ప్రతిష్టాత్మక వరంగల్ నిట్ లో పండుగకు వేళాయే | NIT Warangal is ready for the Annual Celebration | Sakshi
Sakshi News home page

నిట్ వరంగల్ లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్‌ ఫెస్ట్‌

Published Thu, Mar 30 2023 1:46 AM | Last Updated on Fri, Mar 31 2023 12:57 PM

NIT Warangal is ready for the Annual Celebration - Sakshi

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లో ప్రతి ఏడాది విద్యార్థులచే నిర్వాహకులుగా మూడు రోజుల వసంతోత్సవ సంబురం, సంస్కృతి సంప్రదాయాలను పంచుకునే వేదికగా నిలుస్తున్న స్ప్రింగ్‌ స్ప్రీ–23 ఏప్రిల్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. నిత్యం విద్యతో కుస్తీ పడుతూ ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న నిట్‌ విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు దేశవ్యాప్త ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులతో ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, మన సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకుంటూ యాన్యువల్‌ స్పోర్ట్స్‌ మీట్‌గా ఏర్పాటు చేసుకుని మూడు రోజుల వేడుకకు శ్రీకారం చుట్టారు. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 20వేల మంది విద్యార్థులు ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చ రల్‌ ఫెస్ట్‌గా నిట్‌ వరంగల్‌ స్ప్రింగ్‌స్ప్రీ నిలుస్తుంది.

ప్రతి ఏడాది ప్రత్యేక థీంతో..

నిట్‌ వరంగల్‌ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న స్ప్రింగ్‌స్ప్రీ వసంతోత్సవ వేడుకలకు ప్రత్యేక థీంను రూపొందిస్తారు. ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ–23కి కళాధ్వనిగా నామకరణం చేశారు. 2019లో కళాక్షేత్ర, 2020లో మితియాస్‌, 2022లో సృష్టి, 2023లో కళాధ్వనిగా నామకరణం చేశారు.

55కు పైగా ఈవెంట్స్‌..

ఏప్రిల్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీలో 55కు పైగా ఈవెంట్స్‌తో అలరించనుంది. తొలిరోజు 7న టాలీవుడ్‌ నైట్‌ పేరిట టాలీవుడ్‌ సింగర్స్‌ నిట్‌ మైదానంలో అలరించనున్నారు. రెండో రోజు 8న డీజే నైట్‌, సన్‌బర్న్‌ పేరిట డీజేలు వివిధ రకాల పాటలతో అలరించనున్నారు, మూడో రోజు 9న బాలీవుడ్‌ నైట్‌ పేరిట బాలీవుడ్‌ సింగర్స్‌ ఉర్రూతలూగించనున్నారు. వీటితో పాటు మూడురోజుల పాటు ప్రొ షోలు, స్పాట్‌ లైట్స్‌, స్యాండ్‌ ఆర్ట్‌, సైలెంట్‌ డీజేస్‌, మాస్టర్‌ చెఫ్‌, జుంబాడ్యాన్స్‌, కొరియో నైట్‌, వార్‌ ఆఫ్‌ డీజెస్‌, ఐడల్‌, అల్యూర్‌లతో వసంతోత్సవం కలర్‌ ఫుల్‌గా సాగనుంది.

ప్రతిష్టాత్మకంగా స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని

నిట్‌ వరంగల్‌లో నిర్వహించనున్న మూడు రోజుల స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనిని ఏప్రిల్‌ 7, 8, 9 తేదీల్లో వేడుకలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు తెలిపారు. బుధవారం నిట్‌లోని సుభాష్‌చంద్రబోస్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చేందుకు, సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకునేందుకు స్ప్రింగ్‌స్ప్రీ వేడుకలు విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్నారు. రెండు నెలల పాటు 200 మంది విద్యార్థులు నిట్‌లోని వివిధ క్లబ్స్‌తో మమేకమై కోర్‌టీంలుగా ఏర్పడి ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డీన్‌ పులి రవికుమార్‌, ఫ్యాకల్టీ అడ్వైజర్‌ హీరాలాల్‌, కోర్‌ టీం వంశీ కిషార్‌, అజయ్‌కుమార్‌, పీయూష్‌కుమార్‌, సాయిగురునాథ్‌ పాల్గొన్నారు.

నిట్‌ వరంగల్‌ స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా సినీ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఏప్రిల్‌ 6న ముఖ్యఅతిథిగా పాల్గొని స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకలను నిట్‌ మైదానంలో ప్రారంభించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు నిట్‌ వరంగల్‌ విద్యార్థులతో పాటు ఓరుగల్లు వాసులు ఎదురు చూస్తున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎంట్రీ పాసుల కోసం ఇప్పటికే క్రేజ్‌ మొదలైంది. స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లను నిట్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో QR కోడ్‌లతో అందజేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement