reserchers
-
ప్రజల జీవన విధానంపై అధ్యయనం చేయాలి.. కలెక్టర్
మహబూబ్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఏఎస్‌ఓలకు సూచించారు. సోమవారం 25 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి శిక్షణ నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లాకు వచ్చిన ఏఎస్ఓ లతో వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఏఎస్ఓలు 5 రోజుల పర్యటనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని, రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు ఎలా ఉన్నాయో, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వాటన్నిటిని డేటా రూపంలో సేకరించాలని అన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం కింద నర్సరీలను ఏర్పాటు చేశామని, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, డంపింగ్ యార్డ్ వంటివి ఏర్పాటు చేశామని, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. ముఖ్యంగా తాగునీటి కల్పనకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలన్నారు. గ్రామస్థాయిలో సుమారు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వారందరితో అన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించారు. శిక్షణ నిమిత్తం వచ్చిన ఏఎస్‌ఓలకు ఐదు గ్రూపులుగా విభజించి నాగర్‌కర్నూల్, తాడూర్, తెలకపల్లి, కల్వకుర్తి నాలుగు మండలాలను కేటాయించి ఒక్కో ఏఎస్‌ఓకు ఒక ఇన్చార్జ్ అధికారితో పాటు, వారికి అవసరమైన సమాచారం ఇవ్వడం జరుగుతుందని వివరించారు. నేటి నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్ర సచివాలయానికి సంబంధించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంత అధ్యయనంలో పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీపీఓ కృష్ణ, మహబూబ్‌నగర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జ్ గోపాల్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు ఉన్నారు. -
ముంచుకొస్తున్న మరో ముప్పు, ఈ నల్లని మేఘాలు ప్రమాదకరం ఎందుకంటే?
ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుంటే? మామూలుగా అయితే వాన రాకడకు సూచిక. కానీ, జీవజలాన్ని కాక ప్రమాదకరమైన బ్యాక్టీరియాను మోసుకొచ్చే మేఘాలున్నాయని తెలుసా? నిజం. ఇలాంటి మేఘాలున్నాయని కెనడా, ఫ్రాన్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఔషధాల శక్తిని తట్టుకొని మరీ నిక్షేపంగా జీవించే బ్యాక్టీరియా ఈ మేఘాల్లో నిండి ఉంటుందని, వాటితో పాటే అది సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచమంతటినీ చుట్టేస్తుందన్నమాట! ఈ అధ్యయనం వివరాలను సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ పత్రికలో ప్రచురించారు. ► కెనడాలో క్విబెక్ సిటీలోని లావల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫ్రాన్స్‌లోని క్లెర్మాంట్ అవెర్జిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మేఘాల నమూనాలను సేకరించి పరీక్షించారు. ► 8,000 ఒక మిల్లీలీటర్ మేఘంలో సగటున ఉన్న బ్యాక్టీరియా సంఖ్య. ► మేఘాల్లోని ఈ బ్యాక్టీరియాలో 29 ఉపవర్గాలకు చెందిన యాంటీబయాటిక్‌ను తట్టుకునే జన్యువులు ఉన్నట్టు గుర్తించారు. ► ఈ మేఘాల్లో యాంటీబయాటిక్స్‌ను తట్టుకొనే జన్యువులతో కూడిన బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. ► 2019 సెప్టెంబర్ నుంచి 2021 అక్టోబర్ దాకా ఈ పరిశోధన నిర్వహించారు. ► చెట్లపై, భూమిలో ఉన్న బ్యాక్టీరియా గట్టి గాలుల ద్వారా వాతావరణంలోకి, అటునుంచి మేఘాల్లోకి చేరుతుంది. వాటితో పాటు సుదూరాలకు పయనిస్తుంది. ► సముద్ర మట్టానికి 1,465 మీటర్ల(4,806 అడుగులు) ఎత్తులో ఉన్న మేఘాల నుంచి నమూనాలను సేకరించారు. ► మిల్లీలీటర్ పరిమాణంలో 330 నుంచి ఏకంగా 30,000కు పైగా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ► వర్షంగా కురిసిన చోట మేఘాల నుంచి భూమిపైకి చేరుతుంది. ► మేఘాల ద్వారా ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందే బ్యాక్టీరియాతో మానవళి ఆరోగ్యానికి ఉన్న ముప్పుపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. ► ఈ బ్యాక్టీరియాలో 5 నుంచి 50 శాతం దాకా మాత్రమే క్రియాశీలకంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. మేఘాల బ్యాక్టీరియా వల్ల మనుషులకు ముప్పు స్వల్పమేనని పరిశోధకురాలు ఫ్లోరెంట్ రోసీ అభిప్రాయపడ్డారు. ‘వర్షంలో బయట నడవాలంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట’ అంటూ చమత్కరించారు! ► మేఘాల్లోని బ్యాక్టీరియా జన్యువులు ఇతర బ్యాక్టీరియాతో కలుస్తాయా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని రోసీ వెల్లడించారు. ► డ్రగ్–రెసిస్టెంట్‌ను కలిగిన బ్యాక్టీరియాల మూలాలను కనుగొనేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా వైరస్‌ను ఖతం చేసే ఎన్95 మాస్క్
వాషింగ్టన్: కోవిడ్–19 వ్యాప్తిని చాలావరకు తగ్గించడమే కాదు, తనతో కాంటాక్టు అయిన సార్స్–కోవ్–2 వైరస్‌ను చంపేసే సరికొత్త ఎన్95 మాస్క్‌ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ మాస్క్‌ను ఎక్కువ కాలం ధరించవచ్చని, తరచుగా మార్చాల్సిన అవసరం లేదని, దీనితో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా తక్కువేనని పరిశోధకులు తెలియజేశారు. తనంతట తాను స్టెరిలైజ్ చేసుకొనే వ్యక్తిగత రక్షణ పరికరం తయారీలో ఇదొక మొదటి అడుగు అని భావిస్తున్నామని అమెరికాకు చెందిన రెన్సెలార్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి ఎడ్మండ్ పాలెర్మో చెప్పారు. ఈ ఎన్95 మాస్క్‌ను ధరిస్తే గాలిద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని అన్నారు. తాజా పరిశోధన వివరాలను ఇటీవలే ‘అప్లయిడ్ ఏసీఎస్ మెటీరియల్స్, ఇంటర్ఫేసేస్’ పత్రికలో ప్రచురించారు. కరోనా వైరస్‌ను అంతం చేసే ఎన్95 మాస్క్ తయారీ కోసం యాంటీమైక్రోబియల్ పాలిమర్స్, పాలిప్రొపైలీన్ పిల్టర్లు ఉపయోగించారు. ఒకదానిపై ఒకటి పొరలుగా అమర్చారు. ఈ పరిశోధనలో ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) పరిశోధకులు కూడా భాగస్వాములయ్యారు. మాస్క్ పైభాగంలో వైరస్‌లను, బ్యాక్టీరియాను చంపేపే నాన్–లీచింగ్ పాలిమర్ కోటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం అతినీలలోహిత కాంతి, అసిటోన్ కూడా ఉపయోగించారు. -
అరుదైన ఘనతను సాధించిన ఎన్ఐటీ వరంగల్..!
వరంగల్: రీసెర్చ్ అవుట్‌పుట్‌లో ఎన్ఐటీ వరంగల్ అరుదైన మైలురాయిని సాధించింది. ఇటీవల కాలంలో ఎన్ఐటీ వరంగల్ రీసెర్చ్ అవుట్‌పుట్‌లో గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది. స్కోపస్ డేటాబేస్ ప్రకారం...ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2021లో ఎన్ఐటీ వరంగల్ అధ్యాపకులు, విద్యార్థుల ప్రచురణల సంఖ్య 1000కు చేరింది. 2017లో మొత్తం ప్రచురణల సంఖ్య 540. గత 4 సంవత్సరాలలో రీసెర్చ్ అవుట్‌పుట్‌లో దాదాపు రెండింతలు పెరిగింది. 2018, 2019లో గత రెండు రిక్రూట్మెంట్లలో దాదాపు 150 మంది కొత్త ఫ్యాకల్టీలను నియమించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్.వి.రమణారావు, డైరెక్టర్, రిజిస్ట్రార్ శ్రీ. ఎస్ గోవర్ధన్ రావు, డీన్లు, సలహాదారులు మొత్తం ఎన్ఐటీ వరంగల్ అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా అన్ని కోర్సుల పాఠ్యాంశాలను పూర్తిగా సవరించామని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ స్కాలర్లను తీసుకోవడం 150 నుంచి 250కి పెంచామని ప్రొఫెసర్ రమణారావు తెలిపారు. సైన్సెస్‌లో మరిన్ని కొత్త ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టామని, మెరుగైన శక్తి, ఉత్సాహంతో ఇన్స్టిట్యూట్ మరిన్ని మైలురాళ్లను సాధించి ర్యాంకింగ్‌ను మెరుగుపరుస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: 6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్‌లోనే.. -
కోవిడ్-19 ముప్పు : ఈ ఆహారం మేలు..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ మానవాళికి పెనుసవాల్ విసిరిన క్రమంలో మహమ్మారిని ఎదుర్కొనే మందు, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో స్వీయ నియంత్రణే పరమౌషధంగా ముందుకొస్తోంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇమ్యూనిటీకి దోహదపడే జీర్ణవ్యవస్ధను మెరుగుపరిచే ఆహారం తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణసంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ముప్పు అధికమని వీరు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ యురోప నివేదిక హెచ్చరించడం మన ప్రేవులను సురక్షితంగా ఉంచుకోవడం కీలకమని సూచిస్తోంది. కోవిడ్-19 ఊపిరితిత్తులనే కాకుండా జీర్ణవ్యవస్థ సహా కీలక అవయవాలపై పెనుప్రభావం చూపుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే పుష్కలంగా ఉండే ఆకుకూరలను అధికంగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక ఫైబర్‌తో పాటు ప్రొటీన్, బీ విటమిన్, ఒమెగా 3 ఆమ్లాలు అధికంగా ఉండే తృణ ధాన్యాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటితో బరువు తగ్గడంతో పాటు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఒబెసిటీ, కొన్ని క్యాన్సర్ల ముప్పును నివారించవచ్చు. బెర్రీ పండ్లు, ఆరంజ్, ద్రాక్ష వంటి అధిక ఫైబర్, తక్కువ ఫ్రక్టోజ్ కలిగిన పండ్లను నిత్యం ఆహారంలో తీసుకుంటే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. జీవర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు అరటిపండ్లు కూడా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక తక్కువ కొవ్వుతో కూడిన చికెన్, చేపలు వంటి లీన్ మీట్నూ ఆహారంలో భాగం చేసుకోవాలని పేర్కొంటున్నారు. వీటన్నింటితో పాటు జీర్ణ సంబంధ సమస్యలకు దారితీసే డీహైడ్రేషన్‌ను నివారించేందుకు ప్రతిఒక్కరూ మంచినీటిని అధికంగా తీసుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు. అధికారులు సూచించే మార్గదర్శకాలను పాటిస్తూ ఈ ఆహారం తీసుకుంటూ కోవిడ్-19 వ్యాధికి గురయ్యే ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చదవండి : కరోనా విజేతగా 80 ఏళ్ల వృద్ధురాలు -
కరోనా వైరస్: మరో నమ్మలేని నిజం
మహమ్మారి కరోనా వైరస్‌కు సంబంధించి మరో నమ్మలేని నిజం వెలుగుచూసింది. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ గురించి ప్రజల్లో ఇప్పటికీ చాలా అనుమానేలే ఉన్నాయి. కరోనా బారిన పడిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతో కరోనా వ్యాప్తి చెందుతుందనే అక్షర సత్యం. అందుకే ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నిపుణులు, ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. అయితే ఈ వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందని వార్తలు వచ్చినా తగిన ఆధారాలు లేవు. అయితే తాజాగా శృంగారం ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది చైనాకు చెందిన ఓ అధ్యయన బృందం. షాంగిక్యూ మున్సిపల్ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకుంటున్న 38 మంది కరోనా బాధితులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో ఆరుగురి వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే మహమ్మారి కరోనా వైరస్ వీర్యంలో ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేకపోయారు. ఈ ఆరుగురిలో ఇద్దరు కోలుకోగా.. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందా అనేదానిపై పరిశోధకులు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ‘వీర్యంలో కరోనా ఉన్నంత మాత్రానా శృంగారం ద్వారా మరొకరికి వస్తుందని చెప్పలేం. ఒకవేళ అదే రుజువైతే శృంగారానికి దూరంగా ఉండటమో, కండోమ్ వాడటమో చేయాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే శృంగారానికి దూరంగా ఉంటేనే మంచిది’ అని చైనా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆ అంశంపై అధ్యయంన చేసి రూపొందించిన నివేదికను జామా నెట్వర్క్ వెల్లడించింది. ఇక ఎబోలా, జికా వంటి వైరస్లు శృంగారాం ద్వారా కూడా వ్యాపిస్తాయన్న విషయం తెలిసిందే. చదవండి: కరోనా వస్తే.. కనిపెట్టేస్తుంది మాస్క్ లేకుంటే బుక్కయినట్టే..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అల్విదా.. అపార్చునిటీ!
వాషింగ్టన్: అంగారక గ్రహానికి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని మనకు పంపిస్తూ వచ్చిన రోవర్ అపార్చునిటీ గతించినట్లు భావిస్తున్నామని నాసా ప్రకటించింది. ఇది గత 15 ఏళ్లుగా సేవలందిస్తోంది. అపార్చునిటీ ఉన్న పర్సెవరెన్స్ లోయ దక్షిణ భాగంలో ఏడు నెలల క్రితం సంభవించిన భారీ తుపానులో అది దెబ్బతిని ఉంటుం దని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ తుపాను నుంచి వెలువడిన ధూళి, దుమ్ము ఆ ప్రాంతాన్ని కప్పేసిందని, అప్పటి నుంచి దాని సౌర పలకలు సౌరశక్తిని గ్రహించడం కష్టంగా మారడంతో బ్యాటరీల చార్జింగ్ ఆగిపోయిందని వెల్లడించారు. అయితే క్రమంగా తుపాను ఉధృతి తగ్గిన తరువాత రోవర్‌తో సంబంధాల పునరుద్ధరణకు మిషన్ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అపార్చునిటీ నుంచి చివరిసారిగా గతేడాది జూన్ 10న భూమికి సంకేతాలు చేరాయి. ఆ తరువాత రోవర్‌కు సుమారు 600 కమాండ్లు పంపామని నాసా తెలిపింది. డీప్ స్పేస్ నెట్వర్క్(డీఎస్ఎన్) రేడియో సైన్స్ సాయంతో వేర్వేరు పౌనఃపున్యాలు, పోలరైజేషన్లలో అపార్చునిటీ గురించి పరిశోధకులు అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక చివరి ప్రయత్నంగా రాబోయే వారాల్లో మరిన్ని కమాండ్లు పంపాలని కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ పరిశోధకులు సమాయత్తమవుతున్నారు. అపార్చునిటీతో తిరిగి సంబంధాలు పొందేందుకు అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక మార్గాల్ని పరిశీలిస్తామని వారు చెప్పారు. లక్ష్యం 90 రోజులు..