NIT warangal
-
ప్రతిష్టాత్మక వరంగల్ నిట్ లో పండుగకు వేళాయే
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతి ఏడాది విద్యార్థులచే నిర్వాహకులుగా మూడు రోజుల వసంతోత్సవ సంబురం, సంస్కృతి సంప్రదాయాలను పంచుకునే వేదికగా నిలుస్తున్న స్ప్రింగ్ స్ప్రీ–23 ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. నిత్యం విద్యతో కుస్తీ పడుతూ ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న నిట్ విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు దేశవ్యాప్త ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, మన సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకుంటూ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌గా ఏర్పాటు చేసుకుని మూడు రోజుల వేడుకకు శ్రీకారం చుట్టారు. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 20వేల మంది విద్యార్థులు ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చ రల్ ఫెస్ట్గా నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ నిలుస్తుంది. ప్రతి ఏడాది ప్రత్యేక థీంతో.. నిట్ వరంగల్ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న స్ప్రింగ్‌స్ప్రీ వసంతోత్సవ వేడుకలకు ప్రత్యేక థీంను రూపొందిస్తారు. ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ–23కి కళాధ్వనిగా నామకరణం చేశారు. 2019లో కళాక్షేత్ర, 2020లో మితియాస్, 2022లో సృష్టి, 2023లో కళాధ్వనిగా నామకరణం చేశారు. 55కు పైగా ఈవెంట్స్.. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీలో 55కు పైగా ఈవెంట్స్‌తో అలరించనుంది. తొలిరోజు 7న టాలీవుడ్ నైట్ పేరిట టాలీవుడ్ సింగర్స్ నిట్ మైదానంలో అలరించనున్నారు. రెండో రోజు 8న డీజే నైట్, సన్‌బర్న్ పేరిట డీజేలు వివిధ రకాల పాటలతో అలరించనున్నారు, మూడో రోజు 9న బాలీవుడ్ నైట్ పేరిట బాలీవుడ్ సింగర్స్ ఉర్రూతలూగించనున్నారు. వీటితో పాటు మూడురోజుల పాటు ప్రొ షోలు, స్పాట్ లైట్స్, స్యాండ్ ఆర్ట్, సైలెంట్ డీజేస్, మాస్టర్ చెఫ్, జుంబాడ్యాన్స్, కొరియో నైట్, వార్ ఆఫ్ డీజెస్, ఐడల్, అల్యూర్లతో వసంతోత్సవం కలర్ ఫుల్‌గా సాగనుంది. ప్రతిష్టాత్మకంగా స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని నిట్ వరంగల్‌లో నిర్వహించనున్న మూడు రోజుల స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనిని ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో వేడుకలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. బుధవారం నిట్‌లోని సుభాష్‌చంద్రబోస్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చేందుకు, సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకునేందుకు స్ప్రింగ్‌స్ప్రీ వేడుకలు విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్నారు. రెండు నెలల పాటు 200 మంది విద్యార్థులు నిట్‌లోని వివిధ క్లబ్స్‌తో మమేకమై కోర్టీంలుగా ఏర్పడి ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ హీరాలాల్, కోర్ టీం వంశీ కిషార్, అజయ్‌కుమార్, పీయూష్‌కుమార్, సాయిగురునాథ్ పాల్గొన్నారు. నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా సినీ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏప్రిల్ 6న ముఖ్యఅతిథిగా పాల్గొని స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకలను నిట్ మైదానంలో ప్రారంభించనున్నారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు ఓరుగల్లు వాసులు ఎదురు చూస్తున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎంట్రీ పాసుల కోసం ఇప్పటికే క్రేజ్ మొదలైంది. స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లను నిట్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో QR కోడ్లతో అందజేస్తున్నారు. -
ఇన్‌స్టాలో ఐఫోన్ అగ్గువ.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న నిట్ విద్యార్థిని
సాక్షి, వరంగల్: ఇన్‌స్టాగ్రామ్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ లభిస్తుందని వచ్చిన ఓ ప్రకటన చూసి అత్యాశకు పోయిన ఓ నిట్ విద్యార్థి రూ.42,497 నగదు పోగొట్టుకుంది. విద్యార్థిని తన ఫోన్లో ఇన్‌స్టా యాప్ చూస్తుండగా ఐఫోన్, డెల్ ఐ–5 ల్యాప్‌టాప్ తక్కువ ధరకు ఉందనే ప్రకటన చూసి ఆర్డర్ పెట్టింది. వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ల్యాప్‌టాప్ లేదని, వన్ ప్లస్ మొబైల్ ఉందని చెప్పగా.. రూ.42,497 నగదును ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. రోజులు గడుస్తున్నా ఫోన్ రాకపోవడంతో ఆ నంబర్‌కు ఫోన్ చేయగా అవతలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని కాజీపేట పోలీసులను ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. రూ. 34 వేలు పోగొట్టుకున్న చిరు వ్యాపారి.. హనుమకొండ విజయపాల్ కాలనీకి చెందిన చిరువ్యాపారి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.34 వేలు పోగొట్టుకున్నాడు. నిట్ వరంగల్ కలాం విశ్రాంతి గృహానికి బిస్లరీ వాటర్ బాటిళ్లు పంపించాలని గుర్తు తెలియని వ్యక్తి చిరువ్యాపారికి ఫోన్ చేశాడు. బాటిళ్లను ఎన్ఐటీకి తీసుకెళ్లగా ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి అక్కడ లేడు. దీంతో వ్యాపారి ఫోన్ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తి రూ.20 నగదు మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. రూ.34వేలు పంపిస్తే రూ. 68 వేలు పంపిస్తానని మాయమాటలు చెప్పాడు. చిరువ్యాపారి రూ.34 వేలు పంపించాడు. ఆతర్వాత అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించిన బాధితుడు కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. చదవండి: లైట్ తీస్కోవద్దు.. నాకేమవుతుందనుకుంటే ప్రమాదమే, తస్మాత్ జాగ్రత్త! -
నిట్‌లో లైంగిక వేధింపులు.. వాట్సాప్ మెసెజ్‌లు పంపుతూ..
సాక్షి, వరంగల్: అతని లైంగి కవేధింపులకు విసిగివేసారిన మహిళా సెక్యూరిటీ గార్డులు చివరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన నిట్ వరంగల్ క్యాంపస్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. వెంకటేశ్వరన్ పది నెలల క్రితం క్యాంపస్‌కు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా అడ్మిన్ హోదాలో వచ్చాడు. క్యాంపస్‌లో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులను ఒంటరిగా తన ఇంటికి పిలిపించుకుని వ్యక్తిగత పనులు చేయాలంటూ కొన్నిరోజులుగా వేధిస్తున్నాడు. వాట్సాప్ మెసెజ్‌లు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. చెప్పిన పని ఒప్పుకోకపోతే గంజాయి కేసు పెడతా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం వెంకటేశ్వరన్.. ప్రశాంత్‌నగర్‌లోని తన ఇంటికి ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను ఒకరికి తెలియకుండా మరొకరిని పిలిపించాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో గార్డులు డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్‌కు దేహశుద్ధి చేసి కాజీపేట పోలీసులకు అప్పగించారు. ముందుగానే ఈ విషయాన్ని రిజిస్ట్రార్ గోవర్ధన్రావుకు తెలిపినా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. నిట్ వరంగల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఎస్ఐఎస్ సంస్ధ యజమాని డిప్యూటీ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై మహిళా సెక్యూరిటీ గార్డులను తన ఇంటికి పంపించే విధులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఒకరి ఫిర్యాదు మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్, చీఫ్ సె క్యూరిటీ ఆఫీసర్ కుమారస్వామి, ఎస్ఐఎస్ సెక్యూరిటీ సంస్థ శంకరన్లపై కేసు నమోదు చేసినట్లు కాజీపేట ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. కాగా, గతంలో తమిళనాడులో తాను పనిచేసిన సంస్థలోనూ వెంకటేశ్వరన్ ఇదే తరహాలో లైంగిక వేధింపులకు పాల్పడడంతో అక్కడినుంచి నిట్ వరంగల్‌కు మకాం మార్చినట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి:పిజ్జా డెలివరీ బాయ్ ప్రాణాలమీదకు తెచ్చిన రూ.200 చిరిగిన నోటు -
వరంగల్ నిట్‌లో ఘనంగా స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు (ఫొటోలు)
-
వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు
వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట పండింది. ఏడాదిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. ప్రముఖ కంపెనీలో అత్యధిక ప్యాకేజీ ఏడాదికి 62 లక్షల 50 వేల వేతనంతో ఉద్యోగం పొందిన విద్యార్థులు ఎన్ఐటీకి చెందిన వారే కావడం విశేషం. సాక్షి, వరంగల్: వరంగల్ ఎన్ఐటీ మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల గేట్ 2022 లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత ఎన్ఐటి విద్యార్థికే దక్కగా తాజాగా ఏడాదిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొంది సరికొత్త రికార్డు సృష్టించింది. క్యాపస్ డ్రైవ్ ద్వారా 250 కంపెనీల్లో 630 మంది బీటెక్ విద్యార్థులు, 386 మంది పిజి విద్యార్థులు ఉద్యోగాలు పొందారని ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. మరో 50 మంది విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందారని చెప్పారు. 2019-20 సంవత్సరంలో 792 మంది 2020-21లో 839 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందితే ఈసంవత్సరం ఇప్పటి వరకు 1016మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధికంగా ఏడాదికి 62 లక్షల 50 వేల వేతనంతో గౌరవ్ సింగ్, ప్రియాంష్ మహేశ్వరి దెశహ్ కంపెనీలో పని చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో సగటున 14.5లక్షల ప్యాకేజీ లభించిందని డైరెక్టర్ ప్రకటించారు. 450 కంటే ఎక్కువ మంది ఫ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు వివిధ కంపెనీల నుండి ఇంటర్న్‌షిప్ ఆఫర్ పొందారని, నెలకు 20 వేల నుండి లక్ష అరవై వేల వరకు స్టైఫండ్ వస్తుందని తెలిపారు. ప్రభావంతో క్యాంపస్ ఇంటర్వ్యూలు అనుకున్నన్ని జరగకపోయినా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు లభించడం హర్షనీయమని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని డైరెక్టర్ ఎన్వీ రమణ రావు స్పష్టం చేశారు. -
రికార్డు బ్రేక్ చేసిన వరంగల్ నిట్
కాజీపేట అర్బన్: వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2021 విద్యా సంవత్సరంలో 1,000 పరిశోధన పత్రాలతో తన రికార్డు తానే బ్రేక్ చేసింది. రికార్డుస్థాయిలో పరిశోధనలు చేపట్టి పరిశోధన పత్రాల ప్రచురణ రికార్డు బ్రేక్ చేసినట్లు స్పోపస్ డేటాబేస్ సంస్థ వెల్లడించడం అభినందనీయమని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం క్యాంపస్ ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులను ఆయన అభినందించారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో ప్రత్యేకత చాటుకుంటున్న నిట్ వరంగల్ 2017 విద్యా సంవత్సరంలో 540 పరిశోధన పత్రాలను ప్రచురణకు ఇవ్వగా.. 2021లో రికార్డుస్థాయిలో వెయ్యి పరిశోధన పత్రాలను సమర్పించడం విద్యార్థులు, అధ్యాపకుల ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు. ఇది నిట్ మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు స్పెషల్ పర్మిషన్) -
అరుదైన ఘనతను సాధించిన ఎన్ఐటీ వరంగల్..!
వరంగల్: రీసెర్చ్ అవుట్‌పుట్‌లో ఎన్ఐటీ వరంగల్ అరుదైన మైలురాయిని సాధించింది. ఇటీవల కాలంలో ఎన్ఐటీ వరంగల్ రీసెర్చ్ అవుట్‌పుట్‌లో గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది. స్కోపస్ డేటాబేస్ ప్రకారం...ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2021లో ఎన్ఐటీ వరంగల్ అధ్యాపకులు, విద్యార్థుల ప్రచురణల సంఖ్య 1000కు చేరింది. 2017లో మొత్తం ప్రచురణల సంఖ్య 540. గత 4 సంవత్సరాలలో రీసెర్చ్ అవుట్‌పుట్‌లో దాదాపు రెండింతలు పెరిగింది. 2018, 2019లో గత రెండు రిక్రూట్మెంట్లలో దాదాపు 150 మంది కొత్త ఫ్యాకల్టీలను నియమించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్.వి.రమణారావు, డైరెక్టర్, రిజిస్ట్రార్ శ్రీ. ఎస్ గోవర్ధన్ రావు, డీన్లు, సలహాదారులు మొత్తం ఎన్ఐటీ వరంగల్ అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా అన్ని కోర్సుల పాఠ్యాంశాలను పూర్తిగా సవరించామని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ స్కాలర్లను తీసుకోవడం 150 నుంచి 250కి పెంచామని ప్రొఫెసర్ రమణారావు తెలిపారు. సైన్సెస్‌లో మరిన్ని కొత్త ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టామని, మెరుగైన శక్తి, ఉత్సాహంతో ఇన్స్టిట్యూట్ మరిన్ని మైలురాళ్లను సాధించి ర్యాంకింగ్‌ను మెరుగుపరుస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: 6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్‌లోనే.. -
నిట్, వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్ పోస్టులు
వరంగల్‌లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. (టీఎస్ఏసీఎస్లో ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు) ► మొత్తం పోస్టుల సంఖ్య: 129 ► పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీసర్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–06, అసిస్టెంట్ ఇంజనీర్–02, సూపరింటెండెంట్–08, టెక్నికల్ అసిస్టెంట్–27, జూనియర్ ఇంజనీర్–08, ఎస్ఏఎస్ అసిస్టెంట్–03, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–02, సీనియర్ టెక్నీషియన్–19, టెక్నీషియన్–34, జూనియర్ అసిస్టెంట్–19. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 23.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021 ► వెబ్సైట్: www.nitw.ac.in -
నిట్‌లో 11 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
సాక్షి, వరంగల్ : చదువుల ఒడిలో మరోసారి మత్తు పొగలు చూరింది. విద్యాబుద్ధులు నేర్వాల్సిన పిల్లల్ని మైకంలో పడేసింది. దీంతో వరంగల్ నిట్‌లో గంజాయి సేవించినట్టు తేలిన 11 మంది ఇంజనీరింగ్ విద్యార్థులపై యూనివర్సిటీ యాజమాన్యం సస్పెన్షన్ వేటువేసింది. వారం క్రితం నిట్ క్యాంపస్‌లో గంజాయి సేవిస్తూ 11 మంది విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. డీన్ నేతృత్వంలో నిట్ అధికారులు కమిటీ వేశారు. విచారణ చేపట్టిన క్రమశిక్షణ కమిటీ విద్యార్థులు గంజాయి తాగినట్టు తేలడంతో నిట్ నుంచి సస్పెండ్ చేసింది. (చదవండి : వరంగల్ నిట్‌లో గంజాయి.. అసలు నిజం!) -
వరంగల్ నిట్‌లో గంజాయి.. అసలు నిజం!
సాక్షి, వరంగల్ : జిల్లా కేంద్రంలోని నిట్ క్యాంపస్‌లో గంజాయి సేవిస్తూ ఫస్టియర్ విద్యార్థులు పట్టుబడ్డారని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టతనిచ్చారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్. గోవర్థన్ రావు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడిన విషయాన్ని నిర్ధారిస్తూనే ఈ సంఘటన అక్టోబర్ 27వ తేదీ రాత్రిపూట జరిగిందని తెలిపారు. ఆ రోజు సెక్యూరిటీ సిబ్బంది రొటీన్ చెకప్‌లో భాగంగా తనిఖీ చేస్తున్నప్పుడు 1.8కె హాస్టల్ గదిలో మొదటి సంవత్సరం చదువుతున్న 12 మంది విద్యార్ధులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. అయితే మీడియాలో వచ్చినట్టుగా వారివద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు. తక్కువ మోతాదులో మొదటిసారి వారు గంజాయి వాడారని విచారణలో తేలిందని తెలియజేశారు. ఈ విషయంపై క్రమశిక్షణా కమిటీ వేసామని, ఆ కమిటీ ముందు విద్యార్థులు తమ తప్పు ఒప్పుకున్నారని వివరించారు. వీరిపై చర్య తీసుకునే విషయంలో త్వరలో తుది నిర్ణయం వెలువడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. -
నిట్‌తోనే నాకు గుర్తింపు
సాక్షి, కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో విద్యనభ్యసించడం ద్వారానే సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆర్ఎక్స్ –100 హీరో కార్తి్కేయ తెలిపారు. నిట్‌లో నిర్వహిస్తున్న టెక్నోజియాన్–19 నోవస్ ముగింపు సందర్భంగా ఆదివారం గెస్ట్లెక్చర్లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ‘సాక్షి’తో తన సినీరంగ ప్రవేశం, నిట్ జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన స్ఫూర్తితో యాక్టింగ్ తనను సినీరంగంలోకి అడుగుపెట్టేందుకు దోహదపడిందన్నారు. నిట్‌తోనే హీరోగా ఎదిగే అవకాశం మాది హైదరాబాద్ విఠల్‌రెడ్డి, రజితలు నా తల్లిదండ్రులు. నాన్న అమ్మా నాగార్జున గ్రుప్ ఆఫ్ స్కూల్స్‌ను నిర్వహిస్తున్నారు. నన్ను మా అమ్మ ఎంతో ఇష్టపడి, నన్ను కష్టపెట్టి నిట్ వరంగల్‌లో సీటు సాధించే విధంగా చదివించింది. కానీ నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. మా సీనియర్ మణికాంత్ తాను తీసే షార్ ఫిల్మ్స్‌లో నేను నటించేవాడిని. డ్యాన్స్ చేసే వాడిని నా తొలి డైరెక్టర్, అభిమాని తానే. నిట్ వరంగల్‌లో 2010 బ్యాచ్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో చేరాను. టెక్నోజియాన్, స్ప్రీంగ్స్ప్రీలలో ఆడీనైట్లో నా డ్యాన్స్‌తో మైమరపించేవాడ్ని, గుడ్ డ్యాన్సర్ అంటూ అమ్మాయిలు మెసేజ్ పెట్టేవారు. నాలుగు సంవత్సరాల నిట్ విద్యాభ్యాసంలో నాలుగు వేల మందిని అలరించడంతో ధైర్యం వచ్చింది. నిట్‌లో చదువుకుంటున్న సమయంలో రామప్ప, వెయ్యిస్తంభాల గుడి, లక్నవరాన్ని సందర్శించేవాడ్ని. ప్రతి సినిమాను భవానీ టాకీస్‌లో చూసేవాడ్నీ. క్యాంపస్ ఇంటర్వ్యూలు వదిలేశా.. చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలనేదే నా ఆశయం. దీంతో నిట్‌లో ఉన్న నాలుగు సంవత్సరాలు యాక్టింగ్పైనే దృష్టి పెట్టాను. కళాశాలలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రొఫెసర్లు నన్ను యాక్టర్ అవుతావని ఎంకరేజ్ చేశారు. యాక్టర్ కావాలనే సంకల్పంతో నిట్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా వదులుకున్నాను. నిట్‌లో చదువుకునే అవకాశం రావడం అదృష్టం. నిట్‌లో నుంచి బయటకు వెళ్లే సమయం ఫైనల్ ఇయర్లోనే కెరీర్ ఫైనల్ కావాలి. ఆర్ఎక్స్–100తో హీరోగా గుర్తింపు... నిట్ నుంచి 2014 బీటెక్ పూర్తి చేసి బయటకు వెళ్లిన తర్వాత సుబ్బారావు నేషనల్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సులో చేరాను. 2018లో డైరెక్టర్ అజయ్ ఆర్ఎక్స్–100కు హీరోగా సెలెక్ట్ చేశారు. ఆర్ఎక్స్–100 నన్ను యాక్టర్‌గా, హీరోగా నిలబెట్టి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. గ్యాంగ్ లీడర్లో నాని హీరోగా మంచి హీరోయిజంతో కూడిన విలన్ పాత్రను డైరెక్టర్ గుణ æవివరించగా ఒప్పుకున్నాను. త్వరలో 90 ఎంఎల్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. నేను చదువుకున్న నిట్ వరంగల్‌కు నేను హీరోగా మారి అతిథిగా రావడం ఆనందంగా ఉంది. నాడు నేను చదువుకున్న తరగతులు, నేను డ్యాన్స్ చేసిన, నన్ను యాక్టర్‌గా తీర్చిదిద్దిన ఆడిటోరియాన్ని మరువలేను. -
అలరించిన ఆవిష్కరణలు
కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో విద్యార్థులు నిర్వహిస్తున్న సాంకేతిక సంబురం టెక్నోజియాన్–19 నోవస్లో శనివారం రెండో రోజూ ఆవిష్కరణ లు ఆకట్టుకున్నాయి. 14 వర్క్‌షాప్‌లు, 7 గెస్ట్ లెక్చర్లు, 55 ఈవెంట్లు, 6 అట్రాక్షన్లు, 6 స్పాట్‌లైట్స్ నిర్వహించారు. జహాజ్, త్రష్ట్, బాక్సింగ్ రోబోస్, అల్యూర్ లో భాగంగా విద్యార్థుల ర్యాంప్ వాక్, బాలీవుడ్ సింగర్ షెర్టీ సేటియా గీతామృతం అలరించాయి. రైతే రాజు అనే నానుడి నుంచి రైతే శాస్త్రవేత్త అనే స్థాయికి ఎదిగిన రైతన్న సంబంధిత ఆవిష్కరణలు అబ్బురపరిచా యి. చివరి రోజు ఆదివారం గెస్ట్లెక్చర్కు హీరో కార్తికేయ హాజరుకానున్నారు. ఆసు యంత్రం ఆలేరుకు చెందిన చింత కింది మల్లేశం రూపొందించిన ఆసు యంత్రాన్ని ఆలేరుకు చెందిన దామోదర్ ప్రదర్శించారు. మల్లేశం మగ్గంతో కులవృత్తి కొనసాగిస్తున్న సమయంలో ఆటంకాలను అధిగమించేందుకు ఈ యంత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఒక గంటలో 8 చీరలను నేసేందుకు వీలుగా ఆసు యంత్రం తోడ్పడుతుందని చెప్పారు. స్క్రాప్ రిమూవర్ విజయవాడకు చెందిన అబ్దుల్ జలీల్ రూ.22 వేల ఖర్చుతో ఈ యంత్రం రూపొందించారు. స్క్రాప్‌ను వేరు చేసి అల్యూమినియం, కాపర్ వైర్లను తిరిగి ఉపయోగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒక గంటలో 30 నుంచి 40 కిలోల వైర్‌ను తొలగిస్తూ గాలి కాలుష్యం లేకుండా ఉపయోగపడుతుంది. వైల్డ్ బోర్ అలారమ్ జగిత్యాల జిల్లా కిషన్‌రావుపేటకు చెందిన ఇంజపూరి అంజయ్య రూ.1,500 ఖర్చుతో దీన్ని రూపొందించారు. 5వ తరగతి వరకు చదువుకున్న ఆయన తన భూమిలో పంటలను అడవి పందులు నాశనం చేస్తుండగా, వాటిని తరిమికొట్టేందుకు యంత్రాన్ని కనుగొన్నాడు. యాంప్లీఫయర్ సాయం తో రూపొం దించిన సర్క్యూట్‌కు ఒక స్పీకర్‌ను ఏర్పాటు చేసి బోర్‌కు అనుసంధానం చేస్తే చాలు అడవి పందులను భయపెట్టే శబ్దం చేస్తుంది. ఏటీవీ బైక్ నిట్ వరంగల్‌కు చెందిన విద్యార్థులు ఎనిమిది నెలల కాలంలో రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు వెచ్చించి ఏటీవీ (ఆల్ టెరెయిన్ వెహికల్) రూపొందించారు. ఇది కొండలు, ఘాట్ రోడ్లపై సునాయాసంగా ప్రయాణం చేస్తుంది. 3 లీటర్ల పెట్రోల్ సామర్థ్యంతో రూపొందించిన ఈ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
పరిశోధనలతోనే ప్రగతి
కాజీపేట అర్బన్: నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతోనే అభివృద్ధి సాధ్యమని డీఎస్టీ మాజీ సెక్రటరీ డాక్టర్ టి.రామస్వామి తెలిపారు. కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్లోని ఆడిటోరియంలో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, నిట్ వరంగల్ సంయుక్తంగా ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు టీఎస్ఎస్సీ–18 సదస్సును నిర్వహిస్తున్నారు. తొలిరోజు సదస్సుకు ముఖ్య అతిథిగా రామస్వామి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ సైన్స్ కాంగ్రెస్–18 తోడ్పడుతోందని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీతో సమాజ మనుగడ సాధ్యమని.. విద్యార్థులకు సైన్స్‌పై మక్కువను పెంచేందుకు టీఏఎస్ కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు శాస్త్రవేత్తల పరిశోధనలపై అవగాహన కల్పిస్తూ.. ఆవిష్కరణలకు నాంది పలికే విధంగా వారికి స్ఫూర్తినందించాలని సూచించారు. నూతన పరిశోధనలకు నాంది: నిట్ డైరెక్టర్ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ నిట్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న టీఎస్ఎస్సీ–18లో నూతన పరిశోధనలకు నాంది పలికే విధంగా వివిధ దేశాల శాస్త్రవేత్తలతో పరిశోధనలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మీట్ ది సైంటిస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు, టీఎల్సీ ప్రొఫెసర్ అప్పారావు, ఇండో యూఎస్ అసుపత్రి వైద్యుడు ప్రసాదరావు హాజరై శాస్త్రవేత్తల పరిశోధనలపై స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించారు. కాగా, టీఎస్ఎస్సీ–18 సావ నీర్, రిటైర్డ్ ప్రొఫెసర్ చాగంటి కృష్ణకుమారి రచించిన వీరి వీరి గుమ్మడి పండు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సదస్సులో టీఏఎస్ అధ్యక్షుడు కె.నరసింహారెడ్డి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్, డీన్లు కేవీ జయకుమార్, ఎల్‌ఆర్‌జీ రెడ్డి, ప్రొఫెసర్లు లక్ష్మారెడ్డి, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
సొంతంగా ప్రిపేరయ్యా..
సాక్షి, మహబూబాబాద్: ‘ఎక్కడా కోచింగ్ తీసుకో లేదు.. అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రణాళిక ప్రకారం.. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివి గేట్ ఇన్ ఇంజినీరింగ్ (గ్రాడ్యూయేట్ అప్టిట్యూడ్ టెస్ట్)లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించా’నని తెలిపాడు సౌరవ్ సింగ్. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో మెటలార్జికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సౌరవ్ గేట్లో ప్రతిభ చాటాడు. తన ప్రిపరేషన్, భవిష్యత్ లక్ష్యాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. గేట్లో మొదటి ర్యాంక్ వచ్చిందని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నమ్మటానికి కొంచెం టైమ్ పట్టింది. ఒకటికి రెండుసార్లు రిజల్ట్ చూసుకున్నా. కుటుంబ నేపథ్యం.. బీహార్ రాష్ట్రంలోని ముజాఫర్‌పూర్‌కు చెందిన విమల్సింగ్, పూనమ్‌సింగ్ నా తల్లిదండ్రులు. నాకు దివ్య, ప్రతిమ అక్కలు ఉన్నారు. నాన్న గ్రామంలో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ మమ్మల్ని చదివిస్తున్నారు. పెద్దక్క టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తోంది. రెండో అక్క సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ప్రిపరేషన్ ఇలా... నిట్‌లో డాక్టర్ నర్సయ్య సార్ అందించిన ప్రోత్సాహం, నిట్ డైరెక్టర్, ఇతర ప్రొఫెసర్ల చొరవతోనే నంబర్‌వన్ ర్యాంకు సాధించా. గేట్ ప్రవేశపరీక్షకు సుమారు ఆరు నెలలు కష్టపడి చదివాను. ప్రతిరోజూ నాలుగు గంటలపాటు వివిధ పుస్తకాలను చదివే వాడిని. విషయ పరిజ్ఞానం కోసం అగ్లాసెమ్ వెబ్సైట్ చాలా తోడ్పడింది. సైట్లో గేట్లో విజయం సాధించిన ర్యాంకర్ల ఇంటరŠూయ్వలను పొందుపరిచారు. గత ఏడాది నంబర్‌వన్ ర్యాంకు సాధించిన నితీష్రాయ్ ఇంటరŠూయ్వ స్ఫూర్తినిచ్చింది. సొంతంగానే ప్రిపేర్ అయ్యాను. సొంతగానే నోట్స్ తయారు చేసుకున్నా. ఐఓసీఎల్‌లో ఉద్యోగం చేస్తా.. మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. గేట్లో ఆల్ ఇండియా లెవల్లో నంబర్ వన్ ర్యాంకు సాధించిన నాకు ఎంటెక్ వైపు కాకుండా ఆయిల్, రీఫైనరీలో ఉద్యోగం చేయాలనుంది. ఆయిల్ కంపెనీల్లో పేరెన్నిక గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)లో ఉద్యోగం చేస్తా. ప్రస్తుతం ఐఓసీఎల్‌లో జాయిన్ అవుతా. నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తా.. నిట్‌లో చదువుకునే అవకాశం రావడం అదృష్టం. జేఈఈలో 20605 ర్యాంకు సాధించి నిట్ వరంగల్‌లో మెటలర్జికల్ విభాగంలో చేరాను. నిట్‌లోని అత్యుత్తమ బోధనతోనే ఆల్ ఇండియా నంబర్‌వన్ ర్యాంకు సాధించా. నాకు నంబర్‌వన్ ర్యాంకు అందించిన నిట్‌కు రుణపడి ఉంటా. నిరుపేదలకు ప్రోత్సాహం అందిస్తా. ఆర్థిక చేయూతనందిస్తా. వరంగల్ బ్యూటీపుల్ సిటీ. -
నిట్‌లో కత్తిపోట్ల కలకలం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఆదివారం రాత్రి జరిగిన కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. వసంత్సోవం ప్రో షో ముగింపు సందర్భంగా స్టేడియంలో ఇంజనీరింగ్ విద్యార్థిపై ఎమ్మెస్సీ విద్యార్థి తన స్నేహితులతో కత్తులతో దాడి చేశాడు. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిట్ వరంగల్‌లో గతేడాది ఆగస్టు మాసంలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. కన్నూరి హర్ష, అఖిల్ పాపినేని అధ్యక్షులుగా, సార్థక్శర్మ, రవికాంత్ ఉపాధ్యక్షులుగా పోటీ చేశారు. సార్థక్శర్మకు జైప్రీత్‌సింగ్, రవికాంత్‌కు అమిత్‌యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో సార్థక్శర్మ ఓటమి పాలయ్యాడు. నాటి నుంచి జైప్రీత్, అమిత్‌యాదవ్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అమిత్‌యాదవ్ ఎదురుపడిన ప్రతిసారి జైప్రీత్‌సింగ్ అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేవాడు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్‌కు సైతం అమిత్‌యాదవ్ పలుమార్లు ఫిర్యాదు చేశాడు. కారుపెట్టిన చిచ్చు.. స్ప్రింగ్ స్ప్రీ వేడుకల సందర్భంగా జైప్రీత్‌సింగ్ కారులో షికారు చేస్తూ అమిత్యాదవ్కు వింత సైగలు చేయడం ప్రారంభించాడు. అసలు కారుకు అనుమతి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు అని అమిత్‌యాదవ్ ఆరా తీశాడు. ఆదివారం రాత్రి కారులో మద్యం బాటిళ్లను తరలిస్తున్నారనే అమిత్యాదవ్కు అనుమానం వచ్చింది. నిట్ ప్రధాన గేట్ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా జైప్రీత్‌సింగ్ తన మిత్రులతో క్యాంపస్‌లోకి వెళ్లాడు. అతిథుల కోసం డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కారును అనుమతిచ్చినట్లు సమాచారం. కారు పెట్టిన చిచ్చు కత్తుల స్వైర విహారానికి దారితీసింది. పరస్పర దాడులు .. అమిత్యాదవ్పై వారం రోజుల క్రితం జైప్రీత్‌సింగ్ తన మిత్రులతో నిట్ క్యాంపస్ ఎదుట దాడి చేశాడు. సరైన సమయం కోసం వేచిచూస్తున్న అమిత్‌యాదవ్ స్ప్రింగ్ స్ప్రీ ముగింపు వేడుకలను అనుకూలంగా మలుచుకున్నాడు. తన మిత్రులతో కలిసి నిట్ స్టేడియంలో కత్తులు, ఇనుప రాడ్లతో జైప్రీత్‌సింగ్‌పై అమిత్‌యాదవ్ దాడి చేశాడు. దాడిలో జైప్రీత్సింగ్కు కుడి తొడ, నుదిటిపై గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ.. కాజీపేట ఏసీపీ సత్యనారాయణ సోమవారం నిట్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అదే విధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు జైప్రీత్‌సింగ్ వద్దకు చేరుకుని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడిలో గాయపడిన జైప్రీత్‌సింగ్‌ను డీన్ రమణారెడ్డి, విద్యార్థులు పరామర్శించారు. చోద్యం చూస్తున్న సెక్యూరిటీ సిబ్బంది.. కారులో నిట్ విద్యార్థులు మద్యం బాటిళ్లు, కత్తులు, ఇనుపరాడ్లను తీసుకువెళ్తున్నా సెక్యూరిటీ సిబ్బంది చోద్యం చూస్తున్నారు. గతంలో గంజాయి, డ్రగ్స్‌ను సైతం విద్యార్థులు తీసుకువెళ్లారు. నిట్ సెక్యూరిటీ సిబ్బంది పరోక్షంగా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీడియాకు మాత్రం అనుమతి ఇవ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది ఆంక్షలు పెడుతున్నారు. పాత క్షక్షలతోనే దాడి జైప్రీత్‌సింగ్ తనను అసభ్యకర పదజాలంతో మానసికంగా హింసిస్తున్నాడని, తన సహనం కోల్పోయి ఏం చేస్తానో నాకే తెలియదని అమిత్‌యాదవ్ ఈనెల 7వ తేదీన హెచ్చరించాడు. జైప్రీత్‌సింగ్‌ను సివిల్ హెడ్ రాజేష్ సమక్షంలో మందలించాం. ఇలాంటి పొరపాట్లు మరల జరగకుండా చూసుకోమని తెలిపాం. స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో దాడులకు దిగడం బాధాకరం. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో పరస్పరం చోటు చేసుకున్న విభేదాలను పాతకక్షలుగా మార్చుకుని అమిత్‌యాదవ్ తన మిత్రులతో జైప్రీత్‌సింగ్‌పై దాడి చేశాడు. –రాంగోపాల్‌రెడ్డి, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ సెక్షన్ 307 కింద కేసు నమోదు నిట్‌లోని సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి జైప్రీత్‌సింగ్‌పై ఎమ్మెస్సీ చదువుతున్న అమిత్‌యాదవ్, ధీరజ్, సతీష్, రోహిత్, పంకజ్, అలీఖాన్, రవికాంత్ కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఇందులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించాం. రోహిత్ పరారీలో ఉన్నాడు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశాం. జైప్రీత్‌సింగ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. –సీహెచ్.అజయ్, కాజీపేట ఇన్స్పెక్టర్ -
వరంగల్ నిట్ లో విద్యార్థి మృతి
నిట్ క్యాంపస్(కాజీపేట): వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట సమీపంలోని ఎన్ఐటీ(NIT) విద్యా సంస్థలో భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి మృతిచెందాడు. మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన సాంకేత్‌కుమార్ సివిల్ ఇంజనీర్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం కళాశాలకు చెందిన 1కే హాస్టల్ భవనం 6వ అంతస్తు నుంచి దూకడంతో తలకు బలమైన గాయం తగిలింది. చికిత్స కోసం మాక్స్ కేర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్ర జ్వరం ఉండడంతో ఒంటి గంట సమయంలో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వచ్చాడని, 2.30 గంటల సమయంలో హాస్టల్ భవనంపైనుంచి దూకాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవినీతిపరులకు అందలం
నిట్‌లో భారీగా అక్రమాలు నిర్ధారించిన సీబీఐ బాధ్యులపై చర్యలకు సిఫారసు మానవ వనరుల శాఖకు నివేదిక అభియోగాలు ఉన్న వారికి కీలక పోస్టులు వరంగల్ నిట్‌లో అడ్డగోలు నిర్ణయాలు సాక్షి, హన్మకొండ :అవినీతి జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ పేర్కొంది. అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు సూచించింది. నిర్ణయం మాత్రం దీనికి విరుద్ధంగా జరిగింది. ఆరోపణలు ఉన్నవారిపై చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి... వీరికే కీలక పోస్టులు కట్టబెట్టారు. వరంగల్‌లోని ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లో ఈ వ్యవహారాలు జరిగాయి. వరంగల్‌లోని నిట్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. నిట్‌లో చదువుకునే విద్యార్థుల వసతి కోసం 2006–07 విద్యా సంవత్సరంలో కొత్త భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. విద్యార్థులకు వసతి కల్పించేందుకు రూ.200 కోట్లతో భారీ హాస్టల్ భవన సముదాయాన్ని నిర్మించారు. 3100 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా... 1కే, అల్ట్రా మెగా, ఉమెన్ హాస్టల్ నిర్మాణం చేపట్టారు. 2010 వరకు ఈ భవనాల నిర్మాణం కొనసాగింది. హాస్టల్ భవన నిర్మాణ సమయంలో ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు వరంగల్ నిట్ డైరెక్టరుగా వ్యవహరించారు. నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలు పాటించకపోవడం, నాణ్యత ప్రమాణాలు లేకపోవడం, అంచనా వ్యయం పెంచినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ)తో విచారణ జరిపించింది. సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం విచారణ నిర్వహించింది. చర్యలకు సిఫారసు... ఆరేళ్ల విచారణ అనంతరం సీబీఐ తొలి నివేదికను కేంద్ర మానవ వనరుల శాఖకు అందించింది. 1కే హస్టల్ భవన నిర్మాణానికి సంబంధించి ఎనిమిది మంది వ్యక్తులు వ్యవహారశైలిపై సందేహాలు వ్యక్తం చేసింది. అవినీతి వ్యవహరంలో వీరి పాత్రపై తగిన(డాక్యుమెంట్, మౌఖిక) ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ 2016 జూన్ 13న లేఖ రాసింది. సీబీఐ నివేదికలో పేర్కొన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవవనరుల శాఖ... వరంగల్ నిట్ డైరెక్టరుకు ఆదేశాలు జారీ చేసింది. చర్యలు తీసుకోవాలని సీబీఐ సూచించిన ఎనిమిది మంది వ్యక్తుల్లో కొందరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. ముగ్గురు వ్యక్తులు నిట్‌లో ప్రొఫెసర్లుగా కొనసాగుతున్నారు. బుట్టదాఖలు... అవినీతి వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ, కేంద్ర మానవ వనరుల శాఖ చేసిన సిఫార్సులు నిట్ వరంగల్‌లో బుట్టదాఖలయ్యాయి. నిట్ ఇన్చార్జి డెరెక్టరుగా కొనసాగుతున్న ఆర్.వి.చలం ఈ ఆదేశాలు బేఖాతరు చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించిన వ్యక్తులను అందలం ఎక్కించారు. జూలై చివరి వారంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ముగ్గురు ప్రొఫెసర్లలో ఒకరికి బోర్డ్ ఆఫ్ గవర్నర్‌లో సభ్యత్వం కల్పించారు. మరొకరికి విభాగ అధిపతి (హెచ్‌వోడీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్) అప్పగించారు. తీవ్ర ఆరోపణలు ఉన్న ప్రొఫెసర్‌ను ఏకంగా రిజిస్ట్రార్ పదవిని అప్పగించారు. నిట్ ఇన్చార్జ్ డైరెక్టరు తీసుకున్న ఈ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక బాధ్యతలు వరంగల్ నిట్‌లో అవినీతి వ్యవహారాల్లో... మూడు భవనాల నిర్మాణంపై విచారణ కొనసాగుతోంది. 1కే భవన నిర్మాణంపై సీబీఐ నివేదిక వెలువరించింది. అల్ట్రా మెగా, ఉమెన్ హాస్టళ్ల నిర్మాణాలపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. విచారణకు సంబంధించిన వ్యవహరాలు, శాఖాపరమైన చర్యలు తీసుకునే అధిలకారులు ఉన్న రిజిస్ట్రార్ పోస్టులోనే... ఆభియోగాలు ఉన్న వ్యక్తిని నియమించడం సందేహాలకు తావిస్తోంది. అవినీతి వ్యవహారాలను పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఆరోపణలు ఉంటే..? – ఆర్వీ చలం, ఇన్చార్జీ డైరెక్టర్, నిట్, వరంగల్ అవినీతీ ఆరోపణలు ఉన్నంత మాత్రాన బాధ్యతలు అప్పగించకూడదా. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ నాకు ఆదేశాలు అందలేదు. ఛార్జీషీట్ ఫైల్ చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాను. కాలేజీ రోజువారీ వ్యవహారాలు సాఫీగా సాగేందుకు హెచ్‌వోడీ, రిజిస్ట్రార్ పదవులు అప్పగించాం. ఇందులో మరో ఉద్దేశం లేదు. -
నిట్‌లో అడ్మిషన్లు ప్రారంభం
26వ తేదీ వరకు ప్రవేశాలు కాజీపేట రూరల్ : వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నిట్ ఆడిటోరియంలో శనివారం జరిగిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌లో 800 అడ్మిషన్లకు 400 అడ్మిషన్లు జరిగాయి. శుక్రవారం 244 మంది విద్యార్దులు అడ్మిషన్లు తీసుకున్నట్లు నిట్ అధికారులు తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియ 26వ తేదీ వరకు కొనసాగుతుందని, నిట్‌లో 2016–17వ సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు 28వ తేదీన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. -
నిట్‌లో అడ్మిషన్లు ప్రారంభం
26వ తేదీ వరకు ప్రవేశాలు కాజీపేట రూరల్ : వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నిట్ ఆడిటోరియంలో శనివారం జరిగిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌లో 800 అడ్మిషన్లకు 400 అడ్మిషన్లు జరిగాయి. శుక్రవారం 244 మంది విద్యార్దులు అడ్మిషన్లు తీసుకున్నట్లు నిట్ అధికారులు తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియ 26వ తేదీ వరకు కొనసాగుతుందని, నిట్‌లో 2016–17వ సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు 28వ తేదీన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.