సాధారణంగా మనకు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. కానీ కొటాక్ మహీంద్రా బ్యాంక్ మాత్రం డెబిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
మనల్ని అత్యవసర సమయాల్లో ఆర్ధికంగా ఆదుకునేది క్రెడిట్ కార్డ్‌లే. ఆ కార్డ్‌లపై అవగాహన ఉండి సరైన పద్దతిలో మితంగా వాడుకుంటే మంచిది. పరిధి దాటితే చివరికి అప్పులు పాలు కావాల్సి వస్తుంది. అయితే కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అవసరం లేకుండా 'కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్' స్కీమ్ లో భాగంగా డెబిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే క్రెడిట్ కార్డు ప్రయోజనాలు అందిస్తోంది. అంటే డెబిట్ కార్డుతో చేసిన బిల్లును ఈఎంఐలుగా మార్చుకుని మన బడ్జెట్‌కి అనువుగా వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తోంది.
'కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్' స్కీమ్‌లో వినియోగదారులు ఫ్యాషన్ యాక్ససరీస్,ఎలక్ట్రానిక్ వస్తువులు, కిరాణా సామాగ్రిని కొనుగోలు చేవవచ్చు. అనంతరం షాపింగ్‌కి సంబంధించిన బిల్లును డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తూ వాటిని ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఆ అవకాశం వినియోగించుకోవాలంటే తప్పని సరిగా రూ.5,000లకు పైగా షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని కల్పించినందుకు ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకోవడం లేదని కొటక్ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.
♦ వినియోగదారులు ఆఫ్ లైన్ లో లేదంటే ఆన్ లైన్ లో డెబిట్ కార్డ్‌తో రూ.5వేల వరకు షాపింగ్ చేసుకోవచ్చు.
♦ మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐకి అర్హులా? కాదా అనేది బ్యాంక్ అధికారుల్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.
♦ మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐకి అర్హులైతే బ్యాంక్ నుంచి ఎస్‌ఎంఎస్ వస్తుంది.
♦ అనంతరం మీ ట్రాన్సాక్షన్ ను రివ్వ్యూ చేసి మీకు ఈఎంఐ సదుపాయాన్ని ఎన్ని నెలలు ఇవ్వాలనేది బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుంది.
♦ మీకు బ్యాంక్ కల్పించిన ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే రిక్వెస్ట్ చేయాలి. అపై మీకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి ఈఎంఐగా మార్చుకోవచ్చు.
♦ వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఈఎంఐలో భాగంగా ఆటో మెటిగ్గా మీ అకౌంట్ నుంచి మీరు ఎంత ఈఎంఐ చెల్లిస్తారో అంతే కట్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment