ప్రపంచంలో తొలిసారిగా ఆన్‌లైన్ అభ్యసనాలకు ర్యాంకులు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ విద్య విస్తరిస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత సంప్రదాయ విశ్వవిద్యాలయాలు డిజిటల్ విద్యపై దృష్టి కేంద్రీకరించాయి. అయితే ఇప్పటి వరకు ఆన్‌లైన్ విద్య నాణ్యతను కొలవడానికి సరైన ప్రమాణాలు లేవు.
కానీ, తొలిసారిగా ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆన్‌లైన్ లెర్నింగ్ ర్యాంకింగ్స్–2024ను ప్రకటించింది. ఇందులో ప్రపంచంలో 11 యూనివర్సిటీలకు గోల్డ్ స్టేటస్ ర్యాంకును ఇచి్చంది. ఇందులో భారతదేశం నుంచి మానవ్ రచన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీస్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలు ‘బంగారు’ హోదా పొందాయి.
దేశంలో ఏడు వర్సిటీలకు ర్యాంకులు...
ఆన్‌లైన్ విద్యలో గోల్డ్ కేటగిరీలో 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో యూఎస్‌ఏ నుంచి మూడు, యూకే, భారత్ నుంచి రెండు చొప్పున, రష్యా, హంగేరీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ ఉన్నాయి.
భారత్ నుంచి శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌కు సిల్వర్ స్టేటస్ సాధించగా, అమిటీ యూనివర్సిటీ (నోయిడా), కేఎల్ యూనివర్సిటీ (ఏపీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ (పంజాబ్), మణిపాల్ వర్సిటీ (జైపూర్) బ్రాంజ్ స్టేటస్ పొందాయి. ఈ ర్యాంకింగ్స్‌తో భారత్ యూనివర్సిటీలు ఆన్‌లైన్ విద్యను అందించడంలో పురోగతిని కనబరుస్తున్నాయని స్పష్టమవుతోంది.
వీటి ఆధారంగానే ర్యాంకులు
ఆన్‌లైన్ అభ్యాసానికి అంకితమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంతృప్తి, విద్యార్థుల్లో పురోగతి, కోర్సుల సిఫారసు వంటి అంశాలను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ పరిశీలించి ర్యాంకులు కేటాయించింది. మొత్తం ప్రపంచంలో 14 యూనివర్సిటీలు వెండి, 31 కాంస్య పతకాల కేటగిరీలో నిలిచాయి.
మరో 64 సంస్థలు డేటా సమర్పించినప్పటికీ పూర్తి ఎంట్రీ అవసరాలను తీర్చలేదు. కాబట్టి వాటికి రిపోర్టర్ హోదా కల్పిoచింది. అయితే ఆన్‌లైన్ విద్యను అందిస్తున్న యూనివర్సిటీ అభ్యాసకులు టెక్నాలజీ యాక్సెస్, టైమ్‌జోన్, భాషా ప్రావీణ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గోల్డ్ స్టేటస్ పొందిన యూనివర్సిటీలు...
» అమెరికన్ యూనివర్సిటీ(యూఎస్)
» అరిజోనా స్టేట్ వర్సిటీ(యూఎస్)
» హెచ్‌ఎస్‌ఈ వర్సిటీ (రష్యా)
» మానవ్ వర్సిటీ (భారత్)
» మాస్సే వర్సిటీ (న్యూజిలాండ్)
» ఓపీ జిందాల్ (భారత్)
» సెంట్రల్‌ఫ్లోరిడా వర్సిటీ (యూఎస్)
» వర్సిటీ ఆఫ్ ఎసెక్స్ (యూకే)
» లివర్‌పూల్ వర్సిటీ (యూకే)
» సౌత్ ఆస్ట్రేలియావర్సిటీ (ఆ్రస్టేలియా)
» వర్సిటీ ఆఫ్ స్జెడ్ (హంగేరి)
Comments
Please login to add a commentAdd a comment