online coaching
-
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్స్ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్
సాక్షి ఎడ్యుకేషన్: తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కాగా, త్వరలోనే గ్రూప్ 2, 3,4 కు పరీక్షలకు కూడా నోటిఫికేషన్లు రానున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలో గ్రూప్1, 2నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కోచింగ్ సెంటర్లకు వెళ్లి కోచింగ్ తీసుకోలేని, ఇంటివద్దనే ఉంటూ గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవ్వాలనుకునే అభ్యర్థులకోసం ప్రత్యేకంగా సాక్షి ఎడ్యుకేషన్, డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ (కేజీహెచ్ అకాడమీ) ఆధ్వర్యంలో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనుంది. అనుభవజ్ఞులైన ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ఏపీపీఎస్సీ/టీఎస్పీఎస్సీ గ్రూప్ 1,2,3,4 పరీక్షలకు కోచింగ్ ఇస్తుంది. అత్యంత తక్కువ ధరలకే ఈ కోచింగ్ లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా వీడియో క్లాసులు, స్టడీమెటీరియల్, ఆన్లైన్ ఎగ్జామ్స్ మొదలైనవి ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు https:// arenaone. in/ sakshieducation/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ కోచింగ్ వ్యాలిడిటీ ఒక ఏడాది వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు 9505514424, 9666013544, 9912671555 ఫోన్ నంబర్లను సంప్రదించండి. ఇదీ చదవండి: ఏది గుడ్.. ఏది బ్యాడ్?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి -
ఉగ్రవాదుల ఎత్తుగడ.. ఆన్లైన్ కోచింగ్
న్యూఢిల్లీ : కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లూ, నిరంతర నిఘా మధ్య.. ఉగ్రవాద సంస్థల్లో నియామకాలు కష్టంగా మారడంతో ఉగ్రమూకలు శాస్త్ర సాంకేతికతను అనువుగా చేసుకొని ఆన్లైన్ నియామకాలకు శ్రీకారం చుట్టినట్టు భారత నిఘావర్గాలు కనిపెట్టాయి. భద్రతాదళాల అప్రమత్తత కారణంగా, ఉగ్రవాదుల పాచిక పారకపోవడంతో సైబర్ ఎత్తుగడతో రంగంలోకి దిగినట్టు సమాచారం. గత నెలలో 34 రాష్ట్రీయ రైఫిల్స్ ఆఫ్ ఆర్మీ ఎదుట లొంగిపోయినతవార్ వాఘే, అమీర్ అహ్మద్ మీర్లు వెల్లడించిన సమాచారంతో భారీస్థాయిలో ఉగ్రవాదుల సైబర్ రిక్రూట్మెంట్ జరుగుతున్న విషయం రూఢీ అయ్యింది. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్లు నేరుగా సాగకపోవడంతో సైబర్, మొబైల్ అప్లికేషన్స్ ద్వారా నియామకాలు కొనసాగిస్తున్నాయి ఉగ్రమూకలు. భద్రతాదళాలు దారుణాలకు పాల్పడినట్లు ఫేక్ వీడియోలను సృష్టించి, పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు యువతలో ఎమోషన్స్‌ని రెచ్చగొట్టేపనిలో పడ్డాయి. గతంలో ఉగ్రవాదుల సానుభూతిపరులు నేరుగా నియామకాలు జరిపేవారు. ఉగ్రవాదుల సానుభూతిపరులను నిఘావర్గాలు అణచివేయడంతో వారు సైబర్ వేదికనుపయోగించుకొని ఉగ్రవాద సంస్థల్లో రిక్రూట్మెంట్లను నిర్వహిస్తూ, ఆన్లైన్ వేదికగా యూట్యూబ్‌లో శిక్షణను కూడా ఇస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పీచమణిచిన భద్రతాదళాలు... గత ఏడాది 2020లో రెండు డజన్లకుపైగా ఇటువంటి ఉగ్రవాద వ్యవస్థలను భధ్రతాదళాలు ఛేదించి, దాదాపు 40 మంది సానుభూతిపరులను అరెస్టు చేశాయి. సైన్యంలోని 34 రాష్ట్రీయ రైఫిల్స్ ఎదుట లొంగిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు తవార్ వాఘీ, అమిర్ అహ్మద్ మీర్లు తాము ఆన్లైన్లో టెర్రరిస్టు గ్రూపులో చేరినట్టు వెల్లడించడంతో అసలు బండారం బట్టబయలైంది. భారీస్థాయిలో సైబర్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నట్టు తేటతెల్లమైంది. వీరిద్దరితో ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపారు. ఖలీద్, మహ్మద్ అబ్బాస్ షేక్ అనే రిక్రూటర్ కోడ్ నేమ్ ద్వారా ఆన్లైన్లో పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ సంస్థల్లో చేర్చుకున్నారు. ఆన్లైన్లో వివిధ లింకుల ద్వారా, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమ వేదికల్లో వీరికి శిక్షణనివ్వడం మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం. వీరిరువురు కేవలం ఒకే ఒక్కసారి, సౌత్ కశ్మీర్‌లోని షోపియాన్‌లో స్థానిక ఉగ్రవాద ముఠా వ్యక్తులతో నేరుగా కలిశారు. కశ్మీర్ లోయలో పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ వ్యవస్థీకరించిన స్లీపర్ సెల్స్ ఆచూకీ తెలియకుండా ఉండడం కోసం ఉగ్రవాదులు ఈ ఎత్తుగడలు వేస్తున్నట్టు భధ్రతాదళాలు గమనించాయి. స్థానికుల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం మేరకు ఈ సైబర్ ఉగ్రవాద కార్యకలాపాల గుట్టుని భద్రతాదళాలు రట్టు చేశారు. లష్కరే కనుసన్నల్లో టీఆర్ఎఫ్ నిషేధిత లష్కరేతోయిబా నీడలో పనిచేస్తోన్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)లోకి రిక్రూట్ చేసుకున్న తరువాత ఈ ఇరువురికీ పాకిస్తాన్‌కి చెందిన బుర్హాన్ హమ్జా నుంచి ఆదేశాలు అందుతాయి. అలాగే వీరికి మతసంబంధిత బోధనలు కూడా చేస్తారు. ప్రత్యేకించి దక్షిణ కశ్మీర్లో ఇలా సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద సంస్థల్లో చేరిన సంఘటనలు 40కి పైగా ఉన్నట్టు అధికారులు చెపుతున్నారు. కొత్తగా రిక్రూట్ అయిన వారు పాకిస్తాన్ నుంచి ఆదేశాల కోసం వేచి ఉన్నట్టు సమాచారం. టెర్రరిస్టు గ్రూపుల వద్ద తగినన్ని ఆయుధాలు లేకపోవడం వల్ల కూడా వారు నేరుగా రిక్రూట్మెంట్లు చేయకుండా, మ్యాన్ పవర్కంటే కూడా ఆయుధ సమీకరణపై దృష్టిపెట్టినట్టు అర్థం అవుతోంది. గత నెలలో జమ్మూలో సరిహద్దుల్లో దొరికిపోయిన నలుగురు ఉగ్రవాదుల వద్ద 11 రైఫిల్స్, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి పట్టుబడటమే అందుకు ఉదాహరణ అని అధికారులు తెలిపారు. -
సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు
పనాజీ: ఆన్లైన్ తరగతులు చెబుతున్న టీచర్ల ఫొటోలు తీసి, మార్ఫింగ్ చేసి అవమానకర రాతలతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటన గోవా రాజధాని పనాజీలోని పాంజిమ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్టూడెంట్స్ చర్యతో షాక్ కు గురైన సదరు స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (నాన్నా.. తాగొద్దు.. అమ్మను బాగా చూసుకో) ‘కొందరు స్టూడెంట్స్ ఆన్లైన్ తరగతులు జరుగుతున్న సమయంలో టీచర్ల ఫొటోలు స్క్రీన్ షాట్ తీశారు. వాటిని మార్ఫింగ్ చేసి, తిడుతూ సోషల్ మీడియాలో పెట్టారు. ఈ మేరకు సదరు స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం’ అని పాంజిమ్ ఎస్పీ పంకజ్ కుమార్ వెల్లడించారు. (నేను చనిపోతున్నా.. కాబోయే భార్యకు మెసేజ్) -
ఆన్లైన్లో ఎంసెట్, జేఈఈ, నీట్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం ఆన్లైన్లో జేఈఈ, నీట్, ఎంసెట్ పాఠాలను బోధించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్జెక్టు నిపుణులు రూపొందించిన ఆ వీడియో పాఠాలను వినే విద్యా ర్థులకు గ్రాండ్ టెస్టులను ఈనెల 20వ తేదీ నుంచి ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవీ వీడియో పాఠాల లింక్స్.. http://www.tdisk. in http://tsat.tv http://www.softnet. telangana. gov. in -
కష్టం ఫలించె.. కొలువు వరించె
గ్రూప్స్‌లో విజేత కావాలన్న ‘ఆశ’కు ఓ అవకాశం వచ్చింది.. నలుగురిలో ఒకరిగా నిలబడాలన్న కసికి భర్త ప్రోత్సాహం తోడైంది.. ఇంకేముంది పట్టుదల ముందు లక్ష్యం తలవంచింది. కష్టానికి ఫలితం దక్కింది.. విజయం సలాం అంటూ ఆమె ఒడిలోకి వచ్చి వాలింది. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మైదుకూరుకు చెందిన ఆయేషా గ్రూప్స్‌లో బీసీ–ఈ మహిళా విభాగంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి శభాష్ అనిపించారు. యువతకు ఆదర్శంగా నిలిచారు. సాక్షి, కడప: ఎంతకష్టమైనా గ్రూప్స్‌లో విజయం సాధించాలన్న పట్టుదలే ఆయేషాను ముందుకు నడిపించింది. ఎదురుగా కొండంత లక్ష్యం కనిపిస్తున్నా.. మార్గంలో అనేక అడ్డంకులు ఎదురైనా అన్నింటినీ అధిగమించి విజయం సాధించేలా చేసింది. గ్రూప్స్ విజేతగా నిలిచి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్‌గా కొలువు ఒడిసిపట్టిన ఓ మధ్య తరగతి యువతి విజయ గాథ ఇదీ. ఆది నుంచి చదువులో అగ్రస్థానం మైదుకూరు పట్టణంలోని సాయినాథపురానికి చెందిన ఖలీల్‌బాషా ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. ఖలీల్‌బాషా పెద్ద కుమార్తె ఆయేషా. తల్లి ఖాజాబి గృహిణి. ఆయేషా 1 నుంచి 10వ తరగతి వరకు మైదుకూరులోని శారద విద్యామందిర్‌లో చదువుకున్నారు. 2003లో పదో తరగతిలో 505 మార్కులు, ఇంటర్మీడియేట్ మేధా జూనియర్ కళాశాలలో బైపీసీ విభాగంలో 889 మార్కులు సాధించారు. అనంతరం కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీ గ్రూపులో 70.9 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం తిరుపతిలోని గేట్ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ చదివి 74.9 శాతం మార్కులతో నిలిచారు. కళాశాలలో చిగురించిన ప్రేమ.... తిరుపతి గేట్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న సమయంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన, ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న ఎస్.మోహన్ సుబ్రమణి పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా చిగురించి పెళ్లి వరకు తీసుకెళ్లింది. మతాలు వేరైనా ఇద్దరూ అన్యోనంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మోహన్ బెంగుళూరులో యూపీఎస్ బ్యాటరీల షోరూం నిర్వహిస్తున్నారు. తొలుత చిన్న ఉద్యోగంలో చేరి... 2012లో తిరుపతిలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఆయేషా ఉద్యోగం లో చేరారు. తర్వాత 2013లో వివాహమైన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 2014–15,2015–16లో రెండుమార్లు సివిల్స్‌కు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో 2016లో ఏపీపీఎస్సీ గ్రూప్స్‌కు ప్రయత్నించారు. అందులో భాగంగా గ్రూప్–1లో బీసీ–ఈ మహిళా విభాగంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి శభాష్ అనిపించుకున్నారు. గృహిణిగా ఉంటూ....ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ.... బెంగళూరులోని కేఆర్‌పురంలో ఉంటున్న ఆయేషా గృహిణిగానే ఉంటూ ఇంట్లోనే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ పరీక్షకు సిద్ధమయ్యారు. ‘సాక్షి’లో వచ్చే భవిత, ఇతర మెటీరియల్ బాగా చదివారు. ప్రత్యేకంగా తన విజయానికి ‘సాక్షి’ దినపత్రిక ఎంతగానో ఉపయోగపడిందని ఆమె స్పష్టం చేశా రు. ప్రతిరోజు ఫలానా సమయం అని లేకుండా....వీలు దొరికినపుడల్లా ఆన్లైన్ ద్వారా శిక్షణ తీసుకున్నానని వివరించారు. అబ్దుల్‌కలాం స్ఫూర్తి... మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం ఏ విధంగా పైకి వచ్చారో...అదే స్ఫూర్తితో తాను చదివినానని ఆయేషా తెలిపారు.. తన భర్త మోహన్ ప్రోత్సాహం, నానమ్మ రూతమ్మ స్ఫూర్తి కూడా తనకెంతో ఉపయోగపడిందని ఆమె తెలియజేశారు. అలాగే తన భర్త మోహన్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్–2017లో గ్రూప్స్ రాశారని, ప్రస్తుతం గ్రూప్–1కు సంబంధించి మెయిన్స్‌లో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. కష్టపడితే ఏదైనా సాధ్యమే యువత లక్ష్యాలను నిర్ణయించుకుని.. అందుకు అనుగుణంగా కష్టపడి చదివితే ఎలాంటి ఫలితాలనైనా సులభంగా సాధించవచ్చు. ప్రతి ఒక్కరూ చదువుకుంటూనే జీవితానికి ఒక గోల్ పెట్టుకుని ముందుకు సాగాలి. మనం చదువుతున్నప్పుడు కష్టం మన కళ్ల ముందు కనపడుతుంటే.. కచ్చితంగా లక్ష్యం కూడా చిన్నదే అవుతుంది. – ఆయేషా, గ్రూప్–1 విజేత -
ఐఐటీ-జేఈఈకి ఫ్రీ కోచింగ్!
కోయంబత్తూరు: ఐఐటీ-జేఈఈ ఆశావాహులకు శుభవార్త. ఐఐటీ-జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు కేంద్రప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఆన్ లైన్ కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పరీక్షకు సంబంధించిన మెటీరియల్, పాఠ్యాంశాల వీడియోలను ఆన్ లైన్ ద్వారా ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి అందుబాటులో ఉంచనుంది. సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వెనుకబడిన వర్గాల విద్యార్థులకు కోర్సుకు సంబంధించిన వివరాలు, మెటీరియల్స్ తదితరాలు అందుబాటులో ఉంచాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం అత్యంత చౌక ధరలకు ల్యాప్ టాప్, ఇంటర్ నెట్ సదుపాయాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికిది శుభపరిణామం. సీబీఎస్ఈ, ఐఐటీలకు చెందిన నిపుణులు, కేంద్రీయ విద్యాలయాలకు చెందిన టీచర్లు, కోచింగ్ ఇన్ స్టిట్యూట్స్ కు చెందిన నిపుణులతో కూడిన బృందం ఈ మెటీరియల్ ను తయారుచేయనుంది.