతర యూనివర్సిటీలు ఐఐటీ-బొంబై 179వ ర్యాంకును, ఐఐఎస్సీ 190వ ర్యాంకును, ఐఐటీ-మద్రాసు 264 ర్యాంకును, ఐఐటీ-కాన్పూర్ 293 ర్యాంకును, ఐఐటీ ఖరగ్‌పూర్ 308 ర్యాంకును సొంతం చేసుకున్నాయి. ఐఐటీ-బొంబై ర్యాంకింగ్ గతేడాది కంటే దాదాపు 40 స్థానాలు పైకి ఎగబాకింది. అయితే రెండేళ్ల పాటు పైకి ఎగిసిన ఐఐటీ-మద్రాసు ర్యాంకింగ్ 2018లో 15 స్థానాలు పడిపోయింది. గతేడాది ఐఐటీ-మద్రాసు ర్యాంకింగ్ 249. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రతేడాది విడుదల అవుతాయి. మొత్తంగా ఈ ర్యాంకింగ్స్‌లో టాప్-3 బెస్ట్ వర్సిటీలుగా మసాచుసెట్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ యూనివర్సిటీలు మంచి ప్రదర్శన కనబర్చినట్టు తెలిసింది. -
కొంతే.. ర్యాంకులు అంతంతే!
- టైమ్స్ ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత యూనివర్సిటీల వెనుకబాటు - గతేడాది ర్యాంకింగ్‌లో 201250 మధ్య ఉన్న ఐఐఎస్సీ - ఈసారి 250300 ర్యాంకింగ్‌కు పడిపోయిన వైనం - 8011000 మధ్యలో ఓయూ, ఎస్వీ, ఆంధ్రా యూనివర్సిటీలు సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో యూనివర్సిటీలు వెనుకబడ్డాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2018 వివరాలను బుధవారం ప్రకటించింది. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి, విదేశీ విద్యార్థుల శాతం, బాల, బాలికల నిష్పత్తి, బోధన, పరిశోధన, ఇంటర్నేషనల్ ఔట్లుక్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్ ప్రకారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 1,102 యూనివర్సిటీలకు ర్యాంకులివ్వగా మన దేశంలోని 42 యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చింది. గతేడాది బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు 201250 మధ్య స్థానంలో నిలవగా, ఈసారి 250300 మధ్య ర్యాంకుకు పడిపోయింది. ఇక గతేడాది లాగే ఉస్మానియా యూనివర్సిటీ ఈసారి 8011000 మధ్య స్థానంలో ఉండిపోయింది. ఏపీలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ గతేడాది ర్యాకింగ్‌లో 601800 మధ్య స్థానంలో ఉండగా, ఈసారి 8011000 స్థానంలోకి పడిపోయింది. గతేడాది ఆంధ్రా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ 800 పైగా స్థానంలో ఉండగా, ఈసారి ఆంధ్రా యూనివర్సిటీ 8011000 స్థానంతో తన ర్యాంకును పదిలపరుచుకోగా, నాగార్జున యూనివర్సిటీ మాత్రం ఆ ర్యాంకును నిలబెట్టుకోలేకపోయింది. గతేడాది టాప్ 800లోపు 19 విద్యా సంస్థలు ర్యాంకింగ్ పొందగా, ఈసారి 17 విద్యా సంస్థలే ఉన్నాయి. -
యూజీసీ... ఇది తగునా!
అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే మన విశ్వవిద్యాలయాలు తీసికట్టుగా ఉంటున్నాయని, మన దగ్గర పరిశోధనలకిచ్చే ప్రాధాన్యం తక్కువని ఆందోళన పడుతున్న వారికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఈమధ్య జారీచేసిన మార్గదర్శకాలు కలవరం కలిగిస్తాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో వీటిపై నిరసనలు వ్యక్తం కావడంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని ఆ మార్గదర్శకాల్లో కొన్నిటిని వెనక్కు తీసుకోమని ఆదేశించవలసి వచ్చింది. మిగిలిన నిబంధనలు సైతం తమ ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని అధ్యాపకులు భావిస్తున్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకుల బోధనా సమయాన్ని పెంచుతూ ఈ నెల 10న యూజీసీ ఈ మార్గదర్శకాలను జారీచేసింది. వీటికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా ఉంది. 2010నాటి మార్గదర్శకాల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ వారానికి 16 గంటలు, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్లు 14 గంటలపాటు బోధనలో నిమగ్నం కావ లసి ఉంటుంది. సవరించిన మార్గదర్శకాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ వారానికి 18 గంటలు, అసోసియేట్ ప్రొఫెసర్ 16 గంటలు బోధించాలని నిర్దేశించాయి. ప్రొఫె సర్ విషయంలో ఎలాంటి మార్పూ లేదు. సైన్స్ అధ్యాపకులు రెండు గంటలపాటు ప్రాక్టికల్స్‌కు వెచ్చించాల్సి వస్తే దాన్ని ఒక గంట బోధనగా పరిగణిస్తామని కూడా ఆ మార్గదర్శకాలు పేర్కొన్నాయి. పాత మార్గదర్శకాల్లో బోధన వేరు, ప్రాక్టికల్స్ వేరన్న భావన లేదు. ప్రాక్టికల్స్‌కు వెచ్చించే సమయాన్ని తక్కువగా పరిగణించడ మన్నది లేదు. ఇలా పని గంటల్ని పెంచడమే కాదు...పరిశోధనల్లో పాలు పంచుకోని అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతి వారం విద్యార్థులకు అదనంగా ఆరు గంటలు ట్యుటోరియల్స్ నిర్వహించాలంటున్నది. అంటే మొత్తంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వారానికి 24 గంటలు బోధనలో పాలుపంచుకోవలసి ఉంటుందన్న మాట! మన దేశంలో చాలా కళాశాలల్లో పరిశోధనకు సంబంధించిన మౌలిక వసతులు లేవు గనుక ఈ మార్గదర్శకాల ప్రకారం సహజంగానే ఎక్కువమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అధిక సమయాన్ని బోధనకు కేటాయించక తప్పని స్థితి ఏర్పడుతుంది. ఫలితంగా అరకొరగా జరిగే పరిశోధనలు సైతం మూలబడతాయి. అధ్యాపకులు పరిశోధనల్లో పాలుపంచుకోవడంవల్ల బోధనా ప్రమాణాలు పెరుగు తాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. పరిశోధనల్లో వెల్లడయ్యే అంశాలు నూతన ఆలోచనలకు దారితీస్తాయి. మన పొరుగునున్న చైనా ఈ అంశాల్లో ఎంతో ముందుంటున్నది. అందువల్ల ఏటా అక్కడినుంచి అధిక సంఖ్యలో పేటెంట్ల కోసం దరఖాస్తులు దాఖలవుతాయి. మన దేశం పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధం. 