క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన భారతీయ ఐఐటీలు
61% భారతీయ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ మెరుగుదల
భారతీయ వర్సిటీల్లో ఐఐటీ బాంబేకు అగ్రస్థానం..
ఐఐటీ ఢిల్లీకి రెండో స్థానం..
బెంగళూరు ఐఐఎస్సీకి మూడో స్థానం
ప్రపంచంలోనే అత్యుత్తమ వర్సిటీగా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
13వసారి కూడా అగ్రస్థానంలో కొనసాగిన అమెరికా సంస్థ
సాక్షి, అమరావతి: భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ప్రతిష్టాత్మక క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్–2025లో భారతీయ వర్సిటీలు మెరుగైన ర్యాంకింగ్స్ దక్కించుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 61 శాతం భారతీయ వర్సిటీలు తమ ర్యాంకులను మెరుగుపర్చుకోగా.. 24 శాతం వర్సిటీలు పాత ర్యాంకులనే పొందాయి.
కేవలం 9 శాతం వర్సిటీల ర్యాంకులు క్షీణించాయి. అలాగే మూడు కొత్త విశ్వవిద్యాయాలకు క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కింది. జాతీయ స్థాయిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) బాంబే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)–బెంగళూరు, ఐఐటీ ఖరగ్‌పూర్ నిలిచాయి.
మెరుగైన ర్యాంకింగ్స్..
ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో ఐఐటీ బాంబే గతేడాది 149వ స్థానంలో ఉండగా.. ఈసారి 118వ ర్యాంక్ దక్కించుకుంది. ఐఐటీ ఢిల్లీ 197వ స్థానం నుంచి 150కి చేరుకుంది. ఐఐఎస్సీ 225 నుంచి 211వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఐఐటీ ఖరగ్‌పూర్ 271 నుంచి 222కు, ఐఐటీ మద్రాస్ 278 నుంచి 263వ ర్యాంకులకు చేరుకున్నాయి. ఐఐటీ కాన్పూర్ ర్యాంకు గతేడాది కంటే స్వల్పంగా తగ్గి 227వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి కనబర్చింది.
ఈ వర్సిటీ 407వ ర్యాంక్ నుంచి 328వ ర్యాంకుకు చేరుకొని దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఐఐటీ రూరీ్కకి 335, ఐఐటీ గౌహతికి 477, అన్నా వర్సిటీలకు 383వ ర్యాంక్ వచి్చంది. ఐఐటీ ఇండోర్ 454 నుంచి 477వ ర్యాంక్‌కు పడిపోయింది. జాతీయ స్థాయిలో మొదటి 15 స్థానాల్లో ఐఐటీ వారణాసి (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 531వ స్థానం), జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ(580), శూలినీ వర్సిటీ ఆఫ్ బయో టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (587) వర్సిటీలున్నాయి.
ఈ ఏడాది కొత్తగా సింబయాసిస్ ఇంటర్నేషనల్(డీమ్డ్) వర్సిటీ 641–650 ర్యాంకు పరిధిలో.. అలాగే దేశంలో 16వ స్థానం దక్కించుకుంది. టాప్–20లో ఐఐటీ హైదరాబాద్ (681–690), చండీగఢ్ వర్సిటీ (691–700), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి (701–710), యూనివర్సిటీ ఆఫ్ ముంబై (711–720) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వెల్లూరు (791–800), ఎస్‌ఆర్‌ఎం చెన్నై (1,000–1,200) చోటు దక్కించుకున్నాయి.
13 ఏళ్లుగా వరల్డ్ నంబర్ వన్‌గా ఎంఐటీ
ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుసగా 13వసారి ఎంఐటీ అత్యుత్తమ ఇన్‌స్టిట్యూట్‌గా టైటిల్‌ను నిలుపుకుంది. మొత్తం 1,500 విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను కేటాయించగా.. అమెరికా నుంచి అత్యధికంగా 197, బ్రిటన్ నుంచి 90, మెయిన్ ల్యాండ్ చైనా నుంచి 71 వర్సిటీలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ –10 కళాశాలలు/విశ్వవిద్యాలయాలు
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)
ఇంపీరియల్ కాలేజ్ లండన్
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
హార్వర్డ్ విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం
ఈటీహెచ్ జూరిచ్
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్
యూనివర్సిటీ కాలేజ్ లండన్
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
Comments
Please login to add a commentAdd a comment