గ్లోబల్ ర్యాంకింగ్లో ఐఐటీలు ఢమాల్
గ్లోబల్ ర్యాంకింగ్లో ఐఐటీలు ఢమాల్
Published Tue, Sep 6 2016 8:45 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు) గ్లోబల్ ర్యాంకింగ్లో ఢమాల్ మనిపించాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ మంగళవారం విడుదలచేసిన 2016-17 ర్యాంకింగ్స్లో ఐఐటీలు తమ స్థానాలను కోల్పోయాయి. ఈ ర్యాంకింగ్లో వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ప్రపంచంలో బెస్ట్గా నిలిచింది. ఈ ర్యాంకింగ్లో ఇండియాలో అత్యున్నత సంస్థగా మళ్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు బెంగళూరే చోటు దక్కించుకుంది. కానీ టాప్ 150 స్థానం నుంచి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ పడిపోయిందని క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో వెల్లడైంది. అయితే ఐఐటీ మద్రాసు మాత్రం టాప్ 250 స్థానాన్ని చేధించి, ఐదు స్థానాలు పైకి ఎగబాకినట్టు ర్యాంకింగ్ల్లో తెలిసింది.
10 ఇండియన్ యూనివర్సిటీలో తొమ్మిది 700 ర్యాంకింగ్లో నిలిచాయి. అయితే గతేడాది కంటే ఈ యూనివర్సిటీలు తమ ఈ ర్యాంక్లను కోల్పోయాయి. అకాడమిక్, ఎంప్లాయర్ రిప్యూటేషన్ రెండింటి ర్యాంకింగ్లోనూ ఈ ఇన్స్టిట్యూట్లు పేలవమైన ప్రదర్శన కనబర్చినట్టు ర్యాంకింగ్ రిపోర్టు వెల్లడించింది. వరల్డ్ టాప్ 100 రీసెర్చ్ ఇంపాక్ట్ ర్యాంకింగ్లో కూడా భారత్ నుంచి కేవలం నాలుగు ఇన్స్టిట్యూట్లు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు రీసెర్చ్ రిపోర్టు తెలిపింది. భారత్ బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్గా ఐఐఎస్సీ 11వ స్థానాన్ని ఆక్రమించుకుంది.
ర్యాంకింగ్లో పడిపోవడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయని క్యూఎస్ ఇంటిలిజెంట్ యూనిట్ రీసెర్చ్ హెడ్ బెన్ సౌటర్ తెలిపారు. పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లు తక్కువగా ఉండట, ఇతర దేశాలనుంచి పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లను ఇండియా నియమించుకోవడం ర్యాంకింగ్లను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ పోటీదారులను ఇండియా పెంచుకుని ఫర్ఫార్మెన్స్ను ఇండియా మెరుగుపరుచుకోవాలని ఈ ర్యాంకింగ్లు సూచిస్తున్నట్టు సౌటర్ తెలిపారు. 2004 నుంచి యూఎస్ ఇన్స్టిట్యూషన్సే ఈ ర్యాకింగ్లో టాప్ 3 స్థానాలను ఆక్రమించుకుంటూ వస్తున్నాయి.
Advertisement