2014లో చైనానుంచి పేటెంట్ దరఖాస్తులు 25,539 వస్తే... మన దేశంనుంచి దాఖలైనవి 1,394 మాత్రమే! ఈ గణాంకాలు మనం ఎంతగా ఎదగవలసి ఉన్నదో సూచిస్తున్నాయి. ఒక వ్యవస్థలోని విభాగాల మధ్య సమన్వయం కోసం, అవి సమర్ధవంతంగా పనిచేయడం కోసం, వాటి ప్రమాణాలు పెంచడం కోసం దేనికైనా ఒక నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఎక్కువ సందర్భాల్లో ఆ వ్యవస్థల్ని చూసే వారు నియంత్రణను నియంతృత్వంగా పొరబడుతున్నారు. తమకిష్టం వచ్చిన రీతిలో మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించి ‘అమలు చేస్తారా... చస్తారా’ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. యూజీసీ అందుకు మినహాయింపు కాదని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. యూనివర్సిటీల్లోనూ, కళాశాలల్లోనూ జరిగే బోధనకు సంబంధించి ప్రాథమిక అవగాహన ఉన్నవారెవరూ ఇలాంటి మార్గదర్శకాలుజారీ చేయరు. నిజానికి అధ్యాపకులకు బోధన, పరిశోధనవంటివి మాత్రమే కాదు... విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడంతోసహా పాలనాపరమైన ఇతర బాధ్యత లుంటాయి. పైగా తరగతి గదిలో బోధించదల్చుకున్న అంశాన్ని అధ్యయనం చేయడానికి అధ్యాపకులకు కొంత సమయం అవసరమవుతుంది. పనిగంటల్ని పెంచడంలో అత్యుత్సాహం ప్రదర్శించినవారికి ఇలాంటి అంశాలపై స్పష్టత లేదని అర్ధమవుతుంది. యూజీసీ యధాలాపంగా ఈ కొత్త మార్గదర్శకాలు ఇచ్చినట్టు...అధ్యాపక లోకం ఆందోళన గమనించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వాటిని వెనక్కు తీసుకున్నట్టు కనబడుతున్నా వీటి తల్లి వేళ్లు వేరేచోట ఉన్నాయి. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో యూజీసీకిచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 55 శాతం కోతపెట్టింది. ఆ కోతను పూడ్చుకోవడానికి ఏం చేద్దామా అని యూజీసీ చేసిన ఆలోచనల పర్యవసానంగానే తాజా మార్గదర్శకాలు వెలువడ్డాయని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. ఒక విద్యా సంవత్సరంలో నిర్దిష్టమైన కోర్సును పూర్తి చేయడానికి ఎన్ని బోధనా గంటల సమయం పడుతుందో నిర్ణయించి ఆ ప్రాతిపదికన ఏ విశ్వవిద్యాలయమైనా అధ్యాపకులను తీసుకుంటుంది. తాజా మార్గదర్శకాలు అధ్యాపకుల బోధనాకాలాన్ని పెంచడంవల్ల కొత్తవారిని ఆ పోస్టుల్లో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా ఉన్నవారే భారమనిపిస్తారు. తాత్కాలిక పోస్టుల్లో ఉన్నవారిని ఇంటికి పంపించే ఏర్పాటు చేయవచ్చు. ఆ రకంగా అధ్యాపకులకిచ్చే జీతభత్యాల బడ్జెట్ తగ్గుతుంది. అధికారంలో ఉన్నవారికైనా, యూజీసీ నిర్వాహకులకైనా ఇది న్యాయం అనిపిస్తోందా? విశ్వవిద్యాలయాల నిర్వహణను ఆర్ధిక బెడదగా భావించడం, అక్కడి ప్రశ్నించే తత్వాన్ని ధిక్కారంగా పరిగణించడం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. 2009లో సైతం అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో అధ్యాపకులపై యూజీసీ ఈ మాదిరే ‘దాడి’ చేసింది. మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పెరగాలని... బోధనలోనూ, పరిశోధనల్లోనూ మేటిగా ఉండాలని...సృజనాత్మకత వెల్లివిరి యాలని... అవి మరింత జవాబుదారీతనం అలవర్చుకోవాలని... అక్కడ అవినీతి ఉండకూడదని ఆశించడం తప్పేమీ కాదు. విద్యారంగ నిపుణుల్ని, అధ్యాపక వృత్తిలో ఉంటున్నవారిని పిలిపించి ఇలాంటి అంశాల్లో ఇంకేమి చేయవచ్చునో చర్చించాలి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంతేతప్ప ఖర్చు తగ్గించుకుందామని కోతలు విధించి... పరిశోధనలు సరిగా లేవన్న కారణంతో వాటిని ఆపించి ఉన్నత విద్యారంగాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో అర్ధంకాదు. విశ్వవిద్యాలయాల ప్రమాణాలను పెంచడానికి ఇది మార్గం కాదు.