కొనసాగింది 5 వేల రోజులు గోల్ఫ్ కారు పరిమాణంలో, ఆరు చక్రాలతో కూడిన అపార్చునిటీ 2004, జనవరి 24న అంగారకుడి ఉపరితలంపై కాలుమోపింది. దీనితో పాటు స్పిరిట్ అనే మరో రోవర్‌ను కూడా పంపారు. అరుణ గ్రహం నుంచి భూమికి సంకేతాలు పంపిన తొలి రోవర్‌గా అపార్చునిటీ గుర్తింపు పొందింది. అంగారకుడిపై 1,006 మీటర్లు ప్రయాణించి, 90 రోజులు సేవలందించేలా దీన్ని రూపొందించారు. కానీ గత ఏడాది ఫిబ్రవరి నాటికే 45 కిలోమీటర్లు ప్రయాణించి 5000వ రోజును పూర్తి చేసుకుంది. సహచర స్పిరిట్ మిషన్ 2011లోనే ముగిసింది. అపార్చునిటీకి కాలం చెల్లినా దాని పనితీరు సంతోషకరంగా సాగిందని ఈ ప్రయోగ ప్రధాన అధ్యయనకర్త స్టీవెన్ డబ్ల్యూ స్క్వైర్స్ చెప్పారు. -
దేశంలో 38 నగరాలకు ముప్పు
న్యూఢిల్లీ: దేశంలో 60 శాతం భూభాగానికి భూకంపం ముప్పు పొంచి ఉందని, కనీసం 38 నగరాలు అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ వంటి మహానగరంలో భూకంపం వస్తే నష్టం అపారంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌ను విలవిల్లాడించిన భూకంప ప్రభావంతో భారత్‌లోనూ ఆగ్రా నుంచి సిలిగురి వరకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. కాగా, హిమాలయ ప్రాంతంలో మరిన్ని భూకంపాలు వ చ్చే ముప్పు పొంచి ఉందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆసియా, భారత ఉపఖండం ఉన్న భూ పలకల మధ్య తీవ్ర ఒత్తిడి ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. భూకంపాలను తట్టుకునేలా భారత్‌లో భవనాలను నిర్మించాల్సి ఉందని, ఇందుకోసం 1962లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) రూపొందించిన నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీ మెట్రోరైల్ ప్రాజెక్టుతో పాటు గుజరాత్‌లోని భుజ్ పట్టణంలో భారీ భూకంపం తర్వాత కట్టిన అనేక భవనాలు మాత్రం బీఐఎస్ ప్రమాణాలను పాటించాయి. అయితే భూకంపాలను తట్టుకునే భవన నిర్మాణ ప్రమాణాలపై ఎవరికీ అవగాహన లేదని నిపుణులు చెబుతున్నారు. భూకంప ముప్పు పొంచి ఉన్న 38 నగరాల్లో సాధారణ స్థాయి ప్రకంపనలకే భవనాలన్నీ కూలిపోయే అవకాశముందని, ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ఓ నివేదికలో వెల్లడించిందని గుర్తుచేస్తున్నారు. ఢిల్లీతో పాటు శ్రీనగర్, గౌహతి, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలు ప్రమాదం అంచున ఉన్నందున ఇప్పటికైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జూన్‌లో ‘భూకంప’ ఉపగ్ర హ ప్రయోగం సునామీ, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించే ఉపగ్రహాన్ని జూన్ 9వ తేదీన ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ వెల్లడించారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపం, సునామీ తీవ్రమైనవని, వీటి రాకను ముందుగానే పసిగట్టినట్లయితే ముందస్తు చర్యలు తీసుకునేందుకు, ప్రజలను కాపాడేందుకు వీలవుతుందన్నారు. అదేవిధంగా భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్ఎన్ఎస్ఎస్) ఏర్పాటులో భాగంగా ఇటీవల అంతరిక్షానికి పంపిన నాలుగో ఉపగ్రహం బాగా పనిచేస్తోందని కిరణ్‌కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి ఐఆర్ఎన్ఎస్ఎస్ సేవల కోసం ఏడు ఉపగ్రహాలు అవసరమని, ఇందుకుగాను 5వ ఉపగ్రహాన్ని డిసెంబర్లో, 6, 7వ ఉపగ్రహాలను వచ్చే ఏడాది మార్చిలో ప్రయోగిస్తామన్నారు.