Massachusetts Institute of Technology (MIT)
-
నానో ప్రపంచం దగ్గరయింది
బంగారం ఏ రంగులో ఉంటుందో తెలుసు కదా? ముదురు పసుపునకు కొంత కాంతి చేరిస్తే ఉండే రంగు. కానీ, ఇదే బంగారాన్ని నానోస్థాయిలో.. అంటే మన వెంట్రుకలో పదివేల వంతు సూక్ష్మస్థాయిలో చూస్తే దాని రంగు ఎరుపు లేదా వంగపూతగా కనిపిస్తుంది! అదెలా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా నానోస్థాయిలో పదార్థాల ధర్మాల ఆసరాతో అత్యాధునిక ఎల్రక్టానిక్స్ తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి దక్కిందని మాత్రం తెలుసుకోవాలి! ఆ విశేషాలేమిటో చూసేద్దాం.. క్వాంటమ్ డాట్స్ తయారీకి బాటలు నానోటెక్నాలజీ మనకేమీ కొత్త కాదు. చాలా కాలంగా వేర్వేరు రంగాల్లో వాడకంలో ఉన్నదే. స్పష్టమైన, పలుచని ఎల్ఈడీ స్క్రీన్ల తయారీ మొదలుకొని శరీరంలోని కేన్సర్ కణితులను కత్తిరించడం వరకూ రకరకాలుగా నానో టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఈ అత్యద్భుతమైన టెక్నాలజీ ఆవిష్కరణలకు బీజం వేసిన క్వాంటమ్ డాట్స్‌ను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు కాబట్టే స్వీడిష్ నోబెల్ అవార్డు కమిటీ.. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మౌంగి బావెండీ, కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్త లూయిస్ బ్రూస్, నానో క్రిస్టల్స్ టెక్నాలజీ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన అలెక్సీ ఎకిమోవ్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు ప్రకటించింది. సూక్ష్మస్థాయి కణాల ఉత్పత్తి రసాయన శాస్త్రం చదువుకున్న వారు ఎవరికైనా మూలకాల ధర్మాలు వాటిలోని ఎల్రక్టాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని తెలిసే ఉంటుంది. అయితే మూలకం నానోస్థాయికి చేరిందనుకోండి... సాధారణ స్థితిలో ఉండే ధర్మాల స్థానంలో క్వాంటమ్ స్థాయి తాలూకూ ప్రభావం కనిపించడం మొదలవుతుంది. మూలకం సైజును బట్టి ఈ ధర్మాలుంటాయి. ఉదాహరణకు పైన చెప్పుకున్న బంగారం రంగు! అలాగే సైజును బట్టి మూలకాల యాంత్రిక, ఉపరితల, అయస్కాంత, ఎలక్ట్రా్టనిక్, ఆప్టికల్, ఉ్రత్పేరక ధర్మాలు కూడా మారిపోతాయి. సాధారణ సైజులో విద్యుత్తు ప్రవాహాన్ని అడ్డుకోని పదార్థాలు సైజు తగ్గుతున్న కొద్దీ సెమీ కండక్టర్లుగా మారిపోవచ్చు. మరికొన్ని పదార్థాలు సాధారణ సైజులో సెమీకండక్టర్లుగా ఉన్నప్పటికీ నానోస్థాయిలో సూపర్ కండక్టర్లుగా వ్యవహరించవచ్చు. ఇంతటి సూక్ష్మస్థాయిలో ఉండే కణాలను ఉత్పత్తి చేయడంలో ఈ ఏటి రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతలు విజయం సాధించారు. నానో ప్రపంచంలో మూలకాల ధర్మాలు మారిపోతాయని చాలాకాలంగా తెలుసు కానీ.. వీటితో వాస్తవిక ప్రయోజనం తక్కువని అనుకునేవారు. 1980లో అలెక్సీ ఎకిమోవ్ రంగుల గాజులో క్వాంటమ్ ఎఫెక్ట్‌ను సృష్టించడంలో విజయం సాధించారు. కణం సైజు ఆధారంగా రంగు మారుతుందని ఆయన నిరూపించడంతో క్వాంటమ్ డాట్స్‌పై ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ల తరువాత ఒక ద్రవంలో స్వేచ్ఛగా కదులుతున్న కణాల సైజుకు అనుగుణంగా క్వాంటమ్ ఎఫెక్ట్స్ మారుతాయని మొట్టమొదటిసారి నిరూపించగలిగారు. భవిష్యత్తులో సురక్షితమైన సమాచార వ్యవస్థ! 1993లో మౌంగి బావెండీ రసాయనికంగా క్వాంటమ్ డాట్స్‌ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టడంతో వీటిని మన ప్రయోజనాలకు వాడుకోవడం సులువు అయ్యింది. ఇప్పుడు మన కంప్యూటర్ మానిటర్లు, క్యూఎల్ఈడీ స్క్రీన్‌లో విస్తృత స్థాయి రంగులు వెదజల్లడం ఈ క్వాంటమ్ డాట్స్ పుణ్యమే. అలాగే మన ఎల్ఈడీ బల్బుల రంగులు మారడానికి కూడా ఇవే కారణం. శరీరంలోని కణజాలాన్ని స్పష్టంగా గుర్తించేందుకు బయో కెమిస్టులు, వైద్యులు ఇప్పుడు క్వాంటమ్ డాట్స్‌ను వాడుతున్నారు. భవిష్యత్తులో ఈ క్వాంటమ్ డాట్స్ ద్వారా ఎటు కావాలంటే అటు మడిచేసుకోగల ఎల్రక్టానిక్స్, అతి సూక్ష్మమైన సెన్సార్లు, పలుచటి సోలార్ సెల్స్ తయారీతోపాటు అత్యంత సురక్షితమైన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకూ ఉపయోగపడుతుందని అంచనా. క్వాంటమ్ డాట్స్‌పై పరిశోధనలకు నోబెల్ రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా సైంటిస్టులకు ప్రతిష్టాత్మక బహుమతి స్టాక్‌హోమ్: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ బుధవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతి ఈసారి ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలను వరించింది. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో పరిశోధనలకు గాను మౌంగి బావెండీ, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌లకు రసాయన శాస్త్ర నోబెల్ ప్రైజ్ లభించింది. క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో, నానో పారి్టకల్స్ అభివృద్ధిలో ఈ ముగ్గురు సైంటిస్టులు కీలక పాత్ర పోషించారని నోబెల్ కమిటీ తెలియజేసింది. ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అధికారికంగా విజేతల పేర్లు ప్రకటించకముందే ముగ్గురు సైంటిస్టుల పేర్లను స్వీడన్ మీడియా సంస్థలు బహిర్గతం చేయడం కలకలం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Employability Rankings: ప్రపంచంలో ఎక్కువ ఉద్యోగార్హత ఈ యూనివర్సిటీవాళ్లదే!
Times Higher Education (THE) Graduate Employability Rankings 2021: ఉద్యోగవకాశాలు కల్పించడంలో సాంకేతిక విద్యాలయాల పాత్ర ఎంతో ప్రముఖమైంది. అయితే ఈ ఏడాది మన దేశంలోని ప్రముఖ విద్యాలయాలు గ్లోబల్ స్థాయిలో సత్తా చాటాయి. ఏకంగా 27వ స్థానంతో టైమ్స్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌లో నిలిచింది ఐఐటీ ఢిల్లీ. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ 2021లో ఢిల్లీ యూనివర్సిటీ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ 32వ ర్యాంక్), యూనివర్సిటీ ఆఫ్ చికాగో(33వ ర్యాంక్)లను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎక్కువమందిని ఢిల్లీ ఐఐటీ అందిస్తోందన్నమాట. ఇక ఈ లిస్ట్‌లో టాప్-100లో బెంళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc(61), ఐఐటీ బాంబే(97) కూడా చోటు దక్కించుకున్నాయి. గతంలో వీటి ర్యాంక్స్ 71, 128గా ఉండగా.. ఈ ఏడాది ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్(162), ఐఐటీ ఖరగ్పైర్ (170), అమిటీ యూనివర్సిటీ(225), బెంగళూరు యూనివర్సిటీ(249) స్థానాల్లో నిలిచాయి. ఇక క్యూఎస్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ టాప్ 150లో ఢిల్లీ, బాంబే ఐఐటీలు స్థానం దక్కించుకున్నాయి. ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌ను ఉద్యోగుల సబ్జెక్ట్ స్పెషలైజేషన్, గ్రాడ్యుయేట్ స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్ ఎక్సలెన్స్, డిజిటల్ పర్ఫార్మెన్స్, ఫోకస్ ఆన్ వర్క్, సాఫ్ట్ స్కిల్స్-డిజిటల్ లిటరసీ, ఇంటర్నేషనలిజం, స్పెషలైజేషన్.. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. THE Graduate Employability Rankings 2021 లో మాసెచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(అమెరికా) టాప్ ప్లేస్‌లో ఉంది. ఆసియా నుంచి టోక్యో యూనివర్సిటీ(6), సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ (9) మాత్రమే టాప్ టెన్‌లో చోటు సంపాదించుకున్నాయి. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! సంచలన విషయాలు వెల్లడి..! -
క్రెడిట్ కార్డు వాడకం అంటే కొకైన్‌కి బానిసవ్వడమే
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త. క్రెడిట్ కార్డు వాడకం అంటే కొకైన్‌కి బానిసవ్వడమే అని తాజాగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటి) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే క్రెడిట్ కార్డుతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. షాపింగ్ మాల్స్, రిటైల్ అవుట్లెట్లలో, ఈ-కామర్స్ లో క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగించడం ఇప్పుడు సాధారణమై పోయింది. మెట్రో నగరాల్లోని ఎక్కువ మంది క్రెడిట్ కార్డులు అధికంగా వినియోగిస్తున్నారు. ఇది చాలదు అన్నట్టు పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగులకు, వ్యాపారులకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ కార్డులు తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. క్రెడిట్ కార్డు తీసుకున్నవారు అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే ఈ మత్తులో పడిపోతే తొందరగా బయటికి రాలేరని నిపుణులు అంటున్నారు. ఎంఐటి అధ్యయనం ప్రకారం.. క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు చేసే సమయంలో కొకైన్ మాదిరిగానే మెదడులో ఒక రియాక్షన్‌ని, ఒక మత్తుని ఏర్పరుస్తుందని సర్వేలో తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రెడిట్‌కార్డు వాడకం మెదడుకు కొకైన్ మాదిరిగానే కిక్ ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు. వివిధ రకాల ఆన్లైన్ షాపింగ్ సమయంలో క్రెడిట్ కార్డు ఉంటే కోరికలు ఎక్కువ కలుగుతాయని అధ్యయనం తెలిపింది. దీనివల్ల అవసరమైన వాటి కంటే అనవసరమైన ఖర్చు ఎక్కువ పెడుతున్నట్లు సర్వేలో తేలింది. ఉదాహరణకు రెస్టారెంట్లలో, సెలవు దినాలలో ఉపయోగించే క్రెడిట్ కార్డులు ఇంధనంపై ఉపయోగించే కార్డుల కంటే పెద్ద కోరికలను రేకెత్తిస్తాయి. ఈ విషయంపై ప్రొఫెసర్ డ్రేజెన్ ప్రిలెక్ మాట్లాడుతూ.. కొంత మంది క్రెడిట్‌కార్డు, మరికొంతమంది నగదు లావాదేవీలు చేసే వారి మెదడు ప్రతిస్పందనలను తాము స్కాన్ చేశాము. ఇందులో క్రెడిట్ కార్డు ఉపయోగించి షాపింగ్ చేస్తున్న వారిలో మెదడు ప్రేరేపించ బడుతున్నట్లు కనుగొన్నాము. ఈ చర్య వారికి ఆనందం కలుగజేస్తోందని.. అందువల్ల అవసరం లేకున్నా ఎక్కువ కొనుగోళ్లు చేస్తుండటం పరిశీలించామని వివరించారు. చదవండి: బెస్ట్ కెమెరా ఫీచర్ తో వన్‌ప్లస్ కొత్త సిరీస్ తిరుమల సందర్శకులకు తీపికబురు! -
పాలకూర మొక్కలతో ఈ–మెయిళ్లు పంపొచ్చు!
పాలకూరతో ఏం చేస్తారు..? పప్పు వండుకుని తింటాం.. అంతేగా.. అయితే పాలకూర మొక్కలతో ఈ–మెయిళ్లు పంపించొచ్చు తెలుసా..? పాలకూరతో ఈ–మెయిల్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మనం ఉన్నది 21వ శతాబ్దం అనే విషయం గుర్తుంచుకోవాలి. పాలకూర మొక్కలు మన స్మార్ట్ఫోన్లకు మెయిల్స్ పంపేలా చేయడంలో అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఘన విజయం సాధించారు. భవిష్యత్తులో భూగర్భ జలాల కాలుష్యం మొదలుకొని వాతావరణ మార్పుల ప్రభావం దాకా అనేక అంశాలపై ఈ మెయిల్స్ ఉపయోగపడుతాయని శాస్త్రవేత్తల అంచనా. ప్రతి మొక్కకూ ఓ కీబోర్డు, మౌస్ ఉండవు కానీ.. వాటి ఆకుల్లోకి కార్బన్ నానోట్యూబ్స్‌ను చేర్చి సందేశాలను అందుకునేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఇన్ఫ్రా రెడ్ కిరణాలను ఈ మొక్కలపై ప్రసారం చేసినప్పుడు కార్బన్ నానో ట్యూబ్స్ వెలువరించే కాంతి స్పష్టంగా కన్పిస్తుంది. కాంతిలో ఏదైనా తేడా వస్తే కెమెరా ద్వారా శాస్త్రవేత్తకు మెయిల్ అందుతుంది. ప్లాంట్ నానోబయోనిక్స్.. ఇటీవల పుట్టుకొచ్చిన సరికొత్త విభాగమే ఈ ప్లాంట్ నానో బయోనిక్స్. మొక్కల లోపల లేదా మొక్కలతో కలసి ఎలక్ట్రానిక్ భాగాలను పనిచేసేలా చేయడం ఇందులోని కీలక అంశం. మొక్కలు రసాయనాలను చాలా బాగా విశ్లేషించగలవు. కాకపోతే ఆ సమాచారం మనకు తెలియదు. ప్లాంట్ నానోబయోనిక్స్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చనేది పరిశోధకుల అంచనా. పాలకూరలో నానోట్యూబ్స్‌ను జొప్పించడం ద్వారా భూగర్భ జలాలు, మట్టిలో జరిగే అతి సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించే వీలు కలుగుతుంది. నీటి, మట్టిలోని కాలుష్యాన్ని మాత్రమే కాకుండా.. మొక్కలకు దగ్గర్లోని పేలుడు పదార్థాలను గుర్తించేందుకు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ మైకేల్ స్ట్రానో తెలిపారు. సూక్ష్మస్థాయి సెన్సర్లతోనూ ఈ పనులు చేయొచ్చు. కానీ విద్యుత్ అవసరం లేకుండానే ప్లాంట్ నానోబయోనిక్స్ పనిచేస్తాయి. పైగా ఒకసారి నానో కణాలను మొక్కల్లోకి జొప్పించిన తర్వాత నిరంతరం మనకు సందేశాలు అందుతూనే ఉంటాయి. కొన్నేళ్ల కింద తాము నానో కణాల సాయంతో మొక్కలు చీకట్లో వెలిగేలా చేయగలిగామని, విద్యుత్ అవసరం లేకుండా దాదాపు 4 గంటల పాటు ఈ వెలుతురు పొందొచ్చని స్ట్రానో వివరించారు. – సాక్షి, హైదరాబాద్ -
అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట
వాషింగ్టన్: అమెరికాలో ఎఫ్–1, ఎం–1 వీసాలపై చదువుకుంటున్న భారతీయులు సహా విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ వెనక్కి తీసుకుంది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం మసాచూసెట్స్‌లోని అమెరికా జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. అంతకు ముందే ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని న్యాయమూర్తి అలిసన్ బరో న్యాయస్థానంలో వెల్లడించారు. విద్యాసంస్థల్లో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు దేశం విడిచి వెనక్కి వెళ్లిపోవాలంటూ ఈ నెల 6న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలతో లక్షలాది మంది విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు. కోవిడ్–19 అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ యూనివర్సిటీలు ఆన్లైన్ క్లాసులే నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్వదేశాలకు వెళితే వీసా స్టేటస్ కాపాడుకోవడం, రుణాల చెల్లింపు, వేర్వేరు టైమ్ జోన్లతో తరగతులకు ఎలా హాజరుకావాలని విద్యార్థులు సతమతమయ్యారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉన్న 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. వెనకడుగు ఎందుకంటే.. ► హార్వర్డ్, ఎంఐటీలకు మద్దతుగా కాలిఫోర్నియా పబ్లిక్ కాలేజీలు, మరో 17 రాష్ట్రాలు ట్రంప్ సర్కార్‌ని కోర్టుకీ డ్చాయి. వారికి టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్‌లు మద్దతు పలికాయి. వృత్తివిద్యా కోర్సుల్లో ఇచ్చే శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో అవసరమని, అంతిమంగా దేశంలో వాణిజ్య రంగాన్ని బలోపేతం చేస్తాయని టెక్కీ సంస్థలు తేల్చి చెప్పాయి. ► విద్యాసంస్థల్ని తెరవడం కోసం యూనివర్సిటీలపై ఒత్తిడి పెంచడానికే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందంటూ రాజకీయంగానూ ఎదురుదాడి ప్రారంభమైంది. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న చెడ్డ పేరు కూడా వచ్చింది. ► ఆన్లైన్ తరగతులపై పరిమితుల్ని ఎత్తివేస్తూనే, మరోవైపు దానికి పూర్తి విరుద్ధంగా ఇలాంటి ఉత్తర్వులు ఐసీఈ ఎలా ఇస్తుందని హార్వర్డ్, ఎంఐటీలు వాదించాయి. ► అమెరికాలో విదేశీ విద్యార్థులు 10 లక్షలకు పైగా ఉన్నారు. 2018–19లో విదేశీ విద్యార్థుల ద్వారా అగ్రరాజ్యానికి వచ్చిన ఆదాయం 447 కోట్ల డాలర్లుగా ఉంది. విద్యార్థుల్ని వెనక్కి పంపితే అగ్రరాజ్యానికి ఆర్థికంగా కూడా నష్టం కలుగుతుంది. ► విద్యార్థుల్లో ఎక్కువ మంది చైనా, భారత్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా దేశానికి చెందినవారు. దీంతో అంతర్జాతీయంగాను ట్రంప్ సర్కార్ ప్రతిష్ట దిగజారింది. -
‘ఆన్లైన్’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ
న్యూయార్క్: ఆన్లైన్ క్లాస్‌లకు మారిన విద్యా సంస్థలకు చెందిన విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న అమెరికా ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలపై ఈ రెండు ప్రఖ్యాత విద్యా సంస్థలు బుధవారం బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ నిబంధనలను తక్షణమే తాత్కాలికంగా నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి. ‘ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ ఉత్తర్వులిచ్చారు. ఇది చాలా దారుణం. ఈ ఆదేశాలు చట్ట వ్యతిరేకం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ లారెన్స్ బేకో పేర్కొన్నారు. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు న్యాయం జరిగేలా తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆన్లైన్ క్లాసెస్‌కు మారిన విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న ఆదేశాల వల్ల విద్యాసంస్థలు త్వరగా పునఃప్రారంభమయ్యే అవకాశముందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డెప్యూటీ సెక్రటరీ కుసినెలీ అన్నారు. ట్రంప్ ఆగ్రహం: ఫాల్ అకడమిక్ సెషన్‌కి విద్యా సంస్థలను పునఃప్రారంభినట్లయితే, వారికి ఫెడరల్ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. విద్యాసంస్థల పునః ప్రారంభానికి సంబంధించి అరోగ్య విభాగం జారీ చేసిన మార్గదర్శకాలను ఆచరణ సాధ్యం కాదని మండిపడ్డారు. -
అత్యుత్తమ విశ్వవిద్యాయాలకు కేరాఫ్..
లండన్ : బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను గత మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎమ్ఐటీ) వరుసగా ఏడోసారి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. విద్యార్థి- ఉపాధ్యాయుల నిష్పత్తి, అంతర్జాతీయంగా యూనివర్సిటీకి ఉన్న పేరు ప్రతిష్టలు, విద్యా ప్రమాణాలు, ఉద్యోగ కల్పన వంటి విభాగాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు క్యూఎస్ పేర్కొంది. ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ విశ్వవిద్యాలయాలను నిర్ణయించేందుకు పరిగణనలోకి తీసుకున్న ప్రతీ విభాగంలో ఎమ్ఐటీ వందకు వంద పాయింట్లు సంపాదించినట్లు క్యూఎస్ వెల్లడించింది. కాగా ప్రపంచంలోని 39 యూనివర్సిటీలు వందకు 80 పాయింట్లు సాధించి టాప్ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకున్నాయని క్యూఎస్ పేర్కొంది. కాగా ఈ జాబితాలో అత్యధికంగా 15 యూనివర్సిటీలతో అమెరికా ముందు వరుసలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యూకే, చైనాకు చెందిన పలు యూనివర్సిటీలు ఉన్నాయి. క్యూఎస్ వెల్లడించిన ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితా (పాయింట్లతో సహా) -
గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఐఐటీలు ఢమాల్
న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు) గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఢమాల్ మనిపించాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ మంగళవారం విడుదలచేసిన 2016-17 ర్యాంకింగ్స్‌లో ఐఐటీలు తమ స్థానాలను కోల్పోయాయి. ఈ ర్యాంకింగ్‌లో వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ప్రపంచంలో బెస్ట్‌గా నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో ఇండియాలో అత్యున్నత సంస్థగా మళ్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు బెంగళూరే చోటు దక్కించుకుంది. కానీ టాప్ 150 స్థానం నుంచి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ పడిపోయిందని క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. అయితే ఐఐటీ మద్రాసు మాత్రం టాప్ 250 స్థానాన్ని చేధించి, ఐదు స్థానాలు పైకి ఎగబాకినట్టు ర్యాంకింగ్ల్లో తెలిసింది. 10 ఇండియన్ యూనివర్సిటీలో తొమ్మిది 700 ర్యాంకింగ్‌లో నిలిచాయి. అయితే గతేడాది కంటే ఈ యూనివర్సిటీలు తమ ఈ ర్యాంక్‌లను కోల్పోయాయి. అకాడమిక్, ఎంప్లాయర్ రిప్యూటేషన్ రెండింటి ర్యాంకింగ్‌లోనూ ఈ ఇన్స్టిట్యూట్లు పేలవమైన ప్రదర్శన కనబర్చినట్టు ర్యాంకింగ్ రిపోర్టు వెల్లడించింది. వరల్డ్ టాప్ 100 రీసెర్చ్ ఇంపాక్ట్ ర్యాంకింగ్‌లో కూడా భారత్ నుంచి కేవలం నాలుగు ఇన్స్టిట్యూట్లు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు రీసెర్చ్ రిపోర్టు తెలిపింది. భారత్ బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్గా ఐఐఎస్సీ 11వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ర్యాంకింగ్‌లో పడిపోవడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయని క్యూఎస్ ఇంటిలిజెంట్ యూనిట్ రీసెర్చ్ హెడ్ బెన్ సౌటర్ తెలిపారు. పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లు తక్కువగా ఉండట, ఇతర దేశాలనుంచి పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లను ఇండియా నియమించుకోవడం ర్యాంకింగ్‌లను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ పోటీదారులను ఇండియా పెంచుకుని ఫర్ఫార్మెన్స్ను ఇండియా మెరుగుపరుచుకోవాలని ఈ ర్యాంకింగ్‌లు సూచిస్తున్నట్టు సౌటర్ తెలిపారు. 2004 నుంచి యూఎస్ ఇన్స్టిట్యూషన్సే ఈ ర్యాకింగ్‌లో టాప్ 3 స్థానాలను ఆక్రమించుకుంటూ వస్తున్నాయి.