QS rankings
-
దేశంలో ఐఐటీ బాంబే టాప్
సాక్షి, అమరావతి: భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ప్రతిష్టాత్మక క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్–2025లో భారతీయ వర్సిటీలు మెరుగైన ర్యాంకింగ్స్ దక్కించుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 61 శాతం భారతీయ వర్సిటీలు తమ ర్యాంకులను మెరుగుపర్చుకోగా.. 24 శాతం వర్సిటీలు పాత ర్యాంకులనే పొందాయి. కేవలం 9 శాతం వర్సిటీల ర్యాంకులు క్షీణించాయి. అలాగే మూడు కొత్త విశ్వవిద్యాయాలకు క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కింది. జాతీయ స్థాయిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) బాంబే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)–బెంగళూరు, ఐఐటీ ఖరగ్‌పూర్ నిలిచాయి. మెరుగైన ర్యాంకింగ్స్.. ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో ఐఐటీ బాంబే గతేడాది 149వ స్థానంలో ఉండగా.. ఈసారి 118వ ర్యాంక్ దక్కించుకుంది. ఐఐటీ ఢిల్లీ 197వ స్థానం నుంచి 150కి చేరుకుంది. ఐఐఎస్సీ 225 నుంచి 211వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఐఐటీ ఖరగ్‌పూర్ 271 నుంచి 222కు, ఐఐటీ మద్రాస్ 278 నుంచి 263వ ర్యాంకులకు చేరుకున్నాయి. ఐఐటీ కాన్పూర్ ర్యాంకు గతేడాది కంటే స్వల్పంగా తగ్గి 227వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి కనబర్చింది. ఈ వర్సిటీ 407వ ర్యాంక్ నుంచి 328వ ర్యాంకుకు చేరుకొని దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఐఐటీ రూరీ్కకి 335, ఐఐటీ గౌహతికి 477, అన్నా వర్సిటీలకు 383వ ర్యాంక్ వచి్చంది. ఐఐటీ ఇండోర్ 454 నుంచి 477వ ర్యాంక్‌కు పడిపోయింది. జాతీయ స్థాయిలో మొదటి 15 స్థానాల్లో ఐఐటీ వారణాసి (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 531వ స్థానం), జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ(580), శూలినీ వర్సిటీ ఆఫ్ బయో టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (587) వర్సిటీలున్నాయి. ఈ ఏడాది కొత్తగా సింబయాసిస్ ఇంటర్నేషనల్(డీమ్డ్) వర్సిటీ 641–650 ర్యాంకు పరిధిలో.. అలాగే దేశంలో 16వ స్థానం దక్కించుకుంది. టాప్–20లో ఐఐటీ హైదరాబాద్ (681–690), చండీగఢ్ వర్సిటీ (691–700), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి (701–710), యూనివర్సిటీ ఆఫ్ ముంబై (711–720) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వెల్లూరు (791–800), ఎస్ఆర్ఎం చెన్నై (1,000–1,200) చోటు దక్కించుకున్నాయి. 13 ఏళ్లుగా వరల్డ్ నంబర్ వన్‌గా ఎంఐటీ ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుసగా 13వసారి ఎంఐటీ అత్యుత్తమ ఇన్స్టిట్యూట్గా టైటిల్‌ను నిలుపుకుంది. మొత్తం 1,500 విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను కేటాయించగా.. అమెరికా నుంచి అత్యధికంగా 197, బ్రిటన్ నుంచి 90, మెయిన్ ల్యాండ్ చైనా నుంచి 71 వర్సిటీలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ –10 కళాశాలలు/విశ్వవిద్యాలయాలుమసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం హార్వర్డ్ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఈటీహెచ్ జూరిచ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లండన్
