ప్రతీకాత్మక చిత్రం
లండన్ : బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను గత మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎమ్‌ఐటీ) వరుసగా ఏడోసారి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. విద్యార్థి- ఉపాధ్యాయుల నిష్పత్తి, అంతర్జాతీయంగా యూనివర్సిటీకి ఉన్న పేరు ప్రతిష్టలు, విద్యా ప్రమాణాలు, ఉద్యోగ కల్పన వంటి విభాగాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు క్యూఎస్ పేర్కొంది.
ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ విశ్వవిద్యాలయాలను నిర్ణయించేందుకు పరిగణనలోకి తీసుకున్న ప్రతీ విభాగంలో ఎమ్‌ఐటీ వందకు వంద పాయింట్లు సంపాదించినట్లు క్యూఎస్ వెల్లడించింది. కాగా ప్రపంచంలోని 39 యూనివర్సిటీలు వందకు 80 పాయింట్లు సాధించి టాప్ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకున్నాయని క్యూఎస్ పేర్కొంది. కాగా ఈ జాబితాలో అత్యధికంగా 15 యూనివర్సిటీలతో అమెరికా ముందు వరుసలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యూకే, చైనాకు చెందిన పలు యూనివర్సిటీలు ఉన్నాయి.
క్యూఎస్ వెల్లడించిన ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితా (పాయింట్లతో సహా)
Comments
Please login to add a commentAdd a comment