best Universities
-
LPU: రూ. 3 కోట్ల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్స్‌లో మరోసారి ఎల్పీయూ సత్తా
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)కి చెందిన పూర్వ విద్యార్థి యాసిర్ మహమ్మద్ ఓ జర్మనీ కంపెనీలో రూ.3కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శబాష్ అనిపించుకుంటున్నారు. 2018లో వర్సిటీ నుంచి పాసవుట్ అయిన యాసిర్ ప్లేస్‌మెంట్స్‌లో సరికొత్త చరిత్రను లిఖించాడు. ఎల్పీయూ విద్యార్థులు ప్లేస్మెంట్లలో ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఆ వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థి యాసిర్ మహమ్మద్ ఒక జర్మనీ కంపెనీలో రూ.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శబాష్ అనిపించుకున్నాడు. 2018లో వర్సిటీ నుంచి పాసవుట్ అయిన యాసిర్ ప్లేస్‌మెంట్స్‌లో సరికొత్త చరిత్రను లిఖించాడు. ఇండస్ట్రీలో సరికొత్త సాంకేతిక నైపుణ్యాలైన కృత్రిమ మేధస్సు(AI), మెషిన్ లెర్నింగ్ (ML) ప్రాజెక్టులలో ఆయన పనిచేయనున్నారు. ఎల్పీయూలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక యాసిర్ మరే ఇతర డిగ్రీని అభ్యసించలేదు. ఆ వర్సిటీలో చదువుతున్న సమయంలోనే అక్కడ అందించిన నాణ్యమైన విద్యతో పాటు శిక్షణలో నేర్చుకున్న బలమైన ప్రాథమిక అంశాలు తన అపూర్వ విజయానికి కారణమని చెప్పుకొచ్చాడు. ఎల్పీయూలో విద్యనభ్యసించి భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించిన వారిలో యాసిన్ ఒక్కరు మాత్రమే కాదు.. దిగ్గజ ఐటీ కంపెనీలైన గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మెర్సిడెస్ తదితర ప్రపంచవ్యాప్తంగా ఇతర ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో రూ.కోటి అంతకన్నా అధిక ప్యాకేజీలతో ఉద్యోగాలకు ఎంపికైన వారిలో వేలాది మంది ఈ వర్సిటీకి చెందిన విద్యార్థులే ఉన్నారు. ఎల్పీయూ ప్రారంభం నుంచి ప్లేస్‌మెంట్స్‌లో మేటిగా నిలుస్తూ తనదైన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2000+కు పైగా దిగ్గజ కంపెనీలు ఐఐటీలు/ఐఐఎంలు/ఎన్ఐటీలతో పాటు ఎల్పీయూ నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించుకొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తన ప్రయాణంలో ఎల్పీయూ అధ్యాపకులు అందించిన మార్గదర్శకత్వం, మద్దతుకు యాసిర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్లేస్మెంట్ సెల్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రూ.3కోట్ల వార్షిక వేతన ప్యాకేజీకి ఎంపిక కావడంలో వర్సిటీలో అందించిన శిక్షణ, ప్రాక్టికల్ ట్రైనింగే ఎంతో కీలకంగా పనిచేసిందని చెప్పాడు. అలాగే, ఎల్పీయూలో నిర్వహించిన బోధనేతర కార్యకలాపాలు, ఈవెంట్లు తనలో వ్యక్తిత్వ వికాసంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు ఎంతగానో దోహదం చేశాయని తెలిపాడు. LPU B.Tech. CSE Passout Yasir M. | A Record-Breaking Package of ₹ 3 Crore At a Global MNC in Germany ప్లేస్మెంట్లలో ఇలాంటి రికార్డులు ఎల్‌పీయూకు కొత్త ఏమీ కాదు. గతంలోనూ భారీ సంఖ్యలో ఇక్కడి ఉద్యోగులు ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 2022లో ఎల్పీయూలో బీటెక్ గ్రాడ్యుయేట్ హరేకృష్ణ మహ్తో బెంగళూరులోని గూగుల్ కంపెనీలో రూ.64లక్షల భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. గత కొన్ని బ్యాచ్‌లు నుంచి చూస్తే 600 మందికి పైగా LPU విద్యార్థులు రూ.10 లక్షల నుంచి రూ.63లక్షల ప్యాకేజీలుతో ఉద్యోగాలు సాధించారు. కాగ్నిజెంట్ 1850మందికి పైగా ఎల్పీయూ విద్యార్థులను