మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త. క్రెడిట్ కార్డు వాడకం అంటే కొకైన్‌కి బానిసవ్వడమే అని తాజాగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటి) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే క్రెడిట్ కార్డుతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. షాపింగ్ మాల్స్, రిటైల్ అవుట్లెట్లలో, ఈ-కామర్స్ లో క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగించడం ఇప్పుడు సాధారణమై పోయింది. మెట్రో నగరాల్లోని ఎక్కువ మంది క్రెడిట్ కార్డులు అధికంగా వినియోగిస్తున్నారు.
ఇది చాలదు అన్నట్టు పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగులకు, వ్యాపారులకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ కార్డులు తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. క్రెడిట్ కార్డు తీసుకున్నవారు అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే ఈ మత్తులో పడిపోతే తొందరగా బయటికి రాలేరని నిపుణులు అంటున్నారు. ఎంఐటి అధ్యయనం ప్రకారం.. క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు చేసే సమయంలో కొకైన్ మాదిరిగానే మెదడులో ఒక రియాక్షన్‌ని, ఒక మత్తుని ఏర్పరుస్తుందని సర్వేలో తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రెడిట్‌కార్డు వాడకం మెదడుకు కొకైన్ మాదిరిగానే కిక్ ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు.
వివిధ రకాల ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో క్రెడిట్ కార్డు ఉంటే కోరికలు ఎక్కువ కలుగుతాయని అధ్యయనం తెలిపింది. దీనివల్ల అవసరమైన వాటి కంటే అనవసరమైన ఖర్చు ఎక్కువ పెడుతున్నట్లు సర్వేలో తేలింది. ఉదాహరణకు రెస్టారెంట్లలో, సెలవు దినాలలో ఉపయోగించే క్రెడిట్ కార్డులు ఇంధనంపై ఉపయోగించే కార్డుల కంటే పెద్ద కోరికలను రేకెత్తిస్తాయి. ఈ విషయంపై ప్రొఫెసర్ డ్రేజెన్ ప్రిలెక్ మాట్లాడుతూ.. కొంత మంది క్రెడిట్‌కార్డు, మరికొంతమంది నగదు లావాదేవీలు చేసే వారి మెదడు ప్రతిస్పందనలను తాము స్కాన్ చేశాము. ఇందులో క్రెడిట్ కార్డు ఉపయోగించి షాపింగ్ చేస్తున్న వారిలో మెదడు ప్రేరేపించ బడుతున్నట్లు కనుగొన్నాము. ఈ చర్య వారికి ఆనందం కలుగజేస్తోందని.. అందువల్ల అవసరం లేకున్నా ఎక్కువ కొనుగోళ్లు చేస్తుండటం పరిశీలించామని వివరించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment