
వరంగల్: రీసెర్చ్ అవుట్‌పుట్‌లో ఎన్‌ఐటీ వరంగల్ అరుదైన మైలురాయిని సాధించింది. ఇటీవల కాలంలో ఎన్‌ఐటీ వరంగల్ రీసెర్చ్ అవుట్‌పుట్‌లో గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది. స్కోపస్ డేటాబేస్ ప్రకారం...ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2021లో ఎన్‌ఐటీ వరంగల్ అధ్యాపకులు, విద్యార్థుల ప్రచురణల సంఖ్య 1000కు చేరింది. 2017లో మొత్తం ప్రచురణల సంఖ్య 540.
గత 4 సంవత్సరాలలో రీసెర్చ్ అవుట్‌పుట్‌లో దాదాపు రెండింతలు పెరిగింది. 2018, 2019లో గత రెండు రిక్రూట్‌మెంట్‌లలో దాదాపు 150 మంది కొత్త ఫ్యాకల్టీలను నియమించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్.వి.రమణారావు, డైరెక్టర్, రిజిస్ట్రార్ శ్రీ. ఎస్ గోవర్ధన్ రావు, డీన్లు, సలహాదారులు మొత్తం ఎన్‌ఐటీ వరంగల్ అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు.
జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా అన్ని కోర్సుల పాఠ్యాంశాలను పూర్తిగా సవరించామని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డీ స్కాలర్‌లను తీసుకోవడం 150 నుంచి 250కి పెంచామని ప్రొఫెసర్ రమణారావు తెలిపారు. సైన్సెస్‌లో మరిన్ని కొత్త ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టామని, మెరుగైన శక్తి, ఉత్సాహంతో ఇన్‌స్టిట్యూట్ మరిన్ని మైలురాళ్లను సాధించి ర్యాంకింగ్‌ను మెరుగుపరుస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: 6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్‌లోనే..
Comments
Please login to add a commentAdd a comment