నియమించుకోగా, క్యాప్‌జెమిని1400+, విప్రో 500+, ఎంఫసిస్530+, హైరేడియస్ 800+ ఇలా పలు ప్రతిష్ఠాత్మక కంపెనీలు సైతం ఎల్పీయూ విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. గత కొద్ది సంవత్సరాల్లో 20వేలు కన్నా ఎక్కువ ప్లేస్‌మెంట్స్/ఇంటర్న్‌షిప్‌ల్లో ఎల్పీయూ విద్యార్థులే టాప్‌లో ఉన్నారు. కొన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు 5వేలకు పైగా ఆఫర్లు ఇచ్చాయి. ఎల్పీయూ గురించి హరేకృష్ణ ఏమంటున్నారో మీరే వినండి. LPU B.Tech. CSE Graduate Harekrishna Mahto | Hired By Google At 64 LPA | #UnBeatablePlacementsAtLPU ఎల్పీయూ పరీక్ష, అడ్మిషన్ల ప్రక్రియ గురించి తెలుసుకొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి https://bit.ly/3psMUAO ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ అవసరాలకు తగినట్టుగా పాఠ్యప్రణాళిక రూపొందించి.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి వారికి అద్భుతమైన అవకాశాలు కల్పించడంలో ఎల్పీయూ దానికదే సాటి. గూగుల్, మైక్రోసాఫ్ట్, CompTIA, ట్రాన్సోర్గ్ అనలిటిక్స్, ఐబీఎం వంటి అనేక దిగ్గజ కంపెనీల అధినేతలతో కలిసి విద్యార్థులకు వాస్తవిక ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం కల్పిస్తోంది. అలాగే, 300+ కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలతో టై-అప్ కలిగి ఉండటం ద్వారా విదేశాల్లో చదవాలనుకొనే వారికి ఎల్పీయూ అవకాశాలు కల్పిస్తుంది. ఎల్పీయూ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు త్వరలోనే ముగియనుంది. ఇక్కడ అడ్మిషన్లకు చాలా పోటీ ఉంటుంది. LPUNEST 2023ప్రవేశ పరీక్షలో ప్రతిభతో పాటు కొన్ని ప్రోగ్రామ్‌లలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను క్లియర్ చేయడంపై అడ్మిషన్లు ఆధారపడి ఉంటాయి. పరీక్ష, అడ్మిషన్ల ప్రక్రియ తెలుసుకొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. https://bit.ly/3psMUAO -
ప్రతిష్టాత్మక వరంగల్ నిట్ లో పండుగకు వేళాయే
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతి ఏడాది విద్యార్థులచే నిర్వాహకులుగా మూడు రోజుల వసంతోత్సవ సంబురం, సంస్కృతి సంప్రదాయాలను పంచుకునే వేదికగా నిలుస్తున్న స్ప్రింగ్ స్ప్రీ–23 ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. నిత్యం విద్యతో కుస్తీ పడుతూ ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న నిట్ విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు దేశవ్యాప్త ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, మన సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకుంటూ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌గా ఏర్పాటు చేసుకుని మూడు రోజుల వేడుకకు శ్రీకారం చుట్టారు. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 20వేల మంది విద్యార్థులు ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చ రల్ ఫెస్ట్గా నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ నిలుస్తుంది. ప్రతి ఏడాది ప్రత్యేక థీంతో.. నిట్ వరంగల్ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న స్ప్రింగ్‌స్ప్రీ వసంతోత్సవ వేడుకలకు ప్రత్యేక థీంను రూపొందిస్తారు. ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ–23కి కళాధ్వనిగా నామకరణం చేశారు. 2019లో కళాక్షేత్ర, 2020లో మితియాస్, 2022లో సృష్టి, 2023లో కళాధ్వనిగా నామకరణం చేశారు. 55కు పైగా ఈవెంట్స్.. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీలో 55కు పైగా ఈవెంట్స్‌తో అలరించనుంది. తొలిరోజు 7న టాలీవుడ్ నైట్ పేరిట టాలీవుడ్ సింగర్స్ నిట్ మైదానంలో అలరించనున్నారు. రెండో రోజు 8న డీజే నైట్, సన్‌బర్న్ పేరిట డీజేలు వివిధ రకాల పాటలతో అలరించనున్నారు, మూడో రోజు 9న బాలీవుడ్ నైట్ పేరిట బాలీవుడ్ సింగర్స్ ఉర్రూతలూగించనున్నారు. వీటితో పాటు మూడురోజుల పాటు ప్రొ షోలు, స్పాట్ లైట్స్, స్యాండ్ ఆర్ట్, సైలెంట్ డీజేస్, మాస్టర్ చెఫ్, జుంబాడ్యాన్స్, కొరియో నైట్, వార్ ఆఫ్ డీజెస్, ఐడల్, అల్యూర్లతో వసంతోత్సవం కలర్ ఫుల్‌గా సాగనుంది. ప్రతిష్టాత్మకంగా స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని నిట్ వరంగల్‌లో నిర్వహించనున్న మూడు రోజుల స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనిని ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో వేడుకలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. బుధవారం నిట్‌లోని సుభాష్‌చంద్రబోస్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చేందుకు, సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకునేందుకు స్ప్రింగ్‌స్ప్రీ వేడుకలు విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్నారు. రెండు నెలల పాటు 200 మంది విద్యార్థులు నిట్‌లోని వివిధ క్లబ్స్‌తో మమేకమై కోర్టీంలుగా ఏర్పడి ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ హీరాలాల్, కోర్ టీం వంశీ కిషార్, అజయ్‌కుమార్, పీయూష్‌కుమార్, సాయిగురునాథ్ పాల్గొన్నారు. నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా సినీ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏప్రిల్ 6న ముఖ్యఅతిథిగా పాల్గొని స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకలను నిట్ మైదానంలో ప్రారంభించనున్నారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు ఓరుగల్లు వాసులు ఎదురు చూస్తున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎంట్రీ పాసుల కోసం ఇప్పటికే క్రేజ్ మొదలైంది. స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లను నిట్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో QR కోడ్లతో అందజేస్తున్నారు. -
అత్యుత్తమ విశ్వవిద్యాయాలకు కేరాఫ్..
లండన్ : బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను గత మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎమ్ఐటీ) వరుసగా ఏడోసారి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. విద్యార్థి- ఉపాధ్యాయుల నిష్పత్తి, అంతర్జాతీయంగా యూనివర్సిటీకి ఉన్న పేరు ప్రతిష్టలు, విద్యా ప్రమాణాలు, ఉద్యోగ కల్పన వంటి విభాగాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు క్యూఎస్ పేర్కొంది. ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ విశ్వవిద్యాలయాలను నిర్ణయించేందుకు పరిగణనలోకి తీసుకున్న ప్రతీ విభాగంలో ఎమ్ఐటీ వందకు వంద పాయింట్లు సంపాదించినట్లు క్యూఎస్ వెల్లడించింది. కాగా ప్రపంచంలోని 39 యూనివర్సిటీలు వందకు 80 పాయింట్లు సాధించి టాప్ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకున్నాయని క్యూఎస్ పేర్కొంది. కాగా ఈ జాబితాలో అత్యధికంగా 15 యూనివర్సిటీలతో అమెరికా ముందు వరుసలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యూకే, చైనాకు చెందిన పలు యూనివర్సిటీలు ఉన్నాయి. క్యూఎస్ వెల్లడించిన ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితా (పాయింట్లతో సహా) -
సబ్జెక్టుల్లో ప్రపంచంలోనే బెస్ట్ వర్సిటీలు ఇవే..