లండన్: ప్రపంచంలోని ప్రముఖ నగరాలను వెనక్కినెట్టి వరుసగా రెండోసారి విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ సిటీ మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ నగరాలైన టోక్యో, మెల్‌బోర్న్‌లు వరుసగా రెండు, మూడు ర్యాంకులను సాధించాయి. విద్యార్థులకు ఉత్తమమైన నగరాల జాబితాను బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్) బుధవారం విడుదల చేసింది. ప్రతీ నగరానికి సంబంధించి ప్రధానంగా ఆరు అంశాలను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, జనాభా, జీవన ప్రమాణాలు, డిగ్రీ అనంతరం ఉద్యోగ అవకాశాలు, కొనుగోలు సామర్థ్యాలు, విద్యార్థుల అభిప్రాయాలు వంటి అంశాలు ఆయా నగరాల్లో ఏ మేరకు ఉన్నాయో విశ్లేషించి జాబితా రూపొందించింది. మొత్తం ప్రపంచంలోని 120 నగరాలకు సంబంధించి ఈ ర్యాంకులను విడుదల చేయగా.. భారత్ నుంచి బెంగళూరు 81వ ర్యాంకు, తర్వాత ముంబై–85, ఢిల్లీ–113, చెన్నై–115వ స్థానాల్లో నిలిచాయి. పెరుగుతున్న భారతీయ విద్యార్థులు.. భారతదేశం నుంచి లండన్‌కు విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2017–18లో ఈ సంఖ్య 20 శాతం పెరిగింది. 2017–18లో మొత్తం 5,455 మంది విద్యార్థులు లండన్‌లో విద్యాసంస్థల్లో చేరగా.. 2016–17లో ఆ సంఖ్య 4,545గా ఉంది. అయితే విద్యార్థుల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగానే కనిపిస్తుంది. దానికి కారణం వీసా జారీ ప్రక్రియ నిబంధనలు కొంతమేర కు కఠినతరంగా ఉండటంతో భారతీయ విద్యార్థులు లండన్ వైపు మొగ్గు చూపట్లేదని నివేదిక పేర్కొంది. అందుకే అగ్రస్థానం లండన్‌లోని విద్యార్థుల హర్షం విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా లండన్ ఎంపిక కావడం పట్ల అక్కడి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఉత్తమ నగరంగా లండన్ ఎంపిక సరైనదేనంటున్నారు. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, అద్భుతమైన ఉపాధి అవకాశాలు, వైవిధ్యభరితమైన విద్యార్థి సంఘాలు వంటివి లండన్‌ను అగ్ర స్థానంలో నిలబెట్టాయని వివరిస్తున్నారు. యూరప్ ఆధిపత్యం టాప్–120 సిటీల్లో యూరప్ నగరాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. జర్మనీలోని మ్యూనిచ్ 4, బెర్లిన్ 5వ స్థానాల్లో నిలిచాయి. పారిస్ 7వ స్థానం, జ్యూరిచ్(స్విట్జర్లాండ్) 8వ స్థానం దక్కించుకున్నాయి. మాంట్రియల్ (కెనడా) 6వ స్థానం, సిడ్నీ(ఆస్ట్రేలియా) 9వ స్థానం, సియోల్(దక్షిణ కొరియా) 10వ స్థానంలో ఉన్నాయి. ఇక టాప్–30లో మరో రెండు బ్రిటిష్ నగరాలైన ఎడిన్బర్గ్ 15వ ర్యాంకు, మాంచెస్టర్ 29వ ర్యాంకు పొందాయి. -
ఆ ఐఐటీ దేశంలోనే టాప్
సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ కల్పనల్లో ఐఐటీ-బాంబే యూనివర్సిటీ మెరుగ్గా ఉందని క్వాక్వారెల్లి సిమండ్స్ (క్యూఎస్) ర్యాకింగ్స్ సంస్థ వెల్లడించింది. 2019 సంవత్సరానికి గాను దేశంలోని ఉన్నత విద్యా సంస్థలపై నిర్వహించిన సర్వేలో ఐఐటీ బాంబే అధిక పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచిందని తెలిపింది. ఇక ఐఐఎస్సీ బెంగుళూరు సైన్స్ విభాగంలో టాప్‌లో నిలవగా... ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాలు, ఉద్యోగ అవకాశమిచ్చే సంస్థల ప్రతిష్ట ఆధారంగా సర్వే నిర్వహించినట్టు క్యూఎస్ ర్యాకింగ్స్ తెలిపింది. టాప్‌టెన్ యూనివర్సిటీలకు క్యూఎస్ సర్వే ర్యాంకులు ప్రకటించింది. మూడు, నాలుగు స్థానాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ ఉండగా.. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్ 5, 6 స్థానాల్లో ఉన్నాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏడో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ రూర్కే తొమ్మిదో స్థానంలో, ఐఐటీ గువాహటి పదో స్థానాల్లో ఉన్నాయి.