న్యూయార్క్: ప్రతి ఏడాది ప్రపంచంలో ఉత్తమ విశ్వవిద్యాలయాలను గుర్తించి వాటి జాబితాను విడుదల చేసినట్లుగానే ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అత్యున్నత విశ్వవిద్యాలయాల జాబితాను క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకిగ్స్ సంస్థ విడుదల చేసింది. బోధన, అకాడమిక్ పనితీరు, వర్సిటీలో మౌలిక సదుపాయాలతోపాటు పరిశోధనలు, ఉద్యోగుల పనితీరు విద్యార్థుల పురోగతి వంటి అంశాల అధారంగా మొత్తం 16 ఉత్తమ వర్సిటీల జాబితాను ప్రకటించింది. అయితే, పైన తెలిపిన అంశాలను ప్రాథమికంగా సర్వే కోసం తీసుకున్నా.. కేవలం సబ్జెక్టుల ఆధారంగా మాత్రం అత్యుత్తమ సేవలు అందిస్తున్న బెస్ట్ యూనివర్సిటీల జాబితా ప్రకటించింది. అవి ఏంటంటే.. 1.హార్వార్డ్ యూనివర్సిటీ అమెరికా 2.మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా 3.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, బ్రిటన్ 4.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, బ్రిటన్ 5.వెజినింజెన్ యూనివర్సిటీ, నెదర్లాండ్ 6.ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, బ్రిటన్ 7.యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియా, అమెరికా 8.యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, హాంకాంగ్ చైనా 9.ఈటీహెచ్ జూరిచ్, స్విట్జర్లాండ్ 10.యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్రిటన్ 11.కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్, అమెరికా 12.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బార్కెలీ క్యాంపస్, అమెరికా 13.యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియా, అమెరికా 14.ది జులియార్డ్ స్కూల్, అమెరికా 15.యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ అమెరికా 16.యూనివర్సిటీ ఆఫ్కాలిఫోర్నియా, డేవిస్ క్యాంపస్, అమెరికా -
బెస్ట్ వర్సిటీల్లో మనవేవీ లేవు!
ఉపాధ్యాయుల కొరత వల్ల ప్రమాణాలు లోపిస్తున్నాయి యూజీసీ వజ్రోత్సవాల్లో ప్రధాని మన్మోహన్సింగ్ న్యూఢిల్లీ: ఉన్నత విద్యారంగంలో లోపించిన నాణ్యతప్రమాణాలను ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో మనదేశానికి చెందిన విద్యాసంస్థలేవీ లేకపోవడంపై ప్రధాని మన్మోహన్సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్నతవిద్య ప్రమాణాలపై నాణ్యమైన, అర్హులైన ఉపాధ్యాయుల కొరత తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), తత్సంబంధిత వర్గాలు ఆ సమస్యను తక్షణమే పరిగణనలోకి తీసుకుని, పరిష్కారం దిశగా వినూత్న మార్గాలను వెదకాల్సిన అవసరం ఉందని సూచించారు. యూజీసీ వజ్రోత్సవాల్లో ఆయన శనివారం పాల్గొన్నారు. 60 ఏళ్లుగా ఉన్నతవిద్యారంగంలో యూజీసీ చిరస్మరణీయ కృషి జరిపిందని, ఇంకా అత్యుత్తమ ప్రదర్శన రావాల్సి ఉందన్నారు. 1991లో ఆయన యూజీసీ చైర్మన్‌గా పనిచేశారు. దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థలుగా ఐఐటీ)ల్లోనే ఉపాధ్యాయుల కొరత 32 శాతం ఉందని, అన్ని కేంద్ర వర్సిటీల్లోనూ ఉపాధ్యాయ ఖాళీలు చాలా ఉన్నాయన్నారు. శాస్త్ర పరిశోధనలపై వర్సిటీలు దృష్టి పెట్టి, పీహెచ్‌డీల సంఖ్యను, నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాగా వజ్రోత్సవాల్లో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ దేశంలోని వివిధ వర్సిటీల్లో నోబెల్ అవార్డుల గ్రహీతల పేరిట ప్రత్యేక పీఠాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.